రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
maximize car insurance coverage with add-ons
24 మార్చి, 2023

కార్ ఇన్సూరెన్స్‌లో యాడ్-ఆన్ కవరేజీలు: పూర్తి సమాచారం

మీరు కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు, మీకు సాధ్యమైనంత ఉత్తమ కవరేజీ ఉందని నిర్ధారించుకోవడం ఉత్తమం. కాబట్టి, మీరు ఒక ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీరు సరైన కవరేజ్ అమౌంట్ పొందుతున్నారని నిర్ధారించుకోవడమే కాకుండా, మీకు సరైన యాడ్-ఆన్‌లు కూడా ఉన్నాయని మీరు నిర్ధారించుకోవచ్చు. కార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లు అనేవి మీ సమగ్ర పాలసీతో పాటు మీరు కొనుగోలు చేయగల కవర్‌ల రకాలుగా ఉంటాయి. మీరు ఎంచుకోగల కొన్ని యాడ్-ఆన్ కార్ ఇన్సూరెన్స్ కవర్లు గురించి చూద్దాం.
  • జీరో డిప్రిషియేషన్ కవర్

"బంపర్-టూ-బంపర్ కవర్" అని కూడా పిలువబడే ఈ యాడ్-ఆన్ అనేది మీ వాహనం మరియు దాని భాగాల తరుగుదల కోసం రక్షణ అందిస్తుంది. మీరు జీరో డిప్రిసియేషన్ కవరేజీ తీసుకున్నప్పుడు, మీ కారు లేదా దాని దెబ్బతిన్న భాగాల మొత్తం ఖర్చు కోసం క్లెయిమ్ చేయడానికి అది మిమ్మల్ని అనుమతిస్తుంది. కాబట్టి, మీ కారులో దెబ్బతిన్న భాగాల కోసం పూర్తి ఖర్చును పొందడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. తద్వారా, మీరు వాటిని భర్తీ చేయడాన్ని ఆర్థికంగా సులభతరం చేస్తుంది. చాలామంది ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన వాహనాలకు మాత్రమే ఈ కవర్‌ అందిస్తారు.
  • కన్జ్యూమబుల్స్ కవర్

బ్రేక్ ఆయిల్, పవర్ స్టీరింగ్ ఆయిల్, గేర్‌బాక్స్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్‌తో పాటు స్క్రూలు, నట్లు మరియు బోల్టులు లాంటి భాగాలనేవి కారులోని వినియోగ వస్తువులుగా పరిగణించబడుతాయి. మీ కారు ప్రమాదంలో దెబ్బతింటే, మరమ్మత్తుల కోసం మీరు దానిని గ్యారేజీకి తీసుకురావచ్చు. ఈ మరమ్మత్తుల సమయంలో, ఈ వినియోగ వస్తువులను మార్చాల్సి రావచ్చు. రెగ్యులర్ ఇన్సూరెన్స్ పాలసీ, అంటే, థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది, ఈ వినియోగ వస్తువులకు కవరేజీ అందించకపోవచ్చు. కాబట్టి, ఒక కన్జ్యూమబుల్స్ కవర్ కలిగి ఉండడమనేది మీ కారుకి ప్రమాదం తర్వాత, దానిని మరమ్మత్తు చేసే సమయంలో, ఈ వినియోగ వస్తువుల ఖర్చులు ఆదా చేసుకోవడంలో సహాయపడుతుంది.
  • రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్

మీ కారు ఎప్పుడైనా దొంగతనానికి గురైనప్పుడు లేదా ఏదైనా ప్రమాదం కారణంగా, మరమ్మత్తు చేయలేని స్థాయిలో పాడైనప్పుడు, మీ ప్రాథమిక సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉపయోగం లేనిదిగా మారిపోతుంది. మీరు మీ ప్లాన్‌లోని రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్‌తో ఈ పరిస్థితిని నివారించవచ్చు. మరమ్మత్తు చేయలేని స్థాయిలో మీ వాహనం దెబ్బతిన్నప్పుడు, మీ వాహనం పూర్తి ధరను తిరిగి పొందడంలో ఈ రకం కవర్ మీకు సహాయపడుతుంది. ఈ కవర్ లేకపోతే, మీరు మీ కారుని కోల్పోయినప్పుడు అది మీకు ఆర్థిక నష్టంగా పరిణమిస్తుంది.
  • రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్

మీరు మీ కుటుంబంతో సహా, రోడ్ ట్రిప్‌కి వెళ్తున్నారని ఊహించుకోండి. మీరు కొన్ని నగరాలకి ప్రయాణించడానికి మరియు మీ ప్రియమైన వారి కోసం కొంత సమయం వెచ్చించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో, మీ కారు ఆరోగ్యం నిర్ధారించుకోవడం ఒక ప్రాధాన్యతగా మారుతుంది. మీరు ఈ ప్రయాణం ప్రారంభించడానికి ముందు, మీ కారు ఉత్తమ స్థితిలో ఉందని నిర్ధారించుకోవడం కోసం మీ ఉత్తమమైన పని చేసి ఉండవచ్చు. అయినప్పటికీ, మీ ప్రయాణంలో మీకు ఒక సమస్య ఎదురుకావచ్చు. ఉదాహరణకు, మీ టైర్ పంక్చర్ కావచ్చు లేదా ఆయిల్ లీక్ కావచ్చు. మీకు పరిచయం లేని ప్రదేశంలో, ఆ పరిస్థితిలో సహాయం పొందడం మీకు కష్టం కావచ్చు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌తో, మీకు అవసరమైనప్పుడు ఈ సహాయం పొందడం సులభంగా ఉండగలదు. ఈ కవరేజీ పరిధిని అర్థం చేసుకోవడం కోసం, మీరు పాలసీ నిబంధనలను జాగ్రత్తగా చదవారని నిర్ధారించుకోండి.
  • ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్షన్ కవర్

మీ సాధారణ థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది మీ ఇంజిన్‌కు జరిగిన నష్టాన్ని కవర్ చేయదు. ఈ కవర్‌ కలిగి ఉండడం కోసం, ఈ యాడ్-ఆన్‌ను మీరు ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి లేదా మీ సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్‌లో ఈ కవర్ చేర్చబడి ఉందని నిర్ధారించుకోవాలి. కానీ, ఈ కవర్‌ మీకు ఎందుకు అవసరం? తరచుగా, ఒక ప్రమాదం అనేది మీ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్‌కు నష్టం కలిగించవచ్చు. ఈ భాగాల కోసం ఇన్సూరెన్స్ లేకపోతే, వాటి మరమ్మత్తు లేదా మార్చడం కోసం మీరు మీ జేబు నుండి ఖర్చు చేయాల్సి రావచ్చు.
  • రోజువారీ రవాణా ప్రయోజనం

ఏదైనా యాక్సిడెంట్ తర్వాత, మీ కారు పూర్వపు స్థాయిలో కాకపోయినప్పటికీ, ఒక మెరుగైన స్థితిలో మీకు అందుబాటులోకి రావడానికి ముందు మరమ్మత్తుల కోసం అది చాలాకాలం గ్యారేజీలోనే ఉండిపోవచ్చు. అయితే, మీ కారు మరమ్మత్తు కోసం గ్యారేజీలో ఉన్నప్పుడు, మీ రోజువారీ ప్రయాణం కోసం మీ కారు అందుబాటులో లేకపోవడం వల్ల మీ ప్రయాణం కోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. రోజువారీ రవాణా ప్రయోజనం అనేది ఈ ఖర్చును కవర్ చేస్తుంది. మీకు ఒక అలవెన్స్ చెల్లించడం లేదా క్యాబ్ కంపెనీల సేవల కోసం కూపన్లు అందించడం జరుగుతుంది.
  • టైర్ ప్రొటెక్షన్ కవర్

టైర్లు అనేవి మీ కారులోని ముఖ్యమైన భాగాల్లో ఒకటిగా ఉంటాయి. అవి క్రమం తప్పకుండా అరుగుదల మరియు తరుగుదలకు గురవుతాయి. అలాగే, ఏదైనా ప్రమాద సమయంలోనూ అవి దెబ్బతినవచ్చు. అయితే, మీరు మీ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పటికీ, అందులో వాటి కోసం కవరేజీ లభించదు. బదులుగా, మీరు మీ ఒరిజినల్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే సమయంలో, మీరు టైర్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్‌ ఎంచుకోవాలి. యాక్సిడెంట్ కారణంగా, టైర్లు దెబ్బతింటే, మీ టైర్లను రక్షించుకోవడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • కీ అండ్ లాక్ ప్రొటెక్ట్ కవర్

ఎవరైనా సరే, వారి తాళాలు పోగొట్టుకోవడం లేదా ఎక్కడ పెట్టి మర్చిపోవడం అసాధారణ విషయమేమీ కాదు. చాలా సందర్భాల్లో, కొద్దిపాటి శోధన తర్వాత మాత్రమే, అవి చేతికి చిక్కుతుంటాయి. అయితే, అరుదైన సందర్భాల్లో, మీకు అవి దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు మీరు వాటిని మార్చాల్సి వస్తుంది. దాని కోసం మీరు మీ జేబు నుండి చెల్లించడానికి బదులుగా, కీ అండ్ లాక్ ప్రొటెక్ట్ కవర్ క్రింద దాని కోసం క్లెయిమ్ చేయడానికి మీరు ఎంచుకోవచ్చు. మీ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే సమయంలో, మీరు ఈ కవర్‌ను ఎంచుకోవచ్చు మరియు దానిని మీ ప్లాన్‌కు జోడించవచ్చు.
  • వ్యక్తిగత వస్తువులు కోల్పోయిన సందర్భంలో కవర్

ప్రమాదం లేదా దొంగతనం జరిగిన సందర్భంలో, దెబ్బతినేది మీ కారు మాత్రమే కాదు. మీరు మీ కారులో ఉంచిన మీ వ్యక్తిగత వస్తువులు కూడా దెబ్బతినవచ్చు లేదా కనిపించకుండా పోవచ్చు. ఒక సాధారణ కార్ ఇన్సూరెన్స్ పాలసీ వీటిని కవర్ చేయలేకపోవచ్చు. అయితే, వ్యక్తిగత వస్తువుల నష్టం కవర్‌ సహాయంతో, మీరు మీ నష్టం కోసం రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.
  • పే యాజ్ యు డ్రైవ్ కవర్

ఇన్సూరెన్స్ మార్కెట్లో కొత్తగా పరిచయమైన వాటిలో ఇది కూడా ఒకటి. ఈ కవర్‌తో, మీరు మీ కారును ఏమేరకు డ్రైవ్ చేశారనేదాని మీద ఆధారపడి, మీ తదుపరి ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రీమియం మీద ఆదా చేసుకోవచ్చు. కాబట్టి, మీరు మీ కారును తక్కువగా ఉపయోగించినట్లయితే, మీరు మీ సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ మీద మరింత ఆదా చేసుకోవచ్చు.## యాడ్-ఆన్‌లనేవి మీ ప్రీమియంను కొద్దిగా పెంచవచ్చని గమనించండి. ఒక ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ఉపయోగించండి మరియు మీ ప్రీమియం ఖర్చుల గురించి మెరుగైన అవగాహనను పొందండి. ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి. ## ఐఆర్‌డిఎఐ-ఆమోదిత ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రకారం, అన్ని పొదుపులు ఇన్సూరర్ ద్వారా అందించబడుతాయి. ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి