మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
Hyundai Motor Company (దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం కలిగినది)కి పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా ఉన్న Hyundai Motor India Limited (HMIL), 1996లో తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ఈ దేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించింది.
రికార్డ్ పుస్తకాలలో లిఖించదగిన విజయ గాథలలో Hyundai ది ఒకటి. భారతదేశపు ఆటోమొబైల్ మార్కెట్లో అదృష్టం పరీక్షించుకోవాలని కంపెనీ మొదటిసారిగా నిర్ణయించుకున్నప్పుడు, ఇక్కడి మార్కెట్లో కేవలం కొన్ని ఆటోమోటివ్ కంపెనీలు - Maruti Suzuki, Tata Motors, Hindustan, Premier మరియు Mahindra - మాత్రమే ఉన్నాయి. అలాగే, Daewoo, Ford, Opel మరియు Honda వంటి కొత్తగా వచ్చిన కంపెనీలు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది.
Hyundai భారతదేశపు మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత, దాదాపు ఒక దశాబ్ద కాలం వరకు Maruti Suzuki ప్రయాణీకుల కార్ల విభాగంలో, Tata Motors మరియు Mahindra and Mahindra వారు ప్రత్యేకించి వాణిజ్య మరియు యుటిలిటీ వాహనాల విభాగంలో ప్రభావవంతమైన ఏకఛత్రాధిపత్యం వహించారు.
ఆ తరువాత జరిగినది మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం, 17% (2017 నాటికి) కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో, ప్రత్యేకించి, భారతదేశంలో $5.5 బిలియన్ విలువైన వార్షిక టర్నోవర్‌తో, రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా మారిన Hyundai, ప్రజల సాంప్రదాయక ప్రయాణాన్ని నిర్దేశించే డిస్రప్టివ్ టెక్నాలజీల (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆటోనోమస్ డ్రైవింగ్ అని చదువుకోండి) మీద పరిశోధనలు ప్రారంభించింది.
కాబట్టే, కొరియన్లో 'ఆధునికత' అనే అర్థం కలిగిన Hyundai అనే పదం ఇప్పుడు ఆ అర్థానికి ప్రతిరూపంగా మారడం ఆశ్చర్యం కలిగించదు.
మరియు మీ గ్యారేజీలో సురక్షితంగా పార్క్ చేయబడిన మీ Hyundai కారును చూస్తున్నప్పుడు, మీ కల నిజమైందని మీకు అనిపించడం సంతోషకరమైన విషయమే కావచ్చు! అయితే, అదే సమయంలో దానిని ఇన్సూర్ చేయడం (తద్వారా అనేక రకాల నష్టాల నుండి రక్షణ లభిస్తుంది) అనే బాధ్యత కూడా ఖచ్చితంగా మీపై ఉంటుంది. బజాజ్ అలియాంజ్‌తో, మీరు మీ అద్భుతమైన కారు కోసం సరిపోయే అనేక పాలసీల నుండి ఎంచుకోవచ్చు మరియు మీ Hyundai కోసం కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.
బజాజ్ అలియాంజ్‌లో, మీ కారుకు ఇన్సూర్ చేయడమే మా పనిగా ఉంటుంది. మరియు మేము ఆ విషయాన్ని అత్యంత శ్రద్ధగా చేస్తాము.
● Hyundai i10
బోల్డ్, ఎక్స్‌ప్రెసివ్ మరియు ఆధునికత మేళవించిన డిజైన్ ఈ 5-సీటర్ హాచ్బ్యాక్ను ఉత్తమంగా నిలబెడుతాయి. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది, ఈ 1086 cc కారు 17-21 కి.మీ/లీటర్ (ఇంధన రకం మరియు దాని వేరియంట్ ఆధారంగా) ప్రభావవంతమైన మైలేజీ ప్యాక్‌ను కూడా కలిగి ఉంటుంది.
అద్భుతమైన ఇంటీరియర్స్ మరియు ఆకర్షణీయమైన ఎక్స్టీరియర్ మాత్రమే కాకుండా, సెంట్రల్ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్, అడ్జస్టబుల్ సీట్స్, ఫ్రంట్ మరియు సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ మరియు ఇంజిన్ ఇమ్మొబిలైజర్ (ఇది మీ కారును 'హాట్-వైర్డ్'గా మారకుండా నివారిస్తుంది మరియు దొంగతనం అవకాశాలను తగ్గిస్తుంది)తో Hyundai i10 సురక్షతా చార్ట్‌లోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది.
● Hyundai i20
పెట్రోల్ మరియు డీజిల్ వేరియెంట్లలో అందుబాటులో ఉన్న ఈ ముచ్చటైన 5-సీటర్ వాహనం సిటీ రోడ్ల మీద 18.6 కి.మీ/లీటర్ అనే ఆకర్షణీయమైన మైలేజ్ అందిస్తుంది. 13.2 సెకన్లలోనే 100 కి.మీ/గంటకు టాప్ స్పీడ్‌కు చేరుకునే సామర్థ్యమనేది i20లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. వేగంగా ఉంది కదా!
అంతేకాకుండా,40 లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో పాటు మృదువైన డ్రైవింగ్ (మరియు రైడింగ్) అనుభవం కోసం అలాయ్ వీల్స్‌తో ఈ కార్ రూపొందించబడింది. అన్ని రకాల సౌకర్యాలు ఉండడం అంటే ఇదేనేమో!
● Hyundai Verna
1591 cc ఇంజిన్, 480 లీటర్ల బూట్ స్పేస్, ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ రకాలు, ఎల్ఇడి డిఆర్ఎల్ లతో పాటుగా ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల టచ్-స్క్రీన్ ఇన్ఫో/ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, సెన్సార్లతో కూడిన వెనుక కెమెరా (పార్కింగ్ కోసం), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, భద్రతకు మరింత ఎక్కువ భరోసా ఇచ్చే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్-సీట్ యాంకర్లు
ఇవి మరియు వందలాది ఇతర డైనమిక్స్ కలిసి అద్భుతమైన డ్రైవ్ (మరియు రైడ్) నాణ్యత మరియు అత్యుత్తమ నిర్వహణ మధ్య సరైన బ్యాలెన్స్‌ను అందిస్తాయి! నేడు మార్కెట్లో ఉత్తమంగా అమ్ముడవుతున్న సెడాన్లలో Verna కూడా ఒకటి అంటే, ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.
మా Hyundai కార్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయంతో మీ కారు ఆర్థికంగా రక్షించబడుతుంది, వర్షం లేదా ఇతర పరిస్థితుల్లో మాత్రమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ జోక్యం (దోపిడీ, దొంగతనం, సమ్మె, అల్లర్లు లేదా హానికర ఉద్దేశ్యంతో చేయబడే ఏవైనా ఇతర కార్యకలాపాలతో సహా) కారణంగా ఏర్పడే విపత్తుల నుండి తలెత్తే అనిశ్చిత పరిస్థితుల నుండి కూడా మీ కారు రక్షించబడుతుంది.
మా సమగ్ర Hyundai కార్ ఇన్సూరెన్స్ పాలసీలోని సమగ్రమైన అంశాలన్నీ కలసి మీకు ప్రకృతి విపత్తులు, మానవ జోక్యంతో ఎదురయ్యే నష్టాల నుండి రక్షణ అందించడంతో పాటు వ్యక్తిగత ప్రమాద కవర్ మరియు థర్డ్ పార్టీ చట్టపరమైన బాధ్యతల నుండి రక్షణను అందిస్తాయి. మా Hyundai కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీకు ఇష్టమైన మీ Hyundai కారుకి విభిన్న ప్రమాదాల నుండి అత్యధిక స్థాయి రక్షణ లభిస్తుంది.
మోటార్ వాహనాల చట్టం - 1988 ప్రకారం, థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అని మీకు తెలుసు కాబట్టి, మీరింకా ఎందుకు వేచి ఉండాలి? మీకు ఇష్టమైతే, మీరు మరింత ప్రాథమిక స్థాయి బజాజ్ అలియాంజ్ థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీ కూడా ఎంచుకోవచ్చు. ఇది ఏమి చేస్తుంది? ఈ రకమైన పాలసీ మీరు తీసుకుని ఉంటే, మీ కారు కారణంగా ఒక థర్డ్ పార్టీ కారుకి జరిగిన నష్టాలకు లేదా వారి శరీరానికి ఏర్పడిన గాయాల వలన మీ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటే, ఈ పాలసీ ద్వారా మీకు కవర్ లభిస్తుంది!
కారు నడిపే సమయంలో హెచ్చరికతో మరియు జాగ్రత్తగా ఉండడం మినహా మరే ప్రత్యామ్నాయం ఏదీ లేనప్పటికీ, మీ కారు కారణంగా ఇతరుల ఆస్తి లేదా ఆరోగ్యానికి నష్టం జరిగినప్పుడు ఉత్ఫన్నమయ్యే చట్టపరమైన మరియు ఆర్థిక బాధ్యతల నుండి మా థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ Hyundai కార్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని రక్షిస్తుంది.
మీకు అదనపు సౌలభ్యం అందించడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము. తద్వారా, మీరు సెటిల్ చేయాల్సిన దానికంటే ఎక్కువే పొందుతారు. కాబట్టి, మా సమగ్ర Hyundai కార్ ఇన్సూరెన్స్ మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ కవరేజీ మాత్రమే కాకుండా, మీరు మీ ప్రత్యేక పరిగణనలు మరియు ఇన్సూరెన్స్ లక్ష్యాలు దృష్టిలో ఉంచుకుని, రూపొందించబడిన మా యాడ్-ఆన్ కవర్లు కూడా ఉపయోగించుకోవచ్చు. మా ఆఫర్ల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి:
● బజాజ్ అలియాంజ్‌తో, మీకు అవసరమైన సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీకు 24x7 క్లెయిమ్స్ సపోర్ట్ లభిస్తుంది (మరియు మీరు కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇన్సూరెన్స్ సంబంధిత ప్రశ్నలకు కూడా సమాధానం లభిస్తుంది).
● మా 4000+ దృఢమైన గ్యారేజీ నెట్వర్క్ ద్వారా, మీకు అవసరమైన పెద్ద లేదా చిన్న మరమత్తులను పూర్తి చేయబడుతాయి; మీరు మీ కారుతో ఇక్కడి వచ్చినప్పటి నుండి మీకు ఈ సేవ లభిస్తుంది. డ్యామేజీ తీవ్రంగా ఉంటే, మేము మీ కారును గ్యారేజీకి తరలిస్తాము.
● మీరు మా నెట్వర్క్ గ్యారేజీలో ఏదైనా మరమత్తులు చేసుకుంటే, సులభమైన క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ లభిస్తుంది
● మీరు మీ గత ఇన్సూరెన్స్ కంపెనీలో పోగు చేసిన భారీ ఎన్‌సిబి ని వదులుకోకూడదు అని భావిస్తున్నారా? నిజానికి, మీరు వదులుకోవలసిన అవసరం లేదు. మీ బోనస్‌లో 50% మాకు బదిలీ చేయండి, మరియు మేము దానిని సురక్షితంగా మీ కోసం అందుబాటులో ఉంచుతాము.
● మీ Hyundai కార్ ఇన్సూరెన్స్ గడువు త్వరలో ముగియనుందా? మా ద్వారా, దానిని నిమిషాల్లోనే ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోండి!
● మీ సొంత యాడ్-ఆన్లు ఎంచుకోండి మరియు మళ్ళీ ఉత్సాహంగా మీ డ్రైవింగ్ కొనసాగించండి. మేము అందించే యాడ్-ఆన్లు - 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్, కీ అండ్ లాక్ రీప్లేస్మెంట్ కవర్, జీరో డిప్రిషియేషన్ కవర్, ఇంజిన్ ప్రొటెక్షన్ మరియు కన్జ్యూమబుల్ ఎక్స్పెన్షెస్ కవర్ - నుండి మీకు అత్యంత అవసరమైన వాటిని ఎంచుకోండి.
మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడిన డ్రైవ్‌స్మార్ట్ టెలిమాటిక్స్ సర్వీస్ అనేది మీ (ఇన్సూరెన్స్) మార్గంలోని ప్రతి దశలో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది! దీని సహాయంతో, మీ వాహనాన్ని తక్షణమే గుర్తించండి, మీ డ్రైవింగ్ పద్ధతులు మరియు ప్రవర్తనను పర్యవేక్షించండి, అన్ని ముఖ్యమైన కార్ హెచ్చరికలను (తక్కువ బ్యాటరీ, కార్ అనధికారిక కదలిక, మొదలైనవి) సెట్ చేయండి మరియు మరెన్నో చేయండి; తద్వారా, మెరుగైన రిస్క్ మోడల్ అందుకోండి మరియు అదేసమయంలో నిజమైన మరియు అందుబాటు ధరలోని ప్రీమియంలు పొందండి.
డిస్‌క్లెయిమర్
వెబ్సైట్లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి