మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
మీ కథకు మీరే హీరో. ఒక క్లాసిక్ హిందీ సినిమా క్లైమాక్స్ వలె, మీరు టూ వీలర్ వాహనంపై గ్రౌండ్లోకి ప్రవేశించి, గూండాలను చితకబాది, అందరినీ కాపాడతారని ఊహించి ఉంటారు. నిజమే, ఇది బహుశా ఒక కల మాత్రమే. కానీ, మీరు ఇప్పుడు ప్రతిరోజూ దానిలో జీవించవచ్చు! ఒక ఆటోమోటివ్ పర్ఫెక్షన్కు ప్రతీకగా నిలిచే మీ హీరో బైక్ , యాక్షన్ సూపర్‌స్టార్‌గా మీ ప్రతి కదలికకు విశ్వసనీయతను ఇస్తుంది, మీ ఫాంటసీకి ప్రాణం పోస్తుంది!
మొదట బ్రాండ్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. Hero Motocorp అనేది తన 26 సంవత్సరాల జపనీస్ సాంకేతిక భాగస్వామి అయిన Honda తో విడిపోయిన తరువాత 2010లో ఉనికిలోకి వచ్చింది. ఎకానమీ మరియు పర్ఫార్మన్స్ టూ వీలర్ల పట్ల భారతీయ వినియోగదారులకు ఉన్న అమితమైన ఆసక్తిని తృప్తి పరచడంలో ఇది కీలక పాత్ర పోషించింది.
తన కొత్త రూపంతో Hero Motocorp, నేటి యువ తరానికి తగిన విధంగా సరిపోయే ఒక బైక్ బ్రాండ్‌గా మారాలని నిర్ణయించుకుంది. అందమైన డిజైన్ మరియు అధిక పర్ఫార్మన్స్ విషయానికి వస్తే హీరో బైక్‌ల పేర్లు తరచుగా వినిపిస్తాయి. ఇది స్థానిక నిపుణులను ఉద్యోగాలకి తీసుకోవడంలో, కస్టమర్ సెంట్రిసిటీని అలవరచుకోవడంలో ప్రసిద్ధి చెందింది.
బజాజ్ అలియంజ్ హీరో బైక్ ఇన్సూరెన్స్‌తో మీరు సురక్షితం చేయబడి ఉన్నారు. కావున, జీవితంలో సాఫీగా సాగే ప్రయాణం మరియు విస్తారమైన రోడ్డు మీ కోసం వేచి ఉంది. ఒక సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీ యాక్సిడెంట్ సంబంధిత ప్రమాదాలను, థర్డ్ పార్టీ బాధ్యతలు రెండింటినీ సులభంగా నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది
బైక్ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయడంలో డబ్బును ఆదా చేయడం అనేది అన్ని విధాలా సమర్థవంతమైంది, కాని, దానిని వాస్తవంగా అమలులోకి తెచ్చినప్పుడు అది మీ అంచనాలకు తగినవిధంగా సరిపోదని తెలుసుకుంటారు. చవకైన బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తరచుగా మిమ్మల్ని నిరాశపరుస్తాయి!
బైక్ ఇన్సూరెన్స్ శోధనలో ఎదురయ్యే సమస్యలు - ఆన్లైన్లో అనేక రివ్యూలను చదవడం, షోరూమ్‌లను సందర్శించడం, స్పెసిఫికేషన్లను చెక్ చేయడం - వంటివి ఒక ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుగొనడంలో మీకు సహాయపడతాయి, మీరు తక్కువ ధరని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తప్ప. అందుకు గల కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
మీరు మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ రక్షణ కోసం టెంపర్డ్ గ్లాస్ కొరకు వెతుకుతున్నప్పుడు, అంచులను కవర్ చేయడంలో విఫలమయ్యే గాజును కొనుగోలు చేస్తారా? లేదు, ఎందుకనగా ఫోన్ అంచులలో చిన్నపాటి నష్టం జరిగినా అది పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉంటుంది, దాని పనితీరు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా, చవకైన బైక్ ఇన్సూరెన్స్ తగిన కవరేజీని అందించడంలో విఫలం కావచ్చు, ఫలితంగా మీరే ఆ మొత్తాన్ని స్వయంగా చెల్లించాల్సి వస్తుంది. టూ వీలర్ ఇన్సూరెన్స్ వంటి ప్రధాన విషయానికి వస్తే, తగినంత కవరేజ్ అందించే పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
వారు హిండ్‌సైట్ ఎల్లప్పుడూ 20/20 ఉండాలని సూచిస్తారు. రద్దీగా ఉన్న ట్రాఫిక్ ద్వారా ప్రయాణిస్తున్నపుడు, మీ వెనుక వ్యూను చూపించే మిర్రర్, చాలా దగ్గరగా ఉండే వస్తువులను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 2వీలర్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, అన్ని ప్రోడక్టులు మీ అవసరాలను తీర్చలేవు.
యాడ్-ఆన్లు కవరేజీలో ఖాళీలను పూరిస్తాయి, మరో మాటలో చెప్పాలంటే, అవి మీ కవరేజీకి అదనపు అంశాలను అందిస్తాయి, రోడ్ సైడ్ అసిస్టెన్స్ లేదా డిప్రిసియేషన్ నుండి రక్షణ అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి.
అయితే, ఈ యాడ్-ఆన్లు మీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ ధరను పెంచవచ్చు, అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాడ్-ఆన్లు అక్కరకు వస్తాయి, మీకు నిస్సహాయ స్థితి ఎదురవ్వదు.
దాదాపు అన్ని విషయాలు ఒకేలా ఉన్నప్పటికీ, కస్టమర్ సేవ అనేది ఉత్తమమైన వాటిని సాధారణమైన వాటిని వేరు చేస్తుంది. చవకైన బైక్ ఇన్సూరెన్స్ కవర్ కొంత డబ్బును ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది, అయితే, దీంతో మీరు ఊహించిన విధంగా మీ అన్ని ప్రశ్నలకు త్వరగా, సమర్ధవంతమైన విధానంలో సమాధానాలు లభించకపోవచ్చు.
క్లెయిమ్ సెటిల్మెంట్ వంటి కీలక విషయానికి వస్తే, 24X7 క్లెయిమ్ సపోర్ట్ మరియు ఉన్నతస్థాయి కస్టమర్ సేవ కోసం ఎక్కువ చెల్లించడం సరైనది.
Hero బైక్ ఇన్సూరెన్స్ రకాలు
బిజినెస్ కోసం లేదా ఆనందం కోసం - డైలీ ట్రావెల్ కొరకు లేదా సుదూర ప్రయాణాలకు - సందర్భం ఏదైనా బజాజ్ అలియంజ్ వారి హీరో బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మీ బైక్‌ను విశ్వసనీయంగా, స్థిరంగా రైడ్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే, థర్డ్ పార్టీకి జరిగిన దురదృష్టకరమైన సంఘటన లేదా స్వంత డ్యామేజీని కూడా అంచనా వేయడం చాలా కష్టం. బజాజ్ అలియంజ్ హీరో బైక్ ఇన్సూరెన్స్, చట్టపరమైన బాధ్యత లేదా రిపేరింగ్స్ వలన తలెత్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనం, దోపిడీ, అల్లర్లు ఇకపై మీ స్టైల్‌ను అడ్డుకోలేవు.
బజాజ్ అలియంజ్ అందించే హీరో బైక్ ఇన్సూరెన్స్, మీ హీరో బైక్ కోసం అనువైనది. ఈ సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ కవర్ 1, 2 లేదా 3 సంవత్సరాల కాలానికి అందుబాటులో ఉంటుంది. ఇది మీ డ్యామేజ్ అయిన వాహనానికి కవరేజీని అందిస్తుంది, థర్డ్ పార్టీ క్లెయిమ్స్ నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా లయబిలిటీ (ఆర్థిక మరియు చట్టపరమైన) కోసం మిమ్మల్ని కవర్ చేస్తుంది.
మా థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అందించే పరిష్కారం, మిమ్మల్ని చట్టప్రకారం సరైన మార్గంలో నడిపిస్తుంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం, మీకు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉన్నపుడు మాత్రమే మీరు గర్వంగా రైడ్ చేయగలుగుతారు. లేదంటే, బదులుగా మీరు బస్సులో వెళ్లడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే, బజాజ్ అలియంజ్ నుండి హీరో బైక్ ఇన్సూరెన్స్‌తో మీరు భయపడాల్సిన అవసరం లేదు!
హీరో బైక్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
మీ హీరో బైక్ కోసం ఒక లాంగ్‌టర్మ్ బజాజ్ అలియంజ్ హీరో బైక్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇక 3 సంవత్సరాల వరకు మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకు? ఎందుకనగా మీరు చేయవలసిన పనుల జాబితాలో ఒకటి తక్కువగా ఉంటుంది.
బజాజ్ అలియంజ్ హీరో బైక్ ఇన్సూరెన్స్ తక్షణ కొనుగోలు, రెన్యూవల్‌తో సమయం మరియు శ్రమను ఆదా చేస్తుంది.
భారతదేశం అంతటా 4000 కన్నా ఎక్కువ నెట్వర్క్ గ్యారేజీలలో క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్, ప్రత్యేకంగా మీ కోసం.
మీరు మీ లాంగ్ టర్మ్ టూ వీలర్ పాలసీ క్రింద ఒక క్లెయిమ్ రిజిస్టర్ చేస్తే మీ ఎన్‌సిబి తగ్గుతుంది, కానీ శూన్యంగా మారదు.
అదనపు కవర్ అవసరమా? మేము వాటన్నింటి కోసం కస్టమైజ్డ్ పరిష్కారాలను కలిగి ఉన్నాము. వీటిలో కొన్ని యాడ్-ఆన్లు ఇలా ఉన్నాయి:
· జీరో లేదా నిల్ డిప్రిసియేషన్ ప్రొటెక్షన్
· పిలియన్ రైడర్ల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్
· యాక్సెసరీస్ కోల్పోవడం నుండి రక్షణ
మేము అర్ధరాత్రి వేళలో కూడా మీకోసం అందుబాటులో ఉన్నాము. నిజానికి, మీకు సేవ చేసే విషయానికి వస్తే, మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
మునుపటి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి పొందిన మీ ఆర్జిత ఎన్‌సిబిలో 50%, బజాజ్ అలియంజ్కు బదిలీ చేయండి. మీరు దానిని సంపాదించారు!
డిస్‌క్లెయిమర్
వెబ్సైట్లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి