మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

Honda కార్ ఇన్సూరెన్స్

Honda కార్ ఇన్సూరెన్స్

జపాన్‌లోని Honda సంస్థకు చెందిన ఈ అనుబంధ సంస్థ భారతదేశంలో కార్ల తయారీ, మార్కెటింగ్ మరియు ఎగుమతి కోసం ఏర్పాటు చేయబడిన - Honda Cars India Ltd 1995 సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభించింది, మరియు ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో 1997లో దాని తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసింది. $4.5 బిలియన్ కంటే ఎక్కువ ప్రారంభ పెట్టుబడితో, 150 ఎకరాల్లో ఈ ప్లాంట్ విస్తరించబడి ఉంది.

భారతదేశపు మార్కెట్‌లో అతిపెద్ద విజయం తర్వాత, రాజస్థాన్‌లోని తపుకరలో దాదాపుగా 450 ఎకరాల విస్తీర్ణంలో HCIL తన రెండవ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసింది. కొనుగోలు చేసే సమయంలోనూ మరియు డ్రైవ్ చేసే సమయంలోనూ మిమ్మల్ని ఆకర్షించే విశ్వసనీయమైన, ఆకర్షణీయమైన కార్లను Honda అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే, మీరు మీ కలల Honda కారును రోడ్డు మీదకు తీసుకురావాలనుకున్నప్పుడు, మీరొక సమగ్రమైన ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవడం ద్వారా, దానిని ప్రమాదాల నుండి రక్షించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. బజాజ్ అలియాంజ్ కార్ ఇన్సూరెన్స్తో, మీరు మీ ఫోర్-వీలర్‌ను అనేక ప్రకృతి మరియు మానవ జోక్యంతో జరిగే నష్టాల నుండి కవర్ చేయవచ్చు.

 

టాప్ Honda కార్ మోడల్స్

●        Honda City

ఈ సెగ్మెంట్‌లో నిస్సందేహంగా క్లాసీగా ఉండే మరియు క్లాసికల్ కార్లలో (Honda ఉత్పత్తుల నుండి) ఒకటిగా ఉండే ఈ సబ్ కాంపాక్ట్ కార్ 40 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వచ్చే మీకు ఆకర్షణీయమైన పవర్‌తో పాటు ఉత్తమ మైలేజ్ కూడా అందిస్తుంది.

అంతేకాకుండా, ఈ కార్ మీకు ఆటోమేటిక్ మరియు మాన్యువల్ అనే రెండు రకాల ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది. అలాగే, పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు వేరియెంట్లలోనూ అందుబాటులో ఉంది.

●        Honda Civic

ఆటో ఎక్స్‌పో 2018లో ప్రదర్శితమైన 10 తరం Honda Civic అనేది మార్కెట్‌లోని ఇతర టాప్ బ్రాండ్‌లకు ఏమాత్రం తీసిపోదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రస్తుత వెర్షన్ ఒక 5-సీటర్‌గా అందుబాటులోకి రావడంతో పాటు ముందు మరియు వెనుక డిస్క్ రకం బ్రేకులు, ఫ్రంట్ మరియు రియర్ యాంటీ-రోల్ బార్లు, షాక్ అబ్సార్బ ర్లు (గ్యాస్ ప్రెషరైజ్డ్) మరియు గాల్వనైజ్డ్ స్టీల్ ప్యానెల్స్‌తో లభిస్తుంది.

●        Honda Brio

అన్ని రకాల ఆదాయ వర్గాల వారికి తగిన బడ్జెట్ కారుగా రూపొందిన Honda Brio దాని 35 లీటర్ ట్యాంక్ సామర్థ్యంతో అధిక-శక్తిగల అవుట్‍పుట్‍తో సమర్థవంతమైన ఇంధన పొదుపు భరోసా కూడా అందిస్తుంది. అంతేకాకుండా, పవర్ స్టీరింగ్, ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ విండోస్, 5-స్పీడ్ గేర్ బాక్స్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) రకం మరియు విశాలమైన ఇంటీరియర్స్ వంటి విశిష్టతలు Brioను అన్ని రకాల పరిస్థితులకు (ఇది కేవలం మాట కాదు) తగిన కారుగా నిలబెడుతాయి.

 

మీ కోసం మేము ఏమి అందిస్తున్నాము

 

ఒక సమగ్ర బజాజ్ అలియాంజ్ Honda కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీరు మీ ఫోర్-వీలర్‌ను అనేక ప్రకృతి మరియు మానవ ప్రేరేపిత ప్రమాదాలు (దొంగతనం, దోపిడీ, అల్లర్లు, సమ్మె లేదా ఏదైనా హానికర కార్యకలాపాల కారణంతో కలిగే నష్టాలతో సహా) నుండి రక్షించుకోవచ్చు.

ఇంకా ఏం ఉన్నాయి? మీరు ఎంచుకున్న Honda కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీద ఆధారపడి, రోడ్డు ప్రమాదం సమయంలో, మా నెట్‌వర్క్ గ్యారేజీల్లో మాత్రమే కాకుండా వాటికి అవతల కూడా మీరు మిమ్మల్ని ఆర్థిక నష్టాల నుండి రక్షించుకోవచ్చు!

అయితే, మీరు ప్రాథమిక బజాజ్ అలియాంజ్ థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీ కూడా ఎంచుకోవచ్చు - థర్డ్ పార్టీకి శారీరకంగా హాని కలగడానికి లేదా వారి ఆస్తికి నష్టం కలగడానికి మీ కారు కారణమైనప్పుడు ఎదురయ్యే (ఆర్థిక మరియు చట్టపరమైన) నష్టాలను ఇది భరిస్తుంది.

అంతేకాకుండా, మీరు మీ ఇన్సూరెన్స్ అవసరాలకు తగినట్లుగా మా యాడ్-ఆన్ కవర్ల శ్రేణి నుండి జాగ్రత్తగా ఎంచుకోవడం లేదా ఎంచుకోకపోవడం ద్వారా, మీ ఆర్థిక లక్ష్యాలను భర్తీ చేయవచ్చు. యాడ్-ఆన్ కవర్‌లనేవి మీ Honda కార్ ఇన్సూరెన్స్ పాలసీని మరింత దృఢంగా చేస్తాయి. 

మీరు ఎలా ప్రయోజనం పొందుతారు

 

మీరు ఎల్లప్పుడూ ఆధారపడగల, ఎలాంటి అవాంతరాలు-లేని సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజీ అందించేలా బజాజ్ అలియాంజ్‌లో మేము మా ప్రయత్నాలను నిర్దేశిస్తాము. రోడ్ల మీద తిరిగే వాహనాల సంఖ్య దాదాపుగా క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో, సాధ్యం కాగల ప్రమాదాల నుండి మీ కారు రక్షించడమనేది సవాలు లాంటిది కావచ్చు.

ఇలాంటి పరిస్థితిలోనే, మేము మా Honda కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీ కారు కవరేజీ రక్షణ అందించడమే కాకుండా, మీ కారు ఇన్సూరెన్స్ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన మా ప్రత్యేక యాడ్-ఆన్ కవర్‌లతో రక్షణను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాము.

● క్లెయిమ్‌ల కోసం మీరు అన్నివేళలా సహాయం అందుకోవడంతో పాటు మీకు అవసరం కాగల ఇతర సహాయం కూడా అందుకుంటారు. ఇన్సూరెన్స్ విషయంలో ఎలాంటి సెలవు దినం ఉండకూడదనే విషయం చాలా ముఖ్యం అని బజాజ్ అలియాంజ్‌లో మేము విశ్వసిస్తాము. కాబట్టి మీరు మీ స్నేహితుడి ఇంట్లో విందు వేడుకల్లో ఉన్నప్పుడు మీ కారు భద్రతను మేము చూసుకుంటాము, 24x7.

● మీరు మీ ఎన్‌సిబి (మీ గత ఇన్సూరర్ నుండి)లను 50% వరకు మాకు బదిలీ చేయవచ్చు.

● నిర్మానుష్య ప్రదేశంలో మీ కారు ఆగిపోయిందా? సమీపంలోని మా నెట్‌వర్క్ గ్యారేజీని గుర్తించండి మరియు దేశవ్యాప్తంగా ఉన్న మా ఉత్తమ టెక్నీషియన్లు మరియు మెకానిక్స్ నుండి సహకారంతో మీ కారు మరమత్తు చేసుకోండి.

● మమ్మల్ని విస్మరించకుండా ఉండడానికి మరో కారణం కావాలా? మా 4000+ గ్యారేజ్ నెట్‌వర్క్ అంటే, ఎలాంటి ప్రశ్నలకు తావులేకుండా తక్షణం నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ ఆనందించడానికి మీకు అందుబాటులో ఉన్న వేదికలు అని అర్థం!

● మీరు ఎంచుకున్న పాలసీ ఆధారంగా, బ్రేక్‌డౌన్ లేదా ఇతర మైనర్ డ్యామేజీల సమయంలో మీరు 24x7 రోడ్‌సైడ్ సహాయం పొందవచ్చు. అంతేకాకుండా, మీరు మీ కారును సమీప గ్యారేజీకి తీసుకువెళ్ళడానికి కూడా మేము మీకు సహాయపడగలము. చాలా అద్భుతమైన సౌకర్యం కదా?

● మేము మొట్టమొదటగా అందిస్తున్న ఈ డ్రైవ్‌స్మార్ట్ టెలిమాటిక్స్ సర్వీస్ అనేది ఇతరులతో పోలిస్తే, మీ కార్ ఇన్సూరెన్స్ కవరేజీ కోసం బహుళ ప్రయోజనాలు అందిస్తుంది’. డ్రైవ్‌స్మార్ట్ టెలిమాటిక్స్ సర్వీస్ అనేది మీ వాహనాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది (కాబట్టి, రోజులో ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా సంపూర్ణ భద్రతను నిర్ధారిస్తుంది), మెరుగైన రిస్క్ మోడల్‌కు చేరుకోవడానికి డ్రైవింగ్ పద్ధతులు మరియు ప్రవర్తనను పర్యవేక్షిస్తుంది. తద్వారా, సరసమైన ప్రీమియంలు అందిస్తుంది!

● మీరు మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోవచ్చు. కవరేజీలో ఎలాంటి సమస్య ఉత్ఫన్నం కాకుండా ఉండడం కోసం, ప్రస్తుత గడువు తేదీకి ముందే పాలసీని రెన్యూవల్ చేయాలని గుర్తుంచుకోండి.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం