ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
హోమ్ ఇన్సూరెన్స్ విషయంలో, భారతదేశం చాలా కాలంగా వెనుకబడింది. అయితే, ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం అనేది మీరు మీ కొత్త ఇంటిలోకి చేరిన వెంటనే మీ జాబితాలో ఉండాలి. ఏమైనా, మీ కొత్త ఇల్లు అనేక సంవత్సరాలపాటు సురక్షితంగా ఉండేలాగా నిర్ధారించడానికి భారతదేశంలో ఉత్తమమైనది తప్ప మరే హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు అవసరం ఉండదు.
ఏమైనా, మీ కుటుంబ సురక్షత ప్రమాదంలో ఉంది, మీరు మీ కలల ఇంటిలో పెట్టుబడి పెట్టిన లక్షలు మరియు కోట్ల రూపాయల గురించి మరి చెప్పనక్కర్లేదు. అనిశ్చిత ప్రపంచంలో హౌస్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఒక నమ్మకాన్ని అందిస్తుంది.
బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ మీ ఇంటికి దీర్ఘకాలం నిలచి ఉండే రక్షణ ఎలా ఇస్తుంది అనేది ఇక్కడ ఇవ్వబడింది:
అగ్నిప్రమాదాలు, భూకంపాలు, వరదలు, భూపాతాలు వంటి ఉత్పాతాలను కేవలం ప్రహరీ గోడలు మరియు బ్యారికేడ్లు ఆపలేవు, వీటికి మీ మొత్తం ఇరుగుపొరుగులను తుడిచిపెట్టగల సామర్థ్యం ఉంటుంది. అటువంటి సహజ విపత్తుల తీవ్రత తక్కువగా ఉన్నా, చిన్న కంపం లేదా కొద్ది సేపు కురిసే భారీ వర్షం మీ ఇంటిలో ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు ఇతర ఉపకరణాలను శాశ్వతంగా దెబ్బతీయవచ్చు.
అల్లర్లు, దొంగతనం లేదా దోపిడీ వంటి భయాలను పూర్తిగా తొలగించలేము. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతి విపత్తులో, అది ప్రకృతి వలన లేదా మానవుల వలన కలిగినది అయినప్పటికీ, మీకు రక్షణ కలిపిస్తుంది.
మీరు ఒక ప్రధాన మెట్రో లేదా చిన్న పట్టణంలో ఒక అద్దెకు ఉన్నవారు అయినా, ఒక హౌస్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండడం వలన జరిగే అవకాశం ఉన్న ప్రమాదాల నుండి మీ వస్తువులను రక్షించడానికి మీకు సహాయపడుతుంది. మీరు ఒక మినిమలిస్ట్ జీవనశైలిని ఇష్టపడినా, ఒక హౌస్ ఇన్సూరెన్స్‌తో, ల్యాప్‍టాప్‍లు, టెలివిజన్లు, ఫర్నిచర్ మరియు ఇతర ఉపకరణాలు వంటి మీ పర్సనల్ ఆస్తి సురక్షితమైన చేతుల్లో ఉంటాయి.
మీరు మీ ఇంటిని ఇన్సూర్ చేయాలా లేదా అందులోని వస్తువులను ఇన్సూర్ చేయాలా అని నిర్ణయించుకోలేకపోతే, రెండింటినీ కవర్ చేయండి. అత్యవసర పరిస్థితిలో ఇది మీకు సమగ్రమైన కవరేజ్ ప్రయోజనాన్ని అందిస్తుంది మరియు మీకు పూర్తి మనశ్శాంతిని అందిస్తుంది. అయితే, మీరు ఒక అద్దెకు ఉన్నవారు అయితే, మీరు మీ వస్తువులను ఇన్సూర్ చేసే ఎంపికను కూడా కలిగి ఉంటారు.
సెలవు పై వెళ్ళి ఉన్నప్పుడు మీ తలుపులు సురక్షితంగా లాక్ చేయబడ్డాయా అనేదాని గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? మేము అర్థం చేసుకోగలం. మీ ఇంట్లోకి దోపిడీ దొంగలు చొరబడటం అనే ఆలోచన హాలిడే మూడ్‍ను పాడుచేయగలదు. బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్‌తో, మీరు ఇటువంటి ఆలోచనల నుండి తక్షణ స్వేచ్ఛను పొందవచ్చు. బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ మీ ఇంటిని మరియు సామానును అనేక రకాల అపాయాల నుండి సురక్షితం చేస్తుంది, మీరు ఎక్కువ రోజుల పాటు ఇంటి నుండి దూరంగా ప్రయాణిస్తున్నప్పుడు కుడా.
"ధర సరైనదా?" అనేది అడగడానికి ఒక సరైన ప్రశ్న. ఏది ఏమైనా, అది ఒక కొనుగోలు సరైనదా లేదా అనేది నిర్ణయిస్తుంది. మరి, మీ అవసరాలకు సమగ్ర కవరేజ్ అందించేటప్పుడు మా హోమ్ ఇన్సూరెన్స్ కవరేజ్ సరసమైనది అని నిర్ధారించడానికి మేము ప్రత్యేక జాగ్రత్త తీసుకున్నాము. హౌస్ ఇన్సూరెన్స్ కోసం మీ కీలక లక్షణాల జాబితాలో మీరు 'ఖర్చు' చెక్‌బాక్స్‌ను సురక్షితంగా టిక్ చేయవచ్చు. మా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆకర్షణీయమైనది మరియు డబ్బుకు తగిన విలువను జోడిస్తుంది.
నిజాన్ని అంగీకరిద్దాం. మీరు ఎట్టిపరిస్థితిలోనూ చెల్లించవలసిన బకాయిలు చాలా ఉంటాయి. వాటిని మీరు గుర్తు చేసుకోవడానికి డజన్ రిమైండర్లను సెట్ చేసుకుంటారు. అయితే, హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు రెన్యువల్ మరియు ప్రీమియంలు కూడా ఆ జాబితాలో ఉంటాయని మాకు తెలుసు. అయితే, కాలం మారిపోయింది కాబట్టి, దాంతో పాటు మీరు కూడా మారాలి. బజాజ్ అలియంజ్ వద్ద మేము నిరంతరం చేయవలసిన రెన్యువల్ పద్ధతిని తొలగించాము. మీరు 3 సంవత్సరాల వ్యవధితో వచ్చే బజాజ్ అలియంజ్ మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవచ్చు మరియు ప్రతి సంవత్సరం రెన్యూ చేసుకునే పాత పద్ధతికి వీడ్కోలు పలుకవచ్చు.
మేము మీకు తిరుగులేని ధర వద్ద సాటిలేని సౌకర్యాన్ని అందిస్తున్నాము. మా ఆకర్షణీయమైన హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
మాటల కంటే చేతలు గొప్పవి. మీరు మంచి డీల్స్ ఇష్టపడతారని మాకు తెలుసు మరి మేము కూడా మిమ్మల్ని నిరాశపరచాలి అనుకోవటంలేదు! గొప్ప డిస్కౌంట్లు కలిగిన సమగ్ర హౌస్ ఇన్సూరెన్స్ మీకు ఉత్తమమైన వాటిని అందిస్తుంది. బజాజ్ అలియంజ్ వద్ద, మీరు హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై 20% వరకు డిస్కౌంట్ పొందవచ్చు, ఇది మీ ఖర్చును తగ్గిస్తుంది.
ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం అనేది మీరు మీ కొత్త ఇంటిలో చేరిన వెంటనే మీరు చేయవలసిన ప్రధాన కార్యం అయి ఉండాలి.
మీ ప్రియమైనవారిని రక్షణ కోసం, ప్రతికూలత ఎదురైనప్పుడు హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీకు మరింత నియంత్రణ మరియు అంచనా వేయగల సామర్థ్యం అందిస్తాయి.
మీ స్వంత ఇంటిని కలిగి ఉండడం అనేది ఒక ప్రివిలేజ్ మరియు బాధ్యత రెండూను. కొనుగోలు డీడ్ పై సంతకం చేయడం కేవలం ప్రారంభం మాత్రమే. మీరు మీ ఇంటిని ఒక గృహంగా పిలిచే ముందు, చేయవలసిన పని చాలా ఉంటుంది. ఇది ఎంతగా శ్రమతో కూడినదో అంతగా సంతృప్తిని అందించే ఒక ప్రాసెస్. ఇంటీరియర్ డిజైన్ పత్రికలను పరిశీలించడం, పెయింటర్లు మరియు డిజైనర్లను సంప్రదించడం, అనేక ప్రదేశాల నుండి ప్రత్యేకమైన కళా ఖండాలు కొనుగోలు చేయడం మరియు చివరిగా వాటిని అన్నింటినీ చక్కగా అమర్చడానికి వారాలు ఒక్కోసారి నెలల సమయం పట్టవచ్చు.
అయితే, వాస్తవ పరిస్థితులు ఎదురైనప్పుడు, ప్రణాళికలు అన్నీ తలక్రిందులు అవుతాయి. మీరు కుటుంబం మరియు స్నేహితులకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండటానికి ముందు ఆ ఉత్తమ పరిసరాలను పొందడానికి మీరు ఇప్పటికీ ఫర్నిచర్‌ను చుట్టూ కదిలించడం మరియు లైటింగ్‌ను మరి కొన్ని సార్లు సరి చేయడం వంటివి చేయవలసి ఉంటుంది.
వేడుక జరుపుకోవడానికి, అది ఒక మంచి కారణం! అంతేకాకుండా, మీరు మీ స్వంతం అని పిలుచుకోగలిగే ఒక స్థలం కొన్నారు; ఇది చాలామందికి గర్వకారణం. అందులో ఉన్న ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని, మీరు వీలైనంత త్వరగా హౌస్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఉత్తమం.
మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయం.
మీ ఇంటిని మరియు దానిలో ఉన్న వస్తువులను సురక్షితం చేసుకోండి
మా మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.
మీరు ఒక ఇంటి యజమాని అయినా, లేదా ఒక ఇంటిని కొనుగోలు చేయడం పరిగణిస్తున్నా, మీరు హోమ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలి. ఈ వీడియో మీ ఇంటిని మరియు వస్తువులను సురక్షితంగా, ఖచ్చితంగా మరియు ఊహించని విపత్తుల నుండి కవర్ చేసి ఉంచుకోవడం ఎలాగో వివరిస్తుంది.
మై హోమ్ ఇన్సూరెన్స్
హోమ్ ఇన్సూరెన్స్ కవర్ ప్లాన్లు
హోమ్ ఇన్సూరెన్స్ అనుకూలత
ఏదైనా విలువైన వస్తువుని పోగొట్టుకున్నప్పుడు విషాదం మరియు నిరాశ కలుగుతాయి. సంఘటన జరిగిన వెంటనే కలిగిన షాక్ నుండి తేరుకున్న తరువాత, మీరు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. బజాజ్ అలియంజ్ హౌస్ ఇన్సూరెన్స్‌తో, అటువంటి నష్టాల వలన కలిగే ఆర్ధిక ఇబ్బందులను మేము దూరం చేస్తాము. కవరేజ్ పరిధి నిర్ణయించబడే ప్రాతిపదిక గురించి తెలుసుకొని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఏమైనాగానీ, మీరు చెల్లించే హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై మీరు మంచి రిటర్న్స్ ఆశిస్తారు.
మేము బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ కింద 4 ప్లాన్లు అందిస్తాము. అవి ఈ విధంగా ఉన్నాయి:
నష్టపరిహారం ప్రాతిపదికన ప్లాన్లు: ఇది ఇన్సూర్ చేయబడిన ఆస్తికి లేదా వస్తువుకు జరిగిన డామేజ్ లేదా నష్టం కోసం నష్టపరిహారం అనేది అరుగుదల మరియు తరుగుదలని మినహాయించిన తరువాత ఇవ్వబడుతుంది.
రీఇన్‌స్టేట్‌మెంట్ విలువ ప్రాతిపదికన ప్లాన్లు: దెబ్బతిన్న వస్తువు కోసం మీరు ఒక అదేలాంటి రీప్లేస్‌మెంట్ ఇక్కడ పొందుతారు. అయితే, రీప్లేస్మెంట్ యొక్క విలువ మరియు స్పెసిఫికేషన్లు ముఖ్యంగా దెబ్బతిన్న దానికి సమానంగా ఉంటాయని, ఏ మాత్రం ఎక్కువ కాదని, గమనించాలి.
పాత కోసం కొత్తది ప్రాతిపదికన ప్లాన్లు: రిపేర్ చేయబడటానికి వీలుకాకుండా దెబ్బతిన్న వస్తువులకు రీప్లేస్మెంట్ ఖర్చు పూర్తిగా చెల్లించబడుతుంది.
అంగీకరించబడిన విలువ ప్రాతిపదికన ప్లాన్‌లు: అంగీకరించబడిన విలువ ప్రాతిపదికన అంటే ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి అంగీకరించిన ఆస్తి లేదా వస్తువుల విలువపై మా ద్వారా నష్టం సెటిల్ చేయబడుతుంది.
మై హోమ్ ఇన్సూరెన్స్ | బిల్డింగ్ ఇన్సూరెన్స్ (నిర్మాణం) | ||||
అంగీకరించిన విలువ ప్రాతిపదికన (ఫ్లాట్/అపార్ట్‌మెంట్) |
రీఇన్‌స్టేట్‌మెంట్ వాల్యూ బేసిస్ (ఫ్లాట్ / అపార్ట్‌మెంట్ / ఇండిపెండెంట్ బిల్డింగ్) |
నష్టపరిహారం ప్రాతిపదికన (ఫ్లాట్ / అపార్ట్‌మెంట్ / ఇండిపెండెంట్ బిల్డింగ్) |
|||
పోర్టబుల్ పరికరాలతో సహా వస్తువులు | పాతదాని కోసం కొత్తది ప్రాతిపదికన (ఆభరణాలు మరియు విలువైన వస్తువులు, పెయింటింగ్, కళా ఖండాలు మరియు అరుదైన వస్తువులను మినహాయించి) | ప్లాటినం ప్లాన్ -I ఫ్లాట్/అపార్ట్‌మెంట్ ఇన్సూరెన్స్ - అంగీకరించిన విలువ ప్రాతిపదికన + వస్తువులు - పాతదాని కోసం కొత్తది |
డైమండ్ ప్లాన్ -I ఫ్లాట్/అపార్ట్‌మెంట్/బిల్డింగ్- రీఇన్‌స్టేట్‌మెంట్ విలువ ప్రాతిపదికన + వస్తువులు - పాతదాని కోసం కొత్తది ప్రాతిపదికన |
గోల్డ్ ప్లాన్ -I ఫ్లాట్/అపార్ట్‌మెంట్/బిల్డింగ్ - నష్టపరిహారం ప్రాతిపదికన + వస్తువులు- పాతదాని కోసం కొత్తది ప్రాతిపదికన |
|
---|---|---|---|---|---|
నష్టపరిహారం ప్రాతిపదికన (ఆభరణాలు మరియు విలువైన వస్తువులు, పెయింటింగ్, కళా ఖండాలు మరియు అరుదైన వస్తువులను మినహాయించి) | ప్లాటినం ప్లాన్ -II ఫ్లాట్/అపార్ట్‌మెంట్ ఇన్సూరెన్స్ - అంగీకరించిన విలువ ప్రాతిపదికన + వస్తువులు - నష్టపరిహారం ప్రాతిపదికన |
డైమండ్ ప్లాన్ -II ఫ్లాట్/అపార్ట్‌మెంట్/బిల్డింగ్ - రీఇన్‌స్టేట్‌మెంట్ విలువ ప్రాతిపదికన + వస్తువులు - నష్టపరిహారం ప్రాతిపదికన |
గోల్డ్ ప్లాన్ -II ఫ్లాట్/అపార్ట్‌మెంట్/బిల్డింగ్ - నష్టపరిహారం ప్రాతిపదికన + వస్తువులు - నష్టపరిహారం ప్రాతిపదికన |
||
పోర్టబుల్ పరికరాల కవరేజ్ | ఇన్‌బిల్ట్ కవరేజ్: అదనపు ప్రీమియం చెల్లింపుపై ఇండియా కవరేజ్ విస్తరణ: ప్రపంచవ్యాప్తంగా | ||||
ఆభరణాలు, విలువైన వస్తువులు, అరుదైన వస్తువులు మొదలైనవి. | ఆభరణాలు, విలువైన వస్తువులు, అరుదైన వస్తువులు, పెయింటింగ్ మరియు కళా ఖండాలు) | ఆభరణాలు మరియు విలువైన వస్తువుల కోసం: ఇన్‌బిల్ట్ కవరేజ్: అదనపు ప్రీమియం చెల్లింపుపై భారతదేశం వ్యాప్తంగా కవరేజ్ విస్తరణ: ప్రపంచవ్యాప్తంగా | |||
అదనపు ప్రయోజనం | ప్రత్యామ్నాయ వసతి కోసం అద్దె మరియు బ్రోకరేజ్ | i) ప్రత్యామ్నాయ వసతి కోసం అద్దె a) ఫ్లాట్/అపార్ట్‌మెంట్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 0.5% లేదా b) వాస్తవ అద్దె, పునర్నిర్మాణం పూర్తి అయ్యే లేదా 24 నెలలు ఏది తక్కువ అయితే ఆ వ్యవధి వరకు నెలకు గరిష్టంగా రూ. 50,000 కు లోబడి, (a) మరియు (b) లలో ఏది తక్కువ అయితే అది ii) ఒక నెల అద్దెకు మించకుండా చెల్లించవలసిన వాస్తవ బ్రోకరేజ్ |
i) ప్రత్యామ్నాయ వసతి కోసం అద్దె a) ఫ్లాట్/అపార్ట్‌మెంట్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 0.3% లేదా b) బ్రోకరేజ్‍తో సహా వాస్తవ అద్దె, పునర్నిర్మాణం పూర్తి అయ్యే లేదా 24 నెలలు ఏది తక్కువ అయితే ఆ వ్యవధి వరకు నెలకు గరిష్టంగా రూ. 35,000 కు లోబడి, (a) మరియు (b) లలో ఏది తక్కువ అయితే అది ii) ఒక నెల అద్దెకు మించకుండా చెల్లించవలసిన వాస్తవ బ్రోకరేజ్ |
- | |
ఎమర్జెన్సీ కొనుగోళ్లు | రూ. 20,000 లేదా వాస్తవ మొత్తం ఏది తక్కువగా ఉంటే అది | ||||
గమనిక | ఇన్సూర్ చేయడానికి ఎంపికలు | ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ఫ్లాట్/అపార్ట్‌మెంట్/స్వతంత్ర బిల్డింగ్ మాత్రమే లేదా వస్తువులు మాత్రమే లేదా రెండింటిని ఇన్సూర్ చేయడానికి ఎంపిక ఉంటుంది. | |||
పాలసీ వ్యవధి | పాలసీ వ్యవధి కోసం ఎంపికలు | i) 15/30/60/90/120/150/180/210/240/270 రోజుల వరకు షార్ట్ టర్మ్ పాలసీ ii) 1 సంవత్సరం/2 సంవత్సరాలు/3 సంవత్సరాలు/4 సంవత్సరాలు/5 సంవత్సరాల వార్షిక పాలసీ (గమనిక: అన్ని పాలసీలకు ఎంచుకోబడిన అన్ని కవర్ల కోసం పాలసీ వ్యవధి ఒకే విధంగా ఉంటుంది) |
|||
యాడ్ ఆన్ కవర్లు | అన్ని ప్లాన్ల కోసం యాడ్ ఆన్ కవర్ | 1) అద్దె నష్టం 2) తాత్కాలిక రీసెటిల్మెంట్ కవర్ 3) కీస్ మరియు లాక్స్ రీప్లేస్మెంట్ కవర్ 4) ఏటిఎం విత్‍డ్రాల్ దొంగతనం కవర్ 5) పోయిన వాలెట్‌కి కవర్ 6) డాగ్ ఇన్సూరెన్స్ కవర్ 7) పబ్లిక్ లయబిలిటీ కవర్ 8) ఉద్యోగి యొక్క పరిహారం కవర్ |
|||
వస్తువులు ఇన్సూర్ చేయబడి ఉంటే తప్ప ఆభరణాలు మరియు విలువైన వస్తువులు మరియు / లేదా అరుదైన వస్తువులు, పెయింటింగ్లు మరియు కళా ఖండాల కోసం స్టాండ్అలోన్ కవర్ ఎంచుకోలేము. |
పంచభూతములు నుండి మీ ఇంటి ఎక్స్టీరియర్‍ను రక్షించే ఒక తాజా కోట్ పెయింట్ లాగానే, మా ఆల్-ఇన్-వన్ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ మీ ఇంటికి మరియు దాని వస్తువులకు స్థిరమైన రక్షణను అందిస్తుంది. బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ తో, ఒక ఎమర్జెన్సీ పరిస్థితిలో మీ ఖర్చులు భరించబడతాయి అని తెలుసుకుని మీరు ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.
ఒక పిడుగుపాటు లేదా ఒక సిగరెట్ బట్ కారణంగా అయినా కలిగే ఒక అగ్నిప్రమాదం బహుశా మీ ఇల్లు మరియు కుటుంబానికి భయం కలగజేయవచ్చు. అగ్నిమాపకదళం దానిని ఆర్పడానికి కలిసికట్టుగా ప్రయత్నాలు చేసినప్పటికీ, గంటల్లోపు, లక్షల రూపాయల విలువగల ఆస్తిని ఒక చెలరేగుతున్న అగ్ని సర్వనాశనం చేయగలదు. బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ అటువంటి ఆస్తి రిపేర్ మరియు/లేదా పునర్నిర్మాణం ఖర్చులను కవర్ చేస్తుంది.
భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడాన్ని నిపుణులకు వదిలిపెడితే మంచిది, అయితే, బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్‌తో మీరు ఆస్తికి జరిగే నష్టం నుండి రక్షణ పొందవచ్చు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, ఒక ఇంటిని పునర్నిర్మాణం చేయడానికి అయ్యే ఖర్చులు చాలా ఎక్కువగా ఉండవచ్చు. అవసరమైన మునిసిపల్ అప్రూవల్స్ పొందడం నుండి నిర్మాణ సామాగ్రి కొనుగోలు మరియు లేబర్ ఖర్చుల వరకు, దాని అసలు ఖర్చు కంటే ఒక ఇంటిని పునర్నిర్మాణం చేయడానికి మీరు ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు చేయవలసి రావచ్చు. ఒక నామమాత్రపు హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంకు, అటువంటి నష్టాల నుండి మీరు మీ ఇంటిని సురక్షితం చేసుకోవచ్చు.
ఒక దురదృష్టకరమైన భూకంపం యొక్క ఆర్ధిక ప్రభావాన్ని తగ్గించడం ద్వారా బజాజ్ అలియంజ్ హౌస్ ఇన్సూరెన్స్ అనేది మీ ఇంటిని మరియు జీవితాన్ని పునర్నిర్మాణం చేసే సమయంలో ఒక విశ్వసనీయమైన మిత్రునిగా మీకు తోడుగా నిలుస్తుంది.
నిశిరాత్రి సమయంలో, మీ ఇంటికి దొంగతనం లేదా చోరీ ప్రమాదం ఉండవచ్చు. మీరు ఎల్లప్పుడూ తలుపులను గడియ వేసి మీ ఇంటి కిటికీలను మూసినప్పటికీ, దాని సురక్షతను అదృష్టానికి వదిలి పెట్టలేము. బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ చోరీ మరియు దొంగతనం నుండి మీ ఇంటిని కవర్ చేస్తుంది, మీకు మరియు మీ కుటుంబానికి అర్హత కలిగిన అదనపు రక్షణను అందిస్తుంది.
మీ ఇంటిలోని అధిక విలువగల వస్తువుల భద్రత గురించి భయాల కారణంగా మీరు మీ సెలవులను వాయిదా వేస్తున్నట్లయితే, మీరు ఇంక రిలాక్స్ అవ్వచ్చు! బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ హోమ్ ఎంటర్టెయిన్మెంట్ సిస్టమ్‍లు, కంప్యూటర్లు మరియు వాటి పెరిఫెరల్స్ మరియు ఎన్నో ఇతర గృహ ఉపకరణాలు వంటి వస్తువులను కవర్ చేస్తుంది. మీ వద్ద ఇతరులకు ఈర్ష్య కలిగించే పెయింటింగ్‍లు, శిల్పాల కలెక్షన్ ఉన్నా లేదా కెమెరాలు వంటి ప్రొఫెషనల్ పరికరాల కలెక్షన్ ఉన్నా, మేము మిమ్మల్ని కవర్ చేస్తాము.
కుటుంబ ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులు చాలా సెంటిమెంటల్ విలువను కలిగి ఉంటాయి. కళాత్మకమైన సౌందర్యం కలిగి ఉండి అనేక తరాల వారసత్వానికి ప్రతీకగా నిలిచే వీటిని పదిలంగా కాపాడుకోవాలి. మీరు ప్రపంచానికి కనిపించకుండా జాగ్రత్తగా కాపాడుకున్న ఆ అమూల్యమైన కళా ఖండాలను రక్షించడానికి బజాజ్ అలియంజ్ హౌస్ ఇన్సూరెన్స్ ఎంచుకోండి!
నిజాన్ని అంగీకరిద్దాం! ఒక ప్రకృతి లేదా మానవ-నిర్మిత విపత్తు వలన కలిగే కఠినమైన పరిస్థితుల పై కొన్ని సార్లు మాత్రమే గెలవచ్చు. ఒక అత్యవసర పరిస్థితి కారణంగా మీరు ఇన్సూర్ చేయబడిన ఇల్లు లేదా రెసిడెన్షియల్ ఆస్తిని తాత్కాలికంగా ఖాళీ చేయవలసి వస్తే, బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‍లు ప్రత్యామ్నాయ వసతి పై అయిన ఖర్చుల భారాన్ని కూడా భరిస్తాయి.
అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం ఉండదు అని మాకు తెలుసు! అందువల్ల, మీ ఇంటికి సంపూర్ణమైన రక్షణను అందించడానికి, బజాజ్ అలియంజ్ హౌస్ ఇన్సూరెన్స్‌తో మీకు అనేక రకాల యాడ్ ఆన్ కవర్లు అందించబడుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో, మేము మీకు మాటల కంటే చేతల ద్వారా సహాయపడతాము; కొంచెం అధికంగా ఉన్న హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంతో లభించే మా యాడ్ ఆన్స్ సహాయంతో మీ దొంగిలించబడిన లేదా పాడైన విలువైన వస్తువులకు మంచి కవర్ లభిస్తుంది.
యజమాని అయినా లేదా అద్దెకు ఉన్నవారు అయినా, మా హౌస్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీ అవసరాలకు సరిగ్గా సరిపోయేవిగా ఉంటాయి. మీరు మీ స్వంత ఇంటిలో నివసిస్తున్నట్లయితే, మీ ఇంటిని మరియు దాని వస్తువులను వివిధ రకాల ప్రమాదాలు, ప్రకృతి మరియు మానవుల వలన కలిగే విపత్తుల నుండి సురక్షితం చేసుకోవడానికి మా సమగ్ర ప్లాన్‌ను ఎంచుకోండి. మీకు పర్యాటన చేయడం ఇష్టం అయితే, చింతించకండి! మేము అందించే వస్తువులకు మాత్రమే ఉన్న హోమ్ ఇన్సూరెన్స్ కవర్ మీరు ఎంచుకోవచ్చు మరియు నిశ్చింతగా ఉండవచ్చు.
(25 సమీక్షలు & రేటింగ్‍ల ఆధారంగా)
ఆన్‌లైన్‌లో హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి సులభమైన మరియు ఇబ్బందులు లేని, సౌకర్యవంతమైన మార్గం.
హోమ్ ఇన్సూరెన్స్ కోసం ప్రొఫెషనల్, వేగవంతమైన మరియు సరళమైన క్లెయిమ్ ప్రాసెస్!
నేను బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాను, అతను హోమ్ ఇన్సూరెన్స్ గురించి అన్నీ నాకు వివరించారు, అది ప్రశంసనీయం.
1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు కవర్ ఎంచుకోవడానికి ఫ్లెక్సిబిలిటి
వస్తువుల కోసం ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి భర్తీ చేయడం
ప్రాథమికంగా, ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ భూకంపం, వరదలు, అగ్నిప్రమాదం, దొంగతనం, చోరీలు వంటి ప్రకృతి మరియు మానవుల వలన కలిగిన విపత్తులు మరియు మీ నివాస ప్రాంతం ఎదుర్కోగల ఇతర ప్రమాదాల నుండి మీ ఇంటిని మరియు దాని వస్తువులను కవర్ చేస్తుంది. ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఇంటికి మరియు దానిలో మీ ప్రియమైన వాటి అన్నింటికీ ఒక నిజమైన రక్షణ కవచంలా నిలుస్తుంది.
ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మీకు ఈ రెండు రకాల ప్రయోజనాలను అందిస్తుంది, మీ ఆస్తి నిర్మాణానికి అలాగే దాని వస్తువులకు కవరేజ్, అగ్నిప్రమాదం, చోరీ, వరద, దొంగతనం మొదలైనవి ఇప్పుడు మీ ముందు బలహీనపడిపోతాయి! అయితే, మీరు అద్దెకు తీసుకున్న ఇంటిలో కేవలం వస్తువులను మాత్రమే కూడా కవర్ చేయవచ్చు.
వర్షమైనా ఎండైనా, సంవత్సరాలు గడిచే కొద్దీ మీ ఇల్లు చాలా అరుగుదల మరియు తరుగుదలకు గురి అవుతుంది. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ నుండి ఫర్నిచర్ వలన కలిగే ప్రమాదాల వరకు, మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఆస్తి మరియు/లేదా వస్తువులను అగ్నిప్రమాదం, చోరీ, దొంగతనం, ప్రమాదవశాత్తు నష్టం మరియు ప్రకృతి వైపరీత్యాల వంటి అనేక అపాయాలకు వ్యతిరేకంగా కవర్ చేస్తుంది.
మీ ఇంటికి కొత్తవారు వచ్చిన ప్రతిసారీ మీరు మీ అల్మరాను చాటుగా గమనిస్తూ ఉంటే, అలా ప్రవర్తించేది మీరు ఒక్కరు మాత్రమే కాదు. బజాజ్ అలియంజ్ హౌస్ ఇన్సూరెన్స్ మీ ఇంటిలో అధిక విలువగల కళాఖండాలు, ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను కవర్ చేస్తుంది. ఏదైనా నష్టం జరగటం వలన మీ ఆస్తి ఒక నిర్దిష్ట వ్యవధిపాటు నివాసయోగ్యమైనది కాకపోతే, ఆ ఆస్తి మళ్ళీ సరి చేయబడే వరకు ఒక ప్రత్యామ్నాయ వసతి అద్దెకు తీసుకునే ఖర్చులను మా హోమ్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ కవర్ చేస్తుంది.
మా అసెసర్స్ కనుగొన్న విషయాల ప్రకారం, నష్టం ఎలా జరిగింది అనే దానిపై అది నిజంగా ఆధారపడి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లలో సరిగ్గా నింపబడిన మరియు సంతకం చేయబడిన క్లెయిమ్ ఫారంతో పాటు ఫైర్ బ్రిగేడ్ రిపోర్ట్ ఉండవచ్చు. దొంగతనం జరిగినప్పుడు, ఒక FIR నమోదు చేయాలి మరియు దానిని మాకు అందజేయాలి. ఏ పరిస్థితిలోనైనా, క్లెయిమ్ ఫారం అనేది హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క నిబంధనల ప్రకారం క్లెయిమ్‍ను ప్రాసెస్ చేయడానికి ఒక తప్పనిసరి డాక్యుమెంట్
మంచి ప్రశ్న! మునుపటి విభాగంలో ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని లెక్కించడానికి ప్రాతిపదికను మనం చర్చించినందున, అది ఆచరణలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. నిర్మాణం కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం (SI)ను ఈ క్రింది ప్రాతిపదికన ఎంచుకోవచ్చు:
1 ఫ్లాట్లు/అపార్ట్‌మెంట్లు - అంగీకరించబడిన విలువ ప్రాతిపదికన లేదా రీఇన్‌స్టేట్‌మెంట్ ప్రాతిపదికన లేదా నష్టపరిహారం ప్రాతిపదికన
2 భవనాలు/బంగళాలు - రీఇన్‍స్టేట్మెంట్ ప్రాతిపదికన లేదా నష్టపరిహారం ప్రాతిపదికన
పాతదానికి కొత్తది లేదా నష్టపరిహారం ప్రాతిపదికన వస్తువు కోసం SIను ఎంచుకోవచ్చు.
పెంచుకోవచ్చు, మీరు మీ ఇప్పటికే ఉన్న హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద మీ ఇంటి కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని పెంచుకోవాలి అని అనుకుంటే, మీరు చేయవలసిందల్లా ఎస్కలేషన్ క్లాజ్‍ను వినియోగించుకోవడం, దానితో 25% కంటే ఎక్కువగా ఉండని అదనపు ప్రీమియంతో, మీ కవరేజ్‍ను పెంచుకోవచ్చు. ఉదాహరణకు SI INR 10L మరియు మీరు 25% ఎస్కలేషన్ క్లాజ్ ఎంచుకుంటే. ప్రతిరోజూ గడిచే కొద్దీ SI పెరుగుతుంది మరియు పాలసీ యొక్క చివరి రోజున SI 12.5L అవుతుంది.
గమనిక: RIV మరియు నష్టపరిహారం ప్రాతిపదికన ఎంపిక చేయబడిన బిల్డింగ్ SI పై మాత్రమే ఎస్కలేషన్ క్లాజ్ అందుబాటులో ఉంటుంది.
మీకు విలువైనది మాకు కూడా విలువైనది. మీ ఆభరణాలు, అరుదైన వస్తువులు మరియు కళా ఖండాలను సురక్షితం చేయడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. ప్రభుత్వం ఆమోదించిన ఒక వాల్యూయర్ అందించిన మరియు మాచేత ఆమోదించబడిన వాల్యుయేషన్ రిపోర్ట్ ఆధారంగా కవరేజ్ ఉంటుంది.
దురదృష్టవశాత్తు, అరుదైన వస్తువులు మీ భవనంలో నిల్వ చేయబడి లేదా ఉంచబడి ఉన్నప్పుడు మాత్రమే అవి కవర్ చేయబడతాయి.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి