రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Health Insurance Claim Settlement Ratio
ఏప్రిల్ 15, 2021

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి వివరించబడింది

చాలా మంది 'క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి' గురించి మాట్లాడుతూ ఈ సంఖ్య యొక్క ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పడం మీరు వినే ఉంటారు. కానీ దాని అర్థం ఏమిటి మరియు అది ఎందుకు అవసరం? భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు, మీరు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక లాభదాయకమైన ప్లాన్‌లను కనుగొంటారు, కానీ వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడం కష్టంగా ఉండవచ్చు. తగిన హెల్త్ ప్లాన్‌ను కొనుగోలు చేయడంలో మీకు సహాయపడటానికి క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి అనేది ఒక ముఖ్యమైన నిర్ణయాత్మక అంశం. కాబట్టి, హెల్త్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని వివరంగా అర్థం చేసుకుందాం.   క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి అంటే ఏమిటి? క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి లేదా సిఎస్ఆర్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించిన క్లెయిమ్‌ల శాతం గురించి మీకు తెలియజేసే నిష్పత్తి. ఆ నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఫైల్ చేయబడిన మొత్తం క్లెయిముల సంఖ్యతో ఇన్సూరర్ సెటిల్ చేసిన మొత్తం క్లెయిముల సంఖ్యను పోల్చడం ద్వారా ఇది లెక్కించబడుతుంది. భవిష్యత్తులో మీ క్లెయిమ్ సెటిల్ చేయబడే సంభావ్యతను నిర్ణయించడానికి ఈ విలువను ఉపయోగించవచ్చు, అందుకే, అధిక సిఎస్ఆర్ ఉన్న ఇన్సూరెన్స్ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఉదాహరణకు, 100 క్లెయిమ్లు ఫైల్ చేయబడి అందులో 80 సెటిల్ చేయబడితే, సిఎస్ఆర్ 80% ఉంటుంది.. మీరు తెలుసుకోవాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిష్పత్తి రకాలు మూడు ఉన్నాయి:
  • క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి
  • క్లెయిమ్ నిరాకరణ నిష్పత్తి
  • క్లెయిమ్ పెండింగ్ నిష్పత్తి
  మీకు ఇప్పుడు సిఎస్ఆర్ అంటే ఏమిటో తెలుసు కాబట్టి, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి యొక్క ఫార్ములాను చూద్దాం,   సిఎస్‌ఆర్ = (సెటిల్ చేయబడిన మొత్తం క్లెయిమ్ల సంఖ్య) / (రిపోర్ట్ చేయబడిన మొత్తం క్లెయిమ్ల సంఖ్య) + సంవత్సరం ప్రారంభంలో మిగిలి ఉన్న క్లెయిమ్ల సంఖ్య - సంవత్సరం చివరిలో మిగిలి ఉన్న క్లెయిమ్ల సంఖ్య   మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి ఎంత ఉంటుంది? 80% కంటే ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిష్పత్తి మంచి సంఖ్యగా పరిగణించబడుతుంది, కానీ సిఎస్ఆర్ ఒక్కటే నిర్ణయాత్మక అంశంగా ఉండకూడదు. అలాగే, తగిన హెల్త్ ప్లాన్‌లను పొందడంలో ముఖ్యమైన పాత్ర పోషించే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. అందువల్ల, వివిధ ఇన్సూరర్లు అందించే కస్టమర్ సర్వీసులు మరియు ప్లాన్ యొక్క షరతులు మరియు నిబంధనలను ఎల్లప్పుడూ చూడవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది. మీ పాలసీ పై తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ పరిశోధనను మళ్ళీ నిర్ధారించుకోవడానికి, మెడికల్ ఇన్సూరెన్స్ ‌ను కొనుగోలు చేసిన ఎవరైనా మీ స్నేహితులు లేదా బంధువులను కూడా ఒకసారి సంప్రదించండి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని అంచనా వేసేటప్పుడు, మీరు నిరాకరణ లేదా పెండింగ్ నిష్పత్తి వంటి పదాలను కూడా చూసి ఉండవచ్చు. ఈ పదాలను మెరుగ్గా అర్థం చేసుకుందాం:   క్లెయిమ్ నిరాకరణ నిష్పత్తి ఈ సంఖ్య ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ద్వారా తిరస్కరించబడిన క్లెయిముల శాతం గురించి మీకు చెబుతుంది. ఉదాహరణకు, నిష్పత్తి 30% అయితే, అంటే 100 లో 30 కేసులు మాత్రమే తిరస్కరించబడ్డాయని అర్థం. పాలసీహోల్డర్లు ఫైల్ చేసిన మొత్తం క్లెయిమ్లలో తిరస్కరించబడిన క్లెయిమ్ల సంఖ్యను లెక్కించడం ద్వారా ఈ నిష్పత్తి లెక్కించబడుతుంది. క్లెయిమ్ తిరస్కరణకు గల కారణాలలో మినహాయింపుల కిందకు వచ్చే క్లెయిమ్లు, ముందు నుండి ఉన్న వ్యాధులు ‌-మీ పాలసీలో కవర్ చేయబడనివి, తప్పుడు క్లెయిములు, సకాలంలో ఇన్సూరర్‌కు తెలియజేయడంలో వైఫల్యం మరియు మరెన్నో ఉండవచ్చు. క్లెయిమ్ పెండింగ్ నిష్పత్తి అటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిష్పత్తి పెండింగ్‌లో ఉన్న మరియు అంగీకరించబడని లేదా తిరస్కరించబడని క్లెయిమ్‌ల సంఖ్యను ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్ నిష్పత్తి 20% అయితే, అప్పుడు 100 క్లెయిములలో 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అని అర్థం. పాలసీహోల్డర్లు ఫైల్ చేసిన మొత్తం క్లెయిమ్ల సంఖ్యలో చెల్లించకుండా ఉన్న మొత్తం క్లెయిమ్ల సంఖ్యను పరిగణించడం ద్వారా ఈ విలువ లెక్కించబడుతుంది. క్లెయిమ్లు పెండింగ్లో ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి. హాస్పిటలైజేషన్ ఖర్చులు లేదా ఫర్నిష్ చేయబడని డాక్టర్ సర్టిఫికెట్ యొక్క కొనసాగుతున్న ధృవీకరణ వాటిలో కొన్ని కారణాలుగా ఉండవచ్చు.   క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి యొక్క ప్రాముఖ్యత పాలసీహోల్డర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మీ క్లెయిమ్ సెటిల్ చేయబడే అవకాశాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు ఒక పాలసీని కొనుగోలు చేసినప్పుడు, ఈ పెట్టుబడి యొక్క లక్ష్యం అత్యవసర వైద్య పరిస్థితి నుండి మీ ప్రియమైన వారిని సురక్షితం చేయడం. కానీ మీకు అవసరమైన సమయంలో మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ చెల్లించకపోతే, ఇన్సూరెన్స్ కలిగి ఉండటంలో ఎటువంటి అర్థం ఉండదు. అందుకే సమయం వచ్చినప్పుడు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న వారిని సూచించడానికి సిఎస్ఆర్ ఒక మంచి సూచికగా ఉపయోగపడుతుంది. చివరగా, తిరస్కరణ అవకాశాలను నివారిస్తూనే అవసరం అయినప్పుడు క్లెయిమ్లను సమర్థవంతంగా ఫైల్ చేయడానికి మీ పాలసీ యొక్క బీమా క్లెయిమ్ ప్రక్రియ పరిశీలించవలసిందిగా మేము సిఫారసు చేస్తున్నాము.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి