రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Extend Your Travel Insurance Policy
జూలై 23, 2020

మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా పొడిగించాలి?

ఈ సందర్భాన్ని ఊహించుకోండి, అత్యద్భుతమైన ఒక ప్రదేశంలో మీ సెలవును మీరు ఆస్వాదిస్తున్నారు. మీ ట్రిప్‌ను మీరు 4 రోజుల కోసం ప్లాన్ చేసుకున్నారు, కానీ ఆ ప్రదేశంలోని ప్రకృతి సౌదర్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసింది, అందుకనే ఆ ప్రదేశంలో మరొక 3 రోజులు ఉండి మీ సెలవును ఒక వారానికి పొడిగించాలని అనుకున్నారు.

అదనపు 3 రోజులను ఆనందించడానికి, మీరు హోటల్ వసతి, కొత్త రిటర్న్ టిక్కెట్లను ఏర్పాటు చేసుకోవాలి మరియు దీనిని కూడా పొడిగించాలి-‌ ట్రావెల్ ఇన్సూరెన్స్. అవును! మీ ట్రావెల్ ప్లాన్‌లో మార్పులు చేసినట్లయితే, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మీరు అప్‌డేట్ చేయాలి. మీ పొడిగించబడిన ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ పొడిగించబడిన ట్రిప్ కోసం మిమ్మల్ని కవర్ చేయగలదు కాబట్టి ఇది ఒక అవసరమైన దశ.

కాబట్టి, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు ఎలా పొడిగించవచ్చు?

మీ వద్ద బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే, అప్పుడు మీరు ఈ క్రింది రెండు సందర్భాల్లో మీ పాలసీని పొడిగించవచ్చు:

 • పాలసీ గడువు ముగియడానికి ముందు - మీ పాలసీ గడువు ముగియడానికి ముందు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొడిగించడానికి అభ్యర్థన చేయబడితే, అది ప్రీ పాలసీ గడువు పొడిగింపు కిందకి వస్తుంది. మీరు చేయవలసిందల్లా:
  • మీ ట్రిప్ పొడిగింపు గురించి తెలియజేయడానికి బజాజ్ అలియంజ్ బృందాన్ని సంప్రదించడం.
  • మీరు 'గుడ్ హెల్త్ ఫారం'ను పూరించి దానిని మాకు సమర్పించాలి.
  • అప్పుడు మీ కేసు అండర్‌రైటర్లకు నివేదించబడుతుంది, వారు దానిని మూల్యాంకన చేసి మీ అవసరానికి సహాయపడతారు.
 • పాలసీ గడువు ముగిసిన తర్వాత - ఏదైనా కారణం వలన, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసిన తర్వాత మీ ట్రావెల్ ప్లాన్‌లు మారినట్లయితే, అప్పుడు ఈ పాలసీ పొడిగింపును పాలసీ గడువు ముగిసిన తరువాత అని పేర్కొంటారు. మీరు చేయవలసింది:
  • బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ బృందాన్ని సంప్రదించడం మరియు పొడిగింపుకు గల కారణంతో పాటు మీ ట్రిప్ పొడిగింపు గురించి తెలియజేయడం.
  • మీ కేసు అండర్‌రైటర్లకు నివేదించబడుతుంది, వారు దానిని మూల్యాంకన చేసి అవసరమైన చర్యలు చేపడతారు.

సుదీర్ఘమైన లేదా స్వల్ప కాలపు ట్రిప్‌ల కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండడం ముఖ్యం. కాబట్టి, మీ సౌలభ్యాన్ని బట్టి ఎల్లప్పుడూ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయండి. ఇంకా, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా అందించబడుతున్న డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ & సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ లను కూడా చూడండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి