రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

యుకె ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

Travel Insurance For the UK

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ కోసం మీ వివరాలను అందించండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

యుకె ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్‌తో కలసి ఏర్పడిన యునైటెడ్ కింగ్డమ్ (యుకె) అనేది యూరోప్ ఖండంలో ఉత్తర-పశ్చిమ తీరంలో ఉంది. చారిత్రాత్మక మరియు సమకాలీన ల్యాండ్‌మార్క్‌లకు నిలయమైన యునైటెడ్ కింగ్‌డమ్‌లో అనేక చిన్న బ్రిటిష్ దీవులు ఉన్నాయి.

మీరు పర్వతారాధకులైననప్పటికీ లేదా చరిత్ర ప్రేమికులైనప్పటికీ, యుకె సందర్శన అనేది మీ ప్రాధాన్య జాబితాలో ఉండాలి. అదనంగా, యుకె ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీ ట్రిప్‌ను సురక్షితం చేసుకోవడం చాలా ముఖ్యం.

యుకె కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది యుకె సందర్శకుల కోసం రూపొందించబడిన ఒక అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది వారికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.

 

భారతదేశం నుండి యుకె వెళ్లడానికి మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

జీవితంలో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులనేవి చక్కగా రూపొందించిన ప్లాన్‌లను కూడా నాశనం చేయగలవు. కాబట్టి, భారతదేశం నుండి యుకె వెళ్లడం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోండి. యుకె వెళ్లడానికి ప్రస్తుత మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీరు యుకెకి వెళ్లే మరియు తిరిగి రావడానికి ముందు, ఆ సమయంలో లేదా ఆ తర్వాత ఎదురయ్యే ఏవైనా ఊహించని సంఘటనలు ఎదుర్కొంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు, ట్రిప్‌కి ముందు లేదా ట్రిప్ సమయంలో మీరు అనారోగ్యానికి గురైతే లేదా మీరు వెళ్లే ఏవైనా విమానాశ్రయాల్లో మీ లగేజీ పోగొట్టుకుంటే, అప్పుడు మీకు ఏర్పడే ఆర్థిక నష్టాలు నివారించడంలో యుకె ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయపడగలదు.

 

కాబట్టి, ఏవైనా ప్రతికూల పరిస్థితుల్లో తమ ట్రిప్ ఆర్థికంగా సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడం కోసం భారతదేశం నుండి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవలసిందిగా యుకె-యేతర పౌరులకు సలహా ఇవ్వడమైనది.

యుకె ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం వలన కలిగే ప్రయోజనాలు

మీరు ఒంటరిగా లేదా కుటుంబంతో, వ్యాపారం కోసం లేదా విశ్రాంతి కోసం ప్రయాణిస్తున్నప్పుడు, ప్రయాణ సంబంధిత ఊహించని ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. బజాజ్ అలియంజ్ అనేక ఫీచర్లు మరియు ప్రయోజనాలతో ఒక సమగ్ర యుకె ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తుంది. మా యుకె ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ సంబంధిత కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 • తక్షణ సహాయం -

  బజాజ్ అలియంజ్ వారి 24-గంటల ఎమర్జెన్సీ అసిస్టెన్స్ బృందం ఒకేఒక మిస్డ్ కాల్‌తో యుకెలో ఎక్కడైనా మీకు సహాయపడగలదు.

 • పాలసీ రకాలు -

  బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో, అన్ని సంఘటనల నుండి మిమ్మల్ని కవర్ చేసే వివిధ యుకె ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల నుండి మీరు ఎంచుకోవచ్చు.

 • ప్రత్యేకంగా రూపొందించబడిన కవరేజీ -

  మీరు బజాజ్ అలియంజ్‌ నుండి పాలసీలు ఎంచుకున్నప్పుడు - ఒక సీనియర్ సిటిజన్ లేదా విద్యార్థి కోసం కస్టమైజ్ చేయబడిన కవరేజీ అందుబాటులో ఉంటుంది.

 • సమర్థవంతమైన క్లెయిమ్‌ల ప్రక్రియ -

  వేగవంతమైన మరియు శీఘ్రమైన క్లెయిమ్ పరిష్కారం అందించే అత్యంత సమర్థవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌లు బజాజ్ అలియంజ్ వద్ద ఉన్నాయి.

 • విస్తృతమైన కవరేజీ -

  యుకె ప్రయాణం కోసం బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వైద్య అత్యవసర పరిస్థితులు, ట్రిప్ రద్దు, వస్తువులు నష్టపోవడం, పాస్‌పోర్ట్‌లు పోగొట్టుకోవడం మరియు మీ ప్రయాణాల సమయంలో ఎదురయ్యే అలాంటి దురదృష్టకర సంఘటనలను కవర్ చేస్తుంది.

మీరు దీని గురించి తెలుసుకోవాలి: యుకె వీసా మరియు ప్రవేశ సమాచారం


మీరు తప్పక తెలుసుకోవాలి. యుకె భారతీయుల కోసం వీసా అనేది కీలకం. మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్లుగానే.


 • స్టాండర్డ్ విజిటర్ వీసా -

  యుకె సందర్శించాలనుకునే భారత పౌరులు ఒక స్టాండర్డ్ విజిటర్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు నెలల వరకు బస కోసం ఇది సరిపోతుంది. క్రింది కారణాల్లో ఒకదాని కోసం ఈ వీసా దరఖాస్తు చేసుకోవచ్చు:

  -పని/పర్యాటకం
  -విద్యా కార్యకలాపాలు
  -వైద్య పరిస్థితులు
  -కుటుంబం మరియు స్నేహితులను సందర్శించడం
  -వివాహం, నిశ్చయతార్థం లేదా పౌర భాగస్వామ్యం ప్రారంభించడం
  -ఒక సుదీర్ఘ కాలవ్యవధిలో భాగస్వామి లేదా కుటుంబంతో కలిసి నివసించడం
  -దౌత్యపరమైన ముఖాముఖీలు
  విద్య లేదా వైద్య చికిత్సలతో సంబంధం కలిగిన ప్రయాణాల కోసం, ఒక ప్రామాణిక సందర్శన వీసాని అదనపు ఖర్చుతో పొడిగించవచ్చు.

 • దీర్ఘకాలిక స్టాండర్డ్ విజిటర్ వీసా -

  యుకెలో పొడిగించబడిన బస కోసం రెండు, ఐదు లేదా 10 సంవత్సరాల కోసం అందుబాటులో ఉన్న దీర్ఘకాలిక ప్రామాణిక సందర్శకుల వీసాలను మీరు పొందవచ్చు. దీర్ఘకాలిక ప్రామాణిక సందర్శకుల వీసా క్రింద అనుమతించబడే ఏదైనా సందర్శన గరిష్ట కాలవ్యవధి ఆరు నెలలుగా ఉంటుంది. ఇప్పటికే పేర్కొన్న వాటికి అదనంగా, క్రింద జాబితా చేయబడిన లాంటి కొన్ని అదనపు రకాల వీసాల కోసం కూడా మీరు దరఖాస్తు చేయవచ్చు:

  -మేరేజ్ విజిటర్ వీసా
  -టైర్ 4 (జనరల్) స్టూడెంట్ వీసా
  -టైర్ 4 (చైల్డ్) స్టూడెంట్ వీసా
  -టైర్ 2 - స్పోర్ట్స్‌పర్సన్ వీసా
  -అనుమతించబడిన పెయిడ్ ఎంగేజ్మెంట్ వీసా
  -పిబిఎస్ డిపెండెంట్ - చైల్డ్ వీసా
  -పిబిఎస్ డిపెండెంట్ - పార్టనర్ వీసా

యుకె వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు దరఖాస్తు ప్రక్రియ

భారతీయులు యుకెని సందర్శించినట్లయితే, ఇక్కడే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భారతీయుల కోసం యుకె వీసా దరఖాస్తు ప్రక్రియలోని దశలు క్రింద జాబితా చేయబడ్డాయి:

 • సరైన విభాగానికి చెందిన యుకె వీసా కోసం దరఖాస్తు చేయండి.

 • ఆన్‌లైన్ వీసా ఫీజు చెల్లింపు.

 • ఈ రోజే వీసా అపాయింట్‌మెంట్ చేయండి.

 • బుక్ చేసిన మీ వీసా అపాయింట్‌మెంట్‌ కోసం అవసరమైన పేపర్‌వర్క్‌ను సిద్ధంగా ఉంచుకోండి.

 

భారతదేశం నుండి యుకెకి ప్రయాణించే సమయంలో, అవసరమయ్యే ప్రయాణ డాక్యుమెంట్లు ఏమిటి?

 

మీరు మీ యుకె వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌కి హాజరైనప్పుడు, క్రింది డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి:

 

 • వీసా కోసం అపాయింట్‌మెంట్ నిర్ధారణ.
 • వీసా అప్లికేషన్ ఫీజు చెల్లింపు రసీదు.
 • చెల్లుబాటు అయ్యే ప్రయాణ డాక్యుమెంట్లు (అందుబాటులో ఉంటే).
 • ఒక పాస్‌పోర్ట్-సైజు ఫోటో.
 • సరిగ్గా సంతకం చేసిన వీసా అపాయింట్‌మెంట్ ఫారం ప్రింట్అవుట్.
 • సరిగ్గా సంతకం చేసిన స్వీయ-మదింపు ఫారం.    
 • అవసరమైతే, ప్రతి వీసా కేటగిరీ కోసం నిర్దిష్టమైన ఇతర డాక్యుమెంట్లు. నిర్ధారించుకోండి మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం మీ ట్రిప్‌కి ముందు సరైన సమయానికి.

యుకెకి ప్రయాణించే సమయంలో చేపట్టాల్సిన భద్రత మరియు జాగ్రత్త చర్యలు


 • మీ పాస్‌పోర్ట్‌ను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోండి.
 • ప్రైవేట్ డ్రైవర్‌ను ఎంచుకోవడానికి బదులుగా అధికారిక వాణిజ్య రవాణా సౌకర్యం ఉపయోగించండి.
 • దేశం యొక్క నియమాలు మరియు చట్టాలను పరిశీలించండి.
 • ముఖ్యంగా రాత్రివేళల్లో, నిర్మాణుష్య లేదా అపరిచిత ప్రదేశాలకు వెళ్లకండి.
 • ఏ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనవద్దు.
 • దురదృష్టకర సంఘటనల నుండి మీ ఫైనాన్సులను రక్షించు కోవడం కోసం యుకె ప్రయాణం కోసం అత్యుత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఎంచుకోండి.

 

కోవిడ్-19 నిర్దిష్ట మార్గదర్శకాలు:

 

 • ప్రత్యేకించి, ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించే సమయంలో, మీ నోరు మరియు ముక్కు కప్పి ఉండేలా మాస్క్ ధరించండి.
 • భౌతిక దూరం పాటించండి.
 • కోవిడ్-19 సిఫార్సులు అనుసరించండి మరియు స్థానిక ప్రభుత్వం మరియు నియమిత అధికారులతో సహకరించండి.
 • మీకు కోవిడ్-19 లక్షణాలు ఉంటే, మీరు ఏకాంతంలో ఉండడంతో పాటు పరీక్ష చేయించుకోండి. ఆ తర్వాత, ఆ ప్రక్రియను పునరావృతం చేయండి.

యుకె కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఒక సాధారణ ప్రాసెస్‌తో ఆన్‌లైన్‌లో సులభంగా పొందవచ్చు.

తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం: యుకెలో భారతదేశపు ఎంబసీ


మీకు ప్రయాణంలో ఎప్పుడైనా సహాయం అవసరమైతే లేదా ఆన్‌లైన్ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్.

హై కమిషన్ ఆఫ్ ఇండియా, ఇండియా హౌస్, ఆల్డ్విచ్, లండన్, WC2B 4NA, యునైటెడ్ కింగ్‌డమ్

 

హై కమిషన్ సంప్రదింపు వివరాలు:

 

వెబ్‌సైట్: హై కమిషన్ ఆఫ్ ఇండియా, లండన్, యునైటెడ్ కింగ్‌డమ్
ఇమెయిల్: inf.london@mea.gov.in; info.london@mea.gov.in
టెలిఫోన్ నంబర్: 00-44 (0) 020 - 78369147
ఫ్యాక్స్ నంబర్: 020 - 78364331
పని గంటలు: సోమవారం నుండి శుక్రవారం వరకు, 10 AM నుండి 5 PM GMT వరకు

 

 

యుకెలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏమిటి?

 

 • హీత్రూ ఎయిర్‌పోర్ట్, లండన్ (ఎల్‌హెచ్‌ఆర్)
 • మాంచెస్టర్ విమానాశ్రయం, మాంచెస్టర్
 • గ్లాస్గో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, గ్లాస్గో
 • గాట్విక్ విమానాశ్రయం, లండన్ (ఎల్‌జిడబ్ల్యూ)
 • ఎడిన్‌బర్గ్ విమానాశ్రయం, ఎడిన్‌బర్గ్

యుకెకి ప్రయాణించే సమయంలో తీసుకెళ్లడానికి కరెన్సీ మరియు ఫారిన్ ఎక్ఛేంజ్


కొన్ని సమయాల్లో పౌండ్, స్టెర్లింగ్ లేదా క్వీడ్‌గా పిలవబడే పౌండ్ స్టెర్లింగ్ (£) అనేది యునైటెడ్ కింగ్‌డమ్‌కి అధికారిక కరెన్సీగా ఉంటోంది. యుకెకి బయలుదేరే ముందు, పైన పేర్కొన్న నగదు మీ చేతిలో తగినంత ఉండడం చాలా ముఖ్యం.

ఇండియన్ నేషనల్ రూపీ (₹) మరియు పౌండ్ స్టెర్లింగ్ (£) మధ్య విలువలో రోజువారీ హెచ్చుతగ్గులు చూడవచ్చు. కాబట్టి, యుకెకి ప్రయాణించడానికి ముందు మీరు సంబంధిత కరెన్సీ రేటు మీద దృష్టి పెట్టాలి.

యుకెలో మీరు సందర్శించగల పర్యాటక ప్రదేశాలు


విస్తృత చరిత్ర మరియు వైవిధ్యమైన ప్రదేశాలతో యునైటెడ్ కింగ్‌డమ్ పర్యాటకులను అత్యంతత ఆకర్షిస్తోంది. మరియు మీకు భారతదేశం నుండి యుకె ప్రయాణం కోసం సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే, మరే భయం లేకుండా మీరు ఈ ప్రదేశాలను ఆస్వాదించవచ్చు!

మీరు యుకెలో తప్పక చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి:

 • లండన్:

  లండన్ అనేది ఒక ఆర్కిటెక్చరల్ స్మారకం మరియు నిజమైన ఆధునిక అద్భుతం కలయిక లాంటిది. ఇక్కడ ఒకవైపు గతం చిహ్నాలు, మరోవైపు వర్తమానం మరియు భవిష్యత్తు దృశ్యాలు ఆకర్షిస్తుంటాయి. ప్రపంచ-ప్రసిద్ధ ల్యాండ్‌మార్క్‌లు, కాంబుల్‌స్టోన్డ్ స్ట్రీట్‌లు మరియు క్వైయింట్ కేఫ్‌లకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. ఐకానిక్ టవర్ బ్రిడ్జ్, వెస్ట్‌మిన్‌స్టర్ అబే, బకింగ్‌హామ్ ప్యాలెస్, ది మిలేనియం బ్రిడ్జ్, ది లండన్ ఐ, బిగ్ బెన్, బ్రిటిష్ పార్లమెంట్, ది నేచురల్ హిస్టరీ మ్యూజియం మరియు ట్రాఫల్‌గార్ స్క్వేర్‌ లాంటి అద్భుతాలకు ఈ నగరం నిలయంగా ఉంది.
 • ఎడిన్‌బర్గ్:

  ఎడిన్‌బర్గ్ అనేది స్కాట్లాండ్‌కు ఆకర్షణీయమైన రాజధాని. చారిత్రాత్మక మరియు సహజ నిక్షేపాలతో అలంకరించబడిన నగరం ఇది. పదమూడవ శతాబ్దం నాటి ఈథరియల్ ఎడిన్‌బర్గ్ క్యాస్టల్ అనేది ఈ నగరంలో అత్యంత ఎత్తుగా కనిపిస్తుంది.
 • స్టోన్‌హెన్జ్:

  స్టోన్‌హెన్జ్ అనేది 20 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన 4,500-సంవత్సరాల పురాతనమైన ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం. చారిత్రాత్మక ప్రార్థనా ప్రదేశంగా ఉంటోన్న ఈ భవనం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అత్యంత విశిష్ట చిహ్నాల్లో ఒకటిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించింది. స్టోన్‌హెన్జ్‌ సందర్శన తర్వాత, మీరు శాలిస్బరీ సందర్శించవచ్చు. ఇక్కడ కొన్ని అందమైన క్యాథెడ్రల్స్ మరియు నిజమైన మాగ్నా కార్టా ఉన్నాయి.
 • ది లేక్ డిస్ట్రిక్ట్:

  బ్రిటిష్ గ్రామీణ ప్రాంతంలోని ట్రాంక్విల్ లేక్ డిస్ట్రిక్ట్ మరియు కాట్స్‌వోల్డ్స్‌కు ప్రయాణించడమనేది ఆ ప్రదేశాల గురించి పదహారవ శతాబ్దంలో రాసిన ఒక పుస్తకంలో మీరు మునిగిపోవడం లాంటి అనుభవం అందిస్తుంది. ఈ ప్రాంతంలోని సుందరమైన లోయలు, పర్వతాలు, సరస్సులు, గ్రామాలు మరియు మెడోస్‌తో పాటు ఆక్స్‌ఫోర్డ్‌షైర్‌, వార్విక్‌షైర్ మరియు వర్సెస్టర్‌షైర్ కౌంటీలు అద్భుతంగా ఉంటాయి. ఈ కౌంటీలోని అత్యద్భుతమైన సరస్సుగా పేరు గడించిన లేక్ డిస్ట్రిక్ట్ నేషనల్ పార్క్ అనేది ఈ ప్రాంతానికి ఉత్తరంగా ఉంది.

యుకె సందర్శించడానికి ఉత్తమ సమయం ఏది?


మార్చి నుండి మే వరకు ఉండే వసంతకాలం లేదా సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉండే (శరత్కాలం) కాలం యునైటెడ్ కింగ్‌డమ్ సందర్శనకు అనువుగా ఉంటుంది. యుకెలోని చాలా ప్రాంతాలు ఆహ్లాదకరమైన వసంతకాలం అనుభూతిని అందిస్తాయి. కాబట్టి, హాలిడేకి గొప్పగా ఉంటాయి. జూన్ నుండి ఆగస్ట్ వరకు ఉండే వేసవికాలంలో పర్యాటకులతో ఈ దేశం బిజీగా ఉంటుంది కాబట్టి, వసంతకాలం లేదా శరత్కాలంలో మీ ప్రయాణం కోసం షెడ్యూల్ చేసుకోవాల్సిందిగా సలహా ఇవ్వడమైనది.


యుకె ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో తక్షణం మీ ప్రయాణం ప్రారంభించండి మరియు మీ ఫైనాన్సులను రక్షించుకోండి. వివిధ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంపికల నుండి మీరు మీ యుకె ప్రయాణం కోసం అత్యుత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఎంచుకోవచ్చు. భారతదేశం నుండి యుకె ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Frequently Asked Questions

తరచుగా అడిగే ప్రశ్నలు

యుకె ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని నేను ఎలా పొందగలను?

యుకె ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడానికి బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి. తదుపరి దశలలో, అవసరమైన వ్యక్తిగత సమాచారం అందించండి మరియు మీకు కావలసిన కవరేజీ ఎంచుకోండి. ప్రాథమిక ట్రావెల్ ఇన్సూరెన్స్ యుకె ప్లాన్ల కోసం క్రింది ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

-వైద్య రక్షణ

-బ్యాగేజ్ రక్షణ

యుకె ప్లాన్ కోసం మీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో అవసరమైన భాగాలు చేర్చిన తర్వాత, మీరు నగదు చెల్లించాలి మరియు లావాదేవీ పూర్తి చేయాలి. చెల్లింపు పూర్తయిన తర్వాత, మీరు మీ ఇన్‌బాక్స్‌లో మీ యుకె ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీ పొందవచ్చు.

యుకె ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఎంత ఖర్చు అవుతుంది?

యుకెలో మీరు ఎంతకాలం ఉండాలనుకుంటున్నారు అనేదాని ఆధారంగా, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ధర మారుతుంది. పైన పేర్కొన్న మొత్తం అనేది అనేక అదనపు అంశాల ద్వారా మరింతగా ప్రభావితమవుతుంది. మీరు మీ కుటుంబంతో సహా యుకె వెళ్లాలనుకుంటే, యుకె ప్రయాణం కోసం మీ ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో ప్రతి ఒక్కరికీ తగినంత కవరేజీ ఉందని నిర్ధారించుకోవడం తగిన సమ్ ఇన్సూర్డ్‌ను మీరు ఎంచుకోవాలి.

మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ యుకె పాలసీ కొనుగోలు చేయడం అవసరమా?

యుకెకి ప్రయాణించడానికి చెల్లుబాటు అయ్యే మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. మీ ట్రిప్‌ ఆర్థికంగా భద్రంగా ఉందనే హామీ కోసం ఈ ప్లాన్‌ కొనుగోలు చేయవచ్చు.

ప్రముఖ దేశాల కోసం వీసా మార్గదర్శకాలు


డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం