రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
What is IRDA?
మే 19, 2021

IRDAI అంటే ఏమిటి? IRDA విధులు

ఇన్సూరెన్స్ అనే భావన 6,000 సంవత్సరాల నాటిది, అప్పటి ప్రజలు కూడా ఒక రకమైన భద్రతా కవచాన్ని కోరుకునేవారు. తదుపరి తరాల్లో ఈ ఆవశ్యకతను గ్రహించడం జరిగింది, అది ఇన్సూరెన్స్ భావనకు నాంది పలికింది. ఇన్సూరెన్స్ అర్థం ఏమిటంటే “ఒక నిర్దిష్ట ప్రీమియం చెల్లింపుకు ప్రతిఫలంగా జరిగిన నష్టం, డ్యామేజ్, అనారోగ్యం లేదా మరణానికి తగిన పరిహారాన్ని అందించడానికి ఒక సంస్థ తీసుకునే చర్య”. భద్రత యొక్క ఈ భావన క్రమంగా పెరుగుతున్న సందర్భంలో, ఇది మొదట జనరల్ ఇన్సూరెన్స్ ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఆవిర్భావానికి దారితీసింది. భారతదేశంలో ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టినప్పుడు అది ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. అయితే, క్రమంగా పెరుగుతున్న ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ పనితీరును పర్యవేక్షించేందుకు, ఒక స్వతంత్ర సంస్థగా Insurance regulatory and development authority of india లేదా IRDA అని పిలువబడే ప్రత్యేక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయబడింది.

IRDA అంటే ఏమిటి?

IRDA లేదా Insurance regulatory and development authority of india అనేది భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగాన్ని పర్యవేక్షించే మరియు నియంత్రించే ఒక ఉన్నత స్థాయి సంస్థ. IRDA యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం పాలసీదారుల ప్రయోజనాలను కాపాడటం మరియు దేశంలో ఇన్సూరెన్స్ వృద్ధిని నిర్ధారించడం. ఇన్సూరెన్స్ పరిశ్రమను నియంత్రించే విషయానికి వస్తే IRDA, కేవలం లైఫ్ ఇన్సూరెన్స్‌ని మాత్రమే కాకుండా, దేశంలో పనిచేస్తున్న జనరల్ ఇన్సూరెన్స్ ‌కంపెనీలను కూడా చూస్తుంది.

IRDA యొక్క విధులు

పైన చర్చించినట్లు, Insurance regulatory and development authority of india ప్రాథమిక లక్ష్యం ఇన్సూరెన్స్ చట్టంలో పేర్కొన్న నిబంధనల అమలును నిర్ధారించడం. ఈ క్రింది విధంగా ఉన్న దాని మిషన్ స్టేట్‌మెంట్ ద్వారా దీనిని మరింత అర్థం చేసుకోవచ్చు-
  • పాలసీదారుకు సరైన న్యాయం మరియు చికిత్సలు అందించడాన్ని నిర్ధారిస్తూ వారి నమ్మకాన్ని సురక్షితం చేయడం.
  • వర్తించే చట్టాలు మరియు నిబంధనలతో ఆర్థిక భరోసాను నిర్ధారిస్తూ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ పై సరైన నియంత్రణను కలిగి ఉండటం.
  • ఇన్సూరెన్స్ పరిశ్రమలో ఎలాంటి అస్పష్టతకు చోటు లేకుండా, కాలానుగుణంగా కొత్త నిబంధనలను రూపొందించడం.

ఇన్సూరెన్స్ రంగంలో IRDA పాత్ర మరియు ప్రాముఖ్యత

1800లలో భారతదేశం ఇన్సూరెన్స్ అనే భావనను అధికారిక మాధ్యమంగా చూడటం ప్రారంభించింది మరియు అప్పటి నుండి సానుకూల అభివృద్ధితో ముందుకు సాగింది. ఇది తదుపరిగా పాలసీదారుల ప్రయోజనాల దృష్ట్యా వివిధ చట్టాలను క్రమబద్ధీకరించి, అవసరమైన సవరణను తీసుకొచ్చి నియంత్రణ సంస్థకు మరింత మద్దతునిచ్చింది. IRDA పోషించే ప్రధాన పాత్రలు ఈ విధంగా ఉన్నాయి -
  • అన్నింటికన్నా ప్రథమ మరియు ప్రధాన కర్తవ్యం పాలసీదారు నమ్మకాన్ని సురక్షితం చేయడం.
  • సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేందుకు, వ్యవస్థీకృతమైన పద్ధతిలో ఇన్సూరెన్స్ పరిశ్రమ వృద్ధి రేటును మెరుగుపరచండి.
  • ఒక ఇన్సూరెన్స్ సంస్థ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక భరోసాతో పాటు న్యాయమైన, సమగ్రమైన పద్ధతిలో డీల్‌ను కొనసాగించేలా నిర్ధారించడం.
  • వాస్తవమైన ఇన్సూరెన్స్ క్లెయిముల వేగవంతమైన మరియు అవాంతరాలు-లేని సెటిల్‌మెంట్‌ను నిర్ధారించడం.
  • సరైన మార్గం ద్వారా పాలసీదారు సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడం.
  • అక్రమాలను నివారించడం మరియు మోసాలను నిరోధించడం.
  • ఫైనాన్షియల్ మార్కెట్లలో ఇన్సూరెన్స్ కంపెనీల నిర్వహణను పర్యవేక్షించడం మరియు న్యాయాన్ని, పారదర్శకతను ప్రోత్సహించడం.
  • ఆర్థిక స్థిరత్వం పరంగా ఉన్నత ప్రమాణాలతో ఒక విశ్వసనీయమైన నిర్వహణ వ్యవస్థను రూపొందించడం.

IRDA ద్వారా నియంత్రించబడిన ఇన్సూరెన్స్ పాలసీల రకాలు

ఇన్సూరెన్స్ రంగం విస్తృత వర్గీకరణ రెండు భాగాలుగా ఉంటుంది - లైఫ్ మరియు నాన్-లైఫ్, దీనిని జనరల్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో ఇది పేరు సూచించినట్లుగా, మీ జీవితం యొక్క భద్రతను నిర్ధారించే పాలసీలను నిర్వహిస్తుంది. అయితే, జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? జనరల్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ మినహా హెల్త్ ఇన్సూరెన్స్, కారు ఇన్సూరెన్స్, టూ వీలర్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, కమర్షియల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ మరియు మరిన్ని. ఇవి IRDA పోషించే కొన్ని కీలకమైన పాత్రలు. పైన పేర్కొన్న పాత్రలకే పరిమితం కాకుండా, దేశంలో తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి బీమా కంపెనీలకు రిజిస్ట్రేషన్‌ను మంజూరు చేయడం లాంటి బాధ్యతలను కూడా నిర్వర్తిస్తాయి. ఇది బీమాదారు మరియు పాలసీదారుల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించటమే కాక, అనేక ఇతర బాధ్యతలను నిర్వర్తిస్తుంది.   *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి