రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 Whatsapp Logo చాట్ సర్వీసెస్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కారు ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ ఆన్‌లైన్

మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి వేగవంతమైన, అవాంతరాలు లేని మరియు సౌకర్యవంతమైన మార్గం

దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన క్యాప్చాను ఎంటర్ చేయండి
ప్రీమియం వివరాలను చూడండి

Dumy popup

కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ అర్థం వివరించబడింది

నిజానికి! కారు కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు, వాస్తవంగా అది ఒక అద్భుతం. మీరు స్వయంగా కారును సొంతం చేసుకోవడం, దానిని డ్రైవ్ చేయడం వలన కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేము. ఒక కారు ఇన్సూరెన్స్ ద్వారా మీరు మీ కారుని ప్రమాదాల నుండి రక్షించడానికి మరియు దాని దొంగతనం లేదా ప్రమాదం కారణంగా తలెత్తే ఆర్థిక సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సకల ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రతి సంవత్సరం పాలసీని రెన్యూ చేయడం అనేది మీరు సురక్షితంగా ఉన్నారని నిర్ధారిస్తుంది.
...కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ అనేది మీ పాలసీ అమలులో ఉందని నిర్ధారించడానికి, ప్రీమియం చెల్లించే ప్రక్రియను మరియు దాని ద్వారా మీరు పొందే ప్రయోజనాలను సూచిస్తుంది. కారు ఇన్సూ‌రెన్స్ రెన్యూవల్ కోసం మీరు భౌతికంగా ఇన్సూరర్ శాఖను సందర్శించవలసిన రోజులు పోయాయి. ఇప్పుడు, కేవలం కొన్ని మొబైల్ ఫోన్ ట్యాప్‌ల ద్వారానే అన్ని పూర్తవుతాయి
షాపింగ్ నుండి టిక్కెట్ల బుకింగ్ వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో సాధ్యమైనపుడు, కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ఎందుకు కాదు? భారతదేశంలోని ప్రీమియర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటిగా, మేము, బజాజ్ అలియంజ్ ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సౌకర్యాన్ని అందిస్తున్నాము, ఇందులో మీరు కేవలం కొన్ని క్లిక్‌లతో మీ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు మరియు అవాంతరాలు లేకుండా ఒక ఫెర్రారి కంటే వేగంగా కార్ ఇన్సూరెన్స్‌ని రెన్యూవల్ చేస్తాము!
మరింత చదవండి

తక్కువ చదవండి

బజాజ్ అలియంజ్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్స్

 • కారు ఇన్సూరెన్స్

  నేడే కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోండి మరియు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అందుకోండి. సెలవు రోజులలో కూడా క్లెయిమ్ సపోర్ట్ నుండి SMS అప్‌డేట్లను పొందండి.

  రెన్యూ
 • ప్రైవేట్ కార్ థర్డ్ పార్టీ

  మీ ప్రైవేట్ కారు ఓన్లీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ని రెన్యూ చేసుకొని మిగతా వాటిని థర్డ్-పార్టీ లయబిలిటీల నుండి రక్షణ పొందండి. బజాజ్ అలియంజ్‌ వద్ద వేగవంతం, సౌకర్యవంతం మరియు అవాంతరాలు లేనిది.

  రెన్యూ
 • కారు ఇన్సూరెన్స్

 • ప్రైవేట్ కార్ థర్డ్ పార్టీ

మీ కారు ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా రెన్యూ చేసుకోవాలి

 • 1

  మా వెబ్‌సైట్ www.bajajallianz.comకు లాగిన్ అవ్వండి మరియు 'ఆన్‌లైన్‌లో రెన్యూ చేయండి' ట్యాబ్ పై క్లిక్ చేయండి.

 • 2

  మీ ప్రస్తుత పాలసీ నంబర్ మరియు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను పూరించండి.

 • 3

  ఈ సంవత్సరం కోసం మీరు అర్హత కలిగి ఉన్న నో క్లెయిమ్ బోనస్ శాతాన్ని సమీక్షించండి

 • 4

  మీ కార్ విలువను ఎంచుకోండి.
  మీకు అవసరం అనుకుంటే మీ కారు అదనపు ఫిట్‌మెంట్‌లను ఇన్సూర్ చేయడానికి ఎంచుకోండి.
  వాహన డయాగ్నోస్టిక్స్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి మరిన్ని ప్రయోజనాలను పొందడానికి మీరు మా డ్రైవ్ స్మార్ట్ టెలిమాటిక్స్ సర్వీసులను కూడా ఎంచుకోవచ్చు.
  డ్రైవ్‌స్మార్ట్ టెలిమాటిక్స్ సేవల కోసం మేము మూడు విభిన్న ప్యాకేజీలను అందిస్తున్నాము: క్లాసిక్, ప్రీమియం మరియు ప్రెస్టీజ్. మీ అవసరాలకు సరిపోయే ఒకదానిని ఎంచుకోవడానికి ముందు, మీరు ప్రతి ఒక్కదాని వివరాలను చూడవచ్చు.
  మీ పాలసీని మెరుగుపరచుకోవడానికి మీరు టాప్-అప్ కవర్లను కూడా ఎంచుకోవచ్చు.

 • 5

  మీ పాలసీ, వాహనం మరియు వ్యక్తిగత వివరాలను సమీక్షించండి. మీ చిరునామా లేదా ఫోన్ నంబర్‌ వంటి వ్యక్తిగత వివరాలలో ఏవైనా మార్పులు ఉన్నట్లయితే, మీరు వాటిని అప్‌డేట్ చేసుకోవచ్చు.

 • 6

  మీ ప్రీమియం కోట్ పొందండి మరియు చెల్లింపు చేయండి.
  వ్రూమ్! మీ పని పూర్తి అయింది

బజాజ్ అలియంజ్‌ వద్ద ప్రైవేట్ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి దశలు

 • 1

  మా వెబ్‌సైట్ www.bajajallianz.com లోకి లాగిన్ అవ్వండి మరియు ఎగువ కుడి మూలలోని 'ఆన్‌లైన్‌లో రెన్యూ చేయండి' మెనూపై క్లిక్ చేయండి.

 • 2

  ప్రైవేట్ కార్ థర్డ్ పార్టీ మెనూ కింద 'ఇప్పుడే రెన్యూ చేయండి' ని క్లిక్ చేయండి.

 • 3

  క్లిక్ చేసిన తర్వాత, మీరు పాలసీ వివరాలు మరియు మీ వివరాలను పూరించాల్సిన ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఒకసారి అది పూర్తయిన తర్వాత, మీరు ఒక కోట్‌ని పొందుతారు. ఇది కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం మీరు చెల్లించవలసిన మొత్తం.

 • 4

  అవసరమైన మొత్తాన్ని డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించండి! అంతే, పని అయిపోయింది.
  ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ని ఏ రోజైనా, ఏ సమయంలోనైనా చేయవచ్చు. మీరు మీ ఆఫీస్ లేదా ఇంటి నుండి సౌకర్యవంతంగా దానిని పూర్తి చేయవచ్చు. ఒకసారి అవసరమైన పాలసీ వివరాలు మరియు చెల్లింపును అందుకున్న తర్వాత మేము, మిగతా విషయాలను చూసుకుంటాము. ఇప్పుడే రెన్యూ చేయండి!

Important Considerations For Renewing A Car Insurance Policy

 • మీరు బలంగా మరియు ఆరోగ్యకరంగా ఉండటానికి మీ ఆహారంలో మార్పులు చేసుకున్నట్లుగా, రక్షణ కోసం గడువు ముగియక ముందే మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవడం చాలా అవసరం. అయితే, మీ కార్ ఇన్సూరెన్స్ రెన్యూ చేసేటప్పుడు కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది:
 • ఇన్సూర్ చేయబడిన మొత్తం -'మంచి ఆరంభం ఉంటే పని సగం పూర్తయినట్లే' మరియు సరైన మొత్తంతో లభించిన హామీ భద్రతను పెంచుతుంది. మీ కార్ ఇన్స్యూరెన్స్ రెన్యూ చేస్తున్నప్పుడు, ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని చెక్ చేయండి, దానిని పెంచాలా లేదా అనే మూల్యాంకన చేసుకోండి.
 • ఒక వేళ మీరు ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని పెంచాలని అనుకుంటే, బజాజ్ అలియంజ్‌ వద్ద మేము అటువంటి సౌకర్యాన్ని కల్పిస్తాము. ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం ఎంత ఎక్కువగా ఉంటే, ఆర్ధిక మేలు అంత ఎక్కువగా ఉంటుంది.
 • యాడ్-ఆన్ కవర్‌లు - మీరు సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నప్పుడు దుస్తులతో పాటు వాటర్ బాటిల్స్, స్లీపింగ్ బ్యాగులు మరియు నెక్ ట్యూబ్ వంటి ఇతర అవసరమైన వస్తువులను కూడా వెంట తీసుకువెళతారు. కార్ ఇన్సూరెన్స్ కోసం కూడా ఇదే వర్తిస్తుంది. కార్ ఇన్స్యూరెన్స్ వరకు యాడ్ ఆన్స్ అనేవి అదనపు సౌలభ్యాన్ని అందిస్తాయి.
 • మా కస్టమైజ్ చేయబడిన యాడ్-ఆన్ కవర్‌లు మీ వాహనం దొంగతనానికి గురైనా లేదా ప్రమాదం కారణంగా తలెత్తే అన్ని ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా 360-డిగ్రీ రక్షణను నిర్ధారిస్తాయి. లాక్ మరియు కీ రీప్లేస్‌మెంట్ కవర్, జీరో డిప్రిసియేషన్ కవర్ మరియు వ్యక్తిగత సామాను వంటి మా వద్ద అందుబాటులో ఉన్న అనేక యాడ్-ఆన్‌లతో మీ కారుకు ఒక బలమైన రక్షణను కల్పించండి.
 • గ్యారేజీలతో టై-అప్స్ - అవసరమైనప్పుడల్లా మీరు వెళ్లాల్సిన మీ ఖచ్చితమైన గమ్యస్థానాన్ని తెలుసుకోవడం అనేది మీ ప్రయాణాన్ని చాలా వరకు సులభతరం చేయగలదు. బజాజ్ అలియంజ్‌ వద్ద మేము దానిని అందిస్తాము. భారతదేశం వ్యాప్తంగా 4,000 గ్యారేజీలతో ఉన్న మా టై-అప్‌లు, అత్యవసర పరిస్థితులలో మీకు సమీపంలోని ఒకదాన్ని త్వరగా కనుగొనడానికి దోహద పడుతుంది.
 • ఈ గ్యారేజీలు మీ ఇంటి వద్దనే అత్యధిక ప్రమాణాలు కలిగిన సేవలను అందిస్తూ నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ని అందిస్తాయి. మీరు చేయవలసిందల్లా మీ నగరం, పిన్ కోడ్ నమోదు చేయడం. తరువాత మీరు గ్యారేజీల జాబితాను పొందుతారు.
 • క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ - క్రమబద్ధంగా ప్రీమియంలను చెల్లించిన తర్వాత, మీకు ఇబ్బందులు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్ అవసరం, అవునా కాదా? అగ్రశ్రేణి సేవలను అందించే మా నిబద్ధతకు అనుగుణంగా ఉంటూ, మా వినియోగదారులు చూపించే ఉన్నతమైన ఆసక్తికి ప్రాధాన్యతను కల్పిస్తూ, మేము సమర్థవంతమైన మరియు అవాంతరాలు లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్ అందిస్తున్నాము.
 • త్వరిత టర్న్ అరౌండ్ టైమ్‌తో (TAT) పాటు మేము అందించే అత్యంత నాణ్యమైన సేవలు జాతీయ, అంతర్జాతీయ పరంగా జరిగే ఈవెంట్లలో అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకోవడంలో మాకు సహాయపడ్డాయి. మా కస్టమర్ ప్రాధాన్య సేవల వలన, భారతదేశంలో మేము అత్యంత విశ్వసనీయమైన మరియు అత్యధికులు కోరుకునే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటిగా మేము నిలిచాము.
 • నో క్లెయిమ్ బోనస్ - మీరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినా మరియు కారు పట్ల అత్యంత శ్రద్ధ వహించినా వాటికి బహుమతిని పొందకూడదా? సాధారణంగా NCBగా పేర్కొనబడే నో క్లెయిమ్ బోనస్ మీకు ఆ బహుమతిని అందిస్తుంది. ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి గాను, మీరు బోనస్ రూపంలో తగ్గించబడిన ప్రీమియంలను లేదా ఇన్సూరెన్స్ చేసిన మొత్తంలో వృద్ధిని పొందుతారు.
 • బజాజ్ అలియంజ్‌ వద్ద మీరు నో క్లెయిమ్ బోనస్‌ను పొందడం మాత్రమే కాకుండా, మా వద్ద కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకుంటే, మీకు మరొక ఇన్సూరర్ అందించే ప్రస్తుత నో క్లెయిమ్ బోనస్‌లో 50% బదిలీ చేసుకోవచ్చు.
 • అందించబడే కవరేజీలు - పశ్చాత్తాపం పడటం కన్నా సురక్షితంగా ఉండటం మంచిది. కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్స్ అనేవి వార్షిక కాంట్రాక్టులు, కావున పాలసీ కవరేజ్‌లో మీ ఇన్సూరర్ కొన్ని మార్పులు చేసి ఉండవచ్చు. మీరు మా వద్ద కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకుంటే, మీకు వీటిపై కవరేజ్ అందించబడుతుంది:
 • ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టాలు - అగ్నిప్రమాదం, విస్ఫో టనం, భూకంపం, తుఫాను, కొండచరియలు విరిగిపడడం మరియు గాలివానల కారణంగా జరిగిన నష్టాలకు మేము కవరేజ్ అందిస్తాము.
 • మానవుల వలన కలిగిన విపత్తుల కారణంగా జరిగిన నష్టాలు - దొంగతనం, అల్లర్లు, దోపిడీ, తీవ్రవాద కార్యకలాపాలు లేదా రవాణాలో జరిగిన నష్టాలకు మేము మీకు పరిహారం అందిస్తాము.
 • థర్డ్ పార్టీ లీగల్ లయబిలిటీ - ప్రమాదవశాత్తు మీ వాహనం కారణంగా శాశ్వత గాయం లేదా మరణం వంటి థర్డ్ పార్టీ లయబిలిటీల వలన జరిగిన నష్టాల నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక సమస్యల నుండి మేము మిమ్మల్ని రక్షిస్తాము.
 • బజాజ్ అలియంజ్ వద్ద నేడే మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోండి మరియు అనేక ప్రయోజనాలను పొందండి.
 • ఇప్పుడే ఒక కోట్‌ని పొందండి!

బజాజ్ అలియంజ్‌తో కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రయోజనాలు

భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటిగా, మీ సౌలభ్యమే మా లక్ష్యం. మీరు మా వద్ద కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసినపుడు మీరు ఇవి పొందుతారు:

 • 24x7 కాల్ అసిస్టెన్స్

  మీరు రహదారిపై ఉన్నా లేదా లేకపోయినా, అత్యంత విశ్వసనీయ సహచరునిగా ఎల్లప్పుడూ మేము మీకు తోడుగా ఉంటాము. సెలవు దినాలలో కూడా మీరు ఏ సమయంలోనైనా మాకు 24x7 కాల్ చేయవచ్చు. క్లెయిమ్స్ సపోర్ట్ కోసం మేము మీకు తక్షణ SMS అప్‌డేట్లను కూడా అందిస్తాము. క్లెయిమ్స్ సపోర్ట్ అందుకోవడానికి Y నుండి X కి SMS చేయండి ఏదైనా సహాయం కోసం మాకు 1800-209-5858 పై కాల్ చేయండి.

 • మరొక కార్ ఇన్సూరర్ నుండి 50% నో క్లెయిమ్స్ బోనస్ ట్రాన్స్ఫర్

  మీరు ప్రీమియంలను శ్రద్ధగా చెల్లించినప్పుడు, ఒక వేళ ఇన్సూరర్లను మారిస్తే, క్లెయిమ్ చేయని ప్రతి సంవత్సరంలో అందుకున్న నో క్లెయిమ్ బోనస్‌లను ఎందుకు వదులుకోవాలి? తక్కువ ఖర్చుతో కూడుకున్న కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలతో పాటు, మీరు మా వద్ద మీ కార్ ఇన్సూ రెన్స్ పాలసీని రెన్యూ చేసినప్పుడు, మీ మునుపటి ఇన్సూరర్ నుండి అందుకున్న నో క్లెయిమ్స్ బోనస్‌లో 50% ట్రాన్స్ఫర్‌ని మేము అనుమతిస్తాము. ఇది ఎటువంటి అదనపు ప్రీమియం లేకుండా ఇన్సూర్ చేయబడిన మొత్తాన్నిపెంచగలదు లేదా ప్రీమియం మొత్తాన్ని తగ్గించగలదు. అందువల్ల, మీ వాహనం పట్ల బాధ్యత వహించినందుకు గాను సంపాదించిన నో క్లెయిమ్స్ బోనస్ మీరు కోల్పోవడం లేదని మేము నిర్ధారిస్తున్నాము.

 • నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్

  మీరు మీ హెల్త్ ఇన్సూరర్ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో ఎలాగైతే నగదురహిత చికిత్స పొందుతారో, అదే విధంగా మేము బజాజ్ అలియంజ్‌లో, దేశవ్యాప్తంగా 4,000కు పైగా ఉన్నా గ్యారేజీలలో మీకు ఇష్టమైన దానిలో నగదురహిత సెటిల్‌మెంట్ సౌకర్యాన్ని మీకు అందిస్తున్నాము. కాబట్టి, మీరు ఇష్టపడే గ్యారేజీకి మీ కార్‌ని తీసుకెళ్లడం ఇప్పుడు సులభంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. సమీప గ్యారేజీని కనుగొనడానికి పిన్ కోడ్ మరియు నగరం పేరును నమోదు చేయండి. ఒక క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత, మేము దానిని X గంటల్లో సెటిల్ చేస్తాము.

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

  కష్టసుఖాల్లో మీ పక్కన ఉండే ఉత్తమ స్నేహితుడి వలే, మేము 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ అందిస్తాము. ఫ్లాట్ టైర్ కోసం సపోర్ట్ చేయడం లేదా కారు బ్యాటరీని జంప్ స్టార్ట్ చేయడం, యాక్సిడెంట్ తరువాత ఎదురయ్యే చట్టపరమైన సమస్యలతో వ్యవహరించడం మొదలైనవాటిలో మీకు సహాయం చేయడానికి మేము ఎల్లపుడూ సిద్ధంగా ఉంటాము. సమయం ఏదైనా సరే, మేము కేవలం ఒక కాల్ దూరంలో ఉన్నాము! రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం మాకు 1800 103 5858 పై కాల్ చేయండి, మేము తక్షణమే మీ వద్ద ఉంటాం.

కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సాధారణ ప్రశ్నలు

నేను నా కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎప్పుడు రెన్యూ చేయాలి?

పాలసీ గడువు ముగియడానికి ముందుగానే మీరు కారు ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయాలి.

ప్రస్తుతం ఉన్న నా కార్ ఇన్సూరెన్స్ పాలసీ పై నాకు గ్రేస్ పీరియడ్ లభిస్తుందా?

అవును. సాధారణంగా, ఇన్సూరర్లు మీ ప్రస్తుత కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి గ్రేస్ పీరియడ్ ఇస్తారు. మీరు ఈ వ్యవధిలో పాలసీని రెన్యూ చేసినపుడు, మీరు నో క్లెయిమ్ బోనస్ పొందుతారు (ఒక వేళ వర్తిస్తే). మేము, బజాజ్ అలియంజ్ వద్ద మీకు X రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తాము.

రెన్యూవల్ చేసిన పాలసీ ప్రీమియం ఏ అంశాల పై ఆధారపడి ఉంటుంది?

రెన్యూవల్ ప్రీమియం మొత్తం అనేది మీ కార్ రకం, దాని వయస్సు, ఇంజిన్ సామర్థ్యం, మోడల్ మరియు క్లెయిమ్స్ చరిత్ర వంటి కొన్ని ముఖ్యమైన అంశాల పై ఆధారపడి ఉంటుంది.

నేను ఆన్‌లైన్‌లో పాలసీని రెన్యూ చేయవచ్చా?

అవును, మీరు చేయవచ్చు. బజాజ్ అలియంజ్ వద్ద కార్ రెన్యూవల్ ప్రాసెస్‌ను ఆన్‌లైన్‌ చేసాము. మా వెబ్‌సైట్ www.bajajallianz.com కు లాగిన్ అవ్వండి మరియు కుడివైపు పై భాగంలో మూలనున్న 'ఆన్‌లైన్‌లో రెన్యూ చేయండి' అనే టాబ్ పై క్లిక్ చేయండి. మీ పాలసీని రెన్యూ చేయడానికి కింద సూచించిన ప్రాసెస్‌ని అనుసరించండి.

పాలసీ రెన్యూవల్ కోసం ఏయే డాక్యుమెంట్లు అవసరం?

సాధారణంగా అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవి:

● మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్

● వయస్సు, పేరు, పుట్టిన తేదీ మొదలైన మీ వివరాలతో కూడిన డాక్యుమెంట్లు.

● డ్రైవింగ్ లైసెన్స్ సమాచారం

● ఇప్పటికే ఉన్న పాలసీ వివరాలు

కార్ ఇన్సూరెన్స్ కోసం అదనపు కవరేజ్ ఆప్షన్లు

మనకి అన్నింటిలో అదనంగా ఏదైనా ఉంటే ఇష్టపడతాము, ఒప్పుకుంటారు కదా? మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి అదనంగా బజాజ్ అలియంజ్ కార్ ఇన్సూరెన్స్ అనేక యాడ్-ఆన్ కవర్‌లను అందిస్తుంది. మా యాడ్-ఆన్ కవర్‌లలో ఇవి ఉంటాయి:

 • లాక్ మరియు కీ రీప్లేస్‌మెంట్ కవర్:

  మీ కారు తాళం చెవులు పోగొట్టుకున్నపుడు, డూప్లికేట్ తాళం చెవులు చేయించడానికి అయ్యే అధిక ఖర్చు గురించి దిగులు చెందారా? ఇకపై వద్దు. మా లాక్ మరియు కీ రీప్లేస్‌మెంట్ కవర్‌తో, మీ వాహనం యొక్క కొత్త తాళాలు మరియు తాళం చెవులను కొనుగోలు చేయడానికి అయిన ఖర్చుల కోసం మేము మీకు పరిహారం ఇస్తాము.

 • యాక్సిడెంట్ షీల్డ్:

  మా యాక్సిడెంట్ షీల్డ్ యాడ్-ఆన్ కవర్‌తో, ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం లేదా మరణం వంటివి సంభవించినప్పుడు ఎదురయ్యే ఆర్థికపరమైన పర్యావసనాల నుండి మిమ్మల్ని మరియు మీ ఇన్సూరెన్స్ చేయబడిన కారులో ఉన్న వారిని కూడా రక్షించుకోండి.

 • కన్జ్యూమబుల్ ఖర్చులు:

  మీరు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకునే పోషకాహారం వలే, మీ వాహనాన్ని సమర్థవంతంగా నడవడానికి అనేక రకాల కన్జ్యూమబుల్స్ అవసరం. సాధారణంగా వినియోగించే కన్జ్యూమబుల్స్ ఇవి- బ్రేక్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, AC గ్యాస్ ఆయిల్ మరియు పవర్ బ్రేక్ ఆయిల్. ప్రమాదం జరిగిన తర్వాత వాటిని మళ్ళీ నింపడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అదే సమయంలో, మీరు అవి లేకుండా వాహనాన్ని నడపలేరు. మా కన్జ్యూమబుల్స్ ఖర్చుల యాడ్-ఆన్ కవర్, ఇలాంటి అన్ని ఖర్చులకు అయ్యే మొత్తాన్ని భరిస్తుంది.

 • కన్వేయన్స్ ప్రయోజనం:

  మీకు ఇష్టమైన కారు లేకుండా ప్రయాణించడం చాలా కష్టం అని మాకు తెలుసు. ప్రమాదవశాత్తు జరిగిన నష్టం వలన మీ కారు, ఇన్సూర్ చేసిన వాహనం వర్క్ షాప్‌లో ఉన్నన్ని రోజులు మా కన్వేయన్స్ బెనిఫిట్ యాడ్-ఆన్ మీకు 'ప్రతి రోజు' నగదు ప్రయోజనాన్ని మీకు అందిస్తుంది. ప్రయోజనం అనేది ఎంచుకున్న ప్లాన్ ప్రకారం ఉంటుంది.

 • పర్సనల్ బ్యాగేజ్:

  వ్యక్తిగత సామాను పోవడం గురించి ఆందోళన చెందారా? ప్రమాదం జరిగిన తరువాత వ్యక్తిగత సామాను కోల్పోవడం చాలా ఆందోళన కలిగిస్తుందని మేము అర్థం చేసుకున్నాము. ఇన్సూర్ చేసిన మీ వాహనంలో ఉంచబడిన వ్యక్తిగత సామానుకు ఏదైనా నష్టం లేదా డ్యామేజ్ జరిగితే మా వ్యక్తిగత బ్యాగేజ్ యాడ్-ఆన్ కవర్ అందుకు నష్టపరిహారం చెల్లిస్తుంది, మీ ఆందోళనలను దూరం చేస్తుంది.

 • జీరో డిప్రిషియేషన్ కవర్:

  కఠినంగా తోచినప్పటికీ, మీరు షోరూమ్ నుండి బయటకు కార్ తీసుకువెళ్లిన మరుక్షణం దాని విలువ తగ్గుతుంటుంది. ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ, మీ ఇన్సూర్ చేయబడిన వాహనం యొక్క విలువ మరింత తగ్గుతుంది. అంటే దీని అర్థం తక్కువ క్లెయిమ్ మొత్తం? నిజంగా కాదు! మా జీరో డిప్రిషియేషన్ కవర్ మీ క్లెయిమ్ పై డిప్రిషియేషన్ లేకుండా, మీరు పూర్తి ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని పొందేలాగా నిర్ధారిస్తుంది. ఈ కవర్ మీ వాహనంపై డిప్రిషియేషన్ ప్రభావాన్ని పడనీయదు మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో మీకు బాధని కలిగించదు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి