Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను సరిపోల్చండి

Cheap Health Insurance

హెల్త్ ఇన్సూరెన్స్ కోట్ కోసం వివరాలను షేర్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చండి - బజాజ్ అలియంజ్

త్వరిత ప్రశ్న: అవకాశం లేదా ఎంపిక, ఈ రెండింటిలో ఏది మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది అని మీరు భావిస్తున్నారు? ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏదైనా, జీవితం అనిశ్చితం అనే ఒక వాస్తవాన్ని మనం కాదనలేము. మీరు ఒక ఊహించని శుభవార్తను విన్నపుడు, దానిని ఆశీర్వాదంగా భావిస్తారు. కానీ, చెడు విషయాలు మీ ఆనందాన్ని ఒక్కసారిగా హరించివేస్తాయి. 

ఆరోగ్యం విషయానికి వస్తే అవకాశాలను తీసుకోవడం లేదా ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం చాలా తేడాని చూపుతుంది

ఉదాహరణకు, ఒక అనారోగ్యం లేదా గాయాన్ని పరిగణలోకి తీసుకుంటే. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. వేగంగా పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణం మరియు దాని కారణంగా ఏర్పడే ఒత్తిడి కారణంగా మానసిక వేదన లేదా ఆర్థిక ఒత్తిడి ఎదురవుతుందని అన్న విషయం మాత్రం కాదనలేని వాస్తవం.

నియంత్రణ లేని పరిస్థితులు ఎదురైనప్పటికీ అనేక ముందస్తు చర్యలు ఒక ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడంలో మీకు సహాయపడతాయి. అవి మీకు మెరుగైన జీవితాన్ని అందిస్తాయి, అలాగే మీరు కుటుంబ సభ్యులు, స్నేహితుల మెప్పును పొందగలరు. ఎంపిక లో ఉన్న అందం ఇదే!

నేటి నుండి వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించినట్లయితే మీ భవిష్యత్తు ఖచ్చితంగా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, మీ ఆరోగ్యం ప్రస్తుతస్థితి అనేక సంవత్సరాల మీ అలవాట్ల పై ఆధారపడి ఉంటుంది. తొలుత మీరు ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని తెలుసుకోవడం ఒక మంచి చర్య. 

మీ డాక్టర్‌ను సంప్రదించి, జీవనశైలిలో మార్పులు చేసుకున్న తర్వాత, హెల్త్ ఇన్సూరెన్స్‌ను పొందడం లేదా దానిని రెన్యూ చేయడం గురించి ఆలోచించండి. పెరుగుతున్న వైద్య ఖర్చుల నుండి మీకు రక్షణ కలిపించే అనేక హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముందుకు కొనసాగండి, మీ మొదటి మూడు అవసరాలను గుర్తించిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చండి, ప్లాన్‌లు ఏమి ఆఫర్ చేస్తున్నాయోనని తెలుసుకోండి.

దీర్ఘ కాలంలో ఒక బ్యాలెన్స్‌డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం వలన హామీ ఇవ్వబడిన చికిత్స ఆప్షన్‌ల పరంగా మీ రాబడి రెట్టింపు అవుతుంది మరియు మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఇప్పటి వరకు, మీరు ఊహించిన భవిష్యత్తుకు అవసరమైన కవరేజ్ రకం గురించి మీకు ఒక అవగాహన కలిగిందని మేము నమ్ముతున్నాము.

ఫ్లెక్సిబిలిటీ మరియు తగిన కవరేజీని అందించే ప్లాన్‌లను పరిశోధనతో ప్రారంభించండి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చడానికి రివ్యూలను చదవండి, మీరు షార్ట్‌లిస్ట్ చేసుకున్న కొన్ని కంపెనీలకు కాల్ చేయండి. చివరగా, ప్లాన్ వివరాలు, కవరేజ్ మరియు ముందస్తు షరతులు అనేవి పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యాంశాలు. అయితే, ప్లాన్ ఖర్చు కూడా ఒక ముఖ్యమైన అంశం అయినప్పటికీ, దాని ప్రయోజనానికి మించి ప్రాధాన్యత ఇవ్వకూడదు.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఎలా సరిపోల్చి చూడాలి?

ఈ రోజు ఉన్న మీ ఆరోగ్య పరిస్థితిని భవిష్యత్తులో మీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారో సరిపోల్చి చూడడంతో సానుకూల మార్పు ప్రారంభం అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో ఉత్తమ రివ్యూలు, మీరు వెతుకుతున్న ప్రయోజనాలను అందిస్తున్నాయి అని అర్థం కాదు. 

కల్పన నుండి వాస్తవాన్ని వేరు చేయడం ఒక లలిత కళ, అది షెర్లాక్ హోమ్స్‌ను ఒక అత్యుత్తమ డిటెక్టివ్‌గా తీర్చిదిద్దింది. వివిధ ఇన్సూరెన్స్ సంస్థల నుండి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చేటపుడు, మీకు అందుబాటులో ఉన్న దాని గురించి పూర్తి అవగాహన పొందుతారు మరియు మీ అవసరాలకు సరిపోయే ఉత్తమమైన దానిని కొనుగోలు చేస్తారు. మంచి ఆప్షన్‌ను ఎంచుకోవడం వలన కలిగే సంతృప్తి అనేది ఒక అదనపు ప్రయోజనం.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఎలా సరిపోల్చాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక మొదలుపెడదాం.

 • Your Budget మీ బడ్జెట్

  ఈ ప్లాన్ ధర అందుబాటులో ఉంటుందా? నెలాఖరుకి నాకు ఎంత డబ్బు అవసరమవుతుంది? మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చేటపుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. నిత్యావసర ఖర్చులు పోనూ మీ చేతిలో తగినంత నగదు ఉండేలా చూసుకోవడానికి మీరు, మీ ప్రస్తుత నెలవారీ ఖర్చులు, పొదుపు లక్ష్యాలు మరియు దీర్ఘకాలిక ఆర్థిక దృష్టిని పరిగణలోకి తీసుకోవాలి.

  ప్రీమియంలను వాయిదాల రూపంలో చెల్లించడం లేదా పూర్తిగా చెల్లించడం, ఈ రెండింటిలో మీకు ఏది బాగా సరిపోతుందో తెలుసుకోండి. మీ ప్రీమియం చెల్లింపులను తరచుగా ట్రాక్ చేయడాన్ని నివారించడానికి, సేవింగ్స్ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యేలా ప్రీమియం చెల్లింపులను సెట్ చేసుకోండి. అంతే కాకుండా, మీరు ప్రీమియం చెల్లించడంలో బిజీగా ఉండటానికి బదులు వారాంతంలో క్రికెట్ మ్యాచ్‌ను ఆనందిస్తారు.

 • Number of Members Covered కవర్ చేయబడిన సభ్యుల సంఖ్య

  గోడపై వేలాడుతున్న మీ ఫ్యామిలీ ఫోటోను చూసిన ప్రతిసారి, మీరు కలిసి పంచుకున్న మధురమైన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ మీ కుటుంబ రక్షణ, పోషణ విషయంలో మీకు సహాయం చేస్తుంది, తద్వారా రాబోయే సంవత్సరాల్లో విలువైన క్షణాలు గుర్తుండిపోతాయి.

  మీరు మీ కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మెడికల్ ఇన్సూరెన్స్ పోలిక తప్పనిసరి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోల్చినప్పుడు, నవజాత శిశువు నుండి పెద్దల వరకు మీ కుటుంబ సభ్యులలో దాదాపుగా అందరినీ కవర్ చేసే పాలసీని మీరు గుర్తించవచ్చు.

 • Claim Settlement క్లెయిమ్ సెటిల్‌మెంట్

  త్వరగా సేవలను అందించని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ డబ్బుకు తగిన విలువను అందించదు మరియు దాని అసలు ఉద్దేశాన్ని నెరవేర్చదు. మీరు హాస్పిటల్‌కు వెళ్లే మార్గం మధ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మిమ్మల్ని కవర్ చేస్తుందా అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడకూడదు.

  హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చేటప్పుడు మీరు, ఇన్సూరెన్స్ సంస్థల క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోలను ఖచ్చితంగా పరిశీలించాలి.

 • Coverage కవరేజ్

  ఇది చాలా ముఖ్యమైనది. హెల్త్ ఇన్సూరెన్స్ కవర్లను సరిపోల్చేటప్పుడు, మీరు వాటి లాభనష్టాలను అర్థం చేసుకుంటారు మరియు అవి అందించే ప్రయోజనాలు పెట్టుబడి పెట్టడానికి విలువైనవిగా ఉన్నాయో లేదో కూడా తెలుసుకుంటారు. డిస్కౌంట్‌ల నుండి పన్ను ప్రయోజనాల వరకు, అదనపు సమాచారాన్ని పొందడం అనేది దీర్ఘకాలంలో మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడగలదు.

  అకాల వర్షం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే ఒక గొడుగు వలె, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందించే కవరేజ్ కూడా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అస్థిరత నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ పోలికపై తరచుగా అడగబడే ప్రశ్నలు

నేను ఎలా చెల్లించాలి?

మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత, అనేక చెల్లింపు విధానాలను ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. మీరు మీ సౌలభ్యం ప్రకారం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు. 

నేను ప్రీమియం మొత్తాన్ని చెల్లించిన తర్వాత నా పాలసీని ఎలా పొందగలను?

మీ పాలసీ మీకు వీలైనంత త్వరగా అందుతుంది! మీరు చెల్లింపును పూర్తి చేసిన వెంటనే మేము పాలసీని జారీ చేస్తాము, మీ పాలసీ డాక్యుమెంట్ కాపీ తక్షణమే మీకు ఇమెయిల్ చేయబడుతుంది. 

నాకు ఇప్పటికే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా?


మీరు అనారోగ్యానికి గురి అయినప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు, ఏదైనా హాస్పిటలైజేషన్ లేదా మీరు పొందవలసిన చికిత్స విషయంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగకరంగా ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ పొందడంతో అలాంటి అత్యవసర వైద్య పరిస్థితుల్లో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కావున, మీరు ఇప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉన్నప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం అవుతుంది.

ప్రీమియంపై ప్రభావం చూపే కీలక అంశాలు ఏమిటి?

మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంను నిర్ణయించే కీలక అంశాలు ఈ కింద జాబితా చేయబడ్డాయి-

● ఇన్సూర్ చేయబడిన మొత్తం

● కవర్ చేయబడవలసిన సభ్యుల సంఖ్య

● కవర్ చేయబడిన సభ్యుల వయస్సు

● ముందు నుండి ఉన్న వ్యాధులు

● ఆప్షనల్ యాడ్-ఆన్ కవర్లు

అర్థం చేసుకోబడింది. నేను హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎలా సరిపోల్చగలను?

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను నిష్పక్షపాతంగా సరిపోల్చడానికి, మేము సిఫార్సు చేసిన చెక్‌లిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది.  

మేము దీనిని హెల్త్ ఇన్సూరెన్స్ 3C స్కీమ్‌లుగా పిలుస్తాము - కవరేజ్, క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ మరియు క్లెయిమ్స్ సపోర్ట్. మేము డిస్కౌంట్లు, పన్ను ప్రయోజనాలతో పాటు ధర ప్రభావాన్ని కూడా జాబితాకు జోడిస్తాము మరియు చివరగా, హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వలన కలిగే అమూల్యమైన ప్రశాంతతను చేకూరుస్తాము!

మొదట, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను త్వరగా సరిపోల్చేందుకు మీకు సహాయపడే ప్లాన్ ప్రయోజనాలను వర్గీకరించండి. ఒక Excel స్ప్రెడ్‌షీట్ (లేదా ఒక కాగితం!) మెడికల్ ఇన్సూరెన్స్ పోలికను సులభంగా, శ్రమ లేకుండా చేయడంలో మీకు సహాయపడుతుంది.

 • ఖర్చు వర్సెస్ ప్రయోజనాలు

  నా ప్లాన్ డబ్బుకు తగిన విలువను కలిగివుంటుందా? హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చేటప్పుడు, ఇది అందరి మనస్సులో మెదిలే ఒక ప్రశ్న, దీనికి సరైన కారణం కూడా ఉంది! చవకగా అందుబాటులో ఉందని ఒకరు ప్లాన్‌ను ఎంచుకోవడానికి ఇష్టపడవచ్చు. అయితే, అది నిరాశకు దారితీయవచ్చు.

  ఒక ప్లాన్ అందించే కవర్ అనేది, ఆ ప్లాన్ సరసమైనదా కాదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడే అనువైన కొలత ప్రమాణం. మీరు తప్పనిసరిగా అందించే యాడ్-ఆన్-కవర్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

 • నెట్‌వర్క్ హాస్పిటల్స్

  నెట్‌వర్క్ హాస్పిటల్స్ అనేవి మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో టై-అప్ చేయబడినవి. ఈ హాస్పిటల్స్‌లో మీరు ఏ ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్సను పొందవచ్చు.

  పాలసీని ఎంచుకోవడానికి ముందు, ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో అనుబంధించబడిన నెట్‌వర్క్ హాస్పిటల్స్ జాబితాను చెక్ చేయడం చాలా ముఖ్యం. చాలా ముఖ్యంగా మీరు మీ ప్రాంతంలో నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో లేదో అని చెక్ చేయాలి.

 • గది అద్దె పరిమితి

  గది అద్దె ఛార్జీల పరంగా హాస్పిటల్స్ మారుతూ ఉంటాయి. మీరు ఎంచుకున్న గది మరియు సౌకర్యాల రకాన్ని బట్టి, ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. వాస్తవానికి, ఇన్సూరెన్స్ సంస్థలు అందించే కవరేజ్ మొత్తంలో కూడా చాలా తేడాలు ఉంటాయి.

  కావున, ఇది మీకు సులభమైన పోలిక. అన్ని విషయాలతో పాటు, గది అద్దె కోసం గరిష్ఠ కవర్‌ను అందించే పాలసీని ఎంచుకోండి. మీరు ఇక ఎప్పటికీ చింతించరు!

 • మినహాయింపులు

  అన్ని ఆర్థిక విషయాల మాదిరిగానే, హెల్త్ ఇన్సూరెన్స్‌కు కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి. అవగాహన లేకుండా ఇబ్బందులు పడటానికి బదులుగా, కవరేజీలో అందుబాటులో లేని అంశాలను గురించి తెలుసుకోవడం ఎల్లప్పుడూ ఒక మంచి పద్ధతి.

  హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలోని కొన్ని సాధారణ మినహాయింపులు, ముందుగా-ఉన్న అనారోగ్యాలు, కాస్మెటిక్ సర్జరీ మరియు ప్రత్యామ్నాయ చికిత్సలు. 

  మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కింద మినహాయింపులను అర్థం చేసుకునే విషయానికి వస్తే పాలసీ డాక్యుమెంట్లు మీకు పూర్తి వివరాలను అందిస్తాయి. అదనపు సమాచారం కోసం, మీరు ఇన్సూరెన్స్ సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా కస్టమర్ కేర్ విభాగానికి కాల్ చేయవచ్చు.

 • మీ పరిశోధన బాగా పనిచేస్తుంది

  మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వలన ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. బజాజ్ అలియంజ్ వద్ద మీరు హెల్త్ ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. 

  అయితే, మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో పొందాలనుకున్నపుడు, సరైన ప్రశ్నలను అడగడం చాలా ముఖ్యం. మీ ప్రశ్నలలోని నాణ్యత అనేది మీరు కొనుగోలు చేసే ప్లాన్ మీ అవసరాలకు ఉత్తమమైన రీతిలో ఉపయోగపడుతుందో లేదోనని నిర్ణయిస్తుంది.

  ఇన్సూరెన్స్ అనేది విన్నపానికి సంబంధించిన విషయం కాబట్టి, మీరు తీసుకోవాల్సిన ప్లాన్ గురించి పూర్తిగా ఆలోచించడం తెలివైన ఆలోచన. మీరు పరిశోధన కోసం వెచ్చించే మీ సమయం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను అందిస్తుంది.

 • అవసరాన్ని బట్టి ఆశ్రయించడం

  ఒక అథ్లెట్ అతను/ ఆమె అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చడానికి కఠినమైన శిక్షణను పొందుతారు, ఫిట్‌నెస్ షరతులతో వేల గంటల పాటు కసరత్తులు, రోజువారి సాధనను చేస్తారు. శిక్షణ, పోషణ మరియు రికవరీ నియమావళితో వారు ఒక ట్రాక్‌లో ఉండటానికి సహాయపడే నిపుణుల సైన్యం వారికి అండగా ఉంటుంది. ఫలితం: ధృడమైన శారీరక స్థితి, విజేత వైఖరిని పొందుతారు.

  మీకు క్రీడా పరమైన ఆశయాలు లేకపోయినా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పోల్చేటపుడు మీ ప్రస్తుత శారీరక స్థితిని గురించి ఆలోచించండి - వయస్సు, వైద్య చరిత్ర, సాధారణ ఆరోగ్య స్థితి. అంతేకాకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు వైద్య చరిత్ర ఆధారంగా మారుతూ ఉంటాయి. ప్రేమ, ప్రేరణ మరియు మద్దతు పరంగా మీరు, మీ కుటుంబ ఆరోగ్య అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు వేసే ప్రతి అడుగువెనక వారి ప్రధాన పాత్ర ఉంటుంది.

మీ ప్రస్తుత కవర్‌ను అంచనా వేయండి, రెన్యూవల్‌కు ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సరిపోల్చండి

ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన కీలక అంశాలు

హెల్త్ ఇన్సూరెన్స్ మీ వైద్య బిల్లులపై ఒక అవగాహన కల్పించడంలో సహాయపడటమే కాకుండా, మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి కూడా దోహదపడుతుంది. సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పొందడానికి, మీరు ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అన్నింటి కన్నా ముందుగా, మీరు మీ ఆరోగ్య అవసరాలను పూర్తిగా అంచనా వేసుకోవాలి. దీంతో పాటు ప్రాథమిక అంశాలుగా సమగ్ర కవరేజ్, పన్ను ప్రయోజనాలు మరియు సౌకర్యవంతమైన మినహాయింపుల వంటి అంశాలను మీ ఆలోచనకు జోడించాలి. చివరగా, తక్కువ ఖర్చుతో కూడిన ప్రీమియంలతో ముగించండి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పోల్చేటపుడు గుర్తుంచుకోవలసిన అంశాలు ఇక్కడ అందించబడ్డాయి:
Coverage Offered

అందించబడే కవరేజ్

మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ఒక ముఖ్యమైన కారణం అది అందించే కవరేజ్ పరిధి. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో తగినంత కవర్ అందకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ప్రయోజనం ఏమిటి? మరింత చదవండి

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చేటపుడు మొదటి దశగా ప్లాన్ అందించే కవరేజీని చెక్ చేయండి. చాలా పాలసీలు అదే ప్రాథమిక కవరేజీని అందిస్తున్నప్పటికీ, పరిమితుల పరంగా అవి విభిన్నంగా ఉంటాయి. అనేక ఫీచర్లను అందించే పాలసీలను నివారించండి, అందులో చాలా వరకు అనవసరమైనవి ఉంటాయి.  

Policy Sub-limits

పాలసీ ఉప-పరిమితులు

మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంబులెన్స్ ఛార్జీలు, హాస్పిటల్ గది అద్దె వంటి అనేక ప్రయోజనాలను అందించవచ్చు. అయితే, పెద్ద ఇన్సూరెన్స్ మొత్తం ఉన్నప్పటికీ, ప్రతి ఆఫర్ కింద వ్యక్తిగత ఉప పరిమితులు ఉంటాయి. మరింత చదవండి

ఆఖరి నిమిషంలో ఆశ్చర్యాలను నివారించడానికి ముందుగా, మీరు మీ ఉప-పరిమితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే, ఇది పాలసీ కోసం క్లెయిమ్ చేసినప్పుడు, మిమ్మల్ని చాలా నిరాశకు గురిచేస్తుంది.

No Claim Period

క్లెయిమ్ కాలపరిమితి లేదు

అలాగే, వెయిటింగ్ పీరియడ్‌ కూడా ఉంటుంది, ఇది పాలసీ కొనుగోలు చేసిన తేదీ నుండి కొన్ని నిర్ధిష్ట వ్యాధులు కవర్ చేయబడని నిర్ణీత కాలాన్ని సూచిస్తుంది. విభిన్న పాలసీలు వివిధ రకాల వ్యాధుల కోసం వేర్వేరు నిరీక్షణ కాలాన్ని కలిగి ఉంటాయి. మరింత చదవండి

కావున, నిర్ధిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు దాని వెయిటింగ్ పీరియడ్‌ను చెక్ చేయడం ఎల్లప్పుడూ ఒక ఉత్తమ ఆలోచన. 

Cashless Claim Facility

నగదురహిత క్లెయిమ్ సౌకర్యం

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అందించే అత్యుత్తమ ఫీచర్ అనదగ్గ క్యాష్‌లెస్ క్లెయిమ్‌లు వైద్య చికిత్సను ఉచితంగా పొందడాన్ని సుసాధ్యం చేస్తాయి. ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు, కాని, మా ఉద్దేశ్యం ఏమిటంటే, చికిత్స సమయంలో ఈ అద్భుతం మీ నగదు అవసరాన్ని దూరం చేస్తుంది. మరింత చదవండి

ఇన్సూరెన్స్ సంస్థ, ఈ సదుపాయాన్ని దాని అనుబంధ ఆసుపత్రులలో అందజేస్తుంది. వీటినే నెట్‌వర్క్ హాస్పిటల్స్ అని అంటారు, ఇవి మీరు నివసించే ప్రదేశానికి సమీపంలో ఉన్న హాస్పిటల్‌ను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తాయి.

Entry Age

ప్రవేశ వయస్సు

మీరు కుటుంబం కోసం ఒక సమగ్ర కవర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఈ కింది వాటిని తప్పనిసరిగా పరిగణించండి. కుటుంబ సభ్యులు అయిన పిల్లలు, తల్లిదండ్రులు లేదా అత్తమామల ప్రవేశ వయస్సును స్పష్టంగా నిర్వచించాలి. పిల్లల గరిష్ట వయో పరిమితులను కూడా ఖచ్ఛితంగా చెక్ చేసుకోవాలి.

Exclusions

మినహాయింపులు

“క్షమించండి! మేము ఈ వ్యాధిని కవర్ చేయము." ఇది నిరుత్సాహకరంగా అనిపించినప్పటికీ, నిర్ధారణ చేయబడిన మీ ఆరోగ్య పరిస్థితి పాలసీ నిబంధనల ప్రకారం మినహాయించబడినట్లయితే, హాస్పిటలైజేషన్ సమయంలో కవరేజీని పొందలేకపోవచ్చు. మరింత చదవండి

మా సలహా: పాలసీ డాక్యుమెంట్‌ను జాగ్రత్తగా పరిశీలించండి, ఆఖరి నిమిషంలో ఆశ్చర్యాలను నివారించడానికి కవర్ చేయబడని వైద్య పరిస్థితులను వివరంగా తెలుసుకోండి.

Add-on Benefits

అదనపు ప్రయోజనాలు

ఎక్కువ నెయ్యితో కూడిన వంటకాలను ఇష్టపడతారా? మంచిది, యాడ్-ఆన్ ప్రయోజనాలు కూడా ఈ విధంగానే పనిచేస్తాయి. అవి మీ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫర్‌ల ప్రయోజనాలను మెరుగుపరుస్తాయి. కఫ్‌లింక్‌లు మరియు పాకెట్ స్క్వేర్‌లు మీ అందమైన సూట్‌కు వన్నె తెచ్చినట్లుగా, యాడ్-ఆన్‌లు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పరిధిని, కవరేజీని మరియు ప్రయోజనాలను మెరుగుపరుస్తాయి.

Renewability

రెన్యువబిలిటీ

సగటు జీవితకాలం పెరిగే కొద్దీ మీరు లైఫ్‌టైమ్ రెన్యూవల్ సౌకర్యంతో లభించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఎంచుకోవాలి. ఇది వివిధ రకాల అనారోగ్యాల కొరకు మీ కొనసాగుతున్న పాలసీ నుండి కవరేజ్ అనుమతిస్తుంది, అలాగే, జీవితాంతం అవసరమయ్యే వైద్య కవరేజీని నిలుపుకోవడంలో మీకు సహాయపడుతుంది.

Cost effectiveness

తక్కువ ఖర్చు

చివరగా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల విషయానికి వస్తే సరసమైన ధర అనేది ఒక ప్రధాన అంశం. తక్కువ ధరలో మెరుగైన ఆప్షన్‌లను పొందగలిగినప్పుడు, మీరు ఎక్కువ ఖర్చుతో వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కోసం చెల్లించడానికి ఇష్టపడరు. మరింత చదవండి

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం మీరు చెల్లించాల్సిన మొత్తం సమర్థవంతమైనదిగా ఉండాలి, అది అందించే ప్రయోజనాలకు తగినట్లుగా ఉండాలి. 

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

హెల్త్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చడానికి చిట్కాలు: దీర్ఘకాలిక, ఫ్యామిలీ ప్లాన్‌లు అదనపు రాయితీలను అందించవచ్చు

బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

ఏవైనా ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం ఆర్థికంగా సిద్ధంగా ఉండండి

బజాజ్ అలియంజ్ వద్ద మేము, మా కస్టమర్లతో జీవితకాలపు సంబంధాలను ఏర్పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. వ్యక్తులు, కుటుంబాలు మరియు కమ్యూనిటీల తమ ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చులో భరించదగినదిగా నిర్వహించుకోవడానికి వీలుగా మా ప్లాన్‌లు రూపొందించబడ్డాయి. భారతదేశ వ్యాప్తంగా, వేల మంది కస్టమర్లు వారి ఆరోగ్య నాణ్యతను మెరుగుపరచడానికి మా హెల్త్ ఇన్సూరెన్స్ పరిష్కారాలపై ఆధారపడతారు.

మీ ఆరోగ్య సంరక్షణ చింతలను దూరం చేసి, జీవితంలో గొప్పగా రాణించడానికి మీకు సహాయపడటమే మా లక్ష్యం. ఈ క్రమంలో సదరు కస్టమర్‌కు ఆర్థిక స్థిరత్వం, మనశ్శాంతిని అందించడమే లక్ష్యంగా మేము వరల్డ్-క్లాస్ హెల్త్ ఇన్సూరెన్స్ పరిష్కారాలను అందిస్తున్నాము.

మేము పారదర్శకతను నమ్ముతాము, మా వెబ్‌సైట్‌లో అర్థమయ్యే విధంగా పూర్తి సమాచారాన్ని స్పష్టంగా పేర్కొన్నాము. ఇప్పటికీ, ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉన్నట్లయితే, వాటికి సమాధానమివ్వడానికి మా చాట్‌బోట్ బోయింగ్ సదా మీ సేవలో ఉంటుంది. అవసరమైనప్పుడల్లా మీకు సహకారం అందించడంలో మేము సిద్ధంగా ఉంటాము. మా 6000 పైగా ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్‌లు భారతదేశం వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి, ఇక్కడ మీరు పూర్తిగా నగదురహిత పద్ధతిలో చికిత్స పొందవచ్చు.

A long life deserves ongoing హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్. ప్రీమియం అమౌంటుకు బదులుగా మా పాలసీ అందించే ప్రయోజనాలు సాటిలేనివి.

మా విభిన్న పాలసీల మధ్య వివరణాత్మక పోలిక ఇక్కడ ఇవ్వబడింది. వాటిని ఒక సారి పరిశీలించండి!

ఫీచర్లు

ఇండివిడ్యువల్ హెల్త్

ఫ్యామిలీ హెల్త్

బ్యాజిక్ ఎక్స్‌ట్రా కేర్ ప్లస్

 

పాలసీ అవధి ఆప్షన్‌లు 1, 2 మరియు 3 సంవత్సరాలు

 

1, 2 మరియు 3 సంవత్సరాలు

 

1సంవత్సరం

 

ప్రవేశ వయస్సు

3 నెలల నుండి 65 సంవత్సరాల వరకు

3 నెలల నుండి 65 సంవత్సరాల వరకు

3 నెలల నుండి 80 సంవత్సరాలు వరకు

ఎవరిని కవర్ చేయవచ్చు

స్వయం, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యులు

స్వయం, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు. ఇతర కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక పాలసీ

స్వయం, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులను కవర్ చేయవచ్చు

రెన్యూవల్ వయస్సు

లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్‌లు

లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్‌లు

లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్‌లు

ఇన్సూరెన్స్ మొత్తం ఆప్షన్‌లు

1.5 - 50 లక్షలు

1.5 - 50 లక్షలు

3 - 50 లక్షలు

ముందుగా-ఉన్న వ్యాధుల కోసం వెయిటింగ్ పిరియడ్

36 నెలలు

36 నెలలు

<n1> నెలలు

ఆన్‌లైన్‌లో పోల్చి చూసే హెల్త్ ఇన్సూరెన్స్/మెడిక్లెయిమ్ ప్లాన్ల ప్రయోజనాలు

అంబులెన్స్ కవర్

 

 

 

అవయవ దాత ఖర్చులు

 

 

 

ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి భర్తీ చేయడం

 

 

 

ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్

 

 

 

ఆయుర్వేద/ హోమియోపతి హాస్పిటలైజేషన్ ఖర్చులు

 

 

 

ప్రసూతి ఖర్చులు/ నవజాత శిశువు కవర్

 

 

 

బేరియాట్రిక్ సర్జరీ కవర్

 

 

 

ఎయిర్ అంబులెన్స్ కవర్

 

 

 


ఫీచర్లు

 

బ్యాజిక్ హెల్త్ గార్డ్

 

బ్యాజిక్ ఎక్స్‌ట్రా కేర్ ప్లస్

 

 

హెల్త్ గార్డ్ సిల్వర్

 

హెల్త్ గార్డ్ గోల్డ్

 

ఎక్స్‌ట్రా కేర్ ప్లస్

 

గది అద్దె

 

రోజుకు ఎస్‌ఐ లో 1%

 

వాస్తవిక గణాంకాల ప్రకారం

వాస్తవిక గణాంకాల ప్రకారం

ఐసియు ఛార్జీలు

 

వాస్తవిక గణాంకాల ప్రకారం

వాస్తవిక గణాంకాల ప్రకారం

వాస్తవిక గణాంకాల ప్రకారం

ప్రీ హాస్పిటలైజేషన్

 

60 రోజులు

60 రోజులు

60 రోజులు

హాస్పిటలైజేషన్ తరువాత

 

90 రోజులు

90 రోజులు

90 రోజులు

డే కేర్ చికిత్సలు

 

డే కేర్ కింద నిర్వచించబడిన అన్నీ

డే కేర్ కింద నిర్వచించబడిన అన్నీ

డే కేర్ కింద నిర్వచించబడిన అన్నీ

అవయవ దాత

 

ఇన్సూర్ చేయబడిన మొత్తం వరకు

ఇన్సూర్ చేయబడిన మొత్తం వరకు

అంబులెన్స్ కవర్

 

ప్రతి పాలసీ సంవత్సరానికి 20000/- వరకు

ప్రతి చెల్లుబాటు అయ్యే హాస్పిటలైజేషన్ క్లెయిమ్‌ కొరకు రూ. 3000/

ఎయిర్ అంబులెన్స్

 

అందుబాటులో లేదు

ఆప్షనల్ కవర్

స్వస్థత ప్రయోజనం:

 

10 రోజుల హాస్పిటలైజేషన్ విషయంలో, ప్రతి పాలసీ సంవత్సరానికి రూ. 5000

10 రోజుల హాస్పిటలైజేషన్ విషయంలో, ప్రతి పాలసీ సంవత్సరానికి రూ. 7500

అందుబాటులో లేదు

ఇన్సూర్ చేయబడిన పిల్లల (12 సంవత్సరాల వయస్సు వరకు)తో పాటు ఉన్నవారికి డైలీ క్యాష్ అలవెన్స్

 

రోజుకు రూ. 500 చొప్పున గరిష్టంగా 10 రోజుల వరకు

 

అందుబాటులో లేదు

ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి భర్తీ చేయడం వలన ప్రయోజనం

 

పాలసీ వ్యవధిలో ఒక్కసారి, అదే అనారోగ్యం కొరకు

అందుబాటులో లేదు

ప్రసూతి ఖర్చులు

 

అందుబాటులో లేదు

రూ. 35000వరకు. 6 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత

కవర్ చేయబడతాయి, 1సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ తర్వాత

నవజాత శిశువు ఖర్చులు కవర్ చేయబడతాయి

 

అందుబాటులో లేదు

ప్రసూతి ఎస్ఐ లోపల

అందుబాటులో లేదు

బేరియాట్రిక్ సర్జరీ కవర్

 

అందుబాటులో లేదు

ఇన్సూరెన్స్ మొత్తంలో 50% గరిష్టంగా రూ. 5 లక్షల వరకు

అందుబాటులో లేదు

ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్

 

క్లెయిమ్‌తో సంబంధం లేకుండా, ప్రతి 3 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ మొత్తంలో 1%, గరిష్టంగా రూ. 2000/- వరకు

క్లెయిమ్‌తో సంబంధం లేకుండా, ప్రతి 3 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ మొత్తంలో 1%, గరిష్టంగా రూ. 5000/- వరకు

అవును, క్లెయిమ్స్ చరిత్రతో సంబంధం లేకుండా ప్రతి 3 సంవత్సరాలకు గరిష్టంగా రూ. 2000/-

ఆయుర్వేద మరియు హోమియోపతి హాస్పిటలైజేషన్ కవర్

 

అందుబాటులో లేదు

20000 వరకు, అన్ని ఆమోదిత ఆయుర్వేద ఆసుపత్రులలో అందుబాటులో ఉంది

అందుబాటులో లేదు

పైన పేర్కొన్న పట్టిక మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలోని కొన్ని ప్రత్యేక ఫీచర్లను హైలైట్ చేస్తుంది. ఉదాహరణకు, దాదాపు అన్ని మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు హాస్పిటలైజేషన్ గది అద్దె ఖర్చులను పూర్తిగా రీయింబర్స్ చేస్తాయి.

అదేవిధంగా, మేము మీ హాస్పిటల్ బసకు మాత్రమే కాకుండా, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు చెల్లిస్తాము. ముందు, మీరు ఈ విభిన్న ఆప్షన్‌లలో ఒక దానిని ఎంచుకోవాలని నిర్ణయించుకోవాలి, పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించి, మీకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవాలి.

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 25 ఏప్రిల్ 2024

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి