Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

టొయోటా ఫార్చ్యూనర్ కార్ ఇన్సూరెన్స్ కొనండి/రెన్యూవల్ చేసుకోండి

Toyota Fortuner Car Insurance

కార్ ఇన్సూరెన్స్ కోట్ కోసం వివరాలను షేర్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

మీరు కఠినమైన మరియు సాహసం మరియు క్రీడల కోసం నిర్మించబడిన కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, టొయోటా ఫార్చ్యూనర్ను మించి మీరు చూడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మీకు అందుబాటులోని అత్యుత్తమ ఎస్‌యువిలలో ఒకటిగా ఉండే టొయోటా ఫార్చ్యూనర్ అనేది పరిపూర్ణ ఎస్‌యువి కోసం చూసే ఉత్సాహభరిత వ్యక్తులు ఆశించే అన్ని అంశాలను కలిగి ఉంది. ఇందులో ఉండే ఫీచర్లు:

1. ఫోర్-వీల్ డ్రైవ్

2. ముందు మరియు వెనుక ఎయిర్ బ్యాగులు

3. అలాయ్ వీల్స్

4. ఫాగ్ లైట్స్

5. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

6. విభిన్న డ్రైవింగ్ మోడ్‌లు

కారు నాణ్యత మరియు అందించబడే ఫీచర్ల కారణంగా, టొయోటా ఫార్చ్యూనర్ అనేది ప్రీమియం విభాగంలో చేర్చబడిన కారుగా ఉంటోంది. అలాంటి ఒక హై-ఎండ్‌ కారు మీద పెట్టుబడి పెట్టినప్పుడు, ఆ పెట్టుబడిని మీరు రక్షించుకోవాల్సి ఉంటుంది. ‌మీ సరికొత్త టొయోటా ఫార్చ్యూనర్ కోసం ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ ‌ని కొనుగోలు చేయడం ద్వారా, కారును రక్షించడానికి మరియు దాని సుదీర్ఘతను నిర్ధారించడానికి దానికి ఆల్-రౌండ్ ఫైనాన్షియల్ కవరేజీ అవసరం. 

 

టొయోటా ఫార్చ్యూనర్ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు

భారతదేశంలోని అన్ని కార్లకు కనీసం థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ coverage is a legal requirement for all cars in India. However, purchasing a సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ can offer additional types of coverage for added security.

 

టొయోటా ఫార్చ్యూనర్ మోటార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం లభించే కొన్ని ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

 

1. తక్షణ యాక్సెస్

కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల మీ పాలసీ డాక్యుమెంట్‌కు త్వరిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్రక్రియ ప్రత్యక్షంగా ఉంటుంది మరియు ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ సహాయంతో, మీరు మీ టొయోటా ఫార్చ్యూనర్ ఇన్సూరెన్స్ ధరను నిర్ణయించవచ్చు. అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లు మీ వద్ద ఉంటే, మీరు కొన్ని క్లిక్‌లతోనే పాలసీ కొనుగోలు ప్రాసెస్‌ ప్రారంభించవచ్చు మరియు పూర్తి చేయవచ్చు.

 

2. సౌలభ్యం 

Whether you opt for a third-party car insurance policy or a comprehensive one, buying online is hassle-free. Additionally, you can start and finish the purchase process from anywhere, without the need to visit an insurance provider's office. ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్‌ను క్రమం తప్పకుండా రెన్యూవల్ చేయవలసి ఉంటుంది కాబట్టి, ఆన్‌లైన్ రెన్యూవల్ ఒక సౌకర్యవంతమైన ఎంపికగా కూడా ఉంటుంది.

 

3. సులభమైన రెన్యూవల్ 

మీ పాలసీ అనేది థర్డ్-పార్టీ అయినప్పటికీ లేదా సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయినప్పటికీ, దానిని తప్పనిసరిగా రెన్యూవల్ చేయాలి. రెన్యూవల్ ప్రాసెస్ అనేది ఆన్‌లైన్‌లో సులభంగా ఉంటుంది మరియు క్రమం తప్పకుండా ఈ ప్రక్రియను తప్పనిసరిగా పునరావృతం చేయాలి.

 

 

 

టొయోటా ఫార్చ్యూనర్ కోసం ఇన్సూరెన్స్ రకాలు

మీ టొయోటా ఫార్చ్యూనర్ కోసం మీరు ఎంచుకోగల రెండు ప్రధాన రకాల కార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి:

థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్

ఇది భారతదేశంలోని అన్ని వాహనాలకు చట్టం ద్వారా అవసరమైన కనీస ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. మీ కారుకు యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో, థర్డ్-పార్టీ ఆస్తికి లేదా వ్యక్తులకు జరిగే డ్యామేజీలు మరియు నష్టాలను ఇది కవర్ చేస్తుంది. అయితే, థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ అనేది యాక్సిడెంట్‌లో మీ సొంత కారుకు ఏర్పడే డ్యామేజీలను లేదా మీకు ఏర్పడే గాయాలను కవర్ చేయదు. ఇది సాధారణంగా అందుబాటులో ఉండే చవకైన కార్ ఇన్సూరెన్స్.

సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజ్

ఇది విస్తృత కవరేజీని అందించే మరింత సమగ్రమైన మరియు ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీ. యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర రకాల నష్టాల సందర్భంలో మీ స్వంత కారు కోసం థర్డ్-పార్టీ బాధ్యత మరియు నష్టాలను ఇది కవర్ చేస్తుంది. ఇందులో డ్రైవర్ మరియు ప్రయాణీకులకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా ఉంది. సమగ్ర కవరేజ్ అధిక మనశ్శాంతిని అందించినప్పటికీ, ఇది అధిక ఖర్చుతో లభిస్తుంది.

మీ టొయోటా ఫార్చ్యూనర్ కోసం థర్డ్-పార్టీ లయబిలిటీ మరియు సమగ్ర కవరేజ్ మధ్య ఏది ఎంచుకోవాలనే ప్రశ్న ఎదురైనప్పుడు, మీ బడ్జెట్, డ్రైవింగ్ అలవాట్లు మరియు రిస్క్ స్థాయిని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. మీ కారు కొత్తది లేదా ఖరీదైనది అయితే లేదా మీరు తరచుగా అధిక-రిస్క్ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తుంటే, సమగ్ర కవరేజ్ మీకు మెరుగైన ఎంపికగా ఉండగలదు. అయితే, మీ కారు పాతది లేదా తక్కువ విలువైనది అయితే మరియు చవకైన ఇన్సూరెన్స్ ఎంపిక కోసం మీరు అన్వేషిస్తుంటే, థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ మీకు తగినదిగా ఉండవచ్చు.

టొయోటా ఫార్చ్యూనర్ కార్ ఇన్సూరెన్స్ - చేర్పులు మరియు మినహాయింపులు

 • చేర్పులు

 • మినహాయింపులు

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అనే పాలసీ వీటిని కవర్ చేస్తుంది 

మరింత చదవండి

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీకి జరిగిన నష్టాలు లేదా గాయాలు మాత్రమే కాకుండా, ఇన్సూర్ చేయబడిన వాహనం మరియు డ్రైవర్‌కు జరిగిన డ్యామేజీలు మరియు నష్టాలను కూడా కవర్ చేసే ఒక రకం పాలసీగా ఉంటుంది. ‌ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ‌లో కొన్ని సాధారణ చేర్పులు థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజీ, థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ ప్లాన్ అనేది థర్డ్ పార్టీకి జరిగే నష్టం నుండి ఉత్పన్నమయ్యే చట్టపరమైన బాధ్యతను కవర్ చేస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది డ్రైవర్ లేదా ప్రయాణీకులకు శారీరక గాయాలు లేదా మరణం సంభవించిన సందర్భంలో ఆర్థిక మద్దతు అందిస్తుంది మరియు యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇన్సూర్ చేయబడిన వాహనానికి జరిగే నష్టాన్ని కవర్ చేస్తుంది. అలాగే, ఒక వ్యక్తి అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవడం కోసం, సమగ్ర ప్లాన్‌లో ఇతర కవరేజీలు కూడా అందుబాటులో ఉంటాయి.

 

1 ఆఫ్ 1

అయితే, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీకి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి

మరింత చదవండి

అయితే, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయనే విషయం తప్పక గమనించాలి. డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, డ్రైవర్ మద్యం లేదా డ్రగ్స్ ప్రభావంలో డ్రైవింగ్ చేస్తే, యుద్ధ పరిస్థితులు లేదా అణు వికిరణం, కారు సాధారణ వయస్సు మరియు భౌగోళిక ప్రాంతం వెలుపల సంభవించే ప్రమాదాల కారణంగా కారుకు నష్టం జరిగితే, సంభవించే దుర్ఘటనలకు ఈ మినహాయింపులు వర్తిస్తాయి. కాబట్టి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో ఏదైనా గందరగోళం లేదా వివాదాలు నివారించడం కోసం, పాలసీ నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా చదవడం మరియు అర్థం చేసుకోవడం ముఖ్యం.

1 ఆఫ్ 1

టొయోటా ఫార్చ్యూనర్ కార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లు

యాడ్-ఆన్‌లను ఎంచుకోవడం ద్వారా, మీ పాలసీ అందించే కవరేజీని మీరు పెంచుకోవచ్చు. అయితే, ఇది టొయోటా ఫార్చ్యూనర్ ఇన్సూరెన్స్ ధరను కూడా పెంచవచ్చు. కాబట్టి, మీ టొయోటా ఫార్చ్యూనర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను మీ బడ్జెట్‌లో ఉంచుకోవడం కోసం, అవసరమైన యాడ్-ఆన్‌లను మాత్రమే ఎంచుకోవలసిందిగా మీకు సిఫార్సు చేయడమైనది.

మీరు ఎంచుకోవడానికి వీలైన కొన్ని యాడ్-ఆన్‌లు క్రింద ఇవ్వబడ్డాయి:

 

 • ప్రయాణీకుల పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ఇన్సూర్ చేయబడిన కారులో ప్రయాణించే ప్రయాణీకులకు ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించిన సందర్భంలో, వైద్య ఖర్చులు మరియు పరిహారాన్ని ఈ యాడ్-ఆన్ కవర్ చేస్తుంది.

 

 • కీ రీప్లేస్‌మెంట్ కవర్  

కీ రీప్లేస్‌మెంట్ యాడ్-ఆన్ అనేది తాళం తయారీ ఖర్చు లేదా తాళం అవసరం లేకుండా ప్రవేశించే వ్యవస్థ మార్పిడితో సహా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన కార్ తాళం మార్చడం కోసం అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.

 

 • 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ 

టైర్ పంక్చర్ కావడం, డెడ్ బ్యాటరీ లేదా టోయింగ్ సేవలు లాంటి రోడ్డు మీద సంభవించగల కారు బ్రేక్‌డౌన్‌లు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఈ యాడ్-ఆన్ సహాయం అందిస్తుంది.

 

 • ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్

నీళ్లు లోపలకు చేరడం, లూబ్రికేటింగ్ ఆయిల్ లీకేజీ లేదా హైడ్రోస్టాటిక్ లాక్ కారణంగా జరిగే నష్టాల కారణంగా, ఇన్సూర్ చేయబడిన కారు ఇంజిన్‌కు మరమ్మత్తు చేయడానికి లేదా మార్చడానికి అయ్యే ఖర్చులను ఈ యాడ్-ఆన్ కవర్ చేస్తుంది.

 

 • అవుట్‌స్టేషన్ ఎమర్జెన్సీ కవర్

ఇన్సూర్ చేయబడిన కారుకి బ్రేక్‌డౌన్ లేదా యాక్సిడెంట్ జరిగిన సమయంలో, అది దాని సాధారణ భౌగోళిక ప్రాంతానికి వెలుపల ఉన్నప్పుడు, అలాంటి అత్యవసర పరిస్థితుల కోసం ఈ యాడ్-ఆన్ అనేది సహాయం మరియు కవరేజీ అందిస్తుంది.

 

టొయోటా ఫార్చ్యూనర్ కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా కొనుగోలు చేయాలి?

మీ టొయోటా ఫార్చ్యూనర్ కోసం కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ముందు, అంచనా వేయబడిన ఇన్సూరెన్స్ ధరను నిర్ణయించడానికి కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ‌ని ఉపయోగించాల్సిందిగా సిఫార్సు చేయడమైనది.

అంచనా వేయబడిన ధరను మీరు పొందిన తర్వాత, ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ నుండి ఆన్‌లైన్‌లో పాలసీ కొనుగోలు చేయడాన్ని మీరు కొనసాగించవచ్చు. ఈ ప్రాసెస్ ప్రారంభించడానికి ముందు, మీ కార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు గుర్తింపు వివరాలు లాంటి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి.

సైట్‌లో పేర్కొన్న దశలు అనుసరించండి మరియు అందుబాటులోని చెల్లింపు విధానాలు ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయండి. మీరు ఎంచుకున్న యాడ్-ఆన్‌ల ఆధారంగా ఇన్సూరెన్స్ ధరలో మార్పు ఉండవచ్చునని గుర్తుంచుకోండి.

 

 

టొయోటా ఫార్చ్యూనర్ ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి

మీ టొయోటా ఫార్చ్యూనర్ కోసం మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ చేయడాన్ని కొనసాగించే ముందు, ఇన్సూరెన్స్ ధరను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవలసిందిగా సూచించడమైనది. మీ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసే ప్రాసెస్ వేగవంతమైనది మరియు సౌకర్యవంతమైనది. పాలసీ రెన్యూవల్ కోసం మీరు అనుసరించాల్సిన సాధారణ దశలు క్రింద ఇవ్వబడ్డాయి:

 • మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌కు వెళ్లి, రెన్యూవల్ విభాగానికి నావిగేట్ చేయండి.
 • పాలసీ నంబర్ మరియు గడువు తేదీ లాంటి అవసరమైన వివరాలు నమోదు చేయండి మరియు రెన్యూవల్ ప్రాసెస్‌ పూర్తి చేయడం కోసం వచ్చే సూచనలు అనుసరించండి.
 • పాలసీ వివరాలు మరియు ప్రీమియం మొత్తం సమీక్షించండి మరియు నిర్ధారించండి.
 • నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా డిజిటల్ వాలెట్లు లాంటి అందుబాటులోని ఎంపికలు ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయండి.
 • చెల్లింపు విజయవంతమైన తర్వాత, రెన్యూవల్ చేయబడిన పాలసీ కోసం ఇమెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ నిర్ధారణను మీరు అందుకుంటారు.

కవరేజీలో ఏదైనా అంతరాయం నివారించడం కోసం, గడువు తేదీకి కొన్ని రోజుల ముందే మీ పాలసీని రెన్యూవల్ చేసుకోండి మరియు సులభమైన రెన్యూవల్ ప్రాసెస్ కోసం మీ గత పాలసీ వివరాలు అందుబాటులో ఉంచుకోండి.

క్లెయిమ్ విధానం

మీ కార్ ఇన్సూరెన్స్‌ మీద క్లెయిమ్ చేయడం కోసం ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించడం, ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను సంప్రదించడం లేదా ఆన్‌లైన్‌లో లేదా ఫోన్ ద్వారా క్లెయిమ్ చేయడం లాంటి అనేక ఎంపికలు మీకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా, ఆన్‌లైన్‌లో లేదా ఫోన్ ద్వారా క్లెయిమ్ చేయడమనేది వేగవంతంగా మరియు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

క్లెయిమ్ చేయడం కోసం, సంఘటన గురించి మీరు వీలైనంత త్వరగా మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి మరియు మీ పాలసీ నంబర్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, లొకేషన్ మరియు ప్రమాద సమయం మరియు సంఘటన గురించిన సంక్షిప్త వివరణ లాంటి అవసరమైన వివరాలు అందించాలి. థర్డ్-పార్టీ ప్రమేయం ఉన్నప్పుడు, మీరు పోలీసులకు తెలియజేయాలి మరియు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. మీ క్లెయిమ్‌కు మద్దతు కోసం పాడైన వాహనం మరియు సంబంధిత వివరాల చిత్రాలను కూడా మీరు తీసుకోవాలి.

నష్టాలు పరిశీలించడానికి మరియు క్లెయిమ్ మొత్తం అంచనా వేయడానికి మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఒక సర్వేయర్‌ను ఏర్పాటు చేయవచ్చు. క్లెయిమ్ ఆమోదించబడితే, దెబ్బతిన్న భాగాల మరమ్మత్తు లేదా మార్పిడి కోసం అయ్యే ఖర్చులను వారు మీకు రీయింబర్స్ చేస్తారు లేదా ఆ పని కోసం ఏర్పాట్లు చేస్తారు.

క్లెయిమ్ చేయడానికి ముందు, మీ టొయోటా ఫార్చ్యూనర్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలు మరియు షరతులు మరియు క్లెయిమ్ ప్రాసెస్‌ను చదవండి మరియు అర్థం చేసుకోండి. క్లెయిమ్ చేసేటప్పుడు పాలసీ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఎఫ్ఐఆర్ కాపీ లాంటి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, మరియు అది ఎందుకు ముఖ్యం?

కార్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీ. మీ కారుకు సంబంధించిన ప్రమాదాలు, దొంగతనం మరియు ఇతర ఊహించని సంఘటనల కారణంగా జరిగే నష్టాల నుండి ఇది మీకు ఆర్థిక రక్షణ అందిస్తుంది. ప్రమాదం జరిగిన సందర్భంలో, మీ కారు లేదా మీకు లేదా ఇతరులకు జరిగే నష్టాల కోసం అయ్యే ఖర్చులను ఇది కవర్ చేస్తుంది కాబట్టి, ఇది చాలా ముఖ్యమైనది.

అందుబాటులో ఉండే వివిధ రకాల కార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏమిటి?

రెండు ప్రధాన రకాల కార్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అవి: థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ మరియు సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజ్. థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజీ అనేది ప్రమాదంలో థర్డ్ పార్టీలకు జరిగే నష్టాలు లేదా గాయాలను కవర్ చేస్తుంది. అయితే, సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీ కారుకు జరిగే నష్టాలు మరియు వ్యక్తిగత గాయాల రక్షణతో సహా విస్తృత కవరేజ్ అందిస్తుంది.

కార్ ఇన్సూరెన్స్ ఖర్చును ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయి?

కవరేజ్ రకం, కారు వయస్సు మరియు మోడల్, డ్రైవర్ వయస్సు మరియు డ్రైవింగ్ రికార్డ్, భౌగోళిక ప్రదేశం మరియు ఎంచుకున్న యాడ్-ఆన్‌లు లాంటి అనేక అంశాలు కార్ ఇన్సూరెన్స్ ఖర్చును ప్రభావితం చేయగలవు.

యాడ్-ఆన్‌లు అంటే ఏమిటి, మరియు వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి?

యాడ్-ఆన్‌లు అనేవి అదనపు కవరేజీ కోసం కార్ ఇన్సూరెన్స్ పాలసీకి జోడించబడే అదనపు ఫీచర్లు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్షన్ మరియు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లాంటి విషయాలను అవి కవర్ చేయగలవు. తమ వ్యక్తిగత అవసరాలు మరియు ప్రాధాన్యాతల ఆధారంగా ఒకరు వాటిని పరిగణనలోకి తీసుకోవాలి.

 

కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?

కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి, ప్రమాద సంఘటన గురించి సాధ్యమైనంత త్వరగా మీరు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి, పాలసీ నంబర్ మరియు రిజిస్ట్రేషన్ నంబర్ లాంటి అవసరమైన వివరాలు వారికి అందించాలి, నష్టాలను ఫోటోలు తీసుకోండి, అవసరమైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి మరియు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచుకోండి. కాల్ చేయడం లేదా ఆన్‌లైన్ ద్వారా, మీరు వ్యక్తిగతంగా క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం