Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కృషి రక్షక్ పోర్టల్ హెల్ప్‌లైన్ నంబర్ : 14447
టోల్ ఫ్రీ నంబరు : 1800-209-5959

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై)

"ఫసల్ బీమా పొందండి, సురక్షితమైన కవచం పొందండి"

Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY) - Crop Insurance Scheme

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన వివరాలు

జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్ఎఐఎస్), వాతావరణ ఆధారిత పంట బీమా పథకం మరియు సవరించిన జాతీయ వ్యవసాయ భీమా పథకం (ఎంఎన్ఎఐఎస్) వంటి పూర్వపు బీమా పథకాలను వెనక్కి తీసుకున్న తరువాత ఏప్రిల్, 2016 లో, భారత ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) ను ప్రారంభించింది. ఆ విధంగా ప్రస్తుతం, పిఎంఎఫ్‌బివై అనేది భారతదేశంలో ప్రభుత్వం అందించే ప్రధాన వ్యవసాయ బీమా పథకంగా నిలిచింది.

కవర్ చేయబడిన నష్టాలు

విత్తడం / నాటడం నిరోధించబడటం వలన నష్టాలు

విత్తడం / నాటడం నిరోధించబడటం వలన నష్టాలు

 లోటు వర్షపాతం లేదా ప్రతికూల కాలానుగుణ పరిస్థితుల కారణంగా విత్తడం / నాటడం నిరోధించబడితే ఒక రైతు ఎస్ఐ (బీమా మొత్తం) 25% వరకు కవర్ చేయబడటానికి అర్హులు. విత్తనాలు / మొక్కలు నాటాలనే ఖచ్చితమైన ఉద్దేశంతో ఉన్న రైతు, దాని కోసం ఖర్చు చేసిన సందర్భాలలో మాత్రమే ఇది వర్తిస్తుంది.

స్థానికీకరించిన ప్రమాదం

స్థానికీకరించిన ప్రమాదం

ప్రత్యేకంగా గుర్తించబడిన ప్రదేశంలోని వేరుగా ఉన్న పొలాలను ప్రభావితం చేసే వడగళ్లు, కొండచరియలు మరియు ఉప్పెన వంటి గుర్తించిన స్థానికీకరించిన ప్రమాదాల వలన కలిగే నష్టాలు/ డ్యామేజీలు.

పెరుగుతున్న దశలో ఉన్న పైరు (విత్తడం నుండి పంటకోత వరకు)

పెరుగుతున్న దశలో ఉన్న పైరు (విత్తడం నుండి పంటకోత వరకు)

నివారించలేని ప్రమాదాలు, ఉదా ఉదా. సహజ కారణాల వలన ఏర్పడిన అగ్నిప్రమాదం మరియు పిడుగుపాటు, తుఫాను, గాలివాన, సుడిగాలి, కరువు పరిస్థితులు/అనావృష్టి, తెగుళ్లు మరియు వ్యాధులు వల్ల కలిగే దిగుబడి నష్టాలను కవర్ చేయడానికి సమగ్ర రిస్క్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు అందించబడుతుంది.

BAGIC Covers Extented Family Cover

మిడ్-సీజన్ ప్రతికూలత

మిడ్-సీజన్ ప్రతికూలత

ఈ కవర్ విస్తృత వైపరీత్యం లేదా ప్రతికూల సీజన్ సందర్భంలో ఏర్పడిన నష్టాల నుండి రైతులకు తక్షణ ఉపశమనం కల్పిస్తుంది, ఈ సీజన్‌లో ఊహించిన దిగుబడి సాధారణ దిగుబడి కంటే 50% తక్కువగా ఉంటుంది.

Risks post harvest losses

పంటకోత తరువాత జరిగే నష్టాలు

పంటకోత తరువాత జరిగే నష్టాలు

ఈ కవరేజ్ పంటకోత నుండి గరిష్టంగా రెండు వారాల వరకు లభిస్తుంది మరియు పంట కోసిన తరువాత పొలంలో 'కట్ అండ్ స్ప్రెడ్' స్థితిలో ఆరబెట్టడానికి వీలుగా ఉండే పంటలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. తుఫాను, తుఫాను వలన కురిసే వర్షాలు మరియు అకాల వర్షాలు వంటి నిర్దిష్ట ప్రమాదాలకు వ్యతిరేకంగా ఈ కవరేజ్ అందుబాటులో ఉంటుంది.

పిఎంఎఫ్‌బివై కింద రక్షణ కల్పించబడిన పంటలు

 • ఆహార పంటలు (తృణధాన్యాలు, చిరుధాన్యాలు మరియు పప్పుధాన్యాలు)
 • నూనెగింజలు
 • వార్షిక వాణిజ్య / వార్షిక ఉద్యాన పంటలు

ముఖ్యమైన ఫీచర్లు

 • స్థానికీకరించిన ప్రమాదాలు మరియు పంటకోత నష్టాలను కవర్ చేస్తుంది.
 • వేగవంతమైన, అవాంతరాలు లేని క్లెయిమ్స్ కోసం అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం.
 • 1800-209-5959 పై టెలిఫోన్ క్లెయిమ్ సమాచారం

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) యొక్క ప్రయోజనాలు

 • ప్రీమియం కోసం రైతు అందించే సహకారం గణనీయంగా తగ్గుతుంది, ఉదా. ఖరీఫ్ పంటల కోసం 2%, రబీ పంటల కోసం 1.5% మరియు వార్షిక మరియు వాణిజ్య పంటల కోసం 5%.
 • వడగళ్లు, ఉప్పెన మరియు కొండచరియలు వంటి స్థానికీకరించిన ప్రమాదాల విషయంలో నష్టాలను ఒక్కొక్కటిగా అంచనా వేయడానికి సదుపాయం.
 • పంట కోత తరువాత, ఎండ బెట్టడం అనే ఏకైక ఉద్దేశ్యంతో గరిష్టంగా రెండు వారాల వ్యవధి (14 రోజులు) వరకు 'కట్ మరియు స్ప్రెడ్' స్థితిలో ఉన్న పంటకి దేశవ్యాప్తంగా ఏర్పడిన తుఫాను, గాలి వాన మరియు అకాల వర్షాల కారణంగా ఏర్పడిన దిగుబడి నష్టానికి ఒక్కొక ప్లాట్ ఆధారంగా అంచనా.
 • విత్తడం నిరోధించబడిన మరియు స్థానిక నష్టాలు ఏర్పడిన పరిస్థితులలో రైతుకు ఆన్-అకౌంట్ క్లెయిమ్ చెల్లింపు జరుగుతుంది.
 • ఈ పథకం కింద టెక్నాలజీని ఉపయోగించడం చాలా వరకు ప్రోత్సహించబడుతుంది. రైతులకు క్లెయిమ్ చెల్లింపులో ఆలస్యాన్ని తగ్గించడానికి, పంట కోత యొక్క డేటాను సంగ్రహించడానికి మరియు అప్‌లోడ్ చేయడానికి స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగించబడతాయి. పంట కోత ప్రయోగాల సంఖ్యను తగ్గించడానికి రిమోట్ సెన్సింగ్ కూడా ఈ పథకం కింద ఉపయోగించబడుతుంది.

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) యొక్క మినహాయింపులు

 • ద్వేషపూరిత చర్యల వలన కలిగిన నష్టం
 • నివారించదగిన ప్రమాదాలు
 • యుద్ధం మరియు అణు ప్రమాదాల నుండి ఉత్పన్నమయ్యే నష్టాలు

పిఎంఎఫ్‌బివై ప్రీమియం రేట్లు మరియు సబ్సిడీ

పిఎంఎఫ్‌బివై క్రింద యాక్చువరియల్ ప్రీమియం రేటు (ఎపిఆర్) వసూలు చేయబడుతుంది. ఈ రేటు ఇన్సూర్ చేయబడిన మొత్తంపై వర్తిస్తుంది. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం రేటు క్రింది పట్టిక ఆధారంగా నిర్ణయించబడుతుంది:

సీజన్ పంటలు రైతు చెల్లించాల్సిన గరిష్ట బీమా ఛార్జీలు
ఖరీఫ్ అన్ని ఆహార ధాన్యాలు మరియు నూనెగింజలు బీమా చేయబడిన మొత్తంలో 2%
రబీ అన్ని ఆహార ధాన్యాలు మరియు నూనెగింజలు బీమా చేయబడిన మొత్తంలో 1.5%
ఖరీఫ్ మరియు రబీ వార్షిక వాణిజ్య / వార్షిక ఉద్యాన పంటలు
శాశ్వత ఉద్యాన పంటలు (పైలట్ ప్రాతిపదికన)
బీమా చేయబడిన మొత్తంలో 5%

 

గమనిక: మిగిలిన ప్రీమియాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లిస్తాయి.

పిఎంఎఫ్‌బివై క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విధానం

బజాజ్ అలియంజ్ వద్ద ప్రధాన్ మంత్రి బీమా యోజన యొక్క క్లెయిమ్ ప్రక్రియ చాలా వేగంగా మరియు సులభంగా పూర్తవుతుంది.

 

స్థానికీకరించిన నష్టాల కోసం

 • విపత్తు సంభవించిన 72 గంటలలోపు రైతులు జరిగిన నష్టాన్ని గురించి మాకు లేదా సంబంధిత బ్యాంకు లేదా స్థానిక వ్యవసాయ శాఖ / జిల్లా అధికారులకు తెలియజేయవచ్చు. లేదా మా ఫార్మ్‌మిత్ర మొబైల్ యాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మా టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5959 కు కూడా కాల్ చేయవచ్చు.
 • సమాచారంలో తప్పనిసరిగా సర్వే నంబర్ వారీగా బీమా చేసిన పంట వివరాలు మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్ (రుణం తీసుకున్న రైతు) తో పాటు ప్రభావితమైన ఎకరాల విస్తీర్ణం వివరాలు మరియు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ (లోన్ తీసుకోని రైతు) వివరాలు ఉండాలి.
 • 48 గంటలలోపు ఒక సర్వేయర్‌ను మేము నియమిస్తాము మరియు సర్వేయర్ నియామకం జరిగిన 72 గంటలలోపు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కూడా పూర్తి అవుతుంది.
 • నష్టసమాచారం అందిన 7 రోజుల్లోపు బ్యాంక్ లేదా రైతు పోర్టల్ నుండి రైతు యొక్క ప్రీమియం చెల్లింపు ధృవీకరించబడుతుంది.
 • నష్టం యొక్క సర్వే జరిగిన 15 రోజుల్లోపు, కవర్ ఆధారంగా వర్తించే చెల్లింపులు రైతుకు పంపిణీ చేయబడతాయి. అయితే, ప్రీమియం సబ్సిడీలో ప్రభుత్వ వాటా 50% అందుకున్న తరువాత మాత్రమే మేము క్లెయిమ్స్ చెల్లించగలమని గుర్తించాలి.

విత్తడం నిరోధించబడిన సందర్భంలో

విత్తడం నిరోధించబడటం వలన బీమా చేసిన రైతు తనకు ఎదురయ్యే నష్టాలను గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇటువంటి విపత్తు యొక్క వ్యాప్తి విస్తృత స్థాయిలో ఉంటుంది మరియు అంచనా అనేది ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా చాలామంది రైతులు తమ పంటను విత్తలేక పోయినప్పుడు ఈ ప్రయోజనం అందించబడుతుంది. వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:


 • గుర్తించిన బీమా యూనిట్ (ఐయు) లోని ప్రధాన పంట ప్రాంతంలో కనీసం 75% విత్తకపోయినట్లైతే మరియు కరువు లేదా వరద వంటి విస్తృతమైన వైపరీత్యాల కారణంగా అంకురోత్పత్తి వైఫల్యానికి గురైతే బీమా చేసిన రైతులకు నిరోధించబడిన విత్తడం కింద క్లెయిమ్ చెల్లించబడుతుంది.
 • ఎన్‌రోల్‌మెంట్ చేసిన కట్-ఆఫ్ తేదీ నుండి 15 రోజులలోపు ఈ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి.
 • నిరోధించబడిన విత్తడం కోసం బీమా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన 30 రోజులలోపు క్లెయిమ్‌ను చెల్లిస్తుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన విత్తనాలు నాటే ప్రాంతం నుండి స్వీకరించిన డేటాకు లోబడి ఉంటుంది మరియు ప్రభుత్వం నుండి ముందస్తు సబ్సిడీ (1వ విడత) స్వీకరణకి లోబడి ఉంటుంది.
 • ఈ ఇన్సూరెన్స్ కవర్, రైతులకు బీమా చేసిన మొత్తంలో 25% చెల్లింపును తుది క్లెయిమ్ మొత్తంగా అందించిన తరువాత ముగుస్తుంది.
 • ఒక్కసారి నిరోధించబడిన విత్తడం కింద క్లెయిమ్ అందించిన తరువాత, ప్రభావితమైన నోటిఫై చేయబడిన యూనిట్‌లు ఐయు, పంటల నష్టపరిహారం కోసం రైతుల చేసుకున్న తాజా నమోదు అంగీకరించబడదు. గుర్తించిన బీమా యూనిట్‌లలోని రైతులందరికీ ఇది వర్తిస్తుంది.

విస్తృత వ్యాప్తి ఉన్న విపత్తులు

ఏరియా విధానంపై థ్రెషోల్డ్ దిగుబడి (టివై) తో పోలిస్తే బీమా చేసిన పంట దిగుబడిలో కొరతను ఈ కవర్ చెల్లిస్తుంది.


 • బీమా యూనిట్ (IU) లోని బీమా చేయబడిన పంట యొక్క వాస్తవ దిగుబడి (AY), IU లో బీమా చేయబడిన పంట యొక్క థ్రెషోల్డ్ దిగుబడి కంటే తక్కువగా ఉంటే, భీమా యూనిట్‌లోని అదే పంటను పండించే బీమా రైతులందరూ నష్టాన్ని చవిచూసినట్లు పరిగణించబడుతుంది. క్లెయిమ్ ఇలా లెక్కించబడుతుంది: (థ్రెషోల్డ్ దిగుబడి - వాస్తవ దిగుబడి) / థ్రెషోల్డ్ దిగుబడి) * (ఇన్సూర్ చేయబడిన మొత్తం), ఇక్కడ, ఇన్సూరెన్స్ యూనిట్‌లో చేసిన సిసిఇ ల సంఖ్యపై ఎవై లెక్కించబడుతుంది మరియు టివై గత ఏడు సంవత్సరాల నుండి 5 సంవత్సరాలలో అత్యుత్తమ సగటుగా లెక్కించబడుతుంది

మిడ్-సీజన్ విపత్తు

ఈ కవర్ విస్తృత వైపరీత్యం లేదా ప్రతికూల సీజన్ సందర్భంలో ఏర్పడిన నష్టాల నుండి రైతులకు తక్షణ ఉపశమనం కల్పిస్తుంది, ఈ సీజన్‌లో ఊహించిన దిగుబడి సాధారణ దిగుబడి కంటే 50% తక్కువగా ఉంటుంది.

 • తీవ్రమైన కరువు, అనావృష్టి మరియు రాష్ట్రప్రభుత్వం / యుటి ప్రకటించిన కరువు వంటి అసాధారణమైన కాలానుగుణ పరిస్థితుల కారణంగా, అసాధారణమైన అల్ప ఉష్ణోగ్రతలు, కీటకాలు, తెగుళ్లు మరియు వ్యాధుల యొక్క విస్తృత వ్యాప్తి, వరదలు వంటి ప్రకృతి విపత్తుల వలన విస్తృత స్థాయిలో జరిగిన నష్టం కారణంగా బీమా చేసిన పంట నుండి ఆశించిన దిగుబడి సాధారణ దిగుబడి కంటే 50% తక్కువగా ఉంటే, మిడ్ సీజన్ విపత్తు క్లెయిమ్ బీమా చేసిన రైతుకు చెల్లించబడుతుంది.
 • ఈ క్లెయిమ్ కింద బీమా చేసిన రైతుకి నేరుగా వారి అకౌంటులోకి చెల్లించబడుతుంది మరియు అది బీమా చేసిన పూర్తి మొత్తంలో 25% ఉంటుంది.
 • పంట విత్తిన ఒక నెల తరువాత మరియు పంటకోత సమయానికి 15 రోజుల ముందు, మిడ్-సీజన్ ప్రతికూలత యొక్క కాలక్రమం మొదలవుతుంది.
 • మిడ్-సీజన్ ప్రతికూలతకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం 7 రోజుల్లో తెలియజేస్తుంది మరియు ప్రతికూల కాలానుగుణ సంఘటనలు సంభవించినప్పటి నుండి వచ్చే 15 రోజుల్లో నష్టాల గురించిన అంచనా వేయాలి.
 • జిల్లా స్థాయి ఉమ్మడి కమిటీ క్లెయిమ్‌ను అంచనా వేస్తుంది మరియు ఈ షరతుకు లోబడి క్లెయిమ్ చెల్లింపు పై నిర్ణయం తీసుకుంటుంది.
 • అకౌంట్‌లో లెక్కించడానికి సూత్రం: ((థ్రెషోల్డ్ దిగుబడి - వాస్తవ దిగుబడి) / థ్రెషోల్డ్ దిగుబడి) *(ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం * 25% )

పంటకోత తర్వాత నష్టం

 • పంట కోత నుండి 14 రోజుల వరకు పంటను ఎండబెట్టడం కోసం పండించిన పంటను "కట్ అండ్ స్ప్రెడ్" స్థితిలో ఉంచినప్పుడు వడగళ్లు, తుఫాను, గాలి వానలు మరియు అకాల వర్షపాతం వంటివాటి కారణంగా పంటకోత తరువాత దిగుబడి నష్టం సంభావిస్తే, పంటకోత దిగుబడి నష్టం ఒక్కొక్క ప్లాట్ / పొలం ప్రకారం అంచనా వేయబడుతుంది. ఇటువంటి సందర్భాల్లో బీమా సంస్థ వ్యక్తిగత ప్రాతిపదికన, బీమా చేసిన రైతులకు క్లెయిమ్‌ను చెల్లిస్తుంది.
 • జరిగిన నష్టాన్ని రైతు బీమా సంస్థకు, సంబంధిత బ్యాంక్, వ్యవసాయ శాఖ, జిల్లా అధికారులకు 72 గంటలలోపు తెలియజేయాలి. బీమా కంపెనీ అందించిన టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించి ఇది చేయవచ్చు.
 • ఫిర్యాదు అందుకున్న తరువాత బీమా కంపెనీ 48 గంటల్లో సర్వేయర్‌ను నియమిస్తుంది. సర్వేయర్‌ను నియమించినప్పటి నుండి 10 రోజుల్లో నష్టాల అంచనాను పూర్తి చేయాలి.
 • నష్టాల అంచనా నుండి 15 రోజుల్లోపు క్లెయిమ్ చెల్లించబడుతుంది. ఈ నష్టాన్ని అంచనా వేయడం ద్వారా నష్టశాతం లెక్కించబడుతుది.
 • ప్రభావిత ప్రాంతం మొత్తం పంట విస్తీర్ణంలో 25% కన్నా ఎక్కువగా ఉంటే, అప్పుడు బీమా యూనిట్‌లోని రైతులందరూ నష్టాన్ని చవిచూసినట్లు భావించబడుతుంది మరియు బీమా చేసిన రైతులందరికీ క్లెయిమ్ చెల్లించబడుతుంది.

ప్రస్తుత సంవత్సరం కోసం, మేము ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మణిపూర్, గోవా, ఆంధ్రప్రదేశ్ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో పిఎంఎఫ్‌బివై ను అమలు చేస్తున్నాము. అదనంగా, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌డబ్ల్యూబిసిఐఎస్ ను అమలు చేస్తున్నాము.

ఇక్కడ క్లిక్ చేయండి ఖరీఫ్ 2023 మరియు రబీ 2023-24 కోసం మా ద్వారా జాబితా చేయబడిన రాష్ట్రాలు మరియు జిల్లాల సేవల కోసం .

సంవత్సరం 2016 2017 2018 2019 2020 2021 2022 2023 ప్రాసెస్ చేయబడిన అప్లికేషన్ల సంఖ్య
ఖరీఫ్ 16,21,058 23,34,387 12,30,974 30,07,435 29,35,539 36,54,924 52,20,660 40,20,905 2,40,25,882
రబీ 4,91,316 35,79,654 51,98,862 17,86,654 11,16,719 20,97,628 35,76,028 7,79,499 1,86,26,360
పూర్తి మొత్తం 21,12,374 59,14,041 64,29,836 47,94,089 40,52,258 57,52,552 87,96,688 48,00,404 4,26,52,242

ఈ తేదీ నాటికి క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ సారాంశం : 30 ఏప్రిల్ 2024  

రాష్ట్రం
చెల్లించిన క్లెయిములు (రూ. కోట్లలో )
2016 2017 2018 2019 2020 2021 2022 2023 పూర్తి మొత్తం
ఆంధ్రప్రదేశ్ 570.32 0.00 602.32 0.00 0.00 0.00 0.00 0.00 1,172.64
అస్సాం 0.00 0.00 1.78 0.00 0.00 0.00 0.00 0.00 1.78
బీహార్ 164.25 0.00 0.00 0.00 0.00 0.00 0.00 0.00 164.25
ఛత్తీస్‌ఘడ్ 17.49 48.57 236.51 28.98 87.90 150.91 100.28 84.33 754.98
గుజరాత్ 0.00 0.00 2.18 0.01 0.00 0.00 0.00 0.00 2.19
హర్యానా 134.16 364.97 0.00 137.00 140.28 280.38 454.33 0.00 1,511.13
ఝార్ఖండ్ 0.00 0.00 51.42 0.00 0.00 0.00 0.00 0.00 51.42
కర్ణాటక 0.00 0.00 0.00 28.50 183.91 144.20 164.75 153.83 675.18
మధ్యప్రదేశ్ 0.00 0.00 0.00 710.04 0.00 0.00 0.00 0.00 710.04
మహారాష్ట్ర 175 32.77 880.92 480.61 441.40 401.16 347.20 0.00 2,759.06
మణిపూర్ 0.00 0.00 0.00 0.00 0.00 1.45 1.47 0.00 2.92
రాజస్థాన్ 0.00 743.27 168.81 241.69 251.83 759.64 625.43 0.00 2,790.67
తమిళనాడు 0.00 0.00 0.00 0.00 0.00 0.00 136.10 0.00 136.10
తెలంగాణ 54.59 5.35 36.70 0.00 0.00 0.00 0.00 0.00 96.64
ఉత్తర ప్రదేశ్ 0.00 58.31 18.19 26.48 0.00 0.00 0.00 0.00 102.98
ఉత్తరాఖండ్ 0.00 0.00 0.08 0.00 0.00 0.00 0.00 0.00 0.08
పూర్తి మొత్తం 1,115.82 1,253.24 1,998.91 1,653.31 1,105.32 1,737.75 1,829.57 238.16 10,932.07

ఫిర్యాదు పరిష్కారం

 1. స్థాయి 1: మీరు మా ఫార్మ్‌మిత్ర మొబైల్ యాప్ ఉపయోగించి మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా 1800-209-5959 పై మాకు కాల్ చేయవచ్చు

  లెవల్ 2: ఇ- మెయిల్: bagichelp@bajajallianz.co.in

  లెవల్ 3: ఫిర్యాదు అధికారి: కస్టమర్ సమస్యలను వెంటనే పరిష్కరించడమే మా నిరంతర ప్రయత్నం. మా బృందం మీకు ఇచ్చిన ప్రతిస్పందనతో మీరు సంతృప్తి చెందకపోతే, మీరు మా ఫిర్యాదు పరిష్కార అధికారి శ్రీ జెరోమ్ విన్సెంట్‌కు ఇక్కడ వ్రాయవచ్చు:‌ ggro@bajajallianz.co.in

  లెవల్ 4: ఒకవేళ, మీ ఫిర్యాదు పరిష్కరించబడకపోతే మరియు మీరు మా కేర్ స్పెషలిస్ట్‌తో మాట్లాడాలనుకుంటే, దయచేసి +91 80809 45060 పై మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా 575758 కు <WORRY> అని SMS చేయండి మరియు మా కేర్ స్పెషలిస్ట్ తిరిగి మీకు కాల్ చేస్తారు

  దయచేసి మీ సమస్యపై పనిచేయడానికి మా సర్వీస్ నెట్‌వర్క్‌కు తగినంత సమయాన్ని ఇవ్వండి. మేము 'కేరింగ్లీ యువర్స్' ని విశ్వసిస్తాము మరియు ఈ సంస్థలోని ప్రతి ఉద్యోగి ఈ వాగ్దానానికి కట్టుబడి ఉంటారని మేము మీకు హామీ ఇస్తున్నాము.

  1, 2, 3 మరియు 4 స్థాయిలను అనుసరించిన తర్వాత మీ సమస్య పరిష్కరించబడకపోతే, మీరు పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ అంబడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు. దయచేసి మీ సమీప అంబడ్స్‌మెన్ కార్యాలయాన్ని ఇక్కడ కనుగొనండి:‌ https://www.cioins.co.in/Ombudsman

  ఇక్కడ క్లిక్ చేయండి మా జిల్లా అధికారుల వివరాల కోసం.

  ఇక్కడ క్లిక్ చేయండి మీ సమీప అగ్రి ఇన్సూరెన్స్ కార్యాలయం వివరాలను పొందడానికి.

పిఎంఎఫ్‌బివై విజయ గాథలు

ANSWERS TO PMFBY, CROP INSURANCE QUESTIONS

పిఎంఎఫ్‌బివై, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రశ్నలకు సమాధానాలు

ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని మరియు మీ ఆస్తులను ఉహించని నష్టం యొక్క చిన్న సంభావ్యత నుండి రక్షించే ఒక సాధనం. ఇన్సూరెన్స్ అంటే డబ్బు సంపాదించడం కాదు, ఆర్థిక విపత్తుకు కారణమయ్యే ఊహించని నష్టాల నుండి ఒక వ్యక్తికి లేదా వ్యాపారానికి పరిహారం చెల్లించడంలో సహాయం అందించడం. ఇలాంటి నష్టాలకు గురైన చాలా మంది చేసిన చిన్న చిన్న విరాళాల ద్వారా సేకరించిన నిధుల నుండి కొంతమందికి నష్టాలు వచ్చినప్పుడు, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మరియు వారి బాధలు పంచుకోవడానికి ప్రజలకు ఒక మార్గాన్ని అందించే సాంకేతికత ఇది.

క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

పంట బీమా అనేది వివిధ ఉత్పాదక నష్టాల ఫలితంగా, తమ పంటలు దెబ్బతినడం మరియు నాశనం కావడం వలన రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ఉద్దేశించిన ఒక ఏర్పాటు.

పిఎంఎఫ్‌బివై అంటే ఏమిటి?

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) అనేది, ఒక నిర్దిష్ట బీమా యూనిట్ కోసం తమ పంట ఉత్పత్తిని ముందే నిర్వచించిన స్థాయిలో బీమా చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో స్థిరమైన ఉత్పత్తికి తోడ్పడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 

వాతావరణ ఆధారిత పంట బీమా అంటే ఏమిటి?

వర్షపాతం, ఉష్ణోగ్రత, మంచు, తేమ, గాలి వేగం, తుఫాను వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల ఫలితంగా పంట నష్టం సంభవించడంతో ఎదురయ్యే ఆర్థిక నష్టానికై బీమా చేసిన రైతుల కష్టాలను తగ్గించడమే వాతావరణ ఆధారిత పంట బీమా లక్ష్యం.

పిఎంఎఫ్‌బివై కింద ఏ పంటలు కవర్ చేయబడతాయి?

ఇది నిర్దిష్ట ఇన్సూరెన్స్ యూనిట్ యొక్క ప్రధాన పంటలను కవర్ చేస్తుంది ఉదా.

ఎ. ఆహార పంటల్లో తృణధాన్యాలు, మిల్లెట్లు మరియు పప్పుధాన్యాలు ఉంటాయి,

బి. నూనెగింజలు మరియు సి. వార్షిక వాణిజ్య / ఉద్యాన పంటలు మొదలైనవి.

పిఎంఎఫ్‌బివై ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చు?

నోటిఫై చేయబడిన ప్రాంతాల్లో నోటిఫై చేయబడిన పంటలను పెంచే షేర్‌క్రాపర్లు మరియు కౌలు రైతులతో సహా రైతులందరూ కవరేజీకి అర్హత కలిగి ఉంటారు. 

ఒక వ్యక్తిగత రైతు కోసం బీమా చేయబడిన మొత్తం/కవరేజ్ పరిమితి ఎంత?

గత సంవత్సరాల్లో సంబంధిత పంట యొక్క ఆర్థిక లేదా సగటు దిగుబడి మరియు పంట కనీస మద్దతు ధర యొక్క స్కేల్ ఆధారంగా జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని నిర్ణయిస్తుంది. 

ఖరీఫ్ మరియు రబీ సీజన్ కోసం పంట ఇన్సూరెన్స్‌లో నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి?

ఇది పంట జీవితచక్రం మరియు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్‌పై ఆధారపడి ఉంటుంది.

క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు మరియు ప్రీమియం రాయితీలు ఏమిటి?

ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ (ఐఎ) ద్వారా పిఎంఎఫ్‌బివై కింద యాక్చ్యువరియల్ ప్రీమియం రేటు (ఎపిఆర్) ను వసూలు చేస్తారు. రైతు చెల్లించవలసిన ఇన్సూరెన్స్ ఛార్జీల రేటు ఈ క్రింది పట్టిక ప్రకారం ఉంటుంది:

సీజన్ పంటలు రైతు ప్రీమియం రేట్ల ద్వారా చెల్లించవలసిన గరిష్ట ఇన్సూరెన్స్ ఛార్జీలు (ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తంలో %)
ఖరీఫ్ అన్ని ఆహార ధాన్యాలు మరియు నూనెగింజ పంటలు (తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు నూనెగింజలు) 2.0%
రబీ అన్ని ఆహార ధాన్యాలు మరియు నూనెగింజ పంటలు (తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు నూనెగింజలు) 1.5%
ఖరీఫ్ మరియు రబీ వార్షిక వాణిజ్య / వార్షిక ఉద్యాన పంటలు 5%

పిఎంఎఫ్‌బివై పథకం ద్వారా కవర్ చేయబడే రిస్కులు ఏమిటి?

పిఎంఎఫ్‌బివై పథకం కింద కవర్ చేయబడే రిస్కులు: 

ప్రాథమిక కవర్: ఈ పథకం కింద ప్రాథమిక కవరేజీలో నిలబడి ఉన్న పంట (విత్తడం నుండి కోత వరకు) దిగుబడి కోల్పోయే ప్రమాదాన్ని కవర్ చేస్తుంది. ఈ సమగ్ర రిస్క్ ఇన్సూరెన్స్ కరువు, అనావృష్టి, వరదలు, ముంపు, విస్తృత వ్యాప్తి చెందిన పురుగు మరియు వ్యాధి దాడి, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు, తుఫాను, వడగళ్ల వాన, సైక్లోన్ వంటి నివారించలేని ప్రమాదాల కారణంగా ప్రాంతం ఆధారిత విధానం ఆధారంగా దిగుబడి నష్టాలను కవర్ చేయడానికి అందించబడుతుంది.

యాడ్-ఆన్ కవరేజ్: తప్పనిసరి ప్రాథమిక కవర్ కాకుండా, పంట కోల్పోవడానికి దారితీసే ప్రమాదాలు మరియు పంట కోల్పోవడానికి దారితీసే ప్రమాదాల ఆధారంగా రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ (ఎస్‌ఎల్‌సిసిసిఐ) సంప్రదించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు/యుటిలు క్రింది దశలను కవర్ చేయడానికి వారి రాష్ట్రంలోని నిర్దిష్ట పంట/ప్రాంతం అవసరం ఆధారంగా ఈ క్రింది యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోవచ్చు:-

నిరోధించబడిన విత్తడం/నాటడం/మొలకెత్తడం వంటి ప్రమాదం: లోటు వర్షపాతం లేదా ప్రతికూల కాలానుగుణ/వాతావరణ పరిస్థితుల కారణంగా ఇన్సూర్ చేయబడిన ప్రాంతం అనేది విత్తడం/నాటడం/మొలకెత్తడం నుండి నిరోధించబడుతుంది.

మిడ్-సీజన్ ప్రతికూలత: పంట సీజన్ సమయంలో ప్రతికూల సీజనల్ పరిస్థితుల విషయంలో నష్టం అంటే. వరదలు, సుదీర్ఘ అనావృష్టి మరియు తీవ్రమైన కరువు మొదలైనవి, ఇందులో సీజన్ సమయంలో ఊహించిన దిగుబడి సాధారణ దిగుబడిలో 50% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ యాడ్-ఆన్ కవరేజ్ అటువంటి ప్రమాదాలు సంభవించిన సందర్భంలో ఇన్సూర్ చేయబడిన రైతులకు తక్షణ ఉపశమనం కోసం నిబంధనను అందిస్తుంది.

పంటకోత అనంతరం ఏర్పడే నష్టాలు: కవరేజ్ పంటకోత నుండి గరిష్టంగా రెండు వారాల వరకు లభిస్తుంది మరియు పంట కోసిన తరువాత పొలంలో, ఆ ప్రాంతంలోని ఆరబెట్టడానికి వీలుగా ఉండే స్థితిలో / చిన్న కట్టలుగా ఉంచబడిన స్థితిలో గల పంటలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వడగళ్ల వాన, తుఫాను, తుఫాను వలన కురిసే వర్షాలు మరియు అకాల వర్షాలు వంటి నిర్దిష్ట ప్రమాదాలకు ఈ కవరేజ్ అందుబాటులో ఉంటుంది.

స్థానికీకరించిన విపత్తులు: నోటిఫై చేయబడిన ప్రాంతంలోని విడిగా ఉన్న పొలాలను ప్రభావితం చేసే వడగళ్ల వాన, కొండచరియలు విరిగిపడటం, ముంపు, కుంభవృష్టి మరియు పిడుగుల వల్ల సంభవించే సహజ అగ్నిప్రమాదాల వంటి గుర్తించబడిన స్థానికీకరించిన ప్రమాదాల ఫలితంగా నోటిఫై చేయబడిన ప్రాంతంలో ఇన్సూర్ చేయబడిన పంటలకు నష్టం/డ్యామేజ్.

పిఎంఎఫ్‌బివై పథకంలో లోన్ పొందని రైతులు ఎలా నమోదు చేసుకోవచ్చు?

రుణం పొందని రైతులు పథకం యొక్క అప్లికేషన్ ఫారంను పూరించి, గడువు తేదీకి ముందు ఈ క్రింది వాటిలో దేనికైనా దానిని సమర్పించడం ద్వారా పిఎంఎఫ్‌బివై పథకంలో నమోదు చేసుకోవచ్చు:

● సమీప బ్యాంక్ శాఖ

● సాధారణ సర్వీస్ సెంటర్ (సిఎస్‌సిలు)

● అధీకృత ఛానల్ భాగస్వామి

● ప్రత్యామ్నాయంగా, ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఇన్సూరెన్స్ మధ్యవర్తి, రైతులు వ్యక్తిగతంగా గడువు తేదీకి ముందు నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ www.pmfby.comకు వెళ్లవచ్చు మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంను నింపవచ్చు.

ఈ పథకంలో పాల్గొనడానికి రుణం పొందని రైతులకు అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

రుణం పొందని రైతులు ఈ పథకంలో పాల్గొనడానికి ఈ క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి:-

1. భూమి యాజమాన్య డాక్యుమెంట్లు – (హక్కు రికార్డులు (ఆర్‌ఒఆర్), భూమి స్వాధీన సర్టిఫికెట్ (ఎల్‌పిసి) మొదలైనవి.

2. ఆధార్ కార్డు

3. బ్యాంక్ పాస్‌బుక్ (ఇది స్పష్టమైన రైతు పేరు, అకౌంట్ నంబర్/ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ కలిగి ఉండాలి)

4. అద్దెదారు భూమి యాజమాన్య రుజువు / కాంట్రాక్ట్ డాక్యుమెంట్ లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిర్వచించిన ఏదైనా ఇతర డాక్యుమెంట్ కోసం పంట విత్తడం సర్టిఫికెట్ (రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లో తప్పనిసరి అయితే). 

రైతులు బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిపోలని పక్షంలో మార్పులు చేయవచ్చా?

అవును, పిఎంఎఫ్‌బివై పాలసీలో అకౌంట్ వివరాలు సరిపోలకపోతే ఫార్మిత్ర యాప్ అకౌంట్ దిద్దుబాటు యొక్క ఈ ఫీచర్‌ను అందిస్తుంది. 

రుణం పొందిన రైతులు ఇన్సూర్ చేయబడిన పంటలలో మార్పులు చేయవచ్చా మరియు ఎప్పటివరకు?

సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నమోదు యొక్క చివరి తేదీకి రెండు రోజుల ముందు ఇన్సూర్ చేయబడిన పంటలలో రుణం పొందిన రైతులు మార్పులు చేయవచ్చు.

ఆ మార్పులు చేయడానికి, రైతు సంబంధిత బ్యాంక్ శాఖను సందర్శించి, అవసరమైన సమాచారాన్ని అందించవచ్చు. 

స్థానికీకరించిన విపత్తుల కారణంగా పంట నష్టం గురించి తెలియజేయడానికి ప్రాసెస్ ఏమిటి?

ఈ క్రింది మాధ్యమంలో దేని ద్వారానైనా విపత్తు జరిగిన 72 గంటల్లోపు పంట నష్టం గురించి తెలియజేయడం తప్పనిసరి.

● టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5959

● ఫార్మిత్ర- కేరింగ్లీ యువర్స్ యాప్

● క్రాప్ ఇన్సూరెన్స్ యాప్

● ఎన్‌సిఐపి పోర్టల్

● సమీప ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం/శాఖ

● సమీప బ్యాంక్ శాఖ / వ్యవసాయ విభాగం (వ్రాతపూర్వక ఫార్మాట్‌లో)

పథకం గురించి మరింత తెలుసుకోవడానికి లేదా చివరి తేదీకి ముందు నమోదు కోసం దయచేసి సమీపంలోని బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్యాలయం/బ్యాంక్ శాఖ/కో-ఆపరేటివ్ సొసైటీ/సిఎస్‌సి కేంద్రాన్ని సంప్రదించండి. ఏవైనా ప్రశ్నల కోసం, మీరు మా టోల్ ఫ్రీ నంబర్-18002095959 లేదా ఫార్మిత్ర- కేరింగ్లీ యువర్స్ మొబైల్ యాప్ లేదా ఇ మెయిల్- bagichelp@bajajallianz.co.in లేదా వెబ్‌సైట్ ఉపయోగించి మమ్మల్ని సంప్రదించవచ్చు – www.bajajallianz.com ఫార్మిత్ర- మీకు అందుబాటులో అగ్రి సర్వీసులు కీలక లక్షణాలు:

 

● స్థానిక భాషలో యాప్

● క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీ మరియు క్లెయిమ్ వివరాలను పొందండి

● సింగిల్ క్లిక్ పై పంటల గురించి సలహా మరియు మార్కెట్ ధర

● వాతావరణ అంచనా అప్‌డేట్

● వార్తలు

● పిఎంఎఫ్‌బివై సంబంధిత ప్రశ్నలు, క్లెయిమ్‌ల గురించి తెలియజేయడం, క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయడం వంటి ఇతర సమాచారం ఫార్మిత్ర యాప్‌ - మీరు ఇప్పుడు ప్రశ్నలను లేవదీయవచ్చు,క్లెయిమ్‌ల గురించి తెలియజేయవచ్చు (స్థానిక వైపరీత్యాలు మరియు పంటకోత నష్టాలు) మరియు క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయవచ్చు. Play Store ద్వారా ఫార్మిత్ర కేరింగ్లీ యువర్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా ఇక్కడ స్కాన్ చేయండి.

 

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 21st  నవంబర్ 2023

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం