Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ / టోయింగ్ సౌకర్యం

క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

మీ కారు బ్రేక్‌డౌన్ అయితే లేదా రోడ్డుపై పెద్ద సమస్యను ఎదుర్కొంటే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ గొప్పగా సహాయపడుతుంది. అంతేకాకుండా, దారి మధ్యలో ఎక్కడైనా చిక్కుకుపోవడం నిరాశాజనకంగా ఉంటుంది. అందుకే, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది.

కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఫీచర్‌ను స్టాండ్‌అలోన్‌ కారు ఇన్సూరెన్స్ పాలసీ, కొందరు ఒక యాడ్-ఆన్ ఫీచర్‌గా దీనిని అందిస్తారు, నామమాత్రపు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా మీరు మీ అభీష్టానుసారం దీనిని పొందవచ్చు. *

 

కార్ ఇన్సూరెన్స్‌లో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అంటే ఏమిటి?

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అనేది ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీలో చేర్చగల ఒక యాడ్-ఆన్ ఫీచర్. ఇది రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు బ్రేక్‌డౌన్ లేదా ఇతర దుర్ఘటన సందర్భంలో అత్యవసర సేవలకు యాక్సెస్ అందిస్తుంది.

సాధారణంగా, 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ బ్యాటరీ జంప్-స్టార్ట్స్, టైర్ మార్పులు, ఇంధన డెలివరీ మరియు టోయింగ్‌తో సహా విస్తృత శ్రేణి సేవలను కవర్ చేయవచ్చు. ఒకవేళ మీ కారును అదే రోజులోపు ఫిక్స్ చేయకపోతే లాక్అవుట్ సహాయం, అత్యవసర వసతి లేదా ప్రయాణ ఖర్చులు లాంటి అదనపు సేవలను కూడా కొన్ని పాలసీలు అందించవచ్చు. *

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అనేది మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి ఒక విలువైన యాడ్-ఆన్‌గా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది బ్రేక్‌డౌన్ సందర్భంలో సమయం మరియు డబ్బును ఆదా చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. అది లేకుండా, డ్రైవర్లు రోడ్డుపై చిక్కుకుపోయి ఖరీదైన టోయింగ్ ఫీజులు లేదా అధ్వాన్నంగా, కారును స్వయంగా సరిచేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ప్రమాదంలో పడిపోతారు. *

వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు వివిధ రకాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవరేజీని అందించవచ్చని గమనించడం ముఖ్యం, కాబట్టి కొనుగోలు చేయడానికి ముందు పాలసీ వివరాలను జాగ్రత్తగా సమీక్షించడం ముఖ్యం. సాధారణంగా, ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక స్టాండ్‌అలోన్ సర్వీస్‌గా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అందిస్తాయి, ఇది వారి కార్ ఇన్సూరెన్స్ పాలసీకి జోడించాలనుకునే వారికి ఒక సౌకర్యవంతమైన ఎంపికగా ఉండవచ్చు.

 

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ కింద కవరేజ్

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ అమలులోకి వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి:

✓ ఎలక్ట్రికల్/ మెకానికల్ బ్రేక్‌డౌన్

మీ కారు ఎక్కడైనా మధ్యలో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్‌కు గురైతే, ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అవసరమైన రిపేర్లు చేయడానికి మెకానిక్‌ను ఏర్పాటు చేస్తారు. *

✓  ఫ్లాట్ టైర్

ఈ సందర్భంలో, టైర్‌ను రిపేర్ చేయడానికి లేదా రీప్లేస్ చేయడానికి ఒక సాంకేతిక నిపుణుడిని ఏర్పాటు చేయడంలో ఇన్సూరెన్స్ సంస్థ మీకు సహాయపడుతుంది. *

✓ టోయింగ్

యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఇన్సూరెన్స్ ప్రొవైడర్, మీ కారును నెట్‌వర్క్ గ్యారేజీకి తరలించే సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. *

✓  రిపేర్ చేయబడిన కార్ డెలివరీ

మీరు ఏదైనా టూర్‌లో ఉన్నపుడు, మీ రిపేర్ చేయబడిన కారును మీ ఇంటికి డెలివరీ చేయడానికి ఇన్సూరెన్స్ సంస్థ అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తుంది. *

✓  అత్యవసర మెసేజ్‌ల పంపిణీ

కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండటానికి, వారికి అత్యవసర మెసేజ్‌లను పంపించడంలో సహాయపడుతుంది. *

✓  ఇంధన సహాయం

ఇందులో 5 లీటర్ల వరకు ఇంధనాన్ని ఏర్పాటు చేయడం (ఈ ఖర్చులను మీరే భరించాలి) లేదా ఇంధనం కలుషితం కావడం వలన మీ వాహనం కదలలేకపోతే, దానిని సమీపంలోని గ్యారేజీకి తీసుకెళ్లడం వంటివి ఉంటాయి. *

 

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రయోజనాలు

మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మనశ్శాంతి కోసం చూస్తున్నట్లయితే, మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను జోడించడం అనేది ఒక గొప్ప ఎంపిక. ఈ కవరేజీతో మీరు బ్రేక్‌డౌన్ లేదా అత్యవసర పరిస్థితిలో మీకు సహాయం అందుబాటులో ఉంటుందని నిశ్చింతగా ఉండవచ్చు. తరచుగా దూర ప్రాంతాలకు లేదా మారుమూల ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. *

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మీ డబ్బును మరియు సమయాన్ని ఆదా చేయవచ్చు. అది లేకుండా, మీరు ఖరీదైన టోయింగ్ ఫీజులు చెల్లించాల్సి రావచ్చు లేదా ఎవరైనా వచ్చి సహాయం చేస్తారని రోడ్డు పక్కన గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో మీరు రోడ్డుపై తిరిగి రావడానికి అవసరమైన సహాయాన్ని త్వరగా మరియు సులభంగా పొందవచ్చు. *

అంతేకాకుండా, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అనేది మీ కారు అదే రోజులోపు రిపేర్ చేయబడకపోతే లాక్అవుట్ సహాయం, అత్యవసర వసతి లేదా ప్రయాణ ఖర్చులు లాంటి అదనపు సేవలను అందించగలదు. మీరు మీ ఇంటి నుండి దూరంగా ఉన్నట్లయితే మరియు మీరు ఉండటానికి లేదా మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఒక స్థలాన్ని కనుగొనడంలో మీకు సహాయం అవసరమైతే ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. మొత్తంమీద, మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి 24X7 రోడ్‌సైడ్ సహాయాన్ని జోడించడం అనేది ఊహించని పరిస్థితులలో అవసరమైన మద్దతును అందించగలదు. *

 

నేను ఈ కవర్‌ను ఎంచుకోవచ్చా?

మీరు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ను పరిగణలోకి తీసుకోవాలా, వద్దా అనేది మీ ఇన్సూరెన్స్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలు:

✓  వాహనం యొక్క వయస్సు

ఒకవేళ మీ కారు కొత్తది అయితే, అది అత్యుత్తమంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో మీరు ఈ కవర్‌ను ఎంచుకోకూడదని ఎంచుకోవచ్చు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ సాధారణంగా పాత మోడల్ వేరియంట్ల వాహనాలకు ఎక్కువగా వర్తిస్తుంది. *

✓  వినియోగం పరిధి మరియు కవర్ చేయబడిన దూరం

మీరు తరచుగా సుదూర ప్రాంతాలకు మీ కారులో ప్రయాణించాలనుకుంటే, మీరు ఖచ్చితంగా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ను ఎంచుకోవచ్చు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌తో మీరు తదుపరిసారి మీకు లాంగ్ రోడ్ ట్రిప్ ఉన్నప్పుడు బ్రేక్‌డౌన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. *

మరిన్ని అన్వేషించండి:‌ కార్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
faq

ఏవైనా ప్రశ్నలున్నాయా? సమాధానాల కోసం ఇక్కడ చూడండి

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఒక క్లెయిమ్‌గా పరిగణించబడుతుందా?

లేదు, వాస్తవంగా చెప్పాలంటే రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను వినియోగించడం అనేది మీ కారు ఇన్సూరెన్స్ పాలసీపై క్లెయిమ్‌గా పరిగణించబడదు. డ్రైవింగ్ చేసేటప్పుడు బ్రేక్‌డౌన్ లేదా ఇతర అత్యవసర పరిస్థితి సందర్భంలో మీకు సహాయపడటానికి 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అనేది మీ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ఒక సర్వీస్‌గా పరిగణించబడుతుంది. ఇది ఒక క్లెయిమ్‌గా పరిగణించబడదు. ఎందుకంటే, మీరు మీ వాహనానికి జరిగిన ఏవైనా నష్టాలకు ఆర్థిక రీయింబర్స్‌మెంట్‌ను అభ్యర్థించడం లేదు.

అయితే, మీ కవరేజ్ మరియు మీ పాలసీ నిబంధనలపై ఆధారపడి కొన్ని వైవిధ్యాలు ఉండవచ్చు కాబట్టి, మీ నిర్దిష్ట ఇన్సూరెన్స్ పాలసీని సమీక్షించడం ముఖ్యం. *

మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కింద టైర్లు కవర్ చేయబడతాయా?

అవును, టైర్ సంబంధిత సమస్యలు సాధారణంగా 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ కింద కవర్ చేయబడతాయి. ఇందులో ఫ్లాట్ టైర్ మార్చడం లేదా పంక్చర్ సమయంలో స్పేర్ టైర్ అందించడం లాంటి సేవలు ఉండవచ్చు.

మీ పాలసీ నిబంధనలపై ఆధారపడి, కొన్ని పాలసీలు సంవత్సరానికి టైర్ సంబంధిత సమస్యల కోసం మీరు రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ని ఎన్నిసార్లు ఉపయోగించవచ్చు అనే దానిపై పరిమితులను కలిగి ఉండవచ్చు లేదా కొన్ని రకాల టైర్ సమస్యలను మాత్రమే కవర్ చేయవచ్చు. మీ టైర్‌లు చెడిపోవడం లేదా మరమ్మత్తు చేయలేని నష్టం కారణంగా రీప్లేస్‌మెంట్ అవసరమైతే, ఇది రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ పరిధిలోకి రాకపోవచ్చు మరియు మీ కారు బీమా పాలసీ కింద ప్రత్యేక క్లెయిమ్ అవసరం కావచ్చు.

మొత్తం మీద, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కింద మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ టైర్ సంబంధిత సమస్యలను కవర్ చేస్తుందా అనేదాని గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే, పాలసీ వివరాలను సమీక్షించడం లేదా మరింత సమాచారం కోసం మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించడం ఉత్తమం. *

నేను రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఉపయోగించినట్లయితే నా ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుందా?

లేదు, సాధారణంగా రోడ్‌సైడ్ కవర్‌ను ఉపయోగించడం వల్ల మీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగవు. ఇది ఎందుకంటే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సాధారణంగా మీ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ప్రత్యేక సేవగా పరిగణించబడుతుంది మరియు ఇది డ్రైవింగ్ చరిత్ర లేదా గత క్లెయిమ్‌లు లాంటి మీ ప్రీమియంలను ప్రభావితం చేసే అంశాలకు సంబంధించినది కాదు.

అయితే, ఒక ప్రమాదం కారణంగా జరిగిన నష్టం వల్ల మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద క్లెయిమ్ చేస్తే, ఇది మీ ప్రీమియంల పెరుగుదలకు కారణం కావచ్చు అని గమనించడం ముఖ్యం. *

ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

* ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం