Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

ట్రావెల్ ఇన్సూరెన్స్ యూరోప్

బజాజ్ అలియాంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో యూరోప్‌కు సురక్షితంగా ప్రయాణించండి

ప్రపంచంలోని అత్యంత ఆహ్లాదకర గమ్యస్థానాలలో కొన్నింటికి యూరోప్ నిలయంగా ఉండడంతో పాటు ప్రయాణం చేయడానికి బహుశా ఇదొక సురక్షితమైన మరియు సులభమైన ప్రాంతాల్లో ఒకటిగానూ ఉంటోంది. మీ యూరోప్ పర్యటనలో మీరు మీ జీవితకాలం కోసం జ్ఞాపకాలను సృష్టించుకోవచ్చు - విభిన్న సంస్కృతులు, అద్భుతమైన ఆధునిక నగరాలు, అద్భుతమైన ప్యాలెస్‌లు మరియు కోటలు, అద్భుతమైన ప్రదేశాలు, అద్భుత ఆతిధ్యం అందించే ప్రజలు మరియు గొప్ప విందులు లాంటి వాటికి నిలమైన ఖండం ఇది.

మీ ప్రయాణంలో వీక్షించడానికి మరియు ఆస్వాదించడానికి చాలా అంశాలు ఉన్నట్లుగానే, మీ ప్రయాణం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందడానికి మీకొక చక్కటి ప్రణాళిక కూడా అవసరం.

అలాగే, మీరు మీ యూరోపియన్ ప్రయాణం కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, ఒక మంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం మర్చిపోకండి. వైద్య సంబంధిత అత్యవసర పరిస్థితి, బ్యాగేజీ దొంగతనం, పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం లేదా ట్రిప్ రద్దు కావడం లాంటి ఊహించని ప్రమాదాల నుండి మిమ్మల్ని కవర్ చేయడం ద్వారా యూరోప్ కోసం బజాజ్ అలియాంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు పూర్తి మనశ్శాంతిని అందిస్తుంది.

 

యూరోప్‌లో చూడాల్సిన ప్రధాన నగరాలు మరియు విశేషాలు

 

 • ప్యారిస్: లైట్ మరియు లవ్ సిటీగా ఖ్యాతి పొందిన ప్యారిస్ నగరం మిమ్మల్ని మంత్రముగ్ధులని చేస్తుంది. ఇక్కడి ఆకర్షణీయమైన వీధుల్లో విహరించండి, సీన్ నది మీద క్రూజ్‌లో ప్రయాణించండి, ఐఫెల్ టవర్ చూసి ఆశ్చర్యపోండి, హై ఫ్యాషన్‌ను గమనించండి లేదా ప్రపంచ స్థాయి వంటకాలను ఆస్వాదించండి.

 • లండన్: థేమ్స్ నదికి పుట్టినిల్లు అయిన ఈ నగరంలో బిగ్ బెన్, బకింగ్‌హామ్ ప్యాలెస్ మరియు లండన్ ఐతో సహా ప్రపంచ-ప్రసిద్ధ అనేక విశేషాలకు కొలువుదీరి ఉన్నాయి. ఐకానిక్ డబుల్-డెకర్ బస్‌లో ప్రయాణించండి లేదా నగరం మధ్య నుండి క్రూజ్‌లో ప్రయాణించండి.

 • రోమ్: అన్ని దారులు రోమ్‌ వైపుకి తీసుకువెళతాయి అన్న నానుడిలో ఆశ్చర్యమేమీ లేదు - ఎందుకంటే, క్రైస్తవానికి ముఖ్య కేంద్రమైన వాటికన్ సిటీ ఇక్కడే ఉంది. ఇక్కడి సిస్టీన్ చాపెల్, సెయింట్ పీటర్స్ బసిలికా మరియు కొలోజియం లాంటి అద్భుతమైన ఆకర్షణలు సందర్శించకుండా రోమ్ ప్రయాణం సంపూర్ణం కాదు.

 • బెర్లిన్: ఈ జర్మన్ రాజధాని నగరంలో అద్భుతమైన మ్యూజియంలు, విస్తృత స్థాయి ఓపెన్ పార్కులు, అద్భుతమైన షాపింగ్ కేంద్రాలు మరియు గొప్ప వినోదం అందించే కేంద్రాలతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. చరిత్ర మరియు సంస్కృతిని ఇష్టపడే వారికి బెర్లిన్ ఎన్నెన్నో విశేషాలు అందిస్తుంది

 • లిస్బన్: ఉత్సాహభరితంగా, ఎల్లప్పుడూ సందడిగా ఉండే ఈ పోర్చుగల్ రాజధాని గొప్ప ప్రఖ్యాతి సాధించడంతో పాటు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడి వెచ్చటి వాతావరణం, ఊరించే విందులు మరియు నైట్ లైఫ్‌తో పాటు ఆధునికతల సమ్మేళనం మరియు గొప్ప చరిత్ర లాంటివన్నీ కలసి లిస్బన్‌ను యూరప్‌లోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి.

  యూరోప్ అంటేనే అద్భుత నగరాలకు నిలయం. ఈ ప్రతి నగరం ఒక విశిష్టమైన మరియు విలక్షణమైన అనుభవం అందిస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన కొన్నింటిని మనం ఎంచుకోవచ్చు కానీ, ప్రాగ్, లేదా బార్సిలోనా లేదా బ్రూజ్ లాంటి ఇతర నగరాలు కూడా సందర్శించాలి.

బజాజ్ అలియాంజ్‌తో యూరోప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

 

పర్యటన వల్ల మీ మనస్సు ఉత్తేజితమవుతుంది మీ ఆత్మకు పునరుత్తేజం లభిస్తుంది. అయితే, మీ పర్యటన ద్వారా మీరు గరిష్టంగా ఆనందించాలంటే, మీకు ఎలాంటి ఆందోళన మరియు ఒత్తిడి లేకుండా ఉండాలి. మీ పర్యటనలో మీకు ఊహించని అసౌకర్యం ఎదురైనప్పుడు ఒక మంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీకు మళ్లీ సౌకర్యం కల్పించడంలో శ్రద్ధ వహిస్తుంది. యూరప్ కోసం బజాజ్ అలియాంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీ ప్రయాణంలో మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తుంది:

 • త్వరిత సెటిల్‌మెంట్: ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం త్వరిత మరియు సమర్థవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో బజాజ్ అలియంజ్ రికార్డు కలిగి ఉంది

 • తక్షణ సహాయం: యూరోప్‌లో ఎక్కడినుండైనా ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి మరియు మా స్నేహపూర్వక కస్టమర్ సర్వీస్ సిబ్బంది నుండి సహాయంతో తక్షణ కాల్ బ్యాక్ అందుకోండి

 • కస్టమైజ్ చేయబడిన పాలసీలు: ఒక జంటగా, ఒక కుటుంబంగా లేదా ఒంటరిగా ప్రయాణిస్తున్నా, మీ ప్రత్యేక అవసరాలకు సరిపోయే ఒక యూరోపియన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోండి.

 • ప్రత్యేక కవర్: మీరు ఒక విద్యార్థి లేదా సీనియర్ సిటిజన్ అయితే, మీరు ఒక ప్రత్యేక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవచ్చు.

 • ఆల్-రౌండ్ కవరేజీ: అనారోగ్యం, హాస్పిటలైజేషన్, ట్రిప్ రద్దు కావడం, పాస్‌పోర్ట్ కోల్పోవడం, బ్యాగేజీ దొంగతనం మొదలైన అనేక సంఘటనల నుండి రక్షణ పొందండి.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం