Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ఆన్‌లైన్‌లో చవకైన కార్ ఇన్సూరెన్స్

మీరు ఇష్టపడే వాటిని మేము రక్షిస్తాము
Besy Car Insurance Policy Online by Bajaj Allianz

ప్రారంభిద్దాం

దయచేసి మీ మొదటి పేరు చివరి పేరును నమోదు చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
/motor-insurance/car-insurance-online/buy-online.html
ఒక కోట్ పొందండి
రెన్యూ చేయండి కోట్‌ను తిరిగి పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి

దీని వలన మీకు కలిగే లాభం ఏమిటి

feature

వీపే- ఒక యాడ్-ఆన్ కవర్

మీ మోటార్ ఓన్ డ్యామేజ్ సంబంధిత అన్ని ఆందోళనలకు వన్-స్టాప్ పరిష్కారం

మనీ టుడే నుండి ఉత్తమ మోటార్ ఇన్సూరెన్స్ అవార్డు పొందింది

ఆన్ ది స్పాట్ క్లెయిమ్ పంపిణీ

సరసమైన మరియు విశ్వసనీయమైన కార్ ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నారా? బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తక్కువ ఖర్చుతో మీ వాహనానికి రక్షణ కలిపించడానికి చవకైన కార్ ఇన్సూరెన్స్ పరిష్కారాలను అందిస్తుంది. మా పాలసీలు ప్రకృతి మరియు మానవుల ప్రమేయంతో ఏర్పడే విపత్తులు, వ్యక్తిగత ప్రమాదాలు మరియు థర్డ్-పార్టీ చట్టపరమైన బాధ్యతతో సహా సమగ్ర కవరేజీని అందిస్తాయి. నగదురహిత క్లెయిమ్స్ సెటిల్‌మెంట్, 24x7 క్లెయిమ్స్ సపోర్ట్ మరియు యాడ్-ఆన్ కవర్లు వంటి ఫీచర్లతో, మీరు రోడ్డుపై మనశ్శాంతితో ప్రయాణం చేయవచ్చు. నేడే చవకైన కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో పొందండి మరియు సులభమైన రెన్యూవల్స్ మరియు తక్షణ క్లెయిమ్స్ సహాయం నుండి ప్రయోజనం పొందండి. నాణ్యతపై రాజీపడకండి - బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో చవకైన కార్ ఇన్సూరెన్స్ పొందండి మరియు ఆత్మవిశ్వాసంతో డ్రైవ్ చేయండి.

సరసమైన మరియు చవకైన కార్ ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నారా?

ఎవరినైనా అడగండి, తక్కువ ప్రీమియంలు డిమాండ్ చేస్తేనే అది మంచి కార్ ఇన్సూరెన్స్ అనే సమాధానం సర్వసాధారణంగా వినిపిస్తుంది. అయితే, మీరు కొంచెం లోతుగా వెళ్లి చూడండి, చౌకైన కార్ ఇన్సూరెన్స్ అనే ఒక్క విశిష్టత మాత్రమే సరిపోదని మీకు అర్థమవుతుంది.

While a Cheap కారు ఇన్సూరెన్స్ పాలసీ can save you a few bucks upfront on premiums, it’s only going to make you shell out money from your own pocket later on in case of a mishap. That’s because a Cheap Car Insurance Policy fails to provide adequate coverage.

మిమ్మల్ని ఈ విధంగా అడగండి: మీ కారు 'చవకైనది' కాకపోతే, అప్పుడు మీరు మీ కార్ ఇన్సూరెన్స్ పై రాజీపడుతున్నారా?

మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన మీ అత్యంత ఖరీదైన బహుమతుల్లో మీ కారు కూడా ఒకటి. కాబట్టి, కేవలం కొంచెం డబ్బు ఆదా చేయడం కోసం మీరు దాని భద్రత విషయంలో రాజీ పడకూడదు. కాబట్టి, ప్రీమియం మొత్తం తగ్గించడం కోసం మీరు ఒక చవకైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం అన్వేషిస్తుంటే, ఆ పనికి మీరు వెంటనే బ్రేకులు వేయాల్సిన సమయమిది.

బజాజ్ అలియంజ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాలు ఏమిటి

ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ పొందే అర్హత మీ కారుకు ఉందని బజాజ్ అలియాంజ్‌లో మేము విశ్వసిస్తున్నాము, అది అందుబాటు ధరలో ఉన్నప్పటికీ, అవసరమైన కవరేజీ విషయంలో రాజీపడేదిగా ఉండకూడదు. కాబట్టే, ఖర్చు-తక్కువగా ఉన్నప్పటికీ, అనేక ప్రయోజనాలు అందించేలా మేము మా పాలసీని జాగ్రత్తగా రూపొందించాము.

  • నగదురహిత క్లెయిమ్‌ల పరిష్కారం

    నగదు రహిత సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ఉండగా, కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ మాత్రం ఆ విషయంలో ఎందుకు వెనుకబడాలి? జీవితంలోని ప్రతి విషయంలోనూ నగదు రహిత ధోరణి వైపు మీరు సాగిపోతున్న నేపథ్యంలో, మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ సైతం భారతదేశ వ్యాప్తంగా 7200కి పైగా ఎంపిక చేసిన గ్యారేజీల్లో నగదు రహిత క్లెయిమ్స్ సెటిల్‌మెంట్‌‌ను అనుమతిస్తుంది.

    మీరు వ్యక్తిగతంగా ఇష్టపడే గ్యారేజీలో నగదురహిత సదుపాయం అందుబాటులో లేదా? సరే, ఏమి కాదు. ఇలాంటి పరిస్థితిలో, మీరు చెల్లింపు చేసి, ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందడాన్ని ఎంచుకోవచ్చు.

  • ఎన్‌సిబి ట్రాన్స్‌ఫర్

    రోడ్డు మీద బాధ్యతాయుతమైన ప్రవర్తన కోసం మీరు ప్రతి ఏడాది ఒక ఎన్‌సిబి పొందుతారు. అయితే, మీరు ఇన్సూరర్‌ను మార్చినప్పుడు దాని ప్రయోజనాలు కోల్పోవడం అనుచితమే అవుతుంది. ఇన్సూరర్‌ను మార్చినప్పుడు మీరు మీ ఎన్‌సిబి ని కోల్పోవడమనేది మీరు బాధ్యతాయుతమైన డ్రైవర్‌గా ఉండటం ద్వారా మీకు లభించే ప్రయోజనాలను తిరస్కరించడమే అవుతుందని మేము విశ్వసిస్తాము మరియు ఆ పద్ధతిని మేము వ్యతిరేకిస్తాము.

    మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో, మీరు మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి పొందిన మీ ప్రస్తుత ఎన్‌సిబి లో 50% వరకు బదిలీ చేసుకోవచ్చు. ఇది మీ మీద ఆర్ధిక భారం తగ్గించడం ద్వారా, కొంత పరిమితి వరకు ప్రీమియం మొత్తం తగ్గిస్తుంది.

  • 24x7 క్లెయిమ్స్ సపోర్ట్

    కొన్ని సేవలు అన్నివేళలా, ఏడాదిలో 365 రోజులూ అందుబాటులో ఉండాలని మేము విశ్వసిస్తున్నాము, క్లెయిమ్స్ సపోర్ట్ కూడా అందులో ఒకటి. క్లెయిమ్‌లు మరియు మీ ప్రశ్నలకు మద్దతు అందించడం కోసం మా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లు సెలవు రోజులలో కూడా పనిచేస్తుంటారు.

    ఫోన్ ద్వారా క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు, మీరు మా మా టోల్-ఫ్రీ నంబర్ 1800-209-5858కు డయల్ చేస్తే చాలు మరియు మా ఎగ్జిక్యూటివ్‌లు మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి మీకు మార్గనిర్దేశం చేస్తారు. వేగవంతమైన, సౌకర్యవంతమైన మరియు అవాంతరాలు-లేని క్లెయిమ్‌ల మద్దతు కోసం మా అన్నివేళల అందుబాటులో ఉండే టెలిఫోన్ సర్వీస్ అనేది మీకు అవసరమైనప్పుడు మేము మీతో ఉన్నామని నిర్ధారిస్తుంది.

  • టోయింగ్ సౌకర్యం

    కారు బ్రేక్‌డౌన్ అయినప్పుడు దానిని గ్యారేజీకి తరలించడమనేది అతిపెద్ద ప్రతికూలతల్లో ఒకటిగా ఉంటుంది. ఇకపై వద్దు!

    మీరు మా కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు, మీ కారు బ్రేక్‌డౌన్ అయినప్పుడు దానిని సమీప గ్యారేజీకి తరలించడానికి మేము టోయింగ్ సదుపాయం అందిస్తాము. కాబట్టి, మీరే మీ కారును సర్వీస్ కోసం తీసుకెళ్లాల్సిన తలనొప్పి ఉండదు.

  • తక్షణ క్లెయిమ్స్ సహాయం మరియు ఎస్ఎంఎస్ అప్‌డేట్‌లు

    మీరు క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లించినప్పుడు, మీ క్లెయిమ్ సహాయం విషయంలో మీరు కొన్ని నిమిషాలైనా ఎందుకు వేచి ఉండాలి? అవసరమైనప్పుడు తక్షణ క్లెయిమ్‌ల సహాయం అందుకోవడం మీ హక్కు అని మేము విశ్వసిస్తున్నాము మరియు మేము దానిని అందిస్తాము. మీరు ఆన్‌లైన్ లేదా మా టోల్-ఫ్రీ నంబర్ 1800-209-5858కు కాల్ చేయడం ద్వారా మీరు క్లెయిమ్ చేయవచ్చు. సాధ్యమైనంత త్వరగా మీ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఉపయోగపడే ఏ అంశాన్నీ మా ఎగ్జిక్యూటివ్‌లు వదిలేయరు.

    అదే సమయంలో, మీ క్లెయిమ్ స్థితి గురించి ఎస్ఎంఎస్ ద్వారా మేము మీకు నిరంతర అప్‌డేట్‌లు అందిస్తాము. తద్వారా, ప్రతి పురోగతి గురించి మీకు అప్‌డేట్ చేయబడుతుంది.

    మోటార్ ఆన్-ది-స్పాట్ (ఒటిఎస్) ఫీచర్ కూడా మా వద్ద ఉంది. మా యాప్ ఇన్సూరెన్స్ వాలెట్ ద్వారా క్లెయిమ్ ఫైల్ చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. దీనిని పొందండి, నిమిషాల్లోనే క్లెయిమ్ (రూ. 20,000 వరకు) సెటిల్ చేయబడుతుంది!

  • సులభమైన రెన్యూవల్ ప్రాసెస్

    మీ కారు లాంటి ఏదైనా ముఖ్యమైన ఆస్తి రక్షణ విషయానికి వస్తే, మీ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, దానిని రెన్యూవల్ చేసుకోవడం కూడా అవాంతరాలు-లేని పని అయి ఉండాలి.

    కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రాసెస్ సులభమైనది మరియు వేగవంతమైనదే కాకుండా, మీ సమయాన్ని ఎక్కువ వృధా చేయకుండా, మీ కారుకు నిరంతర కవరేజీ అందిస్తోందని మేము నిర్ధారించాము. మా వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావడం, అవసరమైన వివరాలు పూరించడం మరియు వర్తించే ప్రీమియం చెల్లించడం ద్వారా మీరు మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లోనే రెన్యూవల్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది! మీ పని పూర్తయ్యింది.

చవకైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ అప్రయోజనాలు

మీరు డ్రైవింగ్ ప్రారంభించినప్పుడు తప్పనిసరిగా చాలా సలహాలను తీసుకొని ఉంటారు; అందులో ముఖ్యంగా రోడ్డుపై అడ్డంకులు లేకుండా చూసుకోవడం, జాగ్రత్తగా ఉండటం మొదలైనవి.

ఇప్పుడు, మీరు ఒక చవకైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉంటే, మీరు ఎదుర్కోగల సర్వసాధారణ ఉపద్రవాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి మరియు మీరు వాటిని తప్పక నివారించాలి.

తగినంత కవరేజీ

మీరు విహారయాత్ర కోసం సిద్ధమవుతున్నప్పుడు, మీరు చేసే మొదటి పని ఏమిటి? ఆ ప్రదేశం కోసం సిద్ధం చేసుకోవాల్సిన జాబితా కోసం ఆన్‌లైన్‌లో తనిఖీ చేస్తారు కదా? అయితే, మీరు అక్కడితోనే ఆగిపోరని మేము పందెం కట్టగలము. జాబితాలో లేని కొన్ని వస్తువులను కూడా మీరు ప్యాక్ చేసే అవకాశం ఉంది. అవి మీకు వ్యక్తిగతంగా అవసరమైనవి కావచ్చు. అది మీ ఔషధాలు కావచ్చు లేదా మీరు ప్రస్తుతం చదువుతున్న పుస్తకం కావచ్చు.
ఏ ప్రశ్నకైనా ఇంటర్నెట్‌లో దాదాపుగా తక్షణమే పరిష్కారాలు లభిస్తాయి కాబట్టి, సాధారణ పరిష్కారం పొందడానికి కొన్ని క్లిక్‌లు మరియు కొద్దిగా పరిశోధన సరిపోతుంది. అయితే, అది మీ నిర్దిష్ట అవసరాలకు ఉత్తమమైనది కాకపోవచ్చు.
ఒక చవకైన ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే సమయంలో, ఇంటర్నెట్‌లోని వివిధ బ్లాగుల ద్వారా నిర్ధారించబడిన ఒక మంచి పరిష్కారంగా, మీకు ఖర్చు తగ్గించేదిగా అనిపించవచ్చు. కానీ, దీర్ఘకాలంలో అది మీకు మరింత ఖర్చు చేయించేదిగా మారవచ్చు.
మీరు కొనుగోలు చేసే ఒక చవకైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కారు అవసరాలకు తగిన కవరేజీ అందించదు. క్లెయిమ్ చేసే సమయంలో మీరు ఈ విషయం గుర్తించినప్పటికీ, అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఉంటుంది. అలాగే, మీకు ఆ సమయంలో మరే ఎంపికా లేకపోవడమే కాకుండా, మీకు ఏర్పడిన నష్టాలకు మీ జేబు నుండి చెల్లించాల్సి ఉంటుంది.

యాడ్-ఆన్ కవర్లు లేకపోవడం

మొబైల్ ఫోన్ ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఖచ్చితంగా అది కమ్యూనికేట్ చేయడం కోసమే కదా! అయితే, ఆ సౌకర్యం మీకు అందించడానికి మీకు ఒక బేసిక్ ఫోన్ రూ. 1,000కే దొరుకుతున్నప్పటికీ, మీరు దానినే తప్పనిసరిగా ఎంచుకోవాల్సిన అవసరమేమీ లేదు కదా, మీరేమంటారు?
ఎందుకంటే, మొబైల్ ఫోన్ అనేది కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాకుండా వినోదం, పని సంబంధిత అంశాలు మరియు నావిగేషన్ లాంటి ఇతర ప్రయోజనాలు కూడా అందించాలని మీరు కోరుకుంటారు కదా. అయితే, అలాంటి ప్రీమియం ఫీచర్లతో ఉండే ఫోన్ కొనాలంటే, మీరు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కార్ ఇన్సూరెన్స్ కోసం అదే విషయం నిజమవుతుంది. చవకైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కారుకు ప్రాథమిక కవరేజీని అందించగలిగినప్పటికీ, అది యాడ్-ఆన్ కవర్‌లను కలిగి ఉండదు. ఈ యాడ్-ఆన్ కవర్‌లు మీకు అవసరమైనప్పుడు వివిధ పరిస్థితులలో అందుబాటులో ఉంటాయి రోడ్ సైడ్ అసిస్టెన్స్ మరియు డిప్రిసియేషన్ కోసం సిద్ధం కావడానికి.
ఇంజిన్ కవర్ వంటి యాడ్-ఆన్ కవర్లు, నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) నిలుపుదల మరియు ఇంధన సహాయం మీ కారును సమగ్ర కవరేజీతో సన్నద్ధం చేస్తుంది.

అధిక మినహాయింపు

అధిక మినహాయింపు అనేది చవకైన కార్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సర్వసాధారణ ఫీచర్‌గా ఉంటుంది. మినహాయింపు అనే పదం హెల్త్ ఇన్సూరెన్స్‌లో విస్తృతంగా ఉపయోగించబడుతుంటుంది, పాలసీలోని ప్రయోజనాలు అందుకోవడానికి ముందు మీరు సొంతంగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఈ పదం సూచిస్తుంది.
ఏదైనా ప్రమాదంలో మీకు మరియు మీ గొప్ప బహుమతి లాంటి ఆస్తికి ప్రధానంగా డ్యామేజీలు ఏర్పడితే, అధిక మినహాయింపు అనేది ఒక రెట్టింపు భారంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో, మీరు మీ జేబు నుండి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి, కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద డబ్బు ఆదా చేయడం కోసం అధిక మినహాయింపును ఎంచుకోవడమనేది దాదాపుగా ఒక ఉచ్చులో చిక్కుకోవడం లాగా ఉంటుంది.

నాసిరకమైన కస్టమర్ సర్వీస్ మరియు క్లెయిమ్‌ల ప్రాసెస్

ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, మీకు సత్యం తెలిసే సందర్భం అనేది క్లెయిమ్ చేసే సమయంలో ఎదురవుతుంది. ఒక చవకైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ కారణంగా మీరు మీ జేబు నుండి డబ్బు ఖర్చు చేయడమే కాకుండా, కస్టమర్ సర్వీస్ మరియు క్లెయిమ్స్ ప్రాసెస్ విషయంలోనూ మీ అంచనాలు విఫలమవుతాయి.
మీ కారు కారణంగా మీకు ఎదురైన నష్టాల కారణంగా మీకు ఎదురైన భావోద్వేగ సమస్య అనేది ఈ నాసిరకం కస్టమర్ సర్వీస్ మరియు క్లెయిమ్స్ ప్రాసెస్‌తో మరింత తీవ్రమవుతుంది.
క్లెయిమ్‌ల కోసం సహాయమైనా లేదా మరే ఇతర అంశానికి సంబంధించి అయినా సరే, మీ ఇన్సూరర్ మీకు సెలవు రోజుల్లో సైతం 24x7 సహాయం అందించే పరిస్థితి ఉండాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ అనేది త్వరితంగా, అంతరాయాలు లేకుండా మరియు ఇబ్బందులు లేనివిధంగా ఉండాలి. ఇవేవీ ఉండకూడదనే కదా మీరు కారు ఇన్సూరెన్స్ పొందారు? సరైన సమయంలో అవసరమైన సహాయం పొందడమే ఇక్కడ కీలకం.

మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా అందించబడే కవరేజ్ పరిధి

ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టాలు

ప్రకృతి ప్రకోపాన్ని నియంత్రించడం మనకు కష్టమే అయినప్పటికీ, మీ కారుకు సంభవించే ఆర్థిక నష్టాలను ఖచ్చితంగా పరిష్కరించగలము.

ప్రకృతి ప్రకోపాన్ని అడ్డుకోవడం కష్టమే అయినప్పటికీ, మీ కారుకు ఏర్పడే ఆర్థిక నష్టాన్ని ఖచ్చితంగా భర్తీ చేయగలము. అగ్నిప్రమాదం, విస్ఫోటనం, భూకంపం, వరదలు, టైఫూన్, పిడుగులు పడడం లేదా ఆకస్మికంగా మంటలు చెలరేగడం, హరికేన్, తుఫాను, ఆకస్మిక భీకర గాలులు, ముంపు, సైక్లోన్, వడగళ్ళ వర్షం, తుఫాను, కొండచరియలు విరిగిపడడం మరియు కొండ చరియలు జారిపోవడం లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే నష్టాలకు మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు కవరేజీ అందిస్తుంది.

మానవ జోక్యంతో జరిగే విపత్తుల కారణంగా వాటిల్లే నష్టాలు

కొన్నిసార్లు, మానవ జోక్యం వల్ల ఏర్పడే విపత్తులనేవి ప్రకృతి వైపరీత్యాల కంటే ఎక్కువ క్రూరమైనవిగా ఉంటాయి. అవి ఉద్దేశ్యపూర్వకమైనవి కావడమే అందుకు కారణం. మరింత చదవండి

కొన్నిసార్లు, మానవ జోక్యంతో జరిగే విపత్తులనేవి ప్రకృతి వైపరీత్యాల కంటే ఎక్కువ క్రూరమైనవిగా ఉంటాయి. అవి ఉద్దేశ్యపూర్వకమైనవి కావడమే అందుకు కారణం. మా పాలసీ సాయంతో, మానవ నిర్మిత విపత్తుల వల్ల కలిగే నష్టాల నుండి మీకు ఆర్థికంగా రక్షణ లభిస్తుందని మేము అర్థం చేసుకున్నాము.

మా పాలసీతో దోపిడీ, దొంగతనం, అల్లర్లు, సమ్మె, హానికర చర్య, బాహ్య కారణాలతో జరిగిన ప్రమాదం, ఉగ్రవాద కార్యకలాపాలు మరియు రహదారి, రైలు, అంతర్గత జలమార్గం, లిఫ్ట్, ఎలివేటర్ లేదా ఆకాశమార్గం ద్వారా రవాణాలో జరిగిన నష్టాలకు కవరేజీ పొందండి.

వ్యక్తిగత ప్రమాదం

ఏదైనా ప్రమాదంలో మీ కారుకు ఎదురయ్యే నష్టాలకు మీ కారు ఇన్సూరెన్స్ ఆర్థిక భద్రత అందించినప్పటికీ, ఆ నష్టాలనేవి కేవలం దానికే పరిమితం కావు. మరింత చదవండి

ఏదైనా ప్రమాదంలో మీ కారుకు ఎదురయ్యే నష్టాలకు మీ కారు ఇన్సురెన్స్ ఆర్థిక భద్రత అందించినప్పటికీ, ఆ నష్టాలనేవి అక్కడికే పరిమితం కావు. మీ వాహనం ప్రమాదానికి గురైనప్పుడు, మీరు కూడా గాయపడవచ్చు, అది మీకు భయంకరమైన పరిస్థితిగా పరిణమించడమే కాకుండా, దానికోసం చికిత్స అనేది ఖరీదైన వ్యవహారంగానూ ఉండవచ్చు.

ప్రమాదం కారణంగా మీరు చేయించుకునే చికిత్స కోసం ఖర్చును భరించడానికి మీకు ఆర్థిక మద్దతు అందించడమే కాకుండా, మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు రూ. 1 లక్షల వ్యక్తిగత ప్రమాద కవర్ కూడా అందిస్తుంది. మేము మీ సహ-ప్రయాణీకుల భద్రత గురించి కూడా ఆలోచిస్తాము కాబట్టి, వారికి కూడా ఒక ఆప్షనల్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అందిస్తాము.

థర్డ్-పార్టీ లీగల్ లయబిలిటీ

మీరు మీ కారుతో సహా రోడ్డు మీద ఉన్నప్పుడు మీ డ్రైవింగ్ గొప్ప సౌకర్యవంతంగా ఉండడం మాత్రమే కాకుండా, సురక్షితంగానూ ఉండాలి మరింత చదవండి

మీరు మీ కారుతో సహా రోడ్డు మీద ఉన్నప్పుడు మీ డ్రైవింగ్ గొప్ప సౌకర్యవంతంగా ఉండడం మాత్రమే కాకుండా, సురక్షితంగానూ ఉండాలి. అయితే, ఆ మాట సత్య దూరమే అని మనందరికీ తెలుసు. మీ వాహనానికి ఎదురయ్యే ప్రమాదాలు మరియు ఇతర ఇబ్బందులు మిమ్మల్నే కాకుండా, మూడవ పక్షాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మూడవ పక్షంతో ముడిపడిన చట్టపరమైన అంశాలు ఖరీదైన వ్యవహారంగా ఉండవచ్చు.

మూడవ పక్షానికి గాయం, మరణం లేదా నష్టం కారణంగా ఉత్పన్నమయ్యే థర్డ్ పార్టీ చట్టపరమైన బాధ్యతల నుండి మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని కవర్ చేస్తుంది.

సరసమైన మరియు చవకైన కార్ ఇన్సూరెన్స్ పొందడానికి చిట్కాలు

జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి సులభంగా బయటపడడానికి ఉపయోగపడే ఒక జిపిఎస్ ఉంటే, జీవితం ఎంతో సులభంగా ఉంటుంది కదా? ఇప్పటికైతే, ఆ సౌకర్యం ఇంకా సైన్స్ ఫిక్షన్ స్థాయిలోనే ఉండవచ్చు కానీ, క్రింద మేము సిద్ధం చేసిన జాబితా అనేది కార్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి మీరొక మంచి డీల్ పొందడానికి కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను తగ్గించే ప్రాథమిక అంశాల్లోకి వెళ్లడానికి మీకు సహాయపడుతుంది.

  1. మీకు అవసరం లేని కవరేజీలు వదిలేయండి

    మీకు మీ ఇంట్లో కొంత అదనపు స్థలం అవసరమైనప్పుడు, ప్రభావవంతమైన ఎంపికగా ఏది ఉంటుంది? అనవసరమైన వాటిని తొలగిస్తారు కదా. మీకు అవసరం లేని వస్తువులు తొలగించడం వల్ల మీ ఇంట్లో ఎక్కువ స్థలం అందుబాటులోకి రావడమే కాకుండా, మీకు అవసరమైన వాటిని ఉంచడానికి స్థలం కూడా లభిస్తుంది.

    అదేవిధంగా, మీకు అవసరం లేని కవరేజీలను ఎంచుకోవడం అనేది తక్కువగా ఉండవచ్చు ఇన్సూరెన్స్ ప్రీమియం. యాడ్-ఆన్ కవర్‌లతో మీ కారుకు ప్రయోజనం లభించడం నిజమే కానీ, మీకు నిజంగా ఉపయోగకమైన వాటిని ఎంచుకోవాలి మరియు మిగిలిన వాటిని విస్మరించాలి.

  2. మైనర్ క్లెయిమ్‌లు చేయడం నివారించండి

    ఏదైనా పెద్ద అనారోగ్యం విషయంలో వైద్యుడిని సందర్శించడం తెలివైన నిర్ణయమే కానీ, చిన్నపాటి చలి దగ్గు కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేయడం అవసరమా? ఖచ్చితంగా కాదు! అనారోగ్యాన్ని ఎదుర్కోవడంలో శరీరం దాని స్వంత రోగ నిరోధక వ్యవస్థ కలిగి ఉంటుంది. కాబట్టి, వైద్యుడు సూచించిన ఔషధాలు వినియోగించే ముందు ఆ రోగ నిరోధక వ్యవస్థ పనిచేయడానికి అనుమతించడం చాలా అవసరం.

    అదే విధంగా, మైనర్ క్లెయిమ్స్ చేయడానికి మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఉపయోగించాల్సిన అవసరం లేదు. తద్వారా, మీ పాలసీ మీద ఎన్‌సిబి మరియు పాలసీ రెన్యూవల్స్ మీద తక్కువ ప్రీమియంలు పొందడానికి అది మీకు సహాయపడుతుంది.

    కొన్ని సందర్భాల్లో, కారుకు వెనుక వైపు విరిగిపోయిన లైట్ మరమ్మత్తు ఖర్చు కంటే, మీ కారు మరమ్మత్తు కోసం అయ్యే ఖర్చే తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో, ఒక స్థానిక మెకానిక్‌ను సంప్రదించడానికి మరియు క్లెయిమ్ చేయడాన్ని నివారించడం ద్వారా ఎన్‌సిబి రక్షించుకోవడానికి డివిడెండ్‌లు చెల్లిస్తుంది. ఎన్‌సిబి ని రక్షించుకోవడం వల్ల సొంత నష్టం ప్రీమియంలను 50% వరకు తగ్గించుకోవచ్చు.

  3. మీ కారులో భద్రతా ఫీచర్లు ఇన్‌స్టాల్ చేయండి

    ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మేము ఖచ్చితంగా పరిహారం అందిస్తాము. కానీ, అలాంటి పరిస్థితిని నివారించడానికి మీరు కూడా మీ శక్తి మేరకు కృషి చేయడమనేది నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

    యాంటీ-థెఫ్ట్ అలారంలు, స్టీరింగ్ వీల్ మరియు ఎయిర్ బ్యాగులు లాంటి భద్రతా వ్యవస్థలనేవి దొంగతనాలు మరియు ఇతర ప్రమాదాల నుండి మీ కారును రక్షించడమే కాకుండా సొంత వాహనం రక్షణ పట్ల ఒక బాధ్యతాయుతమైన యజమానిగా కూడా మీకు స్థానం కల్పిస్తాయి. మీరు మీ వాహనంలో ఈ ఉపకరణాలు ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో తగ్గింపు పొందే గొప్ప అవకాశం అందుకుంటారు.

  4. అయితే, కారులో మార్పులు చేసే ఆలోచనకు దూరంగా ఉండండి

    అలాయ్ వీల్స్ మరియు స్పాయిలర్స్ లాంటివి కొత్తగా బిగించడం వల్ల మీ కారు రూపం ఆకర్షణీయంగా మారవచ్చు. కానీ, ప్రీమియంలోనూ ఆమేరకు పెరుగుదల ఉంటుంది. అల్ట్రాసోనిక్ సెన్సార్లు మరియు ఆటోమోటివ్ నైట్ విజన్ లాంటి గాడ్జెట్లు ఇన్‌స్టాల్ చేయడం వల్ల మీరు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం అనేక వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి రావచ్చు.

    ఎందుకంటే, ఏదైనా ప్రమాదం లేదా దుర్ఘటన జరిగినప్పుడు ఈ రకమైన గాడ్జెట్లను భర్తీ చేయడం ఒక ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. అలాంటి సందర్భాల కోసం ఇన్సూరర్ మరింత రిస్క్‌ను కవర్ చేస్తారు కాబట్టి, ప్రీమియంలో ఆ మేరకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

    మీ క్లెయిమ్ చెల్లుబాటు కాని పరిస్థితిని నివారించడం కోసం, అలాంటి సవరణలు/ జోడింపుల గురించి మీ ఇన్సూరర్‌కు తెలియజేయడం చాలా ముఖ్యం.

  5. మీరు సులభంగా చెల్లించగల మినహాయింపును ఎంచుకోండి

    మినహాయింపు అనేది మీ పాలసీ ప్రయోజనాలు పొందడానికి ముందు మీరు మీ జేబు నుండి చెల్లించాల్సిన మొత్తాన్ని సూచిస్తుంది. ఇది రెండువైపుల పదును కలిగిన కత్తి లాంటిది, దీనితో జాగ్రత్తగా వ్యవహరించాలి.

    మీరు ఎంచుకునే ఈ మినహాయింపు ఎంత ఎక్కువగా ఉంటే, మీ ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. గొప్పగా అనిపిస్తోంది, కదా? నిజానికి ఇదేమీ గొప్ప విషయం కాదు. ఎందుకంటే, అధిక మినహాయింపు కోసం ఎంచుకోవడమనేది కార్ ఇన్సూరెన్స్ పాలసీ నుండి ప్రయోజనం పొందడమనే ప్రాథమిక ఉద్దేశాన్ని ప్రధానంగా దెబ్బతీస్తుంది. కాబట్టి, మీరు సౌకర్యవంతంగా చెల్లించగల మొత్తం మాత్రమే ఎంచుకోవడం మంచిది.

కార్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

మీ ప్రస్తుత పాలసీ గడువు ముగియబోతుందా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

Juber Khan

జుబేర్ ఖాన్ ముంబై

మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.

Sundar Kumar

సుందర్ కుమార్ ముంబై

మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.

Pooja

పూజ ముంబై

మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం