రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
చాట్ సర్వీసెస్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మీరు ఒక స్టైలిష్ మరియు సమర్థవంతమైన హ్యాచ్‌బ్యాక్‌ను కోరుకుంటే, మారుతి సుజుకి స్విఫ్ట్ మీకు సరైన ఎంపికగా ఉండవచ్చు. డ్యూయల్-టోన్ స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉన్న నాలుగు సిలిండర్ల ఐదు-సీట్ల వాహనం రోజువారీ ప్రయాణాలకు అలాగే లాంగ్ డ్రైవ్స్ కోసం అనువైనదిగా ఉంటుంది.
కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ అనేది భారతదేశంలో అందుబాటులో ఉన్న ఐదు-డోర్ల హ్యాచ్‌బ్యాక్. దాని ప్రధాన ఫీచర్లలో కొన్ని ఇలా ఉన్నాయి:
* క్రూజ్ కంట్రోల్
* డిఆర్ఎల్‌లతో ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు
* కలర్డ్ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే
* స్మార్ట్‌ప్లే స్టూడియో
* స్పోర్టీ ఫ్రంట్ సీట్లు
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు రివర్స్ పార్కింగ్ కెమెరాతో కూడిన ఈ స్విఫ్ట్, స్టైల్‌ను సమర్థతతో కలపాలనుకునే వ్యక్తుల కోసం హ్యాచ్‌బ్యాక్ లాంటిది.
భారతదేశంలో రోడ్డుపై నడిచే అన్ని కార్లు తప్పనిసరిగా కనీసం థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి ఉండాలి. అయితే, ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం అనేది అదనపు ప్రయోజనాలు మరియు కవరేజీని అందించవచ్చు.
మారుతి సుజుకి స్విఫ్ట్ కోసం ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను పరిశీలిద్దాం.
ఆన్‌లైన్‌లో ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా మీరు మీ పాలసీని త్వరగా యాక్సెస్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ప్రక్రియ చాలా సులభం మరియు మీరు ఆన్‌లైన్‌లో కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ మారుతి సుజుకి స్విఫ్ట్ ఇన్సూరెన్స్ ధరను నిర్ణయించవచ్చు. ఒకసారి మీరు మీకు అవసరమైన డాక్యుమెంట్లను సేకరించిన తర్వాత, కేవలం కొన్ని క్లిక్‌లతో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయవచ్చు మరియు మీ పాలసీకి తక్షణ ప్రాప్యత పొందవచ్చు.
థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ లేదా సమగ్ర పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం అనేది అవాంతరాలు-లేనిదిగా ఉండవచ్చు. మీరు ఎక్కడినుండైనా మీ పాలసీని కొనుగోలు చేయవచ్చు మరియు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్‌ను క్రమం తప్పకుండా రెన్యూ చేసుకోవాలి మరియు దీనిని ఆన్‌లైన్‌లో చేయడం సౌకర్యవంతంగా ఉండవచ్చు.
మీరు ఒక థర్డ్-పార్టీ ప్లాన్‌ను కలిగి ఉన్నా లేదా సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉన్నా, మీ వాహన పాలసీకి రెగ్యులర్ రెన్యూవల్స్ అవసరం. ఆన్‌లైన్ రెన్యూవల్స్ అనేవి ప్రక్రియను చాలా సులభతరం చేస్తాయి. ఎందుకనగా, వీటిని తరచుగా పునరావృతం చేయాల్సి ఉంటుంది.
మీ మారుతి సుజుకి స్విఫ్ట్ ను సురక్షితం చేసుకునే విషయానికి వస్తే, మీకు రెండు ప్రధాన ఆప్షన్లు ఉన్నాయి:.
భారతీయ చట్టం ప్రకారం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ తప్పనిసరి మరియు ఇది మీ వాహనం కారణంగా జరిగిన ప్రమాదంలో థర్డ్-పార్టీ ఆస్తికి లేదా వ్యక్తులకు జరిగే నష్టాలు మరియు డ్యామేజీలను కవర్ చేస్తుంది. అయితే, ఈ పాలసీ మీ కారుకు జరిగిన నష్టాలకు లేదా మీకు తగిలిన గాయాలకు కవరేజీని అందించదు. కావున, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవర్ అనేది కనీస అవసరమైన ఇన్సూరెన్స్ కవరేజ్ కాబట్టి, ఇది అత్యంత అవసరమైన ఆర్థిక ఎంపిక.
సమగ్ర ప్లాన్ అనేది విస్తృతమైన కవరేజీని అందించే మరింత విస్తృతమైన మరియు ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీ. థర్డ్-పార్టీ లయబిలిటీ కోసం కవరేజ్, మీ కారుకు జరిగే నష్టాలు, దొంగతనం, అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర మానవ-నిర్మిత ప్రమాదాలకు జరిగే నష్టాలు దీని పరిధిలోకి వస్తాయి. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది డ్రైవర్ మరియు ప్రయాణీకుల కోసం కవరేజీలో చేర్చబడింది. ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు పూర్తి మనశ్శాంతిని అందిస్తుంది, అయితే, ఇది అధిక ఖర్చుతో వస్తుంది.
మీ మారుతి సుజుకి స్విఫ్ట్ కోసం ఏ రకమైన కవరేజీని ఎంచుకోవాలో నిర్ణయించేటప్పుడు, మీ బడ్జెట్, డ్రైవింగ్ అలవాట్లు మరియు రిస్క్ స్థాయిని పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం. కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ అనేది మీకు ఏ పాలసీ తగినవిధంగా సరిపోతుందని నిర్ణయించడంలో మీకు సహాయపడే ఒక ఉపయోగకరమైన సాధనం.
మీరు కొత్త లేదా ఖరీదైన కారును కలిగి ఉంటే లేదా అధిక-ప్రమాదం పొంచిఉన్న ప్రాంతాల్లో తరచుగా డ్రైవ్ చేస్తే, సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజీ అనేది ఒక ఉత్తమ ఎంపిక. మరోవైపు, మీ వద్ద ఒక పాత లేదా తక్కువ విలువైన కారు ఉంటే మరియు అత్యంత సరసమైన ఇన్సూరెన్స్ ఎంపిక కోసం చూస్తున్నట్లయితే, థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ సరిపోతుంది.
మీ పాలసీ కవరేజీని మెరుగుపరచే అదనపు ఫీచర్లను యాడ్-ఆన్‌లుగా పిలుస్తారు. ఈ యాడ్-ఆన్‌లను ఎంచుకోవడం వలన మీ మారుతి సుజుకి స్విఫ్ట్ ఇన్సూరెన్స్ ధర పెరగవచ్చని గమనించడం ముఖ్యం. అందువల్ల, ఇన్సూరెన్స్ ఖర్చును మీ బడ్జెట్‌లో ఉంచుకోవడానికి, మీకు ఉపయోగపడే యాడ్-ఆన్‌లను మాత్రమే ఎంచుకోవడం చాలా ముఖ్యం.
మీకు అందుబాటులో ఉండే కొన్ని యాడ్-ఆన్‌లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
కారులోని ప్రయాణీకులకు శారీరక గాయం లేదా మరణం సంభవించినప్పుడు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
ఇన్సూర్ చేయబడిన కారు పోయినా లేదా దొంగిలించబడినా తాళం చెవులను భర్తీ చేయడానికి అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది.
బ్రేక్‌డౌన్ సందర్భంలో ఫ్యూయల్ డెలివరీ, ఫ్లాట్ టైర్ మార్పు, టోయింగ్ మరియు ఇతర సహాయం లాంటి అత్యవసర సేవలను అందిస్తుంది.
నీరు చేరడం లేదా ఆయిల్ లీకేజీ కారణంగా కారు ఇంజిన్‌కు కలిగే నష్టాలను కవర్ చేస్తుంది.
ఇన్సూర్ చేయబడిన కారు నగరం లేదా నమోదిత రాష్ట్రం వెలుపల ఉన్నప్పుడు సంభవించే అత్యవసర పరిస్థితుల్లో ఇది సహాయపడుతుంది.
మీ మారుతి సుజుకి స్విఫ్ట్ కోసం ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడానికి ముందు, ఇన్సూరెన్స్ ధరను అంచనావేయడానికి కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం మంచిది. ఒకసారి మీరు అది పూర్తి చేసిన తర్వాత, ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా పాలసీని ఫైనలైజ్ చేయవచ్చు.
ప్రాసెస్ ప్రారంభించడానికి ముందు మీ కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు గుర్తింపు వివరాలు వంటి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు మీ వద్ద అందుబాటులో ఉండేలా చూసుకోండి. సైట్‌లోని సూచనలను అనుసరించండి, ఆన్‌లైన్ చెల్లింపు చేయండి. ఈ సమయంలో, మీరు ఎంచుకున్న యాడ్-ఆన్‌ల ఆధారంగా మీ మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ ఇన్సూరెన్స్ ధర హెచ్చుతగ్గులకు లోనవుతుందని గుర్తుంచుకోండి.
మీ స్విఫ్ట్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసేటప్పుడు కూడా మారుతి సుజుకి స్విఫ్ట్ ఇన్సూరెన్స్ ధరను ఆన్‌లైన్‌లో చెక్ చేయడం మంచిది. ఒకసారి మీరు అది పూర్తి చేసిన తర్వాత, మీ రెన్యూవల్ కొనసాగించవచ్చు. అవాంతరాలు లేని రెన్యూవల్ ప్రాసెస్‌ను నిర్ధారించడం కోసం మీకు గత పాలసీ వివరాలు అవసరం కావచ్చు.
మీ మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడం తప్పనిసరి అవసరం, దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. అవాంతరాలు-లేని కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రక్రియ కోసం మీరు అనుసరించవలసిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పాలసీ గడువు తేదీకి కొన్ని వారాల ముందు రెన్యూవల్ ప్రక్రియను ప్రారంభించాలని సిఫార్సు చేయబడింది.
రెన్యూ చేయడానికి ముందు, వివిధ ప్రొవైడర్ల నుండి పోటీ ధరల వద్ద అత్యుత్తమ పాలసీని పొందడానికి కార్ ఇన్సూరెన్స్ ప్లాన్లను సరిపోల్చండి అని సలహా ఇవ్వబడుతుంది.
మీ పాలసీ కవరేజీని మెరుగుపరచడానికి మీరు యాడ్-ఆన్‌ల కోసం కూడా చూడవచ్చు.
రెన్యూవల్ ప్రాసెస్ ప్రారంభించడానికి ముందు మీ కార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, గడువు ముగిసిన పాలసీ డాక్యుమెంట్ మరియు మీ గుర్తింపు వివరాలను అందుబాటులో ఉంచుకోండి.
మీ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మీ పాలసీ వివరాలను నమోదు చేయండి మరియు రెన్యూవల్ కోసం అవసరమైన సమాచారాన్ని అందించండి.
అందుబాటులో ఉన్న చెల్లింపు విధానాల ద్వారా ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించండి.
ఒకసారి మీరు చెల్లింపు చేసిన తర్వాత, ఇమెయిల్ ద్వారా రెన్యూ చేయబడిన పాలసీ డాక్యుమెంట్ అందుకుంటారు.
ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు ఒక అవాంతరాలు లేని రెన్యూవల్ ప్రాసెస్‌ను నిర్ధారించుకోవచ్చు మరియు మీ మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాలను పొందడం కొనసాగించవచ్చు.
నగదురహిత మరియు రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ విధానం కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు కొద్దిగా భిన్నంగా ఉంటాయి.
నగదురహిత క్లెయిమ్ కోసం మీరు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ద్వారా అధీకృతం చేయబడిన నెట్‌వర్క్ గ్యారేజీకి కారును తీసుకెళ్లాలి. ప్రమాదం లేదా కారుకు జరిగిన నష్టం గురించి మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి మరియు వారికి పాలసీ నంబర్, కారు రిజిస్ట్రేషన్ నంబర్, నష్టం యొక్క వివరణ మొదలైన వివరాలను అందించాలి. గ్యారేజీ నష్టాన్ని అంచనా వేస్తుంది మరియు రిపేరింగ్ అంచనాను ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు పంపిస్తుంది. ఒకసారి క్లెయిమ్ ఆమోదించబడిన తర్వాత గ్యారేజీ మరమ్మత్తులను నిర్వహిస్తుంది, మరియు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నేరుగా గ్యారేజీతో చెల్లింపును సెటిల్ చేస్తారు.
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ విషయంలో మీరు ప్రమాదం లేదా కారుకు జరిగిన నష్టం గురించి ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి మరియు వారికి పాలసీ నంబర్, కారు రిజిస్ట్రేషన్ నంబర్ మరియు నష్టం వివరణ లాంటి వివరాలను అందించాలి. ఆ తర్వాత మీరు కారును మీకు నచ్చిన ఏదైనా గ్యారేజీకి తీసుకెళ్లి రిపేర్ చేయించుకోవచ్చు. మీరు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు బిల్లులు మరియు రిపేర్ అంచనాలను సమర్పించాలి. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ క్లెయిమ్‌ను ధృవీకరిస్తారు మరియు పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం మీకు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
సులభమైన క్లెయిమ్ ప్రక్రియను నిర్ధారించడానికి ఏదైనా నష్టం లేదా ప్రమాదం గురించి ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు వీలైనంత త్వరగా తెలియజేయడం ముఖ్యం.
|
అవును, భారతీయ మోటారు వాహనాల చట్టం ప్రకారం కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా డ్రైవింగ్ చేయడం జరిమానాలు మరియు చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు.
ఇది మీ వ్యక్తిగత అవసరాలు మరియు ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ బాధ్యత మరియు మీ స్వంత కారుకు జరిగే నష్టాలు రెండింటిని కవర్ చేస్తుంది, అయితే, థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ ఆస్తికి లేదా ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తికి నష్టాన్ని కవర్ చేస్తుంది, కానీ, ఇది మీ స్వంత కారుకు కాదు. మీరు ఒక కొత్త లేదా ఖరీదైన కారును కలిగి ఉంటే, సమగ్ర ఇన్సూరెన్స్ ఒక మెరుగైన ఎంపికగా ఉండవచ్చు.
మారుతి సుజుకి స్విఫ్ట్ తో సహా అనేక కార్లు ఆన్‌లైన్ ఇన్సూరెన్స్‌తో కవర్ చేయబడతాయి. అయితే, ఏవైనా నిర్దిష్ట మినహాయింపులు లేదా అవసరాల కోసం ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో చెక్ చేయడం ముఖ్యం.
ఒక పాలసీని కొనుగోలు చేసే ముందు మీరు కవరేజ్ మరియు మినహాయింపులు, ప్రీమియం మొత్తం, మినహాయించదగినవి, అందుబాటులో ఉన్న యాడ్-ఆన్‌లు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్ మరియు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ రివ్యూలను చెక్ చేయాలి.
అవును, మీ మారుతి సుజుకి స్విఫ్ట్ పాతది అయినప్పటికీ, ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. చట్ట ప్రకారం థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పనిసరి మరియు ఇది ప్రమాదం జరిగిన సందర్భంలో థర్డ్ పార్టీకి కలిగే నష్టాలు లేదా గాయాలకు కవరేజీని అందిస్తుంది. అదనంగా, ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉండటం వలన దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ఆర్థిక రక్షణ పొందవచ్చు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి