Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ కొనండి/రెన్యూ చేసుకోండి

Bajaj Bike Insurance

బైక్ ఇన్సూరెన్స్ కోట్ కోసం వివరాలను షేర్ చేయండి

వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాన్ కార్డ్ ప్రకారం పేరును ఎంటర్ చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

బజాజ్ ఆటో తమ లైనప్‌లో పల్సర్ మరియు సిటి లాంటి వాహనాలను ఆఫర్ చేస్తూ, టూవీలర్ వాహన ప్రియులలో చాలా ప్రజాదరణ పొందింది. బైక్‌లు మాత్రమే కాకుండా, వారి ప్రోడక్ట్ శ్రేణిలో స్కూటర్లను కూడా కలిగి ఉంది. మీరు ఒక స్టైలిష్‌ బైక్, అలాగే ఉత్తమ పనితీరు కనబరిచే ఒక టూ-వీలర్ కోసం చూస్తున్నట్లయితే, మీరు ఈ ఎంపికలను పరిగణలోకి తీసుకోవచ్చు.

రోడ్డుపై పెరుగుతున్న వాహనాల కారణంగా, మీ సరికొత్త బజాజ్ ఆటో టూ-వీలర్ వాహనం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రమాదాల నుండి మీ వాహనాన్ని రక్షించడానికి మరియు నష్టాల కోసం ఆర్థిక పరిహారం పొందడానికి, మీరు బజాజ్ ఆటో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి. 

బజాజ్ ఆటో మోడల్స్ కోసం ఇన్సూరెన్స్ పాలసీల రకాలు

అద్భుతమైన ఫీచర్లతో నిండిన ఈ బైక్‌లు డబ్బుకు సమానమైన విలువను అందజేస్తాయి. నేర్చుకోవడం సులభం మరియు ఇంధన-సమర్థవంతమైనది, మీకోసం ఒక గొప్ప రవాణా సాధనంగా పనిచేస్తుంది. మీరు ఒక బజాజ్ బైక్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు, అదేసమయంలో దీనిని కూడా కొనుగోలు చేయాలి-‌ టూ-వీలర్ ఇన్సూరెన్స్. మీరు కొనుగోలు చేయదగిన రెండు ప్రధాన బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి - థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ మరియు సమగ్ర బైక్ ఇన్సూరెన్స్. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది.

థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్:

థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని కూడా పిలువబడే థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది మీ బైక్ ద్వారా థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా వారి ఆస్తికి జరిగిన నష్టాలకు కవరేజ్ అందిస్తుంది. భారతీయ చట్టం ప్రకారం భారతదేశంలోని బైక్ యజమానులందరికీ ఈ పాలసీ తప్పనిసరి అవసరం:‌ థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్.

సమగ్రమైన బైక్ భీమా:

మరోవైపు, సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ నష్టాలకు మాత్రమే కాకుండా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం మరియు ఇతర సంఘటనల కారణంగా మీ స్వంత బైక్‌కు జరిగిన నష్టాలకు కూడా కవరేజ్ అందిస్తుంది. ఇది యజమానికి పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను అందిస్తుంది మరియు కవరేజీని మరింత కస్టమైజ్ చేసుకోవడానికి ఆప్షనల్ యాడ్-ఆన్‌లను కూడా అందిస్తుంది.

మీకు ఒక బజాజ్ బైక్ ఉంటే, మీరు బజాజ్ బైక్‌ల కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేదా మీ అవసరాలకు అనుగుణంగా సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీని కూడా కొనుగోలు చేయవచ్చు.

బజాజ్ ఇన్సూరెన్స్‌లో చేర్పులు మరియు మినహాయింపులు

 • చేర్పులు

 • మినహాయింపులు

థర్డ్-పార్టీ వాహనానికి మరియు వారి ఆస్తికి జరిగిన నష్టాలు.

ప్రమాదం కారణంగా జరిగిన థర్డ్-పార్టీ గాయాలు.

వరదలు మరియు భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టాలు.

అల్లర్లు లాంటి మానవ నిర్మిత విపత్తుల కారణంగా జరిగిన నష్టాలు.

అగ్నిప్రమాదం కారణంగా మీ బైక్‌కు జరిగిన నష్టం లేదా డ్యామేజీలు.

దొంగతనం కారణంగా మీ బైక్‌కు జరిగిన నష్టం లేదా డ్యామేజీ.

1 ఆఫ్ 1

గడువు ముగిసిన లేదా చెల్లని డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేయడం.

డ్రగ్స్ లేదా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం.

చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కోసం బైక్‌ను ఉపయోగించడం.

నిత్యం బైక్‌ను ఉపయోగించడం వల్ల కలిగే సాధారణ అరుగుదల, తరుగుదల.

ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్ సమస్యలు కవర్ చేయబడవు.

1 ఆఫ్ 1

మీ బజాజ్ ఆటో బైక్ కోసం యాడ్-ఆన్ కవర్లు

మీరు మీ బజాజ్ బైక్ కోసం ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు, ఈ కింది యాడ్-ఆన్‌లలో కొన్నింటిని మీ సమగ్ర పాలసీకి జోడించవచ్చు:

• జీరో డిప్రిషియేషన్ కవర్:

ఈ యాడ్-ఆన్ కవర్ బైక్ విడిభాగాల తరుగుదల కోసం ఎలాంటి మినహాయింపు లేకుండా పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని పాలసీదారుకు అందిస్తుంది.

 

• పర్సనల్ యాక్సిడెంట్ కవర్:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఇన్సూర్ చేయబడిన బైక్‌ను నడుపుతున్నప్పుడు పాలసీదారుకు ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు, ఈ యాడ్-ఆన్ ఆర్థిక రక్షణను అందిస్తుంది.

 

• రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్:

ఈ యాడ్-ఆన్ టోయింగ్ సర్వీస్, ఫ్యూయల్ డెలివరీ మరియు ఇతర సేవలతో సహా రోడ్డుపై బ్రేక్‌డౌన్ లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయాన్ని అందిస్తుంది.

 

• ఇంజిన్ ప్రొటెక్ట్ కవర్:

ఇంజిన్ ప్రొటెక్ట్ యాడ్-ఆన్ అనేది ఇంజిన్‌లో నీటి ప్రవేశం, ఆయిల్ లీకేజ్ లేదా ఇతర సారూప్య కారణాల వల్ల జరిగిన నష్టాల విషయంలో ఇంజిన్ రిపేరింగ్ లేదా భర్తీ ఖర్చును కవర్ చేస్తుంది.

• నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) ప్రొటెక్ట్ కవర్:

పాలసీ వ్యవధిలో క్లెయిమ్ చేసిన తర్వాత కూడా పాలసీదారు తన ఎన్‌సిబి డిస్కౌంట్‌ను యథాతతంగా కలిగి ఉంటారని ఈ యాడ్-ఆన్ నిర్ధారిస్తుంది.

 

• కన్జ్యూమబుల్స్ కవర్:

ఈ యాడ్-ఆన్ ఇంజిన్ ఆయిల్, నట్లు, బోల్టులు మరియు స్క్రూలు లాంటి బైక్ రిపేరింగ్ సమయంలో ఉపయోగపడే కన్జ్యూమబుల్స్ ఖర్చును కూడా కవర్ చేస్తుంది.

 

• రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్:

ఒక యాక్సిడెంట్ కారణంగా దొంగతనం లేదా పూర్తి నష్టం జరిగిన సందర్భంలో పాలసీదారు, బైక్ యొక్క ఒరిజినల్ ఇన్వాయిస్ విలువను అందుకుంటారని ఈ యాడ్-ఆన్ నిర్ధారిస్తుంది.

ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మరియు ఎంచుకున్న బైక్ ఇన్సూరెన్స్ పాలసీ రకాన్ని బట్టి యాడ్-ఆన్‌ల లభ్యత మారవచ్చు. 

బజాజ్ టూ-వీలర్ కోసం బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి?

బజాజ్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి మీరు ఈ కింది విధంగా కొనసాగవచ్చు:

 1. ఇన్సూరర్ వెబ్‌సైట్‌కు వెళ్లండి.
 1. మీ బైక్ సంబంధిత వివరాలను మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.
 1. మీ అవసరాలకు అనుగుణంగా ఉండే ఒక ప్లాన్‌ను ఎంచుకోండి.
 1. మీరు ఎంచుకున్న పాలసీ ఆధారంగా మీరు ఒక కోట్‌ను అందుకుంటారు.
 1. సమగ్ర బజాజ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ద్వారా, మీకు నచ్చిన యాడ్-ఆన్‌లను జోడించి మీరు దీనిని కస్టమైజ్ చేయవచ్చు.
 1. ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా వెబ్‌సైట్‌లో మీ పాలసీ కోసం చెల్లించండి.

ఈ దశలు చాలా సులభమైనవి మరియు మీరు పాలసీని త్వరగా కొనుగోలు చేయవచ్చు. మీరు బజాజ్ ఆటో ఇన్సూరెన్స్ పాలసీ ధరను తెలుసుకోవాలనుకుంటే, మీరు మీ పాలసీ కోసం ఒక కోట్‌ను పొందడానికి టూ-వీలర్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ‌ను ఉపయోగించవచ్చు.

బజాజ్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా రెన్యూ చేసుకోవాలి?

మీ బజాజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం అనేది ఒక సులభమైన మరియు సౌకర్యవంతమైన ప్రాసెస్. మీ బజాజ్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 1. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు "బైక్ ఇన్సూరెన్స్ రెన్యూ చేయండి" ఆప్షన్‌ను ఎంచుకోండి.
 1. పాలసీ నంబర్ మరియు గడువు తేదీతో సహా పాలసీ వివరాలను నమోదు చేయండి మరియు మీ బైక్ సంబంధిత అవసరమైన సమాచారాన్ని అందించండి.
 1. అందించిన సమాచారాన్ని ధృవీకరించండి మరియు మీకు అవసరమైన కవరేజ్ ఆప్షన్లను ఎంచుకోండి.
 1. పాలసీ నిబంధనలు మరియు షరతులను సమీక్షించండి మరియు పాలసీ కోసం చెల్లింపును నిర్ధారించండి. రెన్యూవల్ సమయంలో ప్రీమియంల మధ్య వ్యత్యాసం ఉంటే, అది కవరేజ్ సవరణ మరియు/లేదా యాడ్-ఆన్‌ల చేర్పు మరియు మినహాయింపు కారణంగా ఉండవచ్చు.
 1. చెల్లింపు ప్రాసెస్ చేయబడిన తర్వాత, మీరు రెన్యూ చేయబడిన పాలసీ వివరాలతో కూడిన ఒక నిర్ధారణ ఇమెయిల్ అందుకుంటారు.

మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీరు ఇన్సూరర్ యొక్క కస్టమర్ సపోర్ట్ బృందాన్ని సంప్రదించవచ్చు లేదా సహాయం కోసం వారి ఆన్‌లైన్ చాట్‌బాట్‌లో సంభాషించవచ్చు.

బజాజ్ ఆటో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?

నగదురహిత లేదా రీయింబర్స్‌మెంట్ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం క్లెయిమ్ ఫైల్ చేయడానికి, కింది దశలను అనుసరించండి:

నగదురహిత క్లెయిమ్ కోసం:

 1. ప్రమాదం జరిగిన వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీకి విషయాన్ని తెలియజేయండి.
 2. మీ బైక్‌ను నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకువెళ్లండి, అనగా అది మీ ఇన్సూరెన్స్ కంపెనీతో అనుబంధం కలిగి ఉండాలి.
 3. ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది మరియు వారు రిపేర్ ఖర్చును అంచనా వేయడానికి వాహనాన్ని చెక్ చేస్తారు.
 4. ఆవిధంగా సర్వేయర్ మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఖర్చు గురించిన అంచనాను అందజేస్తారు.
 5. ఇన్సూరర్ ఖర్చు అంచనాను సమీక్షిస్తారు మరియు క్లెయిమ్‌ను ఆమోదిస్తారు.
 6. రిపేర్ పూర్తయిన తర్వాత, మీరు గ్యారేజీకి ఏమి చెల్లించకుండా మీ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. రిపేరింగ్ ఖర్చుల కోసం ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా గ్యారేజీకి చెల్లిస్తుంది.

 

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం:

 1. ప్రమాదం జరిగిన వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీకి విషయాన్ని తెలియజేయండి.
 2. మీ బైక్‌ను మీకు నచ్చిన గ్యారేజీకి తీసుకెళ్లండి.
 3. గ్యారేజీ నష్టాన్ని పరిశీలిస్తుంది మరియు రిపేర్ కోసం అంచనా వేయబడిన ఖర్చును తెలియజేస్తుంది.
 4. మీరు రిపేరింగ్ ఖర్చులను గ్యారేజీకి చెల్లించాలి మరియు రసీదును సేకరించాలి.
 5. మీ ఇన్సూరెన్స్ కంపెనీకి రసీదుతో సహా క్లెయిమ్ డాక్యుమెంట్లను కూడా సమర్పించండి.
 6. ఇన్సూరర్ క్లెయిమ్‌ను సమీక్షిస్తారు మరియు ఏవైనా వర్తించే మినహాయింపులు లేదా తరుగుదలను మినహాయించిన తర్వాత, చెల్లించిన మొత్తాన్ని మీకు రీయింబర్స్ చేస్తారు.

గమనిక: ఒక క్లెయిమ్‌ను ఫైల్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు ఎఫ్ఐఆర్ (వర్తిస్తే) లాంటి అన్ని సంబంధిత డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవడం ముఖ్యం.

బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

 1. ఇన్సూరెన్స్ పాలసీ కాపీ.
 2. డ్రైవర్ లైసెన్స్ కాపీ.
 3. ఎఫ్ఐఆర్ కాపీ.
 4. మీ బజాజ్ టూ-వీలర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీ.
 5. గ్యారేజ్ నుండి అంచనా బిల్లు.

తరచుగా అడిగే ప్రశ్నలు

బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

టూ-వీలర్ ఇన్సూరెన్స్ అని కూడా పిలువబడే బైక్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీ, ఇది ఏదైనా ప్రమాదం లేదా ఇతర ఊహించని సంఘటనల సందర్భంలో మీ బైక్ లేదా థర్డ్-పార్టీ ఆస్తికి లేదా వ్యక్తికి జరిగిన నష్టం నుండి మీకు ఆర్థిక రక్షణను అందిస్తుంది.

భారతదేశంలో బైక్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరా?

అవును, 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం, బైక్ యజమానులందరూ కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి.

సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఏమి కవర్ చేయబడుతుంది?

ఒక సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్-పార్టీ బాధ్యతలు మరియు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దొంగతనం మరియు అగ్నిప్రమాదం కారణంగా మీ బైక్‌కు జరిగిన నష్టాలను కూడా కవర్ చేస్తుంది.

బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?

బైక్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం అనేది బైక్ తయారీ మరియు మోడల్, బైక్ వయస్సు, భౌగోళిక స్థానం, ఇన్సూరెన్స్ పాలసీ రకం మరియు ఎంచుకున్న యాడ్-ఆన్‌లు లాంటి వివిధ అంశాల ఆధారంగా లెక్కించబడుతుంది.

నేను నా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా రెన్యూ చేసుకోగలను?

ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను సందర్శించడం, అవసరమైన వివరాలను నమోదు చేయడం, పాలసీని ఎంచుకోవడం మరియు చెల్లింపు చేయడం ద్వారా మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవచ్చు.

ఇన్సూరర్ బ్రాంచ్ ఆఫీసును సందర్శించడం ద్వారా లేదా వారి కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ద్వారా మీ పాలసీని ఆఫ్‌లైన్‌లో రెన్యూ చేసుకోవచ్చు. కవరేజీలో ఏవైనా జరిమానాలు లేదా ల్యాప్స్‌లను నివారించడానికి, గడువు ముగిసేలోపు మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవడం ముఖ్యం.

నేను నా ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా తగ్గించుకోగలను?

మీరు భద్రతా పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం, ఎఆర్ఎఐ గుర్తింపు పొందిన గ్రూప్‌లలో సభ్యులుగా మారడం, స్వచ్ఛంద మినహాయింపును ఎంచుకోవడం లేదా యాడ్-ఆన్‌ల సంఖ్యను తగ్గించడం ద్వారా మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకోవచ్చు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం