Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ గురించి

మా గురించి

మా గురించి

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది ప్రపంచంలోని ప్రముఖ ఇన్సూరర్ అయిన Allianz SE మరియు బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ మధ్య ఒక జాయింట్ వెంచర్. భారతదేశంలో జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని నిర్వహించడానికి కంపెనీ 2 మే 2001 నాడు ఐఆర్‌డిఎ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందుకుంది. నేడు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ 1100 కంటే ఎక్కువ పట్టణాలు మరియు నగరాల్లో కార్యాలయాలతో పరిశ్రమలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ తన కస్టమర్లను చేరుకోవడానికి తన కార్యకలాపాలను నిరంతరం విస్తరిస్తుంది.

మే 2, 2021 నాడు మేము 20 సంవత్సరాల సంరక్షణను పూర్తి చేసాము. మా రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో మేము ఒక వినమ్రమైన స్టార్ట్-అప్ నుండి ఒక పరిశ్రమ నాయకుని స్థాయికి ఎదిగాము. మేము 9000 మందికి పైగా ఉద్యోగులు, 80,000 కంటే ఎక్కువ ఏజెంట్లు కలిగిన బలమైన పంపిణీ నెట్‌వర్క్, దాదాపుగా 9,000 మోటార్ డీలర్ భాగస్వాములు మరియు 240 బ్యాంక్ భాగస్వాముల సహాయంతో 11 కోట్ల కస్టమర్ల విశ్వాసాన్ని పొందాము. మేము అనేక బ్రోకర్లు, వెబ్ అగ్రిగేటర్లు మరియు ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో కూడా సంబంధం కలిగి ఉన్నాము. ఇప్పటివరకు మా ప్రయాణంలో మా భాగస్వాములు, కస్టమర్లు మరియు ఉద్యోగులతో మేము అర్థవంతమైన సంబంధాలను ఏర్పాటు చేసాము.

కంపెనీ ఇటీవల తన బ్రాండ్ గుర్తింపును 'కేరింగ్లీ యువర్స్' గా మార్చింది, దీని ద్వారా భారతీయ వినియోగదారుల మనస్సుల్లో వారికి అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, గృహం మరియు అందులోని వస్తువులు, వాహనాలు, వ్యాపారాలు మొదలైన వాటికి సంబంధించి కస్టమర్ యొక్క ఆర్థిక ఆందోళనలను తొలగించి రక్షణ మరియు సంరక్షణ అందించే బ్రాండ్ గా నిలిచిపోవాలని భావిస్తుంది. దీనితో, కంపెనీ దాని సేవను తదుపరి స్థాయికి తీసుకువెళ్లడం మాత్రమే కాక, ప్రతి టచ్‌పాయింట్‌లో ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడానికి మరియు ఒక ఉత్పత్తిని మార్కెట్లోకి పంపడం కాకుండా ఆ ఉత్పత్తి ద్వారా ఆకర్షించాలని అనుకుంటుంది. 

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ దేశం మరియు కార్పొరేట్ రంగం వ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు ఇన్సూరెన్స్‌కు మించిన దాని విస్తృత శ్రేణి ప్రోడక్టులు మరియు సర్వీసులను అందిస్తుంది. కంపెనీ కస్టమర్ల ఇంటి వద్దకు ఇన్సూరెన్స్ పరిష్కారాలను తీసుకురావడం మాత్రమే కాకుండా దాని అధునాతన డిజిటల్ మరియు మొబైల్ అప్లికేషన్లతో ఇన్సూరెన్స్ చేరికను మెరుగుపరుస్తుంది. నేడు దాని డిజిటల్ కార్యాలయాల ద్వారా అది భారతదేశ వ్యాప్తంగా 1000 కొత్త టైర్ 2 మరియు 3 పట్టణాలను చేరుకుంది. కంపెనీ కస్టమర్‌కి అధిక ప్రాధాన్యతని ఇవ్వడం పై దృష్టి పెట్టింది మరియు కస్టమర్ కోసం అత్యున్నతమైన మరియు సంరక్షణ కలిగిన అనుభవంతో ఉత్తమ విలువను అందించడమే లక్ష్యంగా కలిగి ఉంది. అనేక కస్టమర్ కేంద్రీకృత డిజిటైజ్డ్ కార్యక్రమాల ద్వారా నేడు కంపెనీ కస్టమర్లతో ఉన్న తన సంబంధాలను ఇన్సూరెన్స్ కి మించిన స్థాయికి తీసుకువెళుతుంది. 

The Company registered strong financial results by posting revenue of ₹ 4,781 crore in Q2 FY 2022-23 The company recorded a net profit of ₹ 336 crore. Bajaj Allianz General Insurance also reported a healthy Combined Ratio of 99.8% and solvency Ratio of 362% for the period.

మా ఫైనాన్షియల్స్ యొక్క సారాంశం గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

మా వార్షిక నివేదికల కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

To know more about the years of pioneering general insurance excellence click here.

మా విజయాలు

మీరు మా పై చూపిన విశ్వాసానికి మా విజయాన్ని అంకితం ఇస్తాము. సంస్థ యొక్క ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఐఎస్ఒ 9001:2015 ద్వారా సర్టిఫై చేయబడింది, ఇది రిస్కులను సక్రియంగా నిర్వహించడానికి మరియు అంతిమంగా కస్టమర్ అంచనాలను అందుకోవడానికి మరియు మించిపోవడానికి మా నాణ్యత లక్ష్యాన్ని సూచిస్తుంది. మీ అనుభవం యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి మరియు దానిని సాధ్యమైనంతగా అవాంతరాలు లేకుండా చేయడానికి, కంపెనీ ఒక ప్రాథమిక ఎనేబ్లర్‌గా డిజిటలైజేషన్‌ను అనుసరిస్తుంది మరియు దాని సర్వీస్ ఆఫరింగ్స్ యొక్క ఆటోమేషన్ మరియు డిజిటలైజేషన్ పై నిరంతరం కృషి చేస్తుంది.

మా ప్రపంచ స్థాయి వ్యవస్థలు మరియు ప్రక్రియలు మొబైల్ అప్లికేషన్లు మరియు ప్రత్యేకమైన పోర్టల్స్ ద్వారా మా కస్టమర్లు మరియు భాగస్వాములు ఇద్దరికీ రియల్-టైమ్ పరిష్కారాలు అందిస్తాయి. ప్రత్యేకమైన ఫార్మ్ ఎకోసిస్టమ్; కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్‌బాట్, యాప్ ఆధారిత తక్షణ మోటార్ క్లెయిమ్ సెటిల్‌మెంట్, చిత్రం ఆధారిత క్లెయిమ్ సెటిల్‌మెంట్లు, బ్లాక్‌చైన్ సాంకేతిక ఆధారిత ప్రోయాక్టివ్ క్లెయిమ్ ట్రావెల్ క్లెయిమ్ సెటిల్‌మెంట్, నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్లు, వెల్‌నెస్ యాప్ మరియు పోర్టల్స్, ఈజీ ట్యాబ్ మరియు కేరింగ్లీ యువర్స్ యాప్ వంటి డిజిటల్ ఆఫీసులు మరియు మొబైల్ అప్లికేషన్లు వంటి పరిశ్రమలోనే మొట్ట మొదటగా కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా పరిశ్రమలో ఒక బెంచ్‌మార్క్‌ని ఏర్పాటు చేసింది. డ్రైవ్ స్మార్ట్ అనే మా టెలిమ్యాటిక్స్ ఆధారిత ఆఫరింగ్ ద్వారా దేశంలోనే వినియోగ ఆధారిత ఇన్సూరెన్స్‌ని ఆరంభించిన మొట్టమొదటి ఇన్సూరెన్స్ కంపెనీగా మేము నిలిచాము, వ్యక్తుల సంరక్షణ కోసం సైబర్ ఇన్సూరెన్స్ ఆరంభించాము మరియు సమగ్రమైన పెట్ డాగ్ ఇన్సూరెన్స్ ఆరంభించాము.

ఐడిసి ఫైనాన్షియల్ ఇన్‌సైట్స్ ఇన్నోవేషన్ అవార్డుల ద్వారా కంపెనీ భారతదేశంలో ఉత్తమ ఇన్సూరర్ 2020గా గౌరవించబడింది. ఉత్తమ కస్టమర్ అనుభవం 2020 మరియు ఉత్తమ బ్రాండ్ అనుభవం 2020అందించినందుకు సిఎక్స్ ఆసియా ఎక్సెలెన్స్ అవార్డులు కంపెనీని గుర్తించాయి. గతంలో, ఇండియా ఇన్సూరెన్స్ సమ్మిట్ మరియు అవార్డుల 3 ఎడిషన్ కంపెనీని సంవత్సరపు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 2020 గా గుర్తించింది, మరియు ఐడిసి ఫైనాన్షియల్ ఇన్‌సైట్స్ ఆసియా పసిఫిక్ కంపెనీని ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ లో చేర్చారు. నాన్-లైఫ్ ఇన్సూరర్ కేటగిరీ కోసం కంపెనీ ప్రతిష్టాత్మక అవుట్‌లుక్ మనీ అవార్డులు 2020 వద్ద గోల్డ్ అవార్డును కూడా గెలుచుకుంది. అదనంగా, కంపెనీ అవుట్‌లుక్ ట్రావెలర్ ద్వారా ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవార్డు మరియు మనీ టుడే నుండి సంవత్సరపు ఉత్తమ మోటార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అవార్డును కూడా అందుకుంది. విభిన్న విలువను సృష్టించే కేటగిరీ కింద కంపెనీ ప్రతిష్టాత్మకమైన పోర్టర్ ప్రైజ్ అవార్డ్ 2019 ను కూడా గెలుచుకుంది మరియు ఇన్సూరెన్స్ ఆసియా అవార్డులు 2019 వద్ద డొమెస్టిక్ జనరల్ ఇన్సూరర్ ఆఫ్ ది ఇయర్-ఇండియాగా గుర్తించబడింది; జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ , మరియు సంవత్సరం యొక్క కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ ది ఇయర్ గా 4 వార్షిక ఇన్సూరెన్స్ సమ్మిట్ & అవార్డులలో గుర్తింపు పొందింది. సంస్థ 2017 మరియు 2018 లో రెండుసార్లు ఆసియా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులలో ప్రతిష్టాత్మక డిజిటల్ ఇన్సూరర్ అవార్డు గెలుచుకుంది.

మా బ్రాండ్ విజన్‌ను వాస్తవంగా మార్చే చోదక శక్తి మా ఉద్యోగులు. మా కస్టమర్లు వారి ప్రాధాన్యతగల ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌గా బజాజ్ అలియంజ్‌ను ఎంచుకోవడం కొనసాగించడానికి వారు కారణాన్ని సృష్టిస్తారు. ఒక సమగ్రమైన, అభివృద్ధి ఆధారిత పని వాతావరణాన్ని అందించడానికి, బజాజ్ అలియంజ్ పరిశ్రమలోనే ఉత్తమమైన హ్యూమన్ క్యాపిటల్ నిర్వహణ పద్ధతులను ఏర్పాటు చేసింది మరియు వాటిని మా కార్యకలాపాలలోకి చేర్చింది.

ఇది విలువను అందించే మరియు మీ అంచనాలను మించే వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మా ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది. మెరిట్ మరియు ఇన్నోవేషన్ కు గుర్తింపును ఇచ్చే మా అత్యున్నత పనితీరు సంస్కృతి వలన మా ఉద్యోగులను వారు చేసే పనులలో మీ అవసరాలకు అధిక ప్రాధాన్యతని ఇచ్చే కస్టమర్ అడ్వకేట్లుగా తయారు చేసింది. ఈ విధానం వల్ల మా కస్టమర్లు మరియు ఉద్యోగులతో మేము నిర్మించుకున్న సంబంధం పట్ల గర్వపడుతున్నాము!

ప్రశంసల ప్రవాహం కొనసాగుతూనే ఉంది! బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ 2018 మరియు 2016 లో రెండుసార్లు ఎయాన్ ఉత్తమ యజమానులుగా గుర్తించబడింది, ఇది ఉద్యోగి అనుకూల పాలసీలను రూపొందించడంతో పాటు పారదర్శక సంస్కృతి మరియు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించడంలో కంపెనీ యొక్క శ్రేష్టతకు గుర్తింపును ఇస్తుంది. ప్రతిష్టాత్మక Great Place to Work Institute చేత భారతదేశంలో 2018 లో బిఎఫ్ఎస్ఐలో పనిచేయడానికి ఉత్తమ 15 గొప్ప పనిప్రదేశాలలో ఒకటిగా సంస్థ గౌరవించబడింది.

బజాజ్ అలియంజ్ జిఐసి ద్వారా గెలుచుకున్న అవార్డుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అవార్డులు మరియు సర్టిఫికెట్

 • తాజా అవార్డులు
  సెలెంట్ మోడల్ ఇన్సూరర్ అవార్డ్ 2020
 • సర్టిఫికెట్
  ఐఆర్‌‌డిఎ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం