రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

టొయోటా కార్ ఇన్సూరెన్స్ కొనండి/రెన్యూ చేసుకోండి

Toyota Car Insurance

కార్ ఇన్సూరెన్స్ కోట్ కోసం వివరాలను షేర్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

టొయోటా అనేది జపాన్‌కు చెందిన ఒక కార్ల తయారీ సంస్థ. 1937 లో కిచిరో టొయోడాచే స్థాపించబడిన టొయోటా, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక దిగ్గజ కంపెనీగా ఎదిగింది. టొయోటా ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటి, ఇది వరుస సంవత్సరాలపాటు అగ్రశ్రేణి తయారీదారుల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఇది 1997 సంవత్సరంలో కిర్లోస్కర్ గ్రూప్‌తో భాగస్వామ్యంతో భారతదేశంలో దాని కార్యకలాపాలను ప్రారంభించింది. మార్కెట్లో ప్రవేశించినప్పటి నుండి ఇన్నోవా, ల్యాండ్ క్రూయిజర్, ఫార్చ్యూనర్, క్వాలిస్ మరియు ఎతియోస్ లాంటి దాని ఐకానిక్ మోడళ్ళను ప్రవేశపెడుతూ భారతీయ కారు యజమానులలో టొయోటా తనదైన గుర్తింపు సంపాదించుకుంది. టొయోటా యజమానులకు అందుబాటులో ఉన్న ఫీచర్లు:

  • యాంటీ-బ్రేకింగ్ సిస్టమ్
  • ముందు మరియు వెనుక ఎయిర్ బ్యాగులు
  • హెడ్స్-అప్ డిస్‌ప్లే
  • రిమోట్ ఎయిర్ కండిషనింగ్
  • డ్రైవింగ్ విధానాలు

మీరు మీ కోసం మరియు మీ ప్రియమైనవారి కోసం ఒక టొయోటా ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, రోడ్డు ప్రమాదాల నుండి మీ కారుని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోవడం అత్యవసరం. మీ కొత్త టొయోటా కారు కోసం మోటార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ద్వారా ఇది చేయవచ్చు. ఈ పాలసీ మీ కారుకు సంబంధించిన ఆర్థిక మరియు చట్టపరమైన బాధ్యతల నుండి ఆర్థిక కవరేజీని అందిస్తుంది. 

టొయోటా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

యాక్సిడెంట్లు, దొంగతనం లేదా నష్టం లాంటి ఊహించని సంఘటనల నుండి మీ టొయోటా కారును రక్షించడానికి కారు ఇన్సూరెన్స్ ఒక ముఖ్యమైన పెట్టుబడి. వ్యక్తిగతంగా లేదా ఏజెంట్ ద్వారా ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం అనేది ఒక సాంప్రదాయ పద్ధతి, టొయోటా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వీటితో సహా:

 

• సౌలభ్యం

ఆన్‌లైన్‌లో టొయోటా కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడంలోని అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి అది అందించే సౌలభ్యం. మీరు ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ఏజెంట్ కార్యాలయాన్ని సందర్శించవలసిన అవసరం లేకుండానే, ఎప్పుడైనా మరియు ఎక్కడినుండైనా ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా, మీరు మీ సమయం, శ్రమను ఆదా చేసుకోవచ్చు మరియు మీ జీవితంలోని ఇతర ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టవచ్చు. ఈ ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ ‌ను క్రమం తప్పకుండా రెన్యూ చేయాలి, కాబట్టి దీనిని ఆన్‌లైన్‌లో చేయగలగడం సౌకర్యవంతంగా ఉంటుంది.

 

• ప్లాన్లను పోల్చడం

ఆన్‌లైన్‌లో టొయోటా కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు, మీరు అనేక ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల నుండి పాలసీలు మరియు ప్లాన్లను సరిపోల్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇది మీ అవసరాలు మరియు బడ్జెట్‌కు అనుగుణంగా సరిపోయే ఒక ఇన్సూరెన్స్ పాలసీని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.

 

• సరసమైన ప్రీమియంలు

ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణంగా సాంప్రదాయ పాలసీల కంటే సరసమైనవి. ఇది ఎందుకంటే, సాంప్రదాయ బ్రిక్-అండ్-మోర్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే, ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు తక్కువ ఓవర్‌హెడ్ ఖర్చులను విధిస్తారు. టొయోటా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా మీరు తగినంత ఇన్సూరెన్స్ కవరేజీని పొందుతూనే ప్రీమియంలను ఆదా చేసుకోవచ్చు.

 

• సులభమైన డాక్యుమెంటేషన్

టొయోటా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ప్రక్రియ అతి తక్కువ పేపర్‌వర్క్‌తో వస్తుంది - అది ఒక థర్డ్-పార్టీ ప్లాన్ అయినా లేదా సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ అయినా. ఆన్‌లైన్‌లో డాక్యుమెంటేషన్‌ పూర్తి చేయడం చాలా సులభం, ఇది అన్ని అవసరమైన డాక్యుమెంట్లను నిర్వహించడం మరియు నిల్వ చేయడాన్ని సులభతరం చేస్తుంది.

 

• త్వరిత క్లెయిములు

ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు వేగవంతమైన మరియు సమర్థవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను అందిస్తారు. మీరు మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా ఫైల్ చేయవచ్చు మరియు త్వరిత, అవాంతరాలు లేని పరిష్కారాన్ని పొందవచ్చు. ఈ విధంగా, మీరు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, తక్కువ సమయంలో తిరిగి రోడ్డుపైకి రావచ్చు.

 

చివరగా, ఆన్‌లైన్‌లో టొయోటా కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం అనేది అనేక ప్రయోజనాలను అందించే ఒక సౌకర్యవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపిక. ఇది పాలసీలను సులభంగా సరిపోల్చడానికి, ప్రీమియంలపై డబ్బును ఆదా చేయడానికి మరియు మీ పాలసీని సమర్థవంతంగా నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అదనంగా, ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు వేగవంతమైన మరియు సమర్థవంతమైన క్లెయిమ్స్ ప్రాసెసింగ్‌ను అందిస్తారు, ఇది ప్రశాంతతను మరియు సౌలభ్యాన్ని కోరుకునే కార్ల యజమానులకు ఒక ఆదర్శవంతమైన ఎంపికగా ఉంటుంది.

టొయోటా కార్ ఇన్సూరెన్స్ - చేర్పులు మరియు మినహాయింపులు

  • చేర్పులు

  • మినహాయింపులు

థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్: ఇది మీ వాహనం ద్వారా థర్డ్ పార్టీకి జరిగిన నష్టం లేదా గాయాన్ని కవర్ చేస్తుంది.

పర్సనల్ యాక్సిడెంట్ కవర్: ఇది ప్రమాదం సమయంలో డ్రైవర్ లేదా ప్రయాణీకులకు కలిగే గాయాల కోసం పరిహారం అందిస్తుంది.

ఓన్ డ్యామేజ్ కవర్: ఇది ప్రమాదాలు, దొంగతనం లేదా వరదలు లేదా భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ స్వంత వాహనానికి జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది.

ఆప్షనల్ అదనపు కవరేజ్: మీరు సమగ్ర ప్లాన్‌లో ఇంజిన్ ప్రొటెక్షన్ లేదా జీరో డిప్రిసియేషన్ లాంటి అదనపు కవరేజీని ఎంచుకోవచ్చు.

1 ఆఫ్ 1

డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎలాంటి కవరేజ్ లభించదు.

మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నట్లయితే కవరేజ్ లభించదు.

యుద్ధం లేదా న్యూక్లియర్ రేడియేషన్ కారణంగా కారుకు జరిగిన నష్టం కవర్ చేయబడదు.

కారు వయస్సు కారణంగా అరుగుదల మరియు తరుగుదల కవర్ చేయబడదు.

పాలసీ కవరేజ్ పరిధి వెలుపల సంభవించే ప్రమాదాలు కవర్ చేయబడ`వు.

1 ఆఫ్ 1

టొయోటా కార్ ఇన్సూరెన్స్ రకాలు

మీ టొయోటా కారును ఇన్సూర్ చేసే విషయానికి వస్తే, ప్రాథమికంగా రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి: థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ మరియు సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజ్.

థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్

థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ అనేది మీ కారుకు సంబంధించిన ప్రమాదంలో థర్డ్-పార్టీకి కలిగే నష్టాలు లేదా గాయాలను కవర్ చేసే ప్రాథమిక ఇన్సూరెన్స్ పాలసీ. అంటే థర్డ్ పార్టీకి గాయాలు లేదా నష్టాలు కలిగించే ప్రమాదానికి మీరే బాధ్యులని తేలితే, మీ ఇన్సూరెన్స్ కంపెనీ దానికి సంబంధించిన ఖర్చులను కవర్ చేస్తుంది. అయితే, ఈ పాలసీ మీ కారుకు జరిగిన ఎలాంటి నష్టాలను కవర్ చేయదు.

సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజ్

మరోవైపు, ఒక సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ విస్తృతమైన కవరేజీని అందిస్తుంది మరియు ఇందులో దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు మరియు ప్రమాదాల కారణంగా మీ స్వంత కారుకు జరిగిన నష్టం లాంటి అనేక రకాల ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు. సమగ్ర పాలసీలు మరింత విస్తృతమైన కవరేజీని అందిస్తున్నప్పటికీ, అవి సాధారణంగా థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ కంటే ఖరీదైనవి.

ఒక సమగ్ర పాలసీ మీకు సరైన ఎంపిక అవునో కాదో అని నిర్ణయించడానికి మరియు ఖచ్చితంగా ఏమి కవర్ చేస్తుందో అర్థం చేసుకోవడానికి పాలసీ వివరాలను జాగ్రత్తగా సమీక్షించడం ముఖ్యం. ఇది పాలసీ పరిధి గురించి మీకు స్పష్టమైన ఆలోచనను అందిస్తుంది మరియు ప్రయోజనాలు అధిక ప్రీమియంలను సమర్థిస్తాయో లేదో తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తాయి.

నిర్ణయం తీసుకునే ముందు టొయోటా ఇన్సూరెన్స్ ధరలను చెక్ చేయడం ముఖ్యం. విభిన్న ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు అందించే ప్రీమియంలు మరియు కవరేజీని సరిపోల్చడానికి మీరు కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు మరియు మీ డబ్బుకు సమానమైన విలువను అందించే ఒక దానిని ఎంచుకోవచ్చు. మొత్తంమీద, ఒక థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ ప్రాథమిక రక్షణను అందిస్తున్నప్పటికీ, ఒక సమగ్ర పాలసీ విస్తృతమైన నష్టాల నుండి రక్షణను మరియు కవరేజీని అందిస్తుంది. అయితే, చివరిగా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు మీరు సమగ్ర పాలసీలకు సంబంధించిన అధిక ప్రీమియంలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ధరలను సరిపోల్చడంలో మరియు మీ అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోవడంలో మీకు సహాయపడుతుంది.

టొయోటా కార్ ఇన్సూరెన్స్‌తో యాడ్-ఆన్‌లు

కార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లను రైడర్లు లేదా ఎండార్స్‌మెంట్లు అని కూడా పిలుస్తారు, వీటిని మీరు మీ స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి జోడించవచ్చు. ఈ యాడ్-ఆన్‌లు నిర్దిష్ట ప్రమాదాలు లేదా పరిస్థితుల నుండి అదనపు రక్షణను అందిస్తాయి. అందుబాటులో ఉన్న కొన్ని సాధారణ కార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • జీరో డిప్రిషియేషన్ కవర్

    ఈ యాడ్-ఆన్ వాటి తరుగుదల విలువను లెక్కించకుండా విడిభాగాల మరమ్మత్తు లేదా భర్తీ కోసం పూర్తి కవరేజీని అందిస్తుంది.
  • ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్

    ఈ యాడ్-ఆన్ ఇంజిన్ మరమ్మత్తు లేదా భర్తీ ఖర్చును కవర్ చేస్తుంది మరియు నీరు చేరడం, ఆయిల్ లీకేజ్ లేదా హైడ్రోస్టాటిక్ లాక్ వల్ల కలిగే నష్టం విషయంలో దాని విడిభాగాలను కవర్ చేస్తుంది.
  • 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్

    ఈ యాడ్-ఆన్ ప్రమాదాల సందర్భంలో ఫ్లాట్ టైర్, బ్యాటరీ బ్రేక్‌డౌన్ మరియు టోయింగ్ సేవలు లాంటి సాధారణ కారు సమస్యలకు సహాయం అందిస్తుంది.
  • నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్

    ఈ యాడ్-ఆన్ మీరు క్లెయిమ్ ఫైల్ చేసినప్పటికీ, మీ రెన్యూవల్ ప్రీమియంలపై రాయితీని పొందేందుకు వీలు కల్పిస్తూ, మీ పేరుకుపోయిన నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది.
  • ప్రయాణీకుల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్

    యజమాని-డ్రైవర్ మరియు పెయిడ్ డ్రైవర్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్, లో కవర్ చేయబడవచ్చు, అయితే ప్రయాణీకులు కాదు. ఈ యాడ్-ఆన్‌తో ప్రయాణీకులు ప్రమాదంలో సంభవించే గాయాలు లేదా మరణాల కోసం ఇన్సూర్ చేయబడతారు.
  • కన్జ్యూమబుల్స్ కవర్

    ఈ యాడ్-ఆన్ ఈ యాడ్-ఆన్ ఇంజిన్ ఆయిల్, నట్లు, బోల్టులు వంటి మొదలైన కారు మరమ్మతు సమయంలో ఉపయోగించే కన్జ్యూమబుల్స్ ఖర్చులకు కవరేజీని అందిస్తుంది.
  • రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్

    ఈ యాడ్-ఆన్ మీ కారు దొంగతనం లేదా పూర్తి నష్టం జరిగిన సందర్భంలో మీ కారు యొక్క పూర్తి ఇన్వాయిస్ విలువను పొందేందుకు వీలుకల్పిస్తుంది.

ప్రతి యాడ్-ఆన్ అనేది టొయోటా యొక్క మొత్తం ఇన్సూరెన్స్ ధరను ప్రభావితం చేసే అదనపు ఖర్చుతో వస్తుందని గమనించడం ముఖ్యం. అందువల్ల, మీరు ఒక యాడ్-ఆన్‌ను ఎంచుకోవడానికి ముందు మీ అవసరాలు మరియు బడ్జెట్‌ను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఉత్తమ డీల్‌ను కనుగొనడానికి వివిధ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు అందించే ప్రయోజనాలు మరియు ప్రీమియంలను కూడా మీరు సరిపోల్చాలి. మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి తగిన యాడ్-ఆన్‌లను జోడించడం వలన మీ కారు కోసం మరింత సమగ్ర కవరేజీని మరియు రక్షణను పొందవచ్చు.

టొయోటా కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా కొనుగోలు చేయాలి?

మీ టొయోటా కారు కోసం కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఈ రెండు విధానాల్లో కొనుగోలు చేయవచ్చు. ప్రతి విధానం కోసం అనుసరించవలసిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 

కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం:

  • వివిధ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లను పరిశోధించండి మరియు వారు అందించే పాలసీలు, ప్రయోజనాలు మరియు ప్రీమియంలను సరిపోల్చండి
  • మీ అవసరాలు మరియు బడ్జెట్‌కు అనుగుణంగా సరిపోయే ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి.
  • ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు కారు తయారీ, మోడల్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు మీ వ్యక్తిగత సమాచారం లాంటి అవసరమైన వివరాలను పూరించండి.
  • మీకు కావలసిన ఇన్సూరెన్స్ పాలసీ మరియు యాడ్-ఆన్‌ల రకాన్ని ఎంచుకోండి.
  • సురక్షితమైన చెల్లింపు గేట్‌వేని ఉపయోగించి ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించండి.
  • పాలసీ డాక్యుమెంట్ మరియు ఇతర వివరాలను ఇమెయిల్ ద్వారా అందుకోండి.
  •  

    కార్ ఇన్సూరెన్స్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయడం:

  • వివిధ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లను పరిశోధించండి మరియు వారు అందించే పాలసీలు, ప్రయోజనాలు మరియు ప్రీమియంలను సరిపోల్చండి.
  • మీ అవసరాలు మరియు బడ్జెట్‌కు అనుగుణంగా సరిపోయే ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి.
  • మీ టొయోటా కారు కోసం కోట్ పొందడానికి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కార్యాలయాన్ని సందర్శించండి లేదా వారి కస్టమర్ సర్వీస్ నంబర్‌పై సంప్రదించండి.
  • కారు తయారీ, మోడల్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు మీ వ్యక్తిగత సమాచారం లాంటి అవసరమైన వివరాలను పూరించండి.
  • మీకు కావలసిన ఇన్సూరెన్స్ పాలసీ మరియు యాడ్-ఆన్‌ల రకాన్ని ఎంచుకోండి.
  • నగదు, చెక్కు లేదా ఆన్‌లైన్ బదిలీ ద్వారా ప్రీమియం చెల్లించండి.
  • మెయిల్ లేదా ఇమెయిల్ ద్వారా పాలసీ డాక్యుమెంట్ మరియు ఇతర వివరాలను అందుకోండి.
  •  

    మీరు కారు ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయాలని ఎంచుకున్నా, క్లెయిమ్ ప్రక్రియ సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మీరు మీ కారు మరియు వ్యక్తిగత వివరాల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించారని నిర్ధారించుకోవడం ముఖ్యం. ఉత్తమ డీల్ పొందడానికి వివిధ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు అందించే పాలసీలు మరియు ప్రీమియంలను సరిపోల్చడం కూడా మంచిది. ఈ పోలిక కోసం మీరు కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.

టొయోటా ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోండి

మీ టొయోటా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం అనేది ఒక సులభమైన ప్రక్రియ. మీరు అనుసరించగల దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు మీ క్రెడెన్షియల్స్ ఉపయోగించి మీ అకౌంటుకు లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఒక అకౌంటు లేకపోతే, మీరు మీ పాలసీ నంబర్ మరియు వ్యక్తిగత వివరాలను అందించడం ద్వారా ఒకదానిని క్రియేట్ చేయవచ్చు
  • మీ అకౌంటులోని 'రెన్యూవల్' విభాగానికి వెళ్లి, మీరు రెన్యూ చేయాలనుకుంటున్న పాలసీని ఎంచుకోండి.
  • కవరేజ్ మరియు యాడ్-ఆన్‌లతో సహా మీ పాలసీ వివరాలను సమీక్షించండి మరియు అవసరమైతే ఏవైనా మార్పులు చేయండి.
  • మీకు సరిపోయే చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోండి మరియు సురక్షితమైన చెల్లింపు గేట్‌వేను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించండి.
  • చెల్లింపు ప్రాసెస్ చేయబడిన తర్వాత, మీరు ఇమెయిల్ ద్వారా రెన్యూ చేయబడిన పాలసీ డాక్యుమెంట్‌తో పాటు ఒక నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు.

 

బదులుగా, మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మీ టొయోటా కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవచ్చు. దశలు ఆన్‌లైన్‌ రెన్యూవల్ మాదిరిగానే ఉంటాయి మరియు మీరు దీన్ని మీ స్మార్ట్‌ఫోన్ నుండి సౌకర్యవంతంగా చేయవచ్చు.

 

ఏవైనా చట్టపరమైన మరియు ఆర్థిక సమస్యలను నివారించడానికి, గడువు తేదీకి ముందు మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవడం ముఖ్యం. ఆన్‌లైన్ రెన్యూవల్ అనేది సమయం మరియు శ్రమను ఆదా చేసే అవాంతరాలు-లేని మరియు సౌకర్యవంతమైన ఆప్షన్. మీ పాలసీని రెన్యూ చేయడానికి ముందు మీరు మీ కవరేజ్ అవసరాలను సమీక్షించండి మరియు ఉత్తమ డీల్ పొందడానికి వివిధ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల ద్వారా అందించబడే ప్రీమియంలను సరిపోల్చండి.

మీ స్కోడా కోసం ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసే విధానం

క్లెయిమ్ విధానం

మీరు మీ టొయోటా కారు కోసం కారు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయాలనుకుంటే, మీరు ఈ సాధారణ దశలను అనుసరించవచ్చు:

  • క్లెయిమ్‌ను నమోదు చేయడానికి ప్రమాదం లేదా సంఘటన తర్వాత వీలైనంత త్వరగా మీ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. దీనిని సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీ హెల్ప్‌లైన్ లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చేయవచ్చు.
  • మీ పాలసీ వివరాలు మరియు ఇన్సూరెన్స్ కంపెనీకి అవసరమైన ఏదైనా ఇతర సమాచారం, అంటే ప్రమాదం లేదా సంభవించిన నష్టం లాంటి వివరాలు అందించండి.
  • ఇన్సూరెన్స్ కంపెనీ ఒక క్లెయిమ్ ప్రతినిధిని నియమిస్తుంది, వారు ప్రక్రియ గురించి మీకు మార్గనిర్దేశం చేస్తారు మరియు క్లెయిమ్ ప్రాసెస్ పూర్తి చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లను గురించి మీకు పూర్తి సమాచారం అందజేస్తారు.
  • మీరు క్లెయిమ్ ఫారం, ఒరిజినల్ రిపేర్ బిల్లులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ అభ్యర్థించిన ఏవైనా ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్లు లాంటి అవసరమైన డాక్యుమెంట్లను అందించాలి.
  • క్లెయిమ్‌ను సమీక్షించిన తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్‌మెంట్ మొత్తాన్ని నిర్ణయిస్తుంది, ఇది నేరుగా మీకు లేదా రిపేర్ షాప్‌కు చెల్లించబడవచ్చు.
  • సెటిల్‌మెంట్ మొత్తానికి సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే, మీరు ఇన్సూరెన్స్ కంపెనీ గ్రీవెన్స్ సెల్‌ను సంప్రదించవచ్చు లేదా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

పాలసీ రకం, నిబంధనలు, షరతులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ మార్గదర్శకాల ఆధారంగా క్లెయిమ్ ప్రాసెస్ మారవచ్చని గమనించడం ముఖ్యం. ఒక క్లెయిమ్ చేయడానికి ముందు మీ పాలసీ డాక్యుమెంట్‌ను సమీక్షించి కవరేజ్ మరియు క్లెయిమ్ ప్రాసెస్‌ను వివరంగా అర్థం చేసుకోవడం మంచిది. క్లెయిమ్ ప్రక్రియలో ఏవైనా ఆలస్యాలు లేదా సమస్యలను నివారించడానికి ఖచ్చితమైన సమాచారం మరియు డాక్యుమెంట్లను అందించడం కూడా ముఖ్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది?

నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) అంటే పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయని పాలసీదారులకు ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే రాయితీ. ఈ రాయితీ 20% నుండి 50% వరకు ఉండవచ్చు మరియు సంవత్సరాలుగా జమ చేయబడవచ్చు. ఒక క్లెయిమ్ చేసినప్పుడు ఎన్‌సిబి తగ్గించబడవచ్చు లేదా జప్తు చేయబడవచ్చు.

సమగ్ర మరియు థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ మధ్య గల తేడా ఏమిటి?

ఒక సమగ్ర కారు ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంట్లు, దొంగతనం, అగ్నిప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా థర్డ్-పార్టీ బాధ్యతలతో పాటు మీ స్వంత వాహనానికి జరిగే నష్టాల కోసం కవరేజీని అందిస్తుంది. మరోవైపు, థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ వాహనాలు మరియు ఆస్తికి జరిగిన నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది.

కార్ ఇన్సూరెన్స్‌లో యాడ్-ఆన్ కవర్ అంటే ఏమిటి మరియు అది విలువైనదేనా?

యాడ్-ఆన్ కవర్ అనేది అదనపు ప్రీమియంతో మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి జోడించగల ఒక ఆప్షనల్ కవరేజ్. యాడ్-ఆన్‌లు అదనపు రక్షణ మరియు జీరో డిప్రిసియేషన్, ఇంజిన్ ప్రొటెక్షన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మొదలైనటువంటి ప్రయోజనాలను అందిస్తాయి. అది విలువైనదేనా కాదా అనేది మీ వ్యక్తిగత అవసరాలు, డ్రైవింగ్ అలవాట్లు మరియు బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది.

నేను నా కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొత్త యజమానికి బదిలీ చేయవచ్చా?

అవును, మీరు మీ కారును విక్రయిస్తే మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొత్త యజమానికి బదిలీ చేయవచ్చు. ఈ ప్రక్రియలో బదిలీ గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించడం మరియు నామమాత్రపు ఫీజు చెల్లించడం లాంటివి ఉంటాయి. బదిలీ తర్వాత కొత్త యజమాని కొత్త కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం అప్లై చేయాలి.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం