ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Get Two Wheeler Insurance Copy Online
ఫిబ్రవరి 20, 2023

టూ-వీలర్ ఇన్సూరెన్స్ కాపీని ఆన్‌లైన్‌లో పొందండి

మోటారు వాహనాన్ని నడపడం విషయానికి వస్తే, మీరు ఎల్లప్పుడూ ప్రాథమిక డాక్యుమెంట్లను కలిగి ఉండటం ముఖ్యం. ఈ డాక్యుమెంట్లలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పియుసి సర్టిఫికెట్ మరియు ఇన్సూరెన్స్ పాలసీ ఉంటాయి. అది కారు కావచ్చు లేదా బైక్ కావచ్చు, ఈ అవసరాలు అన్ని ఒకే విధంగా ఉంటాయి. 1988 మోటార్ వాహనాల చట్టం ఈ నియంత్రణ నిబంధనను నిర్దేశించింది, దీనిని అనుసరించకపోతే భారీ జరిమానాలు విధించబడవచ్చు. బైక్ ఇన్సూరెన్స్ అనేది మీ టూ-వీలర్‌ను రైడ్ చేసేటప్పుడు మీ వెంట తీసుకువెళ్లవలసిన ఒక తప్పనిసరి డాక్యుమెంట్. అది మీ స్థానిక సూపర్‌మార్కెట్‌కు వెళ్లాలనుకున్నా లేదా ఉద్యోగ విషయమై రోజువారీ చేసే ప్రయాణం అయినా, తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన ఒక డాక్యుమెంట్. ఒక సమగ్ర పాలసీ కాకపోయినా, మీరు కనీసం ఒక థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయాలి, అది యాక్సిడెంట్ సమయంలో థర్డ్-పార్టీ బాధ్యతల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. కానీ, మీరు ఈ డాక్యుమెంట్‌ను పోగొట్టుకున్నట్లయితే ఏమి జరుగుతుంది?? మీరు తిరిగి కొత్త ఇన్సూరెన్స్ కవరేజ్ పొందాలా?? మీరు మీ పాలసీ ప్రయోజనాలన్నింటినీ కోల్పోతారా? తెలుసుకునేందుకు చదవండి.

రైడింగ్ సమయంలో బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందా?

అవును, మోటారు వాహనాల చట్టం ప్రకారం మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ కాపీని కలిగి ఉండటం తప్పనిసరి. ఇది మీరు ఎల్లప్పుడూ మీ వాహనం కోసం చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి ఉన్నారని భరోసా కల్పిస్తుంది. అయితే, బైక్ ఇన్సూరెన్స్ పాలసీ హార్డ్ కాపీని మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అయితే, పాలసీ హార్డ్ కాపీని వెంట తీసుకువెళ్లడం అనేది మీకు అవసరమైన డాక్యుమెంట్‌ను అందుబాటులో ఉంచుకోవడానికి గల ఉత్తమ మార్గం, అలాగే, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ యొక్క డిజిటల్ కాపీని కూడా అందిస్తాయి. ఈ డిజిటల్‌ కాపీని మీ ఫోన్‌లో ఉన్న DigiLocker లేదా mParivahan యాప్‌లో స్టోర్ చేయవచ్చు. మీరు మీ పాలసీ హార్డ్ కాపీని పోగొట్టుకున్న సందర్భంలో లేదా మీరు డిజిటల్ కాపీని వెంట తీసుకెళ్లాలనుకుంటే, మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ డిజిటల్ కాపీని DigiLocker లేదా mParivhan యాప్ లాంటి అధీకృత యాప్‌లలో తీసుకువెళ్లినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఇది గమనించగలరు, ప్రమాదం సందర్భంలో పోలీస్ మరియు/లేదా ఇన్సూరెన్స్ కంపెనీ మొట్ట మొదట మిమ్మల్ని వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ మరియు మీ డ్రైవింగ్ లైసెన్స్ గురించి అడుగుతారు. ఈ డాక్యుమెంట్లు లేకుండా, ప్రమాద సమయంలో మీరు ఇన్సూర్ చేయబడ్డారని నిరూపించడం కష్టతరమవుతుంది, అలాగే, మీ క్లెయిమ్ ప్రాసెస్ లేదా తిరస్కరణలో ఆలస్యాలు కావచ్చు. అదనంగా, రైడింగ్ సమయంలో బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీని వెంట తీసుకెళ్లడం వలన దొంగతనం లేదా ఏదైనా ఇతర దురదృష్టకర సంఘటన సందర్భంలో ఇది మీకు అండగా ఉంటుంది. ఇది రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మీరు ఎల్లప్పుడూ మీతో ఉంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ హార్డ్ కాపీని కలిగి ఉండి దానిని కోల్పోయినట్లయితే, పాలసీ డాక్యుమెంట్ డూప్లికేట్ కాపీని జారీ చేయమని మీరు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను అడగవచ్చు.

మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ డూప్లికేట్ కాపీని ఎలా పొందాలి?

డూప్లికేట్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఈ రెండు మార్గాల్లో అప్లై చేసుకోవచ్చు. చాలా మంది ప్రజలు ఆన్‌లైన్‌లో పాలసీలను కొనుగోలు చేయాలని ఇష్టపడటంతో ఆన్‌లైన్‌లో డూప్లికేట్ టూవీలర్ వెహికల్ ఇన్సూరెన్స్‌ను పొందడం సులభతరం అయింది. మీరు దీన్ని ఎలా చేయవచ్చు అనేది ఇక్కడ ఉంది:
  1. మీ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి. ఇన్సూరెన్స్ కంపెనీలు సాధారణంగా ఈ వివరాలను మెయిల్ ద్వారా షేర్ చేస్తాయి, కానీ అది అందుబాటులో లేకపోతే మీ పాలసీ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.
  2. ఎంచుకోండి బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి.
  3. పోర్టల్ పాలసీ వివరాలను అడుగుతుంది, అవి ధృవీకరించబడతాయి.
  4. ఈ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత మీరు వాటిని వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో టూ-వీలర్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసినట్లయితే, అది డౌన్‌లోడ్ కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు మీ రిఫరెన్స్ కోసం దానిని ప్రింట్ చేసుకోవచ్చు, సేవ్ చేయవచ్చు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఇన్సూరెన్స్ పాలసీని ఇ-మెయిల్‌లో అలాగే, హార్డ్ కాపీని పోస్ట్ ద్వారా పంపే సౌకర్యాన్ని కూడా కల్పిస్తాయి.
ఆన్‌లైన్ ప్రాసెస్‌ పై అంతగా అవగాహన లేని వారికి, ఆఫ్‌లైన్ ప్రాసెస్ కోసం కూడా అవకాశం అందుబాటులో ఉంటుంది. ప్రాసెస్ ఈ కింది విధంగా ఉంటుంది:
  1. మొదటి దశ, మీ ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్‌‌ను పోగొట్టుకున్నారని మీ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం. ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా వారు టూ-వీలర్ ఇన్సూరెన్స్ కాపీని సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ సమాచారం కాల్‌లో లేదా మెయిల్ ద్వారా కూడా తెలియజేయబడుతుంది.
  2. తరువాత, మీరు తగిన అధికారులతో మొదటి సమాచార నివేదిక లేదా ఎఫ్ఐఆర్‌ను ఫైల్ చేయవలసి ఉంటుంది. ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ డాక్యుమెంట్‌ పోగొట్టుకున్నది నిజమేనని కేసు నిర్ధారిస్తుంది.
  3. ఇప్పుడు, ఎఫ్‌ఐఆర్‌తో పాటు మీరు పాలసీ నంబర్ మరియు పాలసీ రకం లాంటి ఇన్సూర్ చేయబడిన టూ-వీలర్ వివరాలను పేర్కొంటూ మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి వ్రాతపూర్వక దరఖాస్తును సమర్పించవలసి ఉంటుంది.
  4. చివరగా, ఏదైనా తప్పుడు ప్రాతినిధ్యం కోసం మీరు పూర్తి బాధ్యత వహిస్తారని తెలియజేసే ఒక నష్టపరిహార బాండ్‌ను కూడా సమర్పించాలి. ఇది మీ ఇన్సూరెన్స్ కంపెనీకి భద్రతను అందించే ఒక చట్టపరమైన డాక్యుమెంట్.

బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం అప్లై చేసేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు ఏవి?

బైక్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసేటప్పుడు, మీరు సాధారణంగా ఈ కింది డాక్యుమెంట్లను అందించాలి:
  1. మీ బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సి) కాపీ
  2. మీ బైక్ యొక్క చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ (పియుసి) సర్టిఫికెట్ కాపీ
  3. మీ డ్రైవర్ యొక్క లైసెన్స్ కాపీ
  4. మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ (అది ఇప్పటికే ఇన్సూర్ చేయబడి ఉంటే)
  5. వ్యక్తిగత మరియు బైక్ సంబంధిత సమాచారం కలిగి ఉన్న ఒక పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
డూప్లికేట్ పాలసీ జారీ సదుపాయంతో మీరు మళ్లీ ఒక ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే, టూ-వీలర్ ఇన్సూరెన్స్ కాపీని పొందవచ్చు. ఒక డూప్లికేట్ పాలసీ కోసం త్వరగా అప్లై చేయండి, ట్రాఫిక్ అధికారులు ఫైన్ వేసేలా చివరి క్షణం వరకు వేచి ఉండకూడదు. ఈ రోజుల్లో రాష్ట్ర రోడ్డు రవాణా కార్యాలయాలు, వాహన యజమానులకు టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో సహా వారి వాహన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలను వెంట తీసుకెళ్లడానికి అనుమతించాయి. mParivahan లేదా DigiLocker లాంటి యాప్స్ వీటిని స్టోర్ చేయడానికి వీలు కల్పిస్తాయి.   ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 2.3 / 5 ఓట్ల లెక్కింపు: 16

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయాన్ని తెలపండి!

  • నిర్మల పిసి - ఫిబ్రవరి 10, 2022 12:30 am కు

    దయచేసి నా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ # OG-22-9906-7802-0005 యొక్క డూప్లికేట్ సాఫ్ట్ కాపీని పంపండి

    • బజాజ్ అలియంజ్ - ఫిబ్రవరి 11, 2022 1:26 గంటలకు

      దయచేసి https://www.bajajallianz.com/forms/form-e-policy.html పేజీని సందర్శించడం ద్వారా మీ పాలసీ సాఫ్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి

  • సుఖ్జిందర్ - ఫిబ్రవరి 8, 2022 9:21 pm

    నేను ఈ ఫిబ్రవరి నెలలో నా పాలసీని రెన్యూ చేశాను, కానీ పిడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేయలేదు.

    • బజాజ్ అలియంజ్ - ఫిబ్రవరి 11, 2022 1:09 గంటలకు

      దయచేసి https://www.bajajallianz.com/forms/form-e-policy.html పేజీని సందర్శించడం ద్వారా మీ పాలసీ సాఫ్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి