రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హోమ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

మీ మనసులో హోమ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు, డబ్బును ఆదా చేయండి మరియు సంరక్షణ పొందండి

మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసినందుకుగాను, దానిని హోమ్ ఇన్సూరెన్స్ కవర్‌తో సురక్షితం చేసినందుకుగాను, అభినందనలు!. ఇది షాంపైన్ పాప్ చేసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం! చాలా మంది యజమానులు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలును వాయిదా వేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు.

తెలివైన నిర్ణయం తీసుకున్న వ్యక్తుల ప్రత్యేక బృందానికి స్వాగతం. హోమ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ అనేది మీ అందమైన ప్రపంచాన్ని ఎల్లపుడూ సురక్షితంగా ఉంచుతుంది!

ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ ఇంటి నిర్మాణం కోసం లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చుకు అదనంగా ఉంటుంది అనే భావన తప్పు. ‌ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఇది ఖచ్చితంగా ఒక విలువైన పెట్టుబడిని నిర్ధారిస్తుంది. అంతేకాకుండా, ప్రాపర్టీని ఇన్సూర్ చేసిన వారు నిశ్చింతగా ఉండవచ్చు!

దీనిని పరిగణించండి: మీరు ప్లాన్‌ను బట్టి రోజుకు రూ. 5 వరకు చిన్న మొత్తంతో రూ. 9 లక్షల విలువగల ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందవచ్చు. అది మీ వార్షిక netflix సబ్‌స్క్రిప్షన్ కంటే చాలా తక్కువ!

హోమ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ మీ ఇంటిని, ఇంట్లోని వస్తువులను, అందులో నివసిస్తున్న వ్యక్తుల చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ నుండి మీ సంరక్షణలో ఉన్న వంశపారంపర్య వస్తువుల వరకు, బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. అది ఎలా సాధ్యం అని మీరు అడగవచ్చు? ఒక ప్రమాదాన్ని పరిశీలిద్దాం.

దొంగతనం:

సేఫ్టీ ట్రెండ్స్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్ (ఎస్‌ఎటిఎఆర్‌సి) సర్వే 2018 ప్రకారం, గడిచిన 12 నెలల్లో ముంబైలోని పోలీస్ స్టేషన్స్‌లో కేవలం 34% దొంగతనం కేసులు మాత్రమే అధికారికంగా రిపోర్ట్ చేయబడ్డాయి. ఇది చాలా కేసులు ఇన్వెస్టిగేట్ చేయబడలేదని, దోపిడీల ముప్పు గణనీయంగానే ఉందని సూచిస్తుంది.

మీరు మీ కుటుంబ సభ్యుల భద్రత, శ్రేయస్సు విషయంలో ఎలాంటి అవకాశాలను తీసుకోవాలనుకోరు. హౌస్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ మీ ఆందోళనలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది, మిమ్మల్ని నిశ్చింతగా ఉంచుతుంది!

భవనం కుప్పకూలిపోతుంది:

భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణమైపోయింది! ఉత్తరాఖండ్ వరదల సమయంలో కొట్టుకుపోయిన ఇళ్ల చిత్రాలు ఇప్పటికీ ప్రజల మనస్సులో మెదులుతూనే ఉంటాయి.

అలాగే, భవనాలు కూలిపోవడానికి ప్రధాన కారణాలు నిర్మాణ లోపాలు లేదా సరైన నిర్వహణ లేకపోవడం. హోమ్ ఇన్సూరెన్స్ మీ ఇంటి పునర్నిర్మాణానికి మరియు అవసరమైనప్పుడు ఏదైనా నష్టం లేదా డ్యామేజి సందర్భంలో దానిని మెరుగు పరచడంలో సహాయపడుతుంది.

బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్‌తో అనంతం ఆస్వాదించండి

క్రికెట్ ఆటలో మనం ఆల్-రౌండర్లను మ్యాచ్ విజేతలుగా పరిగణిస్తాము, ముఖ్యంగా వారు ఆట చివరి క్షణాల్లో గెలుపు ఓటమిలను నిర్ణయిస్తారు. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడం అనేది జీవితం అనే ఆట తీసుకునే మలుపులలో ఎలాంటి అవకాశాలకు చోటు ఇవ్వదు!

బజాజ్ అలియంజ్ తరపున మేము మా కస్టమర్లకు వారు ఎక్కడ ఉన్నా, వారి ఇంటిని, వస్తువులను కవర్ చేసే సమగ్ర రక్షణను అందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాము!

ఆస్తికి జరిగిన నష్టం లేదా డ్యామేజీ అనేది వ్యక్తి మానసిక రుగ్మతకు కారణం కావచ్చు, ముఖ్యంగా సెంటిమెంట్‌తో కూడిన వస్తువు విషయంలో ఇది జరుగుతుంది. హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆర్థిక నష్టాన్ని నిర్వహించడంలో, త్వరలోనే మీరు ఆర్థికంగా స్థిరపడటంలో సహాయపడుతుంది.

మీ ఇంటికి ఒక మేక్ఓవర్ ఇవ్వాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు అదనంగా జోడించాలనుకునే ఏవైనా కొత్త ఫర్నిచర్, ఫిక్చర్స్ లేదా ఫిట్టింగులను కవర్ చేయడానికి మేము సహాయం చేస్తాము. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో మీ లివింగ్ రూమ్‌ను అలంకరించే ఖరీదైన కొత్త హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌ను చేర్చడాన్ని నిర్ధారించుకోండి!

మీ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ లాప్స్ అయినప్పుడు, దాని అన్ని ప్రయోజనాలు పూర్తిగా నిలిచిపోతాయి. అందుకే కాలానుగుణంగా దీనిని రెన్యూ చేయడాన్ని నిర్ధారించుకోవడం ముఖ్యం. ఇలా చేసినందుకు, ఏదో ఒక రోజు మీకు మీరే కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు!

మనలో చాలా మందికి ఇంటి కొనుగోలు అనేది ఏళ్ల తరబడి చేసిన ప్రయత్నాలకు ప్రతిఫలం. పెట్టుబడిగా పెట్టిన డబ్బు కూడా అధిక మొత్తంలో ఉంటుంది! హోమ్ లోన్ కోసం ఇఎంఐలను చెల్లించడానికి మీరు, మీ నికర ఆదాయంలో 20% మరియు 30% వరకు ఖర్చు చేయడాన్ని మానేస్తారు. హోమ్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని అనేక ప్రమాదాల నుండి రక్షిస్తుంది, సంక్షోభ పరిస్థితుల్లో మీ జీవితంలో ముందుకు కొనసాగడం అనే భావాన్ని నిర్ధారిస్తుంది. 

బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ కేవలం మనుగడ కోసమే కాకుండా మీరు అభివృద్ధి చెందడంలో కూడా సహాయపడుతుంది

2001 నుండి బజాజ్ అలియంజ్ మిలియన్ల మంది భారతీయ గృహ యజమానులకు, వారి హోమ్ ఇన్సూరెన్స్ అవసరాల కోసం సమగ్రవంతమైన పరిష్కారాలను అందించింది. చిన్నాపెద్ద నగరాల్లో 1000 పైగా ఉన్న మా విస్తృతమైన నెట్‌వర్క్ మీకు వ్యక్తిగతమైన సేవలను అందించడంలో సహాయపడుతుంది. మా డిజిటల్ చొరవ, వర్చువల్ ఆఫీస్ ఈ రెండూ నిర్మాణ-రహిత/ మోర్టార్ ఆఫీసులతో దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో పరస్పర సంభాషణ జరపడానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి అనుమతిస్తాయి. మా కస్టమర్లకు హోమ్ ఇన్సూరెన్స్‌ను సరళంగా, అవాంతరాలు లేకుండా, సరసమైనదిగా చేయడమే మా లక్ష్యం

మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహానికి మా ధన్యవాదాలు, మనీ టుడే ద్వారా మేము జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ ఆఫ్ ది ఇయర్‌గా పేరుపొందాము.

బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ ఈ క్రింది ప్రయోజనాలను అందిస్తుంది:

 

  • ✓ కేవలం ఒక సమగ్ర పాలసీతో మీ ఇల్లు, ఇంట్లోని విలువైన వస్తువులకు పూర్తి సంరక్షణ:

    మీ ఇల్లు, దానిలోని విలువైన వస్తువుల కోసం వివిధ పాలసీలను కొనుగోలు చేయడానికి బదులుగా, రెండింటినీ కవర్ చేసే ఒకే ప్లాన్‌ను ఎంచుకోండి. బజాజ్ అలియంజ్ అవాంతరాలు లేని కవరేజీని అందించే ప్రత్యేక ఇన్సూరెన్స్ పరిష్కారాలను అందిస్తుంది. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఒక ఇంటిగ్రేటెడ్ ఇన్సూరెన్స్ కవర్ మాత్రమే కాకుండా చవకగా కూడా లభిస్తుంది. మీ రిస్క్ సహనం, బడ్జెట్ ఆధారంగా మేము ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత విపత్తుల వల్ల కలిగే నష్టం లేదా డ్యామేజీలకు తక్కువ ఖర్చుతో పూర్తి రక్షణను అందించడంలో మీకు సహాయపడతాము.

  • ✓ దోపిడీ మరియు దొంగతనం నుండి రక్షణ:

    సరికొత్త టెక్నాలజీ - వీడియో డోర్ ఫోన్లు, సిసిటివి పర్యవేక్షణలో ఉన్న కెమెరాలు మరియు ఆటోమేటిక్ లాక్స్ - ఇవన్నీ కూడా మీ ఇంటి కోసం సంపూర్ణ భద్రతా వ్యవస్థకు హామీ ఇవ్వలేవు. బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ భౌతిక భద్రతా వ్యవస్థలు మరియు దోపిడీలు లేదా దొంగతనాలు వంటి ప్రమాదాల మధ్య అంతరాయాన్ని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. బజాజ్ అలియంజ్ మై హోమ్ ఇన్సూరెన్స్ కవర్ మీ ఇంట్లోని వస్తువులకు రక్షణను అందిస్తుంది, తద్వారా దృఢ విశ్వాసంతో మీరు మీ జీవితాన్ని ఆస్వాదించవచ్చు.

  • ✓ పోర్టబుల్ పరికరాలతో సహా మీ అన్ని వస్తువులకు ప్రపంచ వ్యాప్తపు కవరేజ్:

    మీకు ప్రపంచాన్ని చుట్టిరావాలనే ఒక బలమైన కోరిక ఉంటే, ప్రపంచాన్ని పర్యటించడం తప్ప మరో పరిష్కారం లేదు. ఈజిప్ట్‌లోని పిరమిడ్‌లు లేదా చైనాలోని గ్రేట్ వాల్‌ను సందర్శించాలనేది మీ చిరకాల కోరికల జాబితాలో ఉన్నట్లయితే, మీకు మీరే అండగా నిలవండి, మీ కళను సాకారం చేసుకోండి! బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్‌తో మీ వస్తువులు సురక్షితం చేయబడతాయి. మీరు ప్రయాణంలో వెంట తీసుకుని వెళ్లే అత్యంత విలువైన ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు మొదలైన పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలకు జరిగే నష్టాలను కవర్ చేస్తాము. ఇది ఇంట్లో లేదా ప్రకృతి బాటలో ఉన్నప్పుడు మీ విలువైన వస్తువుల చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది.

  • ✓ మీ ఇంట్లో దాచిన ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను రక్షిస్తుంది:

    మీరు ఒక కళాకారుడా? మా హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మీ అద్భుతమైన కళా సేకరణను మాత్రమే కాకుండా ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను కూడా కవర్ చేస్తాయి. లలిత కళలు రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ దానిని సంరక్షించడంలో, భద్రపరచడంలో సహాయపడుతుంది.

కేవలం కొన్ని క్లిక్‌లతో మీ హోమ్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోండి!

దానికి కొన్ని క్లిక్స్ మాత్రమే పడుతుంది! జీవితం చాలా బిజీగా ఉండవచ్చు, ప్రత్యేకంగా మీరు వృత్తిపరమైన నిపుణులు లేదా క్షణకాలం తీరక లేని రోజంతా పనిలో బిజీగా ఉండే తల్లిదండ్రులు అయినప్పుడు. అదృష్టవశాత్తూ, మీరు హోమ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఆన్‌లైన్‌లో నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేయడంతో ప్రయోజనాలను పొందడం కొనసాగించవచ్చు.

ప్రారంభించడానికి ముందు, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోవాలి. వీటిలో మీ ప్రస్తుత పాలసీ నంబర్, పిన్ కోడ్ మరియు సంప్రదింపు వివరాలు ఉంటాయి. అలాగే, మీకు ఇష్టమైతే ఒక కప్పు కాఫీ కూడా!

ఒకసారి మీరు మీ పాలసీకి ప్రాప్యత పొందిన తరువాత, అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌లో మార్పులు మరియు మరేదైనా సమాచారం అప్‌డేట్ చేయడాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ మీ అవసరాలలో ఏదైనా మార్పులు జరిగితే, ఇన్సూరెన్స్ అమౌంటును సవరించడాన్ని పరిగణించాలి లేదా ఒక యాడ్-ఆన్ కవర్‌ను ఎంచుకోవాలి.

ఆఖరి నిమిషంలో అసంతృప్తికరమైన ఆశ్చర్యాలను నివారించడానికి నిబంధనలు, షరతులను పరిశీలించండి! ఒకవేళ మీకు ఏదైనా సహాయం అవసరమైతే, వెంటనే మాకు కాల్ చేయండి, మీ సమస్యలను పరిష్కరించడంలో ఎల్లపుడూ మేము ముందుంటాము.

చివరగా, అందుబాటులో ఉన్న ఆప్షన్‌ల నుండి మీకు నచ్చిన కోట్‌ను ఎంచుకోండి. మీరు మీ కొత్త ఇంట్లో చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకోండి, అలాగే ఏదైనా ఆప్షన్ ఎంచుకునేటప్పుడు మీ విష్ లిస్టులో ఉన్న కొత్త ఎలక్ట్రానిక్‌ పరికరాలను, అలాగే ఇన్సూరెన్స్ కవర్‌కు జోడించాలనుకునే యాడ్-ఆన్‌లను గురించి ఆలోచించండి.

ఇక చెల్లింపు చేయండి మరియు ఇంతటితో మీ పనిని పూర్తి చేసారు!

హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ కోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

నిరంతర కవరేజిని ఆనందించడానికి గడువు తేదీ ముగిసే లోపు మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రెన్యూ చేయండి. రెన్యూ చేయడానికి ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు. కవరేజ్: ఒక సంవత్సరంలో చాలా జరగవచ్చు. హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ విషయానికి వస్తే, మీ వద్దనున్న ప్రతి వస్తువు మరియు ఆస్తికి తగినంత కవరేజ్ ఉందా అని ఆలోచించడంలో ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది. మీ ఇంటి చుట్టూ నడవండి, మీరు కవరేజీని పొందాలనుకునే ఏవైనా కొత్త ఉపకరణాలు, కళాకృతులు, ఫిక్చర్స్ లేదా ఫర్నిచర్ వంటి మొదలైన జాబితాను రూపొందించండి. పెయింటింగ్‌లు, శిల్పాలు వంటి అరుదైన మరియు అత్యంత-విలువైన వస్తువులు, తగిన ఇన్సూరెన్స్ కవరేజీ అవసరమయ్యే వస్తువులకు ఉదాహరణలు.

మీకు ప్రాప్తించిన వాటిని లెక్కించండి కానీ, వాటి రక్షణ కోసం తగిన ఇన్సూరెన్స్ కవర్‌ను కూడా పొందాలని నిర్ధారించుకోండి! ఖర్చు: మీరు మీ ఇన్సూరెన్స్ అవసరాలను అంచనా వేసుకున్న తరువాత, ప్లాన్ ధరను చూడాలనుకోవచ్చు. మీ ప్లాన్ నుండి అధిక ప్రయోజనం పొందడానికి, అందుబాటులో ఉన్న ఏవైనా దీర్ఘకాలిక డిస్కౌంట్స్ కోసం చెక్ చేయండి. అదే ఇన్సూరెన్స్ ప్రయోజనాల కోసం మీరు ఆదా చేసే డబ్బును చూసి మీరే ఆశ్చర్యపోవచ్చు. సహాయార్థం మీరు మా కస్టమర్ సర్వీస్ ప్రతినిధులతో మాట్లాడండి.

రెనోవేషన్స్: మీరు ఇటీవల మీ ఇంటిని రెనోవేట్ చేసినట్లయితే, మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొత్త జోడింపులను కవర్ చేస్తుందో లేదోనని చెక్ చేయడానికి ఇది మంచి సమయం, లేదా, ఎంత అదనపు ఇన్సూరెన్స్ మొత్తం అవసరం అవుతుందని స్వయంగా అంచనా వేయండి. ఒక సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్ కవర్, ఎలాంటి నష్టాల నుండి అయినా మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ దాని సౌందర్యాన్ని కాపాడుతుంది.

మీరు ఇటాలియన్ ఫ్లోరింగ్, అత్యాధునిక మాడ్యులర్ కిచెన్‌లు, లీడింగ్ ఎడ్జ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లను ఇష్టపడితే, వాటిని బజాజ్ అలియంజ్ మై హోమ్ ఇన్సూరెన్స్ వంటి సమగ్ర ప్లాన్‌తో కవర్ చేసుకోవచ్చు. మీ ఇన్సూరెన్స్ కవర్‌ను అప్‌గ్రేడ్ చేయండి, ధృడమైన రక్షణ కవచంతో మీ అందమైన ఇంటిని సురక్షితం చేసుకోండి!

ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? కొన్ని సమాధానాలు ఇక్కడ ఉన్నాయి

ఆన్‌లైన్‌లో బహుళ పాలసీలను రెన్యూ చేయవచ్చా?

అవును, బహుళ ఇన్సూరెన్స్ పాలసీలను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవచ్చు. మీకు కావలసిందల్లా సంబంధిత పాలసీల పాలసీ నంబర్, పిన్ కోడ్ మరియు మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న చాలా సమాచారం ఉదా: బిల్లింగ్ అడ్రస్ లేదా సంప్రదింపు వివరాలు. మీ పాలసీ వివరాలను సమీక్షించండి ఉదా: ఇన్సూరెన్స్ మొత్తం, చెల్లించవలసిన ప్రీమియం మొదలైనవి.

మీరు ఆన్‌లైన్ రెన్యూవల్ ఫారమ్‌ను నింపిన తరువాత, దానిని సబ్మిట్ చేసి ఆ తరువాత చెల్లింపు చేయండి.

నా ఇంటి మొదటి అంతస్తులో ఉన్న గెస్ట్ రూమ్‌లో అద్దెదారు ఉంటున్నారు. నాకు, అద్దెదారుకు ఇద్దరికీ కలిపి నా పేరుమీద ఇన్సూరెన్స్ కవర్ అవసరమవుతుందా?

ఒకే ఇంట్లో రెండు వేర్వేరు కుటుంబాలు నివసిస్తుంటే (యజమాని మరియు అద్దెదారు), అప్పుడు రెండు వేర్వేరు పాలసీలు జారీ చేయబడవచ్చు. అదేవిధంగా, ఒకవేళ మీ అద్దెదారు మీ యాజమాన్యంలో లేదా మీ ప్రాంగణంలోనే ప్రత్యామ్నాయ వసతిని అద్దెకు తీసుకున్నట్లయితే, మీరు రెండు ప్రత్యేక పాలసీలను కూడా తీసుకోవచ్చు.

మీరు మీ ఇంటి నిర్మాణం, వస్తువులు రెండింటి కోసం ఒక ఆల్-ఇన్‌క్లూజివ్ పాలసీని ఎంచుకోవచ్చు. అలాగే, మీ అద్దెదారు తన వస్తువులతో పాటు, నివసించే ఇంటి నిర్మాణానికి కూడా పాలసీని పొందవచ్చు.

రెన్యూవల్ సమయంలో హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని అప్‌గ్రేడ్ చేయవచ్చా? నేను నా కవర్‌ని తగ్గించుకోవాలనుకుంటే ఏమి చేయాలి?

మీ పాలసీని రెన్యూ చేయడం అంటే, అది ఖచ్చితంగా సరికొత్త పాలసీ, మునుపటి సంవత్సరం పాలసీపై ఎలాంటి ప్రభావం చూపదు. కావున, మీరు ఖచ్చితంగా మీ అవసరాలకు అనుగుణంగా మీ ఇన్సూరెన్స్ కవర్‌ను అప్‌గ్రేడ్ చేయవచ్చు లేదా డౌన్‌గ్రేడ్ చేయవచ్చు.

నేను నా హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసిందని గ్రహించాను? నేను ఏమి చెయ్యాలి

చింతించకండి. మీరు చేయవలసిందల్లా, మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసిన 30 రోజుల తరువాత మాకు కాల్ చేయండి లేదా మా ఆఫీస్‌ను సందర్శించండి, మేము మీ కోసం కొత్త పాలసీని అందజేస్తాము!

నేను మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న వివిధ మార్గాలు ఏంటి?

మా వెబ్‌సైట్ కేవలం కొన్ని క్లిక్‌లతో మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి అనుమతిస్తుంది!

బదులుగా మాకు ఒక కాల్ చేయండి మరియు కాల్ బ్యాక్ కోసం షెడ్యూల్ చేయండి. మేము మిమ్మల్ని ఫాలో-అప్ చేస్తాము, అదేవిధంగా ఆన్‌లైన్‌లో చెల్లింపును ప్రాసెస్ చేస్తాము.

సహాయార్థం కొరకు మీరు మా బ్రాంచ్‌ను సందర్శించడానికి స్వాగతం. మా కస్టమర్లను చూసి మేము ఎల్లప్పుడూ సంతోషిస్తాము!

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి