రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Eco Friendly Diwali Celebration
నవంబర్ 23, 2021

దీపావళి వేడుక: ఈ సంవత్సరం పర్యావరణ అనుకూలమైన దీపావళిని ఎలా జరుపుకోవాలి?

దీపావళి అనేది సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకునే ఒక పండుగ. అయితే, ఇలాంటి ఒక మంచి విషయంతో పాటు, ప్రకృతికి హాని కలిగించే వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం మరియు వనరుల వృధా లాంటి కొన్ని చెడు విషయాలు కూడా ఈ పండుగలో భాగమై ఉన్నాయి. కానీ, ఈ సంవత్సరం మన మాతృభూమిని రక్షించడానికి మనవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం! పర్యావరణాన్ని ప్రభావితం చేయకుండా అదే ఉత్సాహంతో దీపావళిని జరుపుకోవడానికి ఇక్కడ 06 ఉత్తమ మార్గాలు ఇవ్వబడ్డాయి.

1. మీ ఇంటిని కాంతులతో నింపడానికి అందమైన దీపాలను వెలిగించండి

విద్యుత్తు చాలా ఖరీదైన నిత్యావసర వస్తువు మరియు విద్యుత్ బిల్లులు మీకు భారంగా మారవచ్చు. కావున, ప్రత్యామ్నాయంగా మీ ఇంటిని దీపాల వెలుగుతో ప్రకాశవంతం చేసుకోండి. ఈ దీపావళి సాంప్రదాయబద్దమైన, సేంద్రీయ విధానాలకు ప్రతీకగా నిలుస్తుంది. అలాగే, వ్యాపారంపై ఆధారపడిన ఎంతో మంది ప్రజలకు లాభదాయకంగా ఉంటుంది.

2. చేతితో తయారు చేసిన బహుమతి

ప్లాస్టిక్‌తో తయారైన ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బహుమతులు కొంత కాలం తర్వాత నిరుపయోగకరంగా మారతాయి. మీరు వస్త్రాలు లేదా జూట్ లాంటి సహజమైన పదార్థాలతో తయారు చేసిన కస్టమైజ్డ్ గిఫ్ట్‌ను ఎందుకు ఎంచుకోకూడదు? ముఖ్యంగా మీ ప్రియమైన వారి కోసం మీరు స్వయంగా తయారు చేసిన బహుమతులు దేనికీ సరితూగవు. అయితే, వారి నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారా? ఇప్పుడే ప్రారంభించండి!

3. న్యూస్ పేపర్లతో గిఫ్ట్స్ ప్యాక్ చేయండి

రీసైక్లింగ్‌కు సాధ్యం కాని మెరిసే ప్లాస్టిక్‌ కాగితాలకు బదులు మీరు మీ స్నేహితులకు ఇవ్వాలనుకునే గిఫ్ట్‌లను న్యూస్ పేపర్లతో ప్యాక్ చేయండి. పిల్లల కోసం మీరు న్యూస్ పేపర్లలో ఉండే కామిక్ స్ట్రిప్స్ గల పేపర్‌ భాగాన్ని ఉపయోగించవచ్చు. ఇలా మీ స్నేహితులందరిలో కెల్లా మీరే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలవండి మరియు న్యూస్ పేపర్లతో గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి మీ క్రియేటివిటీని ఉపయోగించండి!

4. ప్రకృతిసిద్ధ రంగులతో అందమైన రంగోలిని తీర్చిదిద్దండి

రసాయనిక రంగులకు బదులుగా మీరు సహజసిద్ధమైన విధానంలో గులాబీలు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు మరియు ఆకులను ఉపయోగించి ముగ్గు వేయండి. అంతేకాకుండా, పసుపు, కుంకుమ మరియు కాఫీ పౌడర్‌ని కూడా రంగులుగా వాడుకోవచ్చు. ఇవన్నీ పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా, మరుసటి రోజు సులభంగా మీ చెత్త బుట్టలోకి పారవేయవచ్చు.

5. మీ పాత వస్తువులను దానం చేయండి

మీ అలమరను శుభ్రం చేసేటప్పుడు మీ వస్తువులను పారవేయడానికి బదులు, వాటిని నిరుపేదలకు దానం చేయండి. ఇలా వస్తువులు పునర్వినియోగించబడటంతో మనం వ్యర్థాలను తగ్గించవచ్చు. అలాగే, మీరు వారికి కొన్ని టపాసులు కూడా ఇవ్వండి. ఇది ఖచ్చితంగా వారి ముఖంలో చిరునవ్వులు పూయిస్తుంది!

6. పర్యావరణ అనుకూలమైన టపాసులను ఎంచుకోండి

టపాసులను కాల్చడం పూర్తిగా మానుకోవాల్సి ఉన్నప్పటికీ, పిల్లలను ఒప్పించడం మాత్రం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితిలో మీరు తీసుకోవాల్సిన ఉత్తమ నిర్ణయం, పర్యావరణ అనుకూలమైన టపాసులను కొనుగోలు చేయడం. ఇవి రీసైకిల్ పేపర్‌తో తయారు చేయబడతాయి మరియు తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి.

ఈ శుభ సందర్భంగా బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తో మీ ప్రియమైన వారిని సురక్షితం చేసుకోండి లేదా మీ వాహనాన్ని కారు ఇన్సూరెన్స్ /బైక్ ఇన్సూరెన్స్ పాలసీ తో కవర్ చేయండి

 

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

  • మిలింద్ కాలే - అక్టోబర్ 26, 2018 రాత్రి 12:33 గంటలు

    ఇలాంటి మంచి ఆర్టికల్ కోసం ధన్యవాదాలు

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి