రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Price & Age of Vintage Cars
30 మార్చి, 2021

వింటేజ్ కార్లు: భారతదేశంలోని మోడల్స్, వాటి ధరలు మరియు వయస్సు

మనం కేవలం చట్టపరమైన అవసరానికి మాత్రమే కాకుండా, ఇతర అవసరమైన సమయాల్లో తీవ్ర నష్టం జరగకుండా ఆర్థిక స్థితిని కాపాడుకోవడానికి వాహనాలను ఇన్సూర్ చేస్తాము. ఒకవేళ మనం ఒక రెగ్యులర్ కారు కోసం ఈ విషయాలను పరిగణిస్తే, నిస్సందేహంగా మనకు క్లాసిక్ లేదా వింటేజ్ కారు అవసరం. ఒక వింటేజ్ కారు ధర ఎంతో అని మీరు తెలుసుకోవాలనుకుంటే, రిపేరింగ్ ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి, మీరు ఒక సాధారణ మోటార్ కారును మేనేజ్ చేయలేకపోతే, ఒక వింటేజ్ కారును మేనేజ్ చేయడం అనేది ఖచ్చితంగా తలకు మించిన భారం అవుతుంది. పాత కార్ల వర్గాలు ప్రతి నిత్యం ఒక సామాన్యుడికి ఎదురయ్యే సాధారణ ప్రశ్న ఏమిటంటే, కార్లను వర్గాల వారీగా ఎలా విభజించారు? అయితే, కార్లు తయారీ సంవత్సరం ఆధారంగా వర్గీకరించబడతాయి. వెంటనే తలెత్తే మరొక ప్రశ్న ఏమిటంటే ఒక వింటేజ్ కారు ఏ సంవత్సరానికి చెందినది మరియు ఇతర వర్గాలు ఏమిటి? వివరంగా చూద్దాం. క్లాసిక్ కార్లు: ఈ కార్లు 1940 మరియు 1970 మధ్య తయారు చేయబడ్డాయి. వర్గీకరణ అనేది వివిధ అంశాల ఆధారంగా జరుగుతుంది, వాటిలో అత్యంత ప్రధానమైన తయారీ సంవత్సరం. ఇది దాని ఒరిజినల్ డిజైన్, స్పెసిఫికేషన్ మరియు ఫీచర్లకు దగ్గరగా ఉంటుందని భావించడం జరుగుతుంది. వింటేజ్ కార్లు: కొన్నిసార్లు 1919 మరియు 1925 మధ్య, అలాగే 1930 లో తయారు చేయబడిన కార్లు కూడా వింటేజ్ కార్లుగా వర్గీకరించబడతాయి. ఇవి చాలా పాతవి, చాలా తక్కువగా వాడుకలో ఉన్నాయి. డిజైన్ లేదా ఫీచర్లలో మార్పులు ఈ వర్గాలకు చెందిన కార్ల ధరపై తక్కువ ప్రభావం చూపుతాయి. పాత కార్ల ఇన్సూరెన్స్ మీరు వింటేజ్ కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సులభంగా పొందవచ్చు. ఇప్పుడు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ, కార్ల వర్గీకరణకు సంబంధించి దాని స్వంత మార్గదర్శకాలను కలిగి ఉంటుంది. కావున, మీరు ఒప్పందం పై తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు దానిని పూర్తిగా పరిశీలించడం ముఖ్యం. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మీరు వింటేజ్ కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలని కోరుకుంటాయి. అలాగే, మీరు తప్పనిసరిగా విసిసిసిఐ అందించే సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి, ఇది మీ వర్గీకరణను ధృవీకరించే భారతదేశపు వింటేజ్ మరియు క్లాసిక్ కార్ క్లబ్. ఇతర సాధారణ కారు ఇన్సూరెన్స్ మాదిరిగా ఇక్కడ ఆన్‌లైన్‌లో పాలసీ ప్రీమియం నిర్ణయించబడలేదు. మీ కారును అంచనా వేయడానికి ఇన్సూరర్ ఒక నిపుణుడిని పంపుతారు. సర్వేయర్ వింటేజ్ కారు ధరను, స్పేర్ పార్ట్స్ ధరలను పరిగణలోకి తీసుకుంటారు, అవి భారతదేశంలో అందుబాటులో ఉన్నాయా లేదా దిగుమతి చేసుకోవాలా అనే దాని గురించి ఆరా తీస్తారు, రిపేర్స్ యొక్క సంభావ్యత ఖర్చులను మొదలైన వాటిని అంచనా వేస్తారు, ఆపై నివేదిక తయారు చేస్తారు. ప్రీమియంను నిర్ణయించడానికి ఇది ఒక ప్రాతిపదికగా తీసుకోబడుతుంది. ప్రీమియం అమౌంటును ప్రభావితం చేసే అంశాలు వయస్సు కారు వయస్సు, దాని నిర్వహణ ఖర్చులకు నేరుగా ప్రభావితం చేస్తుంది. వింటేజ్ కారు తయారు చేయబడిన సంవత్సరం మరియు దాని నిర్వహణ తీరు అనేవి ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ప్రస్తుత విలువ ఒకవేళ, మీరు వింటేజ్ కారు ధరను తెలుసుకోవాలనుకుంటే, మీరు పేర్కొన్న స్థితిలో కారును ఈ రోజు విక్రయిస్తే సరైన మొత్తంలో డబ్బు పొందగలరు. వింటేజ్ కార్లు దాదాపు రూ. 45000 నుండి రూ. 4.5 లక్షల ధరల వద్ద అమ్ముడవుతాయి లేదా మిగిలిన మోడళ్ళ సంఖ్య, కారు స్థితి మరియు ఇతర అంశాలను బట్టి అంతకంటే ఎక్కువ ధర వద్ద అమ్ముడవుతాయి. డ్రైవ్ చేసిన కిలోమీటర్లు కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది అన్నది కూడా ముఖ్యమైన అంశం, ఎక్కువ వినియోగం ఉంటే ఎక్కువ అరుగుదల మరియు తరుగుదల ఉంటాయి. అందుబాటులో ఉండే సహాయం తక్కువగా ఉంటే నిర్వహణ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకనే రెండింటి మధ్య సమతౌల్యం పాటించడం ముఖ్యం. రిపేర్ మరియు స్పేర్ పార్ట్స్ కోసం ఖర్చు ఈ వింటేజ్ మరియు క్లాసిక్ కార్లకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అంత సులభంగా లభించవు మరియు అవి ఖరీదైనవి. కొన్నిసార్లు, వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీని కోసం అధిక మొత్తంలో ఖర్చవుతుంది అందువల్ల కారు ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం నిర్ణయించడంలో పరిగణించబడుతుంది. వింటేజ్ కారు ఇన్సూరెన్స్ నుండి సాధారణ మోటార్ కారు ఇన్సూరెన్స్ ఎలా భిన్నంగా ఉంటుంది? మీరు ఒక పిల్లాడు, తన తాతయ్య మాదిరిగా పని చేయాలని ఎవరూ కోరుకోరు. కార్ల విషయంలో కూడా అంతే. సాధారణ కారు మరియు వింటేజ్ కారు ఇన్సూరెన్స్ విషయంలో ఒకేవిధమైన పనితీరును కలిగి ఉండలేరు. రెండు ఇన్సూరెన్స్ పాలసీలు వేర్వేరు అని తెలియజేసే ఒక అంశం ఏమిటంటే, ఒక స్టాండర్డ్ మోటార్ ఇన్సూరెన్స్‌లో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ లేదా ఐడివి అనేది దాని ధర నుండి తరుగుదల విలువను మినహాయించడం ద్వారా నిర్ణయించబడుతుంది. వింటేజ్ కారు ఇన్సూరెన్స్ కింద, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడివి) ను యాక్సెస్ చేయడానికి మీకు ఒక సర్వేయర్ ఉంటారు. వింటేజ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏవి? ఒక వింటేజ్ కారు పాలసీని ఎంచుకునేటప్పుడు ప్రత్యేకమైనది అంటూ ఏదీ లేదు. మీరు ఎల్లప్పుడూ మీ కారు ప్రస్తుత విలువకు దగ్గరగా ఉన్న ఐడివితో పాలసీని ఎంచుకోవాలి. అలాగే, ఇలాంటి కార్లు తరచుగా ఎగ్జిబిషన్స్ లేదా ఇతర పబ్లిక్ ఈవెంట్లలోకి తీసుకెళ్లబడతాయి; అయితే, ఇది సాధారణ వింటేజ్ కారు ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడకపోతే, దీని కోసం ప్రత్యేకంగా ఒక ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం అవసరం. తరచుగా అడిగే ప్రశ్నలు వింటేజ్ కార్ల కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అవసరమా? అవును, వింటేజ్ కార్లతో సహా అన్ని కార్లకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం అవసరం. నా కారు కోసం ఏ వింటేజ్ కారు పాలసీ సరిపోతుంది? మీ కారు ప్రస్తుత విలువకు దగ్గరగా ఉన్న ఐడివిని కలిగి ఉన్న పాలసీ మీకు తగిన విధంగా సరిపోతుంది.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి