రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Two Wheeler Insurance Claim Settlement Process
జూలై 23, 2020

కొన్ని సులభమైన దశలలో టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్

బైక్ ఇన్సూరెన్స్, అనగా టూ వీలర్ ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రమాదం లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యం కారణంగా మీకు మరియు/లేదా మీ టూ వీలర్‌కు జరిగిన నష్టం/ డ్యామేజీ నుండి మీకు ఆర్థిక రక్షణను అందిస్తుంది. మీరు ఒక 2 వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరి అయినప్పటికీ, మొదట దాని ఫీచర్లు మరియు మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చాలా సులభం మరియు పాలసీ నిబంధనలు, షరతులను గురించి ప్రాథమిక అవగాహన కూడా ఉండాలి.

బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేసేటప్పుడు మీకు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

  • క్లెయిమ్ ఫారం
  • పాలసీ డాక్యుమెంట్
  • పన్ను చెల్లింపు రసీదులు
  • మీ టూ-వీలర్ యొక్క రిజిస్ట్రేషన్ కార్డు
  • డ్రైవింగ్ లైసెన్సు
  • పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ

మీరు అందుబాటులో ఉంచుకోవలసిన ఇతర వివరాలు ఇలా ఉన్నాయి:

  • మీ సంప్రదింపు నంబర్
  • మీ బైక్ ఇంజిన్ మరియు ఛాసిస్ నంబర్
  • సంఘటన జరిగిన తేదీ మరియు సమయం

మీరు ఫైల్ చేస్తున్న క్లెయిమ్ రకాన్ని బట్టి మీకు అవసరమయ్యే అదనపు వివరాలను తెలుసుకోవడానికి ఈ కింది పట్టికను చూడండి:

ప్రమాదం కారణంగా జరిగిన నష్టాలు దొంగతనం
రిపేర్ బిల్లులు కీస్
చెల్లింపు రసీదులు సర్వీస్ బుక్‌లెట్
క్లెయిమ్స్ డిశ్చార్జ్ మరియు సంతృప్తి వోచర్ వారంటీ కార్డు
ప్రమాదం జరిగిన స్థలం ఫారం 28, 29 మరియు 30
వాహన తనిఖీ చిరునామా సబ్రోగేషన్ లెటర్

టూ-వీలర్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి?

మీరు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో టూ-వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయవచ్చు.

<

    1. ఆఫ్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం మా టోల్ ఫ్రీ నంబర్‌ 1800-209-5858కు డయల్ చేయండి. ఇక్కడ మా కస్టమర్ కేర్ ప్రతినిధి క్లెయిమ్ రిజిస్ట్రేషన్‌ సంబంధిత పూర్తి ప్రాసెస్‌‌ను గురించి మీకు మార్గనిర్దేశం చేస్తారు.

    2. ఆన్‌లైన్ మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం మా క్లెయిమ్ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ పోర్టల్‌ను సందర్శించండి. తద్వారా మీరు ఆన్‌లైన్‌లో నగదురహిత బైక్ ఇన్సూరెన్స్ ‌‌ను పొందవచ్చు. ఫారంలో నింపమని అడిగినప్పుడు మీరు పైన పేర్కొన్న వివరాలను అందించాలి. తదుపరి దశకు కొనసాగడానికి ముందు మీరు నింపిన అన్ని వివరాలను ఒకసారి చెక్ చేయడం ఉత్తమం.

  • మీరు చివరి దశను చేరుకొని సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత, సిస్టమ్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను జనరేట్ చేస్తుంది. మీరు ఈ నంబర్‌ను జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌కు సంబంధించి అన్ని భవిష్యత్ సూచనల కోసం దీనిని ఉపయోగించాలి.
  • ఒకవేళ మీ బైక్ యాక్సిడెంట్‌లో డ్యామేజ్ అయితే, దానిని సమీప నెట్‌వర్క్ గ్యారేజీకి తరలించండి లేదా దానిని సమీప నెట్‌వర్క్ గ్యారేజీకి తరలించడానికి టోయింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. ఒకవేళ మీరు మీ బైక్‌ను నాన్-నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకువెళ్తే, తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందడానికి అన్ని ఒరిజినల్ రిపేర్/ రీప్లేస్‌మెంట్ బిల్లులను అందుబాటులో ఉంచుకోండి.
  • మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా నియమించబడిన సర్వేయర్, మీరు అందించిన చిరునామా వద్ద తనిఖీ నిర్వహిస్తారు మరియు సర్వే రిపోర్టును సిద్ధం చేస్తారు, దానిని ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేస్తారు. ఆ సర్వే రిపోర్ట్ మరియు ఇతర డాక్యుమెంట్ల పూర్తి పరిశీలన తర్వాత మీ క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది.

పైన వివరించిన విధంగా, మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది చాలా సులభమైన ప్రాసెస్. మీరు చేయవలసిందల్లా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు మరియు క్లెయిమ్ సంబంధిత అన్ని ఇతర వివరాలతో సిద్ధంగా ఉండాలి. క్లెయిమ్ ప్రాసెస్ పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, ప్రాసెస్ పూర్తయ్యే వరకు మీరు ఓపికగా ఉండాలి.

ఇన్సూరెన్స్ వివరణ బ్లాగులో మా క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి