సూచించబడినవి
సూచించబడినవి
Diverse more policies for different needs
మీరు కమర్షియల్ మరియు రిటైల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నుండి కేవలం ఒక్క క్లిక్ దూరంలో ఉన్నారు
ఊహించని విధంగా జరిగే సంఘటనలు మరియు ప్రమాదాలు మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు అని మేము అర్థం చేసుకున్నాము, మేము మీకు సమర్థవంతమైన మరియు విశ్వసనీయమైన క్లెయిమ్ నిర్వహణను అందిస్తాము. మా అనుభవజ్ఞులైన ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ బృందం క్లెయిమ్ ప్రక్రియ గురించి మీకు మార్గనిర్దేశం చేయడానికి నియమించబడింది, ఇది ఒక సులభమైన మరియు అవాంతరాలు లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. మా లక్ష్యం మీపై ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడం మరియు వీలైనంత త్వరగా మిమ్మలని సాధారణ స్థితికి తీసుకురావడం.
- క్లెయిమ్ సూచన
- సర్వేయర్ నియామకం
- నష్టాన్ని గురించిన సర్వే
- డాక్యుమెంట్ల సమర్పణ
- సర్వేయర్ అందించిన తుది నివేదిక
- క్లెయిమ్ యొక్క పరిశీలన
- క్లెయిమ్ సెటిల్‌మెంట్ మరియు చెల్లింపు విడుదల
- క్లెయిమ్ సూచన
- సర్వేయర్ అపాయింట్మెంట్ (ఒకవేళ అవసరమైతే)
- నష్టం గురించిన సర్వే యొక్క ధృవీకరణ
- సాధారణంగా అవరమయ్యే వాటి జాబితా (డాక్యుమెంట్లు)
- డాక్యుమెంట్ల సబ్మిషన్
- సర్వేయర్ ఫైనల్ రిపోర్ట్ సబ్మిషన్
- క్లెయిమ్ తుది పరిశీలన మరియు క్లెయిమ్ అసెస్‌మెంట్ ఫైనలైజేషన్
- క్లెయిమ్ సెటిల్‌మెంట్ మరియు పేమెంట్ విడుదల
- ఆన్‌లైన్ సదుపాయాన్ని ఉపయోగించుకొని బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే మీ నష్టం గురించి (సాధ్యమైనంత త్వరగా) తెలియజేయండి
- వీలైతే సాక్ష్యాలను సేకరించడానికి ఫోటోలు లేదా వీడియోలను తీయండి
- సర్వేయర్ అడ్జస్టర్ వచ్చే వరకు ప్రమాద స్థలాన్ని అలాగే ఉంచండి
- ప్రమాదానికి గల కారణాన్ని పరిశీలించడానికి వారు స్వయంగా విచారణ చేస్తారు (AOG ప్రమాదాలు మినహాయించి)
- Furnish all such information and documentary evidence as the Insurer may require test reports
- సాధ్యమైనంత వరకు ప్రమాదాన్ని అంచనా వేయడం
- నష్టం లేదా ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గించడానికి అతని అధికారానికి లోబడి పలు చర్యలు తీసుకోవడం
- జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని, సాధ్యమైనంత త్వరగా అమలు చేయడం
- మీ సర్వేయర్ / అడ్జస్టర్ మరియు ఇన్సూరెన్స్ సంస్థలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడం
దొంగతనం లేదా దోపిడీ కారణంగా నష్టం లేదా ప్రమాదం జరిగితే - భారత పోలీసు అధికారులకు తెలియజేయడం చాలా అవసరం కాబట్టి, క్లెయిమ్ నోటిఫికేషన్‌లో స్థానిక పోలీసు అధికారి జారీ చేసిన ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) కాపీని చేర్చాలి, ఎఫ్ఐఆర్ కాపీని తరువాతి తేదీలో కూడా సమర్పించవచ్చు
- మీ వ్యాపార స్థలం/ ఆస్తిలో దోపిడీ, దొంగతనం లేదా నష్టం జరిగితే, మా టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1800-209-5858 ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యలను వినడానికి మరియు ప్రాధాన్యత పై మీకు సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము
- కొంత సమయం వెచ్చించి, మీ క్లెయిమ్ గురించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో లేదా మా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మాకు తెలియజేయండి. మేము క్లెయిమ్‌ను సాధారణంగా అవలంభించే పద్ధతులలో పరిశీలించి, తగిన విభాగానికి వెంటనే చేరవేస్తాము. అటువంటి పరిస్థితుల్లో సమయం ఎంత విలువైనదోనని మేము అర్థం చేసుకోగలము.
- ఇప్పటి నుండి, మేము 24 గంటలలోపు ప్రమాద స్థలాన్ని సందర్శించే ఒక సర్వేయర్‌ను (అవసరమైతే) నియమిస్తాము. దీన్ని మరింత వేగవంతం చేయడానికి మేము ప్రయత్నిస్తాము!
- మీరు చేయవలసిందల్లా సర్వేయర్/అసెసర్‌కు, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించడం, ఆ తరువాత వారు తుది నివేదికను గరిష్టంగా 2 వారాలలో మాకు సమర్పిస్తారు (ఈ సమయం పరిస్థితిని బట్టి తక్కువగా కూడా ఉండవచ్చు)
- ఇక్కడ నుండి, మీరు ఏ విషయం గురించి కూడా చింతించవలసిన అవసరం లేదు. మా క్లెయిమ్స్ విభాగం డాక్యుమెంట్లను పరిశీలిస్తుంది, తుది సర్వే నివేదికను చూస్తుంది, ఆ తరువాత మీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను ప్రారంభిస్తుంది.
- You will receive the payment once the claim is settled.
- మీ వ్యాపార ఆస్తికి నష్టం వాటిల్లినా, మీ సంస్థలో దొంగతనం జరిగినా లేదా ఉద్యోగి గాయపడటం వంటి ఎలాంటి ప్రమాదం జరిగినా, మేము కూడా ఆందోళన చెందుతున్నామని మరియు మీకు అవసరమైన అన్ని రకాల సహాయంతో సిద్ధంగా ఉన్నామని తెలుసుకోండి.
- మీకు జరిగిన నష్టాన్ని మాకు తెలియజేయడంలో ఎక్కువ సమయాన్ని వృథా చేయకండి. గుర్తుంచుకోండి, ఎంత త్వరగా సమాచారం అందిస్తే, సహాయం అంత త్వరగా అందుతుంది
- ఒకవేళ మీకు సాధ్యమైతే, ప్రమాదం గురించిన చిత్రాలు/ వీడియోలను తీయండి
- ప్రమాద స్థలంలో మీరు జోక్యం చేసుకోవద్దు. మేము సర్వేయర్‌ను నియమించే వరకు దానిని అలాగే ఉంచండి
- సంబంధిత పూర్తి సమాచారాన్ని మాకు అందించడానికి ప్రయత్నించండి. ఇది పరిస్థితిని మెరుగ్గా అర్థం చేసుకోవడంలో, మీ క్లెయిమ్‌ను వేగంగా ప్రాసెస్ చేయడంలో మాకు సహాయపడుతుంది. మీ నష్టానికి బాధ్యత మాది
- మీకు సాధ్యమైనంత వరకు, జరిగిన నష్టాన్ని అంచనా వేయండి
- మేము చేసే సహాయం పై మీకు నమ్మకం ఉన్నప్పటికీ, మా కోసం వేచి ఉండవద్దు. నష్టం యొక్క తీవ్రతను తగ్గించడానికి మీరు చేయగలిగిన ప్రతిదీ చేయండి
- మాకు మరియు సర్వేయర్‌కు పూర్తి సమాచారాన్ని అందించండి
ఇప్పుడు, మీరు ఒక క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు, క్లెయిమ్ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు, ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లను చూడవచ్చు మరియు అప్‌లోడ్ చేయవచ్చు ఇక్కడ క్లిక్ చేయండి