Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ: పర్సనల్ గార్డ్

ఊహించని ప్రమాదాల కోసం పూర్తి రక్షణ

Personal accident insurance policy by Bajaj Allianz

మీకు మరియు మీ కుటుంబం కోసం సమగ్ర యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్

మీ ప్రయోజనాలను పొందండి

పిల్లల విద్యా ప్రయోజనం

ఆసుపత్రిలో నిర్బంధ భత్యం

ప్రమాదవశాత్తు జరిగిన గాయం కవర్

బజాజ్ అలియంజ్ పర్సనల్ గార్డ్ ఎందుకు ఎంచుకోవాలి?

మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి ఒక ప్రమాదానికి 60 సెకన్ల కంటే తక్కువ సమయం పట్టవచ్చు. ఇది మీకు లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా; ఎక్కడైనా మరియు ఏ సమయంలోనైనా జరగవచ్చు మరియు మీరు దాని కోసం సిద్ధంగా ఉండాలి. ఊహించలేని భవిష్యత్తులో మన కోసం ఏమి దాగి ఉందో మనకు తెలియదు కానీ దానిని ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవచ్చు.

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద మేము, దీనిని అర్థం చేసుకున్నాము మరియు ఏవైనా ఊహించని ప్రమాదాల పరిణామాల నుండి మిమ్మల్ని కవర్ చేయడానికి మా పర్సనల్ గార్డ్ ఇన్సూరెన్స్ పాలసీ రూపొందించబడింది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీ వైద్య బిల్లులను చెల్లించడం, పిల్లల విద్య ప్రయోజనం మరియు మరెన్నో అందించడం ద్వారా మీ జీవితాన్ని సాధారణ స్థితికి తిరిగి తీసుకురావడానికి మీకు సహాయపడుతుంది.

మా పర్సనల్ గార్డ్ పాలసీతో మీ ఆర్థిక భద్రత సురక్షితమైన చేతులలో ఉంది, ప్రమాదాల వలన కలిగే శారీరక గాయం, వైకల్యం లేదా మరణం నుండి మీకు మరియు మీ కుటుంబానికి రక్షణను అందిస్తుంది.

ఈ పాలసీ కింద అందుబాటులో ఉన్న వివిధ రకాల కవర్లను అర్థం చేసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

Sl / వయస్సు

ప్రాథమిక

వైడర్

సమగ్రమైన

మరణం

     

శాశ్వత పూర్తి వైకల్యం

     

శాశ్వత పాక్షిక వైకల్యం

     

తాత్కాలిక పూర్తి వైకల్యం

     

పిల్లల విద్య బోనస్

     

ఇన్సూర్ చేయబడిన మొత్తం

     

వైద్య ఖర్చులు + హాస్పిటల్ కన్ఫైన్మెంట్

     

పర్సనల్ గార్డ్‌లో మీకు చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి

ముఖ్యమైన ఫీచర్లు

ఈ క్రింది ఫీచర్లతో ప్రమాదాల పై రక్షణను అందించే ఒక పాలసీ :

  • విస్తృత కవర్

    ఈ పాలసీ వీటిని ఇన్సూర్ చేస్తుంది:

    • మరణం: ప్రమాదం కారణంగా మరణించినప్పుడు, ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 100% మీ నామినీకి చెల్లించబడుతుంది.
    • శాశ్వత పూర్తి వైకల్యం (PTD): ప్రమాదం కారణంగా PTD విషయంలో, ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 125% పరిహారం పొందండి.
    • శాశ్వత పాక్షిక వైకల్యం (పిపిడి): ప్రమాదం కారణంగా శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడితే, మేము వర్తించే విధంగా హామీ ఇవ్వబడిన మొత్తం నుండి కొంత మొత్తం చెల్లిస్తాము:

      ప్రయోజనాల స్కేల్ వివరణ

      ఇన్సూర్ చేయబడిన మొత్తంలో % గా పరిహారం

      భుజం జాయింట్ వద్ద ఒక బాహువు

      70

      మోచెయ్యి జాయింట్ పైన ఒక బాహువు

      65

      మోచెయ్యి జాయింట్ క్రింద ఒక బాహువు

      60

      మణికట్టు వద్ద ఒక చెయ్యి

      55

      ఒక బొటనవేలు

      20

      ఒక చూపుడు వేలు

      10

      ఏదైనా ఇతర వేలు

      5

      మధ్య-తొడ ఎగువన ఒక కాలు

      70

      మధ్య-తొడ వరకు ఒక కాలు

      60

      మోకాలి కింది వరకు ఒక కాలు

      50

      మధ్య-పిక్క వరకు ఒక కాలు

      45

      మడమ వద్ద ఒక పాదం

      40

      ఒక పెద్ద బొటనవేలు

      5

      ఏదైనా ఇతర కాలివేలు

      2

      ఒక కన్ను

      50

      ఒక చెవిలో వినికిడి నష్టం

      30

      రెండు చెవులలో వినికిడి నష్టం

      75

      వాసన అనుభూతి

      10

      రుచి అనుభూతి

      5

    • తాత్కాలిక పూర్తి వైకల్యం (TTD): TTD ఏర్పడితే, మీరు ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 1% లేదా ప్రతి వారం రూ 5,000, ఏది తక్కువైతే అది, అందుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
  • పిల్లల విద్యా ప్రయోజనం

    మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం సంభవించినప్పుడు, మీకు ప్రమాదం సంభవించిన తేదీన, మీ పై ఆధారపడిన 19 సంవత్సరాల లోపు వయస్సుగల పిల్లల, గరిష్టంగా 2 కి, చదువుకి అయ్యే ఖర్చు కోసం రూ. 5,000 ఒకసారి చెల్లింపు చెల్లించబడుతుంది.

  • ఆసుపత్రిలో నిర్బంధ భత్యం

    మరణం, శాశ్వత పూర్తి వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యం లేదా తాత్కాలిక పూర్తి వైకల్యం క్రింద క్లెయిమ్ అంగీకరించబడితే, ఒక పాలసీ వ్యవధిలో గరిష్టంగా 30 రోజుల వరకు, ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోజుకి మేము మీకు రూ.1,000 చెల్లిస్తాము.

  • ప్రమాదం కారణంగా ఏర్పడే గాయానికి అయ్యే వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది

    మరణం, శాశ్వత పూర్తి వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యం లేదా తాత్కాలిక పూర్తి వైకల్యం క్రింద క్లెయిమ్ అంగీకరించబడితే, ప్రమాదం కారణంగా కలిగిన గాయానికి అయ్యే వైద్య ఖర్చులలో, చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ మొత్తంలో 40% లేదా వాస్తవ మెడికల్ బిల్లు మొత్తం, ఏది తక్కువ ఉంటే, ఆ మొత్తం రీయింబర్స్ చేయబడుతుంది.

మా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‍ల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ వీడియోను చూడండి.

Video

క్లెయిమ్ ప్రాసెస్

ప్రమాదం కారణంగా శారీరక గాయం/మరణం సంభవించినప్పుడు క్లెయిమ్ చేసినట్లయితే, దయచేసి క్రింద ఇవ్వబడిన ప్రక్రియను అనుసరించండి:

  1. మీరు, లేదా మీ తరపున క్లెయిమ్ చేసే మీ ప్రియమైన వ్యక్తి, 30 రోజుల్లోపు మాకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి.
  2. మీరు తక్షణమే ఒక డాక్టర్‌ను సంప్రదించాలి మరియు వారు సిఫార్సు చేసే సలహా మరియు చికిత్సను అనుసరించాలి.
  3. శారీరక గాయం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మీరు సహేతుకమైన చర్యలను చేపట్టాలి.
  4. మీరు మా వైద్య సలహాదారులు చేత తప్పక పరీక్ష చేయించుకోవాలి (అవసరమైతే).
  5. మీరు, లేదా మీ తరపున క్లెయిమ్ చేసే మీ ప్రియమైన వ్యక్తి, క్లెయిమ్ పరిశీలించడానికి మరియు సెటిల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు సమాచారాన్ని పూర్తిగా అందించాలి.
  6. ఒక వేళ మీరు మరణిస్తే, మీ తరపున క్లెయిమ్ చేస్తున్న మీ ప్రియమైన వ్యక్తి, మాకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి మరియు 30 రోజుల్లోపు పోస్ట్-మార్టమ్ రిపోర్ట్ యొక్క కాపీని మాకు పంపాలి (అవసరమైతే).
  7. క్లెయిమ్ ఫారంతో పాటు సమర్పించవలసిన ఇతర సంబంధిత డాక్యుమెంట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

మరణం

  • నామినీ / చట్టపరమైన వారసుని ద్వారా సంతకం చేయబడిన, సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం.
  • పోలీస్ పంచనామా /మరణవిచారణ పంచనామా యొక్క ఒక కాపీ, FIR, పోస్ట్-మార్టమ్ రిపోర్ట్ మరియు మరణ సర్టిఫికెట్.
  • విసేరా రిపోర్ట్ యొక్క ధృవీకరించబడిన కాపీ (పోస్ట్-మార్టం రిపోర్ట్ పై పేర్కొనబడి మరింత విశ్లేషణ కోసం అది భద్రపరచబడి మరియు పంపబడినప్పుడు మాత్రమే).
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క నామినీ / చట్టపరమైన వారసుల NEFT వివరాలు మరియు రద్దు చేయబడిన చెక్.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

పిటిడి (శాశ్వత పూర్తి వైకల్యం), పిపిడి (శాశ్వత పాక్షిక వైకల్యం) మరియు టిటిడి (తాత్కాలిక పూర్తి వైకల్యం)

  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ద్వారా సంతకం చేయబడిన, సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం.
  • వైకల్యం యొక్క శాతం పేర్కొంటూ ఒక ప్రభుత్వ ఆసుపత్రి యొక్క సివిల్ సర్జన్ నుండి వైకల్యం సర్టిఫికెట్ యొక్క ధృవీకరించబడిన కాపీ.
  • వైకల్యాన్ని ధృవీకరిస్తూ ఎక్స్-రే మరియు వైద్య పరీక్ష రిపోర్టులు.
  • FIR యొక్క ధృవీకరించబడిన కాపీ (ఏదైనా ఉంటే).
  • వైకల్యాన్ని ధృవీకరిస్తూ, ప్రమాదానికి ముందు మరియు తర్వాత రోగి యొక్క ఫోటో.
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క NEFT వివరాలు మరియు రద్దు చేయబడిన చెక్.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

పిల్లల విద్య కొరకు బోనస్

  • పాఠశాల / కళాశాల నుండి బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా విద్యా సంస్థ నుండి సర్టిఫికెట్.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

హాస్పిటల్ కన్ఫైన్మెంట్ అలవెన్స్/మెడికల్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్

  • డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్.
  • క్లెయిమెంట్ సంతకం చేసిన మరియు సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం.
  • హాస్పిటల్ డిశ్చార్జ్ కార్డ్.
  • బిల్లులో పేర్కొన్న అన్ని ఖర్చుల వివరిస్తూ ఒక హాస్పిటల్ బిల్లు. OT ఛార్జీలు, డాక్టర్ కన్సల్టేషన్స్ మరియు సందర్శన ఛార్జీలు, OT కన్జ్యూమబుల్స్, ట్రాన్స్‌ఫ్యూజన్స్, గది అద్దె మొదలైన వాటి గురించి స్పష్టమైన వివరాలను తెలియజేయాలి.
  • ఒక రెవెన్యూ స్టాంప్‌ కలిగి ఉండి సరిగ్గా సంతకం చేయబడిన డబ్బు చెల్లించిన రసీదు.
  • అన్ని ఒరిజినల్ ల్యాబరేటరీ మరియు డయాగ్నిస్టిక్ టెస్ట్ రిపోర్టులు, ఉదాహరణకు, ఎక్స్-రే, ECG, USG, MRI స్కాన్, హెమోగ్రామ్ మొదలైనవి.
  • క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కు అవసరం అయ్యే ఇతర డాక్యుమెంట్లు.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

తరచుగా అడిగే ప్రశ్నలు

నాకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఎందుకు ఉండాలి?

ప్రమాదం కారణంగా మరణం/గాయం/వైకల్యం సంభవించిన సందర్భంలో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు ఆర్థిక మద్దతును అందిస్తాయి. ఊహించని వైద్య ఖర్చుల వలన ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఒక సమగ్ర పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉంటే ఒక ఊహించని సంఘటన తర్వాత కూడా మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు.

నేను నా క్లెయిమ్‌ను ఎలా సబ్మిట్ చేయాలి?

ఒక వేళ, మీరు ప్రమాదం బారిన పడి మీ శరీరంలో ఏదైనా భాగానికి గాయం అయి దాని కోసం క్లెయిమ్ చేసినట్లయితే, మీరు లేదా మీ తరఫున క్లెయిమ్ చేసే వ్యక్తి మాకు వెంటనే లేదా వ్రాతపూర్వకంగా 14 రోజులలోపు తెలియజేయాలి.

ప్రమాదం కారణంగా మరణం సంభవించిన సందర్భంలో, దాని గురించి వెంటనే మాకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి మరియు 14 రోజుల్లోపు పోస్ట్-మార్టమ్ రిపోర్ట్ యొక్క కాపీని మాకు పంపాలి.

నా క్లెయిమ్ ఎంత త్వరగా సెటిల్ చేయబడుతుంది?

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్లను వేగంగా ప్రాసెస్ చేయడానికి కట్టుబడి ఉంది. అన్ని ఆవశ్యకతలను నెరవేర్చిన తేదీ నుండి ఏడు పని రోజుల్లోపు క్లెయిములు ప్రాసెస్ చేయబడతాయి.

పర్సనల్ గార్డ్ పాలసీ సహజ మరణం లేదా ఏదైనా అనారోగ్యం/వ్యాధి కారణంగా సంభవించే మరణాన్ని కవర్ చేస్తుందా?

లేదు, ప్రమాదాలు లేదా ప్రమాదాల కారణంగా ఏర్పడిన గాయాల కారణంగా సంభవించే మరణాన్ని మాత్రమే పర్సనల్ గార్డ్ పాలసీ కవర్ చేస్తుంది.

పర్సనల్ గార్డ్ పాలసీ ప్రవేశ వయస్సు ఎంత?

పర్సనల్ గార్డ్ పాలసీని ఎంచుకోవడానికి అర్హత క్రింద ఇవ్వబడిన విధంగా ఉంది:

ప్రతిపాదించేవారు మరియు జీవిత భాగస్వామికి ప్రవేశ వయస్సు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆధారపడిన పిల్లలకు ప్రవేశ వయస్సు 5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య ఉంటుంది.

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

ఆశీష్ జుంజున్వాలా

2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...

సునీత ఎం అహూజా

లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు

రేని జార్జ్

నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...

పర్సనల్ గార్డ్ ఇన్సూరెన్స్ పాలసీ సంపూర్ణ భద్రత మరియు మనశ్శాంతిని అందిస్తుంది.

అన్ని పర్సనల్ ప్రమాద సంబంధిత సందర్భాలను కవర్ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేయబడిన ప్లాన్.

అంతే కాదు, మీ పర్సనల్ గార్డుతో అదనపు ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

ప్రమాదాల కారణంగా సంభవించిన మరణం, గాయం లేదా వైకల్యం కోసం ఈ పాలసీ వివిధ ప్రయోజనాలతో కూడిన పాలసీని అందిస్తుంది:
Family discount

ఫ్యామిలీ డిస్కౌంట్

మీ కుటుంబాన్ని ఇన్సూర్ చేయండి మరియు 10% ఫ్యామిలీ డిస్కౌంట్ పొందండి.

Hassle-free claim settlement

అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌మెంట్

మా ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. మరింత చదవండి

అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌మెంట్

మా ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. మేము భారతదేశ వ్యాప్తంగా ఉన్న 18,400+ కంటే ఎక్కువ నెట్‍వర్క్ ఆసుపత్రులలో క్యాష్‍లెస్ సదుపాయాన్ని కూడా అందిస్తాము. ఇది హాస్పిటలైజేషన్ లేదా చికిత్స సమయంలో ఉపయోగపడుతుంది, ఇక్కడ మేము నెట్‌వర్క్ హాస్పిటల్‌కి నేరుగా బిల్లులు చెల్లిస్తాము మరియు మీరు కోలుకోవడం పై దృష్టి పెట్టవచ్చు. 

Flexible premium computation

ఫ్లెక్సిబుల్ ప్రీమియం కంప్యూటేషన్

మీ వృత్తిని బట్టి నిర్ణయించబడిన వివిధ ప్రమాద స్థాయిలను బట్టి ప్రీమియం మారుతుంటుంది మరింత చదవండి

ఫ్లెక్సిబుల్ ప్రీమియం కంప్యూటేషన్

మీ వృత్తిని బట్టి నిర్ణయించబడిన వివిధ ప్రమాద స్థాయిలను బట్టి ప్రీమియం మారుతుంటుంది

రిస్క్ లెవల్ I: అడ్మినిస్ట్రేటివ్/మేనేజింగ్ కార్యకలాపాలు, అకౌంటెంట్లు, డాక్టర్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్స్, టీచర్లు.

రిస్క్ లెవల్ II: మాన్యువల్ లేబర్, గ్యారేజ్ మెకానిక్, మెషిన్ ఆపరేటర్ పెయిడ్ డ్రైవర్ (కార్/ట్రక్/హెవీ వెహికల్స్), క్యాష్-క్యారీయింగ్ ఎంప్లాయ్, బిల్డర్, కాంట్రాక్టర్, వెటర్నరీ డాక్టర్.

రిస్క్ లెవెల్ III: భూగర్భ గనుల్లో, హై టెన్షన్ సప్లై ఉన్న ఎలక్ట్రిక్ ఇన్‌స్టాలేషన్లలో పనిచేసే కార్మికులు, జాకీ, సర్కస్ పర్ఫార్మర్లు, బిగ్ గేమ్ హంటర్లు, పర్వతారోహకులు, ప్రొఫెషనల్ రివర్ రాఫ్టర్లు మరియు ఇటువంటి వృత్తులు.

గమనిక: పైన పేర్కొనబడని వృత్తుల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

వార్షిక ప్రీమియం రేటు

మీ అవసరాల ఆధారంగా మీరు అనేక ప్రీమియం ఎంపికల నుండి ఎంచుకోవచ్చు:

ప్రీమియం రేట్లు క్రింద ఇవ్వబడ్డాయి (%) - రూ ప్రతి 1,000/-

కవర్

రిస్క్ క్లాస్

 

I

ii

iii

ప్రాథమిక

0.45

0.6

0.9

వైడర్

1.0

1.25

1.75

సమగ్రమైన

1.5

2.0

అందుబాటులో లేదు

వైద్య ఖర్చులు

పైన పేర్కొన్న ప్రీమియంలో 25%

పైన పేర్కొన్న ప్రీమియంలో 25%

పైన పేర్కొన్న ప్రీమియంలో 25%

హాస్పిటల్ కన్ఫైన్మెంట్

ప్రతి వ్యక్తికి రూ 300

ప్రతి వ్యక్తికి రూ 300

ప్రతి వ్యక్తికి రూ 300

Cumulative bonus

క్యుములేటివ్ బోనస్

గరిష్టంగా 50% వరకు, ప్రతి క్లెయిమ్-ఫ్రీ సంవత్సరానికి 10% క్యుములేటివ్ బోనస్ పొందండి, ఒక క్లెయిమ్ రిజిస్టర్ చేయబడినట్లయితే 10% తగ్గించబడుతుంది.

పర్సనల్ గార్డ్ కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రమాదం కారణంగా మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా కవరేజ్ అందిస్తుంది.

పిల్లల విద్యా ప్రయోజనం

ప్రమాదం కారణంగా మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, గరిష్టంగా 2 ఆధారపడిన పిల్లలు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్‌ను అందుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

ఆసుపత్రిలో నిర్బంధ భత్యం

ప్రమాదం కారణంగా మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోజుకి నగదు ప్రయోజనం అందుతుంది.

ప్రమాదం వలన చికిత్స కోసం అయ్యే వైద్య ఖర్చులు

మరణం లేదా వైకల్యం క్రింద క్లెయిమ్ అంగీకరించబడినట్లయితే, చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ మొత్తంలో 40% వరకు లేదా వాస్తవ వైద్య బిల్లులు, ఏది తక్కువ అయితే అది, వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.

1 ఆఫ్ 1

ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం లేదా స్వయంగా చేసుకున్న గాయం లేదా అనారోగ్యం ఫలితంగా జరిగిన ప్రమాదం కారణంగా ఏర్పడిన శారీరక గాయం.

మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/మరణం.

నేరపూరితమైన ఉద్దేశ్యంతో ఏదైనా చట్టం ఉల్లంఘించడం వలన జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/మరణం.

ఏవియేషన్ లేదా బెలూనింగ్‌లో పాల్గొని ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/మరణం...

మరింత చదవండి

విమానయానం లేదా బెలూనింగ్‌లో పాల్గొనడం వల్ల, ప్రపంచంలో ఎక్కడైనా సక్రమంగా లైసెన్స్ పొందిన ప్రామాణిక రకం విమానాలలో ప్రయాణీకుడిగా (ఛార్జీల చెల్లింపు లేదా ఇతరత్రా) కాకుండా వేరే బెలూన్ లేదా విమానంలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు ప్రమాదవశాత్తు జరిగే గాయం/మరణం.

మోటార్ రేసింగ్ లేదా ట్రయల్ రన్స్ సమయంలో డ్రైవర్, కో-డ్రైవర్ లేదా మోటార్ వాహనం ప్రయాణీకునిగా పాల్గొన్నప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/ మరణం.

మీ శరీరంపై మీరు నిర్వహించే లేదా నిర్వహించిన ఏవైనా స్వస్థత కలిగించే చికిత్సలు లేదా ఇంటర్వెన్షన్లు.

ఎటువంటి విరామం లేకుండా నిర్వహించబడిన మిలిటరీ ఎక్సర్‌సైజెస్ లేదా వార్ గేమ్స్ లేదా విదేశీ లేదా దేశీయ శత్రువుతో యుద్ధం రూపంలో ఏదైనా నేవీ, మిలిటరీ లేదా ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క భాగస్వామ్యం.

మీ పై వాస్తవంగా లేదా ఆరోపించబడిన చట్టపరమైన బాధ్యతల వలన కలిగిన పర్యవసాన నష్టాలు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు.

హెచ్ఐవి మరియు/లేదా ఎయిడ్స్ తో సహా ఏదైనా హెచ్ఐవి సంబంధిత అనారోగ్యం మరియు/లేదా ఏ రకంగానైనా కలిగిన దాని మ్యూటెంట్ డెరివేటివ్స్ లేదా దాని వేరియేషన్లు.

గర్భధారణ, దాని ఫలితంగా శిశుజననం, గర్భస్రావం, అబార్షన్ లేదా వీటిలో దేని నుండి అయినా ఉత్పన్నమయ్యే సమస్యలు.

యుద్ధం (ప్రకటించబడినా లేదా కాకపోయినా), అంతర్యుద్ధం, ఆక్రమణ, విదేశీ చర్య కారణంగా ఉత్పన్నమయ్యే చికిత్స...

మరింత చదవండి

యుద్ధం, దండయాత్ర, విదేశీ శత్రువుల చర్యలు, శత్రుత్వాలు (యుద్ధం ప్రకటించబడినా లేదా ప్రకటించబడకపోయినా), అంతర్యుద్ధం, కల్లోలం, అశాంతి, ఉద్యమాలు, విప్లవం, తిరుగుబాటు, సైనిక లేదా స్వాధీనం చేసుకున్న అధికారం లేదా జప్తు లేదా జాతీయం లేదా ఏదైనా ప్రభుత్వం లేదా ప్రజా, స్థానిక సంస్థల అధికారం చేత జారీచేయబడిన ఆదేశాల ద్వారా జరిగిన నష్టం/ దెబ్బతినడం కారణంగా జరిగే చికిత్స.

అణు శక్తి, రేడియోధార్మికతకి గురి అయితే చేయబడే చికిత్స.

1 ఆఫ్ 1

హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

మీ మునుపటి పాలసీ గడువు ఇంకా ముగియలేదా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

4.75

(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

Satish Chand Katoch

సతీష్ చంద్ కటోచ్

పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.

Ashish Mukherjee

ఆశీష్ ముఖర్జీ

ఎటువంటి వారికైనా సులభంగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, గందరగోళం ఉండదు. గొప్ప పని. గుడ్ లక్.

Jaykumar Rao

జయకుమార్ రావ్

యూజర్ ఫ్రెండ్లీ. నేను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో నా పాలసీని పొందాను.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు : బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి