Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కోవిడ్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్

కోవిడ్-19 కోసం హెల్త్ కవర్

కరోనావైరస్‌ని కవర్ చేేసే హెల్త్ ఇన్సూరెన్స్
Health Insurance for COVID

మీ కోసం మరియు మీ ఫ్యామిలీ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పొందండి

దయచేసి పేరును నమోదు చేయండి
/health-insurance-plans/individual-health-insurance-plans/buy-online.html ఒక కోట్ పొందండి
కోట్‌ను తిరిగి పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సబ్మిట్ చేయండి

దీనితో మీకు కలిగే లాభం?

సెక్షన్ 80D క్రింద ఆదాయం పన్ను ప్రయోజనం

ఇన్-పేషెంట్ ఖర్చుల కోసం కవరేజ్

హాస్పిటలైజేషన్‌కు ముందు మరియు తర్వాతి ఖర్చులకు కవరేజ్

కరోనా వైరస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్

కోవిడ్- 19 లేదా కరోనావైరస్ అనేది ఒక అంటువ్యాధి, ఇది వైరస్ సోకిన వ్యక్తి యొక్క దగ్గు లేదా తుమ్ము నుండి వెలువడే బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. జూన్ 17, 2020 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 7.94 మిలియన్ల మంది ప్రజలు కరోనావైరస్ వ్యాధితో బాధపడుతున్నారు. మన భారతదేశం విషయానికి వస్తే, కేసుల సంఖ్య, కేవలం 3 నుండి మొదలుకొని వేగంగా పెరిగింది, ఫిబ్రవరి 2020 లో కేసుల సంఖ్య 354, జూన్‌ 2020 లో 065 కేసులు మరియు ఈ కేసుల సంఖ్య ఇప్పటికీ విశేషమైన రేటుతో పెరుగుతూనే ఉంది.

ప్రస్తుతానికి, కరోనావైరస్ బారిన పడిన రోగులకు నయం చేయడానికి చికిత్స అందుబాటులో లేదు మరియు హాస్పిటల్‌లో ఖర్చులు చాలా ఎక్కువ. కానీ, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే, ఈ హాస్పిటల్ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవచ్చు మరియు ఆర్థిక భారం యొక్క ఒత్తిడిని నివారించవచ్చు. భారతదేశంలో, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా మీరు అనారోగ్యానికి గురైనప్పుడు చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు మిమ్మల్ని కవర్ చేస్తాయి మరియు కరోనావైరస్ కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు అవసరమైన కవరేజీని అందిస్తుంది.

ఈ కోవిడ్-19 వ్యాప్తి సమయంలో మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే, హెల్త్ ఇన్సూరెన్స్‌కు కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మరియు ఈ వెయిటింగ్ పీరియడ్ ముగిసిన తర్వాతే కవరేజ్ మొదలవుతుంది..

కరోనావైరస్‌ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల గురించి మీరు తెలుసుకోవాల్సింది

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, వైద్య అత్యవసర పరిస్థితుల్లో మరియు ఏదైనా అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌‌లో చేరినప్పుడు అయ్యే ఖర్చుల నుండి మిమ్మల్ని రక్షించే ఒక రక్షణ కవచం లాంటిది. ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేనట్లయితే, మీరు మీ జేబులో నుండి వైద్య ఖర్చులను చెల్లించాల్సి వస్తుంది. అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీపై మోపబడే ఆర్థిక భారం నుండి మీరు విముక్తి పొందవచ్చు. పాలసీ అందించే కవరేజీలు, పాలసీకి మీరు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం మరియు ఇతర పారామితులు అయిన నెట్‌వర్క్ హాస్పిటల్స్ సంఖ్య, త్వరిత క్లెయిమ్ పరిష్కారం, ఇన్సూరెన్స్ సంస్థ యొక్క డిజిటల్ ఉనికి మరియు అందుబాటులో ఉన్న యాడ్-ఆన్ కవర్‌ల ఆధారంగా మీరు తగిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు.

మీరు కోవిడ్-19 బారిన పడినట్లయితే, కరోనావైరస్ సంక్రమణ చికిత్స ఖర్చులను భరించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను కవర్ చేస్తాయి. మీకు కోవిడ్-19 సంక్రమణ నిర్ధారణ అయిన రోజు నుండి కవరేజ్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఒక స్టాండర్డ్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మీరు కరోనావైరస్ సంక్రమణతో బాధపడుతుంటే, అప్పుడు మాత్రమే మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడతారు. మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నప్పుడే, కోవిడ్- 19 సంక్రమణ విషయంలో హాస్పిటల్‌లో చేరే ఖర్చులను భరించటానికి సిద్ధంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ని పొందాలి. ఎందుకనగా, వ్యాధి నిర్ధారణ తర్వాత మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేస్తే, అది ముందు నుండి ఉన్న అనారోగ్యంగా పరిగణించబడుతుంది మరియు మీ పాలసీ ఆ కవరేజీని మినహాయిస్తుంది.

బజాజ్ అలియంజ్ నుండి కరోనావైరస్‌ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి?

మీరు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా అత్యవసర పరిస్థితులకు హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చినప్పుడు, మీరు అనుభవించే బాధను మేము బజాజ్ అలియంజ్ తరపున దానిని అర్థం చేసుకున్నాము. కావున, మేము మీ పట్ల శ్రద్ధ వహిస్తామని మరియు వీలైనంత వరకు మీకు మద్దతునిస్తామని నిర్ధారిస్తున్నాము. కరోనావైరస్ సంక్రమణ చికిత్స ఖర్చులను కవర్ చేసే మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో, మీకు పూర్తి రక్షణ లభిస్తుందని హామీ ఇస్తున్నాము, అలాగే, ఈ ప్లాన్ మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను సమగ్రంగా కవర్ చేస్తుంది మరియు కోవిడ్- 19 చికిత్స ఖర్చులపై పోరాడటంలో మీకు సహాయపడుతుంది.

మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు సరసమైన ప్రీమియం రేట్లతో విస్తృతమైన కవరేజీని అందిస్తున్నాయి. వీటితో, మీరు ఈ క్రింది ఫీచర్లు మరియు ప్రయోజనాలను పొందుతారు:

  • నెట్‌వర్క్ హాస్పిటల్స్

    మా 8,600 + నెట్‌వర్క్ ఆసుపత్రులతో, నగదురహిత క్లెయిమ్ సౌకర్యంతో మీరు ఉత్తమ చికిత్సను పొందవచ్చని మేము నిర్ధారిస్తాము.

  • మా కేరింగ్లీ యువర్ యాప్‌తో, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి మరియు రెన్యూవ్ కూడా చేసుకోండి

    మా కేరింగ్లీ యువర్ యాప్‌తో, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు మరియు రెన్యూవల్ ప్రాసెస్‌ని సులభతరం చేసాము. మీరు ఈ యాప్‌ను ఉపయోగించి క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు మరియు క్లెయిమ్ స్టేటస్‌ని కూడా ట్రాక్ చేయవచ్చు.

  • హెల్త్ CDC (డైరెక్ట్ క్లిక్‌తో క్లెయిమ్) ఫీచర్

    మా కేరింగ్లీ యువర్ యాప్ యొక్క హెల్త్ CDC (డైరెక్ట్ క్లిక్‌తో క్లెయిమ్) ఫీచర్‌, మీ మొబైల్ నుండి INR 20,000 వరకు క్లెయిమ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

  • అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌మెంట్

    మీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ని వేగంగా మరియు అవాంతరాలు లేకుండా పూర్తి చేసే, అంతర్గత క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం మా వద్ద ఉంది.

  • ఆదాయపు పన్ను ప్రయోజనం

    మీరు ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద కూడా ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని పొందుతారు.

అనేక ప్రయోజనాలను కలిగి ఉన్న వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్. మరింత తెలుసుకోవడానికి వీడియోను చూడండి.

సులభమైన, అవాంతరాలు-లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్

మీరు క్యాష్‌లెస్ క్లెయిమ్‌ని ఫైల్ చేయవచ్చు లేదా మీ వైద్య బిల్లులను సమర్పించవచ్చు మరియు కోవిడ్-19 ని కవర్ చేసే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రాసెస్‌ని ఎంచుకోవచ్చు. ఈ రెండు క్లెయిమ్ ప్రాసెస్‌లు వేగవంతమైనవి, సులభమైనవి మరియు ఇబ్బంది లేకుండా ఉంటాయని మేము మీకు హామీ ఇస్తున్నాము. మీ సౌలభ్యం ప్రకారం, ఈ రెండు క్లెయిమ్ సెటిల్‌మెంట్ పద్ధతులలో దేనినైనా ఎంచుకోవచ్చు. కోవిడ్-19 ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కింద క్లెయిమ్ వేయడానికి మీరు అనుసరించాల్సిన దశలను చూడండి:

మీరు కరోనావైరస్ లేదా ఏదైనా ఇతర అనారోగ్యంతో బాధపడుతుంటే, క్యాష్‌లెస్ క్లెయిమ్ సదుపాయాన్ని పొందడానికి మరియు ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సేవల కోసం మా నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో దేనినైనా సంప్రదించవచ్చు. భారతదేశంలోని ప్రతీ మూల మరియు వాడల్లో 8600 కంటే ఎక్కువ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి.

మీరు మా టై-అప్ హాస్పిటల్స్‌లో దేనినైనా సంప్రదించవచ్చు మరియు హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్ వద్ద పొందిన ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ ఫారమ్‌పై చికిత్స చేసే వైద్యుడు/ హాస్పిటల్ నుండి సంతకంతో పాటు మీరు కుండా సంతకం చేయండి. నెట్‌వర్క్ హాస్పిటల్ ఈ ఫారమ్‌ను మాకు పంపిస్తుంది, మేము ఫారమ్‌ను పరిశీలించి, 3 గంటల్లో క్యాష్‌లెస్ క్లెయిమ్ ఆమోదం/ తిరస్కరణపై ధృవీకరిస్తాము. అలాగే, మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పుడు, హాస్పిటల్‌లోని మీ వైద్య బిల్లులతో ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం ముందుకు కొనసాగుతాము.

ఒకవేళ, నాన్-నెట్‌వర్క్‌ హాస్పిటల్‌లో చేరాలని ఎంచుకుంటే, మీరు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ సదుపాయాన్ని పొందవచ్చు. కరోనావైరస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఫైల్ చేయడానికి, మా వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పోర్టల్ ను ఉపయోగించవచ్చు లేదా కరోనావైరస్‌ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కింద ఆఫ్‌లైన్‌లో మీ క్లెయిమ్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే, మా టోల్ ఫ్రీ నంబర్‌ : 1800-209-5858 కు కాల్ చేయండి.

మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, ఈ క్రింది డాక్యుమెంట్లను HAT బృందానికి సమర్పించాలి (డిశ్చార్జ్ అయిన 30 రోజులలోపు):

  • మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ID తో పాటు సరిగ్గా పూరించి మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్
  • ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు మరియు చెల్లింపు రశీదు
  • ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్
  • డిశ్చార్జ్ కార్డు
  • ప్రిస్క్రిప్షన్‌లు
  • మందులు మరియు సర్జరీ ఉపకరణాల బిల్లులు
  • ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చుల వివరాలు (ఏవైనా ఉంటే)
  • అవసరమైతే, ఇన్-పేషెంట్ పేపర్లు.
  • మేము ఈ డాక్యుమెంట్లను మా అంతర్గత HAT బృందం సహాయంతో పరిశీలిస్తాము, వారు మీ క్లెయిమ్‌ని 10 రోజుల్లోపు ప్రాసెస్ చేస్తారు.

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

ఆశీష్ జుంజున్వాలా

2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...

సునీత ఎం అహూజా

లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు

రేని జార్జ్

నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...

కరోనావైరస్‌ని కవర్ చేసే బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

  • బజాజ్ అలియంజ్ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ (వ్యక్తిగత హెల్త్ గార్డ్):

    ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అత్యవసర పరిస్థితుల కోసం అయినా మీరు సమగ్రంగా కవర్ చేయబడి ఉన్నారని నిర్ధారించే ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్.

    ఒక వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోవిడ్-19 హాస్పిటలైజేషన్ ఖర్చులు, డే కేర్ విధానాలు, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, రోడ్ అంబులెన్స్ ఖర్చులు మరియు అవయవ దాతల ఖర్చులను కవర్ చేస్తుంది. మీరు ఈ పాలసీని రూ 1.5 లక్షల నుండి రూ 50 లక్షల వరకు ఉన్న, బహుళ మొత్తం ఇన్సూరెన్స్ ఎంపికల నుండి కూడా ఎంచుకోవచ్చు.

  • బజాజ్ అలియంజ్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ గార్డ్):

    కోవిడ్-19 హాస్పిటలైజేషన్ ఖర్చుల నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని, ఒకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. 

    ఈ ప్లాన్ మీ కుటుంబంలోని ప్రతీ సభ్యునికి ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తిగత మొత్తాన్ని పొందటానికి లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో, మీకు డే కేర్ విధానాలు కవర్, బేరియాట్రిక్ సర్జరీ కవర్, ప్రసూతి/నవజాత శిశువు కవర్, అవయవ దాత ఖర్చులు కవర్ మరియు ఆయుర్వేద మరియు హోమియోపతి చికిత్స కోసం కవర్ వంటివి పొందుతారు.

  • బజాజ్ అలియంజ్ సిల్వర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్:

    వృద్ధుల కోసం కోవిడ్-19 హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్.

    సీనియర్ సిటిజన్‌లకు హెల్త్ ఇన్సూరెన్స్ వృద్ధాప్యంలో మీ పొదుపు మొత్తాన్ని ఆరోగ్యం కోసం ఖర్చు చేయకుండా నివారిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు హాస్పిటలైజేషన్, మెడికల్ చెక్-అప్‌లు, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు ఆర్థిక భద్రత పొందుతారు. మీరు మీ కుటుంబంలోని ప్రతి సభ్యునికి 5% ఫ్యామిలీ డిస్కౌంట్ మరియు మీ అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించిన ప్యాకేజీలను కూడా పొందుతారు.

  • ఆరోగ్య సంజీవనీ ప్లాన్:

    ఒక స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఆరోగ్య సంజీవని పాలసీ కోవిడ్-19 హాస్పిటల్ ఖర్చులు, డే కేర్ విధానాలు, AYUSH చికిత్స, డే కేర్ చికిత్సలు, రోడ్ అంబులెన్స్ ఖర్చులు, కంటిశుక్లం చికిత్స మరియు అనేక జాబితా చేయబడిన ఆధునిక చికిత్సా పద్ధతుల కోసం మిమ్మల్ని కవర్ చేస్తుంది.

  • కరోనా కవచ్ పాలసీ

    కరోనా కవచ్ పాలసీ అనేది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఆదేశానుసారంగా, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందుబాటులో ఉంచింది. ఇది కోవిడ్ సంబంధిత హాస్పిటల్/గృహ సంరక్షణ చికిత్స ఖర్చులను భరించటానికి రూపొందించబడింది. అంతే కాకుండా, హాస్పిటల్ డైలీ క్యాష్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, రోడ్ అంబులెన్స్ వంటి ఆప్షన్‌లతో పాటుగా, AYUSH చికిత్సకు కూడా ఈ పాలసీ కవరేజీని అందిస్తుంది. మీరు మీ నివాసంలో కరోనావైరస్ చికిత్స పొందుతుంటే, అప్పుడు మేము హెల్త్ మానిటరింగ్, ఔషధ ఖర్చులు వంటి వైద్య ఖర్చులను 14 రోజుల వరకు భరిస్తాము.

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు సరసమైన ప్రీమియం రేటుతో విస్తృత కవరేజీని అందిస్తాయి.

ఒక కోట్ పొందండి

కరోనావైరస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్

హాస్పిటలైజేషన్ ఖర్చులు

కరోనావైరస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్, రూమ్‌రెంట్, బోర్డింగ్ మరియు నర్సింగ్ ఖర్చులు, డాక్టర్, కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్స్ ఫీజులు, కోవిడ్-19 కోసం రోగనిర్ధారణ పరీక్షలు మరియు మీరు కోవిడ్-19 కారణంగా హాస్పిటల్‌లో చేరినట్లయితే మరెన్నో వాటిని కవర్ చేస్తుంది.

ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్

మీరు, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులను వరుసగా 60 రోజులు మరియు 90 రోజుల వరకు పొందుతారు.

ప్రత్యామ్నాయ చికిత్సలు

ఆయుర్వేదం, యునాని, సిధా మరియు హోమియోపతి చికిత్స వంటి నాన్-అల్లోపతి చికిత్సలకు కూడా కవర్ చేయబడతారు.

అంబులెన్స్ చార్జీలు

కరోనావైరస్‌ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, మీకు రోడ్ అంబులెన్స్ కవర్‌ని అందిస్తాయి, తద్వారా అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా మీరు ఎమర్జెన్సీ సౌకర్యాలతో మీ సమీప ఆసుపత్రిని చేరుకుంటారు.

డే కేర్ విధానాలు

మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో, అన్ని డే కేర్ విధానాల కోసం విస్తృతంగా కవర్ చేయబడతారు, దీనికి మీరు కేవలం 24 గంటల కన్నా తక్కువ సమయం హాస్పిటల్‌లో ఉండాలి.

స్వస్థత ప్రయోజనం

మీ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ఆమోదయోగ్యమైనది అయితే, 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి కోసం నిరంతర హాస్పిటలైజేషన్ విషయంలో, సంవత్సరానికి రూ. 5,000 ప్రయోజనాన్ని పొందడానికి మీరు అర్హులు.

కరోనావైరస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన విషయాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

హాస్పిటలైజేషన్ ముందు మరియు తర్వాత కవర్

హాస్పిటలైజేషన్‌కి ముందు మరియు తరువాతి ఖర్చులను వరుసగా 60 మరియు 90 రోజుల వరకు కవర్ చేస్తుంది.

ఫ్యామిలీ కవర్

మీ తల్లిదండ్రులు, అత్తమామలు, మనవరాళ్లు, మనువలు మరియు మీ పై ఆధారపడిన తోబుట్టువులతో సహా మీ మొత్తం కుటుంబాన్ని కవర్ చేస్తుంది.

అంబులెన్స్ కవర్

ఒక పాలసీ సంవత్సరంలో అంబులెన్స్ ఛార్జీలు రూ. 20, 000 పరిమితికి లోబడి ఉంటాయి.

డేకేర్ చికిత్స కవర్

జాబితా చేయబడిన అన్ని డేకేర్ చికిత్సల కోసం ఖర్చులను కవర్ చేస్తుంది.

1 ఆఫ్ 1

కోవిడ్-19 ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల క్రింద సాధారణ మినహాయింపులు:

ఇన్‌పేషెంట్ కేర్‌కు హామీ ఇవ్వబడని చోట మరియు అర్హతగల నర్సింగ్ సిబ్బంది మరియు అర్హతగల వైద్యుల పర్యవేక్షణ అవసరం లేని చోట వైద్య ఖర్చులు.

మాదకద్రవ్యాలు లేదా మద్యం వాడకం లేదా దుర్వినియోగం కారణంగా చికిత్స అవసరమయ్యే ఏవైనా వ్యాధులు.

చికిత్స చేసే వైద్యుడు ధృవీకరించిన గాయం లేదా వ్యాధి చికిత్సలో భాగంగా లేనట్లయితే విటమిన్స్, టానిక్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కోసం ఖర్చులు.

ప్రయోగాత్మక, నిరూపించబడని లేదా నాన్-స్టాండర్డ్ చికిత్స.

భారతదేశం వెలుపల పొందిన చికిత్స, ఈ పాలసీ పరిధిలోకి రాదు.

హాస్పిటలైజేషన్ తరువాతి సంరక్షణ కోసం ఇంట్లో ఉపయోగించే ఎలాంటి రకమైన బాహ్య వైద్య పరికరాలు.

ప్రాథమికంగా మరియు ప్రత్యేకంగా రోగనిర్ధారణ పరిశోధనల కోసం అయ్యే హాస్పిటలైజేషన్‌కు సంబంధించిన వైద్య ఖర్చులు.

1 ఆఫ్ 1

కరోనావైరస్ కోసం కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల క్రింద ఉన్న, అన్ని మినహాయింపుల గురించిన వివరణాత్మక జాబితా కోసం, దయచేసి బ్రోచర్ మరియు పాలసీ వర్డింగ్స్‌ని డౌన్‌లోడ్ చేసి చదవండి.

హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

ఇప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్రింద కరోనావైరస్ కవరేజ్

మీకు ఇప్పటికే బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నట్లయితే, కోవిడ్-19 కవరేజ్ కోసం మాతో తనిఖీ చేయవచ్చు. కరోనావైరస్ వ్యాప్తికి ముందు లేదా తరువాత కూడా మీరు మా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నట్లయితే, కోవిడ్-19 సంక్రమణ యొక్క హాస్పిటలైజేషన్ ఖర్చుల కోసం మేము మిమ్మల్ని కవర్ చేస్తాము. దయచేసి గమనించండి, మీరు వెయిటింగ్ పీరియడ్‌లో కోవిడ్-19 బారిన పడినట్లయితే, దాని కోసం కవరేజ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలోకి రాదు.

Bajaj Allianz General Insurance Company

    కాబట్టి, మీరు కోవిడ్-19 వ్యాప్తి తర్వాత కరోనావైరస్‌ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పొందడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, అప్పుడు మీరు ఈ వ్యాధికి బాధితులుగా మారడానికి ముందుగానే దానిని పొందుతారని నిర్ధారించుకోండి. కరోనావైరస్‌ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల ద్వారా అందించబడే ప్రాథమిక కవరేజీలు:

     

    • ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు
    • ఐసియు ఛార్జీలు
    • ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు
    • కరోనావైరస్ రోగనిర్ధారణ టెస్ట్ ఖర్చులు

కరోనావైరస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడానికి ముందు చెక్ చేసుకోవాల్సిన విషయాలు

ఈ అనారోగ్యానికి తగినట్లుగా అవసరమయ్యే కవరేజీని పొందడానికి, కరోనావైరస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడం తప్పనిసరి. కానీ, కోవిడ్ - 19 ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి ముందు, మీరు మీ ఇన్సూరెన్స్ సంస్థతో ఈ క్రింది విషయాలను చెక్ చేసుకోవాలి:

Bajaj Allianz General Insurance Company
    • మీరు నెట్‌వర్క్ హాస్పిటల్‌ల జాబితాను చెక్ చేసుకోవాలి, తద్వారా మీకు నచ్చిన హాస్పిటల్‌కు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో అనుబంధం ఉందో లేదో మీకు తెలుస్తుంది మరియు మీరు అక్కడ అడ్మిషన్ పొందాలనుకుంటే క్యాష్‌లెస్ సదుపాయాన్ని పొందవచ్చు.
    • మీరు కరోనావైరస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేసే ముందు, కనీసం ప్రీ-పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, ICU ఛార్జీలు మరియు రోడ్ అంబులెన్స్ ఖర్చులు వంటి ప్రాథమిక కవరేజీల కోసం చూడాలి.
    • మీరు నిర్ధారణ పొందాల్సిన తదుపరి విషయం వెయిటింగ్ పీరియడ్. చాలా వరకు స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనారోగ్యాల కోసం మిమ్మల్ని కవర్ చేయడాన్ని ప్రారంభించడానికి ముందు, 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉంటాయి. అయితే, ఇది పాలసీ నుండి పాలసీకి వేరుగా ఉంటుంది మరియు అందువల్ల, మీరు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న కోవిడ్- 19 కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కింద వెయిటింగ్ పీరియడ్‌ని చెక్ చేయాలి.
    • మీరు చెక్ చేయవలసిన మరో విషయం ఏమిటంటే, ఆఫర్ చేసిన బీమా మొత్తం (SI). కరోనావైరస్ సంక్రమణకు హాస్పిటల్‌లో చేరే ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నందున, మీరు అధిక SI తో కోవిడ్- 19 ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పొందడం మంచిది.

 

 

కోవిడ్-19 కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ను సరళంగా చూద్దాం

కోవిడ్-19 అంటే ఏమిటి?

కోవిడ్-19 అనేది కొత్తగా కనుగొన్న కరోనావైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. ఇది ఒక అంటువ్యాధి, ఇది సోకిన వ్యక్తి యొక్క దగ్గు మరియు తుమ్ము నుండి వెలువడే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది.

కోవిడ్-19 ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను నేను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయగలను?

కరోనావైరస్‌ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం చాలా సులభం. మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు మరియు కోవిడ్- 19 కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని పొందడానికి మీరు, మా కేరింగ్లీ యువర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కరోనావైరస్‌ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, హోమ్ కేర్‌ చికిత్సను కవర్ చేస్తాయా?

లేదు, కరోనావైరస్‌ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల క్రింద, హోమ్ కేర్ చికిత్స కవర్ చేయబడదు.

నేను హోమ్ క్వారంటైన్ కింద ఉంచబడినట్లయితే నా వైద్య ఖర్చులు కవర్ చేయబడతాయా?

లేదు, మీరు హోమ్ క్వారంటైన్ కింద ఉంచబడినట్లయితే, కరోనావైరస్‌ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వైద్య ఖర్చులను కవర్ చేయవు.

ప్రైవేటు హాస్పిటలైజేషన్ కోసం వైద్య ఖర్చులు కవర్ చేయబడతాయా?

అవును, ప్రైవేట్ హాస్పిటలైజేషన్ కోసం చేసే వైద్య ఖర్చులు, కోవిడ్-19 ను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కింద కవర్ చేయబడతాయి

కరోనావైరస్‍‌ని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు ఏవైనా వెయిటింగ్ పీరియడ్‌లు వర్తిస్తాయా?

అవును, కోవిడ్-19 చికిత్సను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్‌లకు 30 రోజుల స్టాండర్డ్ వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.

కరోనావైరస్‌కు సంబంధించిన వైద్య ఖర్చులను నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుందా?

అవును, ఏదైనా వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా మీరు అనారోగ్యానికి గురైనట్లయితే, అనేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు మిమ్మల్ని కవర్ చేస్తాయి. మరియు, కరోనావైరస్ కూడా వైరల్ ఇన్‌ఫెక్షన్ కాబట్టి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, మీకు అవసరమైన కవరేజీని అందిస్తుంది.

లాక్‌డౌన్ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ సేవలను అందించడంలో ఏదైనా ఆలస్యం జరిగిందా?

మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం మరియు రెన్యూచేయడం మరియు క్లెయిమ్ ప్రాసెసింగ్ (క్యాష్‌లెస్ మరియు రీయింబర్స్‌మెంట్) వంటి మా హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అన్నీ, ఆన్‌లైన్‌లో పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, లాక్‌డౌన్ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ సేవలను అందించడంలో ఎటువంటి ఆలస్యం ఉండదు.

ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ ఫలితాలు నెగటివ్ అయితే, నా క్లెయిమ్ ఇంకా గౌరవించబడుతుందా?

కోవిడ్-19 కోసం బ్లడ్ రిపోర్ట్‌లు పాజిటివ్ లేదా నెగెటివ్‌గా ఉన్నప్పటికీ, మీరు సంబంధిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులకు లోబడి హాస్పిటలైజ్ చేయబడితే మీ క్లెయిమ్ గౌరవించబడుతుంది.

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ బ్రాంచ్‌లు తెరచుకున్నాయా?

అవును, మేము 100 బ్రాంచ్‌లకు పైగా తెరిచాము మరియు రాబోయే కాలంలో హైబ్రిడ్ మోడల్‌లో సేవలను అందిస్తాము. అనేక నిబంధనలను పాటించవలసి ఉంటుంది మరియు వాస్తవాలను, పూర్వపు పరిస్థితులతో నవీకరించవలసి ఉంటుంది, కార్యాలయాలను తెరవడానికి ఉన్న నియమాలను సడలించిన వెంటనే, మేము తాజా సమాచారాన్ని అందిస్తాము.

కోవిడ్-19 కారణంగా, లాక్‌డౌన్ సమయంలో నేను హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ గురించి ఎలా తెలియజేయగలను?

బజాజ్ అలియంజ్ వారి సరళమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌తో, లాక్‌డౌన్ సమయంలో మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఎలా రిజిస్టర్ చేసుకుని సెటిల్ చేసుకోవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:

• మా కేరింగ్లీ యువర్ యాప్ తో, మీరు పేపర్‌లెస్ విధానం ద్వారా రూ. 20,000 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను నమోదు చేసుకోవచ్చు - హెల్త్ CDC (డైరెక్ట్ క్లిక్‌తో క్లెయిమ్) కేరింగ్లీ యువర్ యాప్‌లో అందుబాటులో ఉంది.

• మీరు + 91 80809 45060 పై మాకు మిస్డ్ కాల్ ఇవ్వచ్చు మరియు ఈ ప్రాసెస్‌ని ముందుకు కొనసాగించడానికి మేము, మీకు తిరిగి కాల్ చేస్తాము.

• మీరు 575758 కు ‘WORRY’ అని SMS ని కూడా పంపవచ్చు.

• క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి, మీరు మాకు bagichelp@bajajallianz.co.in పై ఒక ఈ మెయిల్ పంపడాన్ని ఎంచుకోవచ్చు.

• మీ క్లెయిమ్ రిజిస్టర్ చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి మరొక మార్గం, మా ఆన్‌లైన్ క్లెయిమ్ పోర్టల్‌ను సందర్శించడం, ఇక్కడ, మీరు మీ పాలసీ నంబర్ వంటి కొన్ని ప్రాథమిక వివరాలను నమోదు చేయవచ్చు మరియు త్వరగా ఒక క్లెయిమ్ వేయవచ్చు.

నేను హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ స్టేటస్‌ని ఎలా చెక్ చేయగలను?

మీరు మా కేరింగ్లీ యువర్ యాప్‌ని ఉపయోగించి లేదా మా హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ క్లెయిమ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా మీ క్లెయిమ్ స్టేటస్‌ని చెక్ చేయవచ్చు.

లాక్‌డౌన్ సమయంలో నేను నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంను ఎలా చెల్లించగలను?

లాక్‌డౌన్ సమయంలో మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించడానికి, మీరు మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివిధ ఆన్‌లైన్ చెల్లింపు విధానాలను ఉపయోగించుకోవచ్చు.

కోవిడ్-19 వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాప్తి చెందుతుందా?

అవును, కోవిడ్-19 వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది, సాధారణంగా వ్యాధి సోకిన రోగితో సన్నిహిత సంబంధం తరువాత, ఉదాహరణకు; ఇల్లు, ఆఫీస్ లేదా ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో వ్యాప్తి చెందవచ్చు.

కోవిడ్-19 ఎలా వ్యాపిస్తుంది?

ప్రజలు, వైరస్ సోకిన ఇతరుల నుండి కోవిడ్- 19 వస్తుంది. ముక్కు లేదా నోటి నుండి వెలువడే సూక్ష్మ తుంపర్ల ద్వారా ఈ వ్యాధి వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది, ఇవి కోవిడ్-19 ఉన్న వ్యక్తి దగ్గినా లేదా ఊపిరిని వదిలినపుడు వ్యాప్తి చెందుతాయి.

లక్షణాలు లేని వ్యక్తి నుండి కోవిడ్-19 వ్యాప్తి చెందుతుందా?

కోవిడ్-19 ఉన్న చాలా మంది ప్రజలు వ్యాధి యొక్క ప్రారంభ దశలలో తేలికపాటి లక్షణాలను మాత్రమే చవిచూస్తారు. అందువల్ల కోవిడ్-19 ఉన్న వ్యక్తి నుండి వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, ఉదాహరణకు, తేలికపాటి దగ్గు మరియు అనారోగ్యం వంటి లక్షణాలు అంత ప్రభావవంతంగా అనిపించవు. 

నోవెల్ కరోనావైరస్ కోసం టీకా ఉందా?

 అవును, ఇప్పుడు వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి, మరియు ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

నోవెల్ కరోనావైరస్ కోసం చికిత్స ఉందా?

నోవెల్ కరోనావైరస్ వల్ల కలిగే వ్యాధికి నిర్దిష్ట చికిత్స లేదు. అయితే, అనేక లక్షణాలకు చికిత్స చేయవచ్చు, అందువల్ల, చికిత్స అనేది రోగి యొక్క క్లినికల్ పరిస్థితి ఆధారంగా మాత్రమే చేయబడుతుంది. అంతేకాకుండా, వ్యాధి సోకినవారికి సహాయక సంరక్షణ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.

తీవ్రమైన అనారోగ్యం అభివృద్ధి చెందే ప్రమాదం ఎవరికి పొంచి ఉంది?

కోవిడ్-2019 ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి మేము ఇంకా అధ్యయనం చేస్తుండగా, వృద్ధులు మరియు ముందు నుండి వైద్య పరిస్థితులతో ఉన్న వ్యక్తులలో (అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్ లేదా డయాబెటిస్ వంటివి) మిగతా వారికంటే, తీవ్రమైన అనారోగ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తుంది.  

నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఏమి చేయగలను?

అనేక రకాల అనారోగ్యాలకు గురికావడాన్ని మరియు వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రామాణిక సిఫారసులు, ప్రాథమిక చేతి శుభ్రత మరియు శ్వాసకోశ పరిశుభ్రతతో పాటు సురక్షితమైన ఆహార పద్ధతులు మరియు దూరాన్ని పాటించడం, దగ్గు మరియు తుమ్ము వంటి శ్వాసకోశ అనారోగ్య లక్షణాలు ఉన్న ఏ వ్యక్తినైనా వీలైనంత దూరంగా ఉంచడం. సామాజిక దూరాన్ని పాటించడం అనేది ప్రధాన ప్రాముఖ్యత.  

ఏదైనా మరింత సహాయం అవసరమా?

+91 80809 45060కు మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా <WORRY> అని 575758 కు SMS చేయండి మరియు మా కేర్ స్పెషలిస్ట్ మీకు తిరిగి కాల్ చేస్తారు.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి