Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ

మీ ఆరోగ్యం కోసం పెట్టుబడి పెట్టండి మరియు సురక్షితంగా ఉండండి

సమగ్రవంతమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు
Port Health Insurance Policy

మీ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ

దయచేసి పేరును నమోదు చేయండి
/health-insurance-plans/individual-health-insurance-plans/buy-online.html ఒక కోట్ పొందండి
కోట్‌ను తిరిగి పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సబ్మిట్ చేయండి

దీనితో మీకు కలిగే లాభం?


6500 + నెట్‌వర్క్ ఆసుపత్రులు వద్ద నగదురహిత చికిత్స

ఇన్-హౌస్ హెల్త్
అడ్మినిస్ట్రేషన్ టీమ్

నగదురహిత ప్రతిస్పందన సమయం
60 నిమిషాల లోపు

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అంటే ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనే భావనను అర్థం చేసుకోవడానికి, పోర్టబుల్ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. సులభంగా తరలించగల లేదా తీసుకువెళ్లగల వస్తువుల విషయంలో పోర్టబుల్ అనే పదం ఉపయోగించబడుతుంది. అయితే, ఇక్కడ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనేది పాలసీహోల్డర్‌కు (ఫ్యామిలీ కవర్‌తో సహా) కల్పించిన హక్కును సూచిస్తుంది.

ప్రస్తుత కంపెనీ నుండి ఒక కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మారడానికి ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఈ ఎంపికను ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తి తమ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చాలని ఎందుకు అనుకుంటారు? ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల మార్పునకు అనేక కారణాలు ఉంటాయి, వేరొక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మెరుగైన ఆఫర్లు మరియు మరెన్నో అందుబాటులో ఉండవచ్చు.

అందువల్ల, అనేక కంపెనీలు అందించే మెరుగైన ఎంపికలను కొనుగోలుదారుకు సులభతరం చేయడానికి, ఏదైనా ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేసే సమయంలో ఏ వ్యక్తికైనా ఈ హక్కు ఇవ్వబడుతుంది. మార్కెట్లో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ మీకు చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు.

<

← స్వైప్/స్క్రోల్ →

>

బజాజ్ అలియంజ్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు పోర్ట్ చేయాలి?

A హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అత్యవసర వైద్య పరిస్థితులు లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీ ఆర్థిక ఖర్చులను భరించే ఒక పెట్టుబడిగా పనిచేస్తుంది. కానీ మార్కెట్లో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నందున, సరైన దానిని ఎంచుకోవడంలో కొనుగోలుదారు తడబడతారు. బజాజ్ అలియంజ్ దిగువ ఇవ్వబడిన ప్రయోజనాలు మరియు కవరేజ్ ప్లాన్లతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది.

బజాజ్ అలియంజ్ నుండి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు

  • బజాజ్ అలియంజ్ 6,000 కంటే ఎక్కువ ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది మరియు మీకు నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సదుపాయాన్ని అందిస్తుంది.
  • క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ సర్వీస్ కోసం ఫోన్ పై 24/7 సహాయం అందుబాటులో ఉంది.
  • ఒక ఇన్-హౌస్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ బృందం (హెచ్ఎటి) వేగవంతమైన మరియు మరింత సమర్థవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేస్తుంది.
  • పాలసీహోల్డర్ తమ యాప్-ఇన్సూరెన్స్ వాలెట్ ద్వారా ఒక క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతించబడే హెల్త్ సిడిసి ప్రయోజనం ఉంది.
  • కస్టమర్లకు 100% వరకు ప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరం కోసం 10% క్యుములేటివ్ బోనస్ ప్రయోజనం అందించబడుతుంది.
  • ఇన్సూర్ చేయబడిన పిల్లల కోసం రోజువారీ నగదు ప్రయోజనం ఇవ్వబడుతుంది.
  • బజాజ్ అలియంజ్ పాలసీ ఇన్సూర్ చేయబడిన మొత్తం వరకు అవయవ దాత ఖర్చులను కవర్ చేస్తుంది.
  • ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు మరియు రెన్యూ చేయవచ్చు, ఇది కఠినమైన పేపర్‌వర్క్ విధానంలోని ఇబ్బందులను తొలగించి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.
  • ఇది బేరియాట్రిక్ సర్జరీ వంటి సంక్లిష్టమైన విధానాలకు కవరేజ్ ప్రయోజనాన్ని అందిస్తుంది.
  • పాలసీహోల్డర్లు హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణుల ద్వారా వారి ప్రశ్నలకు సమర్థవంతమైన మరియు వేగవంతమైన పరిష్కారాన్ని పొందవచ్చు.
  • ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద మినహాయింపులతో రూ. 100,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా అందించబడుతుంది. 

బజాజ్ అలియంజ్ ద్వారా అందించబడే కవరేజ్

  • బజాజ్ అలియంజ్ తన కస్టమర్లకు ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జీల కోసం కవరేజ్ అందిస్తుంది.
  • ప్రసూతి మరియు నవజాత శిశువు ఖర్చుల కోసం కవరేజ్ ప్లాన్ అందించబడుతుంది.
  • ఇది ఇన్-హాస్పిటల్ ఖర్చులు, గది అద్దె మరియు బోర్డింగ్ ఖర్చులకు కూడా కవరేజ్ అందిస్తుంది.
  • బజాజ్ అలియంజ్ నుండి కొనుగోలు చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆయుర్వేదం, యోగ మరియు హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సల కోసం మీకు కవరేజ్ అందిస్తుంది.
  • డాక్టర్ కన్సల్టేషన్ మరియు అంబులెన్స్ ఛార్జీలు కూడా బజాజ్ అలియంజ్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడతాయి. 

మీ హెల్త్ పాలసీలో మీరు పోర్ట్ చేయగల అంశాల జాబితా

మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు, స్పష్టంగా అర్థం చేసుకోవలసిన వివిధ అంశాలు ఉన్నాయి. మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మీరు పోర్ట్ చేయగల అంశాల గురించి తెలుసుకోవడానికి కింద ఒక జాబితా ఇవ్వబడింది.

  1. మీ ప్రస్తుత ఇన్సూర్ చేయబడిన సభ్యులందరినీ మీరు పోర్ట్ చేయవచ్చు.
  2. మీరు నిర్దిష్ట వ్యాధుల కోసం వేచి ఉండే వ్యవధిని కూడా పోర్ట్ చేయవచ్చు.
  3. పోర్టింగ్ జాబితాలో ముందు నుండి ఉన్న వ్యాధులు యొక్క వేచి ఉండే వ్యవధిని కూడా చేర్చవచ్చు.
  4. ప్రస్తుతం ఇన్సూర్ చేయబడిన మొత్తం.
  5. మీ ప్రసూతి ప్రయోజనం వెయిటింగ్ పీరియడ్‌ను మీరు ఎంచుకున్నట్లయితే, దానిని కూడా పోర్ట్ చేయవచ్చు.
  6. మీ సంచిత క్యుములేటివ్ బోనస్‌ను కూడా ఈ జాబితాకు జోడించవచ్చు.

 

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీని వినియోగించేటప్పుడు ఈ క్రింది డాక్యుమెంట్లను ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్లను పేర్కొంటూ ఒక జాబితా క్రింద ఇవ్వబడింది. 

  1. మీరు మునుపటి పాలసీ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. సమర్పించిన పాలసీలకు లోబడి సంవత్సరాల కొనసాగింపు సంఖ్య ఉంటుంది.
  2. ఒక ప్రతిపాదన ఫారం కూడా అవసరం.
  3.  మునుపటి క్లెయిమ్ వివరాలను సమర్పించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది.
  4. వయస్సు రుజువును చూపించడానికి డాక్యుమెంట్లు.
  5. ఇన్వెస్టిగేషన్, డిశ్చార్జ్ కార్డ్, రిపోర్టులు, తాజా ప్రిస్క్రిప్షన్లు మరియు క్లినికల్ పరిస్థితి వంటి ఏవైనా పాజిటివ్ డిక్లరేషన్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడానికి అనుసరించవలసిన దశలు

ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ పాలసీని మరొక ఇన్సూరెన్స్ కంపెనీకి పోర్ట్ చేయడానికి పాలసీహోల్డర్‌కు హక్కు ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. అందువల్ల, బజాజ్ అలియంజ్ అందించే పోర్టబిలిటీ ప్రాసెస్ మీ అనుభవాన్ని స్ట్రీమ్‌లైన్ చేయడానికి మరియు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరొక ఇన్సూరెన్స్ కంపెనీకి సాఫీగా బదిలీ చేయడాన్ని సులభతరం చేసింది. మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడానికి మీరు కేవలం మూడు దశల విధానాన్ని అనుసరించాలి.

దశ 1 : ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పేరు మరియు వయస్సుతో సహా ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ వివరాలతో పోర్టబిలిటీ ఫారం నింపండి.

దశ 2 : కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ కోసం పూర్తి వివరాలతో ప్రతిపాదన ఫారం నింపండి.

దశ 3 : సంబంధిత డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.

IRDA ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ నియమాలు

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీని మరొక ఇన్సూరెన్స్ కంపెనీగా పోర్ట్ చేయడానికి మీకు హక్కును ఇస్తుంది, ఇందుకోసం కొన్ని నియమాలను అనుసరించవలసి ఉంటుంది.

ఇన్సూరెన్స్ కంపెనీల మార్పును నియంత్రించే హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ చట్టం ఏదీ లేనప్పటికీ, ఈ నియమాలు మరియు నిబంధనలను IRDA ఏర్పాటు చేసింది. అందువల్ల, ఇన్సూరెన్స్ పాలసీలను పోర్ట్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మరియు పాలసీహోల్డర్ ఇద్దరూ ఈ నిర్వచించబడిన నియమాలను అనుసరించవలసి ఉంటుంది. 

పాలసీహోల్డర్ హక్కులు

పాలసీ రకం: పాలసీహోల్డర్ అదే రకమైన పాలసీకి మాత్రమే పోర్ట్ చేయగలరు. పోర్టబిలిటీ ప్రక్రియలో కవరేజ్ మరియు పాలసీ రకంలో విపరీతమైన మార్పులు చేసే అవకాశం ఉండదు.

ఇన్సూరెన్స్ కంపెనీ: ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరొకదానికి మారేటప్పుడు, పాలసీహోల్డర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి.

ఒక వ్యక్తి ఒకే రకమైన ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకున్నప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పోర్టబిలిటీని చేయవచ్చు. ఇటువంటి వివరణలు ఇప్పటికే ఉన్న మరియు సంభావ్య ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క విధులలో భాగంగా ఉంటాయి.

ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ప్రతిస్పందన: పాలసీహోల్డర్ పోర్టబిలిటీ అభ్యర్థనను అంగీకరించడానికి ప్రస్తుత ఇన్సూరెన్స్ సంస్థ మూడు రోజుల వ్యవధిని తీసుకోవడానికి అనుమతించబడుతుంది.

పోర్టింగ్ ఫీజు: ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ లేదా కొత్తవారు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడానికి ఫీజు వసూలు చేయలేరు. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ విషయంలో IRDA నిర్దేశించిన నియమాల్లో ఇది ఒకటి.

గ్రేస్ పీరియడ్: హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అదనపు గ్రేస్ పీరియడ్ పొందే హక్కు పాలసీహోల్డర్‌కు ఇవ్వబడుతుంది.

30 రోజుల వ్యవధి ఇవ్వబడుతుంది, ఈ సమయంలో పాలసీహోల్డర్ ప్రీమియంను దామాషా ప్రాతిపదికన చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల, పాత పాలసీ యాక్టివ్‌గా ఉండే రోజుల సంఖ్య ఆధారంగా ఛార్జ్ చేయబడే ప్రీమియం లెక్కించబడుతుంది.

●     ఇన్సూర్ చేయబడిన మొత్తం మరియు కవరేజ్ పరిధి: పాలసీహోల్డర్‌కు ఇన్సూర్ చేయబడిన మొత్తం మరియు కొత్త పాలసీ యొక్క కవరేజ్ పరిధిని పెంచే హక్కును కలిగి ఉంటారు. కానీ ఇది పూర్తిగా ఇన్సూరెన్స్ కంపెనీ మరియు వారి ఆమోదం పై ఆధారపడి ఉంటుంది.

నెరవేర్చవలసిన షరతులు

అంతరాలు: పాలసీ రెన్యూవల్స్‌లో ఏవైనా అంతరాలు ఉన్నట్లయితే, ఆ పాలసీని మరొక కంపెనీకి పోర్ట్ చేయలేరు. ఇప్పటికే ఉన్న పాలసీలోని అంతరాలు అనేవి అని రకాల ఇన్సూరెన్స్ కంపెనీలకు కస్టమర్ యాక్సెస్‌ను పరిమితం చేస్తాయి.

అందువల్ల, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ సమయంలో మీ పాలసీ రెన్యూవల్‌లో ఎటువంటి అంతరాలు ఉండకూడదు.

ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం: పాలసీహోల్డర్ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీకి వ్రాతపూర్వకంగా తెలియజేయవలసి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ ప్లాన్ రెన్యూవల్ తేదీకి 45 రోజుల ముందు ఈ నోటిఫికేషన్ చేయబడాలి.

ప్రీమియంలో మార్పులు: ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రీమియంలు అనేక అంశాల ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీ చేత నిర్ణయించబడతాయి. మీ పాత ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మారడం వలన మీరు అదనపు ప్రీమియం చెల్లించవలసి రావచ్చు.

కొత్త ఇన్సూరర్ అదే రకమైన పాలసీ కోసం వేరొక ప్రీమియం మొత్తాన్ని వసూలు చేసినప్పుడు ఇది జరుగుతుంది.

వేచి ఉండే వ్యవధి: కవరేజ్ విస్తృతి ఆధారంగా అదనపు వేచి ఉండే వ్యవధులు ఉంటాయి. ఒక వేళ పాలసీహోల్డర్ కవరేజ్‌ని పెంచుకోవాలని అనుకుంటే మరియు ఇన్సూరెన్స్ కంపెనీ దానిని ఆమోదిస్తే, కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క షరతులు మరియు నిబంధనల ప్రకారం పాలసీహోల్డర్ వేచి ఉండే వ్యవధిని అనుసరించవలసి ఉంటుంది

మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీని ఎప్పుడు పరిగణించాలి?

మీ ఇన్సూరెన్స్ సేవలతో మీరు సంతృప్తి చెందనప్పుడు: ఢిల్లీకి చెందిన మిస్టర్ కరణ్ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ అందించిన సేవలతో సంతృప్తిగా లేరు మరియు అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయాలని అనుకున్నారు. యుక్త వయస్సులో ఉన్నందువలన, బజాజ్ అలియంజ్ వద్ద అధిక ప్రయోజనాలను కనుగొన్నారు మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీని చేయాలని అనుకున్నారు. అదే విధంగా, ముంబైకి చెందిన మిస్టర్ విశ్వాస్ 58 సంవత్సరాల వయస్సులో బజాజ్ అలియంజ్ వద్ద మెరుగైన సేవలను పొందగలరు అని తెలుసుకున్నారు, అందుకే హెల్త్ పాలసీ పోర్టబిలిటీ గురించి తెలుసుకున్నారు.

మీరు అదనపు కవర్ పొందినప్పుడు: బెంగళూరుకు చెందిన మిసెస్ లతా పాలసీహోల్డర్‌కు అందించబడిన అధిక ఇన్సూర్ చేయబడిన మొత్తం గురించి తెలిసినప్పుడు బజాజ్ అలియంజ్ వద్ద హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీని ఎంచుకున్నారు.

మీరు మెరుగైన ఎంపికలను పొందినప్పుడు: మీరు రెండు విభిన్న ఇన్సూరెన్స్ కంపెనీలను పోల్చినప్పుడు, మీరు ప్రతి కంపెనీ నుండి వివిధ ప్రయోజనాలను కనుగొనవచ్చు. చండీగఢ్‌కి చెందిన మిసెస్ అనితా రెన్యూవల్ కోసం వయస్సు పరిమితులు, గది అద్దెపై పరిమితులు మరియు పాలసీ ప్రీమియంల గురించి వివరాలు తెలుసుకున్న తర్వాత బజాజ్ అలియంజ్ వద్ద హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీని చేయాలని నిర్ణయించుకున్నారు.

పారదర్శకతలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు: బజాజ్ అలియంజ్ పాలసీలో ప్రమేయంగల డాక్యుమెంట్ల పారదర్శకతను నిర్ధారిస్తుంది. పూణేకి చెందిన మిస్టర్ కార్తిక్ కంపెనీ యొక్క పారదర్శకత విధానం గురించి లోతుగా చదివారు మరియు హెల్త్ పాలసీ పోర్టబిలిటీని ఎంచుకున్నారు.

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

మీరు ఒక గాడ్జెట్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినా, ప్రతి దానికి అనేక అనుకూలతలు మరియు ప్రతికూలతలు ఉంటాయి. మరియు మీరు హెల్త్ పాలసీ పోర్టబిలిటీ యొక్క అనుకూలతలు మరియు ప్రతికూలతల గురించి చదవకపోతే, దీర్ఘకాలంలో మీరు పశ్చాత్తాపపడే సందర్భం ఎదురవ్వచ్చు. అందువల్ల, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు జాబితా చేయబడిన అనుకూలతలు మరియు ప్రతికూలతల గురించి తెలుసుకోవాలి. 

ప్రయోజనాలు  ప్రతికూలతలు
కొనసాగింపు ప్రయోజనం: హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ యొక్క గొప్ప ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే మీరు అందించిన ప్రయోజనాలను వదిలి వేయవలసిన అవసరం లేదు. మీరు ప్రయోజనాల కొనసాగింపును ఆనందించవచ్చు. రెన్యూవల్ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పోర్టబిలిటీతో ఉన్న ప్రతికూలతలలో ఒకటి ఏమిటంటే పాలసీ గడువు ముగిసే తేదీకి ముందు మాత్రమే దీనిని వినియోగించవచ్చు. 
నో క్లెయిమ్ బోనస్‌ను ఉంచండి: హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనేది మీ కొత్త ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంలో ప్రతిబింబించే మీ నో క్లెయిమ్ బోనస్‌ను ఉంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.  పరిమిత ప్లాన్ మార్పులు: హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ కోసం ప్లాన్ పై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మీ ప్లాన్‌లో మీరు అనేక మార్పులు చేయలేరు. మీరు ప్లాన్‌లో మార్పులను కస్టమైజ్ చేయాలనుకుంటే, ప్రీమియంలు మరియు ఇతర షరతులు మరియు నిబంధనలు కూడా తదనుగుణంగా మార్చబడతాయి.
వేచి ఉండే వ్యవధి పై ఎటువంటి ప్రభావం ఉండదు: మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసినప్పుడు మీ పాలసీల వేచి ఉండే వ్యవధి ప్రభావితం కాదు. విస్తృత కవరేజ్ కోసం అధిక ప్రీమియం: మీ మునుపటి ప్లాన్‌తో పోలిస్తే మీకు అధిక కవరేజ్ కావాలనుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ తర్వాత మీరు అధిక ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

మీ హెల్త్ పాలసీ పోర్టబిలిటీ అభ్యర్థన ఎప్పుడు తిరస్కరించబడవచ్చు?

కొన్ని సందర్భాలలో హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ కోసం మీ అభ్యర్థనను ఇన్సూరర్ తిరస్కరించవచ్చు. అందువల్ల మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడానికి అవసరమైన కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

మీరు అసంపూర్ణ సమాచారాన్ని అందించినప్పుడు: హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ సమయంలో మీరు కొత్త ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో పారదర్శకంగా వ్యవహరించాలి. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరియు సంబంధిత అంశాల గురించి సమాచారాన్ని దాచి ఉంచడం తిరస్కరణకు దారి తీసే అవకాశం ఉంది. అందువల్ల ఇన్సూరర్‌ను వ్యక్తిగతంగా సంప్రదించడం మరియు అవసరమైన సమాచారాన్ని అందించడం మంచిది.

డాక్యుమెంట్ సమర్పణలో ఆలస్యం: హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ విధానాన్ని పూర్తి చేయడానికి పాలసీహోల్డర్ ఒక నిర్దిష్ట కాలపరిమితిని అనుసరించాలి అని పేర్కొనబడింది. కాబట్టి, మీరు మీ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడానికి ఆలస్యం చేయకూడదు మరియు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఇన్సూరర్‌కు తెలియజేయాలి.

క్లెయిమ్ చరిత్ర కూడా ఆమోదాన్ని ప్రభావితం చేయవచ్చు: ఒకవేళ మోసపూరిత క్లెయిమ్ చరిత్ర ఉంటే, తిరస్కరణ సంభావ్యత అనేక రెట్లు పెరుగుతుంది. అందించిన సమాచారంలో ఏదైనా మోసం లేదా తప్పుడు ప్రాతినిధ్యం కనుగొనబడితే హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ కోసం మీ అభ్యర్థనను తిరస్కరించడానికి ఇన్సూరెన్స్ కంపెనీకి హక్కు ఉంటుంది.

మీ మునుపటి పాలసీ గడువు ఇంకా ముగియలేదా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ ఎందుకు?

  • పరిశ్రమలో ఉత్తమ సేవలు..
  • వేగవంతమైన ఇన్-హౌస్ క్లెయిమ్స్ సెటిల్‌మెంట్..
  • స్వచ్ఛమైన అండర్‌రైటింగ్ పద్ధతుల కోసం కంపెనీ యొక్క స్థిరమైన పనితీరు.
  • హాస్పిటలైజేషన్ కవర్లు, పర్సనల్ యాక్సిడెంట్ కవర్లు, టాప్ అప్‌లు, క్రిటికల్ ఇల్‌నెస్, ఇతర వ్యాపార ప్రోడక్టులతో పాటు హాస్పిటల్ క్యాష్ లాంటి పెద్ద శ్రేణి ప్రోడక్టులు.
  • భారతదేశ వ్యాప్తంగా నగదురహిత ప్రయోజనాన్ని అందిస్తుంది.
  • మార్కెట్లో ఇ అభిప్రాయాన్ని అందించే ఏకైక కంపెనీ.

హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు?

ఆరోగ్యం మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. దీనికి అత్యధిక సంరక్షణను అందించాలి. మన ప్రస్తుత జీవనశైలి విధానాలు ఆరోగ్య సంబంధిత సమస్యలలో పెరుగుదలకు దారితీస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో సిద్ధంగా ఉండటం ముఖ్యం.

video_alt

మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఒక అత్యవసర వైద్య పరిస్థితి మీ శరీరం, మనస్సు మరియు ఆర్థిక స్థితి పై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఒక వ్యక్తికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే, అతని సేవింగ్స్ అన్నీ ఒక్కసారిగా ఖాళీ అయిపోవచ్చు. అందుకే, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల అన్ని ప్రయోజనాలను పొందడానికి ఒక వ్యక్తి సరైన కవర్‌ను కొనుగోలు చేయాలి. పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీ అవసరాలు, జీవనశైలి మరియు కవరేజీని పరిగణలోకి తీసుకోకపోతే మీ క్లెయిమ్ పూర్తిగా ప్రభావితం అవుతుంది. కావున, మీరు ఒక కొత్త కంపెనీకి హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
Drive Smart Benefit Smart Benefit

ప్రస్తుత పాలసీ గడువు తేదీ

గడువు ముగిసిన తర్వాత మీ పాలసీని మీరు పోర్ట్ చేయలేరు. అందువల్ల, మీరు రెన్యూవల్ తేదీ పట్ల జాగ్రత్త వహించాలి మరింత చదవండి

ప్రస్తుత పాలసీ గడువు తేదీ

గడువు ముగిసిన తర్వాత మీ పాలసీని మీరు పోర్ట్ చేయలేరు. అందువల్ల, రెన్యూవల్ సమయంలో మాత్రమే మీరు దానిని పోర్ట్ చేయగలరు కాబట్టి మీ పాలసీ రెన్యూవల్ తేదీ పట్ల మీరు జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా, రెన్యూవల్ తేదీకి 45 రోజుల ముందు పోర్టింగ్ గురించి మీరు ప్రస్తుత ఇన్సూరర్‌కు తెలియజేయాలి

తిరస్కరణలను నివారించడానికి నిజాయితీగా ఉండండి

మీరు కొత్త ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో పారదర్శకంగా వ్యవహరించాలి. మీరు అన్ని షేర్ చేయవలసి ఉంటుంది మరింత చదవండి

తిరస్కరణలను నివారించడానికి నిజాయితీగా ఉండండి

మీరు కొత్త ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో పారదర్శకంగా వ్యవహరించాలి. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి తిరస్కరణలను నివారించడానికి మీ పూర్తి వైద్య చరిత్ర మరియు క్లెయిమ్ చరిత్రను మీరు షేర్ చేయవలసి ఉంటుంది.

వివిధ ప్రయోజనాలతో కూడిన ఇలాంటి ప్లాన్లు

వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే అదే విధమైన ప్లాన్‌లు మరింత చదవండి

వివిధ ప్రయోజనాలతో కూడిన ఇలాంటి ప్లాన్లు

వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే ఇలాంటి ప్లాన్‌లు మీకు వివిధ ప్రయోజనాలను అందించగలవు అని మీరు గుర్తుంచుకోవాలి. అందువల్ల, ప్రయోజనాల గురించి చదువుతున్నప్పుడు మీరు అన్నింటినీ జాగ్రత్తగా గమనించాలి.

పరిమితులు మరియు ఉప-పరిమితులు

హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రతి రకం కవరేజ్ పై క్లెయిమ్ చేయదగిన మొత్తం పై ఒక నిర్దిష్ట పరిమితి ఉంది మరింత చదవండి

పరిమితులు మరియు ఉప-పరిమితులు

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రతి రకమైన కవరేజ్ పై క్లెయిమ్ చేయదగిన మొత్తం పై ఒక నిర్దిష్ట పరిమితి ఉంది. ఉదాహరణకు, రోజువారీ గది అద్దె రూ. 3500 కు పరిమితం చేయబడవచ్చు. అందువల్ల, మీ పాలసీని పోర్ట్ చేసినప్పుడు మీరు అటువంటి పరిమితులను తనిఖీ చేయాలి. పాలసీని పోర్ట్ చేయడానికి ముందు, పరిమితులు మరియు ఉప-పరిమితులు మీ కోసం సరైనవి అని నిర్ధారించుకోండి.

Health Insurance Portability FAQs

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ తరచుగా అడగబడే ప్రశ్నలు

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ యొక్క ప్రయోజనాలు ఏమిటి?

హెల్త్ పాలసీ పోర్టబిలిటీ యొక్క కొన్ని ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి:

  • మీ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పాలసీలను మీరు పొందుతారు.
  • మీరు చెల్లించే ప్రీమియం కోసం మెరుగైన విలువను పొందవచ్చు.
  • పెరిగిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందే అవకాశం.
  • క్లెయిమ్స్, సెటిల్‌మెంట్స్ అన్నీ కూడా అవాంతరాలు లేకుండా పూర్తవుతాయి.
  • మీరు కవరేజ్ కొనసాగింపును ఆనందించవచ్చు.
  • నో క్లెయిమ్ బోనస్‌ను ముందుకు తీసుకువెళ్ళవచ్చు.

 

ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను పోర్ట్ చేయవచ్చు?

ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందించబడే ఏదైనా వ్యక్తిగత లేదా ఫ్యామిలీ పాలసీలను పోర్ట్ చేయడానికి మీరు అనుమతించబడతారు. 

నేను నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయాలనుకుంటున్నాను. విధానం ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడానికి మీరు ఈ దశలను అనుసరించాలి:

  •  ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పేరు మరియు వయస్సుతో సహా ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ వివరాలతో పోర్టబిలిటీ ఫారం నింపండి.
  •  కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ కోసం పూర్తి వివరాలతో ప్రతిపాదన ఫారం నింపండి.
  •  సంబంధిత డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ సమయంలో నా క్యుములేటివ్ బోనస్ మరియు వెయిటింగ్ పీరియడ్‌కు ఏం జరుగుతుంది?

మీ క్యుములేటివ్ బోనస్‌ను ముందుకు తీసుకువెళ్ళవచ్చు మరియు వేచి ఉండే వ్యవధులలో అవాంతరాలు లేని తగ్గింపుతో పాలసీ ప్రయోజనాలను మీరు కొనసాగించవచ్చు. అందువల్ల, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ సమయంలో మీ వేచి ఉండే వ్యవధులు మరియు నిరంతర ప్రయోజనాలు లెక్కించబడతాయి.

ఏవైనా అదనపు పోర్టబిలిటీ ఛార్జీలు ఉన్నాయా?

లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ కోసం ఎటువంటి పోర్టబిలిటీ ఛార్జీలు లేవు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అటువంటి విధానాలను అనుసరించినప్పటికీ, బజాజ్ అలియంజ్ వద్ద అటువంటి ఛార్జీలు ఏమీ లేవని మీరు నిశ్చింతగా ఉండవచ్చు. 

ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు నేను నా ఇన్సూరెన్స్ మొత్తాన్ని మార్చవచ్చా?

అవును, మీరు కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మార్చవచ్చు, అయితే, సవరించబడిన ఇన్సూరర్ ప్రాధాన్యత ఆధారంగా అంగీకారం ఉంటుంది. 

నేను హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీని ఎంచుకుంటే నేను ఏదైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలా?

ఇది కొత్త ఇన్సూరర్ అందించిన పాలసీల నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు మెడికల్ ఫార్మాలిటీల కోసం టైమ్ ఫ్రేమ్ ఇవ్వబడితే, మీరు ఇవ్వబడిన వ్యవధిలో అలా చేయవలసి ఉంటుంది. 

నేను పోర్టబిలిటీ కోసం ఎప్పుడు అప్లై చేయాలి?

మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ తేదీ నుండి 60 రోజుల ముందు మీరు అప్లై చేయాలి. దీనికి కారణం గడువు తేదీకి ముందుగా పోర్ట్ చేయకపోవడం మరియు పాలసీలోని ఒక అంతరాయానికి ప్రీమియంను ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు చెల్లించడంలో వైఫల్యం, ఇది పోర్టబిలిటీ అభ్యర్థన తిరస్కరణ కోసం ఖచ్చితమైన కారణాలుగా ఉంటాయి. 

నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసేటప్పుడు నేను ఏదైనా నష్టపోతానా?

లేదు, మీరు సంచిత క్యుములేటివ్ బోనస్ మరియు గడచిన వెయిటింగ్ పీరియడ్ వంటి విషయాలను కోల్పోరు.

నేను ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేయవచ్చా?

లేదు, మీ ప్రస్తుత పాలసీ గడువు ముగియడానికి ముందు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మాత్రమే పోర్ట్ చేయవచ్చు. అందువల్ల, మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ తేదీకి 45 రోజుల ముందు మీరు ఇన్సూరర్‌కు తెలియజేయాలి.

నా హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అభ్యర్థన తిరస్కరించబడింది. నేను తర్వాత ఏం చేయాలి?

మీ అభ్యర్థన తిరస్కరించబడటానికి గల కారణాలను ఇన్సూరర్ పేర్కొని ఉండాలి. అందువల్ల, మీ ఫారం సమర్పణలో అంతరాయాలను పరిష్కరించడానికి మీరు వాటి పై పనిచేయాలి. మీ గురించి మరియు ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీ యొక్క మీ క్లెయిమ్ చరిత్ర గురించి పూర్తి సమాచారాన్ని మీరు ఇన్సూరర్‌కు అందించవలసి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడంలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదు. 

రెండు వేర్వేరు ఇన్సూరెన్స్ కంపెనీల నుండి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కొనుగోలు చేయడం మంచి ఆలోచన?

మీరు వివిధ ఇన్సూరెన్స్ సంస్థల నుండి అదే కవరేజ్ ప్లాన్‌లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, అది భిన్నంగా ఏమి ఉండదు. అందువల్ల, మీరు రెండు విభిన్న ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందించబడిన రెండు కవరేజ్ ప్లాన్‌ల మధ్య వ్యత్యాసాన్ని పరిగణించాలి మరియు మీ అవసరాలకు సరిపోయే ప్లాన్‌లు మరియు కంపెనీలను ఎంచుకోవాలి. వివిధ ఇన్సూరెన్స్ సంస్థల నుండి రెండు విభిన్న కవరేజీలను కొనుగోలు చేయడం అనేది తీవ్రమైన అత్యవసర వైద్య పరిస్థితులలో మీకు సహాయపడగలదు.

ఏదైనా ప్రతికూల చరిత్ర విషయంలో ప్రీమియంపై ఏదైనా లోడింగ్ ఉంటుందా?

ఏదైనా ప్రతికూల వైద్య చరిత్ర ఉంటే, IRDAతో ఫైల్ చేయబడిన ప్రోడక్ట్ యొక్క ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం లోడింగ్ అప్లై చేయబడవచ్చు.

పోర్టబిలిటీ అభ్యర్థనలను తిరస్కరించడానికి కారణాలు

  • పూర్తి సమాచారం లేకపోవచ్చు.
  • డాక్యుమెంట్లను సమర్పించడంలో ఆలస్యం కావచ్చు లేదా సమర్పించిన డాక్యుమెంట్లలో ఒక లోపం ఉండవచ్చు.
  • క్లెయిమ్స్ చరిత్ర, మెడికల్ ప్రొఫైలింగ్, మునుపటి ఇన్సూరెన్స్ కంపెనీ కవరేజ్‌లో వ్యత్యాసం మరియు కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ ఎంచుకున్న ప్రోడక్ట్ కారణంగా అండర్‌రైటింగ్ తిరస్కరణ.
  • హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అభ్యర్థనలను తిరస్కరించడానికి మరొక కారణం పాలసీ రెన్యూవల్‌లో విరామం కావచ్చు.
  • ప్రమాణాల కంటే వయస్సు ఎక్కువగా ఉంటే.

పోర్టింగ్ బదులుగా, నేను నా ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో నా ప్లాన్‌ను మార్చవచ్చా?

అవును, ఎందుకంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ సమయంలో మీరు ప్లాన్ మరియు కవరేజ్ మార్పులు చేయవచ్చు. ఈ మార్పులు చేయడానికి మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేయవలసిన అవసరం లేదు. 

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

4.75

(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

విక్రమ్ అనిల్ కుమార్

నా హెల్త్ కేర్ సుప్రీమ్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి, మీరు అందించిన సహకారానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు. 

ప్రిథ్బీ సింగ్ మియాన్

లాక్‌డౌన్ సమయంలో కూడా మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ సర్వీస్. కాబట్టి నేను ఎక్కువ కస్టమర్‌లకు బజాజ్ అలియంజ్ హెల్త్ పాలసీని విక్రయించాను

అమగొంద్ విట్టప్ప అరకేరి

బజాజ్ అలియంజ్ వారి అద్భుతమైన, ఇబ్బందులు లేని సేవలు, కస్టమర్ల కోసం ఫ్రెండ్లీ వెబ్‌సైట్, అర్థం చేసుకోవడం సరళం మరియు ఆపరేట్ చేయడం సులభం. కస్టమర్‌లకు పూర్తి ఆనందంతో మరియు ఉత్సాహంతో సేవలు అందిస్తున్నందుకు మీ బృందానికి ధన్యవాదాలు ...

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం