రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీ

Marine insurance in india

మెరైన్ ఇన్సూరెన్స్

మీకు ఇష్టమైన ఫుట్‌బాల్ క్లబ్‌‌‌ల నుండి బ్రాండెడ్ సరుకులను ఆర్డర్ చేయడం అనేది మీలో ఉన్న అభిమానికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆర్డర్ వలన మ్యానుఫ్యాక్చరర్స్, లాజిస్టిక్స్ ఏజెన్సీలు మరియు ఇన్సూరెన్స్ కంపెనీల విస్తృతమైన నెట్‌వర్క్‌‌లో అనేక సంఘటనలు జరుగుతాయి. ఇన్సూరెన్స్‌కి ఇ-కామర్స్‌తో సంబంధం ఏమిటి అని మీరు అడగవచ్చు? మెరైన్ ఇన్సూరెన్స్ బిలియన్ డాలర్ల విలువైన వస్తువులకు బాధ్యత వహిస్తుంది- వస్తువులు ఉత్పత్తి చేసిన కర్మాగారాన్ని విడిచిపెట్టిన క్షణం నుండి చివరకు అవి కొనుగోలుదారుడి గిడ్డంగికి వచ్చే వరకు.

అంతర్జాతీయ పైరసీ, రోడ్డు యాక్సిడెంట్లు, మానవ తప్పిదం కారణంగా మర్చంట్ ట్యాంకర్ల ఢీకొట్టుకోవడం మరియు సరుకును లోడ్ చేసేటప్పుడు లేదా అన్‌లోడ్ చేసేటప్పుడు స్టాక్‌కు నష్టం కలిగించే ప్రమాదాలు చాలా సాధారణంగా జరుగుతుంటాయి.

మెరైన్ ఇన్సూరెన్స్ అనేది సరుకులు మీ ఫ్యాక్టరీ లేదా గిడ్డంగిని విడిచిపెట్టిన వెంటనే అవి రోడ్డు, సముద్రం లేదా ఆకాశ మార్గం గూండా వాటి గమ్యస్థానాన్ని చేరుకునే వరకు వాటికి రక్షణను అందిస్తుంది.

ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలలో వ్యాపారాలు, సంస్థలు ప్రమాదాల తీవ్రతను తగ్గిస్తూ, వాటి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లలో విస్తారతను పెంపొందించడానికి మెరైన్ ఇన్సూరెన్స్ అవసరం.

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కోసం, ముడి చమురు మరియు విలువైన వస్తువుల దిగుమతులు అనేవి, విస్తారమైన సముద్ర మార్గాలను దాటుకొని నిరంతరాయంగా జరిగే సరుకుల రవాణా పై ఆధారపడి ఉంటుంది. ఉత్పాదక లాభాల వైపు ప్రభుత్వం మొగ్గుచూపడంతో, ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి మార్కెట్ చేరుకోవడం మరియు దానిలో చొచ్చుకుపోవడం పరంగా వైవిధ్యీకరణ అవసరం.

వివిధ రంగాలలోని భారతీయ కంపెనీలకు బజాజ్ అలియంజ్ మెరైన్ ఇన్సూరెన్స్ పరిష్కారాలను అందిస్తుంది. సముద్రంలో జరిగే ప్రమాదాల నుండి పరిశ్రమను పరిపుష్టి చేయడం ద్వారా, మేము కంపెనీలకు మరియు వారి పెట్టుబడిదారులకు కొత్త లక్ష్యాలను నిర్దేశించడానికి మరియు సాధించడానికి గొప్ప విశ్వాసాన్ని అందిస్తున్నాము.

మెరైన్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమైనది?

రవాణాలో ఉన్నప్పుడు మీ వస్తువులు లేదా ఆస్తులకు ప్రమాదం లేదా నష్టం జరిగితే మెరైన్ ఇన్సూరెన్స్ ఆ నష్టం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది.

ఒక ఫ్లీట్ ఓనర్‌గా, మీరు మీ ఓడలకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) ట్రాన్స్‌పాండర్లు, GPS నావిగేషన్ రిసీవర్లు, ఎకో సౌండర్‌లు మరియు వాతావరణ రాడార్‌లను అమర్చి ఉంటారు; అయితే, పెరుగుతున్న వాణిజ్య పరిమాణాల కారణంగా సముద్ర మార్గాలు బిజీగా మారుతున్నాయి, పరిశ్రమల అంచనా ప్రకారం, దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఇటీవలి కాలంలో నాలుగు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు.

ఒక ఆయిల్ స్పిల్ వంటి సముద్ర విపత్తు విషయంలో, మీరు వివాదాలు మరియు జరిమానాలను ఎదుర్కోవచ్చు, దీని ఖర్చులు చాలా అధికంగా ఉండవచ్చు. చట్టపరమైన ఖర్చులు వ్యాపార ఖర్చులలో ఒక భాగంగా పరిగణించబడుతున్నప్పటికీ, అవి మీ కంపెనీ బాటమ్ లైన్‌పై ప్రభావం చూపుతాయి. మెరైన్ ఇన్సూరెన్స్ నష్టాలను నిర్వహించడానికి మరియు మీ వ్యాపారం యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఒక సమగ్ర మెరైన్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీ వాణిజ్య నౌకల సముదాయం ఎటువంటి భయం లేకుండా కార్యకలాపాలను నిర్వహించగలదు. ఇది కోట్ల రూపాయల విలువచేసే సరుకు దెబ్బతినడం లేదా నష్టపోవడం వల్ల కలిగే పరిణామాలను నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఉదాహరణకు, మీ నౌక ఒడ్డుకు కొట్టుకొని వస్తే లేదా దేనినైనా ఢీకొన్నట్లయితే దానిని తోయడానికి, రిపేరింగ్ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీ, అటువంటి నష్టాలను జాగ్రత్తగా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది.

అదనంగా, వాణిజ్య నౌకలు నిర్వహణ అధికంగా ఉన్నందున, స్పేర్స్ లేదా కన్జ్యూమబుల్స్ లేకపోవడం వల్ల అవి ఎక్కువ కాలం అందుబాటులో ఉండకపోవచ్చు, ఇది వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది మరియు లాభదాయకతపై పర్యవసాన ప్రభావం చూపుతుంది.

మహా సముద్రాలలో సముద్రపు దొంగలు ఓడను హైజాక్ చేసే ప్రమాదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. హైజాక్ చేయబడిన వాణిజ్య నౌకలను విడిపించడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు మరియు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే అది నష్టం లేదా ప్రమాదానికి దారి తీయవచ్చు. మెరైన్ ఇన్సూరెన్స్‌తో, అటువంటి అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి మీరు ఒక స్థాయిలో సన్నద్ధం అవ్వచ్చు.

 సంభావ్య ప్రమాదాలను తగ్గించడానికి మరియు కంపెనీ వాల్యూ చైన్ కొనసాగింపును నిర్ధారించడానికి మెరైన్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి చాలా అవసరం.

మెరైన్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడం మీ వ్యాపార కార్యాచరణను సులభతరం చేయగలదు అనేది ఎందుకో ఇక్కడ ఇవ్వబడింది:               

ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కార్గో

    ఖరీదైన, ప్రాజెక్ట్ - క్రిటికల్ పరికరాలను షిప్పింగ్ చేయడం అధిక రిస్కుతో కూడుకున్న పని, ఎందుకంటే అటువంటి సరుకుల రవాణాలో అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. బజాజ్ అలియంజ్‌‌లో, మా వద్ద అత్యంత నైపుణ్యం కలిగిన ప్రాజెక్ట్ కార్గో అండర్‌రైటర్స్, మెరైన్ రిస్క్ కన్సల్టెంట్స్ బృందం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది, మేము అతి పెద్ద రిస్కులను కూడా నిర్వహించగలము.

    మా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కార్గో ఇన్సూరెన్స్, మీ వ్యాపారానికి సంబంధించిన నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి మరియు అన్ని రకాల నష్టాలను సృజనాత్మకంగా నిర్వహించడానికి రూపొందించబడింది.

    మేము భారీ సివిల్, ప్రొడక్షన్ మరియు మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టులు వంటి పెద్ద విభాగాలకు చెందిన సరకు రవాణాలో ఏర్పడే నష్టాలను కవర్ చేస్తాము మరియు క్లిష్టమైన పరికరాలు ఆలస్యంగా లేదా అసలు రాకపోవడం వల్ల ఆదాయం లేదా లాభాన్ని కోల్పోకుండా వాటికి అడ్వాన్స్‌డ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ (ALOP) కవరేజీని అందిస్తాము.

మెరైన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్

సముద్రంలో జరిగే నష్టాల కారణంగా వాణిజ్య సరుకులు తమ గమ్యస్థానానికి చేరుకోనప్పుడు వ్యాపారం చేయడానికి అయ్యే ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మీకు మెరైన్ ఇన్సూరెన్స్ సరిగ్గా ఉపయోగపడాలి అనుకుంటే, బజాజ్ అలియంజ్ ఆ పనిని సక్రమంగా చేస్తుంది.

ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మెరైన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ని ఎలా మొదలుపెట్టవచ్చు అనేది ఇక్కడ ఇవ్వబడింది

దశ 1

మా మెరైన్ ఇన్సూరెన్స్ పేజీని సందర్శించండి మరియు 'క్లెయిమ్ రిజిస్టర్ చేయండి' పై క్లిక్ చేయండి.

దశ 2

తెరవబడే కొత్త పేజీలో, 'క్లెయిమ్ రిజిస్ట్రేషన్' ఎంచుకోండి. పాలసీ నంబర్, ఇమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వంటి ఇతర వివరాలను పూరించండి మరియు కొనసాగండి పై క్లిక్ చేయండి.

దశ 3

ఆ తరువాతి పేజీలో ఇతర సంబంధిత వివరాలను పూరించండి మరియు క్లెయిమ్ బటన్ పై క్లిక్ చేయండి. క్లెయిమ్‌ను ధృవీకరించడానికి మీరు ఒరిజినల్ ఇన్‌వాయిస్ వంటి కొన్ని పత్రాలను అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది.

అభినందనలు! మీరు మీ మొదటి క్లెయిమ్‌ను విజయవంతంగా ఫైల్ చేసారు!

 

కమర్షియల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి

ఇప్పుడు, మీరు ఒక క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు, క్లెయిమ్ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు, ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లను చూడవచ్చు మరియు అప్‌లోడ్ చేయవచ్చు ఇక్కడ క్లిక్ చేయండి.

కమర్షియల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి