కస్టమర్ డే

హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ వద్ద కస్టమర్ డే
IRDAI ఆదేశానుసారం, మేము 17 మార్చి 2023 నాడు, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, 4వ అంతస్తు, నార్త్ ఈస్ట్ ప్లాజా, బిఎండబ్ల్యూ షోరూమ్ వెనుక, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, హైదరాబాద్ - 500082 వద్ద ఉ.10:00 గం.ల నుండి సా. 04:00 గం.ల వరకు కస్టమర్ డేని నిర్వహిస్తున్నాము.
మీకు ఇప్పటికే బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మరియు దానికి సంబంధించి ప్రశ్నలు ఉంటే, వాటిని పరిష్కరించడానికి మీకు సహాయపడతాము. కస్టమర్లకి అవసరం అయినా సమయంలో మేము వారి వెన్నంటే నిలుస్తాము. ఈ సంరక్షణ ప్రయాణంలో, మేము ప్రత్యేకమైన మరియు కస్టమర్ ఆందోళనలను పరిష్కరించే సేవలను అందిస్తాము.
తప్పనిసరి కెవైసి


రెస్పెక్ట్- సీనియర్ కేర్ రైడర్

ప్రవేశపెడుతున్నాం రెస్పెక్ట్-సీనియర్ కేర్ రైడర్, సీనియర్ సిటిజన్స్‌కు సకాలంలో సహాయం అందించే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ రైడర్, సంరక్షణను ఇది ఎక్కడినుండైనా స్మార్ట్‌గా మరియు సులభతరంగా చేస్తుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతల కారణంగా మనలో చాలామంది మన తల్లిదండ్రుల కోసం భౌతికంగా అందుబాటులో ఉండడం కుదరకపోవచ్చు. మీరు వారి వద్ద ఉంటున్నా లేదా దూరంగా నివసిస్తున్నారా అనేదానితో సంబంధం లేకుండా, మీరు వారి సంరక్షణ సహచరులుగా ఉండవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ఎవరైనా బేస్ పాలసీతో రెస్పెక్ట్-సీనియర్ కేర్ రైడర్‌ను జోడించవచ్చు. మీకు మా వద్ద ఇప్పటికే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే, రెన్యూవల్ సమయంలో మీరు దానిని చేర్చవచ్చు. ఇటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ అనేది మీకు మరియు మీ తల్లిదండ్రుల మధ్య ఉన్న భౌతిక దూరం గురించి ఆందోళన, చింత లేదా ఒత్తిడిని దూరం చేస్తుంది.
మా సంరక్షణ ప్రయాణంలో, రెస్పెక్ట్-సీనియర్ కేర్ రైడర్ మీ తల్లిదండ్రులకు సహాయం అందిస్తుంది మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.
సీనియర్ సిటిజన్స్ కోసం మా సంరక్షణ కేవలం ఒక మిస్డ్ కాల్ దూరంలో ఉంది- +91 91520 07550.
అందరికీ EV

పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరియు డిమాండ్‌తో, వాటిని అనిశ్చిత పరిస్థితుల నుండి సురక్షితం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక స్థిరమైన మరియు వాతావరణ అనుకూల భవిష్యత్తును నిర్మించడానికి మేము, బజాజ్ అలియంజ్ ఈవి ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెడుతున్నాము. మేము ప్రత్యేక సర్వీసులను ఆఫర్ చేస్తాము మరియు కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరిస్తాము. మీ డ్రైవింగ్ విధానాన్ని పునర్నిర్వచిస్తూ, అందరికీ ఈవి ని ప్రవేశపెడుతున్నాం. అన్ని-ఎలక్ట్రిక్ వెహికల్ అవసరాల కోసం సమగ్ర పరిష్కారాలను అందిస్తున్నాము.
మా ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్, వెహికల్ కోసం 11 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలను అందిస్తుంది. ఈ సేవల్లో ఒక ప్రత్యేక ఈవి హెల్ప్‌లైన్, ఔట్-ఆఫ్-ఎనర్జీ టోయింగ్, ఆన్-సైట్ ఛార్జింగ్ మొదలైనవి ఉంటాయి. మా సంరక్షణతో మీ ఎలక్ట్రిక్ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి!