రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హ్యుందాయ్ క్రెటా కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి/రెన్యూ చేయండి

Hyundai Creta Car Insurance

కార్ ఇన్సూరెన్స్ కోట్ కోసం వివరాలను షేర్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

1996 లో ప్రారంభమై, భారతదేశంలో తన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్న దక్షిణ కొరియా మ్యానుఫ్యాక్చరర్ సంస్థ హ్యూందాయ్ ఎల్లప్పుడూ, భారతీయ ఆటోమోటివ్ రంగానికి గణనీయమైన సహకారాన్ని అందించింది. 1998 లో తన మొట్టమొదటి ప్రధాన ఉత్పత్తి హ్యూందాయ్ శాంత్రో మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుండి ఇది భారతీయ కారు మార్కెట్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. అప్పటి నుండి, మ్యానుఫ్యాక్చరర్ కర్మాగారం నుండి విడుదలైన కొత్త మోడళ్ళు, ఎల్లప్పుడూ భారతీయ ఆటో ఔత్సాహికుల నుండి ప్రేమ మరియు ప్రశంసలను పొందాయి. జులై 2015 లో తిరిగి ప్రారంభించబడిన అలాంటి ఒక మోడల్ హ్యూందాయ్ క్రెటా. 

 

హ్యూందాయ్ క్రెటా యొక్క గుర్తించదగిన ఫీచర్లు

  • మీ బడ్జెట్ మరియు ఫీచర్ ప్రాధాన్యత ఆధారంగా ఎంచుకోవడానికి హ్యూందాయ్ క్రెటా అనేది ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
  • ఇది ఐదు-సీట్ల కాంపాక్ట్ ఎస్‌యువి, రోడ్లు మరియు రోడ్లు లేని ప్రాంతాల కోసం అనువైనది.
  • ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మూడు ఇంజిన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
  • వాహనం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఇఎస్‌సి), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (విఎస్ఎం), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఎసి), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు మరియు ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లతో వస్తుంది. దీని భద్రతా పరిధిలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్), వెనుక పార్కింగ్ కెమెరా మరియు ఇబిడితో కూడిన ఎబిఎస్ ఉంటాయి.
  • ఇవి హ్యూందాయ్ క్రెటా కు సంబంధించిన కొన్ని ఫీచర్ల జాబితా అయితే, ఒక యజమానిగా మీరు దాని రిజిస్ట్రేషన్ సమయంలో కారు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా పొందాలి. మోటారు వాహనాల చట్టం ద్వారా నిర్దేశించబడిన తప్పనిసరి అవసరాలలో ఇది ఒకటి.

హ్యూందాయ్ క్రెటా కోసం ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు

ఒక ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీరు ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అది కూడా ప్రమాదం జరిగిన సందర్భంలో థర్డ్ పార్టీకి జరిగిన గాయం లేదా నష్టం కారణంగా తలెత్తవచ్చు. అంతేకాకుండా, మీ కారుకు నష్టం జరిగిన సందర్భంలో మీరు మీ ఫైనాన్సులను కూడా సురక్షితం చేసుకోవచ్చు. 

సాంప్రదాయక ఆఫ్‌లైన్ విధానానికి బదులుగా ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలను చూద్దాం:

 

1. బహుళ పాలసీలను సరిపోల్చడం

మీ హ్యూందాయ్ క్రెటా కోసం ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు, మీరు అనేక ప్లాన్ల ప్రయోజనాలను ఒకేసారి సరిపోల్చవచ్చు మరియు అంచనా చేయవచ్చు. బహుళ ప్లాన్ల ఆఫ్‌లైన్ పోలిక అనేది చాలా శ్రమతో కూడుకున్నది. ఒక కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ అనేది వివిధ పాలసీలను సరిపోల్చడానికి, మీ అవసరాలకు ఉత్తమంగా సరిపోయేదాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించగల ఒక సులభమైన సాధనం. అంతేకాకుండా, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ఫీచర్లను అంచనా వేసేటప్పుడు పాలసీల ధరలను పోల్చడానికి కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.

 

2. పేపర్‌వర్క్ లేదు

ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్‌తో మరొక ప్రయోజనం ఏమిటంటే, పాలసీదారు మరియు వాహనం సంబంధిత కొన్ని వివరాలతో మీరు సుదీర్ఘమైన ఆటో-పాపులేటెడ్ ఫారంలను పూరించాల్సిన అవసరం లేదు. అనగా, వాహనం యొక్క రిజిస్ట్రేషన్ వివరాలు, ఛాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్, పాలసీదారు పేరు మరియు చిరునామా, ప్లాన్ రకం మరియు మీ పాలసీ యొక్క నామినీ, ఈ వివరాలలో కొన్నింటిని ఇన్సూరెన్స్ సంస్థ అడగవచ్చు. బదులుగా, ఆఫ్‌లైన్ ప్లాన్ల కోసం మీరు ఈ వివరాలను వేర్వేరు చోట్ల అనేక సార్లు పూరించాల్సి ఉంటుంది, ఇది కొంచెం కష్టమైన పని.

 

3. సౌలభ్యం & తక్షణ పాలసీ 

ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన కలిగే అత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే, మీరు ఎక్కడినుండైనా మరియు ఏ సమయంలోనైనా మీ పాలసీని కొనుగోలు చేయవచ్చు మరియు రెన్యూ చేసుకోవచ్చు. మీరు ఇకపై మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ ఆఫీసును సంప్రదించాల్సిన అవసరం లేదు; మీరు మీ సౌలభ్యం మేరకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, మీరు ఆన్‌లైన్ కొనుగోలు చెల్లింపును పూర్తి చేసిన వెంటనే మీ ఇన్‌బాక్స్‌లో పాలసీని అందుకుంటారు.

 

4. ఇన్సూరెన్స్ కంపెనీ విశ్వసనీయతను చెక్ చేయడం సులభం

ఒక ఆన్‌లైన్ ప్లాన్‌తో ఇన్సూరెన్స్ కంపెనీ విశ్వసనీయతను చెక్ చేయడం చాలా సులభం. మీరు పాలసీదారుల నుండి ఆధారాల కోసం చూడవచ్చు మరియు వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన కొనుగోలుదారుల పోస్ట్ చేసిన రివ్యూలను కూడా చదవవచ్చు. ఈ విధంగా, ఇన్సూరెన్స్ కంపెనీ గురించి నిజమైన అభిప్రాయాలను తెలుసుకోవడం సులభతరం అవుతుంది. 

హ్యూందాయ్ క్రెటా కార్ ఇన్సూరెన్స్: దానిలో చేరికలు మరియు మినహాయింపులు

  • చేర్పులు

  • మినహాయింపులు

థర్డ్-పార్టీ గాయం, మరణం మరియు వైకల్యం.

థర్డ్-పార్టీ ఆస్తి నష్టాలు.

కారు జరిగిన పూర్తి నష్టం.

సహజ మరియు మానవ నిర్మిత విపత్తుల నుండి రక్షణ.

పర్సనల్ యాక్సిడెంట్ కవర్ (తప్పనిసరి; కానీ మీకు ఇప్పటికే ఒకటి ఉంటే కొనుగోలు చేయవలసిన అవసరం లేదు).

1 ఆఫ్ 1

చెల్లుబాటు అయ్యే కార్ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా డ్రైవింగ్ చేయడం.

చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం.

కారు సాధారణ అరుగుదల మరియు తరుగుదల.

కారుకు జరిగిన ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ నష్టాలు.

మత్తు పదార్థాల ప్రభావంతో కారు నడపడం.

 పేర్కొన్న భౌగోళిక సరిహద్దు వెలుపల సంభవించే నష్టాలు లేదా డ్యామేజీలు.

సందేహాస్పదమైన కారును వారి ఉద్దేశించిన ప్రయోజనం కోసం ఉపయోగించనప్పుడు సంభవించే నష్టాలు. 

1 ఆఫ్ 1

హ్యూందాయ్ క్రెటా కోసం కార్ ఇన్సూరెన్స్ పాలసీల రకాలు

చట్టపరమైన సమ్మతి మరియు ఆర్థికపరమైన కవరేజ్ కోసం వాహన యజమానులందరూ ఒక పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి. హ్యూందాయ్ క్రెటా కోసం కార్ ఇన్సూరెన్స్ రెండు వర్గాల్లో అందుబాటులో ఉంది – థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ మరియు సమగ్ర కార్ ఇన్సూరెన్స్.

థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్

ఒక థర్డ్-పార్టీ ప్లాన్ యాక్సిడెంట్ లేదా ఢీకొనడం లాంటివి జరిగిన సందర్భంలో థర్డ్ పార్టీ వ్యక్తికి చెల్లించవలసిన బాధ్యతలకు కవరేజ్ అందిస్తుంది. ఇది వారి వాహనం లేదా ఆస్తికి జరిగిన నష్టాల కోసం కావచ్చు మరియు గాయాలు, మరణం కోసం కూడా కావచ్చు. అందువల్ల, మీరు చెల్లించే హ్యూందాయ్ క్రెటా ఇన్సూరెన్స్ ధర కోసం థర్డ్-పార్టీ ప్లాన్ చట్టపరమైన సమ్మతిని నిర్ధారిస్తుంది. ఇది కనీస అవసరం అయినప్పటికీ, మీ కారుకు జరిగే నష్టాలకు సంబంధించి ఎలాంటి కవరేజీని అందించదు.

సమగ్ర కార్ ఇన్సూరెన్స్

ఒక సమగ్ర పాలసీ కేవలం థర్డ్-పార్టీ బాధ్యతలకు మాత్రమే కాకుండా, మీ హ్యూందాయ్ క్రెటా కు జరిగిన నష్టాలకు కూడా కవరేజీని అందిస్తుంది. అందువల్ల, విస్తృతమైన ఇన్సూరెన్స్ కవరేజీని అందించడానికి సమగ్ర ప్లాన్ అనేది థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పరిమితిని దాటవేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత సంఘటనలు, దొంగతనం మరియు అగ్నిప్రమాదం కారణంగా జరిగే నష్టాలు సమగ్ర పాలసీ పరిధికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు.

అంతేకాకుండా, సమగ్ర ప్లాన్‌లో పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కూడా ఉంటుంది. ఇది ప్రమాదం జరిగిన సందర్భంలో యజమాని-డ్రైవర్ ఎదుర్కొన్న గాయాలకు పరిహారం క్లెయిమ్ చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే, మీకు ఇప్పటికే ఒక పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఉంటే, హ్యూందాయ్ క్రెటా కోసం మీ ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్‌తో దానిని మళ్లీ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు.

హ్యూందాయ్ క్రెటా కార్ ఇన్సూరెన్స్ కోసం అందుబాటులో ఉన్న యాడ్-ఆన్‌లు

యాడ్-ఆన్‌లు అనేవి మీరు మీ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీతో కొనుగోలు చేయగల ఆప్షనల్ పాలసీ కవర్లు. ఈ కవర్లు ప్రామాణిక సమగ్ర కారు కవరేజీలో భాగం కాదు, కానీ ఇప్పటికే ఉన్న కవర్‌కు జోడించబడి ఉంటాయి. స్టాండర్డ్ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవరేజ్ పరిమితిని అధిగమించడానికి యాడ్-ఆన్‌లు ఉపయోగపడతాయి.

కొనుగోలు చేయగల యాడ్-ఆన్‌ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

ఈ యాడ్-ఆన్‌లు హోండా కార్ ఇన్సూరెన్స్ ధరను పెంచుతాయి, కానీ అవి దీర్ఘకాలంలో విలువకు తగిన ఫలితాన్ని అందిస్తాయి. 

హ్యూందాయ్ క్రెటా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి?

  1. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. మీ హ్యూందాయ్ క్రెటా మోడల్, తయారీ తేదీ మరియు రిజిస్ట్రేషన్ నగరం లాంటి వివరాలను పేర్కొనండి.
  3. మీ అవసరాల ఆధారంగా సరైన పాలసీని ఎంచుకోండి.
  4. పైన పేర్కొన్న ఎంపికల ఆధారంగా, హ్యూందాయ్ క్రెటా ఇన్సూరెన్స్ ధర కోసం మీ కోట్ రూపొందించబడింది.
  5. మీరు ఒక సమగ్ర ప్లాన్‌ను కలిగి ఉంటే, యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోవచ్చు మరియు మీ పాలసీ ఐడివిని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. హ్యూందాయ్ క్రెటా కార్ ఇన్సూరెన్స్ ధరలను లెక్కించడంలో కూడా ఈ అంశాలు చేర్చబడ్డాయి.
  6. మీరు మీ ప్లాన్ ప్రత్యేకతల ఆధారంగా చెల్లింపు చేసిన తర్వాత, మీ పాలసీ తక్షణమే మీ మెయిల్‌బాక్స్‌కు పంపించబడుతుంది.

మీ హ్యూందాయ్ క్రెటా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం

  • సందర్శించండి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్‌ను మరియు 'ఆన్‌లైన్‌లో రెన్యూ చేయండి' ట్యాబ్‌ను గుర్తించండి..
  • మీరు మీ కారు రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు మీ ప్రస్తుత పాలసీ వివరాలను నమోదు చేయండి.
  • మీరు మీ సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీతో ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయకపోతే, అప్పుడు అర్హత కలిగిన 'నో క్లెయిమ్ బోనస్' శాతాన్ని సమీక్షించడం చాలా అవసరం.
  • ఒకసారి మీరు ఎన్‌సిబి ప్రయోజనాలను పొందిన తర్వాత, మీరు కొత్త కవర్లను జోడించడం మరియు హ్యూందాయ్ క్రెటా కార్ ఇన్సూరెన్స్ ధరను పెంచే అనవసరమైన యాడ్-ఆన్‌లను తొలగించడం ద్వారా మీ పాలసీ కవరేజీని సమీక్షించవచ్చు.
  • మీరు పాలసీ కవరేజీని సమీక్షించిన తర్వాత, ఏదైనా మార్పు జరిగిన సందర్భంలో ఎండార్స్‌మెంట్‌ను ఫైల్ చేయడానికి ముందు మీ వ్యక్తిగత వివరాలను ధృవీకరించండి.
  • హ్యూందాయ్ క్రెటా ఇన్సూరెన్స్ ధర కోసం కోట్ పొందడానికి పైన పేర్కొన్న వివరాలను సమర్పించండి.
  • చివరిగా, చెల్లింపు చేయండి మరియు మీ ఇన్‌బాక్స్‌లో తక్షణమే మీ పాలసీని అందుకోండి.

మీ హ్యూందాయ్ క్రెటా కోసం ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసే విధానం

  • మొదట, మీ ఇన్సూరెన్స్ కంపెనీకి నష్టాల గురించి తెలియజేయండి మరియు మీ క్లెయిమ్‌ను నమోదు చేసుకోండి.
  • ఒకసారి మీ క్లెయిమ్ నమోదు చేయబడిన తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్ అప్లికేషన్‌ను ట్రాక్ చేయడానికి ఉపయోగించగల ఒక ప్రత్యేక క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను మీకు జారీ చేస్తుంది.
  • ఇప్పుడు, పాలసీ రకాన్ని బట్టి ప్రాసెస్ మారవచ్చు. నగదురహిత ప్లాన్ల విషయంలో మీరు మీ వాహనాన్ని రిపేర్ చేయించుకోవడానికి నెట్‌వర్క్ గ్యారేజీలలో ఒకదానికి తీసుకువెళ్లాలి. అయితే, ఏవైనా రిపేర్స్ చేయడానికి ముందు ఒక ఇన్సూరెన్స్ సర్వేయర్ నష్టాన్ని పరిశీలిస్తారు మరియు రిపేర్ ఖర్చును ఆమోదిస్తారు. రీయింబర్స్‌మెంట్ ప్లాన్ల విషయంలో అలాంటి షరతులు లేవు, మీరు సమీపంలోని ఏదైనా సర్వీస్ గ్యారేజీ నుండి మీ వాహనాన్ని రిపేర్ చేయించుకోవచ్చు. రిపేర్స్ కోసం నెట్‌వర్క్ గ్యారేజీని సందర్శించడం తప్పనిసరి కాదు.
  • నగదురహిత క్లెయిమ్ విషయంలో సర్వీస్ గ్యారేజ్ రిపేరింగ్స్‌కు సంబంధించి అవసరమైన అన్ని వివరాలను మీ ఇన్సూరెన్స్ సంస్థతో పంచుకుంటుంది, అయితే, రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ విషయంలో మీరు అనగా పాలసీదారు, క్లెయిమ్ ఫైల్ చేసే సమయంలో రిపేర్ బిల్లును ఇన్సూరెన్స్ సంస్థకు అందించాలి.
  • మంజూరు చేయబడిన క్లెయిమ్‌పై ఆధారపడి ఇన్సూరెన్స్ సంస్థ చెల్లింపును జారీ చేస్తుంది మరియు మిగిలిన మొత్తాన్ని మీరు భరించాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు హ్యూందాయ్ క్రెటా కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా కొనుగోలు చేయవచ్చు?

ఒక ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ నేటి యుగంలో మరియు ఈ రోజుల్లో చాలా సులభం. మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి - మీ ఇంటి సౌలభ్యం నుండి దానిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం లేదా ఇన్సూరర్ బ్రాంచ్ ఆఫీసును సందర్శించడం ద్వారా లేదా మీ ఇన్సూరెన్స్ ఏజెంట్‌తో ఒక అపాయింట్‌మెంట్‌ను షెడ్యూల్ చేసుకోవడం ద్వారా సాంప్రదాయ విధానాన్ని అనుసరించడం. 

నేను నా హ్యూందాయ్ క్రెటా ను ఎందుకు ఇన్సూర్ చేయాలి?

మోటార్ వాహనాల చట్టం 1988 ద్వారా నిర్దేశించబడిన నిబంధనల ప్రకారం, మీ ఫోర్-వీలర్‌ను ఇన్సూర్ చేయడం తప్పనిసరి. ఇది చట్టపరమైన అవసరం మాత్రమే కాకుండా ప్రమాదాలు, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ నిర్మిత సంఘటనల ద్వారా మీ కారుకు థర్డ్-పార్టీ బాధ్యతలు మరియు నష్టాల కోసం ఆర్థిక భద్రతను అందించడంలో కూడా సహాయపడుతుంది.

చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేనందున ఏదైనా జరిమానా విధించబడుతుందా?

ఇన్సూరెన్స్ లేకుండా కారును నడుపుతున్న మొదటిసారి నేరానికి రూ.2000 జరిమానా మరియు/లేదా మూడు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. పదేపదే చేసిన అదే నేరాల కోసం జరిమానా రూ.4000 మరియు/లేదా మూడు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం