రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Laptop Insurance in India
31 మార్చి, 2021

భారతదేశంలో ల్యాప్‌టాప్ ఇన్సూరెన్స్

నేడు ల్యాప్‌టాప్‌లు నోట్‌బుక్‌లకు పర్యాయపదంగా మారాయి - ప్రతి విద్యార్థి, ప్రొఫెషనల్ మరియు నిపుణులు కూడా దీనిని వినియోగిస్తున్నారు! ల్యాప్‌టాప్‌లు యజమానులకు స్వేచ్ఛ మరియు ఉత్పాదకత యొక్క నూతన భావాన్ని కల్పిస్తాయి. ఈ పోర్టబుల్ పరికరాలు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగంగా మారాయి, ఇవి లేని జీవితాన్ని ఊహించడం చాలా కష్టం. మీ ల్యాప్‌టాప్ ఒక రోజు లేదా ఒక వారం లేదా ఒక నెల పాటు పాడైపోయిన స్థితిలో ఉంది అనుకుందాం. డేటాను తిరిగి పొందడానికి మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించండి. పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారితే, మీరు కొత్త దానిని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఒక ఉద్యోగి కోసం అయితే, ఇది తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. ల్యాప్‌టాప్‌లు అంత చవకైనవి కావు, వాటి అదనపు మరమ్మతు ఖర్చులు మరింత ఇబ్బందికి గురిచేస్తాయి. అందుకే, ఇలా అడగడం మామూలే – నేను నా ల్యాప్‌టాప్‌ను ఇన్సూర్ చేయవచ్చా? తెలుసుకోవడానికి మరింత చదవండి!  

నేను నా ల్యాప్‌టాప్‌ను ఇన్సూర్ చేయవచ్చా?

ఒక్క మాటలో సమాధానం - అవును, మీరు మీ ల్యాప్‌టాప్‌ను కవర్ చేసే ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ప్రీమియంలు అనేవి ల్యాప్‌టాప్ బ్రాండ్, మోడల్ మరియు నాణ్యతపై ఆధారపడి ఉంటాయి, ఇలాంటి పాలసీలు తమ ఉద్యోగులకు ఈ డివైసులను అందించే వ్యక్తిగత-యజమానులు మరియు వ్యాపారాలకు అనువైనవి.  

ల్యాప్‌టాప్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమి కవర్ చేయబడుతుంది?

కవరేజ్ వివరాలు ఎక్కువగా మీరు కలిగి ఉన్న ల్యాప్‌టాప్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆధారపడి ఉంటాయి. అయితే, కవరేజ్ యొక్క అత్యంత సాధారణ రూపాలు తప్పనిసరిగా ఈ కింది వాటిని కలిగి ఉంటాయి:
  1. స్క్రీన్ రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్: మీరు జాగ్రత్తగా గమనిస్తే, ల్యాప్‌టాప్‌లో సర్వసాధారణంగా డ్యామేజీకి గురయ్యే భాగాల్లో ల్యాప్‌టాప్ స్క్రీన్ ఒకటి. ఇడి పలచగా ఉంటుంది, అందువల్ల, సులభంగా డ్యామేజీకి గురయ్యే అవకాశం ఎక్కువ. ల్యాప్‌టాప్‌లు తరచుగా ఎప్పుడైనా మరియు ఎక్కడైనా ఉపయోగించబడుతున్నందున, అవి ఒక్కసారి కింద పడినా స్క్రీన్ పగిలిపోవడం లేదా డిస్‌ప్లే పూర్తిగా పాడైపోవడం లాంటివి జరగవచ్చు. స్క్రీన్‌ను సులభంగా రిపేర్ చేయడం సాధ్యం కాదు కాబట్టి, ఇది సాధారణంగా రీప్లేస్‌మెంట్ కోసం పంపబడుతుంది, ఇది ల్యాప్‌టాప్ విక్రయ ధరలో 10%-15% వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ల్యాప్‌టాప్ విలువ తగ్గుతూ వస్తుంది, అందువల్ల కొత్త స్క్రీన్ కోసం చెల్లించడం ఎల్లప్పుడూ సమంజసం కాదు. ఈ పరిస్థితిలో ల్యాప్‌టాప్ ఇన్సూరెన్స్ మీకు అండగా నిలుస్తుంది మరియు స్క్రీన్ రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ ఖర్చులను కవర్ చేస్తుంది.
 
  1. మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఇటువంటి ఇతర నష్టం: సాధారణ అరుగుదల మరియు తరుగుదల ఖర్చులు పాలసీలో కవర్ చేయబడనప్పటికీ, ఇది ల్యాప్‌టాప్ యొక్క అన్ని ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ వైఫల్యాలను కవర్ చేస్తుంది. అనేక ఇన్సూరెన్స్ పాలసీలు ఇన్సూరెన్స్ ప్రోడక్టులో కవర్ చేయబడే అన్ని బ్రాండ్‌లను గురించి స్పష్టంగా తెలియజేస్తాయి. కావున మీరు, తరచుగా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ వైఫల్యాలను ఎదుర్కొనే ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయడం లేదని నిర్ధారించుకోవచ్చు. కానీ, ఒకవేళ అలా జరిగితే, మీరు దానిని త్వరగా రిపేర్ చేయించుకోవచ్చు లేదా రీప్లేస్ చేయవచ్చు మరియు మీ ఇన్సూరెన్స్ సంస్థ వద్ద క్లెయిమ్ చేయవచ్చు.
 
  1. దొంగతనం, చోరీ లేదా మోసం: ఒక సారి ఊహించండి - మీరు ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఒక ఫ్రీలాన్సర్. మీరు రెండు రోజుల్లో మీ ఆర్ట్‌వర్క్‌ను డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఈరోజే మీరు పని చేసే కో-వర్కింగ్ స్పేస్ నుండి మీ ల్యాప్‌టాప్ దొంగిలించబడింది. మీరు రాబోయే రెండు రోజుల్లో ప్రాజెక్టు పని అంతటినీ మళ్లీ పూర్తి చేయగలిగినప్పటికీ, ఒక కొత్త ల్యాప్‌టాప్‌ను వెంటనే కొనుగోలు చేయగలరా? మీకు ఒక ల్యాప్‌టాప్‌ ఇన్సూరెన్స్ కవర్ ఉండి అందులో దొంగతనం కవర్ చేయబడి ఉంటే, ఒక కొత్త దానిని పొందడానికి మీరు మీ సేవింగ్స్ లేదా ఒక ఇఎంఐ ఎంపికను ఉపయోగించవచ్చు మరియు ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఫైల్ చేయవచ్చు.
 
  1. లిక్విడ్ స్పిల్లేజ్: ల్యాప్‌టాప్ యొక్క పోర్టబిలిటీ వలన మీరు దీనిని ఎక్కడైనా ఉపయోగించవచ్చు – కేఫ్‌టేరియాలో, మీ డైనింగ్ టేబుల్ పై, లేదా మీ స్నేహితులతో సినిమా చూస్తున్నప్పుడు దీనిని ఉపయోగించవచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు, ఇంకా, అది ఎక్కడైనా పాడైపోయే అవకాశం కూడా ఉండవచ్చు. కాఫీ, కూల్ డ్రింక్ లేదా నీళ్లు లాంటి ద్రవాలను మీరు అనుకోకుండా దీని పై చిందించవచ్చు. మీ టచ్‌ప్యాడ్ లేదా కీబోర్డ్‌కు తీవ్ర నష్టం కలగవచ్చు. ఒక సమగ్ర ల్యాప్‌టాప్ ఇన్సూరెన్స్ కవర్ అనేది ఇలాంటి పరిస్థితిలో మీకు అవసరమైన రిపేర్ మరియు రీప్లేస్‌మెంట్ ఖర్చులకు కవరేజీని అందిస్తుంది.
  ల్యాప్‌టాప్ ఇన్సూరెన్స్ యొక్క ప్రత్యేక ఫీచర్ పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్‌ను ఉపయోగించి ల్యాప్‌టాప్ విక్రేత లేదా తయారీదారు మీకు మార్కెట్ స్టాండర్డ్‌ పై అదనపు వారంటీని ఇవ్వగలరు. ఉదాహరణకు, మీరు 12 నెలల ప్రామాణిక వారంటీ వ్యవధితో కొత్త Dell ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశారని అనుకుందాం. ఒక పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్తో, ఈ వ్యవధి తర్వాత విక్రేత మీకు 12 నెలలు, 24 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి కోసం వారంటీని ఇవ్వవచ్చు. దీని కోసం మీకు ల్యాప్‌టాప్ రిటైల్ ధర కన్నా కొంచెం ఎక్కువగా ఖర్చవుతుంది. అయితే, ల్యాప్‌టాప్ వయస్సు మరియు విలువ తగ్గుతున్నప్పటికీ - ఇది రాబోయే కొన్ని సంవత్సరాల వరకు రిపేర్ ఖర్చుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.  

ఈ పాలసీలో మినహాయింపులు ఏమిటి?

  1. యుద్ధం లేదా తీవ్రవాద దాడుల వల్ల ల్యాప్‌టాప్ డ్యామేజ్ అవ్వడం.
  2. నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టం (అజాగ్రత్తగా వినియోగించడం).
  3. అరుగుదల మరియు తరుగుదల.
  4. రిపేర్ చేసే సమయంలో జరిగిన నష్టం.
 

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. పొడిగించబడిన వారంటీ ప్రయోజనాలు ఏమిటి?
పొడిగించబడిన వారంటీ ప్రయోజనాలు పొందడానికి ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లయితే, మీ ల్యాప్‌టాప్ వారంటీని సాధారణ వ్యవధికి మించి పొడిగించడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఈ విధంగా, ల్యాప్‌టాప్ విలువ పడిపోతున్నప్పటికీ మీరు హోల్డింగ్ వ్యవధిలో రిపేర్ల కోసం చెల్లించవలసిన అవసరం లేదు.    
  1. నేను పాత ల్యాప్‌టాప్ కోసం ఇన్సూరెన్స్ పొందవచ్చా?
సిద్ధాంతపరంగా - అవును. కానీ ల్యాప్‌టాప్ విలువ తక్కువగా ఉంటుంది మరియు అందువల్ల కవరేజ్ మొత్తం ఎక్కువగా ఉండదు. అదనంగా, అవసరమైన ప్రయోజనాలను పొందడానికి మీరు రైడర్లను కొనుగోలు చేయవలసి ఉంటుంది.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి