రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
What is Top Up Health Insurance & How Does it Work?
4 మార్చి, 2021

టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

వైద్య అత్యవసర పరిస్థితిలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ అన్ని అవసరాలను తీరుస్తుంది. కానీ, ఆసుపత్రి బిల్లులు హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మించిపోయినప్పుడు మీరు అదనపు మొత్తాన్ని భరించాల్సి వస్తుంది, అది కొన్నిసార్లు అదనపు జేబు ఖర్చుగా మారవచ్చు. అయితే, టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అలాంటి సంక్షోభాలను నివారించుకోవడానికి అవకాశం ఉంది.

టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పాలసీదారులు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల గరిష్ట పరిమితిని మించిపోయినప్పుడు, వారికి మద్దతుగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే అదనపు కవరేజీ. ఉదాహరణకు, మిస్టర్ A కి రూ. 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అతను వార్షికంగా రూ. 6000 ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ, అతను ఆ కవరేజ్ సరిపోదని భావిస్తున్నారు. తదనుగుణంగా, అతను ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పెంచినట్లయితే, ప్రీమియం మొత్తం రూ. 10,000 అవుతుంది. కానీ బదులుగా, అతను టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకున్నారు, అది ప్రతి 1 లక్ష టాప్-అప్‌ కోసం రూ. 1000 ప్రీమియం వసూలు చేస్తుంది. అందువల్ల, అదనపు 2 లక్షల కవర్ కోసం అతను సంవత్సరానికి రూ. 8,000 అని, అదనంగా రూ. 2000 చెల్లిస్తారు.

హెల్త్ ఇన్సూరెన్స్‌లో టాప్ అప్ అంటే ఏమిటి?

పాలసీదారుని మెడికల్ ఎమర్జెన్సీ క్లెయిమ్‌లు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్ ద్వారా కవర్ చేయబడే మొత్తం కన్నా ఎక్కువగా ఉంటే, అప్పుడు పాలసీదారు టాప్-అప్ ప్లాన్ నుండి అదనపు మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ఇక్కడ రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి - టాప్-అప్ మరియు సూపర్ టాప్-అప్.
  1. టాప్-అప్ ప్లాన్: క్లెయిమ్ ప్రాతిపదికన ప్రతి సంవత్సరానికి వర్తిస్తుంది మరియు క్లెయిమ్ అమౌంట్ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ మొత్తం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది.
  2. సూపర్ టాప్-అప్ ప్లాన్: ఒక సంవత్సరంలో పునరావృతమయ్యే క్లెయిమ్‌ల కారణంగా, పాలసీదారు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కవర్‌ను ముగించినప్పుడు ఇది అమలులోకి వస్తుంది.
   
క్లెయిమ్ మిస్టర్ A - రూ. 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ + రూ. 5 లక్షల టాప్-అప్ ప్లాన్ మిస్టర్ B-– రూ. 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ + రూ. 5 లక్షల సూపర్ టాప్-అప్ ప్లాన్
క్లెయిమ్ 1 — రూ. 3 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడుతుంది
క్లెయిమ్ 2 — రూ. 1 లక్ష పాలసీదారులు మొత్తం అమౌంటును చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకనగా, ఒక టాప్-అప్ ప్లాన్ వారు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లాన్‌ను మించిపోయిన సందర్భంలో క్లెయిమ్‌ను మాత్రమే కవర్ చేస్తుంది. సూపర్-టాప్ అప్ ప్లాన్ క్లెయిమ్‌ను కవర్ చేస్తుంది. ఒక సంవత్సరంలో అనేక క్లెయిమ్స్ చేయబడినప్పుడు పాలసీదారు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తాన్ని పూర్తి చేస్తే, సూపర్ టాప్-అప్ ప్లాన్ అదనపు మొత్తాన్ని చెల్లిస్తుంది.
క్లెయిమ్ 3 — రూ. 4 లక్షలు టాప్-అప్ ప్లాన్ ద్వారా రూ. 1 లక్ష మాత్రమే కవర్ చేయబడుతుంది, ఇది పాలసీదారు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లాన్ పై అదనపు మొత్తాన్ని సూచిస్తుంది. పాలసీదారు తన 1వ క్లెయిమ్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పూర్తిగా వినియోగించి నందున, అతను ఆ రూ. 3 లక్షలను చెల్లిస్తారు. సూపర్ టాప్-అప్ ప్లాన్ పూర్తి అమౌంటును కవర్ చేస్తుంది.  

టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?

ఒక టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం ముగిసిన తర్వాత మాత్రమే యాక్టివేట్ అవుతుంది. టాప్-అప్ మరియు సూపర్ టాప్-అప్ ప్లాన్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటంటే — ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కన్నా టాప్-అప్ ప్లాన్ ఒక్క క్లెయిమ్‌ను మాత్రమే కవర్ చేస్తుంది. దీనికి విరుద్ధంగా, సూపర్ టాప్-అప్ ప్లాన్ ఒక సంవత్సరంలో సామూహిక వైద్య ఖర్చుల కోసం క్లెయిమ్‌లు చేస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఈ ప్లాన్‌ను ఎందుకు పొందాలి?

పాలసీదారు తమ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, వైద్య లేదా ఆరోగ్య సంరక్షణ అవసరాలకు సరిపోదని భావించే సమయంలో పాలసీదారు ఆ కవరేజ్ అమౌంటును పెంచడానికి టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒక టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్, ఇది జీవితంలో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులలో పాలసీదారుడు కవర్ చేయబడతాడని నిర్ధారిస్తుంది.
  1. హెల్త్ ఇన్సూరెన్స్‌లో టాప్ అప్ అంటే ఏమిటి? ప్లాన్‌ను ఎవరు కొనుగోలు చేయాలి?

హెల్త్ ఇన్సూరెన్స్‌లో టాప్-అప్‌లు తరచుగా - హాస్పిటల్ క్యాష్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లాంటి అదనపు ప్రయోజనాలతో గందరగోళానికి గురిచేస్తాయి. కానీ, టాప్-అప్ అనేది ఒక రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌గా అదే ప్రయోజనాలను అందించే ఒక పాలసీ. ప్రతి పాలసీదారు తన ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ ఆధారిత ప్లాన్‌తో పాటు టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొనుగోలు చేయాలి. ఇది మరింత ఉదారమైన సీనియర్ సిటిజన్ల కవరేజీని కలిగి ఉంది, ఎందుకనగా వ్యక్తి వయస్సు పెరిగే కొద్దీ, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది. టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వల్ల ప్రీమియం గణనీయంగా తగ్గుతుంది.
  1. టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?

ఒకే హాస్పిటలైజేషన్ బిల్లు కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మరియు టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెండింటినీ ఒకేసారి క్లెయిమ్ చేయవచ్చు. ప్రతి ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్‌లలో కొంత భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ముగింపు:

ఒక టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది హెల్త్‌కేర్ పాలసీ మరియు వైద్య అత్యవసర ఖర్చుల మధ్య వారధిగా పనిచేస్తుంది. ఇది తక్కువ ఖర్చుతో హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని పెంచుతుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను కలిగిన లేదా ఏదైనా వ్యాధి చరిత్ర కలిగిన పాలసీదారుల కోసం టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక మంచి ఆప్షన్.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 3.3 / 5. ఓట్ల లెక్కింపు: 9

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి