రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
చాట్ సర్వీసెస్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
నేటి కాలంలో మీ షెడ్యూల్ మీ నియంత్రణలో ఉండాలనుకుంటే, ఖచ్చితంగా కారు కలిగి ఉండాల్సిందే. మీ కారులో మీరు గడిపే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అది మీ రెండవ ఇల్లు అని కూడా మీరు భావించవచ్చు.
మంచి కారును కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం కూడా అంతే ముఖ్యం. రోడ్డు మీద ప్రమాదాలు మరియు ఇతర దుర్ఘటనల నుండి ఇది మీకు మరియు మీ కారుకు ఆర్థిక రక్షణ అందించడమే కాకుండా, ఇది ఒక చట్టపరమైన ఆవశ్యకత.
కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే సమయంలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం గందరగోళంగా మరియు కష్టంగా అనిపించే అవకాశం ఉందని మాకు తెలుసు. అయితే, పాలసీ అందించే కవరేజీతో పాటు ప్రీమియం అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటిగా ఉంటుంది.
మా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది అన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు చెల్లించవలసిన ప్రీమియం మొత్తం పై ఒక అంచనాను అందిస్తుంది.
మీ ఇన్సూరెన్స్ ప్రీమియంలను నియంత్రించడంలో మీకు సహాయపడడమే మా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ యొక్క ప్రధాన ఉద్దేశం. కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకునే ప్రక్రియను అత్యంత సులభంగా చేయడమే లక్ష్యంగా మేము ఈ క్యాలిక్యులేటర్‌ను రూపొందించాము. క్యాలిక్యులేటర్‌కు సంబంధించిన కొన్ని ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
✓ ప్రీమియం మొత్తానికి సంబంధించిన తక్షణ అంచనాను మీకు అందిస్తుంది
✓ మారుతున్న కవరేజీ మరియు ఇతర అంశాలు ప్రీమియం చెల్లింపులను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయమై మీకు ఒక అవగాహనను అందిస్తుంది
✓ కొనుగోలు సమయంలో మీకు అవసరమయ్యే ప్రతి డాక్యుమెంట్‌ను అందుబాటులో ఉంచుకునేలా మిమ్మల్ని సిద్ధం చేస్తుంది
✓ మీరు ఏ ప్లాన్‌ను హడావుడిగా ఎంచుకోవలసిన అవసరం లేదు
✓ మరియు అత్యంత ముఖ్యంగా, ప్రీమియంలను లెక్కించే ప్రయత్నంలో మీరొక గణితశాస్త్రవేత్తగా మారాల్సిన ఒత్తిడిని ఇది తొలగిస్తుంది.
మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ నుండి సరైన ఫలితం పొందాలని అనుకుంటే, చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని ఏ అంశాలు నిర్ణయిస్తాయో మీరు అర్థం చేసుకోవాలి మరియు ముఖ్యమైన అంశాలు కొన్నింటిని మేము ఇక్కడ అందించాము:
కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంని నిర్ణయించే అత్యంత ప్రాథమిక అంశాల్లో ఇది ఒకటి.
✓ కార్ తయారీ
ఈ నియమం చాలా సరళమైనది; వాహనం సురక్షితంగా ఉంటే, ప్రమాదావకాశాలు తగ్గుతాయి మరియు ప్రీమియంలు తగ్గుతాయి.
సులభంగా ఉంది కదా?
ఉదాహరణకు, తెరవడానికి కష్టంగా ఉండే ఉత్తమ లాకింగ్ ఫీచర్లు కలిగిన కారును మీరు ఎంచుకుంటే. ఆ కారు దొంగతనానికి గురయ్యే ప్రమాదవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే, స్పోర్ట్స్ కారు విషయంలో ప్రమాదవకాశాలు స్వాభావికంగా ఎక్కువగా ఉంటాయి, స్పీడ్ డ్రైవింగ్ మరియు యాక్సిడెంట్ల కారణంగా ప్రమాదవకాశాలు ఎక్కువగా ఉంటాయని మర్చిపోకండి.
✓ కారుకు ఏదైనా మార్పులు చేయడం
మీరు కారుకు ఏవైనా మార్పులు చేస్తే, అది మీరు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మీ కారు తయారీ సమయంలో దానిలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఫిట్ చేయబడి ఉండి, ఆ తర్వాత మీరు దానిని ఆటోమేటిక్‌కు మార్చాలనుకుంటే, అది మీ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది.
✓ ఇంధన రకం
ఎక్కువ ఇంధన సామర్థ్యం కోసం మీరు పెట్రోల్ కారు తీసుకోవచ్చు కానీ, డీజిల్ కారు అనేది ఒక నిర్ధిష్ట కాల వ్యవధిలో కారు పనితీరును పెంచగలదు. మీరు మీ కారులో పోసే ఇంధనం సైతం మీ ప్రీమియం చెల్లింపును నిర్ణయిస్తుంది.
అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అనేది మీ కారుకు ప్రస్తుతం మార్కెట్లో లభించే విలువను సూచిస్తుంది. మీ కారు దొంగతనానికి గురైనప్పుడు లేదా దానికి ఏదైనా నష్టం జరిగినప్పుడు, మీరు క్లెయిమ్ చేయగల గరిష్ట మొత్తం కూడా ఇదే అవుతుంది. ఈ క్రింది సాధారణ లెక్కింపుతో ఈ విలువ నిర్ణయించబడుతుంది:
ఐడివి = ఎక్స్-షోరూమ్ ధర + ఫిట్టింగ్స్ విలువ (ఏవైనా ఉంటే) – డిప్రిసియేషన్ రూపంలో తీసి వేయబడిన విలువ
కాబట్టి, ఐడివి ఎక్కువయ్యే కొద్దీ, మీరు చెల్లించాల్సిన ప్రీమియం ఎక్కువగా ఉంటుందని మీరు భావించే అవకాశం ఉంది. ఆ మాట నిజమే అయినప్పటికీ, ఐడివి తక్కువగా ఉంటే, కవరేజీ విషయంలో మీరు రాజీపడినట్లే అని గుర్తుంచుకోండి. మీ కారు మార్కెట్ విలువకు దాదాపు సమానంగా ఉండే ఐడివి మాత్రమే ఆదర్శనీయం. అలాగే, ఐడివి అనేది కారు వయస్సుతో పాటు తగ్గుతుంది.
క్లుప్తంగా చెప్పాలంటే, నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) అనేది మీరు ఒక పూర్తి సంవత్సరం పాటు బాధ్యతాయుతమైన డ్రైవర్‌గా ఉన్నారని సూచించే ఒక టోకెన్ లాంటిది. ఎలాంటి క్లెయిమ్ లేని ప్రతి సంవత్సరం కోసం మీరు ఈ బోనస్‌కు అర్హత సాధిస్తారు. ఎన్‌సిబి ఎంపికతో, మీరు ఓన్ డ్యామేజ్ ప్రీమియంలపై (ఐడివి ప్రకారం నిర్ణయించబడుతుంది) 50% వరకు ఆదా చేసుకోవచ్చు.
అర్థం కాని పదజాలం లాగా అనిపిస్తోందా? ప్రాథమికంగా, (ఏదైనా ఒక క్లెయిమ్ సందర్భంలో) ఇన్సూరెన్స్ ప్రొవైడర్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను పూర్తి చేసే ముందు మీరు మీ స్వంత డబ్బును వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న మొత్తాన్నే వాలంటరీ ఎక్సెస్‌గా పేర్కొంటారు. కాబట్టి, వాలంటరీ ఎక్సెస్ ఎంత ఎక్కువగా ఉంటే, ప్రీమియం చెల్లింపులు అంత తక్కువగా ఉంటాయి.
యాడ్-ఆన్ కవర్‌లనేవి ప్రీమియంలను పెంచవచ్చు, కానీ అవి అందించే ప్రయోజనాల కారణంగా, క్లెయిమ్ సమయంలో వాటి ప్రయోజనాలు అందుకోవడం మీకు సంతోషం కలిగిస్తుంది.
కొన్ని అత్యంత ఉపయోగకరమైన యాడ్-ఆన్లు జీరో డిప్రిషియేషన్ కవర్ (డిప్రిసియేషన్‌ను పరిగణనలోకి తీసుకోకుండా సమగ్ర కవరేజీ అందిస్తాయి), ఆన్-రోడ్ అసిస్టెన్స్ కవర్ (మీ ప్రయాణం మధ్యలో మీ కారు ఆగిపోయినప్పుడు మీకు సహాయపడుతుంది) మరియు ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ మరియు ఇతర రకాల కవర్లను కలిగి ఉంటాయి.
ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లాంటి చెల్లుబాటు అయ్యే ఆటోమొబైల్ ఏజెన్సీతో మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే, మీరు అదృష్టవంతులు కాగలరు. అటువంటి సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు, కొన్ని కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు మీ స్వంత డ్యామేజీ ప్రీమియం మీద అదనపు డిస్కౌంట్‌లు అందిస్తాయి.
అంతేకాకుండా, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఆర్ఎఐ) ద్వారా ఆమోదించబడిన యాంటీ-థెఫ్ట్ ఉపకరణాలు మరియు పరికరాల మీద ప్రీమియం చెల్లింపులు పై 2.5% వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
సాధారణంగా, భారతదేశంలో పట్టణ యొక్క శివారు ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే, ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మీ వాడకం అనేది నగరం పరిధిలో ఉంటే, మీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు.
మీరు ఢిల్లీలో (లేదా IRDA ప్రకారం జోన్ A పరిధిలోకి ఏదైనా ఇతర నగరంలో) నివసించే వారైతే, అదే రకమైన కారు కలిగిన మీ రాంచీ స్నేహితుడితో పోలిస్తే, మీరే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తే, మీరు మోసానికి గురైనట్లుగా భావించకండి. కొన్నిసార్లు, కేవలం ప్రదేశం కారణంగా ఈ పరిస్థితి ఎదురుకావచ్చు.
మా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ నుండి మీరు అందుకునే ఫలితం అనేది మీరు నమోదు చేసిన వివరాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీ ప్లాన్‌ను రెన్యూవల్ చేసుకోవడానికి మీకు ఎంత ఖర్చు అవుతుందో మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, అది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
✓ ఉపయోగించిన కారు కోసం
ప్రస్తుతం ఉపయోగిస్తున్న కారు కోసం మీరు ప్రీమియం లెక్కించాలనుకుంటే, మీరు ఈ క్రింది వివరాలు అందించాలి:
● కార్ రకం
● ఇంధన రకం
● కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ వివరాలు
● రిజిస్ట్రేషన్ నంబర్
● యాజమాన్యంలో మార్పు ఉంటే, ఆ వివరాలు
● గత క్లెయిమ్‌ల చరిత్ర (మునుపటి సంవత్సరం/లలో చేయబడిన క్లెయిమ్‌లు)
✓ కొత్త కారు కోసం
ఒక కొత్త కారు కోసం మీరు ప్రీమియంలు లెక్కించాలనుకుంటే, మీరు ఈ క్రింది వివరాలు అందించాలి:
● తయారీదారు పేరు
● కార్ మోడల్
● కార్ రిజిస్ట్రేషన్ చేసిన రాష్ట్రం
● తయారీ సంవత్సరం
● మీ వ్యక్తిగత వివరాలు (కార్ యజమాని వివరాలు)
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి