మా బృందం
బజాజ్ అలియంజ్ వద్ద, మార్పు పై స్థాయి నుండి ప్రారంభమవుతుంది. డిజిటల్ కార్యక్రమాల నుండి ప్రోడక్ట్ అభివృద్ధి వరకు, మా నాయకత్వ బృందం 100 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల సామూహిక అనుభవాన్ని కలిగి ఉంది. వ్యవస్థాపక స్ఫూర్తి మరియు కస్టమర్ విజయం పట్ల అభిరుచితో కలిపి నేడు మార్కెట్లో అత్యంత లాభదాయకమైన ఇన్సూరర్లలో ఒకటిగా కంపెనీ యొక్క నిరంతర విజయానికి వారు ఉత్ప్రేరకాలుగా ఉన్నారు. సంస్థకు వెన్నంటే ఉంటూ, వారు మనల్ని వృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
-
తపన్ సింఘేల్
ఎండి మరియు సిఇఒ

తపన్ సింఘేల్
2001 లో బజాజ్ అలియంజ్ ప్రారంభమైనప్పటి నుండి శ్రీ తపన్ సింఘేల్ ఉన్నారు మరియు రిటైల్ మార్కెట్‌లో ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని ప్రారంభించే బృందంలో కీలకంగా వ్యవహరించారు.
తపన్ సింఘేల్ 2012 లో ఎండి మరియు సిఇఒ గా బాధ్యతలు చేపట్టారు. గత 11 సంవత్సరాలలో కంపెనీ అతని నాయకత్వంలో కొత్త ఆలోచనలను చేసింది, ఇండస్ట్రీ-ఫస్ట్ కార్యక్రమాలను ప్రారంభించింది మరియు కస్టమర్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించడం పై దృష్టి పెట్టింది. ఇన్సూరెన్స్ విక్రయం, పంపిణీ మరియు కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ఈయన మార్గదర్శకత్వంలో డిజిటల్ విధానంలోకి మారాయి.
దీనికి ముందు, అతను బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సిఎంఒ) గా పనిచేసారు. అతను కంపెనీలో ప్రాంతీయ మేనేజర్, జోనల్ హెడ్ మరియు సిఎంఒ గా అన్ని రిటైల్ ఛానల్స్ హెడ్ వంటి వివిధ పాత్రలను నిర్వహించారు.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క ఎండి మరియు సిఇఓ గా, ఈయన పరిశ్రమలో అభివృద్ధి, లాభదాయకత మరియు కాస్ట్ లీడర్‌షిప్ ని నిర్ధారించారు. ప్రస్తుతం అతను ఇన్సూరెన్స్ మరియు పెన్షన్లపై సిఐఐ జాతీయ కమిటీకి కూడా అధ్యక్షత వహిస్తున్నారు. ఈయన అనేక గౌరవాలను పొందారు, వాటిలో కొన్ని, ఇండియా ఇన్సూరెన్స్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2019 వద్ద 'పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్', 22వ ఆసియా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2018 మరియు ఇండియన్ ఇన్సూరెన్స్ సమ్మిట్ 2017. ఈయన 2019 మరియు 2018 లో 'LinkedIn టాప్ వాయిస్ ఇన్ ఇండియా' గా నిలిచారు మరియు The Economic Times గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2018 వద్ద ఆసియా లో 'మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్' గా గుర్తింపు పొందారు.
-
టిఎ రామలింగం
చీఫ్ టెక్నికల్ ఆఫీసర్

టిఎ రామలింగం
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కోసం టిఎ రామలింగం చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. తన ప్రస్తుత బాధ్యతలో భాగంగా ఈయన మోటార్ మరియు నాన్-మోటార్ అండర్‌రైటింగ్, క్లెయిములు, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు సంస్థ కోసం రీ-ఇన్సూరెన్స్ నిర్వహించడానికి బాధ్యత వహిస్తారు. దీనికి పూర్వం, ఈయన సంస్థ అమ్మకాల కోసం ముఖ్య పంపిణీ అధికారిగా కంపెనీకి చెందిన పంపిణీ ఛానెళ్లు మరియు వ్యూహాత్మక టై-అప్‍లను నిర్వహించారు. తన మునుపటి పాత్రలలో, ఈయన క్లెయిమ్‌ల సమయంలో అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడానికి కీలకం అయిన సమర్థవంతమైన క్లెయిమ్‌ల నిర్వహణ ప్రక్రియలను రూపొందించడానికి బృందాలకు మార్గనిర్దేశం చేశారు మరియు నాయకత్వం వహించారు. ఫలితంగా, క్లెయిమ్స్ మేనేజ్‌మెంట్‌లో ఉత్తమ టర్న్‌అరౌండ్ సమయం కోసం ఈ రోజు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ భారతీయ ఇన్సూరెన్స్ పరిశ్రమలో పేరు గాంచింది. రామ బ్యాంకింగ్ పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించారు మరియు ఇన్సూరెన్స్ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా పని అనుభవం కలిగి ఉన్నారు. అతను మార్కెటింగ్, క్లెయిమ్‌లు మరియు రీఇన్సూరెన్స్‌తో సహా వివిధ కార్యాచరణ ప్రాంతాలను నిర్వహించిన ఒక ప్రముఖ జాతీయ ఇన్సూరర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. అతను కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క అసోసియేట్.
-
శశికుమార్ ఆదిదాము
చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ - ఇన్స్టిట్యూషనల్ సేల్స్

శశికుమార్ ఆదిదాము
శశికుమార్ ఆదిదాము బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కోసం సంస్థ సేల్స్‌కి చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్. తన ప్రస్తుత పాత్రలో, ఈయన బ్యాంక్‌అస్యూరెన్స్, కార్పొరేట్ వ్యాపారాలు మరియు ప్రభుత్వ వ్యాపారాలు, పంట బీమా, సంస్థకి చెందిన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో ద్వారా వ్యూహాత్మక టై-అప్లు వంటి వివిధ పంపిణీ ఛానెళ్ల ద్వారా కంపెనీ కార్పొరేట్ వ్యాపార పోర్ట్‌ఫోలియోను నడిపించడానికి బాధ్యత వహిస్తారు. ఈ పాత్రకు ముందు, శశికుమార్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా కంపెనీ అండర్‌రైటింగ్, క్లెయిమ్‌లు, రీ-ఇన్సూరెన్స్ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించేవారు. తన మునుపటి పాత్రలో, సిటిఒ కు ముందు, అతను అండర్‌రైటింగ్, క్లెయిమ్‌లు, రిస్క్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్ మరియు ప్రాఫిట్ సెంటర్ మేనేజ్‌మెంట్ వంటి విభిన్నమైన పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. శశికుమార్ మూడు దశాబ్దాలకు పైగా గొప్ప అనుభవం కలిగి ఉన్నారు మరియు New India Assurance Company తో 1989 లో తన ఇన్సూరెన్స్ కెరీర్‌ను డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా ప్రారంభించారు. 2001 సంవత్సరంలో బజాజ్ అలియంజ్‌లో చేరడానికి ముందు ఈయన 12 సంవత్సరాలపాటు పబ్లిక్ సెక్టార్ కంపెనీలతో పనిచేశారు. శశికుమార్ ఐటీ సెక్టార్లో కూడా కొంతకాలం పనిచేశారు, Australian IT company లో ఒక బిజినెస్ అనలిస్ట్‌గా చేసారు. శశికుమార్ ఆదిదాము సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నారు మరియు Insurance Institute of India యొక్క అసోసియేట్ కూడా. ఈయన మ్యూనిచ్‌లో అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్ శిక్షణను కూడా పూర్తి చేశారు. పనితో పాటు, శశికుమార్ పఠనాసక్తి కలవారు మరియు తన కుటుంబంతో సమయాన్ని గడపడాన్ని ఆనందిస్తారు.
-
రమణదీప్ సింగ్ సాహ్ని
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్
రమణదీప్ సింగ్ సాహ్ని
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ముఖ్య ఫైనాన్షియల్ అధికారి రమణదీప్ సింగ్ సాహ్ని. ఈ పాత్రలో అతను ఫైనాన్స్, కంప్లయన్స్, లీగల్ మరియు అడ్మినిస్ట్రేషన్ కోసం బాధ్యతలను నిర్వహిస్తారు. 17 సంవత్సరాలకు పైగా Indian life insurance spaceలో పనిచేసిన రమణదీప్, ఇన్సూరెన్స్‌లో మంచి అనుభవాన్ని కలిగి ఉన్నారు. తన మునుపటి పాత్రలలో అతను ఫైనాన్స్, బిజినెస్ ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్, బిజినెస్ స్ట్రాటజీ ఫార్ములేషన్ అండ్ ఎగ్జిక్యూషన్, అడ్మినిస్ట్రేషన్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇంటర్నల్ ఆడిట్ వంటి దాదాపు అన్ని కోణాలలో అనుభవం ఉన్న భారతదేశంలోని రెండు ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో సీనియర్ పదవులలో పనిచేసారు. రమణదీప్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ మరియు విద్యార్హతగా కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. అతను ఒక సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిటర్.
-
అవినాష్ నాయక్
చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్
అవినాష్ నాయక్
మిస్టర్ అవినాష్ నాయక్ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. తన ప్రస్తుత పాత్రలో, అతను టెక్నాలజీ వ్యూహాన్ని నడపడానికి, డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు సంస్థకు కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్లను తీసుకురావడానికి బాధ్యత వహిస్తారు. అవినాష్ అనేక భౌగోళిక ప్రాంతాల్లో పెద్ద సాంకేతిక కార్యకలాపాలు, డిజిటల్ పరివర్తన మరియు ఇన్నోవేషన్ కార్యక్రమాలను నిర్వహించడంలో గొప్ప అనుభవం కలిగి ఉన్నారు. అతను Infosys Limited లో ఒక దశాబ్దానికి పైగా పనిచేశారు, ఇక్కడ అతను ఫార్చ్యూన్ 100 కంపెనీల కోసం డెలివరీ హెడ్, క్లయింట్ పార్ట్‌నర్, ప్రోగ్రామ్ మేనేజర్, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్ మొదలైన వాటితో సహా అనేక పాత్రలను పోషించారు. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో చేరడానికి ముందు, అతను బజాజ్ ఫిన్‌సర్వ్‌లోని గ్రూప్ కార్పొరేట్ స్ట్రాటెజీ బృందంలో భాగంగా ఉన్నారు, ఇక్కడ అతను గ్రూప్ కంపెనీలలో డిజిటల్ మరియు ఇన్నోవేషన్ ఎజెండాను నడపడానికి బాధ్యత వహించారు. అవినాష్ ముంబైలోని VJTI నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నారు.
-
కెవి దీపు
హెడ్ - ఆపరేషన్స్ మరియు కస్టమర్ సర్వీస్
కెవి దీపు
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద కె.వి. దీపు ఆపరేషన్స్ మరియు కస్టమర్ సర్వీస్ హెడ్, సీనియర్ ప్రెసిడెంట్. రిటైల్ ఫైనాన్స్ కార్యకలాపాలలో అతనికి గొప్ప నిర్వహణ అనుభవం ఉంది. అతని ప్రత్యేకతల్లో సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్ మరియు ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి.
ఈయన GE Capital లో సేల్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, సిక్స్ సిగ్మా మరియు ఆపరేషన్స్‌లో 19 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ఈయన ఒక సర్టిఫైడ్ లీన్ సిక్స్ సిగ్మా బ్లాక్ బెల్ట్, వివిధ పరిశ్రమ సమావేశాలు మరియు బిజినెస్ స్కూల్స్‌లో ఉపన్యాసకుడు. ఈయన వ్యాపార నిపుణుల ఎంపిక పరిశోధన సంఘం అయిన Harvard Business Review Advisory Council లో సభ్యుడు.
-
విక్రమ్‌జీత్ సింగ్
చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్
విక్రమ్‌జీత్ సింగ్
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో విక్రమ్‌జీత్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్. బజాజ్ అలియంజ్ జిఐసి కి ముందు విక్రమ్‌జీత్ L&T, Vodafone, మరియు Deutsche Bank వంటి ప్రముఖ సంస్థలతో విశేషమైన మరియు గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఒక యువ మరియు ఉత్సాహవంతమైన నాయకుడు అయిన విక్రమ్‌జీత్ ఎల్లప్పుడూ వినూత్నమైన మరియు మార్గనిర్దేశం చేసే హెచ్‌ఆర్ కార్యక్రమాలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నారు. మంచి పనితీరు నిర్వహణ ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడం మరియు సంస్కృతిలో మార్పును తీసుకురావడం ద్వారా అతను ప్రజల ఎజెండాకు విపరీతమైన సహకారం అందించారు.
-
ఆదిత్య శర్మ
చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ - రిటైల్ సేల్స్

ఆదిత్య శర్మ
శ్రీ ఆదిత్య శర్మ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కు చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ - రిటైల్ సేల్స్. ప్రస్తుతం ఈయన దాని వివిధ డిస్ట్రిబ్యూషన్ ఛానెళ్ల ద్వారా కంపెనీకి చెందిన మొత్తం రిటైల్ బిజినెస్ పోర్ట్‌ఫోలియోను లీడ్ చేయడానికి బాధ్యత వహిస్తారు. కంపెనీతో తన మునుపటి రోల్లో, అతను మోటార్ కోసం బిజినెస్ హెడ్‌గా ఉన్నారు మరియు అన్ని ఆటో ఇండస్ట్రీ విభాగాల నుండి ఆదాయ వృద్ధి, మార్కెట్ షేర్ మరియు ఫ్రాఫిట్స్ను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించారు. ఈయన కంపెనీ యొక్క అత్యంత వినూత్నమైన వర్చువల్ ఆఫీస్ ఇనీషియేటివ్‌ను నిర్వహించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. వివిధ డిస్ట్రిబ్యూషన్ ఛానెళ్లతో ఈయన పాత్ర సహకారంతో, కస్టమర్ సర్వీస్ పై ప్రత్యేక దృష్టితో కార్యాచరణ సామర్థ్యాన్ని మరియు వర్చువల్ కార్యాలయాల కోసం అభివృద్ధి ప్రాంతాలను గుర్తించడాన్ని నిర్ధారిస్తుంది. ఈయన కృషి వర్చువల్ ఆఫీస్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడంలో కంపెనీకి సహాయపడ్డాయి మరియు కస్టమర్ల ఇంటి వద్దకు ఇన్సూరెన్స్ పరిష్కారాలను తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాయి, తద్వారా ఇన్సూరెన్స్ వ్యాప్తిని మెరుగుపరిచాయి. ఆదిత్యకు రెండు దశాబ్దాలకు పైగా గొప్ప అనుభవం ఉంది మరియు కొత్త డిస్ట్రిబ్యూషన్ ఛానెల్‌లు, డిజిటల్ మార్కెటింగ్ మరియు రిటైల్ మార్కెటింగ్‌లను సమన్వయం చేయడం మరియు అభివృద్ధి చేయడం వంటి నైపుణ్యం కలిగిన రంగాలు ఉన్నాయి. ఆఫీస్ హెడ్, ఏరియా మేనేజర్, వెబ్ సేల్స్ హెడ్, డైరెక్ట్ మార్కెటింగ్, ట్రావెల్, రిటైల్ హెల్త్, హోమ్ మరియు స్ట్రాటజిక్ ఇనీషియేటివ్స్ హెడ్ వంటి భౌగోళిక రంగాలలో ఈయన వివిధ పాత్రలను నిర్వహించారు. ఆదిత్య సైన్స్ గ్రాడ్యుయేట్ మరియు హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం, సిమ్లా నుండి ఫైనాన్స్ మరియు కంట్రోల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్, మేనేజ్‌మెంట్ డిగ్రీని కలిగి ఉన్నారు. ఈయన ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఒక విశిష్ట సభ్యుడు. పని కాకుండా, అతను చదవడం, సినిమాలు చూడటం, వ్యాయామం చేయడం మరియు తన కుటుంబంతో సమయం గడపడం వంటివి ఆనందిస్తారు.
-
అమిత్ జోషి
చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్
అమిత్ జోషి
2016 సంవత్సరంలో బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా అమిత్ చేరారు. కంపెనీ బోర్డు మరియు ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ నిర్దేశించిన రిస్క్ మరియు రిటర్న్ లక్ష్యాల ప్రకారం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను నిర్వహించడానికి ఈయన బాధ్యత వహిస్తారు. బజాజ్ అలియంజ్‌లో చేరడానికి ముందు ఈయన మునుపటి అసైన్‌మెంట్ Aviva Life Insurance company లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో విస్తరించి ఉన్న పెట్టుబడి పరిశ్రమలో అమిత్‌కి 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. అతను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ ఎకనమిక్స్‌లో మాస్టర్ డిగ్రీని పొందారు. అమిత్ సిఎఫ్ఎ ఇన్స్టిట్యూట్ యుఎస్ఎ నుండి సిఎఫ్ఎ చార్టర్‌ను కూడా కలిగి ఉన్నారు. పనితో పాటు అమిత్ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ మరియు సైక్లింగ్ వంటి ఎండ్యూరెన్స్ క్రీడలలో చాలా యాక్టివ్‌గా ఉంటారు మరియు క్రమం తప్పకుండా మారథాన్‌లు మరియు అల్ట్రా-సైక్లింగ్ ఈవెంట్లలో పాల్గొంటారు.