Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

Travel Insurance for Malaysia

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ కోసం మీ వివరాలను అందించండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

సుదూర ప్రయాణం లేదా విదేశీ ప్రయాణం కోసం ప్లాన్ చేసే ఎవరైనా మలేషియాను ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా ఎంచుకోవచ్చు. మలేషియా అనేది అత్యంత అందమైన ప్రదేశాలకు నిలయం మరియు ఆహార ప్రియులకు ఇదొక రుచుల స్వర్గంగా ఉంటుంది!

ఆకర్షణీయమైన మలేషియన్ బీచ్‌లు, ద్వీపాలు, అడవులు, ఆర్కిటెక్చరల్ అద్భుతాలు, ఆకాశహర్మ్యాలు మరియు ఇతర ఆకర్షణలన్నింటినీ మీ విహార యాత్రలో భాగం చేసుకోండి. అదే సమయంలో, మలేషియా టూర్ కోసం తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ ఎంచుకోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి.

ట్రిప్ సంబంధిత ఏవైనా సమస్యలను మీరు నివారించాలనుకుంటే, ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కలిగి ఉండడం అవసరం. సరైన అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీతో, మీరు మీ డబ్బును కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు

మీరు మీ ఆర్థిక సమస్యలను దూరంగా ఉంచవచ్చు మరియు మలేషియా ట్రిప్ కోసం మీ వద్ద ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ట్రిప్ సంబంధిత వివిధ ప్రమాదాల నుండి ఆర్థికంగా సురక్షితంగా ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావచ్చు, Covid-19 సోకవచ్చు, లేదా హాస్పిటల్‌లో చేరాల్సిన స్థాయిలో ఏదైనా ప్రమాదానికి గురికావచ్చు. అలాగే, మీరు మీ వస్తువుల్లో వేటినైనా పోగొట్టుకోవచ్చు, మీ హోటల్ రిజర్వేషన్ రద్దు కావచ్చు లేదా మీ విమాన ప్రయాణం విఫలం కావచ్చు. అలాంటి విపత్తుల సమయంలో, భారీ ఆర్థిక ఎదురుదెబ్బలు నివారించడంలో మలేషియాలో ఇన్సూరెన్స్ మీకు సహాయపడగలదు. 

 

భారతదేశం నుండి మలేషియాకు వెళ్లడానికి మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో అవసరమేమిటి?

 

మీరు ఎలాంటి ఆందోళన లేకుండా వెకేషన్‌కు వెళ్లాలనుకుంటే, భారతదేశం నుండి మలేషియా వెళ్లడానికి మీ వద్ద ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. తద్వారా, మీ వెకేషన్ సమయంలో ఉత్పన్నమయ్యే ఏవైనా పరిస్థితుల కోసం మీరు సంసిద్ధంగా ఉండవచ్చు. భారతదేశం నుండి మలేషియా వెళ్లడం కోసం తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఉండడం వల్ల, మీరు మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవచ్చు మరియు మీ ఆందోళనలను దూరం చేసుకోవచ్చు.

బజాజ్ అలియంజ్ అందించే మలేషియా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం వలన కలిగే ప్రయోజనాలు

మలేషియాను సందర్శించే క్రమంలో, మీకు వివిధ ఇబ్బందులు ఎదురుకావచ్చు. దొంగతనం, వ్యాధులు మరియు ప్రమాదాలు లాంటివి ఎప్పుడైనా హెచ్చరిక లేకుండా వస్తాయి. ాఅలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భద్రత కలిగి ఉండడం చాలా ముఖ్యం. కొన్ని ప్రయోజనాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి:

  • తక్షణ మద్దతు

    బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ నుండి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో, తక్షణ మరియు వేగవంతమైన మద్దతు అనేది కేవలం ఒక కాల్ దూరంలో ఉంటుంది. ఏ సమయంలోనైనా మీకు సహాయం అవసరమైతే లేదా మీరు ఏదైనా పోగొట్టుకుంటే, దాని కోసం తక్షణ సహాయం పొందడానికి కస్టమర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. 

  • ప్రత్యేకంగా రూపొందించబడిన పాలసీలు

    మలేషియా ప్రయాణం కోసం తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే సమయంలో మీరు ఎంచుకోవడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ నుండి మీకు అందుబాటులో ఉండే అనేక ఎంపికల నుండి మీకు సరిపోయే ఒక ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. 

  • త్వరిత సెటిల్మెంట్

    బజాజ్ అలియంజ్ నుండి మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ ఎంచుకున్నప్పుడు, ఇన్సూరర్‌ నుండి ఎలాంటి అవాంతరాలు లేకుండా మీరు మీ సెటిల్‌మెంట్‌ను త్వరగా పొందవచ్చు. 

  • సమగ్రమైన కవరేజ్

    మలేషియా ప్రయాణం కోసం బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ ప్రయాణ సమయంలో మీకు ఎదురయ్యే వివిధ పరిస్థితులు - విలువైన వస్తువులు పోగొట్టుకోవడం, అనుకోకుండా అనారోగ్యానికి గురికావడం లేదా ట్రావెల్ ప్లాన్‌లు ఆకస్మికంగా రద్దు కావడం - కోసం కవరేజ్ అందిస్తుంది.

మలేషియా వీసా మరియు ప్రవేశ సమాచారం


2016 లో, సందర్శకుల కోసం మలేషియన్ ప్రభుత్వం ఇ-వీసా అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం మీరు నిర్దిష్ట వీసా చెల్లింపులతో ఆన్‌లైన్ వీసా అప్లికేషన్‌ పూర్తి చేసి, సమర్పించాలి. భారతీయుల కోసం మలేషియా వీసా ఆమోదం పొందిన తర్వాత, అది మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి పంపబడుతుంది.


  • ఎంట్రీ వీసా: ఎంట్రీ ఇ-వీసా అనేది మలేషియాకు ఒక ట్రిప్ కోసం మాత్రమే సరిపోతుంది మరియు మీరు అక్కడ 15 రోజులు మాత్రమే ఉండవచ్చు.

  • భారత జాతీయుల కోసం వీసా ఆన్ అరైవల్ లేదా టూరిస్ట్ వీసా (30 రోజుల ఇ-వీసా): ఈ ఇ-వీసాతో మలేషియాలో మీరు 30-రోజులు బస చేయడానికి అనుమతించబడతారు. మరియు ఇది మూడు నెలల చెల్లుబాటు వ్యవధి కలిగి ఉంది.

  • 30 రోజుల కోసం మల్టిపుల్ ఎంట్రీ ఇ-వీసా: వ్యాపారం, పని సంబంధిత కారణాల కోసం మీరు మలేషియాకు ప్రయాణిస్తే లేదా కుటుంబం లేదా స్నేహితులను కలవడం కోసం వెళ్తే, మీరు ఈ దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ నిర్దిష్ట మలేషియా ఇ-వీసాతో మీ పాస్‌పోర్ట్ స్టాంప్ చేయబడుతుంది.

మలేషియా వీసా కోసం అప్లికేషన్ ప్రక్రియ

భారతీయుల కోసం చెల్లుబాటు అయ్యే మలేషియా వీసా పొందడానికి, మీరు క్రింది దశలు అనుసరించాలి:

  • ఒక అధీకృత వెబ్‌సైట్ నుండి ఇ-వీసా అప్లికేషన్‌ డౌన్‌లోడ్ చేసుకోండి. 

  • అప్లికేషన్ ఫారమ్‌ను ఖచితత్వంతో పూర్తి చేయండి, అవసరమైన సమాచారం అందించిన తర్వాత, ఫోటో అవసరాల కోసం వెబ్‌సైట్ వివరణను జాగ్రత్తగా సమీక్షించిన తర్వాత, మీ అత్యంత ఇటీవలి ఫోటో జోడించండి.

  • చెక్‌లిస్ట్ తర్వాత, ఇ-వీసా విధానం కోసం అవసరమైన ప్రతి సపోర్టింగ్ డాక్యుమెంట్‌ జోడించండి. 

  •  అసంపూర్ణ అప్లికేషన్లు తిరస్కరించబడుతాయి. కాబట్టి, ఫారమ్ పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

  •  మీరు మీ ఇ-వీసా అప్లికేషన్‌తో పాటు అవసరమైన వీసా ఖర్చులను నగదు లేదా డిమాండ్ డ్రాఫ్ట్‌ రూపంలో అధికారిక వీసా అప్లికేషన్ కేంద్రానికి సమర్పించవచ్చు.

  •  మీ పాస్‌పోర్ట్ సిద్ధమైనప్పుడు, దాన్ని అందుకునే దశలు మీకు తెలియజేయబడుతాయి.

 

భారతదేశం నుండి మలేషియాకు ప్రయాణిస్తున్నప్పుడు ఏయే ప్రయాణ డాక్యుమెంట్లు అవసరమవుతాయి?

 

మలేషియా ప్రయాణం కోసం ఇ-విసా పొందడానికి ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా అందించాల్సిన ప్రతి డాక్యుమెంట్ జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

 

  • మలేషియా నుండి భారతదేశానికి మీ రిటర్న్ టిక్కెట్‌ల కాపీ

  • మూడు ప్రస్తుత పాస్‌పోర్ట్-సైజు ఫోటోలు

  • మీరు వ్యాపార పని మీద ప్రయాణిస్తున్నారని నిర్ధారించేలా మీ కంపెనీ నుండి ఒక కవర్ లెటర్

  • పిల్లల కోసం తల్లిదండ్రులు వారి పాస్‌పోర్ట్‌ల ఎన్ఒసి మరియు కాపీలు సమర్పించాలి.

  • మలేషియాలో మీ ఖర్చుల కోసం తగిన సొమ్ము ఉందని నిరూపించడం కోసం కనీసం $1000 రుజువుగా చూపాలి

  • మలేషియాలో హోటల్ వసతుల కోసం రుజువు

 

మీరు మలేషియా నుండి ఇండోనేషియా, సింగపూర్ లేదా థాయిలాండ్‌కి ప్రయాణించబోతుంటే, ఆ దేశాల కోసం ప్రస్తుత టూరిస్ట్ వీసా కాపీ కూడా అవసరం. మీరు ఇలాగ చేసారని నిర్ధారించుకోండి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం మలేషియాకు మీ పర్యటనకు ముందుగానే.

మలేషియాకు ప్రయాణిస్తున్నప్పుడు భద్రత మరియు జాగ్రత్త చర్యలు


మీరు మలేషియాకు చేరుకున్న వెంటనే, ఏవైనా అత్యవసర పరిస్థితులను నివారించడానికి మరియు మలేషియా ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందడానికి ఈ స్థానిక భద్రతా నిబంధనలు అనుసరించండి. మలేషియాను సందర్శించే ప్రయాణికులు అనుసరించాల్సిన సాధారణ భద్రతా జాగ్రత్తలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • పాస్‌పోర్ట్‌లు మరియు అవసరమైన ఇతర డాక్యుమెంట్‌లను ఎల్లప్పుడూ సురక్షితంగా మరియు అందుబాటులో ఉంచుకోవాలి

  • ఏ స్థానిక నిరసనల్లోనూ స్వచ్ఛందంగా పాల్గొనకూడదు

  • మీరు ఎక్కువగా ఇతరుల గొడవలు లేదా విరోధాల మధ్య చిక్కుకున్నట్లు అనిపిస్తే, వెంటనే సమీపంలోని సురక్షిత ప్రాంతానికి వెళ్లి తలదాచుకోండి

  • స్థానిక వార్తలు చూడడం కొనసాగించండి మరియు అవసరమైతే మీ ట్రిప్ ప్రయాణ ప్రణాళికను మార్చుకోండి

  • మలేషియన్ అధికారుల ద్వారా, స్థానికంగా ఏర్పాటు చేయబడిన నియమాలు మరియు చట్టం గురించి తెలుసుకోండి

  • ఏ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనవద్దు లేదా బహిరంగ ప్రదేశాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దు

  • అవసరమైన సమాచారం లేకుండా, ఏ మారుమూల ప్రదేశంలోనూ సందర్శనకు వెళ్లకండి. ఎల్లప్పుడూ స్థానిక అధికారుల సహాయం తీసుకోండి

  • చెల్లుబాటు అయ్యే వీసా లేకుండా మీ సందర్శన పొడిగించబడడం నివారించడం కోసం మీ మలేషియన్ వీసా చెల్లుబాటు వ్యవధిని ట్రాక్ చేస్తూ ఉండండి

  • మలేషియా ప్రయాణం కోసం తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఎంచుకోండి. మలేషియా అనే ఈ అద్భుత దేశాన్ని సందర్శించే సమయంలో, మీ వద్ద తగిన ఆర్థిక నిల్వ ఉందని నిర్ధారించుకోండి

దుబాయ్ ప్రయాణం కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని ప్రమాదాలు మరియు ఊహించని వైద్య ఖర్చుల నుండి ఆర్థికంగా రక్షిస్తుంది.

తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం: మలేషియాలో భారతీయ ఎంబసీ


మీకు ప్రయాణంలో ఎప్పుడైనా సహాయం అవసరమైతే లేదా ఆన్‌లైన్ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్.

 

ఎంబసీ చిరునామా

సంప్రదింపు వివరాలు

పని గంటలు

భారతదేశపు హై కమిషన్

+ 60 3-6205 2350

సోమవారం నుండి శుక్రవారం వరకు – 9:00 am నుండి 5.30 pm వరకు

 

మలేషియాలో ఏయే అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి?

 

  • పెనాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • సెనాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • మలక్కా అంతర్జాతీయ విమానాశ్రయం
  • కుచింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • లాంగ్‌కవి అంతర్జాతీయ విమానాశ్రయం
  • కోట కినబలు అంతర్జాతీయ విమానాశ్రయం

మలేషియాకు ప్రయాణించే సమయంలో తీసుకువెళ్లడానికి కరెన్సీ మరియు ఫారిన్ ఎక్ఛేంజ్


మలేషియన్ రింగట్‌ అనేది మలేషియా అధికారిక కరెన్సీగా ఉంటోంది. మీరు ఎంత డబ్బు తీసుకురావాల్సి ఉంటుందో/మార్చవలసి ఉంటుందో తెలుసుకోవడానికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారి అధికారిక వెబ్‌సైట్‌లో అత్యంత ఇటీవలి ఎక్స్చేంజ్ రేటును తనిఖీ చేయండి..

మలేషియాలో మీరు సందర్శించగల పర్యాటక ప్రదేశాలు


మలేషియా ఒక అద్భుతమైన దేశం మరియు మీరు అక్కడ వచ్చిన తర్వాత అనేక విశేషాలు చూడవచ్చు మరియు చేయవచ్చు. అయితే, మీ ట్రిప్‌ను ప్లాన్ చేయడంలో మీకు సహాయం చేయడం కోసం మలేషియాలో చేయాల్సిన పనుల జాబితాను మేము అందిస్తున్నాము. అయితే, ఈ ప్రదేశాలన్నీ సందర్శించడానికి ముందు మలేషియా ప్రయాణం కోసం మీరు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. మరింత తెలుసుకోవడానికి చదవండి:


  • పెట్రోనాస్ టవర్ అనేది మలేషియాలోని ఒక అద్భుతమైన గమ్యస్థానం. దీని పైనుండి చూసినప్పుడు కనిపించే ఆ దేశ అందాల కోసం ఇది ప్రసిద్ధి చెందింది. పెట్రోనాస్ టవర్స్ 41వ అంతస్తులో స్కై బ్రిడ్జ్ ఉంటుంది. ఇది అద్భుతమైన నగర అందాన్ని కళ్లకు కడుతుంది. అయితే, మీరు రాత్రివేళ లేదా సాయంత్రం వేళ 86వ-అంతస్తులోని అబ్జర్వేషన్ డెక్‌కు వెళ్తే, ఆ అద్భుతం చూసి మీరు ఆశ్చర్యపోతారు!

  • మీకు థ్రిల్స్ అంటే ఇష్టమైతే, కౌలాలంపూర్‌లోని టాండమ్ స్కైడైవింగ్ మీ కోసం ఒక గొప్ప యాక్టివిటీ కాగలదు. దీని ఎత్తు నుండి మీరు మీ ఉత్సాహాన్ని అనుభూతి చెందాలనుకుంటే, ఇన్స్ట్రక్టర్ ద్వారా సురక్షితంగా పైకి ఎగరడం ద్వారా, అజూర్ సముద్రం మీద విహరిస్తూ, గాలిలో తేలియాడే అవకాశాన్ని అస్సలు మిస్ కాకండి.

  • కౌలాలంపూర్ నగరం మీద హెలికాప్టర్ విహారం అనేది మలేషియా ప్రయాణంలో తప్పక చవిచూడాల్సిన ఒక అనుభూతి. అర గంట పాటు సాగే ఈ ప్రయాణం అనేది భూమి మీద నుండి 1500 అడుగుల ఎత్తు నుండి ఈ నగరం అందమైన వీక్షణను కళ్లకు కడుతుంది.

మలేషియా సందర్శనకు ఉత్తమ సమయం ఏది?


నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలోని నెలలు మలేషియా ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. ఈ నెలల్లో తక్కువ వర్షం కురియడంతో పాటు ఆర్ద్రత స్థాయిలు తక్కువగా ఉంటాయి. అయితే, మీరు వర్షాన్ని ఆస్వాదించే వారైతే, మీరు వర్షాకాలంలో కూడా ఈ దేశానికి ప్రయాణించవచ్చు.


సంవత్సరం పొడవునా, మలేషియాలో ఉష్ణోగ్రతలు సాధారణంగా ముప్పై డిగ్రీలకు అటూఇటూగా ఉంటాయి. మీ మలేషియా సందర్శన సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం ఎల్లప్పుడూ తెలివైన నిర్ణయంగా ఉంటుంది. భారతదేశం నుండి మలేషియా ప్రయాణం కోసం అలాంటి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను అవాంతరాలు-లేని పద్ధతిలో త్వరగా పొందవచ్చు.

Frequently Asked Questions

తరచుగా అడిగే ప్రశ్నలు

మలేషియా ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలా?

మలేషియా ప్రయాణం కోసం ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయడం అవసరం కానప్పటికీ, అక్కడ మీరు అనారోగ్యానికి గురయ్యే లేదా అత్యవసర పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉండవచ్చు కాబట్టి, ఈ విధంగా సలహా ఇవ్వడమైనది. మలేషియా ప్రయాణం కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఎంచుకోవడం వల్ల, విమాన ఆలస్యాలు లాంటి వివిధ ఊహించని సంఘటనల నుండి మీకు కవర్ లభిస్తుంది, ట్రిప్ రద్దు, పాస్‌పోర్ట్‌లు పోగొట్టుకోవడం, వైద్య ప్రయోజనాలు మరియు మరిన్ని. 

మలేషియా ప్రయాణం కోసం అందించే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో నా పిల్లలు కవర్ చేయబడతారా?

ఇన్సూరర్ మీద ఆధారపడి, మీరు వీటిని ఎంచుకోవచ్చు ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూర్ చేయబడిన వ్యక్తి జీవిత భాగస్వామి మరియు వారి మీద ఆధారపడిన పిల్లలను కవర్ చేసే ప్లాన్. మీ పిల్లల వయసు కనీస వయస్సు కంటే ఎక్కువైతే, అంటే, 21 ఏళ్ల కంటే పెద్దవారైతే, వారికి కవర్ లభించదు.

నా లగేజీ దొంగిలించబడితే మలేషియా ప్రయాణం కోసం నా ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా నాకు కవర్ లభిస్తుందా?

నిజంగానే లభిస్తుంది. దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న లగేజీ కోసం చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు కవరేజీ అందిస్తాయి. మలేషియా ప్రయాణం కోసం మీ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది షరతులకు లోబడి, కోల్పోయిన ఉత్పత్తులు మరియు అవసరాలకు కూడా మీకు పరిహారం చెల్లిస్తుంది.

ప్రముఖ దేశాల కోసం వీసా మార్గదర్శకాలు


డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం