Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్

మీ గాడ్జెట్లు, మా రక్షణ
Extended Warranty Insurance

ప్రారంభిద్దాం

దయచేసి పేరును నమోదు చేయండి
https://general.bajajallianz.com/Insurance/extendedWarranty/index.jsp ఒక కోట్ పొందండి
కోట్‌ను తిరిగి పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సబ్మిట్ చేయండి

దీనితో మీకు కలిగే లాభం?

భారతదేశ వ్యాప్తంగా 400+ నగరాల్లో క్యాష్‍లెస్ సర్వీస్

3 సంవత్సరాల వరకు కవరేజ్

రిపేర్ మరియు రిప్లేస్‌మెంట్ కవరేజ్

బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్

దీనిని ఊహించుకోండి: మీరు ఒక బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ యొక్క TV ప్రీమియర్‌ ఆనందిస్తున్నారు మరియు క్లైమాక్స్ రావడంతోనే, ఒక ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్ వచ్చి స్క్రీన్ బ్ల్యాంక్ అయిపోతుంది! మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న వారాంతం ఒక పీడకలగా మారిపోయింది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, గడుస్తున్న నిమిషాలు గంటల్లోకి మారినప్పటికీ, మీరు TVని మళ్ళీ పని చేయించలేరు. టెక్నీషియన్ చివరగా మీ TVని పరిశీలించినప్పుడు ఆ సూచన మంచిగా ఉండదు.

దాని లోపల ఒక సర్క్యూట్ కాలిపోయిందని మరియు మీ TV వారంటీ క్రింద కవర్ చేయబడి ఉంటే తప్ప, రిపెయిర్‍ల కోసం పెద్ద మొత్తం ఖర్చుపెట్టవలసి ఉంటుందని అతను మీకు చెబుతాడు. మీ బాధను మరింత పెంచే విధంగా, అసలు తయారీదారు వారంటీ గడువు గత నెలలోనే ముగిసిందని మీరు తెలుసుకుంటారు! ఒక ఉపకరణాన్ని కొనుగోలు చేయడానికి అప్‍ఫ్రంట్ ఖర్చు మరియు రిపెయిర్లు మరియు మెయిన్టెనెన్స్ యొక్క అదనపు భారం మీ సరికొత్త బ్రాండ్ LED TVని మీరు అనుకున్న బేరం కంటే తక్కువగా చేస్తాయి!

మీ TV వారంటీ క్రింద కవర్ చేయబడినప్పుడు, తయారీదారు పేర్కొన్న వ్యవధిలో మీరు ఏదైనా రిపెయిర్‍ల గురించి నిశ్చింతగా ఉండవచ్చు. చాలామంది తయారీదారులు దీర్ఘకాలిక మన్నికను నిర్ధారించడానికి వారి ప్రోడక్టులపై వారంటీలను అందిస్తారు. చాలా ఉపకరణాలతో చేర్చబడిన యూజర్ మాన్యువల్స్‌లో వారి ఉపకరణాల ఇన్‌స్టాలేషన్, ఉపయోగం మరియు మెయిన్టెనెన్స్ పై వివరణాత్మక సూచనలు ఉంటాయి.

మీరు వారంటీ పై పొడిగింపు పొందగలిగితే అది గొప్పగా ఉండదూ? మీరు ఎల్లప్పుడూ వారంటీలు అస్థిరంగా ఉండవచ్చని మరియు మీకు బాగా అవసరమైనప్పుడు అవి ఉపయోగపడవని భావించినట్లయితే, మీ కోసం ఒక శుభవార్త ఉంది. బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ కలని నిజం చేసింది మీ కోసం జీవితాన్ని సులభతరం చేసింది.

 బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ తో, మీరు సమయం మరియు డబ్బు రెండింటినీ ఆదా చేసుకోవచ్చు. మీ ఉపకరణాలు మీకు సమయాన్ని ఆదా చేసి జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేయగా, అసలు తయారీదారు వారంటీ గడువు ముగిసిన తర్వాత కూడా మా పొడిగించబడిన కవరేజ్‍తో రిపెయిర్ ఖర్చులను అదుపులో ఉంచవచ్చు. ఇంకా ఏమిటి, బజాజ్ అలియంజ్‍తో, మీ క్లెయిమ్‌లు వేగవంతంగా సెటిల్ చేయబడి మరియు మీ ప్రశ్నలు వేటికైనా స్నేహపూర్వక మరియు ప్రొఫెషనల్ పద్ధతిలో సమాధానాలు ఇవ్వబడే ప్రపంచ స్థాయి కస్టమర్ సర్వీస్ మీకు హామీ ఇవ్వబడుతుంది.

మీరు ఒక గృహిణి అయితే, ఓవెన్ లేదా గ్రిల్ సరిగా పనిచేయకపోవడం వలన వంటకి సంబంధించిన మీ ప్రణాళిక ప్రభావితం అవుతుంది మరియు మీ పిల్లల కోసం మీరు గడిపే సమయం మీద కూడా ప్రభావం పడుతుంది. అది మీ పిల్లలను బాధించడమే కాకుండా, మీ ఉపకరణం వేగంగా మరియు తక్కువ ధర వద్ద సర్వీసింగ్ పూర్తి అవుతుంది అని మీరు ఖచ్చితముగా ఉండలేరు. ఇది మీ నెలవారీ బడ్జెట్ మరియు కుటుంబ సమయం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితులు నివారించలేకపోయినప్పటికీ లేదా ఊహించలేనప్పటికీ, ఆ సమస్యను పరిష్కరించేందుకు అయ్యే ఖర్చులను మరియు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మీకు ఒక దారి అవసరం.

ఒక బిజీ ప్రొఫెషనల్‌గా, ఒక ఎలక్ట్రికల్ సాధనం లేదా వినియోగదారు ఉపకరణం పనిచేయడం మానేసినప్పుడు ఇంటి మరియు పని బాధ్యతలను అటూ ఇటూ చేసుకుంటూ ఉండడం కష్టమవవచ్చు. ఆన్‌లైన్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్‌తో, అనుకోని సంఘటన కారణంగా మీ రోజువారీ కార్యక్రమం పూర్తిగా ప్రభావితం అవ్వకుండా చూడవచ్చు! దీని ఫలితం: పని సజావుగా సాగుతుంది.

మీరు వేరే పనిలో ఉన్నప్పుడు కూడా మీ ఎలక్ట్రానిక్ డివైసులు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి సహకరిస్తాయి. మీ ల్యాప్‌టాప్ మరియు మొబైల్ ఫోన్‌తో ఒక వ్యాపారాన్ని పూర్తిగా నిర్వహించవచ్చు. అయితే, ఈ డివైసులకు బహుముఖ ఉపయోగాలు ఉన్నప్పటికీ, అవి హానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్‌తో మీరు ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు మరియు మీ పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి మీ ఎలక్ట్రానిక్ డివైసులను కవర్ చేస్తుంది. మీ కోసం ఒక చిన్న వృత్తి నిపుణుల బృందం పని చేస్తున్నట్లయితే, బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఒక మంచి వ్యాపార నిర్ణయం అవుతుంది, ఎందుకంటే, ఊహించని ప్రమాదాల వలన కలిగే నష్టాలను ఇది తగ్గిస్తుంది మరియు మీ వ్యాపారాన్ని కొనసాగించేలా చేస్తుంది.

వారంటీ యొక్క షరతులు మరియు నిబంధనలు చదవడానికి అనేక గంటల సమయం వెచ్చించిన తరువాత, అది పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది అన్న విషయం నిరాశను కలిగిస్తుంది. ఇకపై వద్దు. బజాజ్ అలియంజ్ ఆన్‌లైన్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్‌తో, తయారీదారు అందించిన వారంటీ కాలాన్ని మీరు 3 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. కేవలం కొన్ని క్లిక్కులతో, మీ పరికరాలను ఎటువంటి ఆందోళన లేకుండా సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు. ఏదైనా నష్టం వాటిల్లితే, మేము వాటి బాధ్యతను స్వీకరిస్తాము!

వినటానికి బాగుంది! కానీ నేను పొడిగించబడిన వారంటీని బజాజ్ అలియంజ్ నుండి ఎందుకు పొందాలి?

ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేసేటప్పుడు, మీరు టాప్ మోస్ట్ బ్రాండ్ నుండి తాజా మోడల్ పొందడానికి గణనీయమైన సమయం మరియు ప్రయత్నాన్ని వెచ్చిస్తారు. ఎందుకు? ఎందుకంటే, మీరు కొనే ఏదైనా ఉపకరణం మన్నికైనది మరియు సమర్థవంతంగా ఉండాలని మీరు ఆశిస్తారు. ప్రోడక్ట్ స్పెసిఫికేషన్లు కాకుండా, మీరు అందించబడే వారంటీ నిబంధనలపై కూడా ఒక కన్ను వేసి ఉంచుతారని మాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే సాధ్యమైనంత కాలం మీ డివైస్‍కు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా సర్వీస్ అందుబాటులో ఉండేలాగా మీరు నిర్ధారించుకోవాలి అనుకుంటారు కాబట్టి. కానీ, ఒక ఆర్థిక సిద్ధాంతం పేర్కొన్నట్లుగా ఒక ఉపకరణాన్ని పనిచేస్తున్న స్థితిలో ఉంచడానికి పట్టే ప్రయత్నం మరియు డబ్బు స్థిరంగా పెరుగుతూ ఉంటుంది.

 బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ తో, ఒక ఉపకరణాన్ని కొనుగోలు చేయడానికి ప్రారంభ ఖర్చులతో పాటు, అన్ని ఇతర రిపెయిర్ మరియు మెయిన్టెనెన్స్ ఖర్చులు భరించబడతాయని మీరు నిర్ధారించుకోవచ్చు, ఉపకరణానికి చివరికి భర్తీ అవసరమైనప్పటికీ. మీకు బెంగ లేకుండా చేస్తూ పొడిగించబడిన సమయం వరకు మీరు వారంటీ కవరేజ్‍ను ఆనందించడం కొనసాగిస్తారు. తయారీదారు అందించిన అసలు వారంటీ గడువు ముగిసిన తర్వాత కూడా బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ మీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల జీవితాన్ని మెరుగుపరుస్తుంది.

బజాజ్ అలియంజ్ నుండి ఒక పొడిగించబడిన వారంటీ ప్లాన్ కొనుగోలు చేయడం అనేది పెట్టుబడిపై వారి రాబడులను గరిష్టంగా పెంచుకోవాలనుకునే నాణ్యత మరియు ఖర్చు గురించిన స్పృహ కలిగిన వినియోగదారుల ప్రత్యేక క్లబ్‌లో మిమ్మల్ని చేర్చుతుంది. మీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను రక్షించడానికి బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు ఒక ఫ్లెక్సిబుల్ మరియు సరసమైన ఎంపిక అనేది ఇక్కడ ఇవ్వబడింది:

  • Minimal Cost కనీస ఖర్చు

     

    మరి, మీరు చేసే ప్రతి కొనుగోలు మీరు ఖర్చు చేసే డబ్బుకు అది అందించే ప్రయోజనాలతో తూచి చూడాలి. ఇందులో ఒక ఉపకరణాన్ని కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చులు మాత్రమే కాక ఒక సహేతుకమైన వ్యవధిలో దానిని నడపడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఉంటుంది. తయారీదారు అందించిన స్టాండర్డ్ వారంటీ కవర్ పై బజాజ్ అలియంజ్ ఆన్‌లైన్ పొడిగించబడిన వారంటీ కవరేజ్‌ను అతి తక్కువ ఖర్చుతో అందిస్తుంది. కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కదిలే భాగాలను కలిగి ఉండవచ్చు, వాటిని హ్యాండిల్ చేయడానికి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అవసరం కావచ్చు. బజాజ్ అలియంజ్ అధీకృత సర్వీస్ సెంటర్లలో స్పెషలిస్ట్స్ ద్వారా మీ ఉపకరణం సర్వీస్ చేయబడుతుందని నిర్ధారిస్తుంది, రికరింగ్ బ్రేక్-డౌన్స్ అవకాశాలను తగ్గిస్తూ, నాణ్యమైన స్పేర్ పార్ట్స్ మాత్రమే ఉపయోగించబడతాయని నిర్ధారిస్తుంది.

  • Flexible Coverage ఫ్లెక్సిబుల్ కవరేజ్

    మా పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ సర్వీస్ మీ అవసరాలకు నిర్దిష్టమైన, అనుకూలంగా చేయబడిన కవరేజ్ అందిస్తుంది. మీరు ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాల వ్యవధి కోసం కవరేజ్ ఎంచుకోవచ్చు, ఇది దీనిని సరసమైనదిగా మరియు సమగ్రమైనదిగా చేస్తుంది. మా రిపెయిర్ మరియు సర్వీస్ నెట్‍వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించబడి ఉంది, ఇది మీకు సాటిలేని ఫ్లెక్సిబిలిటి ఇస్తుంది. 

  • Fast Claims Processing వేగవంతమైన క్లెయిమ్స్ ప్రాసెసింగ్

    బజాజ్ అలియంజ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌లు ఒక వరుసలో అనేక సంవత్సరాలపాటు ICRA ద్వారా సర్టిఫై చేయబడ్డాయి. మీకు క్లెయిమ్స్ సహాయం అవసరమైనప్పుడు, బజాజ్ అలియంజ్ ఒక ప్రత్యేక అనుకూలతను అందిస్తుందని మీరు కనుగొంటారు. మా కస్టమర్ల కోసం, దాని అర్ధం వేగవంతమైన మరియు సమర్థవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్, క్లెయిమ్ యొక్క స్థితి గురించి రెగ్యులర్ అప్డేట్లు మరియు క్లెయిమ్ ఆమోదించబడిన తర్వాత ఫండ్స్ పంపిణీ. 

  • 24*7 Customer Service 24*7 కస్టమర్ సర్వీస్

    మేము మీ కోసం ఇక్కడ ఉన్నాము 24*7, వర్షమైనా ఎండైనా. బజాజ్ అలియంజ్‍తో మీ ప్రశ్నలకు సమాధానం పొందడం చాలా సరళం మరియు సులభం. రిపెయిర్‍లను బుక్ చేయడం, డీలర్ సపోర్ట్ పొందడం మరియు మీకు అవసరమైన పొడిగించబడిన కవరేజ్‍కు సంబంధించిన ఏదైనా ఇతర వాటి గురించి మా ప్రొఫెషనల్స్ బృందం మీకు సహాయపడగలదు. మా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడటానికి పట్టే ఆ కొద్ది నిమిషాల్లో, మీ ఉపకరణం మంచి చేతుల్లో ఉందని మీరు చెప్పుకోదగినంతగా రిలాక్స్ అయి విశ్వసిస్తారు! మా మిలియన్ల మంది కస్టమర్లు అంగీకరిస్తారు. మీరు చేయవలసిందల్లా మా టోల్-ఫ్రీ నంబర్ 1800-209-1021 కు కాల్ చేయడం మరియు ఒక స్మైల్ తో ప్రపంచ స్థాయి సర్వీస్‍ను అనుభవించడం.

  • Free of Cost Home Visit in case of a Claim ఒక క్లెయిమ్ సందర్భంలో ఉచిత ఇంటి సందర్శన

    మీ ఉపకరణం మళ్ళీ నడుస్తూ ఉండటానికి మీకు సహాయపడటానికి మేము మా వంతు చేయాలనుకుంటున్నాము. బజాజ్ అలియంజ్‍తో, ఒక క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత మా నిపుణులు మీ ఇంటిని సందర్శించినప్పుడు ఎటువంటి ఛార్జీలు ఉండవు. క్లెయిమ్ రిజిస్టర్ చేసుకున్న గంటల్లోపు మీరు మీ ఇంటి వద్ద మమ్మల్ని చూస్తారు. ఏమైనాగానీ, సకాలంలో గుర్తించడం అనేది ఒక సమస్యను పరిష్కరించడానికి మొదటి దశ. మేము సమస్యను నిర్ధారణ చేస్తాము, ఉత్తమ చర్యను సూచిస్తాము మరియు ఒక ప్రొఫెషనల్ మరియు పారదర్శకమైన పద్ధతిలో రిపెయిర్ల కోసం ఏర్పాటు చేయడానికి మీకు సహాయపడతాము.  

  • Coverage equal to Invoice Amount ఇన్వాయిస్ మొత్తానికి సమానంగా కవరేజ్

    మంచి బేరం పొందడం ఎల్లప్పుడూ సంతృప్తికరంగా ఉంటుంది! అది మన్నిక మరియు సర్వీస్ పరంగా డబ్బు కోసం మెరుగైన విలువకు హామీ ఇస్తుంది కాబట్టి మీరు ఒక ప్రీమియం ప్రోడక్ట్ పై కొంత అదనంగా ఖర్చు చేయడాన్ని పరిగణించవచ్చు. బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీతో, మీరు ఇన్వాయిస్ మొత్తం వరకు కవరేజ్ పొందుతారు, ఇది మీరు ఇప్పుడే కొనుగోలు చేసిన ఉపకరణం మీకు దీర్ఘకాలంపాటు బాగా సేవ అందిస్తుందనే భరోసాతో మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తుంది. మీరు చేయవలసిందల్లా దాన్ని పూర్తిగా ఉపయోగించగలరని నిర్ధారించుకోవడానికి మాన్యువల్‌ను జాగ్రత్తగా చదవవడం. పనిచేయకపోవడాలు మరియు సాంకేతిక సమస్యల విషయంలో, ఆన్‌లైన్ బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కవర్ చేసి ఉంచుతుంది. దానికి కొన్ని క్లిక్స్ మాత్రమే పడుతుంది!

మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి

పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ క్రింద ఒక క్లెయిమ్ ఫైల్ చేయడం చాలా సులభం మరియు సౌకర్యవంతమైనది. మీరు చేయవలసిందల్లా మా 24*7 టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం, అది 1800-209-1021. ప్రత్యామ్నాయంగా, మీరు ఏ సమయంలోనైనా మాకు ఈమెయిల్ చేయడం ద్వారా ఒక క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు ew.cda@bajajallianz.co.in లేదా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి .


మీ క్లెయిమ్ స్థితిని తెలుసుకోవడానికి  ఇక్కడ క్లిక్ చేయండి.

 

బజాజ్ అలియంజ్ రిపెయిర్ మరియు రిప్లేస్మెంట్ రెండింటిని కలిగి ఉన్న పూర్తి శ్రేణి సర్వీసులను అందిస్తుంది. ఒక క్లెయిమ్ విషయంలో, మా ప్రతినిధి మీ ఇంటిని ఉచితంగా సందర్శించి మీ ప్రోడక్ట్‌ను తనిఖీ చేస్తారు. ఒక అధీకృత సర్వీస్ సెంటర్ వద్ద అది నిజమైన భాగాలతో సర్వీస్ చేయబడడానికి కూడా మేము ఏర్పాటు చేస్తాము. ఒకవేళ మీ ప్రోడక్ట్ రిపెయిర్ చేయబడకపోతే, ఉచితంగా ఒక రిప్లేస్మెంట్ అందించబడుతుంది.

 

ఇంకా ఏమిటి, పనిచేసే స్థితికి మీ ఎలక్ట్రికల్ డివైస్‌ను రిస్టోర్ చేయడం ఇప్పుడు పూర్తిగా క్యాష్‍లెస్! బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ భారతదేశ వ్యాప్తంగా 400 కంటే ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది. మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేదానితో సంబంధం లేకుండా, ప్రొఫెషనల్ సర్వీస్ కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటుంది! బజాజ్ అలియంజ్‍తో ఆన్‌లైన్ పొడిగించబడిన వారంటీ - ఎదురులేని ధరకు సాటిలేని విలువ.

ఒక ప్రశ్న ఉందా? సహాయపడగల కొన్ని సమాధానాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

పొడిగించబడిన వారంటీని ఎవరు కొనుగోలు చేయవచ్చు?

పొడిగించబడిన వారంటీ ప్రోడక్ట్ అనేది తయారీదారు వారంటీ వ్యవధి గడువు ముగిసిన తర్వాత తయారీ లోపాల కారణంగా కలిగిన నష్టం లేదా దెబ్బతినడం కోసం ఇన్సూరెన్స్ రక్షణను పొందాలనుకునే వివిధ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, వంటగది ఉపకరణాలు, ఫర్నిచర్ మరియు ఫిక్స్చర్లు, కెమెరా, ల్యాప్‍టాప్, మొబైల్ మొదలైన పోర్టబుల్ పరికరాల యజమానుల అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. ఇది వారి కస్టమర్లకు పొడిగించబడిన వారంటీ కవర్ అందించాలనుకునే తయారీదారుల ద్వారా కూడా కొనుగోలు చేయబడవచ్చు.

మీరు పొడిగించబడిన వారంటీని ఎప్పుడు కొనుగోలు చేయవచ్చు?

మీరు ఆస్తిని కొనుగోలు చేసిన అదే తేదీన లేదా ఆస్తిపై తయారీదారు వారంటీ గడువు ముగిసే ముందు ఏ సమయంలోనైనా ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు.

మీరు ఆస్తి కొనుగోలు చేసిన తేదీ నుండి 6 నెలల తర్వాత, కానీ తయారీదారు వారంటీ గడువు ముగిసే ముందు, ఈ కవర్ కొనుగోలు చేయాలనుకుంటే, క్రింద ఇవ్వబడిన ప్రకారం ప్రీమియంపై లోడింగ్ వర్తిస్తుంది 

ఆస్తి కొనుగోలు తేదీ నుండి ఇన్సూరెన్స్ కవర్ కొనుగోలులో ఆలస్యం

ప్రీమియం పై

ప్రీమియం

6 నెలల కంటే తక్కువ 0%

0%

6 నెలలు నుండి 1 సంవత్సరం వరకు 4%

4%

1 సంవత్సరం కంటే ఎక్కువ మరియు తయారీదారు వారంటీ కంటే తక్కువ

5%

బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఎందుకు?

బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ మీ ఇన్సూర్ చేయబడిన ఆస్తికి సంబంధించిన ఊహించని రిపెయిర్ పని కోసం ఒక ఫైనాన్షియల్ కవర్ అందించడం ద్వారా మీకు మనశ్శాంతిని అందిస్తుంది. బజాజ్ అలియంజ్ నుండి పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ ను పరిగణించడానికి కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

✓ పార్ట్స్ మరియు లేబర్ పై సమగ్ర కవరేజ్

✓ EW వ్యవధిలో అపరిమిత రిపెయిర్లు, హామీ ఇవ్వబడిన మొత్తానికి లోబడి

✓ ఇబ్బందులు-లేని క్యాష్‍లెస్ సదుపాయం

✓ క్వాలిటీ రిపెయిర్ హామీ

✓ నిజమైన స్పేర్ పార్ట్స్

✓ బహుళ బ్రాండ్ల కోసం కవరేజ్

✓ పెద్ద ఉపకరణాల కోసం ఇంటి వద్ద సర్వీస్

✓ దేశవ్యాప్తంగా సర్వీస్ నెట్‍వర్క్

ప్రధాన మినహాయింపులు ఏమిటి?

కొన్ని ప్రధాన మినహాయింపులలో ఇవి ఉంటాయి:

✓ భౌతిక/ లిక్విడ్/అగ్నిప్రమాదం లేదా ఏదైనా బాహ్య వనరుల కారణంగా ఏదైనా నష్టం

✓ ఇన్సూర్ చేయబడిన ఆస్తి యొక్క వాణిజ్య/అద్దె/లాభం ఉత్పత్తి వినియోగం

✓ మితి మీరిన వినియోగం: ఓవర్‍లోడింగ్, స్ట్రెయిన్, షార్ట్ సర్క్యూట్, మితిమీరి నడపడం, అరుగుదల మరియు తరుగుదల, అసాధారణ ఎలక్ట్రికల్/గ్యాస్/నీటి సరఫరా మొదలైనవి.

✓ పనితనం లేదా మెటీరియల్‌లో పనిచేయకపోవడాలు లేదా లోపాలను కలిగి ఉండని సర్వీస్ కాల్స్

✓ కన్జ్యూమబుల్స్ (ఉదా. ఫిల్టర్లు, బల్బులు, బెల్టులు, బ్యాటరీ, టోనర్, సాఫ్ట్‌వేర్ మొదలైనవి)

✓ తుప్పు పట్టడం, సొట్ట పోవడం, గీతలు పడటం మొదలైనవి.

✓ అనధికారిక రిపెయిర్ మరియు మార్పులు

✓ తయారీదారు వారంటీ క్రింద కవర్ చేయబడని లోపాలు లేదా తప్పులు

✓ ఒక గ్యారెంటీ మరియు/లేదా వారంటీ క్రింద ఇన్సూర్ చేయబడిన ఆస్తి తయారీదారు బాధ్యత వహించే నష్టం లేదా దెబ్బతినడం.

మినహాయింపుల వివరణాత్మక జాబితా కోసం, దయచేసి పాలసీ డాక్యుమెంట్/ప్రాస్పెక్టస్‌ను చూడండి.

మీ ఆస్తి కోసం ప్రీమియం అంచనా ఎలా పొందాలి?

మీ ఆస్తికి చెల్లించవలసిన ప్రీమియం అంచనాను పొందడానికి, మీరు బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీరు షేర్ చేసే సమాచారం ఆధారంగా, మీరు చెల్లించవలసిన ప్రీమియం మొత్తం వివరాలను పొందుతారు.

ఇన్సూర్ చేయబడిన మొత్తం అంటే ఏమిటి?

వివిధ ఆస్తుల కోసం ఇన్సూర్ చేయవలసిన మొత్తం వాటి అసలు కొనుగోలు ధరకు సమానంగా ఉండాలి.

ఏది కవర్ చేయబడుతుంది?

పాలసీ వ్యవధి సమయంలో తయారీ లోపాలు మరియు/లేదా అధీకృత వర్క్ షాప్‍ల సర్వీస్ సిబ్బంది యొక్క సరిగాలేని పనితనం కారణంగా తయారీ లోపాల వలన కలిగే ఒక బ్రేక్‍డౌన్ కారణంగా మీ ఇన్సూర్ చేయబడిన ఆస్తి యొక్క రిపెయిర్ లేదా రిప్లేస్మెంట్ ఖర్చును మేము కవర్ చేస్తాము. ఒక బ్రేక్‌డౌన్ అంటే మేము సూచిస్తున్నది, మీ ఆస్తిని అది ఉద్దేశించబడిన పద్ధతిలో పనిచేయకుండా చేసే ఒక మెకానికల్ మరియు/లేదా ఎలక్ట్రికల్ వైఫల్యం.

ఈ ప్రోడక్ట్ కోసం ఎంచుకునే సమయంలో ఏ డాక్యుమెంట్లు అవసరం?

మీరు పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు మీకు ప్రోడక్ట్/సేల్ ఇన్వాయిస్ అవసరం. 

క్లెయిమ్ ప్రాసెస్ ఏమై ఉంటుంది?

పొడిగించబడిన వారంటీ క్లెయిముల పై ఏదైనా సహాయం కోసం, దయచేసి 1800-209-1021కు కాల్ చేయండి లేదా ew.cda@bajajallianz.co.inకు మాకు మెయిల్ చేయండి

మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి లేదా మీ క్లెయిమ్ స్థితిని చెక్ చేసుకోవడానికి మీరు క్రింది లింకులను కూడా ఉపయోగించవచ్చు:

ఒక క్లెయిమ్ రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

క్లెయిమ్ స్థితిని చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

చాలా బాగుంది! మీరు కవర్ చేసే విషయాలు ఏమిటి?

  • చేర్పులు

  • మినహాయింపులు

తయారీ లోపాల పై సమగ్ర కవరేజ్

మీరు మీ ఉపకరణం ఇంటికి తీసుకువచ్చిన సమయం నుండి 3 సంవత్సరాల వరకు తయారీ లోపాల కోసం సమగ్ర కవరేజ్

మరింత చదవండి

మీరు మీ ఉపకరణం ఇంటికి తీసుకువచ్చిన సమయం నుండి 3 సంవత్సరాల వరకు తయారీ లోపాల కోసం సమగ్ర కవరేజ్

అదే బ్రాండ్ నుండి క్వాలిటీ ఉపకరణాలను ఉపయోగించడం మరియు సదరు ఉపకరణానికి అనుకూలంగా ఉండే ఆమోదించబడిన ఎలక్ట్రికల్ అవుట్‍లెట్లు మరియు ఫిట్టింగులను ఉపయోగించడం వంటి కొన్ని నిర్దిష్ట విషయాలు చర్చించతగనివి; అయితే పదే పదే పవర్ అంతరాయాలు లేదా వోల్టేజ్ హెచ్చుతగ్గులు వంటి ఊహించని దుర్ఘటనలు కొంతకాలం తర్వాత మీ డివైస్ యొక్క పనితీరును ప్రభావితం చేయగలవు మరియు మేము వాటికి కవర్ అందిస్తాము.  

అసలైన స్పేర్ పార్ట్స్ మరియు క్వాలిటీ సర్వీసింగ్

దేశవ్యాప్తంగా విస్తరించబడిన మా విస్తృత సర్వీస్ నెట్‍వర్క్ భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది

మరింత చదవండి

అసలైన స్పేర్ పార్ట్స్ మరియు క్వాలిటీ సర్వీసింగ్

దేశవ్యాప్తంగా విస్తరించబడిన మా విస్తృత సర్వీస్ నెట్‍వర్క్ అసలైన, హై క్వాలిటీ రిప్లేస్మెంట్ పార్ట్స్ ఉపయోగించడం విషయంలో భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

ఊహించని మెటీరియల్ లేదా తక్కువ పనితనం సంబంధిత లోపాలు కనుగొనబడితే, పాలసీ యొక్క నిబంధనలలో డివైస్‌ను ఉచితంగా రిప్లేస్ చేయిస్తాము.

డబ్బు ఖర్చుల కోసం విలువకు విస్తృత కవరేజ్

మీరు పొందే ప్రయోజనాల ఖర్చును సరిపోల్చినప్పుడు, ఆన్‍లైన్ బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఎందుకు ఒక స్పష్టమైన విజేతగా నిలుస్తుందో మీరు చూడవచ్చు

మరింత చదవండి

డబ్బు ఖర్చుల కోసం విలువకు విస్తృత కవరేజ్

మీరు పొందే ప్రయోజనాల ఖర్చును సరిపోల్చినప్పుడు, ఆన్‍లైన్ బజాజ్ అలియంజ్ పొడిగించబడిన వారంటీ ఎందుకు ఒక స్పష్టమైన విజేతగా నిలుస్తుందో మీరు చూడవచ్చు.

తయారీదారులు లేదా డీలర్ల ద్వారా అందించబడే వార్షిక మెయిన్టెనెన్స్ కాంట్రాక్ట్ తో పోలిస్తే, మేము మీ ఉపకరణాలకు ఎంతో విస్తృత కవరేజ్ అందిస్తాము అది కూడా చాలా తక్కువ ఖర్చుతో. 

కొనుగోలు యొక్క ఫ్లెక్సిబిలిటి

కొనుగోలు సమయంలో పొడిగించబడిన వారంటీని కొనుగోలు చేయలేదా? మరీ ఆలస్యం అయిపోలేదు. ఇన్వాయిస్ తేదీ నుండి 180 రోజుల్లోపు మీ కవర్ కొనుగోలు చేసే ఫ్లెక్సిబిలిటిని మేము మీకు అందిస్తాము. 

1 ఆఫ్ 1

అసమంజసమైన వినియోగం

పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తింపజేయబడేందుకు, మీరు యూజర్ మాన్యువల్‌లో సూచనలను అనుసరించాలి. ఆమోదించబడిన యాక్సెసరీలు, 

మరింత చదవండి

అసమంజసమైన వినియోగం

పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తింపజేయబడేందుకు, మీరు యూజర్ మాన్యువల్‌లో సూచనలను అనుసరించాలి. గ్యాడ్జెట్ యొక్క సురక్షితమైన మరియు విశ్వసనీయమైన పనితీరుకు వీలు కల్పించడం కోసం ఆమోదించబడిన యాక్సెసరీలు, అనుకూలమైన ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, తగినంత వెంటిలేషన్ మరియు సపోర్టింగ్ స్టాండ్స్ ఉపయోగించవలసి ఉంటుంది.

సహేతుకమైన జాగ్రత్తలు లోపించిన సందర్భంలో, మేము బాధపడతాము కానీ మేము మీ క్లెయిములను గౌరవించలేకపోవచ్చు. 

ఓవర్‌ల్యాపింగ్ కవరేజ్

వేరేవాటితో పోలిస్తే మీ ఉపకరణం యొక్క కొన్ని భాగాలు పొడిగించబడిన తయారీదారు వారంటీని ఆనందించవచ్చు. ఉదాహరణకు, కంప్రెసర్ 

మరింత చదవండి

ఓవర్‌ల్యాపింగ్ కవరేజ్

వేరేవాటితో పోలిస్తే మీ ఉపకరణం యొక్క కొన్ని భాగాలు పొడిగించబడిన తయారీదారు వారంటీని ఆనందించవచ్చు. ఉదాహరణకు, మీ రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ సాధారణంగా మరింత ఎక్కువ వారంటీ వ్యవధిని కలిగి ఉంటుంది. పొడిగించబడిన తయారీదారు వారంటీ కింద ఉన్న అటువంటి భాగాలు మా ద్వారా కవర్ చేయబడవు.

బాహ్య సంఘటనలు

మేము సాంకేతిక లోపాలను మాత్రమే కవర్ చేస్తాము. దొంగతనం, విస్ఫోటనం, అగ్నిప్రమాదం, నీరు కారడం, భగవంతుని చర్యలు మొదలైన వాటి కారణంగా మీ వంటగది ఉపకరణం లేదా వినియోగదారు పరికరం దెబ్బతిని ఉన్నట్లయితే, మేము మా సానుభూతిని మాత్రమే అందించగలము.

మితిమీరిన ఉపయోగం

వస్తువు యొక్క మితిమీరిన వినియోగం కారణంగా అది సరిగ్గా పనిచేయకపోతే, పొడిగించబడిన వారంటీ వర్తించదు. ఉదాహరణల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఓవర్‍లోడ్ మొదలైనవి ఉంటాయి, వీటి వలన అరుగుదల మరియు తరుగుదల వేగంగా ఉంటుంది.

యాజమాన్యం మార్పు

ఇన్సూర్ చేయబడిన ప్రోడక్ట్ మరొక పార్టీకి విక్రయించబడినా లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడినా, పొడిగించబడిన వారంటీ నిబంధనల ప్రకారం, కవరేజ్ వర్తించదు.

1 ఆఫ్ 1

పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

మీ గత పాలసీ ఇంకా గడువు ముగియలేదా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు : బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి