భారతదేశంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తప్పనిసరిగా మార్చాయి. పాలసీదారు స్వయంగా ఎలాంటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా, క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అన్ని మెడికల్ బిల్లులను నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీతో సెటిల్ చేయడానికి వీలు కల్పిస్తాయి.
క్యాష్‌లెస్ చికిత్స పాలసీలు అనేవి హాస్పిటలైజేషన్ సమయంలో పాలసీదారునికి ఆర్థిక ఉపశమనాన్ని అందించే ఏకైక ఉద్దేశ్యంతో రూపొందించబడ్డాయి.
క్యాష్‌లెస్ చికిత్స ఎలా పనిచేస్తుంది?
చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంపానెల్ చేయబడిన ఒక హాస్పిటల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి, ఇక్కడ క్యాష్‌లెస్ మెడిక్లెయిమ్ పాలసీలతో ఇన్సూర్ చేయబడిన వ్యక్తులు చికిత్స కోసం ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు. ఛార్జీలను ఇన్సూరెన్స్ సంస్థ నేరుగా హాస్పిటల్‌కు చెల్లిస్తుంది.
క్యాష్‌లెస్ చికిత్సలో రకాలు
ప్లాన్ చేసిన క్లెయిమ్ - ప్లాన్ చేయబడిన క్లెయిమ్‌లో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి హాస్పిటలైజేషన్ గురించి రెండు-మూడు రోజుల ముందుగానే తెలుసుకుంటారు. అలాంటి క్లెయిమ్‌లలో షెడ్యూల్ చేసిన చికిత్స కోసం, కనీసం కొన్ని రోజులకు ముందుగా హాస్పిటల్ నుండి ప్రీ-ఆథరైజేషన్ ఫారమ్‌ను తీసుకోవాల్సిందిగా అతనిని కోరడం జరుగుతుంది.
ఎమర్జెన్సీ క్లెయిమ్ - అకస్మాత్తుగా తీవ్రమైన వ్యాధి లేదా అనారోగ్య పరిస్థితి నెలకొన్నపుడు, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కోసం తక్షణ హాస్పిటలైజేషన్ అవసరమైతే, దానిని ఎమర్జెన్సీ క్లెయిమ్ అంటారు.
క్యాష్‌లెస్ చికిత్స ప్రయోజనాలు
✓ వైద్య అత్యవసర పరిస్థితులలో మద్దతుగా ఉంటుంది
✓ ఉపశమనం కల్పిస్తుంది
✓ విస్తృత శ్రేణి కవరేజీని అందిస్తుంది
✓ ప్రయాణ సమయాల్లో మీ ఆరోగ్యాన్ని సురక్షితం చేస్తుంది
✓ పన్ను ప్రయోజనాలను అందిస్తుంది
క్యాష్‌లెస్ చికిత్సను పొందడానికి ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు
✓ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో మాత్రమే క్యాష్‌లెస్ చికిత్స సదుపాయం అందుబాటులో ఉంది.
✓ క్యాష్‌లెస్ క్లెయిములు తిరస్కరించబడితే, మీరే స్వయంగా మీ హాస్పిటల్ ఖర్చులను చెల్లించాలి, తదుపరి రీయింబర్స్మెంట్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
✓ ఇన్సూరెన్స్ కంపెనీ/ టిపిఎకు సకాలంలో సమాచారాన్ని చేరవేయడం తప్పనిసరి.
✓ ఇన్సూరెన్స్ కంపెనీ/ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టిపిఎ)కు అవసరమైనపుడు అందించడానికి, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఒరిజినల్ డాక్టర్ రిపోర్టులు మరియు ప్రిస్క్రిప్షన్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
✓ క్యాష్‌లెస్ సెటిల్మెంట్ను పొందడానికి, హాస్పిటలైజేషన్ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డును చూపించడం తప్పనిసరి.
✓ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి దాని స్వంత నిబంధనలు, షరతులు ఉంటాయి; కావున, పాలసీ వర్డింగ్స్ను జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం.
క్యాష్‌లెస్ చికిత్స కింద మినహాయింపు
✓ సర్వీస్ ఛార్జీలు
✓ రిజిస్ట్రేషన్ ఫీజు లేదా అడ్మిషన్ ఫీజు
✓ ఆక్సిజన్ మాస్క్‌లు, సిరంజిలు, డైపర్లు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు.
✓ టాయిలెట్రీస్
✓ అటెండెంట్ ఫీజు
మరిన్ని అన్వేషించండి: హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి