Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్

సోలో ట్రిప్స్ పై మేము మీకు మద్దతును అందిస్తాము
Individual Travel Insurance Plan

ప్రారంభిద్దాం

దయచేసి పేరును నమోదు చేయండి
/travel-insurance-online/buy-online.html ఒక కోట్ పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సబ్మిట్ చేయండి

దీనితో మీకు కలిగే లాభం?

అవుట్‌లుక్ ట్రావెలర్ నుండి బెస్ట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవార్డు పొందింది

విమాన ఆలస్యం మరియు రద్దు కవర్

వైద్య ఖర్చుల కవర్

ఆకర్షణీయమైన ప్రీమియంల వద్ద సమగ్ర కవర్

నాకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

'జెట్ ప్లేన్‌లో ప్రయానించడం' 1960 లో వచ్చిన ప్రజాదరణ పొందిన పాట వలె ఉత్సాహంగా ఉందా?? మిమ్మల్ని విసుగెత్తించే రోజువారీ రొటీన్ బంధనాల నుండి తప్పించుకుపోవడం మంచిదే, కానీ ప్రయాణంలో తలెత్తే అత్యవసర పరిస్థితి కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం

మీరు చేయవలసిన పనులు మరియు చూడవలసిన ప్రదేశాల జాబితాను రూపొందించిన తరువాత, మంచి ధర వద్ద లభ్యం అయ్యే హోటళ్లు మరియు టూర్ ప్యాకేజీల కోసం శోధించాలి. ఇంకా, స్విమ్మింగ్ ట్రంక్స్ లేదా సూట్స్ కూడా ఉండాలి (వెళ్ళేచోట అవి అవసరం అయితేనే)!

ఆ పనులు పూర్తి అయిన తరువాత, మిగితా ముఖ్యమైన వాటి గురించి ఆలోచించాలి. అవి ఏమిటో అని మీరు ఆలోచిస్తున్నారా? అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక ప్రణాళిక! ఒక వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అటువంటి ప్లాన్‍లో భాగం అయి ఉండాలి.

అంతర్జాతీయ ప్రయాణాలలో అనేక ప్రమాదాలు ఉంటాయి. పాస్‌పోర్ట్ కోల్పోవడం నుండి బ్యాగేజ్ అందుకోవడంలో ఆలస్యం అవ్వడం లేదా అత్యవసరమైన వైద్య పరిస్థితుల వరకు చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరగవచ్చు. మీరు బయలుదేరే ముందు, ప్రమాదాలు కలిగించే వివిధ కారణాలను ప్రయాణ వ్యవధి మరియు వ్యక్తిగత బాధ్యతను అంచనా వేయండి, ఇది మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ రక్షణను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

దీనిని పరిగణించండి: మీరు మీ గమ్యస్థానం చేరుకున్న కొద్దిసేపట్లోనే మీ సామాను పోయింది లేదా మీరు ఒక అత్యవసరమైన వైద్య పరిస్థితిని ఎదుర్కొన్నారు మరియు వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. చుట్టు పక్కల ఎవరూ తెలిసిన వారు లేనప్పుడు, ఒక ఇండివిడ్యువల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ డ్రీమ్ హాలిడేని దురదృష్టకరమైన గాథగా మార్చదు. సంక్షోభం తప్పింది!

వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వలన మీ డబ్బుకు రక్షణ ఉంటుంది మరియు అది మీకు మనఃశాంతిని అందిస్తుంది. విదేశాలలో ఉండగా మీకు సహాయం అవసరమైతే, మీరు చేయవలసిందల్లా మా టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం. మీరు ఏ ప్రదేశంలో ఉన్నా, మా గ్లోబల్ నెట్‍వర్క్ వలన వేగవంతమైన క్లెయిమ్స్ ప్రాసెసింగ్ మరియు సెటిల్‍మెంట్ సర్వీస్ పొందడానికి మీకు వీలు కల్పిస్తుంది.

అంటువ్యాధులు మరియు ప్రకృతి వైపరీత్యాలు వలన కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా కలిగి ఉండాలి, ఎందుకంటే ఇటువంటి పరిస్థితులలో తలెత్తే భారీ వైద్య ఖర్చులను భరించడానికి ఇది సహకరిస్తుంది. అదేవిధంగా, ఒక అత్యవసర పరిస్థితిలో మీకు నగదు అవసరం అయినప్పుడు, మా వ్యక్తిగత ట్రిప్ ప్లాన్లు మీకు తగినంత ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.

ఒక ప్రొఫెషనల్ లేదా ఒక టూరిస్ట్‌గా ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయడం అనేది ఒక ఉత్తేజభరితమైన అనుభవం! బజాజ్ అలియంజ్ వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో, మీరు విమాన ప్రయాణం ఆరంభం అయిన తరువాత ప్రయాణానికి సంబంధించిన మీ చింతలు అన్ని దూరం అవుతాయి!

అత్యంత తక్కువ ధర వద్ద వ్యక్తిగత ట్రావెల్ ప్లాన్ ఎలా పొందాలా అని ఆలోచిస్తున్నారా? తాజా కోట్స్ పొందడానికి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి, వివిధ ట్రిప్ ప్లాన్లను పోల్చండి మరియు మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌తో చెల్లించవలసిన ప్రీమియంను అంచనా వేయండి. ఇది నిజంగా చెబుతున్నంత సులభం!

ప్రత్యేక ఫీచర్స్

మాకు హడావుడి చేయడం ఇష్టం ఉండదు! ఒక అత్యవసర పరిస్థితిలో, బజాజ్ అలియంజ్ మీకు తెర వెనుక ఉండి మద్దతును అందిస్తుంది.

ప్రపంచంలో మీరు ఏ ప్రదేశంలో ఉన్నా, మీరు ఆపదలో ఉంటే, మీరు చేయవలసింది +91-124-6174720కు ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం. ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మా కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్స్ పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడటానికి పగలూ రాత్రీ అందుబాటులో ఉంటారు!

ఆపద సమయంలో వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయడమే కాకుండా, మీరు ట్రిప్ పై వెళ్ళినప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరిగినా లేదా మీ ట్రిప్ రద్దు అయినా లేదా కుదించబడినా, వీటి వలన జరిగే నష్టాలను కవర్ చేస్తుంది.

  • క్లెయిముల త్వరిత సెటిల్‌మెంట్

    బజాజ్ అలియంజ్ వద్ద, క్లెయిమ్లను త్వరగా మరియు సమర్థవంతంగా సెటిల్ చేయడానికి మా ప్రక్రియలను ఒకే తాటి పైకి తెచ్చాము. ప్రపంచ స్థాయి సాంకేతికత మరియు వ్యవస్థలను వినియోగించుకుంటూ, పరిశ్రమలోనే వేగంగా ప్రతిస్పందనను అందించే వారిలో ఒకరిగా మేము నిలిచాము అని సగర్వంగా ప్రకటిస్తున్నాము.

  • ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ట్రావెల్ ట్రిప్ డిలే డిలైట్

    మీ అవసరాలను సులభంగా మరియు సునాయాసంగా తీర్చడానికి మా మొబైల్ యాప్ అయిన, ట్రావెల్ టిప్ డిలే డిలైట్ రూపొందించబడింది. క్లెయిమ్ స్థితిని ట్రాక్ చేయడానికి మరియు ఆటోమేటెడ్ పద్ధతిలో చెల్లింపులను ప్రారంభించడానికి యాప్ రూపొందించబడింది.

ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు?

సులభమైన, అవాంతరాలు-లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్

మీ ప్రయాణాలలో మీకు అన్నీ అనుకూలంగా ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము, అయితే, ఒక క్లెయిమ్ ఫైల్ చేయడానికి మీరు మాకు కాల్ చేసినప్పుడు, మీరు ఓర్పుతో వినేవారిని మరియు వేగవంతమైన సర్వీస్‍ను కనుగొంటారు. మీరు మా టోల్ ఫ్రీ నంబర్ 1800 209 5858 ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా +91 124 6174720కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మా గ్లోబల్ ట్రావెల్ హెల్ప్ లైన్ కూడా ఉపయోగించవచ్చు. గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ నంబర్ పై మీరు మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత, మీరు మా నుండి ఒక కాల్ అందుకుంటారు మరియు మా ప్రతినిధి మిగిలిన ప్రాసెస్‍ను మీకు వివరిస్తారు.

 

మీ ట్రావెల్ క్లెయిమ్ ఎలా ప్రాసెస్ చేయబడుతుంది అనేది మీరు క్యాష్‍లెస్ లేదా క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాతిపదికన కవరేజ్ కోసం ఎంచుకున్నారా అనేదానిపై ఆధారపడి ఉంటుంది. 

క్యాష్‌లెస్ విధానం ద్వారా మీ క్లెయిమ్ చేయబడితే, మేము దానిని ఎలా ప్రాసెస్ చేస్తామో ఇక్కడ ఇవ్వబడింది

✓ మీరు ఒక క్లెయిమ్ చేయవలసి ఉంటే, మీరు చేయవలసిందల్లా ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా మమల్ని సంప్రదించడం. క్లెయిమ్ ప్రాసెస్‍కు సంబంధించి మా అడ్వైజర్ మీకు వివరిస్తారు మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానాలు అందిస్తారు.

✓ మీ క్లెయిమ్‌ను త్వరగా ప్రాసెస్ చేయడానికి, సరిగ్గా నింపబడిన క్లెయిమ్ ఫారం మరియు సపోర్ట్ చేసే డాక్యుమెంట్లు వంటి సూచించబడిన డాక్యుమెంట్లను మీరు అందించవలసి ఉంటుంది. వీటి గురించి ఈ క్రింది సెక్షన్‌లో వివరంగా పేర్కొనబడింది.

✓ మీ క్లెయిమ్ ధృవీకరించిన తర్వాత, మీ క్లెయిమ్ ఆమోదించబడిందా లేదా తిరస్కరించబడిందా అనేది సాధ్యమైనంత తక్కువ సమయంలోనే మేము మీకు తెలియజేస్తాము.

✓ అదనపు సమాచారం అవసరమైన సందర్భంలో, ఒక స్పష్టీకరణ కోసం మేము మీ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌ను సంప్రదించవచ్చు. బజాజ్ అలియంజ్ పంపించే ఒక విచారణ లేఖ ద్వారా ఇది పూర్తి చేయబడుతుంది.

✓ ఒక వేళ ఆమోదించబడితే, మేము మీ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌ను సంప్రదిస్తాము మరియు వారికి ఒక చెల్లింపు గ్యారెంటీ లేఖ పంపుతాము. అంటే, దీని అర్థం, మీరు నాణ్యమైన చికిత్సను పొందవచ్చు మరియు దానికి అయిన ఖర్చు బాధ్యత మాది.

✓ ఒక వేళ క్లెయిమ్ తిరస్కరించబడితే, మేము నిరాకరణ లేఖ ద్వారా ప్రొవైడర్‌కి తెలియజేస్తాము. దురదృష్టవశాత్తు, మీరు మీ ఫండ్స్ నుండి చికిత్స కోసం చెల్లించవలసి ఉంటుంది.

ఇక్కడ క్లిక్ చేయండి మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి. 

ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని సులభంగా అర్థం చేసుకుందాము

ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది వైద్య ఖర్చులు, ట్రిప్ రద్దు, పోయిన సామాను, విమాన ప్రమాదం మరియు ప్రయాణ సమయంలో జరిగిన ఇతర నష్టాలను కవర్ చేసే ఒక రకమైన ఇన్సూరెన్స్. అంతర్జాతీయ మరియు దేశీయ ప్రయాణం రెండింటి కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందవచ్చు.

ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎలా పొడిగించాలి?

ట్రావెల్ ఇన్సూరెన్స్ పొడిగింపు కోసం రెండు సందర్భాలు ఉండవచ్చు అంటే పాలసీ గడువు ముగియడానికి ముందు మరియు పాలసీ గడువు ముగిసిన తర్వాత. రెండు సందర్భాలకు ప్రాసెస్ క్రింద పేర్కొన్నట్లుగా ఉంటుంది.

  • పాలసీ గడువు ముగియడానికి ముందు: ఈ సందర్భంలో, కస్టమర్ వారి ట్రావెల్ ఇన్సూరెన్స్ పొడిగింపు ఆవశ్యకత గురించి బజాజ్ అలియంజ్ బృందానికి తెలియజేయాలి. అభ్యర్థనను అందుకున్న తర్వాత, కస్టమర్ ఒక గుడ్ హెల్త్ ఫారం నింపమని బజాజ్ అలియంజ్ ప్రతినిధి మిమ్మల్ని కోరతారు, దీని తరువాత అభ్యర్థనను అండర్‌రైటర్లు పరిశీలిస్తారు మరియు అవసరమైనది చేస్తారు.
  • పాలసీ గడువు ముగిసిన తర్వాత: అటువంటి సందర్భంలో, అభ్యర్థన పంపడంలో ఆలస్యానికి గల కారణంతో పాటు పాలసీ ఎక్స్‌టెన్షన్ అవసరం ఆవశ్యకత గురించి బజాజ్ అలియంజ్ బృందానికి కస్టమర్ తెలియజేయాలి. అభ్యర్థనను అందుకున్న తర్వాత, అండర్‌రైటర్లు దానిని పరిశీలిస్తారు మరియు సమర్పించిన వివరాల ఆధారంగా, ఒక నిర్ణయానికి వస్తారు.

ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేయడానికి నాకు అవసరమైన సమాచారం ఏమిటి?

అప్లికేషన్‌ను పూర్తి చేయడానికి అవసరమైన సమాచారం అంతా దరఖాస్తుదారుల పాస్‌పోర్ట్‌లో అందుబాటులో ఉంటుంది. అప్లికెంట్ల పూర్తి పేరు, పాస్‌పోర్ట్ నంబర్, పుట్టిన తేదీ, భారతదేశంలో మెయిలింగ్ చిరునామా మరియు టెలిఫోన్ నంబర్, నియుక్తులు (ప్రయాణీకుని మరణం లేదా డిస్‌మెంబర్‌మెంట్ సందర్భంలో పాలసీ కోసం లబ్ధిదారు) మరియు సరైన ప్రయాణ తేదీలు

BA ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం ఎంపిక పరిమితి ఏమిటి?

BA అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో 50k USD నుండి 5 లక్షల USD వరకు ఉండే శ్రేణిలో ప్లాన్లు కలిగి ఉంది

పర్సనల్ లయబిలిటీ కవర్ అంటే ఏమిటి?

విదేశీ ప్రయాణాల్లో శారీరక గాయం లేదా యాక్సిడెంటల్ ప్రాపర్టీ డ్యామేజ్ వలన ఎదురయ్యే థర్డ్ పార్టీ సివిల్ క్లెయిమ్‌ల కోసం చేసే చెల్లింపును పర్సనల్ లయబిలిటీ కవర్ చేస్తుంది.

 

ఏ సందర్భాలలో, ఎవరైనా బ్యాగేజ్ నష్టపోవడం/ఆలస్యం అవ్వడం వలన కలిగే నష్టానికి కవర్ పొందుతారు?

బ్యాగేజ్ కోల్పోవడం/ఆలస్యం అవ్వడం అనేది చెక్డ్ ఇన్ బ్యాగేజ్ విషయంలోనే వర్తిస్తుంది, అది కూడా ఒక వ్యక్తి భారతదేశం నుండి విదేశానికి ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే.

విదేశాలలో ప్రయాణిస్తున్నప్పుడు నాకు నగదు అవసరమైతే ఏం చెయ్యాలి?

ఈ పాలసీ యొక్క ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి ఏమిటంటే ఎమర్జెన్సీ క్యాష్ అడ్వాన్స్. ఇది ఒక సహాయ సర్వీస్, సామాను/డబ్బు దొంగతనం/దోపిడీకి గురి అయినప్పుడు లేదా ఎక్కడన్నా నిలిచి పోయినప్పుడు, అత్యవసర ఆర్థిక సహకారం అందించడానికి భారతదేశంలో ఉన్న ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి బంధువులతో సమన్వయం చేసుకుంటూ అతని అవసరం ప్రకారం, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న పరిమితి ప్రకారం, ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తికి కంపెనీ అత్యవసర నగదు సదుపాయాన్ని అందిస్తుంది

ఏ పాలసీ మెరుగైనది, ఇండివిడ్యుయల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్?

ఇది పూర్తిగా మీ అవసరం ఏమిటి అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్నా లేదా స్నేహితులు, సహచరులతో ప్రయాణిస్తున్నా, ఇండివిడ్యువల్ ప్లాన్ సరిపోతుంది. మీరు జీవిత భాగస్వామి మరియు పిల్లలతో ప్రయాణిస్తున్నట్లయితే మరియు మీరు మొత్తం కుటుంబాన్ని కవర్ చేయడానికి ఒకే పాలసీ కావాలి అనుకుంటే, అప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ మంచి ఎంపిక అవుతుంది.

ప్రయాణిస్తున్నప్పుడు నేను నా పాస్‌పోర్ట్‌ను కోల్పోతే ఏం చెయ్యాలి?

ఒక వేళ మీరు పాస్‌పోర్ట్ కోల్పోతే, ఆ జరిగిన నష్టం కూడా బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది, ఒక వేళ మీరు విదేశాలలో ప్రయాణిస్తున్నప్పుడు పాస్‌పోర్ట్‌ని కోల్పోతే, నిర్ణయించబడిన ప్రయోజన మొత్తాన్ని మీరు పొందుతారు

హైజాక్ కవర్ అంటే ఏమిటి?

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ప్రయాణిస్తున్న ఏదైనా విమానం హైజాక్ చేయబడి హైజాకర్ల ద్వారా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి నిర్బంధించబడితే, షెడ్యూల్‌లో పేర్కొన్న గరిష్ట మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది.

అంబులెన్స్ ఛార్జీలు కవర్ చేయబడతాయా?

అవును, అంబులెన్స్ ఛార్జీలు కవర్ చేయబడతాయి

నేను నా ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను మర్చిపోతే ఏమి చేయాలి?

ఒకవేళ మీరు మీ ట్రావెల్ పాలసీని వెంట తీసుకువెళ్ళడం మర్చిపోతే, పాలసీ నంబర్ లేదా కస్టమర్ ID నంబర్ వంటి పాలసీ వివరాలు మీరు కలిగి ఉండాలి. పాలసీ యొక్క సాఫ్ట్ కాపీని కూడా ఒక చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్‍గా వెంట తీసుకువెళ్ళవచ్చు

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

సోనాల్ గోపుజ్‌కర్

అద్భుతమైన ప్రాసెస్! ఉపయోగించడానికి చాలా సులభం మరియు ఫలితం వెంటనే లభిస్తుంది

ఉషాబెన్ పిపాలియా

చాలా వేగవంతమైన మరియు ప్రొఫెషనల్ సర్వీస్. బజాజ్ అలియంజ్ యొక్క కస్టమర్ సర్వీస్ బృందం సేవతో ఆనందంగా ఉన్నాను.

కె.వి.రంగారెడ్డి

చక్కటి మరియు కస్టమైజ్ చేయబడిన వెబ్‌సైట్. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ అనుభూతి బాగుంది.

బజాజ్ అలియంజ్‌తో మీ సెలవును హాయిగా ఆనందించండి!

ఒక కోట్ పొందండి

వ్యక్తిగత ప్రయాణ బీమా కవర్లు మరియు ఫీచర్లు

 

చూడవలసిన ప్రదేశాల విషయంలో మీరు వివిధ రకాల ఎంపికలు కలిగి ఉండాలని అనుకుంటున్నారని మాకు తెలుసు. వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుకు భిన్నం కాదు. బజాజ్ అలియంజ్ వద్ద, పర్సనల్ లయబిలిటీ ప్రొటెక్షన్ మరియు ఎమర్జెన్సీ క్యాష్ అడ్వాన్స్ కలిగి ఉన్న సమగ్ర కవరేజ్‌తో పాటు ఖర్చు పెట్టిన డబ్బుకు తగిన విలువను అందించే వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను మేము అందిస్తున్నాము. వివరాలు ఇక్కడ ఉన్నాయి:

 

 

వ్యక్తిగత ట్రావెల్ కంపానియన్ ప్లాన్

 

 

మీరు ఒక అంతర్జాతీయ గమ్యస్థానానికి ప్రయాణిస్తున్నప్పుడు మీకు సంపూర్ణ మెడికల్ మరియు హెల్త్ కవర్ అందించే ఒక ప్రాథమిక ట్రావెల్ కవర్ ఇది. ఇతర ఎంపికలతో పాటు ఇది పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్, మెడికల్ మరియు బ్యాగేజ్ లాస్ కవరేజ్ అందిస్తుంది.

తక్కువ లగేజితో ప్రయాణం చేయడం పై మీకు నమ్మకం ఉన్నా లేదా లేకపోయినా, మీకు ఎదురయ్యే ప్రతి అత్యవసర వైద్య పరిస్థితిని ట్రావెల్ కంపానియన్ కవర్ చేస్తుంది. దీనిని కలిగి ఉంటే, మీరు ఎక్కడికి వెళ్లినా ఒక అదృష్ట దేవతను మీతో పాటు తీసుకువెళుతున్నట్లే! వివరాలు ఇక్కడ ఉన్నాయి.

 

 

  ట్రావెల్ కేర్ ట్రావెల్ సెక్యూర్ ట్రావెల్ వాల్యూ
కవరేజీలు US$ ల ప్రయోజనం US$ ల ప్రయోజనం US$ ల ప్రయోజనం
వైద్య ఖర్చులు, తరలింపు
మరియు స్వదేశానికి పంపటం
50,000 2,00,000 5,00,000
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్
పైన (I) లో చేర్చబడింది
500 500 500
చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం
ప్రతి సామానుకు గరిష్టంగా 50% మరియు సామానులో ప్రతి వస్తువుకు 10%
250** 1,000** 1,000**
బ్యాగేజ్ ఆలస్యం 100 100 100
వ్యక్తిగత ప్రమాదం
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగల ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50% అందించబడుతుంది
10,000*** 25,000*** 30,000***
పాస్‌పోర్ట్ నష్టం 250 250 250
వ్యక్తిగత బాధ్యత 1,00,000 2,00,000 2,00,000
హైజాక్ ప్రతి రోజుకు $ 50 నుండి
గరిష్టంగా $ 300
ప్రతి రోజుకు $ 50 నుండి
గరిష్టంగా $ 300
ఒక రోజుకు $ 50 నుండి
గరిష్టంగా $ 300
పర్యటన ఆలస్యం - ప్రతి 12 గంటలకు $ 20. 12 గంటలు. గరిష్టంగా $120 ప్రతి 12 గంటలకు $ 20. 12 గంటలు. గరిష్టంగా $120
అత్యవసర నగదు అడ్వాన్స్****
క్యాష్ అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి
500 1000 1,500
గోల్ఫర్ హోల్-ఇన్-వన్ - 250 500
**ప్రతి బ్యాగేజ్‍కు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజ్‍లో ప్రతి వస్తువుకు 10 %. *** 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50% **** క్యాష్ అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి.

వ్యక్తిగత ట్రావెల్ ఎలైట్ ప్లాన్

 

 

అదనంగా ఇంకేమైనా కావాలా? మా ట్రావెల్ ఎలైట్ ప్లాన్లు మీకు అదనపు రక్షణను అందిస్తాయి, ఒక బిజినెస్ క్లాస్ ఫ్లైట్ అనుభవం లాగా. ఫ్లెక్సిబుల్ సమ్ ఇన్స్యూర్డ్ ఎంపికలు, ట్రిప్ డిలే ప్రొటెక్షన్ మరియు పర్సనల్ లయబిలిటీ కవర్ అందించే మా సిల్వర్, గోల్డ్ మరియు ప్లాటినం ప్లాన్ల నుండి మీరు ఎంచుకోవచ్చు.

ఇంకా, చెక్డ్ ఇన్ బ్యాగేజీ కోల్పోవడం మరియు ట్రిప్ రద్దు అవ్వడం వంటి వాటికి కూడా ట్రావెల్ ఎలైట్ కవరేజ్ అందిస్తుంది. మొదలైనవి. ట్రావెల్ ఎలైట్ హైజాక్ కవరేజ్ కూడా అందిస్తుంది.

మా ట్రావెల్ ఎలైట్ ప్లాన్ మీ ప్రయాణ ఆందోళనలను దూరం చేయడానికి ఎలా సహాయపడుతుందో ఇక్కడ ఇవ్వబడింది!

 

 

  సిల్వర్ గోల్డ్ ప్లాటినం
కవరేజీలు US$ ల ప్రయోజనం US$ ల ప్రయోజనం US$ ల ప్రయోజనం
వైద్య ఖర్చులు, తరలింపు
మరియు స్వదేశానికి పంపటం
50,000 2,00,000 5,00,000
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్
పైన (I) లో చేర్చబడింది
500 500 500
వ్యక్తిగత ప్రమాదం
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50%
సంవత్సరాలు
15,000*** 25,000*** 25,000***
AD & D కామన్ క్యారియర్ 2,500 5,000 5000
బ్యాగేజ్ ఆలస్యం 100 100 100
చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం
ప్రతి సామానుకు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజీలో ప్రతి వస్తువుకు 10 %.
500** 1,000** 1,000**
హైజాక్ ప్రతి రోజుకు $50 నుండి గరిష్టంగా $ 300 వరకు ప్రతి రోజుకు $60 నుండి గరిష్టంగా $ 360 వరకు ప్రతి రోజుకు $60 నుండి గరిష్టంగా $ 360 వరకు
పర్యటన ఆలస్యం ప్రతి 12 గంటలకు $ 20 గరిష్టంగా
$ 120
ప్రతి 12 గంటలకు $ 30 గరిష్టంగా
$ 180
ప్రతి 12 గంటలకు $ 30 గరిష్టంగా
$ 180
వ్యక్తిగత బాధ్యత 1,00,000 2,00,000 2,00,000
అత్యవసర నగదు అడ్వాన్స్****
క్యాష్ అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి.
500 1,000 1,000
గోల్ఫర్ హోల్-ఇన్-వన్ 250 500 500
ట్రిప్ రద్దు అవ్వడం 500 1,000 1,000
హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ రూ.1, 00,000 రూ.2, 00,000 రూ.3, 00,000
ట్రిప్ తగ్గింపు 200 300 500
హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం ప్రతి రోజుకు $25 నుండి గరిష్టంగా $100 వరకు ప్రతి రోజుకు $25 నుండి గరిష్టంగా $125 వరకు ప్రతి రోజుకు $25 నుండి గరిష్టంగా $150 వరకు
పాస్‌పోర్ట్ నష్టం 250 250 250
**ప్రతి బ్యాగేజ్‍కు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజ్‍లో ప్రతి వస్తువుకు 10 %. *** 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50% **** క్యాష్ అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి.

వ్యక్తిగత ట్రావెల్ ప్రైమ్ ప్లాన్

 

 

మీరు తరచుగా ప్రయాణిస్తున్నట్లయితే, మేము మా ట్రావెల్ ప్రైమ్ ప్లాన్ సిఫార్సు చేస్తాము. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే సమయంలో మీరు ఎదుర్కొనే అవకాశం ఉన్న అనేక రిస్కుల పై సమగ్ర కవరేజ్ అందించడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.

హాస్పిటలైజేషన్ ఖర్చు మరియు సంబంధిత ఖర్చులతో సహా జరిగే అవకాశం ఉన్న ప్రతి వైద్య పరిస్థితి ఈ ప్లాన్ క్రింద కవర్ చేయబడుతుంది. ఒక వైరల్ వ్యాధి వ్యాపించి ఉన్న ప్రమాదకరమైన దేశానికి మీరు ప్రయాణిస్తున్నట్లయితే, అప్పుడు అయ్యే వైద్య ఖర్చుల భారం నుండి ట్రావెల్ ప్రైమ్ మీకు రక్షణ కల్పించగలదు.

ఒక అంతర్జాతీయ ప్రయాణంలో మీకు ఎదురయ్యే అవకాశం గల ప్రమాదాలు ఎన్ని ఉన్నాయో, ట్రావెల్ ప్రైమ్ క్రింద మీకు అన్ని ఎంపికలు లభ్యమవుతాయి. హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం, ప్రమాదం కారణంగా సంభవించిన మరణం లేదా వైకల్యం నుండి అత్యవసర తరలింపు వరకు, ట్రావెల్ ప్రైమ్ మీకు అత్యుత్తమ రక్షణను అందిస్తుంది మరియు మీ వెకేషన్‌ను మీరు కోరుకున్న విధంగా ఆనందించవచ్చు!

మీరు ఆల్ప్స్‌లో స్కీయింగ్‌కి వెళ్లినా లేదా పారాసెయిలింగ్ ఆనందించినా, మీ ఇన్‌స్ట్రక్టర్ యొక్క సూచనలను జాగ్రత్తగా పాటించవలసిందిగా మిమల్ని కోరుతున్నాము. ట్రావెల్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, బజాజ్ అలియంజ్ ట్రావెల్ ప్రైమ్ మీకు కవరేజ్ అందిస్తుంది. అయినప్పటికీ, ఇన్సూరెన్స్ అనేది విన్నపానికి సంబంధించిన విషయం కాబట్టి, మీరు నిబంధనలు మరియు షరతులను అంతే జాగ్రత్తగా చదవవలసిందిగా మేము సూచిస్తున్నాము.  

 

 

  సిల్వర్ గోల్డ్ ప్లాటినం సూపర్ ప్లాటినం గరిష్ఠం మినహాయింపు
కవరేజీలు 50,000 USD 2 లక్షల USD 5 లక్షల USD 7.5 లక్షల USD 10 లక్షల USD -
వ్యక్తిగత ప్రమాదం* 15,000 USD 25,000 USD 25,000 USD 25,000 USD 25,000 USD నిల్
వైద్య ఖర్చులు మరియు తరలింపు 50,000 USD 200,000 USD 500,000 USD 750,000USD 1,000,000 USD 100 USD
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ పైన పేర్కొనబడిన పరిమితులలో చేర్చబడింది 500 USD 500 USD 500 USD 500 USD 500 USD 100 USD
రిపాట్రియేషన్ 5,000 USD 5,000 USD 5,000 USD 6,000 USD 6,500 USD లేదు
చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం** 500 USD 1,000 USD 1,000 USD 1,000 USD 1,000 USD లేదు
ప్రమాదం కారణంగా సంభవించిన మరణం మరియు వైకల్యం
(కామన్ క్యారియర్)
2,500 USD 5,000 USD 5,000 USD 5,000 USD 5,000 USD లేదు
పాస్‌పోర్ట్ నష్టం 250 USD 250 USD 250 USD 300 USD 300 USD 25 USD
వ్యక్తిగత బాధ్యత 100,000 USD 200,000 USD 200,000 USD 250,000 USD 250,000 USD 100 USD
హైజాక్ కవర్ ప్రతి రోజుకు 50 USD
గరిష్టంగా 300 USD వరకు
ప్రతి రోజుకు 60 USD
గరిష్టంగా 360 USD వరకు
ప్రతి రోజుకు 60 USD
గరిష్టంగా 360 USD వరకు
ప్రతి రోజుకు 60 USD
గరిష్టంగా 360 USD వరకు
ప్రతి రోజుకు 60 USD
గరిష్టంగా 360 USD వరకు
లేదు
పర్యటన ఆలస్యం ప్రతి 12 గంటలకు 25 USD
గరిష్టంగా 120 USD వరకు
ప్రతి 12 గంటలకు 30 USD
గరిష్టంగా 180 USD వరకు
ప్రతి 12 గంటలకు 30 USD
గరిష్టంగా 180 USD వరకు
ప్రతి 12 గంటలకు 30 USD
గరిష్టంగా 180 USD వరకు
ప్రతి 12 గంటలకు 30 USD
గరిష్టంగా 180 USD వరకు
12 గంటలు
హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం ప్రతి రోజుకు 20 USD
గరిష్టంగా 100 USD వరకు
ప్రతి రోజుకు 25 USD
గరిష్టంగా 125 USD వరకు
ప్రతి రోజుకు 25 USD
గరిష్టంగా 125 USD వరకు
ప్రతి రోజుకు 25 USD
గరిష్టంగా 125 USD వరకు
ప్రతి రోజుకు 25 USD
గరిష్టంగా 125 USD వరకు
లేదు
గోల్ఫర్స్ హోల్-ఇన్-వన్ 250 USD 500 USD 500 USD 500 USD 500 USD లేదు
ట్రిప్ రద్దు అవ్వడం 500 USD 1,000 USD 1,000 USD 1,000 USD 1,000 USD లేదు
ట్రిప్ తగ్గింపు 200 USD 300 USD 500 USD 500 USD 500 USD లేదు
చెక్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం 100 USD 100 USD 100 USD 100 USD 100 USD 12 గంటలు
హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ రూ. 100,000 రూ. 200,000 రూ. 300,000 రూ. 300,000 రూ. 300,000 లేదు
అత్యవసర నగదు ప్రయోజనం*** 500 USD 1,000 USD 1,000 USD 1,500 USD 1,500 USD లేదు
మిస్డ్ కనెక్షన్ 100 USD 100 USD 100 USD 100 USD 100 USD 12 గంటలు
ఆలస్యం అయిన లేదా ముందస్తు రిటర్న్ కారణంగా విమాన ఛార్జీలలో వ్యత్యాసం 500 USD 500 USD 500 USD 500 USD 500 USD లేదు
హోటల్ బుకింగ్ బౌన్స్ అయితే 500 USD 500 USD 500 USD 500 USD 500 USD లేదు
భారతదేశంలో PA కవర్ రూ. 50,000 రూ. 50,000 రూ. 50,000 రూ. 50,000 రూ. 50,000 లేదు

  • INR అనేది ఇండియన్ నేషనల్ రూపీస్ ని సూచిస్తుంది
  • సంకేతాక్షరము* 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో 50%ని మాత్రమే సూచిస్తుంది ఉదా. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణించినప్పుడు సంపూర్ణ బాధ్యత అనేది పర్సనల్ యాక్సిడెంట్ కోసం మొత్తం SI లో 50% అవుతుంది అంటే 50%*10000 USD= 5000 USD
  • సంకేతాక్షరము ** ప్రతి బ్యాగేజ్‌కు గరిష్టంగా 50% మరియు సామానులో ప్రతి వస్తువుకు 10%
  • అబ్రివేషన్ *** క్యాష్ అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి

విదేశాలలో నాకు అత్యవసరంగా నగదు అవసరం అయితే ఏమి చేయాలి?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనుభవించే 10 అతిపెద్ద ప్రయాణ పీడకలల్లో ఒక పరదేశంలో చిక్కుకుపోవడం! మీరు నిజ జీవితంలో అటువంటి పరిస్థితిని ఎప్పుడైనా ఎదుర్కొన్నట్లయితే, ఉదాహరణకు, మరొక దేశంలో దోపిడీకి గురి అయితే, మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎంబసీ సిబ్బంది, పోలీస్ లేదా ఇమిగ్రేషన్ అధికారుల నుండి మీరు సహాయం కోరగలిగినప్పటికీ, తక్షణ ఖర్చుల మాట ఏమిటి?

వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ సహాయంతో మీరు అత్యవసర నగదు సహాయాన్ని పొందవచ్చు, దీనితో మీరు అత్యవసరమైన వాటిని కొనుగోలు చేయవచ్చు మరియు రాత్రి నిద్రపోవడానికి ఒక సౌకర్యవంతమైన ప్రదేశాన్ని కనుగొనవచ్చు.

మా ఎమర్జెన్సీ క్యాష్ అడ్వాన్స్ ఫీచర్ సామాను దొంగతనం లేదా నష్టం వంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మీకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. మీ వస్తువులను కనుగొనబడేవరకు వేచి ఉన్నప్పుడు, ఒక అత్యవసర నగదు సహాయం మిమ్మల్ని అత్యవసర సర్వీసులను యాక్సెస్ చేయడానికి మరియు భారతదేశంలో మీ కుటుంబ సభ్యులకు కాల్ చేయడానికి ఉపయోగపడుతుంది.

మీ బంధువుతో సమన్వయం చేయడం ద్వారా అత్యవసర నగదు సహాయం మీకు అందించబడుతుంది. సహాయం పరిమితి అనేది పాలసీ షెడ్యూల్‌లో పేర్కొనబడింది.   

నేను కవర్ చేయబడే లేదా చేయబడని పరిస్థితులు ఏమిటి?

  • చేర్పులు

  • మినహాయింపులు

మెడికల్ మరియు హాస్పిటలైజేషన్

తరలింపు మరియు రీపేట్రియేషన్

సామాను కోల్పోవడం/ఆలస్యం

పాస్‌పోర్ట్ నష్టం

అత్యవసర నగదు అడ్వాన్స్

1 ఆఫ్ 1

పాలసీ ప్రారంభం అవ్వడానికి ముందు నుండే ఉన్న ఒక అనారోగ్యంతో లేదా దాని వలన ఏర్పడిన సంక్లిష్టతలతో మీరు బాధపడుతున్నా. 

ఎటువంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితికి సూచన లేకుండా మీరు సాధారణ హెల్త్ చెకప్ చేయించుకుంటే

పాలసీ అవధి గడువు ముగిసిన తర్వాత అయిన వైద్య ఖర్చులు

ఆత్మహత్యాయత్నం లేదా స్వయంగా చేసుకున్న గాయం కారణంగా ఎదురైన ఆరోగ్య సమస్యలు.

ఎటువంటి శారీరక అనారోగ్యం లేకుండా కలిగిన ఆందోళన/ భయం/ ఒత్తిడి వంటి మానసిక రుగ్మతలు.

సుఖ వ్యాధులు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేదా మద్యపానం. 

ఒక వేళ మీరు ప్రమాదంతో నిండి ఉన్న శారీరక శ్రమ చేసిన లేదా చట్ట వ్యతిరేకమైన లేదా నేరపూరిత చర్యలో పాలుపంచుకున్నా.

ఒక సాటి మనిషి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తప్ప అనవసరమైన ప్రమాదానికి స్వయంగా గురికావడం.

వైద్యపరంగా గుర్తించబడని ప్రత్యామ్నాయ లేదా ప్రయోగాత్మక పద్ధతులను ఉపయోగించి చికిత్స చేయించుకోవడానికి ఎంచుకుంటే.

చికిత్స కోసం ఆధునిక వైద్యం లేదా అలోపతి కాకుండా ఇతర రకాల ఔషధాలను ఉపయోగించినట్లయితే.

రోగనిర్ధారణ లేదా చికిత్స కోసం ఉపయోగించబడే వినికిడి పరికరాలు, కళ్ళజోడు మొదలైన ఉపకరణాల ఖర్చు.

ప్రసవం, గర్భస్రావము వంటి గర్భధారణ సంబంధిత సమస్యల కోసం అయ్యే వైద్య సంబంధమైన ఖర్చులు.

భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు బ్యాగేజ్ అందుకోవడంలో ఆలస్యం అయితే, అది కవర్ చేయబడదు.

పోలీస్, కస్టమ్స్, మిలిటరీ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ అథారిటీ ద్వారా అది జప్తు చేయబడటం లేదా నిర్బంధం కారణంగా మీ పాస్‍పోర్ట్ కోల్పోవడం లేదా దెబ్బతినడం.

దానిని కోల్పోయిన 24 గంటల్లోపు రిపోర్ట్ చేయకపోతే మరియు ఆ తరువాత దానికి సంబంధించి అధికారిక నివేదిక పొందలేకపోతే.

వాటిని రక్షించడానికి అవసరమైన చర్యలను తీసుకోవడంలో మీ వైఫల్యం కారణంగా మీరు మీ వస్తువులను కోల్పోతే.

1 ఆఫ్ 1

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

నేను నా ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎలా రద్దు చేయగలను?

మేము మీతో మా విలువైన సంబంధాన్ని కొనసాగించాలని ఎంతగా కోరుకుంటామో, బజాజ్ అలియంజ్ వద్ద రద్దు చేయాలన్న మీ నిర్ణయాన్ని అంతగానే గౌరవిస్తాము మరియు ఏ సమయంలోనైనా అలా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాము!

  • మీ పాలసీ ప్రారంభించడానికి ముందు

    మీరు పాలసీ టర్మ్ ప్రారంభించడానికి ముందు మీ వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని రద్దు చేయాలనుకుంటే మీరు ఇలా చేయవలసి ఉంటుంది:

     

    · పాలసీని రద్దు చేయాలన్న మీ నిర్ణయం గురించి బజాజ్ అలియంజ్‍కు తెలియజేయడం.

    · అదనంగా, మీరు రద్దును అభ్యర్ధిస్తూ ఒక ఈమెయిల్ కూడా పంపవలసి ఉంటుంది.

    · ఈమెయిల్‌లో మీ పాలసీ నంబర్ లేదా షెడ్యూల్ నంబర్‌ను పేర్కొనడం.

    ఒక రద్దు ఛార్జ్ వర్తిస్తుందని దయచేసి గమనించండి.    

  • మీ పాలసీ ప్రారంభమైన తర్వాత (మీరు ప్రయాణించి ఉండకపోతే)

    పాలసీ ప్రారంభం అయిన తరువాత మీరు ప్రయాణం చేయకపోతే, మీరు పాలసీని రద్దు చేయాలని అనుకోవచ్చు. అటువంటి సందర్భంలో, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ క్రింది డాక్యుమెంట్లను పంపవలసి ఉంటుంది-

     

    · పేర్కొన్న వ్యవధిలో మీరు ప్రయాణం చేయలేదు అన్న రుజువు.

    · ఖాళీ పేజీలతో సహా పాస్‍పోర్ట్ యొక్క అన్ని పేజీల స్కాన్ లేదా ఫోటోకాపీ.

    · పాలసీ రద్దు చేయడం వెనుక ఉన్న కారణం.

    · వీసా తిరస్కరణ అనేది ట్రిప్ రద్దుకు దారితీసినట్లయితే, వీసా తిరస్కరణ లేఖ యొక్క ఒక కాపీ.

    పంచుకున్న సమాచారం ఆధారంగా, అన్ని డాక్యుమెంట్లను అందుకున్న ఒక పని రోజులోపు పాలసీ రద్దు చేయబడుతుంది.

  • మీ పాలసీ ప్రారంభమైన తర్వాత (ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ప్రయాణించినట్లయితే)

    మీ ట్రిప్ తగ్గించబడినట్లయితే నిరాశ పడకండి! మిగిలిన పాలసీ రోజులకు మేము పరిహారం చెల్లిస్తాము!

    మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసే ముందు మీ టూర్ ముగిసినట్లయితే, మిగిలిన రోజుల కోసం మీకు రిఫండ్ అందించబడుతుంది. పాలసీ వ్యవధిలో ఎటువంటి క్లెయిములు చేయలేదు అనే వాస్తవానికి లోబడి మరియు ఈ క్రింది పట్టికలో రేట్ల ప్రకారం ఈ రిటర్న్ ఉంటుంది-

     

    ప్రీమియం కంపెనీ వద్ద ఉంటుంది

    రిస్క్ వ్యవధి
    ప్రీమియం శాతం
    పాలసీ వ్యవధిలో 50% కంటే ఎక్కువ
    100%
    పాలసీ వ్యవధి యొక్క 40-50% మధ్య
    80%
    పాలసీ వ్యవధి యొక్క 30-40% మధ్య
    75%
    పాలసీ వ్యవధి యొక్క 20-30% మధ్య
    60%
    పాలసీ వ్యవధి యొక్క పాలసీ inception-20%
    50%

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

 4.62

(5,340 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

మదన్‌మోహన్ గోవిందరాజులు

స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ మరియు ధర. చెల్లించడం మరియు కొనుగోలు చేయడం సులభం

పాయల్ నాయక్

చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు సౌకర్యవంతమైనది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు.

కింజల్ బోఘర

ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క సరసమైన ప్రీమియంతో అద్భుతమైన సేవలు

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు : బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి