Insurance Regulatory and Development Authority of India (IRDAI) అనేది భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగాన్ని నియంత్రించే అపెక్స్ బాడీ. ఇది లైఫ్ ఇన్సూరెన్స్‌కి మాత్రమే పరిమితం కాకుండా నాన్-లైఫ్ లేదా జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లను కూడా కలిగి ఉంటుంది. వీటిలో, ప్రజలు టూ వీలర్ వాహనాల పట్ల చూపిస్తున్న ప్రాధాన్యత కారణంగా టూ వీలర్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా, 1988 మోటార్ వాహనాల చట్టం దేశంలో రిజిస్టర్ చేయబడిన అన్ని వాహనాలకు ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం తప్పనిసరి చేస్తుంది. అందువల్ల, టూ-వీలర్ ఇన్సూరెన్స్ కోసం అవసరం వేగంగా పెరుగుతోంది. ఇంటర్నెట్ ఆగమనంతో
బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ని ఆన్‍లైన్‌లో కొనుగోలు సులభం అయింది. ఇది మొత్తం ప్రక్రియను అవాంతరాలు లేనిదిగా మరియు సౌకర్యవంతంగా చేసింది. మీరు థర్డ్ పార్టీ లేదా సమగ్ర ప్లాన్ కొనుగోలు చేస్తున్నా, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు బైక్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్ అవసరం.
రిజిస్ట్రేషన్ నంబర్ అంటే ఏమిటి?
రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టిఒ) ద్వారా కేటాయించబడిన ఒక ప్రత్యేక నంబర్. ఈ నంబర్ ప్రతి వాహనానికి ప్రత్యేకంగా ఉంటుంది మరియు వాహనం మరియు దానికి సంబంధించిన అన్ని రికార్డులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రతి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన 30 రోజుల్లోపు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్‌కి ముందే నిర్వచించబడిన ఒక ఫార్మాట్ ఉంటుంది, ఇందులో అక్షరాలు మరియు అంకెల కాంబినేషన్ ఉపయోగించబడుతుంది. XX YY XX YYYY అనేది ఫార్మాట్, ఇందులో 'X' అక్షరాలను సూచిస్తుంది మరియు 'Y' అంకెలను సూచిస్తుంది. మొదటి రెండు అక్షరాలు రాష్ట్ర కోడ్‌ను సూచిస్తాయి అంటే వాహనం రిజిస్టర్ చేయబడిన రాష్ట్రం. తదుపరి రెండు అంకెలు జిల్లా కోడ్ లేదా రిజిస్టర్ చేసిన ఆర్‌టిఒ యొక్క కోడ్‌ను సూచిస్తాయి. వీటి తరువాత ఆర్‌టిఒ యొక్క ప్రత్యేక క్యారెక్టర్ సీరీస్ ఉంటుంది. చివరి నాలుగు నంబర్లు వాహనం యొక్క ప్రత్యేక నంబర్‌ను సూచిస్తాయి. అక్షరాలు మరియు అంకెల ఈ కాంబినేషన్ ఉపయోగించి, మీ వాహనం యొక్క ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది, ఇది ఆర్‌టిఒ రికార్డులలో స్టోర్ చేయబడుతుంది. ఏ రెండు వాహనాలు ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉండకూడదు. మొదటి ఆరు అక్షరాలు మరియు సంఖ్యల కలయిక ఒకే విధంగా ఉండవచ్చు, అయితే చివరి నాలుగు అంకెలు మీ వాహనానికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. ఈ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి, మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్‌తో సహా వాహనానికి సంబంధించిన వివిధ సమాచారాన్ని ట్రాక్ చేయవచ్చు
.
బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి రిజిస్ట్రేషన్ నంబర్ ఎలా ఉపయోగపడుతుంది?
మీ బైక్ గుర్తింపు కాకుండా, ఈ క్రింది పరిస్థితులలో రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం అవుతుంది.
బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు సమయంలో: మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినా, మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం. అన్ని
వాహన ఇన్సూరెన్స్ పాలసీలు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌ను పేర్కొంటాయి. ఇది ఇన్సూరెన్స్ పాలసీ యొక్క కవరేజీని ఒక ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఆ నిర్దిష్ట వాహనానికి పరిమితం చేస్తూ మరియు కట్టుబాటు చేస్తూ సూచిస్తుంది.
బైక్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ సమయంలో:
టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసే సమయంలో మీ ఇన్సూరర్‌ను మార్చడానికి లేదా అదే ఇన్సూరెన్స్ కంపెనీతో కొనసాగడానికి మీకు ఎంపిక ఉంటుంది. ఎంపికతో సంబంధం లేకుండా, మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌ను మీరు ఇన్సూరర్‌కు అందించాలి. మీ వాహనానికి సంబంధించిన ఏవైనా ప్రస్తుత రికార్డులను పొందడానికి ఇది సహాయపడుతుంది.
బైక్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్‌ను పోగొట్టుకున్న సందర్భంలో: ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ పాలసీ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లేదా భౌతిక ఫార్మాట్‌లో కూడా అందించబడుతుంది. మీరు మీ పాలసీ డాక్యుమెంట్‌ను పోగొట్టుకున్నట్లయితే మరియు బైక్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్ గుర్తులేకపోతే, మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించవచ్చు. మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి ఏవైనా యాక్టివ్ ఇన్సూరెన్స్ పాలసీలు చూడవచ్చు. ఈ సమాచారాన్ని మీ ఇన్సూరర్ వెబ్‌సైట్‌లో లేదా రెగ్యులేటర్ వద్ద కూడా శోధించవచ్చు. రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఛాసిస్ నంబర్, కాలుష్య సర్టిఫికెట్ వివరాలు, కొనుగోలు తేదీ మరియు బైక్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్ వంటి పూర్తి వివరాలను కలిగి ఉన్న అప్లికేషన్లను ప్రవేశపెట్టింది. సమాచారం కోసం వివిధ డేటాబేస్‌లను శోధించడానికి మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగకరంగా ఉండే కొన్ని మార్గాలు ఇవి. ఇది సౌకర్యవంతం మాత్రమే కాకుండా ఒకే ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ నంబర్ ఉపయోగించి ఏదైనా వాహనం సంబంధిత వివరాలను కూడా ఇబ్బందులు లేకుండా చూడవచ్చు. కాబట్టి మీరు మీ పాలసీ డాక్యుమెంట్‌ను కోల్పోయినట్లయితే, చింతించకండి, మీరు రిజిస్ట్రేషన్ వివరాలను ఉపయోగించి డూప్లికేట్ కాపీ కోసం అప్లై చేయవచ్చు.
రిప్లై ఇవ్వండి