రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
'చవకైన' అనే పదం మంచి బేరాన్ని ఇష్టపడే తెలివైన కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. తక్కువ ధరకి ఎక్కువ కావాలనుకోవడం మానవ సహజం, మరియు రిటైల్ థెరపీని విశ్వసించే వారికి ఇది కలిగించే ఆనందం అంతా ఇంతా కాదు.
అయితే ఒక హెచ్చరిక! చవకైన వస్తువులను కొనుగోలు చేయడంలో తప్పు ఏమీ లేనప్పటికీ, బైక్ ఇన్సూరెన్స్ వంటి కొన్ని ముఖ్యమైన విషయాల్లో, చవకైన టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు నిజంగా ఖరీదైనవిగా మారవచ్చు.
చవకైన బైక్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని ఆర్థికపరమైన భారం నుండి తప్పించవచ్చు, కాని, తగినంత కవరేజీని అందించడంలో విఫలం కావచ్చు. కావున, మీరు తక్కువ ప్రీమియంతో వచ్చే చవకైన టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇంకా ఆలస్యం చేయకుండా ఆ ఆలోచనను మానుకోండి!
బైక్ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయడంలో డబ్బును ఆదా చేయడం అనేది అన్ని విధాలా సమర్థవంతమైంది, కాని, దానిని వాస్తవంగా అమలులోకి తెచ్చినప్పుడు అది మీ అంచనాలకు తగినవిధంగా సరిపోదని తెలుసుకుంటారు. చవకైన బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు తరచుగా మిమ్మల్ని నిరాశపరుస్తాయి!
బైక్ ఇన్సూరెన్స్ శోధనలో ఎదురయ్యే సమస్యలు - ఆన్‌లైన్‌లో అనేక రివ్యూలను చదవడం, షోరూమ్‌లను సందర్శించడం, స్పెసిఫికేషన్‌లను చెక్ చేయడం - వంటివి ఒక ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుగొనడంలో మీకు సహాయపడతాయి, మీరు తక్కువ ధరని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తప్ప. అందుకు గల కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
మీరు మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ రక్షణ కోసం టెంపర్డ్ గ్లాస్ కొరకు వెతుకుతున్నప్పుడు, అంచులను కవర్ చేయడంలో విఫలమయ్యే గాజును కొనుగోలు చేస్తారా? లేదు, ఎందుకనగా ఫోన్ అంచులలో చిన్నపాటి నష్టం జరిగినా అది పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉంటుంది, దాని పనితీరు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా, చవకైన బైక్ ఇన్సూరెన్స్ తగిన కవరేజీని అందించడంలో విఫలం కావచ్చు, ఫలితంగా మీరే ఆ మొత్తాన్ని స్వయంగా చెల్లించాల్సి వస్తుంది. టూ వీలర్ ఇన్సూరెన్స్ వంటి ప్రధాన విషయానికి వస్తే, తగినంత కవరేజ్ అందించే పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
వారు హిండ్‌సైట్ ఎల్లప్పుడూ 20/20 ఉండాలని సూచిస్తారు. రద్దీగా ఉన్న ట్రాఫిక్ ద్వారా ప్రయాణిస్తున్నపుడు, మీ వెనుక వ్యూను చూపించే మిర్రర్, చాలా దగ్గరగా ఉండే వస్తువులను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 2వీలర్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, అన్ని ప్రోడక్టులు మీ అవసరాలను తీర్చలేవు.
యాడ్-ఆన్‌లు కవరేజీలో ఖాళీలను పూరిస్తాయి, మరో మాటలో చెప్పాలంటే, అవి మీ కవరేజీకి అదనపు అంశాలను అందిస్తాయి, రోడ్ సైడ్ అసిస్టెన్స్ లేదా డిప్రిసియేషన్ నుండి రక్షణ అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి.
అయితే, ఈ యాడ్-ఆన్‌లు దీనికి జోడించవచ్చు మీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఖర్చు, వారు అత్యవసర పరిస్థితుల్లో చెల్లించినప్పుడు మీరు నిస్సహాయత నుండి తప్పించుకుంటారు.
దాదాపు అన్ని విషయాలు ఒకేలా ఉన్నప్పటికీ, కస్టమర్ సేవ అనేది ఉత్తమమైన వాటిని సాధారణమైన వాటిని వేరు చేస్తుంది. చవకైన బైక్ ఇన్సూరెన్స్ కవర్ కొంత డబ్బును ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది, అయితే, దీంతో మీరు ఊహించిన విధంగా మీ అన్ని ప్రశ్నలకు త్వరగా, సమర్ధవంతమైన విధానంలో సమాధానాలు లభించకపోవచ్చు.
క్లెయిమ్ సెటిల్‌మెంట్ వంటి కీలక విషయానికి వస్తే, 24X7 క్లెయిమ్ సపోర్ట్ మరియు ఉన్నతస్థాయి కస్టమర్ సేవ కోసం ఎక్కువ చెల్లించడం సరైనది.
దీంతో నాకు ఏమి ప్రయోజనం, అని మీరు అడగవచ్చు? కొత్త కస్టమర్ల విషయంలో మా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ, మీ బైక్ కోసం తక్కువ ఖర్చుతో కూడిన ప్రీమియంతో సమగ్రమైన కవర్‌ను అందిస్తుంది.
బజాజ్ అలియంజ్ వద్ద మేము చవకైన బైక్ ఇన్సూరెన్స్‌ను సరసమైన ధరతో, బలమైన రక్షణను అందించే పాలసీగా నిర్వచించాము. ఒకరు తిరిగి ప్రత్యేకంగా మరొక దానికి ఖర్చు చేయనవసరం లేదని మేము నమ్ముతున్నాము. మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని పొందినప్పుడు, మీరు:
ప్రమాదాలను ఊహించలేము కావున, విపత్తు సమయంలో మీకు సహాయం చేయడానికి మేము 24 గంటలూ అందుబాటులో ఉన్నాము. మీ బీమాదారుగా మేము, మీకు అవసరమైనప్పుడల్లా సేవలను అందించాలనుకుంటున్నాము. మా 24x7 కాల్ క్లెయిమ్స్ సపోర్ట్ టీమ్ రాత్రిపగలు తేడా లేకుండా, ఏ సమయంలోనైనా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది.
మీరు చేయాల్సిందల్లా మా టోల్-ఫ్రీ నంబర్ 1800-209-5858పై కాల్ చేయాలి, తదుపరి క్లెయిమ్స్ ప్రాసెస్‌ను గురించి మేము మార్గనిర్దేశం చేస్తాము. మీ ప్రశ్న ఏదైనా - కొత్త పాలసీని కొనుగోలు చేయడం నుండి క్లెయిమ్‌ను పరిష్కరించడం వరకు - మేము మీ అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాము. మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ క్లెయిమ్స్ స్టేటస్‌పై తక్షణ అప్‌డేట్‌లను కూడా అందుకుంటారు.
మీరు మీ సంపాదనను పోగుచేయాలని మేము ఆశిస్తున్నాము. ఎన్‌సిబి విషయానికి వస్తే, మీ బైక్ ఇన్సూరెన్స్ అవసరాలను తీర్చుకోవడానికి బజాజ్ అలియంజ్‌ను ఎంచుకున్నప్పుడు, ఇప్పటికే ఉన్న ఎన్‌సిబిలో 50% బదిలీ చేయడాన్ని ఎంచుకోవచ్చు.
ఈ సదుపాయం, మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అత్యుత్తమ కార్ ఇన్సూరెన్స్ ప్రొడక్టుల ప్రయోజనాన్ని పొందేలా వీలుకల్పిస్తుంది. బజాజ్ అలియంజ్ వద్ద మేము, వ్యాపారం చేసే విధానంలో కస్టమర్ సాధికారతయే లక్ష్యంగా పనిచేస్తాము.
ఒక ప్రమాదం తరువాత, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ వేగం అనేది మీ బైక్ ఎంత తొందరగా తిరిగి రోడ్డుపైకి రాగలదో అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. అక్కడే మేము అడుగు ముందుకు వేస్తాము. మా వేగవంతమైన, అవాంతరాలు లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్, యాక్సిడెంట్ వంటి దుర్ఘటన తరువాత సాధ్యమైనంత వేగంగా కోలుకోవడానికి వీలు కల్పిస్తుంది.
అలాగే, క్యాష్‌లెస్ ధోరణికి అనుగుణంగా భారతదేశం అంతటా ఉన్న నెట్‌వర్క్ గ్యారేజీలతో మా టై-అప్ వేగవంతమైన, నగదురహిత క్లెయిమ్ పరిష్కారాన్ని నిర్ధారిస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేయవచ్చు లేదా మీ క్లెయిమ్‌ను నమోదు చేసుకోవడానికి మా టోల్-ఫ్రీ నంబర్‌కు డయల్ చేయవచ్చు.
ఇది మొదటి రౌండ్ డజర్ట్‌ను ఆస్వాదించిన తరువాత రెండవ సారి కోసం తిరిగి రావడం లాంటిది, అది కూడా బఫే క్యూలో నిలబడకుండానే;! మా అవాంతరాలు-లేని రెన్యూవల్ ప్రాసెస్ అనేది మిమ్మల్ని, మీ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎల్లప్పుడూ ఇన్సూరెన్స్‌తో సురక్షితంగా ఉంచుతుంది.
మీరు చేయవలసిందల్లా మా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం, రెన్యూవల్ కోసం అవసరమైన వివరాలను పూరించడం, ఇంతటితో మీ ప్రాసెస్ పూర్తి అవుతుంది! మీరు ప్రపంచంలోని ఏ మూల నుండి అయినా, మీ పాలసీని ప్రయాస లేకుండా రెన్యూ చేసుకోవచ్చు.
మీరు లాటరీ గురించి చాలా ప్రయత్నించి దానిని మానేసి ఉండవచ్చు, కాని, టూ వీలర్ ఇన్సూరెన్స్ విషయంలో మీరు ప్రతిసారి చేసే ప్రయత్నం ఫలించడానికి కొన్ని అంతర్గత చిట్కాలు ఇక్కడ ఉన్నాయి! మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? చదవండి.
మంచి బేరాలు ఆడటాన్ని ఇష్టపడతారా? కొంచెం పరిశోధనతో మీరు మీ అవసరాలకు తగిన ఇన్సూరెన్స్‌ను పొందడమే కాకుండా, మీ స్నేహితులు మరియు సహోద్యోగులు దృష్టిలో ఒక నిపుణుడిగా నిలుస్తారు. మీరు ఆదా చేసే సమయం, డబ్బును పరిగణనలోకి తీసుకుంటే, మీ శ్రమకు తగిన ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
మీ అవసరాలకు తగిన ప్లాన్‌ను ఎంచుకోవడం అనేది, ఒక కొత్త వార్డ్‌రోబ్‌ను కొనుగోలు కోసం దాని సైజు, రంగు వంటి వివిధ ఫీచర్లను వెతకడం లాంటిది. మీరు వెతుకుతున్న టాప్ 3 ఫీచర్ల జాబితాను రూపొందించండి. తరువాత, మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ కవరేజీని మరింత సమగ్రంగా చేసే ఏవైనా డిస్కౌంట్లు, మినహాయింపులు లేదా యాడ్-ఆన్‌ల కోసం చూడండి.
మీరు చేసే కొద్దిపాటి విశ్లేషణ, ఖచ్చితంగా ఒక ఆదర్శవంతమైన టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడంలో మీకు సహాయపడుతుంది! మీరు చేయాల్సిందల్లా అవసరమైన వివరాలను పూరించడం, బహుళ ఇన్సూరెన్స్ సంస్థల నుండి తక్షణ కోట్‌లు పొందటం. లక్ష్యం చేరువైంది, ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి!
క్రాస్ కంట్రీ బైక్ ట్రిప్‌లను ఇష్టపడుతుంటారా? మీరు బహుశా మీ స్థిరత్వంలో వేగాన్ని, మంచి సూపర్‌బైక్ కోసం తీరని అవసరాన్ని కలిగి ఉండవచ్చు. ఒక బైక్ ఇన్సూరెన్స్ దృష్ట్యా, హై ఎండ్ మోడల్ బైక్ మీ ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం కొన్ని వేల రూపాయలను జోడించవచ్చు. మీ ప్రమాణాలకు అనుకూలంగా ఉండే సరైన కవర్‌ను ఎంచుకోండి.
మరోవైపు, శ్రేణికి దిగువన ఉన్న మోడల్ కొంత మేరకు ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గిస్తుంది. మీ మెటాలిక్ స్టీడ్ కోసం తగిన కవర్‌ను పొందడానికి ఖర్చు-ప్రయోజన విశ్లేషణ మీకు సహాయపడుతుంది.
మీ వాలెట్‌లో తమ వాటా కోసం అనేక అంశాలు ప్రాధాన్యతను కలిగి ఉండవచ్చు, కానీ, టూ వీలర్ ఇన్సూరెన్స్ మినహాయింపులు మాత్రం ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. మినహాయింపు అనేది పాలసీ ప్రయోజనాలను ప్రారంభించడానికి ముందు, మీరు మీ స్వంత జేబు నుండి చెల్లించాల్సిన మొత్తాన్ని సూచిస్తుంది.
అధిక స్వచ్ఛంద మినహాయింపు మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించవచ్చు, కాని, మీ బైక్ ప్రమాదానికి గురైతే మినహాయింపు కింద పెద్దమొత్తంలో ఖర్చులను చెల్లించడానికి దారితీయవచ్చు. అందువలన, మీరు చెల్లించడానికి సౌకర్యంగా ఉండే మినహాయింపును ఎంచుకోండి.
మీరు అనారోగ్యం బారిన పడిన ప్రతిసారి వైద్య నిపుణులను సందర్శిస్తున్నారా? ఖచ్చితంగా కాదు. అదేవిధంగా, చిన్న రిపేర్స్ కోసం క్లెయిమ్ రైజ్ చేయడం మంచిది కాదు, ఇది ఎన్‌సిబిని కోల్పోవడానికి దారితీస్తుంది. ఉదాహరణకు, మీ హెడ్‌లైట్ విరిగి పోయినట్లయితే మీ ఎన్‌సిబిని చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవడానికి, స్థానిక మెకానిక్ నుండి దానిని రిపేర్ చేయించుకోవడం సమంజసం.
పోగుచేసిన ఎన్‌సిబి రెన్యూవల్ సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అనేక విధాలుగా మీ ప్రీమియం మొత్తాన్ని తగ్గించవచ్చు. ఇంకా ఏం ఉన్నాయి? ఇది ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి కొన్ని అదనపు మెరుపులను జోడించవచ్చు. కావున, ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసే సమయంలో తొందరపడకుండా, జాగ్రత్తగా ఉండండి.
కస్టమ్ బైక్ యాక్సెసరీస్ మరియు ఫిట్స్‌తో ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌ను రూపొందించండి. అయితే, ఇది మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో పెరుగుదలకు దారితీయవచ్చు. ఎందుకనగా, కస్టమ్ ఫిట్స్ కోసం రిపేరింగ్ ఖర్చుల ధర స్టాండర్డ్ టూ వీలర్ వెహికల్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది.
మరో మాటలో చెప్పాలంటే, మీరు చాలా వరకు రిస్క్‌లో పడతారు, తద్వారా ప్రీమియం మొత్తం పెరుగుతుంది. మా సలహా: జాగ్రత్తగా యాక్సెస్ చేయండి!
కొన్ని సందర్భాల్లో, మీరు మీ బైక్‌లో మార్పులు చేసి ఇన్సూరెన్స్ సంస్థకు ఆ విషయాన్ని తెలియజేయకపోతే మీ క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు.
వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రోడ్డు భద్రత ఒక తీవ్రమైన సమస్యగా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మీ ఆన్-రోడ్ భద్రతను నిర్ధారించుకోవడానికి, రైడింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం.
దీని వలన బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ప్రమాదాలను నివారించడానికి, మీ ఎన్‌సిబిని సంరక్షించడానికి, థర్డ్ పార్టీ వలన కలిగే నష్టాలను నివారించడంలో సహాయపడుతుంది. మీరు ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ సహాయం పొందవచ్చు లేదా రైడింగ్ క్లబ్‌లో చేరవచ్చు.
మీకు అనవసరమైన అన్ని కవర్‌లను జోడించడంతో మీ ప్రీమియంలో పెరుగుదల కనిపిస్తుంది. మీకు తగిన రక్షణ ఉందని నిర్ధారించుకోవడానికి, మీ కవరేజీని అంచనా వేయండి మరియు మిగిలిన వాటిని విస్మరించండి.
ఉదాహరణకు, ఇంజిన్ కవర్ మరియు జీరో డిప్రిసియేషన్ కవర్ తీసుకోవడం వివేకం అయితే, ఉపకరణాల కోసం కవర్ అంత ముఖ్యమైనది కాకపోవచ్చు. ఈ కవర్ అనవసరంగా మీ ప్రీమియం మొత్తాన్ని పెంచవచ్చు. అందువలన, మీ ఇన్సూరెన్స్ పాలసీకి విలువను జోడించే యాడ్-ఆన్‍లను ఎంచుకోండి.
చవకైన బైక్ ఇన్సూరెన్స్ అనేది మీరు తెలివిగా ఆడాల్సిన ఒక గేమ్ లాంటిది. మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ మరియు ఊహాత్మక ఇన్సూరెన్స్ అవసరాలను బట్టి, మీరు ఒక విజేతగా నిలవడానికి కావలసిన మరియు ఉత్తమమైన పాలసీల మధ్యన ఎంచుకోవాలి.
ప్రభావవంతమైన మరియు మీ పొదుపును హరించివేయని బైక్ ఇన్సూరెన్స్‌ను మీరు ఎలా ఎంచుకోవాలో ఇక్కడ ఇవ్వబడింది.
విహారయాత్రకు వెళ్లినప్పుడు మీకు అవసరం అవుతుందని మీతో పాటు కొంత అదనపు నగదును తీసుకెళ్లలేదా? అదేవిధంగా, టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునేటప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగితే మీ ఖర్చులను తగ్గించే కవరేజ్ మొత్తాన్ని ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.
కొంచెం అదనపు కవరేజ్ చెడ్డది కాదు.
యాడ్-ఆన్‌లు మీ బైక్ ఇన్సూరెన్స్‌ను బలపరుస్తాయి, అలాగే మీకు సమగ్ర కవరేజీని అందిస్తాయి. వివిధ బైక్ ఇన్సూరెన్స్ కవర్‌ల కోసం సెర్చ్ చేస్తున్నపుడు, అందుబాటులో ఉన్న యాడ్-ఆన్‌లను సరిపోల్చండి, అవి మీ బైక్ ఇన్సూరెన్స్ ధరను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మీకు, మీ బైక్‌కు 360-డిగ్రీల రక్షణను అందించడానికి, సంబంధిత యాడ్-ఆన్ కవర్‌లను తెలివిగా ఉపయోగించుకోండి.
ముఖ విలువ వద్ద క్లెయిమ్స్ తీసుకోవద్దు! చవకైన బైక్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునే విషయానికి వస్తే, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఖచ్చితంగా పరిగణించవలసిన కీలక అంశం. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పరిశోధించండి, సరైన దానిని ఎంచుకోవడానికి క్లెయిమ్ నిష్పత్తులను జాగ్రత్తగా పరిశీలించండి.
క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో అనేది, ఒక ఇన్సూరెన్స్ సంస్థ తాను స్వీకరించిన క్లెయిమ్స్ నుండి సెటిల్ చేసిన క్లెయిమ్‌ల సంఖ్యను సూచిస్తుంది. ఎక్కువ క్లెయిమ్ నిష్పత్తి మంచిదని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రకృతి ఆగ్రహానికి అవధులు లేవు. ప్రకృతి కోపాన్ని అదుపు చేయడం సాధ్యం కానప్పటికీ, ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి నష్టాలను తగ్గించుకోవడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మరింత చదవండి
ప్రకృతి ఆగ్రహానికి అవధులు లేవు. ప్రకృతి కోపాన్ని అదుపు చేయడం సాధ్యం కానప్పటికీ, ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి నష్టాలను తగ్గించుకోవడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది.
మా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ అగ్నిప్రమాదం, విస్ఫోటనం, కార్చిచ్చు లేదా పిడుగుపాటు, భూకంపం, వరద, టైఫూన్, హరికేన్, తుఫాను, టెంపెస్ట్, అధిక ఉష్ణోగ్రత, సైక్లోన్, వడగళ్ల వాన, సైక్లోన్, కొండచరియలు విరిగి పడటం, మంచు, రాక్‌స్లైడ్ వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టాల నుండి మీకు రక్షణను అందిస్తుంది.
మీ టూ వీలర్ వెహికల్ యాక్సిడెంట్ అనేది, రెప్పపాటులో మీ జీవిత గమనాన్ని మార్చగలదు. ప్రకృతి వైపరీత్యాల మాదిరిగానే, మరింత చదవండి
మీ టూ వీలర్ వెహికల్ యాక్సిడెంట్ రెప్పపాటులో మీ జీవిత గమనాన్ని మార్చగలదు. ప్రకృతి వైపరీత్యాల మాదిరిగానే, ఇతరుల వాహనాలకు సంబంధించిన విషయాలను అంచనా వేయడం చాలా కష్టం. మా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు, మీ బైక్‌కు దోపిడీ, దొంగతనం, అల్లర్లు, సమ్మెలు, ప్రమాదాలు లేదా ఏదైనా తీవ్రవాద కార్యకలాపాల వంటి మానవ నిర్మిత విపత్తుల వల్ల కలిగే నష్టాల నుండి ఆర్థిక పరిపుష్టిని అందిస్తుంది.
అదనంగా మేము రైలు, రోడ్డు, అంతర్గత జలమార్గాలు, ఎలివేటర్లు లేదా వాయు మార్గం ద్వారా రవాణాలో జరిగిన నష్టాలు లేదా డ్యామేజీలకు కూడా కవరేజ్ అందిస్తాము.
దురదృష్టవశాత్తు, మీ బైక్‌కు సంబంధించిన యాక్సిడెంట్లు కేవలం వ్యక్తిగత గాయాలు లేదా నష్టానికి మాత్రమే పరిమితం కావు. మరింత చదవండి
దురదృష్టవశాత్తు, మీ బైక్‌కు సంబంధించిన యాక్సిడెంట్లు కేవలం వ్యక్తిగత గాయాలు లేదా నష్టానికి మాత్రమే పరిమితం కావు. థర్డ్-పార్టీకి జరిగిన ఏవైనా నష్టాలు మీ ఫైనాన్సులను పూర్తిగా హరించివేస్తాయి.
మా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మరొక వ్యక్తికి లేదా అతని/ ఆమె ఆస్తికి జరిగిన నష్టం, మరణం లేదా శారీరక హాని కారణంగా ఉత్పన్నమయ్యే థర్డ్ పార్టీ బాధ్యతను కవర్ చేస్తుంది. అలాగే, మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి.
ఒక యాక్సిడెంట్ కేవలం మీకు బిల్లులు, ఒత్తిడిని మిగులుస్తుంది. మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మరింత చదవండి
ఒక యాక్సిడెంట్ కేవలం బిల్లులను, ఒత్తిడిని మిగులుస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు, పర్వతాన్ని అధిరోహిస్తున్నపుడు లేదా దిగుతున్నప్పుడు జరిగే ప్రమాదాల కోసం మీరు, మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో రూ. 1 లక్ష వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీతో కవర్ చేయబడతారు.
పిలియన్ రైడర్‌కు కవరేజీని అందించడానికి, మీరు మీ పాలసీలో కో-ప్యాసింజర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కూడా జోడించవచ్చు.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
అప్పారావు పసుపురెడ్డి ముంబై
మంచి ఆన్‌లైన్ అనుభవం.
మదన్‌మోహన్ గోవిందరాజులు ముంబై
స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ మరియు ధర.
పాయల్ నాయక్ ముంబై
చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు సౌకర్యవంతమైనది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి