రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
జీవితం అనిశ్చితం ; ఇది ఎవరినైనా, ఏ సమయంలోనైనా ఊహించని ప్రమాదాలతో మలుపు తిప్పుతుంది. అదనంగా, యాక్సిడెంట్ కారణంగా సంపాదనాపరుని మరణం లేదా వైకల్యం సంభవిస్తే, అది మీ కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతుంది మరియు మీరు దీనికి సిద్ధంగా ఉండకపోవచ్చు.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అటువంటి ఆర్థిక ఒత్తిడి నుండి మిమ్మల్ని రక్షించడానికి మరియు మీ అవసరమైన సమయంలో, ఎప్పుడైనా మరియు ప్రపంచంలో ఎక్కడైనా మీకు సహాయపడటానికి ఒక ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉంది.
మా గ్లోబల్ పర్సనల్ గార్డ్ మరణం, పూర్తి శాశ్వత వైకల్యం లేదా పాక్షిక శాశ్వత వైకల్యం మరియు ప్రమాదం కారణంగా సంభవించే ఏవైనా ఇతర గాయాలకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన కవరేజ్ అందిస్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు సంభవించే ప్రమాదాలకు కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది గ్లోబల్ కవరేజీని అందిస్తుంది.
గ్లోబల్ పర్సనల్ గార్డ్ ఈ క్రింది ఫీచర్లతో ఒక ప్రమాదం కారణంగా జరిగిన గాయాల కోసం రక్షణను అందిస్తుంది:
ప్రమాదవశాత్తు మరణం మరియు గాయాలను కవర్ చేస్తుంది
ఈ పాలసీ, యాక్సిడెంట్ కారణంగా తలెత్తే గాయాల కోసం అయ్యే ఖర్చులకు కవరేజీని అందించడంతో పాటు యాక్సిడెంటల్ డెత్ కవరేజీని కూడా అందిస్తుంది.
జీవనశైలిలో సవరణ ప్రయోజనం
ఈ పాలసీ ప్రమాదవశాత్తు గాయం తర్వాత, జీవనశైలి సవరణ కోసం అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.
మొత్తం కుటుంబాన్ని కవర్ చేస్తుంది
ఈ పాలసీ మిమ్మల్ని, మీ జీవిత భాగస్వామిని, తల్లిదండ్రులు మరియు పిల్లలను ఒకే పాలసీ క్రింద కవర్ చేస్తుంది.
దీర్ఘ-కాలిక పాలసీ
మీరు 1, 2 లేదా 3 సంవత్సరాల వ్యవధి కోసం ఈ పాలసీని ఎంచుకోవచ్చు.
క్యుములేటివ్ బోనస్
ప్రతీ క్లెయిమ్-రహిత సంవత్సరం కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తంపై 10% కుములేటివ్ బోనస్ పొందండి.
రూ. 25 కోట్ల వరకు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం కోసం ఆప్షన్‌లు
మీ ఆదాయం ఆధారంగా రూ. 50, 000 నుండి రూ. 25 కోట్ల వరకు ఇన్సూరెన్స్ మొత్తం గురించిన ఆప్షన్‌లలో ఒకదానిని ఎంచుకోండి.
యాక్సిడెంటల్ మరణం లేదా గాయాల విషయంలో, రీయింబర్స్‌మెంట్ ప్రాసెస్‌ని ఉపయోగించి మీరు మీ సెటిల్‌మెంట్‌ని క్లెయిమ్ చేయవచ్చు. మీరు క్లెయిమ్ చేసిన కవర్‌ను బట్టి, అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్నాయి:
క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్, కేవలం నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌ని పొందటానికి, క్రింద పేర్కొన్న విధానాన్ని అనుసరించండి:
a. ప్రమాదవశాత్తు జరిగిన గాయాలకు చికిత్స మరియు/లేదా వైద్య ఖర్చులను నెట్‌వర్క్ హాస్పిటల్ నుండి పొందడానికి ముందు, మీరు మాకు కాల్ చేసి, మేము అందించే ఫారమ్ ద్వారా వ్రాతపూర్వకంగా ప్రీ-ఆథరైజేషన్ కోసం అభ్యర్థన చేయాలి. ప్రమాదవశాత్తు శారీరక గాయం వలన అత్యవసర హాస్పిటలైజేషన్ సందర్భంలో, ఈ పరిస్థితి మినహాయింపు కింద పరిగణించబడుతుంది.
b. మీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మరియు పూర్తి సమాచారం మరియు డాక్యుమెంటేషన్ పొందిన తర్వాత, మేము మీకు లేదా నెట్‌వర్క్ ఆసుపత్రికి ఒక అధికార లేఖను పంపుతాము. ఆథరైజేషన్ లెటర్, మీ పాలసీ ID కార్డ్ మరియు మేము పేర్కొన్న ఏదైనా ఇతర సమాచారం లేదా డాక్యుమెంటేషన్‌ను ఆసుపత్రిలో మీ అడ్మిషన్ సమయంలో ప్రీ-ఆథరైజేషన్ లెటర్‌లో గుర్తించబడిన నెట్‌వర్క్ హాస్పిటల్‌లో తప్పనిసరిగా అందజేయాలి.
c. పైన పేర్కొనబడిన విధానం అనుసరించినట్లయితే, ఒక ప్రమాదం కారణంగా గాయపడినప్పుడు మీరు నెట్‌వర్క్ హాస్పిటల్ వైద్య ఖర్చుల కోసం నేరుగా చెల్లించనక్కర్లేదు. యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ ఖర్చుల కింద హాస్పిటల్‌కి మా నుండి పరిహారం అందుతుంది మరియు అసలు బిల్లులు మరియు చికిత్స చేసినట్లు రుజువు హాస్పిటల్ వద్ద వదిలివేయబడుతుంది. అయితే, అన్ని ధరలు మరియు ఖర్చులు కవర్ చేయబడతాయని ప్రీ-ఆథరైజేషన్ హామీ ఇవ్వదు. వైద్య ఖర్చుల కోసం ప్రతి క్లెయిమ్‌ను సమీక్షించే హక్కును మేము కలిగి ఉంటాము మరియు తదనుగుణంగా ఈ పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం కవరేజ్ నిర్ణయించబడుతుంది. మీరు ఏదైనా సందర్భంలోనైనా, ఇతర అన్ని ఖర్చులను నేరుగా సెటిల్ చేయవలసి ఉంటుంది.
గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది యాక్సిడెంట్‌ల వల్ల సంభవించే మరణం, వైకల్యం లేదా గాయాల విషయంలో విస్తృతమైన గ్లోబల్ కవరేజీని అందిస్తుంది.
మీరు ప్రమాదం తర్వాత వికలాంగులైతే లేదా గాయపడినట్లయితే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. ఊహించని వైద్య ఖర్చులు, ఫైనాన్షియల్‍గా పెద్ద ఎదురుదెబ్బ కావచ్చు. కాంప్రిహెన్సివ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఊహించని సంఘటనల తర్వాత ఆర్థికంగా సురక్షితంగా ఉండడానికి భరోసా ఇస్తుంది.
స్టాండ్‌అలోన్ యాక్సిడెంట్ పాలసీ మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం మరియు పాక్షిక వైకల్యం నుండి కవర్ చేస్తుంది. అయితే, మీరు హాస్పిటల్ ఖర్చులు, అంబులెన్స్ ఛార్జీలు, లోన్ లయబిలిటీ, ఫిజియోథెరపీ మరియు ఇతర ఖర్చుల నుండి అసురక్షితంగా ఉంటారు. గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ ఈ ఖర్చులన్నిటితో పాటు, ఆదయ కవర్, ఫ్రాక్చర్ కవర్, అడ్వెంచర్ స్పోర్ట్స్ బెనిఫిట్, డైలీ క్యాష్ బెనిఫిట్ మరియు ప్రయాణ ఖర్చులు వంటి అదనపు ప్రయోజనాలను ఒకే పాలసీ కింద అందిస్తూ, ఆర్థిక మద్దతుని తెలుపుతుంది మరియు ఊహించని ప్రమాదం సందర్భంలో పూర్తి మనఃశాంతిని కల్పిస్తుంది.
గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ ప్రమాదవశాత్తు మరణం లేదా ప్రమాదవశాత్తు గాయాల వల్ల సంభవించే మరణాన్ని మాత్రమే కవర్ చేస్తుంది.
ప్రాథమిక కవర్‌లో మరణం, పూర్తి శాశ్వత వైకల్యం మరియు పాక్షిక శాశ్వత వైకల్యాలు ఉంటాయి.
మరణం: ప్రమాదం కారణంగా మరణించినప్పుడు డెత్ బెనిఫిట్. డెత్ కవర్‌తో పాటు, ఇటువంటి అదనపు ప్రయోజనాలు అందించబడతాయి:
ఆ రెండు ప్రయోజనాలు ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తానికి మించి ఉన్నాయి.
అలాగే, మేము అదృశ్య కవర్‌ని అందిస్తాము. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏదైనా రవాణాలో ప్రయాణిస్తుంటే బలవంతపు ల్యాండింగ్, స్ట్రాండింగ్, మునిగిపోవడం లేదా శిధిలానికి గురవ్వడం వంటివి జరిగితే మరియు ఆ ప్రమాదం కారణంగా అతను అదృశ్యమైతే, అదృశ్యమైన 12 నెలల తరువాత, ఆ వ్యక్తి మరణించినట్లు భావించబడతాడు, ప్రమాదవశాత్తు మరణం వల్ల ప్రయోజనం నామినీకి చెల్లించబడుతుంది.
పూర్తి శాశ్వత వైకల్యం:
ప్రమాదవశాత్తు శారీరక గాయం జరిగిన సందర్భంలో పూర్తి శాశ్వత వైకల్యం ప్రయోజనం:
పైన పేర్కొన్న వాటికి అదనంగా, బీమా చేసిన మొత్తంలో 2% జీవనశైలి సవరణ ప్రయోజనం కోసం, బీమా చేయబడిన వ్యక్తికి చెల్లించబడుతుంది. ఈ ప్రయోజనం బీమా ఎంచుకున్న మొత్తానికి మించి ఉంటుంది.
శాశ్వత పాక్షిక వైకల్యం:
పాలసీ వ్యవధిలో మీరు ప్రమాదవశాత్తు శారీరక గాయాన్ని ఎదుర్కొంటే, ఇది ప్రత్యక్షంగా మరియు స్వతంత్రంగా అన్ని ఇతర కారణాల వలన ప్రమాదం తేదీ నుండి 12 నెలలలో శాశ్వత వైకల్యానికి దారితీస్తే, అప్పుడు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తంలో కొంత శాతం, క్రింద చూపబడిన విధంగా చెల్లించబడుతుంది:
శాశ్వత పాక్షిక వైకల్యం | బీమా చేయబడిన మొత్తంలో % | శాశ్వత పాక్షిక వైకల్యం | బీమా చేయబడిన మొత్తంలో % |
---|---|---|---|
రెండు చెవుల వినికిడి | 75% | మడమ వద్ద ఒక పాదం | 40% |
భుజం జాయింట్ వద్ద ఒక బాహువు | 70% | ఒక చెవి వినికిడి | 30% |
ఒక కాలికి మధ్య తొడపై | 70% | ఒక బొటనవేలు | 20% |
మోచెయ్యి జాయింట్ పైన ఒక బాహువు | 65% | ఒక చూపుడు వేలు | 10% |
మోచెయ్యి జాయింట్ క్రింద ఒక బాహువు | 60% | వాసన అనుభూతి | 10% |
మధ్య-తొడ వరకు ఒక కాలు | 60% | రుచి అనుభూతి | 5% |
మణికట్టు వద్ద ఒక చెయ్యి | 55% | ఏదైనా ఇతర వేలు | 5% |
మోకాలి కింది వరకు ఒక కాలు | 50% | ఒక పెద్ద బొటనవేలు | 5% |
ఒక కన్ను | 50% | ఏదైనా ఇతర కాలివేలు | 2% |
మధ్య-పిక్క వరకు ఒక కాలు | 45% |
యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ అనేది, కనీసం 24 గంటల వరకు హాస్పిటలైజేషన్ కారణంగా తలెత్తే ఇన్-పేషెంట్ చికిత్స ఖర్చులను మరియు వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.
2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...
లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు
నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...
ప్రమాదాలపై పూర్తి రక్షణ.
అడ్వెంచర్ స్పోర్ట్స్ సమయాల్లో మాత్రమే ప్రమాదాలను కవర్ చేసే పాలసీ.
మీరు హాస్పిటలైజ్ చేయబడిన సందర్భంలో జరిగిన వైద్య ఖర్చుల నుండి మిమ్మల్ని రక్షించే ఒక ఆప్షనల్ కవర్... మరింత చదవండి
యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ ఖర్చులు
మీరు కనీసం 24 గంటలు హాస్పిటల్‌లో చేరినప్పుడు లేదా ప్రమాదవశాత్తు గాయం కారణంగా జాబితా చేయబడిన డేకేర్ విధానాలలో దేనినైనా ఎదుర్కొన్నప్పుడు అయ్యే వైద్య ఖర్చుల నుండి మిమ్మల్ని రక్షించే ఒక ఆప్షనల్ కవర్ ఇది. అటువంటి సందర్భంలో ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.
ఈ పాలసీ మరణం లేదా ప్రమాదవశాత్తు గాయాల కారణంగా సంభవించే శాశ్వత పూర్తి వైకల్యాన్ని...కవర్ చేసే ఒక ఆప్షనల్ కవర్‌ని అందిస్తుందిమరింత చదవండి
అడ్వెంచర్ స్పోర్ట్స్ బెనిఫిట్
సూపర్‌విజన్ కింద ఏదైనా నాన్-ప్రొఫెషనల్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో నిమగ్నమైనప్పుడు, ప్రమాదవశాత్తు శారీరక గాయం వలన జరిగిన మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం కోసం ఈ పాలసీ ఆప్షనల్ కవర్‌ని అందిస్తుంది.
ఆప్షనల్ ఎయిర్ అంబులెన్స్ కవర్, ప్రమాద స్థలం నుండి సమీప హాస్పిటల్ వరకు అత్యవసర ఎయిర్ అంబులెన్స్ ఖర్చులను చెల్లిస్తుంది.
చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ అనేది మీ పిల్లల చదువుల కోసం అయ్యే ఖర్చులను కవర్ చేయడానికి గల ఒక ఆప్షనల్ కవర్ ... మరింత చదవండి
పిల్లల విద్యా ప్రయోజనం
చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ అనేది ఒక ఆప్షనల్ కవర్, ప్రమాదం కారణంగా మీరు శాశ్వతంగా వికలాంగులైతే లేదా పనిచేసే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతే, ఇది మీపై ఆధారపడిన పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను భరిస్తుంది.
ఒకవేళ మీరు ప్రమాదవశాత్తు గాయం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్తే, ఈ పాలసీ మీ ఇన్సూరెన్స్ మొత్తానికి ఆప్షనల్ కవర్‌ని అందిస్తుంది.
పాలసీ నిబంధనల ప్రకారం, ప్రమాదవశాత్తు గాయం కారణంగా శాశ్వత పాక్షిక వైకల్యం సంభవించిన సందర్భంలో 3 నెలల వరకు మీ యాక్టివ్ ఇఎంఐ ని ఇన్సూర్ చేయడానికి ఈ ఆప్షనల్ కవర్‌ని ఎంచుకోవచ్చు.
ఈ ఆప్షనల్ కవర్, ఒక ఫ్రాక్చర్ చికిత్స కోసం అయ్యే ఖర్చులను రూ. 5 లక్షల వరకు చెల్లిస్తుంది.
ఈ ఆప్షనల్ కవర్ కింద, ప్రమాదవశాత్తు గాయం కారణంగా హాస్పిటల్‌లో చేరినప్పుడు, మీరు 60 రోజుల వరకు డైలీ క్యాష్ బెనిఫిట్ కోసం అర్హులు.
ఈ ఆప్షనల్ కవర్ కింద ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం వరకు, పాలసీలో పేర్కొన్న మీ లోన్ యొక్క అవుట్‌స్టాండిగ్ మొత్తానికి అనుగుణంగా ఉన్న మొత్తాన్ని మీరు స్వీకరించవచ్చు.
ప్రమాదవశాత్తు గాయం ఫలితంగా వైకల్యం, తద్వారా జరిగిన మీ ఆదాయం నష్టాన్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది.
ఈ ఆప్షనల్ కవర్, ప్రమాదవశాత్తు గాయం కారణంగా హాస్పిటల్‌లో చేరినప్పుడు తలెత్తే అత్యవసర అంబులెన్స్ ఖర్చులను, ఇన్సూరెన్స్ చేసిన మొత్తం వరకు చెల్లిస్తుంది.
మీ నివాస నగరం వెలుపల, ప్రమాదవశాత్తు గాయం కారణంగా మీరు హాస్పిటల్‌లో చేరినట్లయితే, ఈ ఆప్షనల్ కవర్ కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చుల కోసం బీమా చేసిన మొత్తం వరకు చెల్లిస్తుంది.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
రమా అనిల్ మాటే
ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
మీ వెబ్‌సైట్‌లో రెన్యూవల్ అద్భుతమైనది,
యూజర్-ఫ్రెండ్లీ మరియు సరళమైనది.
సురేష్ కాడు
బజాజ్ అలియంజ్ వారి ఎగ్జిక్యూటివ్
తీవ్ర మద్దతుని అందించారు, అందుకుగాను
నేను వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.
అజయ్ బింద్ర
బజాజ్ అలియంజ్ వారి ఎగ్జిక్యూటివ్
పాలసీ ప్రయోజనాలను చక్కగా విశదీకరించారు. ఆమె చాలా మంచి
కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కలిగి ఉన్నారు మరియు చక్కగా వివరించారు.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్డేట్ చేయబడిన తేదీ: 23 ఏప్రిల్ 2024
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి