Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

Travel Insurance for Dubai

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ కోసం మీ వివరాలను అందించండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

జీవితం అనేది ఊహించలేనిదిగా ఉండవచ్చు. కొన్ని సమయాల్లో, ప్రత్యేకించి, కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఇటీవలి కాలంలో ప్రయాణాలు ఆలస్యం కావడం లాంటి ఊహించని సంఘటనల నేపథ్యంలో ఉత్తమంగా రూపొందించిన ప్రణాళికలు సైతం నిష్ఫలం కావచ్చు. దుబాయ్‌ ప్రయాణం కోసం మీరు ప్లాన్ చేస్తుంటే మరియు అలాంటి పరిస్థితుల గురించి ఆందోళన చెందుతుంటే, దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ అనేది మీకు ఉపయోగకరంగా ఉండగలదు.

కాబట్టి, మీ విహారయాత్రకు సిద్ధం కావడానికి ముందు, యుఏఇ కోసం అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయడం మరియు మిమ్మల్ని మీరు ఆర్థికంగా సురక్షితం చేసుకోవడం ఒక మంచి ఆలోచన కాగలదు.

దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీ ప్రయాణ సమయంలో అనిశ్చిత పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

 

భారతదేశం నుండి దుబాయ్‌ వెళ్లడానికి మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

జీవితంలో ఏదీ నిర్ధిష్టంగా జరగాలని లేదు, సెలవు ప్రణాళికలకు సైతం ఇది వర్తిస్తుంది. ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ దుబాయ్ ప్రయాణ సమయంలో లేదా ముందుగా ఉత్పన్నమయ్యే ఊహించని సంఘటనలు ఎదుర్కోవడానికి ఇది అవసరం. విమానం మిస్ చేయడం, విమానాశ్రయంలో బ్యాగేజీ నష్టం లేదా ఆలస్యం కావడం లేదా దుబాయ్‌కి ప్రయాణిస్తున్నప్పుడు వైద్య అత్యవసర పరిస్థితి లాంటి ఆకస్మిక అనారోగ్యం లాంటివి ఇందులో భాగంగా ఉండవచ్చు.

ఫలితంగా, దుబాయ్ ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడమనేది మీ సెలవులకు హానికరంగా కాగల ఊహించని సంఘటనల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సిఫార్సు చేయబడుతుంది.

బజాజ్ అలియంజ్ జిఐసి నుండి దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండడం ద్వారా కలిగే ప్రయోజనాలు

దుబాయ్ కోసం బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఊహించని సంఘటనల గురించి ఆందోళన చెందకుండా మీరు మీ సెలవులను ఆనందించడానికి మనశ్శాంతిని అందిస్తుంది. మా దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ వివిధ ప్రయోజనాలు అందిస్తుంది, వీటితో సహా:

  • కస్టమైజ్ చేయదగిన పాలసీలు -

    మా విస్తృతమైన ప్లాన్‌ల పోర్ట్‌ఫోలియో నుండి విద్యార్థులు మరియు సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేక కవర్‌లతో సహా, మీ అవసరాలకు సరిపోయే పాలసీని మీరు ఎంచుకోవచ్చు.

  • సమర్థవంతమైన మద్దతు -

    దుబాయ్‌లో ఎక్కడినుండైనా, తక్షణ సహాయం ఒక మిస్డ్ కాల్ దూరంలోనే ఉంటుంది.

  • తక్షణ క్లెయిమ్‌లు -

    మా అవాంతరాలు-లేని ప్రాసెస్ అనేది మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను త్వరగా పంపిణీ చేయడాన్ని నిర్ధారిస్తుంది.

  • సమగ్రమైన కవరేజ్ -

    ప్రయాణంలో ఉన్నప్పుడు ఊహించని సంఘటనల నుండి ఆర్థిక రక్షణను మీరు ఆస్వాదించవచ్చు. ఉదాహరణకు, హాస్పిటలైజేషన్, మీ ట్రిప్ రద్దు లాంటివి, బ్యాగేజీ పోయింది , మరియు మీ ఇంట్లో జరిగిన దోపిడీ కూడా.

దుబాయ్ వీసా మరియు ప్రవేశ సమాచారం


ముందుస్తుగా సిద్ధం చేసిన వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో క్రింది డాక్యుమెంట్లు సమర్పించాలి:


  • దరఖాస్తుదారుని కలర్ ఫోటోగ్రాఫ్
  • కనీసం మూడు నెలల వరకు చెల్లుబాటు కలిగిన దరఖాస్తుదారుని పాస్‌పోర్ట్

ఒక నిర్దిష్ట ధరతో, భారతీయుల కోసం 14-రోజుల దుబాయ్ వీసా కోసం క్రింది వ్యక్తుల సమూహం దరఖాస్తు చేసుకోవచ్చు. అదనపు చెల్లింపుతో, వారి బసను మరికొన్ని రోజులు పొడిగించగవచ్చు.


  • వచ్చిన తేదీ నుండి కనీసం ఆరు నెలలు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌లు కలిగిన భారత జాతీయులు
  • సంబంధిత యుఎస్ఏ అథారిటీ ద్వారా జారీ చేయబడిన గ్రీన్ కార్డ్ లేదా సందర్శన వీసా కలిగి ఉన్న వ్యక్తుల కోసం ఇది కనీసం ఆరు నెలల వరకు చెల్లుతుంది
  • యూరోపియన్ యూనియన్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ పౌరులు
  • జిసిసి రెసిడెన్సీ పర్మిట్స్ హోల్డర్లు యుఏఇకి ప్రయాణించడానికి ముందు వీసా కోసం దరఖాస్తు చేయాలి

ప్రీ-అప్రూవ్డ్ వీసాలతో దుబాయ్‌కు వెళ్లే సందర్శకులందరూ క్రింది డాక్యుమెంటేషన్‌ కలిగి ఉండాలి:


  • హెల్త్ స్టేట్‌మెంట్ ఫారం
  • క్వారంటైన్ చేపట్టడం కోసం ఫారం
  • సందర్శన సమయంలో వైద్య ఖర్చుల కోసం కవరేజీతో సహా వర్కింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీకి అదనంగా, ఒక చెల్లుబాటు అయ్యే, వైద్యపరమైన సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ తీసుకోవాల్సిందిగా దుబాయ్‌ సందర్శించే పర్యాటకులకు సలహా ఇవ్వడమైనది.

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌లో భాగంగా, ఏదైనా యాదృచ్ఛిక పరిశీలన సమయంలో విజిటర్స్ వీసా లేదా వీసా నిర్ధారణ నంబర్ హార్డ్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది.

దుబాయ్ వీసా కోసం అప్లికేషన్ ప్రాసెస్

దుబాయ్ సందర్శించే భారత జాతీయులందరూ - ప్రస్తుత పాస్‌పోర్ట్ మరియు ముందుగానే జారీ చేయబడిన వీసా కలిగి ఉండాలి. దుబాయ్‌ని సందర్శించడానికి ముందు, చెల్లుబాటు అయ్యే ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం మరియు దానిని చేతిలో ఉంచుకోవడం ఒక మంచి ఆలోచన కాగలదు. దుబాయ్‌ని సందర్శించే భారతీయ పౌరులందరూ తప్పనిసరిగా ముందుగానే వీసా కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. భారతీయుల కోసం దుబాయ్ వీసాలు క్రింది కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి:

  • విజిట్ పర్మిట్, 48 గంటల కోసం సరిపోతుంది

  • సందర్శకుల కోసం, 96-గంటల సందర్శన అనుమతి

  • 30-రోజుల, సింగిల్-ఎంట్రీ, దుబాయ్‌లో ఉపయోగించడం కోసం ట్రాన్సిటరీ టూరిస్ట్ వీసా

  • 30-రోజుల స్వల్పకాలిక బహుళ-ప్రవేశ పర్యాటక వీసా అనేది దుబాయ్‌లో ప్రవేశానికి చక్కగా ఉంటుంది

  • దుబాయ్‌కి వచ్చిన రోజు నుండి ప్రారంభమయ్యే విధంగా 90 రోజుల సింగిల్-ఎంట్రీ టూరిస్ట్ వీసా

  • దుబాయ్‌లోకి మొదటిసారిగా ప్రవేశించినప్పటి నుండి 90 రోజులు చెల్లుబాటు అయ్యే లాంగ్-టర్మ్ మల్టిపుల్-ఎంట్రీ టూరిస్ట్ వీసా

 

భారతదేశం నుండి దుబాయ్‌కి ప్రయాణించే సమయంలో అవసరమయ్యే ప్రయాణ డాక్యుమెంట్లు ఏవి?

 

యుఏఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాల్సిందిగా గట్టిగా సలహా ఇవ్వబడినప్పటికీ, భారతదేశం నుండి దుబాయ్‌కి వెళ్లే విమానాలు ఎక్కడానికి కొన్ని ప్రయాణ డాక్యుమెంట్లు కూడా అవసరం. అవి క్రింద పేర్కొనబడ్డాయి:

 

  • భారతదేశం కోసం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ (దుబాయ్‌కి వచ్చిన తేదీ నుండి కనీసం ఆరు నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి)
  • ప్రీ-అప్రూవ్డ్ వీసా
  • ప్రయాణించే వారి కలర్ ఫోటోగ్రాఫ్
  • అవసరమైతే, ఔషధాల కోసం ప్రిస్క్రిప్షన్
  • కోవిడ్-19 రక్షణతో ఉండే ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్

దుబాయ్‌కి ప్రయాణించే సమయంలో చేపట్టాల్సిన భద్రత మరియు జాగ్రత్త చర్యలు


ప్రత్యేకించి, రద్దీగా ఉండే ప్రాంతాలు మరియు ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి.

  • ప్రైవేట్ డ్రైవర్‌ను ఎంచుకోవడానికి బదులుగా, అధికారిక, వాణిజ్య రవాణా ఉపయోగించండి.
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం అనేది యుఏఇ చట్టాలకు వ్యతిరేకం కాబట్టి, ఆ పని చేయకండి.
  • ముఖ్యంగా రాత్రివేళల్లో, నిర్మాణుష్య లేదా అపరిచిత ప్రదేశాలకు వెళ్లకండి. దీనితో మిమ్మల్ని రక్షించుకోండి ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ దుబాయ్ కోసం.
  • చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనకండి.

దుబాయ్ ప్రయాణం కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని ప్రమాదాలు మరియు ఊహించని వైద్య ఖర్చుల నుండి ఆర్థికంగా రక్షిస్తుంది.

దుబాయ్‌లోని భారతీయ ఎంబసీ గురించి ముఖ్యమైన సమాచారం


దుబాయ్‌లోని భారత ఎంబసీ క్రింది చిరునామాలో ఉంది:

దీనికి సంబంధించిన సమస్యల విషయంలో ఎంబసీ సంప్రదింపు వివరాలు అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్:

టెలిఫోన్ నంబర్: 00-971-2-4492700
ఫ్యాక్స్ నంబర్: 00-971-2-4444685
పని గంటలు: ఆదివారం నుండి గురువారం వరకు, 08:30 AM - 05:00 PM
పబ్లిక్ ఇంటర్ఫేస్ గంటలు: ఆదివారం నుండి గురువారం వరకు, 09:00 AM నుండి 12:30 PM వరకు

 

దుబాయ్‌లో ఏయే అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి?

దుబాయ్‌లో రెండు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి:

  • దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (డిఎక్స్‌బి)
  • దుబాయ్ వరల్డ్ సెంట్రల్ లేదా అల్ మక్టౌమ్ ఇంటర్నేషనల్ (డిడబ్ల్యూసి)

దుబాయ్‌కి ప్రయాణించే సమయంలో తీసుకువెళ్లడం కోసం కరెన్సీ మరియు ఫారిన్ ఎక్ఛేంజ్


"దిర్హం"గా పిలిచే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హం (ఎఇడి) అనేది ఈ దేశపు అధికారిక కరెన్సీ. మీ విహారయాత్ర ప్రారంభమయ్యే ముందు తగినంత ఏఇడి చేతిలో ఉంచుకోవడం మంచిది.

దుబాయ్‌లో మీరు సందర్శించగల పర్యాటక ప్రదేశాలు


దుబాయ్‌లో మీరు తప్పక సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి:

  • బుర్జ్ ఖలీఫా అనేది ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణం మరియు దుబాయ్‌లోని అత్యంత ప్రసిద్ధి చెందిన స్మారకాల్లో ఒకటి. దుబాయ్ మెట్రోపోలిస్‌లోని ఈ డిజైన్, ఆర్కిటెక్చర్ మరియు మానవ విజయానికి ప్రతిరూపమైన ఈ అద్భుతాన్ని పర్యాటకులు తప్పక వీక్షించాలి.
  • దుబాయ్ డాల్ఫినేరియం అనేది డాల్ఫిన్లను అత్యంత దగ్గర నుండి ఆస్వాదించడానికి అనుమతించే ఒక పర్యాటక గమ్యం. మిడిల్ ఈస్ట్‌లోని మొట్టమొదటి ఇండోర్ డాల్ఫినేరియంగా ఇది ప్రసిద్ధి చెందింది.
  • జుమీరా బీచ్ అనేది దుబాయ్‌లోని స్నేహపూర్వక మరియు ఆప్యాయ వైఖరిని సూచిస్తుంది. మీరు ఇసుక మీద నడవవచ్చు, సమీపంలోని బులెవార్డ్‌లో షాపింగ్ చేయవచ్చు మరియు వాటర్ స్పోర్ట్స్‌లో పాల్గొనవచ్చు.
  • ఏ-ఫహిదీ కోటలోని దుబాయ్ మ్యూజియం అనేది సూక్ష్మ రూపంలోని కలప బోటులు, పెయింటింగ్‌లు మరియు నిలువెత్తులో పునర్నిర్మించిన చారిత్రక సెట్టింగ్‌లతో పాటు దుబాయ్ చరిత్రకు సంబంధించిన కీలక కళాఖండాలతో నిండి ఉంటుంది.
  • ప్రపంచపు అత్యంత ఎత్తైన ఫౌంటెన్ షోగా ప్రసిద్ధి చెందిన దుబాయ్ ఫౌంటెన్ షో అనేది మీ కళ్లను ఆకర్షించే ఒక అద్భుత దృశ్యంగా ఉంటుంది. విభిన్న సంగీత నేపథ్యాలతో, ఈ ఫౌంటెన్ అనేది అతిథులకు ఒక ప్రత్యేకమైన మరియు మరచిపోలేని అనుభవం అందిస్తుంది.

దుబాయ్ కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ద్వారా, పైన పేర్కొన్న ప్రదేశాలను సందర్శించే సమయంలో యుఏఇలో మీరు ఒత్తిడి-లేని సెలవు అనుభవం అందుకోవచ్చు.

దుబాయ్‌ సందర్శించడానికి ఉత్తమ సమయం ఏది?


నగరంలో ఒక మోస్తరు చలికాలం ఉండే నవంబర్ నుండి మార్చి వరకు కాలం అనేది దుబాయ్‌కి ప్రయాణించడానికి మరియు ఆ నగరంలోని అద్భుతాలను అన్వేషించడానికి అత్యుత్తమ సమయం. ఈ కాలంలో, ఈ నగరం వ్యాప్తంగా ఉష్ణోగ్రత అనేది సాధారణంగా 19 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

Frequently Asked Questions

తరచుగా అడిగే ప్రశ్నలు

దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని నేను ఎలా కొనుగోలు చేయాలి?

మీరు ఒక సమగ్ర దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ కోరుకుంటే, మా వెబ్‌సైట్‌ని సందర్శించండి మరియు దుబాయ్ కోసం ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఎంచుకోండి. అవసరమైన వ్యక్తిగత సమాచారం పూరించాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది మరియు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కవరేజ్ స్థాయిని ఈ పేజీలోనే ఎంచుకోండి.

దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం నేను ఎంత ఖర్చు చేయాలి?

నగరంలో మీరు ఎన్ని రోజులు బస చేస్తారు లాంటి అనేక కీలక అంశాలనేవి మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ దుబాయ్ ప్లాన్ ధరను ప్రభావితం చేస్తాయి. దుబాయ్ సందర్శించాలనుకునేవారు వారి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వివిధ కవరేజ్ అంశాలు పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, దుబాయ్ కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయవచ్చు.

ట్రిప్ వ్యవధి కోసం మీకు తగినంత రక్షణ ఉందని నిర్ధారించుకోవడం కోసం ఆమోదించదగిన సమ్ అస్యూర్డ్‌ని ఎంచుకోండి. మీరు మీ కుటుంబంతో సహా దుబాయ్‌కి వెళ్తుంటే, దుబాయ్‌లో కూడా మీకు ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ లభించే విధంగా సమ్ అస్యూర్డ్ ఎంచుకోవాలి.

మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ దుబాయ్ ప్లాన్‌ కొనుగోలు చేయడం అవసరమా?

అవును, దుబాయ్ కవరేజీ కోసం చెల్లుబాటు అయ్యే ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. ఈ ప్యాకేజీ కొనుగోలు చేయడం ద్వారా, యుఏఇకి మీరు మీ ప్రయాణాన్ని ఆర్థికంగా సురక్షితం చేసుకోవచ్చు.

ప్రముఖ దేశాల కోసం వీసా మార్గదర్శకాలు


డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం