మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
Respect Senior Care Rider: 9152007550 (Missed call)
సేల్స్: 1800-209-0144
సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
యాక్సిడెంట్లు, దొంగతనం మరియు ప్రకృతి వైపరీత్యాలు వంటి ఆకస్మిక సంఘటనలు వలన కలిగే ఆర్ధిక నష్టాల నుండి మీకు రక్షణ కలిపించడానికి మీ ఇన్సూరర్ మరియు మీ మధ్య జరిగే ఒప్పందమే కారు ఇన్సూరెన్స్. కారు యజమానులు అందరూ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండే విధంగా భారతదేశ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మీ కారు వలన దురదృష్టవశాత్తు మీకు కాకుండా, వేరే ఇతరుల ఆస్తికి మరియు జీవితానికి జరిగిన నష్టాన్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఇన్సూరెన్స్ యొక్క మరొక సాధారణ రకం సమగ్ర కార్ ఇన్సూరెన్స్. సామాజిక అశాంతి, ప్రకృతి వైపరీత్యం వలన మీ కారుకి నష్టం కలిగినా లేదా కారు దొంగిలించబడినా, దాదాపుగా మీరు ఎదుర్కొనే అన్ని లయబిలిటీలను ఇది కవర్ చేస్తుంది.
కారు యజమానిగా, మీరు సరైన కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం ముఖ్యం. ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ కోసం శోధించేటప్పుడు, పాలసీ యొక్క స్వభావం మరియు నిబంధనలు మరియు షరతులను మీరు పూర్తిగా అర్థం చేసుకోవడం తప్పనిసరి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ స్వంత కార్ ఇన్సూరెన్స్ పొందడానికి బజాజ్ అలియంజ్ బృందం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది.
ఎటువంటి ఆందోళన లేకుండా, 'వేగంగా వెళ్ళాలి అనే మీ కోరిక'ను తీర్చుకోండి!
ఒక కోట్ పొందండిమీరు ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు, ప్రాసెస్‌ను నిరాటంకంగా నిమిషాల్లో పూర్తిచేయడానికి మీకు ఈ క్రింది డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలను అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి -
సున్నా తరుగుదల
బంపర్ నుండి బంపర్ కవర్ అని కూడా పిలువబడే, ఇది మీరు మీ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీకి జోడించగల ఒక యాడ్-ఆన్. జీరో డిప్రిషియేషన్ గురించి తెలుసుకునే ముందు, డిప్రిషియేషన్ గురించి తెలుసుకుందాం. మరింత చదవండి
బంపర్ నుండి బంపర్ కవర్ అని కూడా పిలువబడే, ఇది మీరు మీ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీకి జోడించగల ఒక యాడ్-ఆన్. జీరో డిప్రిషియేషన్ గురించి తెలుసుకునే ముందు, డిప్రిషియేషన్ గురించి తెలుసుకుందాం.
మీరు కొనుగోలు చేసే వరకు కార్లు చాలా విలువైనవి. మీరు కొనుగోలు చేసిన సమయం నుండి, మీ కారు విలువలో తరుగుదల మొదలవుతుంది, అంటే అది పాతది అవుతున్నంత కొద్దీ మార్కెట్లో దాని విలువ తగ్గుతుంది. కార్ మాత్రమే కాదు మీ కారు నడవడానికి ఉపయోగపడే విడి భాగాల విలువ కూడా తగ్గుతుంది. అందువల్ల ఇటీవల కొనుగోలు చేసిన వాటి కంటే మార్కెట్లోని పాత కార్లు తక్కువ ధరలు కలిగి ఉంటాయి.
జీరో డిప్రిషియేషన్ యాడ్-ఆన్‌తో, కార్ విలువకు సంబంధించిన తరుగుదలను మీరు నిరర్థకం చేస్తున్నారు. అంటే దీని అర్థం, సాంకేతికంగా మీ కార్ విలువ మార్కెట్లో తరిగిపోదు, ఎందుకంటే ఇన్సూరర్ మీ కార్ యొక్క డిప్రిషియేషన్ని పరిగణనలోకి తీసుకోరు.
కాబట్టి, మీరు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసినప్పుడు, మీ కారు మరియు దాని అన్ని విడి భాగాల కోసం పూర్తి విలువను అందుకుంటారు. బంపర్ నుండి బంపర్ కవర్ అత్యంత ఖరీదైన ప్రీమియం కలిగి ఉంటుంది మరియు ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు విలువ కలిగి ఉంటుంది. మీ కారును 5 సంవత్సరాల లోపు కొనుగోలు చేసినట్లయితే, ఈ యాడ్ ఆన్‌ను ఖచ్చితంగా తీసుకోవలసిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము.
ఫీచర్లు
ఇంజిన్ ప్రొటెక్టర్
కారులోని అత్యంత ముఖ్యమైన భాగాలలో ఇంజిన్ ఒకటి. దురదృష్టవశాత్తు సాధారణ కార్ ఇన్సూరెన్స్ పాలసీలలో, కార్ ఇంజిన్ దెబ్బతిన్నప్పుడు, దానికి అయ్యే ఖర్చు కవర్ చేయబడదు. అత్యంత ఖరీదైన వాటిలో ఒకటైన మరింత చదవండి
కారులోని అత్యంత ముఖ్యమైన భాగాలలో ఇంజిన్ ఒకటి. దురదృష్టవశాత్తు సాధారణ కార్ ఇన్సూరెన్స్ పాలసీలలో, కార్ ఇంజిన్ దెబ్బతిన్నప్పుడు, దానికి అయ్యే ఖర్చు కవర్ చేయబడదు. సర్వీసింగ్ చేయడానికి అత్యంత ఖరీదైన భాగాల్లో ఒకటి కావడం వలన, యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా ఏదైనా వైఫల్యం ఏర్పడినప్పుడు మీ కార్ ఇంజిన్ని రికవర్ చేయడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.
అందుకే, ఇంజిన్ ప్రొటెక్టర్ యాడ్ ఆన్ అనేది మీ ఇన్సూరెన్స్ పాలసీలో తప్పనిసరిగా ఉండవలసిన పరిష్కారం. నీరు చేరడం, ఆయిల్ లీక్ అవ్వడం, హైడ్రోస్టాటిక్ లాక్ ఇంకా ఇటువంటి మరిన్ని సమస్యల వలన ఏర్పడే ఖర్చులను ఇది కవర్ చేస్తుంది. ఇది మీ కారు ఇంజిన్ బాగు చేయించుకోవడం పై మీరు ఖర్చు చేసే మొత్తంలో 40% వరకు ఆదా చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.
ఫీచర్లు
24/7 స్పాట్ సహాయం
మీ కార్ ఇన్సూరెన్స్‌లో బాగా ఉపయోగపడే యాడ్ ఆన్స్‌లో ఒకటి అయిన దీనితో మీ కార్ ఎటువంటి సమస్యతో అయినా రోడ్డు పై నిలిచి పోయినప్పుడు మీకు సహాయపడుతుంది. మా బృందం కేవలం ఒక కాల్ లేదా క్లిక్ దూరంలో ఉంది లేదా మరింత చదవండి
మీ కార్ ఇన్సూరెన్స్‌లో బాగా ఉపయోగపడే యాడ్ ఆన్స్‌లో ఒకటి అయిన దీనితో మీ కార్ ఎటువంటి సమస్యతో అయినా రోడ్డు పై నిలిచి పోయినప్పుడు మీకు సహాయపడుతుంది. భారతదేశంలో మీ కారుతో మీరు ఏ ప్రదేశంలో నిలిచిపోయినా, ఆ సమస్యను ఎదుర్కోవడంలో మీకు సహాయపడటానికి మా బృందం కేవలం ఒక కాల్ లేదా క్లిక్ దూరంలో ఉంది లేదా ఆ సమస్యను ఎదుర్కోవడానికి మీకు సహాయపడుతుంది.
కాబట్టి, మీరు టైర్ మార్చవలసి ఉన్నా, ఒక నిపుణుడు మీ కార్ ఇంజిన్ని పరిశీలించవలసినా లేదా ఒక యాక్సిడెంట్‌ని సెటిల్ చేయడానికి మీకు సహకారం అవసరం అయినా, మీరు మమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు మరియు మేము అతి తక్కువ సమయంలో మిమ్మల్ని చేరుకుంటాము.
ఫీచర్లు
తాళం మరియు తాళం చెవి భర్తీ
ప్రపంచంలో ఎక్కువగా పోగొట్టుకునే వస్తువులలో కార్ తాళం చెవులు ఒకటి. రెస్టారెంట్లో మర్చిపోవడం దగ్గర నుండి ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోవడం వరకు, కార్ తాళం చెవులను చాలా అశ్రద్ధ చేస్తారు. దురదృష్టవశాత్తు, మరింత చదవండి
ప్రపంచంలో ఎక్కువగా పోగొట్టుకునే వస్తువులలో కార్ తాళం చెవులు ఒకటి. రెస్టారెంట్లో మర్చిపోవడం దగ్గర నుండి ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోవడం వరకు, కార్ తాళం చెవులను చాలా అశ్రద్ధ చేస్తారు. దురదృష్టవశాత్తు, మీ కార్ కోసం కొత్త తాళం చెవులు పొందడం ఖరీదైన వ్యవహారం, ఎందుకంటే ఇక్కడ కేవలం తాళం చెవులు కాకుండా పూర్తి లాకింగ్ సిస్టమ్‌ని కూడా మార్చవలసి ఉంటుంది.
మీరు తాళం చెవులను పోగొట్టుకున్నా లేదా ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినా, కొత్త తాళం చెవులను పొందడానికి అయ్యే ఖర్చును ఈ యాడ్ ఆన్ తగ్గిస్తుంది. మీ కార్ లాక్ మరియు తాళం చెవులను రీప్లేస్ చేయడానికి మరియు కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు బాధ్యతను మేము తీసుకుంటాము.
ఫీచర్లు
కన్జ్యూమబుల్ ఖర్చులు
మేము చెప్పినట్లుగా, ఒక కార్ కొనుగోలు చేయడం మరియు ఒక కార్‌ను మెయింటెయిన్ చేయడం అనేవి రెండు భిన్నమైన విషయాలు. మీ కారు మెయింటెయినెన్స్లో తరచుగా అనేక ఖర్చులు ఉంటాయి. స్పేర్ పార్ట్స్ సర్వీసింగ్ నుండి వాటిని భర్తీ చేయడం వరకు, మరింత చదవండి
మేము చెప్పినట్లుగా, ఒక కార్ కొనుగోలు చేయడం మరియు ఒక కార్‌ను మెయింటెయిన్ చేయడం అనేవి రెండు భిన్నమైన విషయాలు. మీ కారు మెయింటెయినెన్స్లో తరచుగా అనేక ఖర్చులు ఉంటాయి. స్పేర్ పార్ట్స్ సర్వీసింగ్ నుండి వాటిని భర్తీ చేయడం వరకు, మీ కారుకి సంబంధించి అనేక ఖర్చులు ఉంటాయి. ఎప్పటికప్పుడు లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు మార్చవలసిన పలు రకాల కార్ ఆయిల్స్ గురించి ఇంకా మేము చెప్పడం లేదు.
కన్జ్యూమబుల్ ఖర్చుల కవరేజ్‌తో, మీరు సర్వీసింగ్ సమయంలో లేదా యాక్సిడెంట్-అనంతరం మీ కారు కోసం కన్జ్యూమబుల్స్ వినియోగం పై అయ్యే ఖర్చుల బాధ్యతను మేము స్వీకరిస్తాము.
ఫీచర్లు
కన్స్యూమబుల్స్ ఖర్చులు కలిగి ఉన్న
పర్సనల్ బ్యాగేజ్
ఒక కార్ అనేది మీ వ్యక్తిగత మరియు ప్రైవేట్ బీరువా,బయట మీ పని పూర్తి అయ్యే వరకు మీ వస్తువులను దాని లోపల వదిలివేస్తారు. ల్యాప్‌టాప్‌లు మరియు ఖరీదైన గాడ్జెట్ల నుండి డబ్బు లేదా విలువైన వస్తువుల వరకు, మరింత చదవండి
పర్సనల్ బ్యాగేజ్
ఒక కార్ అనేది మీ వ్యక్తిగత మరియు ప్రైవేట్ బీరువా, బయట మీ పని పూర్తి అయ్యే వరకు మీ వస్తువులను దాని లోపల వదిలివేస్తారు. ల్యాప్‌టాప్‌లు మరియు ఖరీదైన గాడ్జెట్ల నుండి డబ్బు లేదా విలువైన వస్తువుల వరకు, మీ వస్తువులను మీ కారులో తరచూగా పెడుతుంటారు.
కానీ ఇందులో ప్రమాదం కూడా ఉంది, ఆ వస్తువులు చోరీ లేదా దోపిడీకి గురి అవచ్చు, ముఖ్యంగా మీ కారుని తక్కువ జనసాంద్రత ఉన్న ప్రదేశాలలో ఉంచినప్పుడు. అందుకే, మీ వ్యక్తిగత వస్తువులకు రక్షణ కలిపించడానికి మరియు ఒక వేళ అవి దెబ్బతిన్నా లేదా కారు నుండి దొంగిలించబడినా జరిగిన నష్టాన్ని పర్సనల్ బ్యాగేజ్ యాడ్ ఆన్ కవర్ చేస్తుంది.
ఫీచర్లు
రవాణా ప్రయోజనం
మరొక అత్యంత సౌకర్యవంతమైన యాడ్-ఆన్, ఇందులో ఒక యాక్సిడెంట్ తర్వాత మీరు మీ రోజువారీ జీవితంలో ఎదుర్కునే అవకాశంగల చిన్నవి, అయినప్పటికీ ముఖ్యమైనవి అయిన ఆందోళనల గురించి మేము జాగ్రత్త వహిస్తాము. మరింత చదవండి
మరొక అత్యంత సౌకర్యవంతమైన యాడ్-ఆన్, ఇందులో ఒక యాక్సిడెంట్ తర్వాత మీరు మీ రోజువారీ జీవితంలో ఎదుర్కునే అవకాశంగల చిన్నవి, అయినప్పటికీ ముఖ్యమైనవి అయిన ఆందోళనల గురించి మేము జాగ్రత్త వహిస్తాము.
మీ కార్ ఒక గ్యారేజీలో రిపెయిర్ చేయబడుతున్నప్పుడు మరియు మీ క్లెయిమ్‌ను మేము అంగీకరించిన తర్వాత, మీరు మీ రోజువారీ ప్రయాణం కోసం ఈ యాడ్ ఆన్ ద్వారా మా నుండి మీరు చెల్లింపును అందుకుంటారు. దీనితో, మీ కార్ సర్వీస్ చేయబడుతున్నప్పుడు రోజువారీ క్యాబ్ లేదా రవాణా ఛార్జీల కోసం మీరు అధికంగా డబ్బును ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు.
ఫీచర్లు
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
మీ గడువు ముగిసిన ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్‌ను సాధ్యమైనంత త్వరగా రెన్యూ చేసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా పేర్కొన్నట్లుగా, దీనికి ప్రధాన కారణం ఏమిటంటే చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా వాహనం నడపడం చట్టవిరుద్ధం మరియు దీనిని కలిగి ఉండడం వలన చట్టపరమైన సమస్యలను నివారించవచ్చు.
ఇది కాకుండా, మీరు మీ కార్ ఇన్సూరెన్స్‌ను వెంటనే రెన్యూ చేసుకోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి –
మీ నో క్లెయిమ్స్ బోనస్ పొందడానికి
మీరు మీ పాలసీని రెన్యూ చేయనప్పుడు, మీరు అర్హత కలిగిన మీ నో క్లెయిమ్స్ బోనస్‌ను కోల్పోతారు. మీకు మంచి డిస్కౌంట్లు మరియు ఇతర ప్రయోజనాలను చేకూర్చడానికి మీ బోనస్ సంవత్సరాల తరబడి జమ అవుతుంది. మీరు రెన్యూ చేసుకోకపోతే, అవి ల్యాప్స్ అయిపోతాయి.
ఆర్థిక భారం
ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే, దురదృష్టవశాత్తు మీ కారుకు యాక్సిడెంట్ జరిగినా లేదా దెబ్బతిన్నా, దాని పర్యవసానంగా ఏర్పడే ఆర్థిక భారాన్ని మీరే మోయవలసి ఉంటుంది. మీ కార్ రికవరీ కోసం మీరు మీ సేవింగ్స్ లేదా స్వంత డబ్బును చెల్లించవలసి ఉంటుంది. ఇటువంటి ఆర్థిక భారాన్ని నివారించడానికి, ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్‌ని రెన్యూ చేయవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది.
మీరు కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్లైన్లో సులభంగా రెన్యూ చేసుకోవచ్చు.
(18,050 సమీక్షలు & రేటింగ్‌ల ఆధారంగా)
శిబ ప్రసాద్ మొహంటీ
వాహనం మా జోనల్ మేనేజర్ సర్ ద్వారా ఉపయోగించబడింది. అతి తక్కువ కాలంలోనే వాహనాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా చేయడంలో మీరు ప్రారంభించిన సకాలంలో మరియు వేగవంతమైన చర్యను మేము ప్రశంసిస్తున్నాము. ఈ చర్యను అందరూ ప్రశంసించారు.
రాహుల్
“ఎంచుకోవడానికి ఎంపికల శ్రేణి.”
ఒక పర్ఫెక్షనిస్ట్ అయి ఉండటం వలన, నేను అన్నింటిలోనూ ఉత్తమమైనదాన్ని ఇష్టపడతాను. నేను నా కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎయిర్టైట్గా కూడా ఉండాలని కోరుకున్నాను. యాడ్-ఆన్లు మరియు సమగ్ర ప్లాన్లతో,...
మీరా
“OTS క్లెయిమ్‌లు ఒక వరం లాంటివి.”
ఒక ప్రమాదం జరిగినప్పుడు నేను మార్గమధ్యంలో ఉన్నాను. డబ్బు తక్కువగా ఉండటంతో, నా నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేయకుండా నా కారు సర్వీస్ చేయించుకోవడానికి నేను మార్గాల కోసం చూస్తున్నాను...
1988 నాటి మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనము ఒక ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి. యాక్సిడెంట్లు, దొంగతనం లేదా ఏదైనా ఇతర కారణాల వలన జరిగే నష్టాల నుండి ఒక ఇన్సూరెన్స్ పాలసీ మీకు కవరేజ్ అందిస్తుంది. అదనంగా, సహ-ప్రయాణీకులు మరియు ఇతర వాహనాలకు జరిగిన నష్టాలకు కూడా కార్ ఇన్సూరెన్స్ పరిహారం అందిస్తుంది.
కార్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు మొదటిసారి INR 2000/- జరిమానా మరియు/లేదా 3 నెలల వరకు జైలు శిక్ష విధింపు ఉంటుంది. నేరం మళ్ళీ చేసినప్పుడు INR 4000/- ఛార్జీలను మరియు/లేదా 3 నెలల వరకు కారాగారశిక్ష ఉంటుంది.
థర్డ్-పార్టీ మరియు సమగ్ర ఇన్సూరెన్స్ అనే రెండు రకాల కార్ ఇన్సూరెన్స్‌లలో, సమగ్ర ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ (శరీరం మరియు ఆస్తి)కి జరిగిన నష్టంతో పాటు మీకు, మీ ఆస్తికి జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది. దీనికి విరుద్ధంగా, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఇతర వ్యక్తి యొక్క శారీరక గాయం లేదా మరణం మరియు ఆస్తి నష్టాన్ని కవర్ చేస్తుంది.
మెరుగైన యాక్సెసిబిలిటీ కోసం, కస్టమర్లు ఆన్లైన్లో టూ-వీలర్, కార్ ఇన్సూరెన్స్ మరియు కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు. వివరాలను సమర్పించే సాధారణ ప్రక్రియ తర్వాత, కొనసాగడానికి ముందు మీరు తుది కోట్‌ను పొందవచ్చు. అయితే, అనేక అంశాల ఆధారంగా కోట్లు మారవచ్చు.
వారి క్లెయిమ్ సెటిల్మెంట్ సమయం మరియు నిష్పత్తిని అనుసరించి ఒక ప్రఖ్యాత ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి. గ్యారేజ్ నెట్వర్క్, క్యాష్‌లెస్ క్లెయిములు, యాక్సెసిబిలిటీ ప్రయోజనాలు (ఆన్లైన్ చెల్లింపులు మరియు క్లెయిములు) వంటి అదనపు ఫీచర్ల కోసం చెక్ చేయండి. మీకు అన్ని విధాలా తగిన ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకునే ముందు ఒక తులనాత్మక విశ్లేషణ చేయండి.
ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ పొందడానికి ఈ విధానాన్ని అనుసరించండి:
#1 For new car insurance click on “Get a Quote.”
#2 To renew the existing policy, click on Renew.
#3 Fill in the vehicle and your details.
#4 Select a quote.
#5 Pay the said amount, and the policy will be emailed in the pdf format.
ఆన్లైన్లో ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం అనేది ఏదైనా ఆన్లైన్ స్టోర్ నుండి షాపింగ్ చేయడం లాంటిదే. ప్రోడక్ట్ వ్యత్యాసాలు కాకుండా; మొత్తం ప్రక్రియ మీరు ఏదైనా ఇతర డొమైన్‌తో అలవాటుపడిన దానిని పోలి ఉంటుంది. అత్యుత్తమ SSL సెక్యూరిటీ సర్టిఫికేషన్లతో, డేటా గోప్యత మరియు భద్రత నిర్ధారించబడి ఉంటుంది.
ఆన్లైన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు ప్రక్రియ చాలా వేగంగా పూర్తి అవుతుంది. అయితే, మీరు డాక్యుమెంటేషన్ మరియు సమాచారం అంతా సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ సందర్భంలో, ప్రక్రియ పూర్తి చేయడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. *
ఇన్స్పెక్షన్ అభ్యర్థన సమర్పించిన సమయం నుండి, కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి 24 గంటల సమయం పడుతుంది. సర్వేయర్ సిఫార్సు తర్వాత, వెబ్‌సైట్‌ను సందర్శించి ఇన్సూరెన్స్ పాలసీని మార్చడానికి మీకు 48 గంటల సమయం ఇవ్వబడుతుంది. అనుసరించడంలో విఫలం అయితే, ప్రక్రియను మళ్ళీ మొదటి నుండి ప్రారంభించవలసి ఉంటుంది.
మీ ఇన్సూరెన్స్ పాలసీ బజాజ్ అలియంజ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది, మరియు దీనిని మీ అకౌంట్ వివరాలతో యాక్సెస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాలసీ యొక్క కలర్డ్ లేదా మోనోక్రోమ్ ప్రింట్ అవుట్ స్పష్టంగా ఉంటుంది మరియు అసలు కాపీగా అంగీకరించబడుతుంది.
ఈ ప్రశ్నకు సమాధానం మీ పాలసీ డాక్యుమెంట్లలో ఉంటుంది. ఇది మీ కార్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ఒక ప్రత్యేకమైన 8-10 అంకెల సంఖ్య. సాధారణంగా, ఇది ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లలో లేదా కంపెనీ జారీ చేసిన స్టేట్మెంట్లలో ఉంటుంది.
మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క పేపర్‌వర్క్ పాలసీ ప్రారంభం మరియు గడువు ముగింపునకు సంబంధించిన సమాచారం కలిగి ఉంటుంది. దాని స్థితి గురించి తెలుసుకోవడానికి, మీరు ఎప్పటికప్పుడు అది సృష్టించబడిన తేదీని చెక్ చేస్తూ ఉండాలి. గడువు ముగియడానికి ముందు దానిని రెన్యూ చేయడం కూడా ముఖ్యం.
మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్‌ను మీరు పోగొట్టుకున్నట్లయితే, కస్టమర్ సర్వీస్ ప్రతినిధిని 1800-209-0144 వద్ద సంప్రదించడం ద్వారా లేదా బజాజ్ అలియంజ్ వెబ్సైట్లో లైవ్ చాట్ పోర్టల్ ద్వారా మెసేజ్ పంపడం ద్వారా వెంటనే మాకు తెలియజేయండి.
ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, మీకు ఇటువంటి వివిధ చెల్లింపు పద్ధతులు అందించబడతాయి:
● ఇంటర్నెట్ బ్యాంకింగ్
● క్రెడిట్ కార్డ్ చెల్లింపు
● డెబిట్ కార్డ్ చెల్లింపు
● UPI చెల్లింపులతో ఆన్లైన్ వాలెట్లు
మీరు వేరొక ప్లాన్‌కు మారవచ్చు కానీ మీ ఇన్సూరెన్స్ పాలసీని అవధి మధ్యలో మార్చడం సిఫార్సు చేయబడదు. అయితే, 2 నుండి 3 సంవత్సరాల తర్వాత మారడం ప్రయోజనకరం, ఇది ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను బట్టి 5 నుండి 15% వరకు ఖర్చు పొదుపు చేయడానికి సహాయపడగలదు.
సాధారణ అభిప్రాయానికి విరుద్ధంగా, బిజినెస్ ప్రయోజనాలతో సహా గృహసంబంధిత, నివాస మరియు సామాజిక కారణాల కోసం ఉపయోగించబడే ఏ కారు అయినా ప్రైవేట్ కారుగా పరిగణించబడుతుంది. అయితే, ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి లేదా ప్రయాణీకుల కోసం వస్తువులను లోడ్ చేయడానికి వాహనాలకు క్యారేజ్ ఫిట్ చేయబడిన వాహనం ప్రైవేట్ కారు కాదు.
డిస్కౌంట్లు మరియు క్లెయిమ్స్ ఫ్రీ అనుభవం, వాలంటరీ యాక్సెస్ ఎంచుకోవడం, ఆమోదించబడిన ఆటోమొబైల్ అసోసియేషన్లలో సభ్యత్వం మరియు ఆమోదించబడిన యాంటీ-థెఫ్ట్ పరికరాలను ఇన్స్టాల్ చేయడంతో సహా ఆఫర్లు ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద వర్తిస్తాయి.
మార్గమధ్యంలో ఒక వేళ మీ కార్ పాడైపోయినా లేదా యాక్సిడెంట్‌కి గురి అయినా మరియు సమీపంలో మెకానికల్ సహాయం అందుబాటులో లేకపోతే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ సేవలు అనేవి బజాజ్ అలియంజ్ వద్ద ఇన్సూరెన్స్ పొందిన వారికి అందుబాటులో ఉంటాయి.
మెకానికల్ బ్రేక్‌డౌన్ లేదా యాక్సిడెంట్ వంటి సందర్భంలో తగినంత సహాయం లేదా మద్దతు లేకుండా మీరు చిక్కుకుపోయే ఏదైనా సంఘటన.
కాలక్రమేణా, ఏదైనా వస్తువు పాతది అవడం, డామేజీలు, అరుగుదల మరియు తరుగుదల వంటి కారణాల వలన దాని విలువను కోల్పోతుంది. అదేవిధంగా, అటువంటి కారణాల వలన కార్ విలువలో తగ్గుదలని డిప్రిషియేషన్.
క్లెయిమ్ ప్రాసెస్ అమలు చేస్తున్నప్పుడు, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ తుది క్లెయిమ్ విలువ నుండి కొంత మొత్తాన్ని మినహాయిస్తుంది. ఆ తొలగించదగిన మొత్తం సదరు వాహనం రకం ప్రకారం మారుతుంది. ఆ తొలగించదగిన మొత్తం తప్పనిసరి మినహాయింపుగా పేర్కొనబడుతుంది.
పాలసీహోల్డర్ చేసిన క్లెయిమ్‌కి సంబంధించి మీరు చెల్లించడానికి అంగీకరిస్తున్న ఈ మొత్తం. అయితే, ఈ మొత్తం తప్పనిసరి మినహాయింపునకు అదనంగా ఉంటుంది. అధిక స్వచ్ఛంద మినహాయింపు అంటే తక్కువ ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది మరియు తక్కువ స్వచ్ఛంద మినహాయింపు అంటే అధిక ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.
ఒకవేళ మీ కారును నడిపేటప్పుడు మీ డ్రైవర్‌కు గాయం అయినా లేదా అతని ప్రాణం పోయినా, అతనికి లేదా అతని కుటుంబానికి నష్టాల కోసం చెల్లించవలసిన బాధ్యత మీకు ఉంటుంది. బజాజ్ అలియంజ్ వద్ద, ఒక అదనపు ప్రీమియం పై మీ కోసం ఆ ఖర్చును మేము కవర్ చేస్తాము.
ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో మీరు మీ సభ్యత్వ స్థితిని పేర్కొని ఉంటే, మీరు ఒక డిస్కౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు.
ఒక కొత్త కారు కోసం, 1 సంవత్సరం లేదా 3 సంవత్సరాల ఓన్ డ్యామేజ్ కవర్‌తో పాటు కనీసం 3 సంవత్సరాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. పాత కార్ల కోసం, అయితే, 1-సంవత్సరం పాలసీ కవర్ తప్పనిసరి చేయబడింది.
గడువు ముగిసిన తర్వాత, మీరు కార్ యొక్క స్వీయ-ఇన్స్పెక్షన్ చేయవచ్చు, సర్వేయర్ రివ్యూ చేయడం కోసం చిత్రాలను అప్లోడ్ చేసి విజయవంతమైన ఆన్లైన్ చెల్లింపు తర్వాత ఇన్స్టంట్ ఆన్లైన్ 4 వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చు. అయితే, ఈ ఏర్పాటు ప్రైవేట్ ఇన్సూరెన్స్‌కు సాధ్యమవుతుంది మరియు TP కవర్‌కు వర్తించదు.
లర్నర్స్ లైసెన్స్ కలిగి ఉన్నవారి కోసం కార్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది; ఒక అనుభవంలేని డ్రైవర్ దురదృష్టకరమైన సంఘటనలను ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. లర్నర్స్ లైసెన్స్ కలిగి ఉన్నవారి కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది, కానీ ప్రీమియం సగటు కంటే ఎక్కువగా ఉంటుంది.
కార్ ఇన్సూరెన్స్ పాలసీ దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. ఒక వేళ చిరునామా మారితే, క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసే సమయంలో ఇబ్బందులను తగ్గించడానికి ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం ఉత్తమం.
ఎండార్స్మెంట్ అనేది ఇన్సూరెన్స్ కవర్‌కు ముందుగా అంగీకరించిన సవరణలు లేదా మార్పులకు సాక్ష్యంగా పనిచేస్తుంది. రెండు రకాల ఎండార్స్మెంట్లలో, కవర్లో మార్పుల కోసం ప్రీమియం-బేరింగ్ అదనపు ఫీజులను ఆహ్వానిస్తుంది. దీనికి విరుద్ధంగా, నాన్-ప్రీమియం బేరింగ్ ఎండార్స్మెంట్లకు అందుకోసం ఎటువంటి ఛార్జీలు ఉండవు.
పరిమిత మార్పుల కోసం మీరు ఎండార్స్మెంట్ అభ్యర్థనను ఆన్లైన్లో సమర్పించవచ్చు. వీటిలో ఇవి ఉంటాయి; చిరునామా, RTO, LPG లేదా CNG కిట్ జోడింపు, యాంటీ-థెఫ్ట్ పరికరాలు, పాలసీహోల్డర్ పేరు, కార్ ఇంజిన్ నంబర్ లేదా ఛాసిస్ నంబర్ కూడా.
లోడింగ్ అనేది కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసే సందర్భంలో ప్రీమియం మొత్తానికి జోడించబడే ఒక రకం ఖర్చు. అయితే, ఈ అదనపు మొత్తం యొక్క వర్తింపు పాలసీహోల్డర్ యొక్క రిస్క్ కొనసాగింపు అంచనాకు లోబడి ఉంటుంది. ఒకవేళ, రిస్క్ సాధారణం కంటే ఎక్కువగా ఉంటే, లోడింగ్ జోడించబడుతుంది.
ఇది నో క్లెయిమ్ బోనస్‌కి సంక్షిప్త పదం, పాలసీ యజమానులు పాలసీపై ఎన్నడూ క్లెయిమ్ చేసి ఉండకపోతే వారికి ఈ రకం ఏర్పాటు అందించబడుతుంది. వరుసగా ఉండే NCBల వలన ప్రీమియం మొత్తం 50% వరకు డిస్కౌంట్ లభించవచ్చు.
మీ కార్ పై ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ ట్రాన్స్ఫర్ అనేది ఒక ఎండార్స్మెంట్ ద్వారా సాధ్యమవుతుంది. ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి, మీరు RC (పాత) యొక్క కాపీ మరియు కొన్ని ఇతర అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించవలసి ఉంటుంది.
కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా కొత్త కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి నో క్లెయిమ్ బోనస్‌ను మీరు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. దీనికి అదనంగా, కొందరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు NCBని వేరొక ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అనుమతిస్తారు.
అవును. కార్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిగి ఉన్న సంబంధాల, మరియు మీ ఇన్సూరర్ ద్వారా సంపాదించబడిన NCB ప్రకారం మేము మీకు కొత్త మరియు మెరుగైన NCB ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందిస్తాము. మా కస్టమర్లకు ఉత్తమ సేవను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.
కొన్ని సరళమైన దశలు మరియు సులభమైన ప్రక్రియలతో, మీ కార్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ పాలసీ డాక్యుమెంటేషన్ పూర్తవుతుంది. మాకు ఎటువంటి పేపర్‌వర్క్ అవసరం లేదు కానీ, VIR అవసరమైన కొన్ని సందర్భాల్లో, అడిగిన వెంటనే సరైన డాక్యుమెంట్లు పరిశీలించబడాలి మరియు సమర్పించబడాలి.
కస్టమర్ ఒక రద్దు అభ్యర్థనను సమర్పించిన తర్వాత ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని రద్దు చేయవచ్చు. అయితే, రద్దు ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ముందు మీ వాహనాన్ని మరొక ప్రొవైడర్ వద్ద ఇన్సూర్ చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఏడు రోజుల సమయం పడుతుంది, మరియు ఇన్సూరర్ వైపు నుండి ప్రీమియం బాకీ ఉన్నట్లయితే, అది తిరిగి చెల్లించబడుతుంది.
దామాషా ప్రాతిపదికన కొన్ని షరతులు మరియు లెక్కింపుల ప్రకారం ప్రీమియంలు రిఫండ్ చేయబడతాయి. కార్ ఇన్సూరెన్స్ పాలసీని రద్దు చేసే ముందు అన్ని షార్ట్ రేట్లను లెక్కించవలసిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము ఎందుకంటే, ఒక సారి కార్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీని రద్దు చేసిన తరువాత మాత్రమే రిఫండ్ సాధ్యమవుతుంది.
మోటార్ వాహనాల చట్టం, 1988 ప్రకారం, ఇన్సూరెన్స్ చేయబడని వాహనాల యజమానులకు కారాగార శిక్ష మరియు/లేదా జరిమానాలు విధించబడవచ్చు. కార్ ఇన్సూరెన్స్ పాలసీ ల్యాప్స్ అయితే, లభించిన అన్ని ప్రయోజనాలు కూడా తొలగించబడతాయి.
మీ కార్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ పాలసీని రెన్యూ చేసుకునే ప్రక్రియ చాలా సులభం. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి, రెన్యూ పై క్లిక్ చేయండి మరియు మీ పాలసీని రెన్యూ చేసుకోవడానికి అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి. అవసరమైన వివరాలలో కొన్ని ఇలా ఉన్నాయి వాహన మోడల్, వేరియంట్, RTO, నో క్లెయిమ్ బోనస్, ప్లాన్ రకం మొదలైనవి.
కార్ ఇన్సూరెన్స్ మోటార్ వాహనాల చట్టం, 1988 ద్వారా నియంత్రించబడుతుంది, ఇది ఒక దేశవ్యాప్త శాసనము. దీని ప్రకారం, మీరు కొనుగోలు చేసే ఏదైనా కార్ ఇన్సూరెన్స్ పాలసీ భారతదేశం అంతటా వర్తిస్తుంది, అయితే మీరు ల్యాప్స్ తేదీకి ముందు దానిని రెన్యూ చేసుకుని ఉండాలి.
ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేక రకాల ప్రమాదాల కారణంగా జరిగే నష్టాలను కవర్ చేస్తుంది. దీనిలో ఢీకొనడాలు, దొంగతనం, అగ్నిప్రమాదం, పర్సనల్ యాక్సిడెంట్లు, భూకంపాలు మరియు కొండచరియలు విరిగి పడడం, ముంపు మరియు థర్డ్-పార్టీ బాధ్యతల పై కూడా కవరేజ్ ఉంటుంది.
ఒక థర్డ్ పార్టీ ఓన్లీ కవర్ అనేది మీకు కనీస స్థాయి ఇన్సూరెన్స్ కవర్ అందించే ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీ. TPO పొందడానికి, మీరు మా ఏజెంట్లలో ఒకరిని సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్లో మళ్ళీ అదే ప్రాసెస్‌ను అనుసరించవచ్చు.
సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్‌కు సంబంధించిన అన్ని వివరాలను బజాజ్ అలియంజ్ వెబ్సైట్ యొక్క పాలసీ పేజీలో కనుగొనవచ్చు. నిబంధనలు మరియు షరతుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి, వెబ్సైట్ నుండి పాలసీ నిర్దిష్ట పరిభాష లేదా పదాలను డౌన్లోడ్ చేసుకోండి.
అవును, మీ వాహనానికి రక్షణ కలిపించడానికి మీరు ఒక స్టాండ్అలోన్ ఓన్-డ్యామేజ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు. అయితే, మీకు బజాజ్ లేదా మరొక ఇన్సూరర్ వద్ద దీర్ఘకాలిక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం తప్పనిసరి.
వాహనం యొక్క రిపెయిర్ డామేజి మీ ఇన్సూరెన్స్ కవర్ కంటే ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలియజేయబడింది కాబట్టి, మీ కార్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ పాలసీ షరతుల ప్రకారం మీ దెబ్బతిన్న వాహనాన్ని రిపెయిర్ చేయడానికి అవసరమైన అదనపు మొత్తాన్ని మీరు చెల్లించవలసి ఉంటుంది.
వాహన ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని షరతులు ఉన్నాయి, వాటి ప్రకారం ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఎటువంటి క్లెయిమ్ పొందలేరు. ఆ షరతులను చేర్పులు అని పేర్కొంటారు. మీ క్లెయిమ్ యొక్క కారణం మినహాయింపుల విభాగంలో ఉంటే, మీకు ఎటువంటి పరిహారం అందదు.
కొన్ని అదనపు ప్రయోజనాలు మరియు రక్షణ కోసం మీరు మీ వాహన ఇన్సూరెన్స్ పాలసీని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే, యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోండి. బజాజ్ అలియంజ్ అందించే యాడ్-ఆన్ కవర్లలో 24*7 స్పాట్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్టర్, మరియు లాక్ మరియు కీ రీప్లేస్మెంట్ కవర్ ఉంటాయి.
ఒక డ్రైవర్ ఎదుర్కొనే అన్ని ప్రధాన సంఘటనలను మా పాలసీ కవర్ చేసినప్పటికీ, నిర్దిష్ట ప్రదేశం లేదా ప్రాంతం, కార్ రకం మరియు ఇటువంటి కొన్ని వాటికి సంబంధించి కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి.
యాడ్-ఆన్ కవర్లు ఎల్లప్పుడూ మీ కార్ పై ముందు నుంచే-ఉన్న ఇన్సూరెన్స్‌కు అటాచ్ చేయబడతాయి. అందువల్ల, మీరు బజాజ్ అలియంజ్ నుండి పాలసీ కవర్ కొనుగోలు చేయకుండా యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయలేరు.
యాడ్-ఆన్ కవర్లు ఒక అదనపు భద్రతా పొరను అందిస్తాయి మరియు అసాధారణమైన పరిస్థితుల కారణంగా అయ్యే అదనపు ఖర్చుల నుండి మీకు రక్షణను అందిస్తుంది. వాటి ప్రాముఖ్యత వలన, మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ పై యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయడానికి ఎటువంటి పరిమితులు లేవు.
కార్ డ్రైవ్ చేసే వ్యక్తిని ఇన్సూర్ చేయడానికి, మీరు మీ కార్ కోసం సమగ్ర పాలసీకి అదనంగా ప్రీమియం పర్సనల్ గార్డ్ పాలసీతో కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి. ఇది కారు మరియు డ్రైవర్‌కు జరిగిన నష్టాల వలన అయ్యే ఖర్చు పై 360° కవరేజ్ అందిస్తుంది.
పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ లేదా ప్రీమియం పర్సనల్ గార్డ్ అనేది ప్రయాణీకుల కోసం పాలసీ కవరేజ్‌ను విస్తరించడానికి మీకు ఒక ఎంపికను అందిస్తుంది. డ్రైవర్‌కు అదనంగా, ఈ పాలసీ 1 నుండి 3 ప్రయాణీకులను ఇన్సూర్ చేయగలదు.
ఇంజిన్ ప్రొటెక్టర్ యాడ్-ఆన్ ఇంజిన్‌కు జరిగిన నష్టాల పై మీకు పాలసీ కవరేజ్‌ను అందిస్తుంది. కార్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ ప్రీమియంకు చిన్న జోడింపుతో, మీరు ఇంజిన్ రిపెయిర్ ఖర్చు నుండి సురక్షితం చేసే అదనపు కవరేజ్‌ను పొందవచ్చు.
ఒకవేళ, ఒక యాక్సిడెంట్ వలన ఎలెక్ట్రికల్ ఫైర్ ఏర్పడితే, అది సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడుతుంది.
బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ పాలసీ కార్ యొక్క డిప్రిషియేషన్‌ను పరిగణనలోకి తీసుకోదు మరియు ఒక వేళ కార్ దెబ్బతిన్నా లేదా పూర్తిగా నష్టపోయినా దానికి మార్కెట్ విలువ దగ్గర పరిహారం అందించబడుతుంది. అయితే, ఈ పాలసీ కవరేజ్ అధిక ప్రీమియంను కలిగి ఉంటుంది.
కారులో విద్యుత్‌తో నడిచే అన్ని ఉపకరణాలు ఎలక్ట్రానిక్ యాక్సెసరీలుగా పరిగణించబడతాయి. కార్ సీట్ కవర్లు, వీల్ కవర్లు, మ్యాట్లు మరియు ఇటువంటివి నాన్ ఎలక్ట్రికల్ యాక్సెసరీలుగా పరిగణించబడతాయి. ప్రాథమిక ప్రీమియం పై అదనంగా మరికొంత ప్రీమియం చెల్లించిన మీదట రెండు రకాల యాక్సెసరీలకు రక్షణ లభిస్తుంది.
కంపెనీ లేదా తయారీదారు-ఫిట్ చేసిన LPG లేదా CNG కిట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో చేర్చబడతాయి. RCలో పేర్కొనబడని లేదా సూచించబడని కిట్ కోసం బజాజ్ అలియంజ్ ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను అందించలేదు.
ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు ఉద్దేశించిన ఒక అధికారిక అభ్యర్థనకు లోబడి ఏదైనా అదనపు యాక్సెసరీ కోసం ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్‌ను పొందవచ్చు. అయితే, అదనపు కవరేజ్ వలన ప్రీమియం అధికంగా ఉంటుంది.
అవును, ఒకే కారు కోసం రెండు ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉండటం సాధ్యమవుతుంది మరియు అది చట్టప్రకారం చెల్లుతుంది. అయితే, ఒక కార్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ ప్రొవైడర్ ఒక వాహనాన్ని రెండుసార్లు ఇన్సూర్ చేయరు, కాబట్టి, మీరు ఆ తరువాతి పాలసీని వేరొక ప్రొవైడర్ నుండి కొనుగోలు చేయాలి. రెండు ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉండటం సిఫార్సు చేయబడదు.
థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఇతర ప్రభావిత పార్టీకి ప్రయోజనాలు కల్పిస్తుంది, కానీ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఒక సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ ప్రాథమిక పాలసీ హోల్డర్ అయిన మీకు నష్టాలను రికవర్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అగ్నిప్రమాదం, దొంగతనం, ప్రమాదాలు, భూకంపం మొదలైనటువంటివి సంభవించినప్పుడు ఆర్థిక రక్షణను అందిస్తుంది.
లేదు, వాయిదాలలో ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించడం సాధ్యం కాదు. మీరు ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తున్నట్లయితే, ఒకేసారి పూర్తి ప్రీమియం మొత్తాన్ని డిపాజిట్ చేయడం తప్పనిసరి. ఏ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కూడా వాయిదాలలో ప్రీమియం చెల్లింపును అంగీకరించరు.
అవును, మీ కార్ యొక్క మోడల్ మీ కార్ ఇన్సూరెన్స్ యొక్క ఆమోదయోగ్యమైన తుది విలువను ప్రభావితం చేస్తుంది. దీనికి కారణం, మీ కారు యొక్క బ్రాండ్ మరియు మోడల్ దాని ధరను నిర్ణయిస్తుంది మరియు మీ పాలసీలో ఇన్సూర్ చేయబడిన మొత్తం కారు ధరపై ఆధారపడి ఉంటుంది.
అవును, భౌగోళిక ప్రదేశం అనేది ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై ప్రభావం కలిగి ఉంటుంది. దేశంలోని అధిక జనసాంద్రత కలిగిన ప్రదేశంలో మీరు నివసిస్తుంటే, యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, మీ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం అటువంటి ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది.
మీరు కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు, వివిధ కారణాల వలన తుది కోట్ మారవచ్చు. వాటిలో కొన్ని ప్రధానమైనవి ఇవి:
● కార్ మోడల్ మరియు మేక్
● కార్ వయస్సు
● IDV (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ)
● యాడ్-ఆన్ కవర్లు
● ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ కవర్ రకం
● నో-క్లెయిమ్ బోనస్
● భౌగోళిక లొకేషన్
● క్యూబిక్ సామర్థ్యం
కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించే విధానం చాలా సులభం. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు ఇతర వివరాలతో పాటు కార్ తయారీదారు, మోడల్, కార్ వయస్సు, లొకేషన్, ఇన్సూరెన్స్ రకం వంటి కొన్ని వివరాలను సమర్పించండి. వెబ్సైట్ మీ కోసం ప్రీమియం మొత్తాన్ని లెక్కిస్తుంది.
అవును, మీరు తక్కువ IDVని ఎంచుకుంటే మీ కార్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం తక్కువగా ఉంటుంది. అయితే, ఇది సిఫార్సు చేయబడదు. తక్కువ IDV వలన మీ కార్ కోసం చెల్లించే ప్రీమియం మొత్తం తగ్గుతుంది, కానీ దొంగతనం జరిగినప్పుడు లేదా కారుని పూర్తిగా నష్టపోయినప్పుడు మీకు కార్ యొక్క సరైన మార్కెట్ విలువ లభించదు.
ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం యొక్క ఆన్లైన్ చెల్లింపు అనేది అత్యంత సౌకర్యవంతమైన మార్గం. దీనికి అదనంగా, మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఆన్లైన్లో చెల్లించగల ఇటువంటి వివిధ విధానాలు ఉన్నాయి, అవి:
● ఇంటర్నెట్ బ్యాంకింగ్
● డెబిట్ కార్డ్
● క్రెడిట్ కార్డ్
● UPI
NCB ఫీచర్‌తో, ఒక వేళ ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే, కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రతి ఏటా ఒక నిర్దిష్ట శాతం వరకు తగ్గవచ్చు. ఒకే కంపెనీ వద్ద దీర్ఘ కాలిక ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అని నిరూపించబడింది.
ప్రీమియం పెరుగుదల అవసరాలకు లోబడి ఉంటుంది, మరియు ఇది అందుబాటు ధర శ్రేణిలోనే ఉంటుంది. మీ వాహన రకం, మోడల్, వయస్సు మొదలైన వాటికి ప్రత్యేకంగా సరిపోయే అన్ని యాడ్ ఆన్ ప్రయోజనాలు మరియు అంశాలను పేర్కొంటూ మేము ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ సర్వీసులను అందిస్తాము. తదనుగుణంగా మీరు ఎంచుకోవచ్చు మరియు అప్లై చేయవచ్చు.
అనేక సంవత్సరాలపాటు ఒకే ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద పాలసీ కొనుగోలు చేయడం వలన కార్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రీమియం పై మీకు ఎటువంటి రాయితీ లభించదు. ఇది సంస్థ యొక్క పాలసీలో చేర్చబడి ఉండదు, కానీ ఆ అభిమానానికి ప్రతిగా మేము మీకు ఇతర ప్రయోజనాలను అందిస్తాము.
మీరు స్వంతంగా ఇన్స్టాల్ చేసుకున్న యాంటి థెఫ్ట్ పరికరంతో, మీ వాహనానికి అదనపు రక్షణను అందిస్తున్నారు. ఒక వేళ దానిని ARAI ఆమోదిస్తే, మీ పాలసీ యొక్క విలువ పెరుగుతుంది మరియు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గడంతో పాటు మీరు అదనపు ఆఫర్లు మరియు డిస్కౌంట్లు పొందుతారు.
ARAI ఆమోదించబడిన యాంటీ-థెఫ్ట్ అలారం మరియు లాకింగ్ సిస్టమ్స్ కోసం ప్రత్యేక డిస్కౌంట్లు పేర్కొనబడ్డాయి. సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌తో, ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క మార్గదర్శకాల ఆధారంగా కార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం పై మరింత రాయితీ అందించబడుతుంది. కాబట్టి అవును మీరు డిస్కౌంట్ కోసం అర్హత కలిగి ఉంటారు.
సాధారణ ప్రైవేట్ కార్లతో పోలిస్తే మీరు ఎలక్ట్రిక్ కార్ల కోసం కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లయితే భారతదేశ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ మరియు డెవలప్మెంట్ అథారిటీ 15% డిస్కౌంటెడ్ ప్రీమియం రేట్లను మంజూరు చేసింది. ఇది కొత్త థర్డ్ పార్టీ కవర్ ప్రీమియం రేట్ల క్రింద ఉంది.
అతి తక్కువ 4 వీలర్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు ఇన్సూర్ చేయబడిన దివ్యాంగులకు క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తారు. ప్రభుత్వం ద్వారా వివిధ స్కీంలు ప్రవేశ పెట్టబడ్డాయి, ఇవి ప్రాథమిక వైద్య చికిత్సలను కవర్ చేస్తాయి.
మీరు 4 వీలర్ ఇన్సూరెన్స్ పై క్లెయిమ్ ఎప్పుడు చేయాలి అనుకుంటున్నారో మాకు తెలియజేయండి, మేము ప్రతి దశలోనూ మిమ్మల్ని గైడ్ చేస్తాము. టోల్-ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్ పై, లేదా మీకు అందుబాటులో ఉన్న నంబర్ పై మీ ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను నేరుగా సంప్రదించండి. అవసరమైన అన్ని దశలు వివరించబడతాయి మరియు తగిన మార్గనిర్దేశం చేయబడుతుంది.
ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రారంభించడానికి దశలు:
1 మీ ప్రస్తుత పరిస్థితి గురించి మాకు తెలియజేయవలసిందిగా మీ కార్ ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ఏజెంట్‌కు తెలియజేయండి.
2 సమాచారం యొక్క మూలం ఈమెయిల్, కాల్, టెక్స్ట్ లేదా ఆన్లైన్ అప్లికేషన్ అయి ఉండవచ్చు.
3 ఒక అప్లికేషన్ ఫైల్ చేసి అవసరమైన మొత్తం సమాచారాన్ని మాకు అందించడం.
ఇన్సూర్ చేయబడిన వాహనానికి నష్టం జరిగిన రోజునే క్లెయిములు రిజిస్టర్ చేయబడాలి. 4 వీలర్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే సమాచారం అందించడం ఉత్తమం. ఒక ఆన్లైన్ ప్రక్రియ ద్వారా క్లెయిమ్ అప్లికేషన్‌ను పూర్తి చేయండి మరియు ఆ పైన మేము మీకు సహకరిస్తాము.
కార్ ఇన్సూరెన్స్‌ను మీరు క్లెయిమ్ చేయాలని అనుకుంటే, ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించే వరకు ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి మీరు వాహనాన్ని తరలించకండి. క్లెయిమ్ కోసం చెల్లుబాటు అయ్యే రుజువుగా చిత్రాలను తీసుకోండి. మీరు వాహనాన్ని తరలించినట్లయితే, అది విధానాన్ని సంక్లిష్టం చేయగలదు.
మీ వాహనాన్ని మరొకరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా పాలసీ యొక్క సాధారణ నియమాలు వర్తిస్తాయి. వేగంగా స్పందించండి మరియు ప్రమాదం గురించి పోలీసులకి తెలియజేసిన తరువాత మీ ఏజెంట్‌కి సమాచారం అందించండి, దీని తరువాత కార్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ క్లెయిమ్ ప్రాసెస్ చేయబడుతుంది. యాక్సిడెంట్‌ను డాక్యుమెంట్ చేయడం వలన తదుపరి అనుసరించే విధానంలో అది సహాయపడుతుంది.
1 దొంగతనం జరిగిన ప్రదేశానికి సమీపంలోని పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద FIR ఫైల్ చేయడం.
2 ఆన్లైన్ 4 వీలర్ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం మరియు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారం సమర్పించడం.
3 మీ కోసం కేటాయించబడిన ఏజెంట్లు ప్రక్రియను కొనసాగిస్తారు మరియు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయడానికి సహాయపడతారు.
క్లెయిమ్ ఫారం, పాలసీ నంబర్, 4 వీలర్ ఇన్సూరెన్స్ యొక్క వివరాలు, పాలసీ కవర్/ ఇన్సూరెన్స్ నోట్ కాపీ, ఆ సమయంలో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి యొక్క అసలు డ్రైవింగ్ లైసెన్స్, యాక్సిడెంట్ అయినట్లయితే FIR, RTO ఇంటిమేషన్ థెఫ్ట్ అప్లికేషన్, రిపెయిర్ల కోసం అయిన బిల్లులు మరియు చెల్లింపు రసీదులు మరియు ప్రాసెస్ కోసం అవసరమైన ఏవైనా ఇతర డాక్యుమెంట్లు.
ప్రమాదం జరిగిన వెంటనే. పోలీసుల వద్ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేయడం అనేది ప్రక్రియలో మొదటి దశ. వాహనం ప్రమాదానికి గురి అయినప్పుడు లేదా అది దొంగిలించబడినప్పుడు ఇది తప్పనిసరి. ఏ పరిస్థితిలోనైనా, మీ కార్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ పాలసీని మీతో లేదా మీ వాహనంలో ఉంచండి మరియు మీ ఆన్లైన్ ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయండి.
కనీస నష్టాన్ని క్లెయిమ్ చేయనందుకు, తదుపరి సంవత్సరంలో NCB తో అదనపు బోనస్ లేదా డిస్కౌంట్ జమ చేయబడుతుంది. ఇది మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ పై ప్రీమియం యొక్క ఖర్చును తగ్గిస్తుంది మరియు రిపెయిర్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఇది దీర్ఘ కాలంలో మీకు ప్రయోజనం కల్పిస్తుంది.
కార్ ఇన్సూరెన్స్ పాలసీ కాలపరిమితిలో సంఘటన జరిగింది కాబట్టి, పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా క్లెయిమ్ ధృవీకరించబడుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద క్లెయిమ్ చెల్లుతుంది కాబట్టి, క్లెయిమ్ ప్రక్రియ కోసం మీరు అర్హత కలిగి ఉంటారు.
ఒక క్లెయిమ్ సెటిల్ చేయబడటానికి కాలపరిమితి ఆన్లైన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క పరిధి మరియు రకం పై ఆధారపడి ఉంటుంది. ఒక సాధారణ నష్టం కోసం చేసే క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది మరియు అదే రోజున సెటిల్ చేయబడుతుంది. క్లిష్టమైన సమస్యల కోసం, అవసరమైన డాక్యుమెంట్ల ఆధారంగా వ్యవహారంలో జాప్యం ఉంటుంది.
ఎంపిక చేయబడిన గ్యారేజీల భాగస్వామ్యంతో, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు నగదురహిత కార్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. ఈ రకం పాలసీలో, రిపెయిర్ల కోసం అయిన ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా గ్యారేజ్‌కు చెల్లిస్తుంది. కానీ పాలసీ కింద కవర్ చేయబడని భాగాల కోసం మీరు చెల్లించవలసి ఉంటుంది.
మీ ప్రస్తుత నగరంలోని మా గ్యారేజీలను గుర్తించే ప్రక్రియ చాలా సులభం:
1 మా వెబ్‌సైట్‌కు వెళ్ళండి
2 ఆప్షన్స్ మెనూకు వెళ్ళండి > లెవెల్ 1 ఆప్షన్‌కు వెళ్ళండి > బ్రాంచ్ లొకేటర్ ఎంచుకోండి
3 బ్రాంచ్ అలియంజ్ లొకేటర్ > ఒక నెట్వర్క్ గ్యారేజ్ కనుగొనండి ని ఎంచుకోండి > బజాజ్ అలియంజ్ మ్యాప్ ఎంచుకోండి
మీరు మీ పిన్ కోడ్ పంచ్ చేయవచ్చు, మరియు మా గ్యారేజీలు మీ స్క్రీన్ పై అందించబడతాయి.
మీరు చేయవచ్చు, మరియు మీకు నచ్చిన గ్యారేజీలలో అయిన ఖర్చును మేము మీకు తిరిగి చెల్లిస్తాము. అయితే, మా నెట్‌వర్క్‌లోని గ్యారేజీలను అన్వేషించడానికి కస్టమర్లకు మా సహాయం అవసరమైతే, మా బృందం పిక్ సర్వీస్ కూడా అందించగలదు.
రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అనేది వాహనం రిపెయిర్ల కోసం అయిన ఖర్చును కస్టమర్ స్వంతంగా చెల్లించిన తరువాత, ఆ మొత్తం కోసం క్లెయిమ్ చేసే ప్రక్రియ. కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి కస్టమర్ సమర్పించిన ఇన్వాయిస్ల ఆధారంగా క్లెయిమ్ మొత్తం రీయింబర్స్ చేయబడుతుంది.
మొట్టమొదట పోలీసుకు తెలియజేయండి మరియు మీరు చేయగలిగితే, పరిస్థితిని డాక్యుమెంట్ చేయండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు, వాహనాన్ని తరలించకండి మరియు తనిఖీ నిర్వహించవలసిందిగా ఏజెంట్ లేదా కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయండి. క్లెయిమ్‌ను బట్టి అభ్యర్థించబడిన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.
మీ వాహనానికి జరిగిన ప్రమాదం లేదా నష్టం యొక్క విలువు ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో పేర్కొనబడిన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ లేదా IDV లో 75% కంటే ఎక్కువ ఉన్న పరిస్థితిని CTL గా పేర్కొనబడుతుంది.
ఇది కార్ ఇన్సూరెన్స్ కంపెనీ లేదా IDV ముగియడం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా, అనేక క్లెయిములను అనుమతించాలా లేదా అనేది ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క విశేషాధికారం పై ఆధారపడి ఉంటుంది. పాలసీ డాక్యుమెంట్లలో క్లెయిముల గురించి మరిన్ని వివరాలు పేర్కొనబడ్డాయి.
మీ క్లెయిమ్‌ను రద్దు చేయడానికి మీరు మీ కార్ ఇన్సూరెన్స్ కంపెనీని లేదా మీ ఏజెంట్‌ను సంప్రదించవచ్చు. ప్రక్రియను పూర్తిచేయడంలో మీకు సహాయపడటానికి మీ ఏజెంట్ అందుబాటులో ఉంటారు. ఇది కాకపోతే, మీరు మా ఆన్లైన్ సర్వీసులను కూడా ఉపయోగించుకోవచ్చు
మమ్మల్ని ఇక్కడ సంప్రదించండి: bajajallianz.com.
సర్వీసెస్ చాట్: +91 75072-45858
కస్టమర్ కేర్: 1800-209-0144
మీరు వాహనం యొక్క యజమాని అయి ఉంది కారును మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రమే పర్సనల్ యాక్సిడెంట్ కోసం క్లెయిమ్ చేయవచ్చు. అలాగే, వాహనం యొక్క కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ పేరు పై ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ చేయమని కోరండి
డిస్‌క్లెయిమర్
వెబ్సైట్లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్డేట్ చేయబడిన తేదీ: 21 డిసెంబర్ 2022
డిస్‌క్లెయిమర్
వెబ్సైట్లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి