రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
What is Zero Depreciation Cover in Two Wheeler Insurance?
జూలై 23, 2020

బైక్ ఇన్సూరెన్స్‌లో జీరో డిప్రిసియేషన్

ప్రతి వాహనంలో డిప్రిసియేషన్ అనేది ఏర్పడుతుంది. సులభమైన మాటల్లో చెప్పాలంటే, డిప్రిసియేషన్ అనేది నిర్ధిష్ట వ్యవధిలో అరుగుదల మరియు తరుగుదల కారణంగా వస్తువు విలువలో తగ్గింపును సూచిస్తుంది. ఇది మీ టూ వీలర్ కోసం కూడా వర్తిస్తుంది.

క్లెయిమ్ సమయంలో మీ బైక్ ఇన్సూరెన్స్ విలువ తగ్గకుండా మిమ్మల్ని రక్షించడానికి, డిప్రిసియేషన్ లేదా జీరో డిప్రిసియేషన్ కవర్ అనేది యాడ్ ఆన్‌ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఈ పాలసీపై అదనపు ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ.

డిప్రిసియేషన్ కారణంగా మీ టూవీలర్ విలువలో తగ్గింపు అనేది పరిగణలోకి తీసుకోబడదు కావున, ఈ కవర్ క్లెయిమ్ ఫైల్ చేసే సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల, ఇది మీకు జరిగిన నష్టంపై మెరుగైన క్లెయిమ్ మొత్తాన్ని అందిస్తుంది మరియు పొదుపు కోసం సహాయపడుతుంది. ఉదాహరణకు, మీ బైక్‌కు ప్రమాదం జరిగితే, మీ నష్టానికి పూర్తి క్లెయిమ్ అందించబడుతుంది మరియు బైక్ తరుగుదల విలువ దీనిలో లెక్కించబడదు.

వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల విషయంలో అనేక సందర్భాలలో బైక్‌లో డిప్రిసియేషన్ వలన ప్రభావితం అయ్యే భాగాలు సాధారణంగా రీప్లేస్ చేయబడతాయి.

ప్రయోజనాలు:

జీరో డిప్రిసియేషన్ కవర్ మీకు ఈ విషయాల్లో సహాయపడగలదు -

  • ఒక క్లెయిమ్ సందర్భంలో మీ స్వంతంగా చేయవలసిన అదనపు ఖర్చులను తగ్గించడం
  • తప్పనిసరి మినహాయింపుల తర్వాత, వాస్తవ క్లెయిమ్ మొత్తాన్ని అందుకోవడం
  • మీ ప్రస్తుత కవర్‌కు మరింత రక్షణను జోడించడం
  • మీ సేవింగ్స్ వృద్ధి చేయడం
  • తక్కువ క్లెయిమ్ మొత్తాలకు సంబంధించిన భయాందోళనలకు స్వస్తి చెప్పడం

చేర్పులు మరియు మినహాయింపుల గురించి తెలుసుకొని దీని కోసం జీరో డిప్రిసియేషన్ కవర్ పొందండి-‌ కొత్త బైక్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్.

చేర్పులు:

    1. టూ వీలర్ తరుగుదల జరిగే భాగాల్లో రబ్బరు, నైలాన్, ప్లాస్టిక్ మరియు ఫైబర్-గ్లాస్ భాగాలు ఉంటాయి. జీరో డిప్రిషియేషన్ కవర్‌లో క్లెయిమ్ సెటిల్‌మెంట్ల విషయంలో రిపేర్/ భర్తీ కోసం ఖర్చు చేర్చబడి ఉంటుంది.

    2. పాలసీ వ్యవధిలో 2 క్లెయిమ్‌ల వరకు యాడ్-ఆన్ కవర్ చెల్లుబాటు అవుతుంది.

    3. జీరో డిప్రిషియేషన్ కవర్ ప్రత్యేకంగా 2 సంవత్సరాల వయస్సు గల బైక్/ టూ-వీలర్ కోసం రూపొందించబడింది.

    4. కొత్త బైక్‌ల కోసం మరియు బైక్ ఇన్సూరెన్స్ పాలసీల రెన్యూవల్ పై జీరో డిప్రిసియేషన్ కవర్ అందుబాటులో ఉంది.

    5. పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి, ఎందుకనగా, ఈ కవర్ నిర్దేశించిన టూవీలర్ వెహికల్ మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మినహాయింపులు:

    1. ఇన్సూర్ చేయబడని ప్రమాదం కోసం పరిహారం.

    2. మెకానికల్ స్లిప్-అప్ కారణంగా జరిగిన నష్టం.

    3. వయస్సు కారణంగా సాధారణ అరుగుదల మరియు తరుగుదలతో జరిగిన నష్టం.

    4. బై-ఫ్యూయల్ కిట్, టైర్లు మరియు గ్యాస్ కిట్లు లాంటి ఇన్సూర్ చేయబడని బైక్ వస్తువుల నష్టానికి పరిహారం.

    5. వాహనం పూర్తిగా దెబ్బతిన్న/ పోగొట్టుకున్న సందర్భంలో యాడ్-ఆన్ కవర్ ఆ ఖర్చును కవర్ చేయదు.

ముగింపు

మీరు జీరో డిప్రిసియేషన్ కవర్‌ను జోడించినట్లయితే స్టాండర్డ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీకు అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌ను అందిస్తుంది మరియు మీ ప్లాన్ చేయబడిన బడ్జెట్‌ను సమతుల్యంగా ఉంచుతుంది.‌ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని సరిపోల్చండి ఆన్‌లైన్

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి