రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
taxi insurance guide
29 మార్చి, 2023

గరిష్ఠ భద్రత కోసం లాంగ్-టర్మ్ కార్ ఇన్సూరెన్స్: ప్రయోజనాలు మరియు కవరేజ్ గురించి వివరించబడింది

కార్ ఇన్సూరెన్స్ అనేది కారును సొంతం చేసుకున్న లేదా డ్రైవ్ చేసే వారికి ఒక అవసరమైన కొనుగోలు కాబట్టి, కవరేజీ పరంగా చూసినప్పుడు ఉత్తమ ఎంపికల గురించి ముందుగానే సమాచారం కలిగి ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది వ్యక్తులు అన్వేషించే అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ప్రయోజనకరమైన ఎంపికల్లో లాంగ్ టర్మ్ కార్ ఇన్సూరెన్స్ ఒకటి. మల్టీ-ఇయర్ ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ అనేది డ్రైవర్లకు ఎల్లప్పుడూ అవసరమైన కవరేజీని అందించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ ఆర్టికల్‌లో, మల్టీ-ఇయర్ మరియు లాంగ్-టర్మ్ కార్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు, కవరేజ్ మరియు అర్హతా అవసరాలను గురించి మేము వివరిస్తాము.

మల్టీ-ఇయర్ మరియు లాంగ్-టర్మ్ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

మల్టీ-ఇయర్ కార్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన కార్ ఇన్సూరెన్స్. పూర్తి ప్రయోజనం విషయానికి వస్తే, ఇది కూడా సమగ్ర కార్ ఇన్సూరెన్స్ లాగానే ఉంటుంది. కవరేజీ వ్యవధి పొడవులో మార్పు మాత్రమే రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసంగా ఉంటుంది. ఒక స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి ఒక సంవత్సరం టర్మ్ ఉంటుంది. దీర్ఘకాలిక కార్ ఇన్సూరెన్స్ వ్యవధి అనేది సాధారణంగా రెండు నుండి ఐదు సంవత్సరాల మధ్య ఎంతైనా ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు కారు ఇన్సూరెన్స్ ‌ను ఒకేసారి 3 సంవత్సరాల కోసం కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఈ భావనకు సంబంధించి చాలామందిలో తలెత్తే ప్రధానమైన సందేహం అనేది ప్రీమియం చెల్లింపులకు సంబంధించినదిగా ఉంటుంది. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, ఎంత ప్రీమియం చెల్లించాలి మరియు ఎప్పుడు చెల్లించాలి? అనే ప్రశ్న ఎదురవుతుంది. సాధారణంగా, దీర్ఘకాలిక కార్ ఇన్సూరెన్స్ కోసం మీరు ప్రీమియం రూపంలో పెద్ద మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, తద్వారా మీరు సుదీర్ఘమైన కవరేజీ అవధిని అందుకుంటారు. అదనంగా, మల్టీ-ఇయర్ కార్ ఇన్సూరెన్స్ కోసం మీరు చెల్లించే మొత్తం అనేది ప్రతి సంవత్సరం మీ పాలసీని రెన్యూవల్ చేయడం కోసం మీరు మొత్తంగా ఖర్చు చేసే అమౌంట్ కంటే తక్కువగా ఉంటుంది.

మల్టీ-ఇయర్ కార్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

దీర్ఘకాలిక కార్ ఇన్సూరెన్స్‌ ఎంచుకోవడం ద్వారా అనేక ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి.

1. ఖర్చు ఆదా చేయవచ్చు

దీర్ఘకాలిక కార్ ఇన్సూరెన్స్ పాలసీలనేవి తరచుగా డిస్కౌంట్లతో లభిస్తాయి. తద్వారా, మీరు మీ పాలసీపై ఉత్తమ డీల్ పొందుతున్నారని మరియు మీ డబ్బును ఆదా చేస్తున్నారని నిర్ధారిస్తాయి.

2. సౌలభ్యం

మల్టీ-ఇయర్ కార్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి సంవత్సరం పాలసీని రెన్యూవల్ చేసుకోవడం గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని నివారిస్తుంది. అలాగే, పాలసీ మొత్తం వ్యవధి కోసం కవర్ చేయబడే సౌలభ్యాన్ని మీకు అందిస్తుంది.

3. మనశ్శాంతి

3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం వల్ల మీకు లేదా మీ కారుకు ఏది జరిగినా మీకు రక్షణ లభిస్తుందనే హామీ మీకు అదనంగా లభిస్తుంది.

4. సౌలభ్యం

కొన్ని మల్టీ-ఇయర్ పాలసీలనేవి మీ అవసరాలకు అనుగుణంగా కవరేజీని కస్టమైజ్ చేసే ఎంపికను కూడా అందిస్తాయి. మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా మీ పాలసీ రూపొందించబడిందని నిర్ధారించుకోవడంలో ఇది మీకు అదనపు ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.

మల్టీ-ఇయర్ మరియు లాంగ్-టర్మ్ కార్ ఇన్సూరెన్స్ కోసం కవరేజ్

· యాక్సిడెంట్ కవరేజ్

ప్రమాదం కారణంగా అవసరమైన మరమ్మత్తులు లేదా మార్పులతో పాటు ఆస్తి నష్టం లేదా శారీరక గాయాల కోసం లయబిలిటీ కవరేజ్.

· దొంగతనం కవరేజ్

దొంగతనానికి గురైన మీ కారు కోసం లేదా అందులోని భాగాల కోసం రీయింబర్స్‌మెంట్ లేదా కవరేజ్.

· ప్రకృతి వైపరీత్యం

వరదలు, వడగళ్ల వర్షం, భూకంపాలు లేదా విధ్వంసం లాంటి ప్రకృతి చర్య కారణంగా మీ కారుకు జరిగిన ఏదైనా నష్టం కోసం మరమ్మత్తులు లేదా మార్పులు.

· వైద్య ఖర్చులు

తప్పిదంతో సంబంధం లేకుండా, ప్రమాదం కారణంగా ఎదురైన ఏవైనా వైద్య ఖర్చుల కోసం కవరేజ్.

· చట్టపరమైన ఖర్చులు

ప్రమాదం కారణంగా ఎదురైన కోర్టు ఖర్చులు మరియు చట్టపరమైన ఫీజుల కోసం కవరేజ్.

మల్టీ-ఇయర్ కార్ ఇన్సూరెన్స్ కోసం యాడ్-ఆన్‌లు

చాలా వరకు మల్టీ-ఇయర్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలు డ్రైవర్లకు అవసరమైన విధంగా అదనపు కవరేజీ జోడించడానికి అనుమతిస్తాయి. ఇలాంటి సంఘటనలు కవర్ చేయడానికి ఇందులో కవరేజ్ ఉండవచ్చు:

· రోడ్‌సైడ్ అసిస్టెన్స్

టోయింగ్, ఫ్లాట్ టైర్ మార్పులు, డెడ్ బ్యాటరీ మార్చడం మరియు అవసరమైతే ఫ్యూయల్ డెలివరీ చేయడంతో సంబంధం కలిగిన ఖర్చులను ఇది కవర్ చేస్తుంది.

· కన్జ్యూమబుల్స్ కవరేజ్

దొంగతనం లేదా ప్రమాదం లాంటి సంఘటనల కారణంగా దెబ్బతిన్న లేదా పోగొట్టుకున్న కారులో నిల్వ చేయబడిన వ్యక్తిగత వస్తువుల కోసం కవరేజీ కూడా అనేక పాలసీల్లో భాగంగా ఉంటుంది. చివరగా, చాలా వరకు మల్టీ-ఇయర్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలనేవి యాంటీ-థెఫ్ట్ లేదా ఢీకొనడం నుండి రక్షణ లాంటి అదనపు కవరేజీ జోడించడం కోసం కూడా డిస్కౌంట్లు అందిస్తాయి. పాలసీ మొత్తం ఖర్చును తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అదనంగా, కొన్ని పాలసీల్లో అదే కంపెనీ నుండి అనేక పాలసీలు కొనుగోలు మీద డిస్కౌంట్లు కూడా ఉండవచ్చు.

మల్టీ-ఇయర్ మరియు లాంగ్-టర్మ్ కార్ ఇన్సూరెన్స్ కోసం అర్హతా ఆవశ్యకతలు

భారతదేశంలో మల్టీ-ఇయర్ కార్ ఇన్సూరెన్స్ కోసం అర్హత పొందడం కోసం డ్రైవర్లు క్రింది ప్రమాణాలు నెరవేర్చాలి:
  • డ్రైవర్లు కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • కారు కోసం చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ మరియు తగిన థర్డ్-పార్టీ కవర్‌ ఉండాలి.
  • చెల్లుబాటు అయ్యే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ రుజువును కూడా డ్రైవర్లు కలిగి ఉండాలి.
  • కారు అనేది కనీస భద్రతా ప్రమాణాలను నెరవేర్చాలి.
  • ఆ కారు ప్రతి సంవత్సరం తనిఖీ లేదా 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' (పియుసి) పరీక్షను పాస్ చేయాలి.

ముగింపు

లాంగ్-టర్మ్ కార్ ఇన్సూరెన్స్ అనేది తమకు సరసమైన ధర వద్ద అవసరమైన కవరేజ్ ఉందని నిర్థారించుకోవాలనుకునే డ్రైవర్లకు ఒక అద్భుతమైన ఎంపికగా ఉంటుంది. సౌలభ్యం, ఖర్చు పొదుపులు మరియు మనశ్శాంతితో సహా అలాంటి పాలసీల్లోని ప్రయోజనాలన్నీ వాటిని ఒక గొప్ప ఎంపికగా చేస్తాయి. అదనంగా, ఇందులో అందించే మరియు ఒక స్టాండర్డ్ ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో అందించే కవరేజీ ఒకటే అయినప్పటికీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లాంటి అదనపు కవరేజీని జోడించే ఎంపికలు అందుబాటులో ఉంటాయి. అయితే, కనీస వయస్సు మరియు మంచి డ్రైవింగ్ రికార్డుతో సహా అలాంటి పాలసీని తీసుకోవడానికి అవసరమైన అర్హతలను తప్పక నెరవేర్చాలి.   ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి