Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్

Cheap Travel Insurance Online

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ కోసం మీ వివరాలను అందించండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

భారతదేశంలో చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

కొత్తగా-పెళ్లైన రవి మరియు రీటా అమెరికాలో వారి హనీమూన్ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి వాళ్లిద్దరికీ తెలుసు. కాబట్టి, ఒకటి తీసుకున్నారు. అయితే, వాళ్లు అక్కడకు చేరుకున్న తర్వాత, వారి లగేజీ చికాగో విమానాశ్రయంలో చిక్కుకుందనీ, మర్నాడు అది వారి చేతికి అందుతుందని వారికి తెలియజేయబడింది.

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజీ ఆలస్యమైనప్పుడు వారి పాలసీ కవరేజీ అందించదని మరియు వారికి జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించబడదని జంట తెలుసుకున్నప్పుడు వారి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆన్‌లైన్‌లో చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ద్వారా వారికి కొంత డబ్బు ఆదా అయ్యింది కానీ అవసరం అయిన సందర్భంలో ఉపయోగపడలేదు!

Lured by cheap travel insurance offers, Ravi and Rita had overlooked the fine print which specified coverage details. The story of this couple highlights the importance of choosing a ట్రావెల్ ఇన్సూరెన్స్ policy offering a comprehensive coverage against nasty surprises that might crop up anytime during your journey abroad.

తక్కువ ఖర్చు అయ్యే ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసే సమయంలో గమనించవలసిన అంశాలు

ఏదైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే సమయంలో, 1 నుండి 3 వరకు ఉండే స్కేల్‌ పై మీరు అత్యంత ముఖ్యమైన అంశంగా దేనికి రేటింగ్ ఇస్తారు? ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు సమయంలో మేము వాటిని 3సి లుగా పేర్కొంటాము, అవి కవరేజ్, కస్టమర్ సపోర్ట్ మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్!


మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీద మీరు మంచి డీల్ ఇష్టపడతారని మేము అర్థం చేసుకున్నాము. అయితే, మీ బ్రౌజర్‌లో 'చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు' అని టైప్ చేయడానికి బదులుగా, తక్కువ ఖర్చు ఆధారంగా ప్లాన్‌లను ఎలా మూల్యాంకన చేయాలనే విషయం అర్థం చేసుకోవడం కోసం కొన్ని నిమిషాలు వెచ్చించాల్సిందిగా మేము సూచిస్తున్నాము.


చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లనేవి మీ అవసరాలను పూర్తిగా తీర్చలేవు, ప్రత్యేకించి మీరు బోలెడంత లగేజీ మరియు పిల్లలతో సహా విదేశీ ప్రయాణానికి వెళ్లినప్పుడు, అవసరం అయ్యే కవరేజీ అందించదు!


కాబట్టి, 360-డిగ్రీల రక్షణ అందించే పాలసీని ఎంచుకోవడం తప్పనిసరి. చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు కొనుగోలు చేయడం ద్వారా, మీరు భారం తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పుడు మీరు వివిధ రకాల ప్రయాణ ప్రమాదాల వలన నష్టపోయే అవకాశం ఉంది.


ఇలాంటప్పుడే మనకో ప్రశ్న ఎదురవుతుంది. అది: నా అవసరాల కోసం నాకు బాగా సరిపోయే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి? ఇందులో ప్రీమియం అత్యంత ముఖ్యమైన అంశం అవ్వచ్చు. ఎందుకంటే, చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎవరు మాత్రం కాదనుకుంటారు? అయితే, రవి మరియు రీటా ఎదుర్కొన్న అనుభవాల నేపథ్యంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకునే సమయంలో మీరు దాని కోసం ఎంత చెల్లించాలనే విషయమే కాకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి.


మరింత తెలుసుకోవడానికి చదవండి.

అందించబడే కవరేజ్

అన్ని ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఒకే విధంగా రూపొందించబడవు. చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మీ చూపును ఆకర్షించవచ్చు. కానీ, కొనుగోలు చేసే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ప్లాన్ అందించే కవరేజీని అర్థం చేసుకోవడానికి పాలసీలోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. ఉదాహరణకు, దొంగతనం, బ్యాగేజీ కోల్పోవడం లేదా విమాన ఆలస్యాల కోసం కొన్ని ప్లాన్‌లు కవరేజీ అందించవచ్చు. కానీ, బ్యాగేజీ ఆలస్యంగా వచ్చినప్పుడు అవి కవరేజీ అందించకపోవచ్చు.

కాబట్టి, ఏదైనా ఔషధం లేదా ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు గడువు తేదీని తనిఖీ చేసే విధంగానే, కవరేజీ పొందే సంఘటనలు మరియు పరిస్థితులు అర్థం చేసుకోవడం కోసం పాలసీని క్షుణ్ణంగా పరిశీలించండి.

గాయాలు, మరణం మరియు వైద్య అత్యవసర పరిస్థితులే కాకుండా మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోండి

రూపం లేదా ఇంజిన్ సామర్థ్యం ఆధారంగా మాత్రమే మీరు కారు కొనుగోలు చేస్తారా? రూపం మరియు ఇంజిన్ సామర్థ్యం ముఖ్యమే కానీ, కారు కొనుగోలుకు అవి మాత్రమే సరిపోవు. అదేవిధంగా, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు, గాయాలు, మరణం లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో అందించబడే కవరేజీ మాత్రమే కాకుండా, మరిన్ని అంశాలను పరిశీలించాలి.

విమానం ఆలస్యం కావడం, పాస్‌పోర్ట్ మరియు అవసరమైన డాక్యుమెంట్‌లు పోగొట్టుకోవడం, ట్రిప్ రద్దు కావడం మరియు అత్యవసర నగదు ప్రయోజనం లాంటి వాటి కోసం పరిహారం అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ, ట్రిప్ రద్దు అవ్వడం కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయంగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్లప్పుడూ మెరుగైన ఎంపిక కాదు!

ఉదాహరణకు, ఎమర్జెన్సీ క్యాష్ అడ్వాన్స్ అనేది మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో ఒక ముఖ్యమైన ఫీచర్‌గా ఉంటుంది. దీనిప్రకారం, లగేజీ దొంగతనం మరియు దోపిడీ లాంటి సందర్భంలో మేము మీకు అత్యవసర నగదు అందిస్తాము.

ఆన్-సపోర్ట్ కాల్

అవసరమైన డాక్యుమెంట్‌లు పోగొట్టుకున్న కారణంగా మీరు మీ ప్రియమైన వారితో విదేశంలో చిక్కుకుపోయినట్లు ఊహించుకోండి. పరిస్థితిని కొంచెం మారుద్దాం. అటువంటి సందర్భంలో మిమ్మల్ని గైడ్ చేయడానికి మీ వైపు ఒక స్నేహితుడిని ఊహించుకోండి. ఇదివరకటి కంటే ఇప్పుడు మీరు ఎక్కువ ప్రశాంతంగా ఉన్నారు కదా?

మీరు తక్కువ ఖర్చు అయ్యే ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు, ప్రపంచంలోని ఏదైనా భాగం నుండి 24X7 క్లెయిమ్స్ మద్దతు అందుబాటులో ఉంటుందని నిర్ధారించుకోండి. ఏదైనా అత్యవసర పరిస్థితిని సానుకూలంగా మార్చడంలో అది మీకు సహాయపడుతుంది.

ఉదాహరణకు, మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో, మీరు +91-124-6174720కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ప్రపంచంలో ఎక్కడినుండైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. అవసరమైన సమయాల్లో, మీరు ఎల్లప్పుడూ ఒక స్నేహపూర్వక, ఆత్మవిశ్వాసంతో కూడిన స్వరాన్ని వినవచ్చు.

విశ్లేషణ చేసే ఓపిక మీకు లేకపోతే, ఇది మీకొక గొప్ప సహాయకారిగా ఉంటుంది!

క్లెయిమ్‌ల ప్రాసెస్

ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది అత్యంత కీలకమైన అంశంగా ఉంటుంది. దేశంలోని ప్రముఖ ఇన్సూరర్‌లలో ఒకటిగా, బజాజ్ అలియాంజ్ మీ క్లెయిమ్‌లను త్వరగా మరియు సమర్థవంతంగా అందించడానికి కృషి చేస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో సరిపోల్చే సమయంలో, ప్రాసెస్ ఎంత సులభంగా ఉంటుంది లేదా అవాంతరాలు లేనిదిగా ఉంటుందా అనే అంశాలతో పాటు దాని కోసం అవసరమైన డాక్యుమెంట్‌లను చెక్ చేయండి.

విషయాన్ని స్పష్టంగా వివరించాలంటే, చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు మీరు పరిగణనలోకి తీసుకునే ప్రాథమిక అంశం డబ్బును ఆదా చేయడం అయితే, బజాజ్ అలియాంజ్ వద్ద క్లెయిమ్‌ల ప్రాసెస్ మీకు మరొక విలువైన అంశాన్ని పొదుపు చేయడానికి రూపొందించబడిం, అదే - సమయం!

At Bajaj Allianz, we believe in making the entire claims journey a smooth ride. With our Travel Insurance Plan, you can register your claim by sending an email to travel@bajajallianz.co.in or calling our Toll-free number <an1> Quick, efficient and seamless to say the least.

మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద పెద్ద మొత్తంలో ఎలా ఆదా చేసుకోవచ్చు?

పొదుపు - చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు గొప్ప ఆకర్షణకి కారణం. మీ వాలెట్ షేర్ కోసం, పోటీపడే అనేక ప్రాధాన్యతలు ఇందులో ఉంటాయి. మీరు పెట్టే ఖర్చుకు గొప్పగా ప్రయోజనం అందుకోవాలని మీరు కోరుకోవడం సహజమే. అయితే, ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని ప్రాథమిక అంశాల గురించి మంచి అవగాహన లేకుంటే, మీ జేబు మీద భారం పడే అవకాశం లేకపోలేదు.

అయితే, ధైర్యం కోల్పోకండి! మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీద పొదుపు చేయడమనేది మీరు ఊహించినంత కష్టమేమీ కాదు. ఈ సులభమైన చిట్కాలతో మీరు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల భారాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు:

మీకు సౌకర్యవంతమైన స్థాయిలో కవర్‌ను ఎంచుకోండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలనేవి సాధారణంగా మూడు రకాల కవరేజీలు అందిస్తాయి, అవి బేసిక్, అడ్వాన్స్‌డ్ మరియు కాంప్రిహెన్సివ్. ప్రతి రకంతో, లభించే ప్రయోజనాలు పెరుగుతాయి మరియు దానికి తగ్గట్టే ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి, మీకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే కవర్ స్థాయిని ఎంచుకోవడం ముఖ్యం.

ఉదాహరణకు, మూడు రకాల కవర్‌లు మీకు వైద్య అత్యవసర పరిస్థితులు లేదా ట్రిప్ రద్దు కోసం కవరేజీ అందిస్తాయి. అయితే, బ్యాగేజ్ రావడంలో ఆలస్యం జరిగిన సందర్భంలో అవన్నీ ఒకేలా పరిహారం అందించకపోవచ్చు. కాబట్టి, మీకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే కవర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

సమగ్ర కవరేజీ అనేది మీకు మనశ్శాంతి అందిస్తుందని భావిస్తే, దానినే ఎంచుకోండి లేదా కొన్ని దుర్ఘటన సందర్భాల్లో ప్రాథమిక కవర్ అందించే పాలసీ ఎంచుకోండి.

మీకు అవసరం లేని యాడ్-ఆన్‌లు నివారించండి

బ్యాగేజీ ఎక్కువయ్యే కొద్దీ మీ చేతుల మీద భారం పెరిగే విధంగానే మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీకి యాడ్-ఆన్‌లు ఎక్కువయ్యే కొద్దీ మీ ప్రీమియం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, మీకు అవసరం లేని యాడ్-ఆన్‌లు నివారించడమనేది మీ ప్రీమియంలు తగ్గించుకోవడానికి ఒక సమర్థవంతమైన మార్గంగా ఉంటుంది.

ఉదాహరణకు, సాహస క్రీడల కోసం ఎలాంటి అవకాశం లేని ప్రదేశాన్ని మీరు సందర్శిస్తున్న పక్షంలో, మీ ట్రావెల్ పాలసీతో కలిసి ఉన్న అడ్వెంచర్ స్పోర్ట్స్ కవర్ వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదేవిధంగా, మీ వెంట ఖరీదైన వస్తువులు ఏవీ తీసుకెళ్లనప్పుడు, అధిక-విలువ వ్యక్తిగత ఐటమ్‌ల కవర్ వల్ల మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఆన్‌లైన్‌లో కొనండి

ఈ డిజిటల్ యుగంలో, మీరు అన్ని వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయగలిగినప్పుడు, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రం ఎందుకు కొనుగోలు చేయకూడదు? నిజానికి, ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం ద్వారా, మీరు మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా దానిని కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. అలాగే, ఇన్సూరర్ పంపిణీ ఖర్చుల మీద పొదుపు చేస్తారు కాబట్టి, మీకు డిస్కౌంట్‌లు కూడా లభిస్తాయి.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు, ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి మీరు మీ ఇన్సూరర్ కార్యాలయంలో క్యూలో నిలబడాల్సి వచ్చేది. నేడు, దాన్ని తీసుకోవడానికి ప్రాథమిక ప్రమాణాలు - ఖర్చు, కవరేజీ, కంపెనీ మొదలైనవి ఎంచుకోవడం మాత్రమే! మీరు ఎంచుకోవడానికి వీలుగా అనేక రకాల చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి!

ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడమనేది అందరికీ లాభం చేకూర్చే ఒక పరిష్కారం. ఒక వినియోగదారునిగా, మీరు ఆకర్షణీయమైన ధరల్లో లభించే అనేక ఉత్పత్తుల (చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి చదవండి!) నుండి మరియు టాప్ రేటెడ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లను ఎంచుకోవచ్చు. ఇంతకంటే ఏం చెప్పాలి!

సాధ్యమైన ఏవైనా ఆఫర్ల గురించి తెలుసుకోవడం కోసం ఇన్సూరర్‌ల న్యూస్‌లెటర్ల కోసం కూడా మీరు సైన్ అప్ చేయవచ్చు. అదే సమయంలో, అది మీకు సరైనదా, కాదా అని నిర్ణయించడానికి డిస్కౌంట్ చేయబడిన పాలసీ ఫీచర్‌లు చెక్ చేయండి.

మల్టీ-ట్రిప్ పాలసీ పొందండి

సుదూర ఖండాలకు ప్రయాణించాల్సిన వృత్తిలో ఉండడం వల్ల మీరు తరచూ ప్రయాణించాల్సిన అవసరం ఉంటోందా? అవును అయితే, ప్రీమియంల భారం తగ్గించుకోవడానికి మల్టీ-ట్రిప్ పాలసీ మీకు ఉత్తమమైనది. అటువంటి పాలసీ కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాకుండా, ఒక సంవత్సరంలో చేసిన అన్ని ట్రిప్‌లను కవర్ చేస్తుంది.

ఒక బహుళ ఎంట్రీ వీసా లాగే, చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ విషయంలో ఇది మీకు ఉత్తమమైనది కావచ్చు. మీరొక కార్పొరేట్ ప్రయాణీకుడైతే, మీ నెలవారీ వ్యాపార ఖర్చులను సంతృప్తిపరచడాన్ని కూడా ఇది సులభతరం చేస్తుంది.

కాబట్టి, ప్రతిసారీ ప్రత్యేక పాలసీలు కొనుగోలు చేయడానికి బదులుగా, ఒక మల్టీ-ట్రిప్ పాలసీని ఎంచుకోండి. ఇది మీ ఆర్ధిక భారాన్ని చాలా తగ్గిస్తుంది. సంతోషంగా ప్రయాణించండి!

మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు పొందే కవరేజ్

మన ప్రయాణంలో కొన్ని రిస్కులు తీసుకున్నప్పుడే మన జీవితంలోని కొన్ని ఉత్తమ క్షణాలను ఆస్వాదిస్తాము. బజాజ్ అలియాంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మేము మీ వెన్నంటే ఉన్నామనే ధైర్యంతో మీరు ముందడుగు వేయచ్చు. మీ ట్రావెల్ కవర్ నుండి మీరు ఎక్కువ ప్రయోజనం పొందడానికి మేము మీకు ఎలా సహాయపడతామో ఇక్కడ తెలుసుకోండి:
Baggage Covers

బ్యాగేజ్ కవర్లు

బ్యాగేజ్ లాస్ కింద, మీరు ప్రయాణిస్తున్న సమయంలో సామానుని శాశ్వతంగా కోల్పోయినందుకు, స్టోర్ చేయబడే చెక్-ఇన్ లగేజ్ ఆధారంగా మీకు పరిహారం చెల్లించబడుతుంది. మరింత చదవండి

బ్యాగేజ్ లాస్ కింద, మీరు ప్రయాణిస్తున్న సమయంలో సామానుని శాశ్వతంగా కోల్పోయినందుకు, స్టోర్ చేయబడే చెక్-ఇన్ లగేజ్ ఆధారంగా మీకు పరిహారం చెల్లించబడుతుంది. లగేజ్ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో వదిలేసినట్లు, నిరాశకు గురవుతారు, కాని లగేజ్ కవర్ మీకు అవసరమైన ఖర్చులను భరించటానికి అనుమతిస్తుంది మరియు అవి పాలసీ పరిధిలో ఉంటాయి.

Baggage Delay:

హాస్పిటలైజేషన్‍కు ముందు మరియు తరువాతి ఖర్చులు

ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీలో, లగేజ్ ఆలస్యం కోసం పరిహారం చెల్లించబడుతుంది మరింత చదవండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీలో, ధరించిన బట్టలు, టాయిలెటరీస్, ఇతర నిత్యావసరాలు వంటి వస్తువులు ఉన్న లగేజ్ ఆలస్యం కోసం పరిహారం చెల్లించబడుతుంది. మనకు అవసరమైనపుడు, లగేజ్ ఆలస్యం వలన ఒత్తిడి పెరుగుతుంది మరియు కొన్నిసార్లు చివరికి లగేజ్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. .

Flight Delay

విమాన ఆలస్యం

విమాన ఆలస్యం మరియు కొత్త విమానాన్ని తిరిగి బుక్ చేసే పరిస్థితులలో, సాధ్యమైతే ప్లాన్ చేయబడని అదనపు ఖర్చులకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పరిహారం చెల్లించబడుతుంది లేదా బుక్ చేయబడుతుంది మరింత చదవండి

విమాన ఆలస్యం మరియు కొత్త విమానం కోసం రీ-బుకింగ్ చేసుకునే సందర్భాల్లో, ఒక ప్లాన్ లేకుండా అయ్యే అదనపు ఖర్చులకు ఇన్సూరెన్స్ సంస్థ వీలైతే పరిహారం చెల్లిస్తుంది లేదా భర్తీ చేస్తుంది. కొన్ని సమయాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆలస్యం అయితే మీ కోసం కొత్త ఫ్లైట్ బుక్ చేసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది కానీ, మీరు ఆ విషయాన్ని ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది.

Trip Cancellation/ Curtailment

ట్రిప్ రద్దు / తగ్గింపు

పలురకాల కారణాలు ట్రిప్ రద్దు లేదా ప్రయాణం కుదింపునకు దారితీయవచ్చు. మరింత చదవండి

పలురకాల కారణాలు ట్రిప్ రద్దు లేదా ప్రయాణం కుదింపునకు దారితీయవచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీ టిక్కెట్ ఖర్చులు కవర్ చేయబడతాయని హామీ లభిస్తుంది మరియు మీరు రీయంబర్స్ మొత్తాన్ని కూడా పొందవచ్చు. మీరు బుక్ చేసిన టికెట్లు నాన్ రిఫండబుల్ అయినప్పుడు, అటువంటి కవర్ మరింత ముఖ్యమైనది.

అల్లర్లు, నిరసనలు, సమ్మెలు, ప్రకృతి వైపరీత్యాలు, కుటుంబంలో మరణం, చెడు వాతావరణం మొదలైనవి. ఏదైనా అత్యవసర పరిస్థితి ట్రిప్ రద్దు లేదా కుదింపునకు దారితీస్తుంది. కానీ, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు టికెట్ ఖర్చుల కోసం రీయంబర్స్‌మెంట్‌ని పొందవచ్చు.

Bounced Flight/ Hotel Booking

బౌన్స్ అయిన ఫ్లైట్/ హోటల్ బుకింగ్

ఇలాంటి పరిస్థితిలో, ప్రయాణికులు ఇంతకు మునుపే బుక్ చేసుకున్న హోటల్స్ లేదా ఫ్లైట్ సీట్లు, రాగానే మనకు అందుబాటులో ఉండకపోవడం. మరింత చదవండి

ఇలాంటి పరిస్థితిలో, ప్రయాణికులు ఇంతకు మునుపే బుక్ చేసుకున్న హోటల్స్ లేదా ఫ్లైట్ సీట్లు, చేరుకోగానే మనకు అందుబాటులో ఉండకపోవడం. అటువంటి సందర్భాలలో, మీకు ఇష్టమైన వసతులు అందుబాటులో లేకపోతే, ఇన్సూర్ చేసిన వ్యక్తి ముందుగా బుక్ చేసుకున్న హోటల్ గదికి లేదా ఎయిర్‌లైన్స్ బుకింగ్స్ కోసం రీయంబర్స్‌మెంట్‌ని పొందవచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఎంచుకున్నట్లయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మీరు క్లెయిమ్ చేయవచ్చు.

Loss of Passport

పాస్‌పోర్ట్ నష్టం

మీ బ్యాగ్ దొంగిలించబడి, మీ పాస్‌పోర్ట్‌ను కోల్పోయినను, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలో మీరు సురక్షితంగా ఉంటారు. మరింత చదవండి

మీ బ్యాగ్ దొంగిలించబడి, మీ పాస్‌పోర్ట్‌ను కోల్పోయినను, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలో మీరు సురక్షితంగా ఉంటారు. ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం పరిమితి వరకు, కొత్త పాస్‌పోర్ట్‌ని పొందడానికి అయ్యే ఛార్జీలను భీమా సంస్థ భరిస్తుంది.

Hijacking

హైజాకింగ్

అరుదైన సందర్భాల్లో అనగా ఒక ట్రిప్ సమయంలో మీ విమానం హైజాక్ అయినట్లయితే, పాలసీ యొక్క ఈ కవర్‌ని కలిగి ఉండటం వలన మీ మానసిక ఒత్తిడికి పరిహారాన్ని పొందవచ్చు. మరింత చదవండి

అరుదైన సందర్భాల్లో అనగా ఒక ట్రిప్ సమయంలో మీ విమానం హైజాక్ అయినట్లయితే, పాలసీ యొక్క ఈ కవర్‌ని కలిగి ఉండటం వలన మీ మానసిక ఒత్తిడికి పరిహారాన్ని పొందవచ్చు. ఈ రకమైన పాలసీ కవర్‌లు సాధారణంగా పాలసీదారుల చేత ఎంపిక చేయబడవు కానీ, తెలియని గమ్యస్థానాలకు ప్రయాణించేటప్పుడు, ఈ కవర్‌ను కలిగి ఉండటం అత్యంత మేలుని చేకూరుస్తుంది.

Credit Card Theft

క్రెడిట్ కార్డ్ దొంగతనం

క్రెడిట్ కార్డ్ థెఫ్ట్ అనేది విదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఉండాల్సిన ఒక కవర్. మరింత చదవండి

క్రెడిట్ కార్డ్ థెఫ్ట్ అనేది విదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఉండాల్సిన ఒక కవర్. మీ క్రెడిట్ కార్డు దొంగిలించబడినప్పుడు లేదా పోగొట్టుకున్నపుడు, వెంటనే మీ ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయండి. ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు తెలియజేయడం వల్ల మీకు అత్యవసర నగదు అడ్వాన్స్‌ని స్వీకరించడానికి అర్హత ఉంటుంది. దాని వివరాలు కన్సల్టింగ్ ఏజెంట్ మీకు అందిస్తారు లేదా ఆ సమాచారం లబ్ధిదారునికి తగిన విధంగా చేరవేయబడుతుంది.

Home Burglary

ఇంటి దోపిడీ

Under this point of the travel insurance coverage, if you are out on a vacation or a business trip Read more

మీరు సెలవులో లేదా వ్యాపార పర్యటనలో ఉన్నపుడు మీ ఇల్లు కూల్చివేయబడి ఉంటే, ఇలాంటి ఒక దశలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు ఆ దోపిడీ వల్ల కలిగిన నష్టాలకు మరియు డ్యామేజీలకు పరిహారాన్ని చెల్లిస్తుంది. అయితే, మీరు అందుకునే బీమా పాలసీ మొత్తం, మీ కవర్ యొక్క పరిమితిపై ఆధారపడి ఉంటుంది

Personal Liability

వ్యక్తిగత బాధ్యత

పర్సనల్ లయబిలిటీ నిబంధన మీపై శారీరక గాయం కోసం చేసిన క్లెయిమ్ నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది, మరింత చదవండి

పర్సనల్ లయబిలిటీ కవర్ యొక్క నిబంధన, శారీరక గాయాలు, ఆస్తికి నష్టం లేదా ట్రిప్‌లో మరొక వ్యక్తికి నష్టం కలిగించినందుకుగాను మీపై దాఖలు అయిన దావా నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది. మీ ఇంటి భద్రత నుండి మీరు దూరంగా ఉన్నప్పుడు, తెలియని చోట క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం చాలా కష్టం. పర్సనల్ లయబిలిటీ కవర్ మిమ్మల్ని ఇలాంటి ఊహించని మరియు ప్రేరేపించని పరిస్థితుల నుండి సురక్షితం చేస్తుంది.

Medical Covers

మెడికల్ కవర్లు

ట్రిప్ సమయంలో జరిగిన వ్యక్తిగత గాయాలకు పరిహారం చెల్లించబడుతుంది లేదా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఖర్చులు చూసుకోబడతాయి మరింత చదవండి

ట్రిప్ సమయంలో జరిగిన వ్యక్తిగత గాయాలు కవర్ చేయబడతాయి లేదా ఆ ఖర్చులను ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. డ్రగ్స్, మధ్యపానం వంటి మాదకద్రవ్యాల ప్రభావంతో తగిలిన గాయాలు కవర్ చేయబడవు.

Interruption of Studies

చదువులో అంతరాయం

స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద, అనేక ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మీరు చెల్లించే ఖర్చులు మరియు వ్యయాలను కవర్ చేస్తారు మరింత చదవండి

స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద చాలా మంది ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లు, విదేశాలలో అధ్యయనాల కోసం మీరు చెల్లించే ఖర్చులు మరియు ఫీజులను భరిస్తారు. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి తన ఇన్‌స్టిట్యూట్‌కు ముందుగానే చెల్లించిన ట్యూషన్ ఫీజును, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ వ్యక్తికి రీయంబర్స్ చేస్తాయి.

Dental Treatment

దంత చికిత్స

రెగ్యులర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అత్యవసరమైన వైద్య తరలింపును కవర్ చేస్తుంది. మరింత చదవండి

రెగ్యులర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అత్యవసరమైన వైద్య తరలింపును కవర్ చేస్తుంది. ఇది ఎయిర్‌లిఫ్ట్ లేదా వైద్యం కోసం అమర్చిన విమాన పరికరాలను స్వదేశానికి తిరిగి పంపడానికి అయ్యే ఖర్చును కలిగి ఉంటుంది.

Accidental Death

ప్రమాదం కారణంగా మరణం

ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో యాక్సిడెంటల్ డెత్ కవర్ చాలా ముఖ్యమైన అంశం. మరింత చదవండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో యాక్సిడెంటల్ డెత్ కవర్ చాలా ముఖ్యమైన అంశం. విదేశాల్లో ప్రయాణించే పాలసీదారుని యొక్క కుటుంబ సభ్యుడు లేదా అతనితో సంబంధం ఉన్న ఎవరైనా వ్యక్తి, వారి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ ప్రమాదవశాత్తు మరణం అనే నిబంధనను పాలసీలో చేర్చాలి. ఈ కవర్‌లో ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరణించిన వారి కుటుంబానికి బీమా చేసిన మొత్తం పరిమితి వరకు పరిహారం ఇవ్వబడుతుంది.

చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

Sonal Gopujkar

సోనాల్ గోపుజ్‌కర్

అద్భుతమైన ప్రాసెస్! ఉపయోగించడానికి చాలా సులభం మరియు ఫలితం వెంటనే లభిస్తుంది

Ushaben Pipalia

ఉషాబెన్ పిపాలియా

చాలా వేగవంతమైన మరియు ప్రొఫెషనల్ సర్వీస్. బజాజ్ అలియంజ్ యొక్క కస్టమర్ సర్వీస్ బృందం సేవతో ఆనందంగా ఉన్నాను.

K.V.Rangareddy

కె.వి.రంగారెడ్డి

చక్కటి మరియు కస్టమైజ్ చేయబడిన వెబ్‌సైట్. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ అనుభూతి బాగుంది.

ప్రముఖ దేశాల కోసం వీసా మార్గదర్శకాలు


 Written By : Bajaj Allianz - Updated: <n1>th April <n2>

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం