మీరు ఒక సమగ్రమైన జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నుండి కేవలం ఒక క్లిక్ దూరంలో ఉన్నారు
In our endeavour to provide you the best coverage along with a host of other value added services, our online General Insurance claims system has been designed keeping your ease in mind. With a convenient insurance claim process, you can now register your claim, upload the necessary documents and know the status of your motor insurance online!
యాప్‌తో క్లెయిమ్ రిజిస్టర్ చేయండి, యాప్‌లోని మోటార్ ఆన్ ది స్పాట్ (OTS) ఫీచర్‌తో 20 నిమిషాల్లో* సెటిల్ చేస్తాము.
డౌన్‌లోడ్ కేరింగ్లీ యువర్స్ యాప్
యాక్సిడెంట్ సమాచారం, డాక్యుమెంట్లు, రిపోర్టులను పంపడానికి పోలీస్‌కు ఈమెయిల్:
air@bajajallianz.co.inసమ్మన్/నోటీస్, క్లెయిమ్ పిటిషన్, అవార్డ్ కాపీని పంపడానికి MACTకి ఈమెయిల్:
claimslegal@bajajallianz.co.inమీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి.
రిపేర్ కోసం మీ వాహనం పంపండి.
సర్వే మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్.
మీరు మీ కారును డ్యామేజ్ చేసారా? చింతించవలసిన అవసరం లేదు, మేము మీతో ఉన్నాము!
మీరు మీ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌తో ముందుకు సాగుతున్నట్లయితే, మేము ప్రాసెస్‍ను పూర్తిగా ఇబ్బందులు-లేనిదిగా చేసాము. మీరు ఆన్‌లైన్ క్లెయిమ్‌లను ఎంచుకున్నట్లయితే, ఇక్కడ క్లిక్ చేయండి. లేకపోతే, మా టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5858 కు కాల్ చేయండి, మేము మీకు వెంటనే సహాయం అందిస్తాము. రోజులో ఏ సమయంలోనైనా మేము మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటాము
ఇబ్బందులు లేని ప్రక్రియ అన్న వాక్యంలో ప్రతి అక్షరానికి మేము కట్టుబడి ఉన్నాము. మీ సమయం విలువైనదని మాకు తెలుసు, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో. అందువల్ల మీరు అందించవలసిన వివరాలు చాలా తక్కువగా ఉంటాయి.
మీరు మీ మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకున్న తర్వాత, మీరు మా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ నుండి ఒక క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్‌ను అందుకుంటారు. క్లెయిమ్ గురించిన ఖచ్చితమైన స్టేటస్ మీకు SMS ద్వారా తెలియజేయబడుతుంది. మీరు మా టోల్ ఫ్రీ నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు, మీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్‌ను అందించవచ్చు.
గమనిక – 24x7 ఏదైనా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం మేము మా టోల్ ఫ్రీ నంబర్ 1800-103-5858 పై అందుబాటులో ఉన్నాము. తమ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ ఫీచర్‌ను ఎంచుకున్న మా కస్టమర్ల కోసమే ఈ సేవ అందుబాటులో ఉంటుంది.
యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం/బ్రేక్‌డౌన్ పాయింట్ నుండి మీ వాహనాన్ని గ్యారేజీకి తరలించవలసిందిగా లేదా మరింత నష్టాన్ని నివారించడానికి దానిని లాక్కుని వెళ్ళవలసిందిగా మేము మీకు సూచిస్తున్నాము.
దొంగతనం జరిగిన సందర్భంలో, పోలీసు వద్ద ఒక ఫిర్యాదును ఫైల్ చేయండి మరియు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మాకు తెలియజేయండి. మీ వాహనం 90 రోజుల్లోపు కనుగొనబడకపోతే, పోలీసుని ఒక నాన్-ట్రేసబుల్ రిపోర్ట్‌ను జారీ చేయమని అడగండి (వారు మీ వాహనాన్ని ఇంకా కనుగొనలేకపోయారని) మరియు ఆ రిపోర్ట్‌ను మాకు అందజేయండి.
మీరు విశ్రాంతి తీసుకోండి, మేము మిగితా పని పూర్తి చేస్తాము.
మీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ స్వభావం ఆధారంగా, మీకు నచ్చిన గ్యారేజ్/డీలర్‌కు డాక్యుమెంట్ల కాపీని అందించి వాటిని ఒరిజినల్స్‌తో సరిపోల్చి చూడమని కోరండి.
నష్ట తీవ్రత తక్కువగా ఉన్నదా? కేవలం ఒక విండ్‌షీల్డ్ పై పగులు రావడం లేదా బంపర్ లూజ్ అవ్వడం జరిగిందా? ఇటువంటి సందర్భంలో, మా మోటార్ OTS (ఆన్-ది-స్పాట్) సర్వీస్ తీసుకోవాలని మీకు సూచిస్తున్నాము.
ఇన్సూరెన్స్ కొనుగోలు నుండి, జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిములను తెలియజేయడం మరియు పాలసీ రెన్యూవల్ అలర్ట్స్ పొందడం వరకూ, మా మొబైల్ యాప్ అయిన బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ వాలెట్ మీ అన్ని ఇన్సూరెన్స్ సంబంధిత అవసరాలకు సరిపోయే ఒక సులభమైన యాప్.
మేము మీ వాహనాన్ని మీకు నచ్చిన నెట్‌వర్క్ గ్యారేజీలో రిపేర్ చేయించి, దానిని మీ ఇంటి వద్దకే అందజేస్తాము మరియు గ్యారేజీకి నేరుగా చెల్లిస్తాము. మీరు స్వచ్ఛంద అదనపు మొత్తాన్ని (పాలసీలో పేర్కొన్న విధంగా) మరియు సర్వేయర్ తెలియజేసిన తరుగుదల విలువను మాత్రమే చెల్లించాలి.
బజాజ్ అలియంజ్ మోటార్ ఇన్సూరెన్స్‌తో, మీరు మీ వాహనాన్ని సురక్షితం చేసుకోవడమే కాకుండా రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్టర్, కీ మరియు లాక్ రీప్లేస్‌మెంట్ వంటి ఇతర యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు.
దయచేసి క్రింద ఉన్న క్లెయిమ్ ఫారంను డౌన్‌లోడ్ చేసుకోండి.
మోటార్/వాహనం ఇన్సూరెన్స్ అనేది భౌతికంగా జరిగిన నష్టం నుండి మీ వాహనాన్ని మరియు మిమ్మల్ని శారీరక గాయం/మరణం మరియు థర్డ్-పార్టీ బాధ్యత నుండి ఆర్థికంగా రక్షించే ఒక ఇన్సూరెన్స్ పాలసీ. రోడ్డు మీద వెళ్తున్న ప్రతిసారి ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది.
భారీ ఖర్చులను భరించాల్సిన ఒక కఠినమైన పరిస్థితి నుండి మిమ్మల్ని కాపాడుతుంది, కనుక, మోటార్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇది మీ బడ్జెట్ మరియు లక్ష్యాలను ట్రాక్ చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది, ఎందుకంటే ఒక దుర్ఘటన జరిగినప్పుడు అయ్యే ఖర్చులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా కవర్ చేయబడతాయి.
అదనంగా, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలో ఒక చట్ట ప్రకారం తప్పనిసరి కాబట్టి ఇది మిమ్మల్ని చట్టపరమైన సమస్యల నుండి రక్షిస్తుంది.
మీ పేరుతో రిజిస్టర్ చేయబడిన వాహనం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), చెల్లుబాటు అయ్యే డ్రైవర్ లైసెన్స్ మరియు కాలుష్య నియంత్రణ (PUC) సర్టిఫికెట్‌ను మీరు కలిగి ఉండాలి.
మా మోటార్ ఇన్సూరెన్స్ కవర్లు:
మీ వాహనానికి జరిగిన నష్టం
ఇది ప్రకృతి వలన లేదా మనుషుల కారణంగా ఏర్పడిన వైపరీత్యాల కారణంగా జరిగితే, మేము మీ వాహనానికి లేదా దాని యాక్సెసరీలకు కలిగిన ఎటువంటి ప్రమాదం లేదా నష్టాన్ని కవర్ చేస్తాము.
థర్డ్-పార్టీ లీగల్ లయబిలిటీ
మీరు నీతి నియమాలు కలిగి ఉన్న వ్యక్తి అని మాకు తెలుసు మరియు అందుకు మీ పై మాకు గౌరవం ఉంది. అందువలన, మా పాలసీ, థర్డ్ పార్టీ వలన ఎదురయ్యే మరణం లేదా గాయాలు వంటి వాటికి వాహనంలో ఉన్నవారితో సహా డ్రైవర్‌కు కూడా పరిహారం చెల్లించేలా మీ చట్టపరమైన బాధ్యతను కవర్ చేస్తుంది.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
మీకు భద్రత కల్పించలేకపోతే మీ వాహనం యొక్క భద్రతకు అర్థం అనేది ఉండదు. అందువల్ల, మేము రూ. 750[1] ప్రీమియంతో వాహన యజమాని-డ్రైవర్ కోసం రూ. 15 లక్షల వరకు తప్పనిసరి పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను అందిస్తాము . అంతేకాకుండా, మీరు మీ తోటి-ప్రయాణీకుల కోసం కూడా అదనపు కవరేజీని ఎంచుకోవచ్చు.
వాహనంలో ఉన్నవారి కోసం PA కవర్ అనే మరొక అంశాన్ని మేము జోడించవచ్చా
మేము పూర్తి పారదర్శకతను నమ్ముతాము మరియు పాలసీలో కవర్ చేయబడని అంశాలు ఇక్కడ ఉన్నాయి.
మా టోల్-ఫ్రీ నంబర్ 1800-209-5858 కు కాల్ చేయండి లేదా మీ క్లెయిమ్ రిజిస్టర్ చేసుకోవడానికి మమ్మల్ని ఆన్‌లైన్‌లో సందర్శించండి. ఆ తర్వాత, మా టోయింగ్ సౌకర్యం మరియు అన్ని వేళలలో అందుబాటులో ఉండే మా రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీసులు పొందడం ద్వారా మీ వాహనాన్ని గ్యారేజీకి తీసుకువెళ్ళండి.
తుది దశ సర్వే మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్. మా మోటార్ ఆన్-ది-స్పాట్ సర్వీసుతో, మా మొబైల్ యాప్, ఇన్సూరెన్స్ వాలెట్ సహాయంతో మీరు స్వీయ-సర్వే చేసుకోవచ్చు మరియు రూ 20,000 వరకు మీ క్లెయిములను వేగంగా మరియు ఇబ్బందులు లేని పద్ధతులలో రిజిస్టర్ చేసుకోవచ్చు.ఒకవేళ మీ క్లెయిమ్ రూ. 20 వేల కంటే తక్కువగా ఉంటే, మా మొబైల్ యాప్, ఇన్సూరెన్స్ వాలెట్ సహాయంతో స్వీయ-సర్వే చేయవచ్చు.
మంచి అలవాట్లకు బహుమతి ఇవ్వాలి అని మేము నమ్ముతాము, అలాగే ఒక మంచి డ్రైవర్ అయినందున, నో క్లెయిమ్ బోనస్ అనేది మేము మీకు అందించే ఒక బహుమతి. మీరు మునుపటి పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే ఇది మేము మీకు అందించే బహుమతి మరియు దీని ప్రయోజనాలు సమయం గడిచే కొద్దీ పెరుగుతుంటాయి.
నో క్లెయిమ్ బోనస్‌ను కలిగి ఉండటం వలన మీరు స్వంత డ్యామేజీ ప్రీమియంపై 20-50% వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
మీరు మీ పాలసీలో మార్పులు చేయాలనుకుంటే, ఎండార్స్మెంట్ అనేది సరైన మార్గం. పాలసీ మార్పును అంగీకరించినట్లుగా ఇది ఒక వ్రాతపూర్వక సాక్ష్యం. అదనపు ప్రయోజనాలు లేదా కవర్ అందించడానికి పాలసీని జారీ చేసే సమయంలో ఇది జారీ చేయవచ్చు.
తర్వాత ఒక ఎండార్స్మెంట్ చేయడానికి, ఉదాహరణకు చిరునామా మార్పు లేదా వాహనం మార్చడాన్ని రికార్డ్ చేయడానికి, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.
మీరు ఒక క్లెయిమ్-ఫ్రీ రికార్డ్‌ని నిర్వహించినట్లయితే, మీరు నో క్లెయిమ్ బోనస్‌ని పొందవచ్చు, అలాగే ఓన్ డ్యామేజ్ ప్రీమియం పై 50% వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
మీ ప్రీమియం తగ్గించడానికి మరొక మార్గం ఏమిటంటే మీరు ప్రతి క్లెయిమ్ కోసం ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించే స్వచ్ఛంద అదనపు మొత్తాన్ని ఎంచుకోవడం.
డిస్‌క్లెయిమర్
వెబ్సైట్లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి