రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Insurance Claim For Bike Scratches
ఏప్రిల్ 1, 2021

బైక్ పై పడే గీతల కోసం మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలా?

మన వాహనాలను శుభ్రంగా మరియు మెరిసేలా ఉంచుకోవడానికి మనం ఇష్టపడతాము. మెరుస్తూ ఉండే కార్ లేదా బైక్‌ని ఇష్టపడని వారు ఎవరుంటారు! కానీ మీ బైక్ లేదా కారుని ఎప్పటికీ కొత్త దానిలా ఉంచడం సాధ్యం కాదు. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా, సమయం గడిచే కొద్దీ మీ కొత్త కారు లేదా బైక్ పై చిన్న గీతలు లేదా సొట్టలు పడతాయి. ఇంకా, ఇది మీ తప్పు కాకపోతే, చాలా చికాకు కలిగిస్తుంది. మీరు పరిస్థితులను నియంత్రించలేరు, కానీ మీరు చేయగలిగినది వీటిని కొనుగోలు చేయడం: ఒక కార్ లేదా బైక్ ఇన్సూరెన్స్. మీ బైక్ లేదా కారుకు జరిగిన నష్టాన్ని రికవర్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ మీకు సహాయపడుతుంది. అయితే, ఇప్పుడు ఉన్న సందేహం, బైక్ పై పడే గీతల కోసం నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయగలనా? మరింత ముఖ్యంగా, మీ బైక్ పై పడే చిన్న గీతల కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం సరైన చర్య అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం!  

బైక్ పై పడే గీతల కోసం నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చా?

ఇది మీ బైక్ ఇన్సూరెన్స్ కాబట్టి, మీరు కోరుకున్న వాటి కోసం దానిని క్లెయిమ్ చేయవచ్చు. కానీ, ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, చిన్న గీతల కోసం ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేయడం సరైన చర్య అవుతుందా అని. ఖచ్చితంగా చెప్పాలంటే, ఇది మీ బైక్‌కి జరిగిన నష్టం పై ఆధారపడి ఉంటుంది. అదనంగా, ఇది మీకు ఉన్న పాలసీ రకం పై కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు,  
  • మీ బైక్ కోసం మీ వద్ద ఒక సమగ్ర పాలసీ కవర్ ఉంటే, క్లెయిమ్ మొత్తం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
  • మరొకవైపు, మీ వద్ద థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ఉంటే, అది మీ బైక్‌ను మరమ్మతు చేయడంలో ఉపయోగపడనందున మీరు ఏమి క్లెయిమ్ చేయలేరు. కానీ, ఇది మీ వలన థర్డ్ పార్టీకి జరిగిన నష్టాల కోసం చెల్లింపు చేస్తుంది.
  ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే, మీ బైక్‌ని పునరుద్ధరించుకునే ముందు మీరు ఖర్చును విశ్లేషించవలసి ఉంటుంది. మీ అంచనా ప్రకారం ఆ ఖర్చు తక్కువగా ఉండి మీరు భరించగలిగినది అయితే, ఏదైనా పెద్ద నష్టం కోసం మీ బైక్ ఇన్సూరెన్స్‌ని ఆదా చేసుకోండి. అయితే, దానికి తీవ్రమైన నష్టం వాటిల్లితే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఉత్తమమైన నిర్ణయం అవుతుంది.  

బైక్ పై పడే చిన్న గీతల కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

మొదట్లో ఇది అంత సమంజసమైన ఎంపికగా అనిపించకపోవచ్చు, కానీ మీ బైక్ పై పడే చిన్న గీతల కోసం మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే, అది మీకు దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. ఎందుకు అని అడుగుతున్నారా? దానిలో దాగి ఉన్న కొన్ని రహస్య ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:  
  • నో క్లెయిమ్ బోనస్: మీకు బైక్ ఇన్సూరెన్స్‌లో ఎన్‌సిబి అంటే ఏమిటి అని తెలియకపోతే, మీరు ఇన్సూరెన్స్‌ని రెన్యూ చేసే సమయంలో గడచిన సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే అది మీకు లభించే డిస్కౌంట్ అని తెలుసుకోండి. మరియు ఈ బోనస్ మొత్తం ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరం కోసం పెరుగుతూ ఉంటుంది. క్రింది పట్టికను చూడండి:
 
క్లెయిమ్ రహిత సంవత్సరాల సంఖ్య ఎన్‌సిబి డిస్కౌంట్
1 సంవత్సరం 20%
వరుసగా 2 క్లెయిమ్ రహిత సంవత్సరాలు 25%
వరుసగా 3 క్లెయిమ్ రహిత సంవత్సరాలు 35%
వరుసగా 4 క్లెయిమ్ రహిత సంవత్సరాలు 45%
వరుసగా 5 క్లెయిమ్ రహిత సంవత్సరాలు 50%
  కాబట్టి, సాధ్యమైన సందర్భంలో మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకుండా ఉన్నట్లయితే (భారీ మొత్తంలో నష్టం సంభవిస్తే మినహా), అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేసిన ప్రతి సారి, ఎన్‌సిబి సున్నాకి రీసెట్ చేయబడుతుంది.  
  • తక్కువ ప్రీమియం: మీకు దీని పై కూడా అవగాహన ఉండాలి -‌ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఏమిటి. చిన్న బైక్ నష్టానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోవడం వలన కలిగే ప్రయోజనం - తక్కువ ప్రీమియం. మీ బైక్ నష్టాల కోసం మీరు క్లెయిమ్ చేసిన ప్రతిసారీ, ప్రీమియం గణనీయంగా పెరుగుతుంది. ఇది మీకు ఆర్థికంగా భారంగా మారుతుంది.
 

నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఏదైనా ప్రారంభ మొత్తం ఉందా?

మొదట్లో నష్టానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కాబట్టి, మీ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ముందు నష్టాన్ని లెక్కించడం ముఖ్యం. సాధారణ నియమం ఏంటంటే కారు యొక్క రెండు ప్యానెల్స్ కోసం పునరుద్ధరణ అవసరమైతే లేదా నష్టం యొక్క పూర్తి మొత్తం 6000 ఐఎన్ఆర్ కు మించితే, ఇన్సూరెన్స్‌ని పరిగణించడం ఉత్తమం. కొన్ని సాధారణ ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:  
  1. నష్టం: ఒక బాడీ ప్యానెల్
మీరు దానిని మీ స్వంతంగా మరమ్మతు చేసుకుంటే: రూ. 5000 మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే: రూ. 5800 (ఫైలింగ్ ఛార్జీలతో సహా)   పరిష్కారం: క్లెయిమ్‌ను ఆదా చేయండి!  
  1. నష్టం: మూడు-బాడీ ప్యానెల్స్
మీరు దానిని మీ స్వంతంగా మరమ్మత్తు చేసుకుంటే: దాదాపుగా రూ. 15000 మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే : దాదాపుగా రూ. 7000 (ఫైలింగ్ ఛార్జీలతో సహా)   పరిష్కారం: క్లెయిమ్ చేయండి! ఖర్చును పోల్చడానికి ఇవి కొన్ని సాధారణమైన ఉదాహరణలు. ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు ఈ ఖర్చులను అంచనా వేయాలి. మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్న వాహనం రకం ఆధారంగా ఈ ఖర్చులు మారుతూ ఉంటాయి. అందువల్ల, లెక్కించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి!  

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. స్క్రాచ్ మరియు డెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదేనా?
ఇది మీరు స్వంతంగా మరమ్మతు చేయించుకునే అయ్యే ఖర్చు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే మొత్తం మధ్య తేడా పై ఆధారపడి ఉంటుంది. మీరు చెల్లించే మొత్తం కంటే ఆ తేడా తక్కువగా ఉంటే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఉత్తమ ఎంపిక, అలాగే మీరు చెల్లించే మొత్తం కంటే ఆ తేడా ఎక్కువగా ఉంటే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోవడం ఉత్తమ ఎంపిక అవుతుంది.  
  1. వాహనం పై పడే ఒక గీత ఇన్సూరెన్స్‌ను ఎంత పెంచుతుంది?
మీ బైక్ పై పడే గీతల కోసం మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేస్తే, మీ బైక్‌కు గతంలో జరిగిన నష్టం ఆధారంగా మీ ఇన్సూరెన్స్ రేటు దాదాపుగా 38% లేదా అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి